హామీల అమలులో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మహాలక్ష్మీ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి
= రుణమాఫీ పేరుతో మోసం
= ఇంటికో ఉద్యోగం ఉత్తి మాటే
= జగన్ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి
= ఆళ్లగడ్డ ప్లీనరీలో గౌరు, గంగుల, ఎర్రబోతుల
ఆళ్లగడ్డ: హామీల అమలులో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మహాలక్ష్మీ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్లీనరీ నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్లీనరీకి ర్యాలీగా తరలివచ్చారు. ముఖ్య అతిథి గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్దానాలతో టీడీపీ అధినేత అధికారం చేజిక్కించుకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్నారు. పంటలు పండక..గిట్టుబాటు ధర లేక అన్నదాతకు కన్నీటి కష్టాలే మిగిలాయన్నారు.
బాబు పాలనలో కరువు తాండవిస్తోందన్నారు. ఒకే సారి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రుణమాఫీ కాక..అప్పులు తీర్చలేక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. రైతుల ఉసురు చంద్రబాబుకు తగలడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందినవారు టీడీపీ హామీలతో మోసపోయారని..ఇంటికో ఉద్యోగం ఇస్తామని యువతను అధికార పార్టీ నేతలు మభ్య పెట్టారన్నారు. ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డలో విజయబాపుటా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు.