బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని ఏపీఎన్జీవో నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని ఏపీఎన్జీవో నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంగళవారం ప్రధాని మన్మోమోహన్‌సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సీడబ్ల్యుసీ నిర్ణయాన్ని పునః పరిశీలించే విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేనని, సీమాంధ్రుల విద్యా, ఉపాధి, సాగునీరు, హైదరాబాద్ అంశాలపై కేంద్ర కమిటీ నివేదిక అనంతరం రాష్ట్ర విభజన చేసేలా చర్యలు తీసుకుంటామని మాత్రమే ప్రధాని హామీ ఇచ్చారు.
ప్రధానితో పాటు బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ, జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్, అన్నాడీఎంకే నేత తంబిదురై, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయను సమాజ్ వాది పార్టీ నేత రాంగోపాల్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం నేత సీతారాం యేచూరి, డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు తదితరులను కలిసి సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజాందోళనను ఏపీఎన్జీవో నేతలు వివరించారు.