‘జెమ్స్‌’కు మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు | Another 50 MBBS seats for gems medical collage | Sakshi
Sakshi News home page

‘జెమ్స్‌’కు మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు

Nov 6 2017 2:03 AM | Updated on Nov 6 2017 2:03 AM

Another 50 MBBS seats for gems medical collage - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీకాకుళంలోని ‘జెమ్స్‌’వైద్య కళాశాలకు మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతి లభించింది. ప్రస్తుతం ఆ కళాశాలలో 100 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. మరో 50 సీట్లు పెంచాలని కళాశాల యాజమాన్యం ప్రభుత్వానికి ఇటీవల దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో హైపవర్‌ కమిటీ కళాశాలను తనిఖీ చేసి వసతులపై సంతృప్తి వ్యక్తం చేసింది. మరో 50 సీట్లు పెంచేందుకు అర్హతలు ఉన్నాయని నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం ఈ కళాశాలకు ఎసెన్షియాలిటీ ఇచ్చినట్లు తెలిసింది.

అనంతరం కళాశాల భారతీయ వైద్యమండలి (ఎమ్సీఐ)కి దరఖాస్తు చేసుకుంటుంది. పెరిగే సీట్లు 2018–19 సంవత్సరానికి అందుబాటులోకి రాను న్నట్లు సమాచారం. ప్రభుత్వ పరిధిలో కూడా మూడు కళాశాలల్లో 50 చొప్పున సీట్లు పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కనీసం 200కు పైగా సీట్లు పెరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement