
టీడీపీ దాడులు చేస్తున్నా పట్టించుకోరా?
‘‘పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని అధికార తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తున్నా పోలీసుయంత్రాంగం ....
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఉస్మానియాలో చికిత్స పొందుతున్న దస్తగిరిరెడ్డిని పరామర్శించిన జగన్
అఫ్జల్‌గంజ్ ‘‘పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని అధికార తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తున్నా పోలీసుయంత్రాంగం పట్టించుకోవడంలేదు. కేసులు నమోదుచేయకుండా చోద్యం చూస్తోంది.’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల దాడిలో గాయపడి, ఉస్మానియాలో చికిత్సపొందుతున్న వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం జీవంపేటగ్రామానికి చెందిన పార్టీ నేత దస్తగిరిని ఆయన బుధవారం పరామర్శించారు. ఆయన వెంట నాయకులు ఎంవీ మైసూరారెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దస్తగిరిరెడ్డిని అడ్డుకుని దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయకుండా బాధితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దారుణమన్నారు.
తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కొనసాగుతున్న దాడులపై పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడంలేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎం.వి.మైసూరారెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రాజార్యంగేతర శక్తులు ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం వల్లే వైఎస్సార్‌సీపీ నేతలు,కార్యకర్తలపై వరుస దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దస్తగిరికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీజీ రఘురామ్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్‌చవాన్, శివకుమార్, ఆస్పత్రి ఆర్‌ఎంవోలు డాక్టర్ మహ్మద్ రఫీ, నరేందర్, సిద్ధిఖీ, వైద్య నిపుణులు డాక్టర్ నాగేందర్, డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.