బాధ్యతలు స్వీకరించిన కల్లం, శ్రీరామ్‌

Ajeya Kallam Take Charges As Paprincipal Advisor To AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారుగా అజేయ్‌ కల్లం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని బాధ్యతలు చేపట్టిన ఆయనకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు. అంతకు ముందు అజేయ్‌ కల్లం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఏజీగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌
మరోవైపు ఆంధ్రపద్రేశ్‌ హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన తన ఛాంబర్‌లో కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు.  సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అడ్వొకేట్‌ జనరల్‌గా శ్రీరామ్‌ను నియమించాలని నిర్ణయించారు. శ్రీరామ్‌ 1969లో జన్మించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top