అనంతపురం రూరల్ పరిధిలోని ఏ నారాయణపురానికి చెందిన వై వెంకటేశ్(28) అనారోగ్యం, మానసిక వేదనతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అనంతపురం రూరల్: అనంతపురం రూరల్ పరిధిలోని ఏ నారాయణపురానికి చెందిన వై వెంకటేశ్(28) అనారోగ్యం, మానసిక వేదనతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాల కారణంగా కొద్దికాలం కిందట భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. దీనికి తోడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు ఎవరూలేరని ఆత్మన్యూనత భావంతో దిగులు చెందిన వెంకటేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణం పొందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.