యాపిల్ ట్రీ చిట్‌ఫండ్ కంపెనీ మోసం | Apple tree chit fund company cheating in vijayawada | Sakshi
Sakshi News home page

యాపిల్ ట్రీ చిట్‌ఫండ్ కంపెనీ మోసం

Nov 23 2013 6:11 PM | Updated on Aug 20 2018 3:07 PM

నగరంలో మరో చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది.

విజయవాడ: నగరంలో మరో చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. యాపిల్ ట్రీ కంపెనీని నెలరోజుల క్రిందటే కేరళలో మూసివేశారు.  అయినా ఆ కంపెనీ ఏజెంట్ ఇక్కడ డిపాజిట్లు వసూలు చేస్తున్నాడు. దాంతో బాధితులు ఏజెంట్‌ను పట్టుకొని గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో  అప్పగించారు. యాపిల్ ట్రీ కంపెనీ  కేరళ కేంద్రంగా పని చేస్తోంది.  కొట్టాయం జిల్లాలో వేల మంది డిపాజిటర్లను ముంచిన యాపిల్ ట్రీ బోగస్ చిట్ ఫండ్ కంపెనీ కేరళలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ ఘటన అక్కడ రాజకీయంగా కూడా   పెద్ద దుమారమే లేపుతోంది .

ఆర్థిక నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విజయవాడ నగరవాసులు రెడ్డమ్మ చిట్ ఫండ్ కంపెనీ మోసం ఘటన మరువక ముందే మరో మోసం బయట పడింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement