రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్య రాష్ట్రం డివూండ్‌తో స్పీకర్ ఫారాట్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్య రాష్ట్రం డివూండ్‌తో స్పీకర్ ఫారాట్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. నెలరోజుల క్రితమే సమర్పించిన రాజీనావూలేఖలపై, స్పీకర్ తక్షణమే నిర్ణయుం తీసుకుని వాటిని ఆమోదించాలని విన్నవించింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ఆయన చాంబర్లో కలుసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ రాజీనామాలను పరిశీలిస్తునట్టుగా స్పీకర్ చెప్పారన్నారు. రాజీనామాల ఆమోదంలో వురింత జాప్యం జరిగిన పక్షంలో పార్టీ ఎమ్మెల్యేలందరం మరోసారి స్పీకర్‌ను కలసి ఒత్తిడిచేస్తామన్నారు. విభజన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలియగానే తాము రాజీనామా లేఖలు ఇచ్చామన్నారు. అన్నిప్రాంతాలకు న్యాయం చేయడంలో కేంద్రం విఫలమవుతోంది కనుకనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిందిగా కోరుతున్నామని తెలిపారు.