దూరవిద్య బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | Applications invited for Distance BED entrance | Sakshi
Sakshi News home page

దూరవిద్య బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Feb 21 2015 1:55 AM | Updated on Sep 2 2017 9:38 PM

తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో బీఈడీ స్పాట్ అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వోన్నత విద్యా అధ్యయన సంస్థ ప్రిన్సిపల్ ఎం.సోమిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్: తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో బీఈడీ స్పాట్ అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వోన్నత విద్యా అధ్యయన సంస్థ ప్రిన్సిపల్ ఎం.సోమిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో కనీసం రెండేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి  గలవారు ఈ నెల 23, 24వ తేదీల్లో మాసబ్‌ట్యాంక్ ఎన్‌ఎండీసీ వద్ద ఉన్న ప్రభుత్వోన్నత విద్యా అధ్యయన సంస్థకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 80194 05275 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు, మరింత సమాచారం కోసం వెబ్‌సైట్ www.spmvv.ac.in
లాగిన్ కావచ్చు.

Advertisement

పోల్

Advertisement