
ఒక్కో సభ్యుడికి 3 లేదా 4నిమిషాలు
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాతపూర్వకంగా ఇచ్చిన లేఖలను రికార్డుల్లోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. విభజన బిల్లుపై మాట్లాడేందుకు సభ్యులు ఆసక్తి చూపుతున్నారని.... వీలైనంత ఎక్కువ మందికి మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు.
ఒక్కో సభ్యుడికి మూడు నుంచి నాలుగు నిమిషాలు కేటాయిస్తామన్నారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చ ముగిసిందా...లేదా అనేది స్పష్టత ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కోరగా... ముగియలేదని స్పీకర్ తెలిపారు. మరోవైపు సీమాంధ్ర ప్రాంత సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని...సీమాంధ్ర మంత్రులు ఫోన్లు చేశారు.