కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు 50 శాతం పెంపు! | 50 per cent of the increase in the wages of contract employees | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు 50 శాతం పెంపు!

Jun 13 2017 1:56 AM | Updated on Sep 5 2017 1:26 PM

కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 50 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- ఏప్రిల్‌ 1 నుంచి వర్తింపు.. 
రూ. 12 వేలు తగ్గకుండా జీతం ఉండాలని ఉత్తర్వులు 
 
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 50 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కాంట్రాక్టు ఉద్యోగికి నెలకు రూ. 12వేలు తగ్గకుండా వేతనం ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు వేతనాల పెంపును ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వర్తింపచేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఇంచార్జి) ఎం.రవిచంద్ర సోమవారం ఉత్తర్వులిచ్చారు.

అదే సమయంలో వేతనాల పెంపు వర్తింపునకు షరతులను కూడా ప్రభుత్వం విధించింది. మంజూరైన రెగ్యులర్‌ ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, ఆర్థిక శాఖ అనుమతితో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే పెంపుదల వర్తింప చేస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement