భూ ఆక్రమణపై సైనికుడి దీక్ష

Army Man Protest On Land Grabbing In Chittoor - Sakshi

రొంపిచెర్ల: తాతల కాలం నుంచి అనుభవంలో ఉన్న భూమిని ఒక విశ్రాంత ఉద్యోగి ఆక్రమించుకున్నాడని ఓ జవాన్‌ భూమి వద్ద నిరసన దీక్ష చేపట్టాడు. ఈ సంఘటన రొంపిచెర్ల మండలం మోటుమల్లెల గ్రామ పంచాయతీలోని గంగిరెడ్డిగారిపల్లె సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లెకు చెందిన జగన్మోహన్‌రెడ్డి 2003వ సంవత్సరం నుంచి జవాన్‌గా పనిచేస్తున్నారు. సర్వే నంబరు 2082–7లో ఎకరా భూమి 150 సంవత్సరాలుగా తాతల కాలం నుంచి తమ ఆధీనంలోనే ఉందని తెలిపారు.

గంగిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడని తెలిపారు. న్యాయం కోసం నిరసన దీక్షకు దిగామని తెలిపారు. జవాన్‌ జగన్మో హన్‌రెడ్డికి చెందిన భూమి ఇతరులు అక్రమించుకోకుండా న్యాయం చేస్తామని తహసీల్దార్‌ వెంకటకృష్ణుడు తెలిపారు. జవాన్‌ పొలం వద్ద దీక్ష చేస్తున్నారని తెలియడంతో అప్పటికప్పుడే వీఆర్వో దామోదర్‌ను విచారణ కోసం పంపించామని తెలిపారు. ఆక్రమణ దారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top