27 నుంచి అసెంబ్లీ సమావేశాలు! | AP Assembly Meetings from the March 27th | Sakshi
Sakshi News home page

27 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

Mar 23 2020 4:21 AM | Updated on Mar 23 2020 4:21 AM

AP Assembly Meetings from the March 27th - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 27వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆ రోజు ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగంతో ప్రారంభం అవుతాయి.

29వ తేదీన శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2020–21 ఆర్థిక ఏడాదికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం నేపథ్యంలో తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 30వ తేదీన నెల లేదా రెండు నెలల వ్యయానికి సరిపడా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు అసెంబ్లీ నుంచి ఆమోదం పొందనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement