High Court Green Singal for Municipal and Panchayati Raj Elections in AP | స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ - Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Nov 15 2019 1:29 PM | Updated on Nov 15 2019 5:23 PM

Andhra Pradesh High Court Green Signal To Local Body Elections - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై విధివిధానాలు కూడా సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది.

అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీనిపై కూడా హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వీటిపై విచారణను నాలుగు వారాలు వాయిదా వేసిన హైకోర్టు.. ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ప్రభుత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఇప్పటికే పదవీ కాలం పూర్తయిన సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement