‘డ్రా’ ద్వారా టెండర్ల కేటాయింపు | allocation of tenders through draw | Sakshi
Sakshi News home page

‘డ్రా’ ద్వారా టెండర్ల కేటాయింపు

Feb 22 2014 3:15 AM | Updated on Sep 2 2017 3:57 AM

నగరపాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణకు టెండర్లను డ్రా పద్ధతిన కేటాయించారు. టెండర్లో పాల్గొన్న 21 మంది కాంట్రాక్టర్లు జీరో శాతానికి టెండర్లు వేశారు.

కార్పొరేషన్,న్యూస్‌లైన్ : నగరపాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణకు టెండర్లను డ్రా పద్ధతిన కేటాయించారు. టెండర్లో పాల్గొన్న 21 మంది కాంట్రాక్టర్లు జీరో శాతానికి టెండర్లు వేశారు. దీంతో ఎవరికి టెండర్లు ఇవ్వాలో అర్థంకాక దీనిపై తుది నిర్ణయం కోసం వారం రోజుల క్రితం ఫైల్‌ను ఇన్‌చార్జి కమిషనర్ మంగతాయారు, మున్సిపల్ ప్రత్యేకాధికారి,జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ముందుంచారు.

 దీనిని పరిశీలించిన కలెక్టర్ డ్రా పద్ధతిన టెండర్లు కేటాయించాలని  ఆదేశించారు. దీంతో శుక్రవారం సాయంత్రం కమిషనర్  చాంబర్‌లో డ్రా ద్వారా టెండర్లను  కేటాయిం చేందుకు ఏర్పాట్లు చేశారు. టెండర్లు వేసిన కాంట్రాక్టర్ల అందరికీ సమాచారం ఇచ్చారు. ఇన్‌చార్జి కమిషనర్ మంగతాయారు,ఎంహెచ్‌ఓ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో డ్రా తీయించారు. ఇందులో ఒకటో జోన్‌లో పారిశుధ్య కార్మికుల టెండర్ నవచైతన్య కార్మిక సంఘానికి, రెండవ,నాలుగో జోన్ల టెండర్లు ఝాన్సీ మహిళా సంఘానికి,మూడవ,అయిదవ జోన్ల టెండర్లు ప్రగతి కార్మిక సంఘానికి వచ్చాయి.

 ‘ఝాన్సీ’కి అభ్యంతరం తెలిపిన కార్మికులు
 పారిశుధ్య కార్మికుల టెండర్లు కార్మికులకే ఇవ్వాలని గతంలో పలు యూనియన్లు ధర్నాలు,సమ్మెలు చేశాయి. వచ్చే టెండర్లలో కార్మికులకే టెండర్లు ఇస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇవ్వడంతో  కార్మికులు సమ్మెను విరమించుకున్నారు. ఇప్పుడు కూడా మళ్లీ  కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొనడంపై సీఐటీయూ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ మహిళా సం ఘం కార్మికుల జీతం డబ్బులు సక్రమంగా ఇవ్వడంలేదని ఆరోపించారు. దీనికి సంఘం కాంట్రాక్టర్ విజయ తాను ఎవరికి ఇబ్బందులు పెట్టలేదని,కార్మికులకు సంబంధించి బ్యాంకు ఖాతానంబరు సక్రమంగా లేకనే వారి ఖాతాలో డబ్బులు జమకాలేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ సీఐటీయూ నాయకులు ఝాన్సీ సంఘానికి టెండర్లు దక్కడంపై  తాము నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు యూనియన్ నాయకుడు దండివెంకట్ తెలిపారు.

 కార్మికుల కేటాయింపు ఇలా..
 జోన్‌నం.  మగ కార్మికులు   మహిళా కార్మికులు  డ్రైవర్లు      మొత్తం
 1    14    -    9     23
 2    26    1    6    33
 3    26    -    8    34
 4    30    1    13    44
 5    26    -    8    34
 మొత్తం    122    2    44    168  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement