192 కేజీల గంజాయి పట్టివేత | 192 kg ganja seized in visakhapatnam | Sakshi
Sakshi News home page

192 కేజీల గంజాయి పట్టివేత

Jul 16 2016 10:50 AM | Updated on Sep 4 2017 5:01 AM

ప్రభుత్వాసుపత్రికి చెందిన అంబులెన్స్లో గంజాయి తరలిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

విశాఖపట్నం: ప్రభుత్వాసుపత్రికి చెందిన అంబులెన్స్లో గంజాయి తరలిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 192 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో శనివారం చోటు చేసుకుంది. లంబసింగి పీహెచ్సీకి చెందిన అంబులెన్స్లో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు ఆగంతకుడు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంబులెన్స్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement