అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించాలని రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. అలా చేయపోతే సీమవాసులకు, ఉత్తరాంధ్ర వాసులకు భవిష్యత్‌లో అన్యాయం జరుగుతుందని అన్నారు. విశాఖపట్టణం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేశ్ తో పాటు.. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఉన్నారు.