పంపా వద్ద 34 మంది తెలుగు యాత్రికులు క్షేమం | 34 Telugu pilgrims safe at pampa in kerala | Sakshi
Sakshi News home page

పంపా వద్ద 34 మంది తెలుగు యాత్రికులు క్షేమం

Sep 20 2013 8:49 AM | Updated on Sep 1 2017 10:53 PM

శబరిమల వెళ్లే మార్గంలో పంపా సమీపంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

శబరిమల వెళ్లే మార్గంలో పంపా సమీపంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శబరిమల యాత్రకు వెళ్లి వస్తున్న 34 మంది తెలుగువారు గత అర్థరాత్రి పంపా వద్ద వరదనీటిలో చిక్కుకున్నారు. దాంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వరద ప్రాంతానికి చేరుకుని, తెలుగువారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే వారిని కాపాడే క్రమంలో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు వరదల్లో కొట్టుకుపోయారు. దాంతో అతన్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement