ఆ ఇసుక నిల్వలు టీడీపీ ఎమ్మెల్యేవి? | 50 lorrys sand seized in eluru | Sakshi
Sakshi News home page

ఆ ఇసుక నిల్వలు టీడీపీ ఎమ్మెల్యేవి?

Mar 26 2016 12:08 PM | Updated on Aug 28 2018 8:41 PM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిసరాల్లోని కండ్రిగగూడెం పంచాయతీ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 లారీల ఇసుకను పోలీసులు, రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిసరాల్లోని కండ్రిగగూడెం పంచాయతీ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 లారీల ఇసుకను పోలీసులు, రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. ఎస్పీకి అందిన సమాచారం మేరకు ఆయన ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఇసుక నిల్వల వద్ద ఉన్న వ్యక్తులను విచారించగా... ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆధ్వర్యంలో ఇసుకను నిల్వ చేసినట్టు వారు బదులిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement