రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్‌ల కేడర్ సంఖ్యను నోటిఫై చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్‌ల కేడర్ సంఖ్యను నోటిఫై చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ఐఏఎస్‌ల కేడర్ సంఖ్యను 211గా, తెలంగాణకు 163గా నోటిఫై చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 147 కాగా పదోన్నతుల ద్వారా భర్తీ చేసేవి 64గా నిర్ణయించారు. తెలంగాణకు డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 114, పదోన్నతుల ద్వారా 49 పోస్టులను కేటాయించారు.