‘ఆనందభాష్పాలతో.. మునిగిన సభా స్థలి’ |  Vijayasai reddy fires on Congress TDP alliance | Sakshi
Sakshi News home page

‘ఆనందభాష్పాలతో.. మునిగిన సభా స్థలి’

Nov 30 2018 12:06 PM | Updated on Nov 30 2018 2:00 PM

 Vijayasai reddy fires on Congress TDP alliance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఖమ్మం వేదికపై అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైందని వైఎస్సార్‌ సీపీ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు చెప్పులు, రాళ్లు విసురుకుని, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న టీడీపీ, కాంగ్రెస్‌ అధ్యక్షుల కరచాలనాలు, ఆలింగనాలతో సభలో ఉద్వేగభరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయని ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అది చూసి తట్టుకోలేని సభికుల ఆనందభాష్పాలు వరదగా మారి మోకాలి లోతున సభా స్థలి మునిగిపోయిందని సెటైర్లు వేశారు.

ఇదంతా చూసి ఒళ్లు పులకరించిపోయిన ఓ వర్గం మీడియా తన పైత్యాన్ని పతాక స్థాయిలో చూపించిందని విజయసాయిరెడ్డి చురకలంటించారు. ఖమ్మం పట్టణంలో మహాకూటమి నిర్వహించిన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే.

సంబంధిత కథనాలు : 
ఆ టీడీపీ నాయకులకు జైలు ఖాయం : విజయసాయిరెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement