ఇక విద్యా కమిటీలకు ఎన్నికలు

AP Government Green Signal For Education Committees Election - Sakshi

నెలాఖరులోగా నిర్వహణకు  కసరత్తు 

సంస్కరణల దిశగా ప్రభుత్వ  పాఠశాలలు 

3,278 బడుల్లో విద్యాకమిటీ ఎన్నికలు.. అనంతరం శిక్షణ  

సాక్షి, సీతంపేట: టీడీపీ ప్రభుత్వం పుణ్యమా అని విద్యాకమిటీలు గత రెండేళ్లుగా నిర్వీర్యమయ్యాయి. రెండేళ్ల క్రితం ఎన్నికలు నిర్వహిం చినా నిధులు విడుదల చేయకపోవడంతో కమిటీలు ప్రేక్షకపాత్ర పోషించాయి. వివిధ కారణాలతో గత విద్యాసంవత్సరం నుంచి విద్యాకమిటీలు అచేతనమయ్యాయి. తాజా గా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యాకమిటీలకు జీవం పోయనుంది. ప్రభుత్వ పా ఠశాలల్లో విద్యాకమిటీల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ, జిల్లా, మండలపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్‌ పాఠశాలలకు ఈ నెలాఖరులోగా పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సర్వ శిక్షాభియాన్‌ రాష్ట్ర పథక సంచాలకుల నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. పాఠశాలల విద్యాకమిటీ సభ్యుల కాలపరి మితి రెండేళ్లు ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం 2016లో విద్యాకమిటీలకు ఎన్నికలకు నిర్వహించింది.

అటు తర్వాత ఎన్నికల నిర్వహణపై ఆసక్తి చూపలేదు. పాఠశాలల కు సంబంధిచిన నిర్వహణ గ్రాంట్‌ సకాలంలో విడుదల చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోం ది. కొత్త ప్రభుత్వం రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి తీసుకువచ్చేందుకు కా ర్యాచరణను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల నిర్వాహణకు సైతం గ్రాంట్‌ను కూడా ముందే విడుదల చేసింది. ఇక పర్యవేక్షణకు విద్యాకమిటీలను ని యమించనుంది. జిల్లాలో 3,278 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 2,730, ప్రాథమికోన్నత పాఠశాలలు 431, జిల్లా పరిషత్‌ ప్రభుత్వ హైస్కూళ్లు 477 ఉన్నాయి. సుమారు 2 లక్షల 55 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.

విద్యాకమిటీ ఎన్నికలు ఇలా...
ఒక్కో తరగతి నుంచి ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల ను సభ్యులుగా ఎన్నుకుంటారు. ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు కలిపి 15 మందిని ఎన్నుకుం టారు. వీరిలో ఒకరిని పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సా మాజిక వర్గాలకు చెందిన వారు చైర్మన్లుగా ఉండాల న్న నిబంధనలు విధించారు. ప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఏడు తరగతుల కు 21మంది సభ్యులను ఎన్నుకుంటారు. అందులో ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకుం టారు. మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8 తరగతులకు చెందిన విద్యార్థులు తొమ్మిది మందిని సభ్యులుగా ఎన్నుకుంటారు. అందులో ఇద్దరు చైర్మన్‌లుగా, ఇద్దరు వైస్‌చైర్మన్‌లుగా ఉంటారు. వీరితో పాటు ప్రతి పాఠశాలలో ఎక్స్‌ అఫీ షియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారు. అందులో సర్పంచితోపాటు వార్డు మెంబర్, అంగన్‌వాడీ వ ర్కరు, మహిళా మండలి సభ్యులు, ఇద్దరు టీచర్లను నియమించనున్నారు. వీరితోపాటు కోఆప్షన్‌ సభ్యులుగా మరో ఇద్దరిని నియమించనున్నారు.

కమిటీ విధులివిగో...
పాఠశాల అబివృద్ధిలో విద్యాకమిటీలదే కీలకపాత్ర. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం, విద్యార్థు ల, ఉపాధ్యాయుల హాజరు, డ్రాపౌట్లు గ్రామాల్లో లే కుండా చూడడం, బడిబయట పిల్లలను బడిలో చే ర్పించడం వంటివి చేయాలి. పాఠశాలలకు విడుదల య్యే నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా చూ డాలి. అమ్మ ఒడికి అర్హులైన కుటుంబాలను గుర్తించే విషయంలో విద్యాకమిటీలు కీలకం కానున్నాయి. ఎన్నికైన కమిటీలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top