‘రాష్ట్రంలో యూరియా కొరత లేదు’ | Agriculture Commissioner Arun Kumar Speech On Urea At Amaravati | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రంలో యూరియా కొరత లేదు’

Sep 7 2019 1:03 PM | Updated on Sep 7 2019 1:25 PM

Agriculture Commissioner Arun Kumar Speech On Urea At Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యూరియా నిల్వలు ఖరీఫ్‌ సీజన్ అవసరాల మేరకు ఉన్నాయని వ్యవసాయశాఖ పేర్కొంది. వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ కుమార్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యూరియా నిల్వలపై  ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో యూరియాకు కొరత ఎక్కడా లేదని, ప్రస్తుతం రెండు లక్షల టన్నుల యూరియా నిల్వలు మార్క్‌ఫెడ్‌, డీలర్స్‌ వద్ద ఉన్నాయని వెల్లడించారు. దీంతోపాటు సెప్టెంబర్‌ మాసంలో రాష్ట్ర వ్యవసాయ అవసరాల నిమిత్తం కేంద్రం మూడు లక్షల టన్నుల యూరియాను కేటాయించిందన్నారు. 

డీలర్లు అధిక ధరలకు యూరియాను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుకు అవసరం లేని ఎరువులను బలవంతంగా అమ్మజూపినా డీలర్లపై తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎరువుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని అరుణ కుమార్‌ పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement