ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి | Auto driver suspicious death | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి

Oct 11 2015 9:33 AM | Updated on Sep 3 2017 10:47 AM

ప్రకాశం జిల్లా పాల్వంచలో ఆటో డ్రైవర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.

పాల్వంచ (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా పాల్వంచలో ఆటో డ్రైవర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. వివరాల ప్రకారం... పాల్వంచ పట్టణంలోని నెహ్రూనగర్ వికలాంగుల కాలనీలో భాస్కర్(44) అనే ఆటో డ్రైవర్ నివాసముంటున్నాడు. కాగా కాలనీకి సమీపంలో రాతిచెరువు వద్ద ఆదివారం ఉదయం భాస్కర్ మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు.

అతని శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయి. గొంతుపై కత్తి గాట్లు ఉండడంతో ఎవరో హతమార్చి పడేశారని భావిస్తున్నారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement