breaking news
-
ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది బాబూ?: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ క్యాంప్ కార్యాలయం ఆయన మాట్లాడుతూ, డిగ్రీ చదివే 9 లక్షల మందికి గత ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏడిపిస్తుందని మండిపడ్డారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిన, ట్రెజరీలో సిద్ధంగా ఉన్న డబ్బు విద్యార్థులకు ఈ కూటమి ప్రభుత్వం జమ చేయలేదు. రేపటి భవిష్యత్తు విద్యార్థులది. వారికి ప్రోత్సహాం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదు. తల్లిదండ్రులు అప్పులు చేసి వారి పిల్లలను చదివిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదు. అందుకే ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ తరపున నిరసన చేపడుతున్నాం’’ అని కొట్టు సత్యనారాయణ తెలిపారు...పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు రాష్ట్రం శ్రీలంకలా అవుతుందని గగ్గోలు పెట్టి.. ఇప్పుడు లక్షల కోట్లు ప్రభుత్వం అప్పులు చేస్తుంటే నోరుమెదపట్లేదు. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని సినీఫక్కిలో డైలాగులు చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు. ఆర్బీకె ల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేవాళ్ళం. అన్నదాత సుఖీభవ అని 20వేలు ఇస్తామని చెప్పారు దాని ఊసే లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీ గురించి కూడా ఇంతవరకు మాట్లాడే పరిస్థితి లేదు. యువగళంలో లోకేష్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 3000 నెలకి ఇస్తానని నమ్మపలికారు.ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ లాంటి పథకాలు కొనసాగిస్తామని ప్రక్కన పెట్టేసిన వ్యక్తి చంద్రబాబు. స్వలాభం, స్వార్థం, చేతకానితనంతో విజయవాడను ముంచేశారు. దాతలు ఇచ్చిన సొమ్మును కూడా వందల కోట్లు కాజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి 1 లక్షా 19 వేల కోట్లు ఇప్పటివరకు అప్పులు చేశామని చెబుతున్నారు. దీంతో పాటు మామూలుగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఒక్క హామీ ప్రజలకు ఇవ్వకుండా ఇదంతా ఎవరి ఖాతాల్లోకి వెళ్తుందో చెప్పాలి’’ అని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు.‘‘సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు అర్థమవుతుంది. పొంతన లేని మాటలు, పొంతన లేని పనులు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. సీజ్ ద షిప్ అంటారు అది కేంద్ర ప్రభుత్వ పరిధి అని కూడా ఆయనకు తెలియదు. ప్రజలు ప్రస్తుతం ఎంత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఈ ప్రభుత్వానికి తెలుసా?. చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం ఏమైంది. మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలకు అర్ధమవుతుంది. తాడేపల్లిగూడెంను ఒక పేకాట హబ్ గా మార్చేశారు. ఏ మాత్రం భయం లేకుండా ప్రజాప్రతినిధులే అందులో పాల్గొనడం దారుణం’’ అని కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘పవన్.. బాబు సూపర్ సిక్స్‌కు గ్యారంటీ నువ్వే కదా’
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడని వ్యాఖ్యలు చేశారు. అలాగే, అప్పులు చేసి కూడా పేదలకు చంద్రబాబు పథకాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరుతో మోసం చేసిన టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ప్రజల నిలదీయాలని పిలుపునిచ్చారు.అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా నేడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సహా భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం చంద్రబాబు సహజ గుణం. చెప్పింది చెయ్యడం.. చేయగలిగినదే చెప్పడం వైఎస్ జగన్ సహజ గుణం. ఎన్నికలకు ముందు ఒక్క అబద్దం చెప్పడానికి కూడా జగన్ ఒప్పుకోలేదు.. హామీల అమలు కోసం అడిగితే మొన్నే అధికారంలోకి వచ్చాం అంటున్నారు. మరి మొన్నే అధికారంలోకి వచ్చిన మీరు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టు ఎలా తీసుకొచ్చారు?. బల్క్ డ్రగ్ పార్క్ ఎలా తీసుకొచ్చారు?. పథకాల విషయంలో మొన్నే అధికారంలోకి వచ్చాం అంటారా?. ప్రాజెక్టులు మాత్రం మేమే తీసుకొచ్చాం అంటారా?. ఇదెక్కడి న్యాయం’ అని ప్రశ్నించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీ లక్కు.. అంబటి రాంబాబు అంటే వైఎస్సార్సీపీలో కిక్కు. చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడు. మోసం చేసిన టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి. నాకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. అనకాపల్లిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడంలో నా పాత్ర కీలకంగా ఉంటుందని నూకాంభిక అమ్మవారిపై ప్రమాణం చేస్తున్నాను అని అన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ కావాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి చేసిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్రంలో పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది.రాష్ట్రంలో వాట్సాప్ సేవలు తీసుకొచ్చింది వైఎస్ జగన్. వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకు మంచి జరిగింది. కానీ, పార్టీకి కేడర్‌కు మధ్య గ్యాప్ పెరిగింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యకర్తల ద్వారానే అన్ని సేవలు అందుతాయి. ఇది పార్టీ మాటగా హామీ ఇస్తున్నాను. అన్ని వైఎస్ జగన్‌ను ప్రజలు ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రజలకు మంచిగా బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కి డబ్బులు వేయలేకపోతున్నాడు. ప్రజలకు రెండు లక్షల 80వేల కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ఉభయ రాష్ట్రాలలో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి బొత్స. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకే అర్ధం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పునఃనిర్మాణం జరుగుతుంది. ధర్మశ్రీని ఢిల్లీ పంపాలని జగన్ నిర్ణయించారు. ఓటమి నుంచే పట్టుదల పెరుగుతుంది. ఎనిమిది నెలల కాలంలో ఇంత వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం లేదు. చంద్రబాబు సూపర్ సిక్స్‌కు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. బీజేపీ గ్యారంటీ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఆయన భార్య, కొడుకు ఒప్పుకునేలా లేరు. వైఎస్సార్సీపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడానికి లోకేష్ ఒక్కడు చాలు. లోకేష్‌కు దండం పెట్టిన వాడికి మంత్రి పదవి ఇచ్చారు’ అని కామెంట్స్ చేశారు. -
చెప్పారంటే.. చేయరంతే!
సాక్షి, అమరావతి: ‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. పారిపోయే బ్యాచ్ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు ఎగ్జామ్స్.. ఎప్పుడు ఇంటర్వ్యూలు.. ఎప్పుడు ఆఫర్ లెటర్లు (Offer Letters) ఇచ్చేది చాలా స్పష్టంగా 2025 జనవరి ఫస్ట్‌నే ప్రకటిస్తాం’ అని ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు యువగళం సభల్లో నారా లోకేశ్ (Nara Lokesh) ఆర్భాటంగా సెలవిచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి. జనవరి ఒకటో తేదీ వెళ్లిపోయింది. ఫిబ్రవరి వస్తోంది. జాబ్ కేలండర్ (Job Calendar) ప్రకటన మాత్రం లేదు. ఇప్పటిదాకా జాబ్ కేలండర్ ఏమైందో పట్టించుకున్నదే లేదు. లోకేశ్ మాత్రమే కాదు.. నారా చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్–1, 2 మెయిన్స్ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర అటవీ శాఖలోని 689 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించి 10 నెలలు దాటినా, వాటికి నోటిఫికేషన్ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకపోగా, కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని స్పష్టమవుతోంది.10 లక్షల మందిలో తీవ్ర ఆందోళన కూటమి ప్రభుత్వంలో గ్రూప్–2, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేశారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఫిబ్రవరిలో గ్రూప్–2, మే నెలలో గ్రూప్–1 మెయిన్స్‌కు తేదీలు ప్రకటించారు. అయితే, గత సంఘటనలతో ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమానం నిరుద్యోగులను వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన మరో 21 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఎనిమిది నెలలుగా ఈ పరీక్షల నిర్వహణపై ఇటు ఏపీపీఎస్సీ, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. దీంతో యువత భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేశారు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగార్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఇంకా శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలో తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు మదనపడుతున్నారు. ఈ 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ మే నెలకు వెళ్లిపోయింది. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అలాగే ఉంది. కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్‌కు అర్హత సాధించిన వారు దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు. వారంతా దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ‘యువగళం’లో యువతకు హామీ ఇచి్చన విషయాన్ని 2023 నవంబర్ 30న ‘ఎక్స్’లో పోస్టు చేసిన లోకేశ్ మభ్య పెట్టడమే సర్కారు విధానంరాష్ట్ర అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గతేడాది అనుమతిచ్చింది. ఇందులో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 70, బీట్ ఆఫీసర్ పోస్టులు 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375, తానాదార్ 10, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 12, జూనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వీస్ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. కానీ కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీకి ముందు ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు పేర్కొని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను చేర్చి ‘డ్రాఫ్ట్ జాబ్ కేలండర్–2025’గా ప్రచారం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.యువత సంక్షేమం పేరుతో జ్యాబ్ క్యాలెండర్ ఇస్తామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం గత ప్రభుత్వంలో షెడ్యూల్ ప్రకారమే భర్తీవైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా పోస్టులు భర్తీ చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా నియామకాలు పూర్తి చేశారు. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి, ఏకంగా 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఏ ఒక్క నోటిఫికేషన్ వాయిదా పడిన సందర్భంగానీ, రద్దు చేయడం గాని జరగలేదు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పని తీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. చదవండి: అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు2019కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లపై వివాదాలు చెలరేగి నిరుద్యోగ యువత నష్టపోయారు. ప్రస్తుతం ఉద్యోగ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతినెలా సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. 2018 డిసెంబర్లో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చినా, ఒక్క నోటిఫికేషన్‌కు పరీక్షలు నిర్వహించ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 2019కి ముందున్న పరిస్థితే వచ్చిందని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లోకేష్ తప్పుడు ప్రచారం మానుకో: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: అసర్ సర్వేని తప్పుడు తక్కెడగా చేశారని.. లోకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో విద్యారంగం అద్బుతంగా ఉన్నట్ఠు, జగన్ పాలనలో నాశనం అయినట్టు లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్ఈ చదువులు, ఐబీ సిలబస్ తెచ్చిన ఘనత జగన్‌ది. అలాంటి జగన్ ప్రాభవాన్ని మసకబార్చాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారు. రూ.3872 కోట్లతో నాడు-నేడు కింద ఫస్ట్ ఫేజ్‌లోనే స్కూళ్లని జగన్ అభివృద్ధి చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను జగన్ కల్పించారు. ఇప్పటికీ వెబ్ సైట్ లో ఆ వివరాలను చూసుకోవచ్చు’’ అని నాగార్జున యాదవ్ వివరించారు.వైఎస్. జగన్ హయాంలో విద్యారంగంలో మంచి మార్పులు వచ్చాయని.. కేంద్ర ప్రభుత్వ నివేదికల్లోనే తేలింది. చంద్రబాబు, జగన్ హయాంలను బేరీజు వేస్తూ ఎవరిని అడిగినా సమాధానం చెప్తారు. జరిగిన అభివృద్ది కళ్లెదుటే కనిపిస్తుంది. జగన్ ఐదేళ్ల పాలనలో నాడు-నేడు జరగలేదని లోకేష్ చెప్పగలరా?...స్కూళ్ల అభివృద్ధి జరగలేదని చెప్పించగలరా?. దేశం మొత్తం జగన్ చేసిన అభివృద్ధిని కొనియాడుతోంది. ఇతర రాష్ట్రాలు సైతం జగన్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నాయి. అలాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చిన జగన్‌పై తప్పుడు నివేదికలతో లోకేష్ మాట్లాడకూడదు’’ అంటూ నాగార్జున యాదవ్ హితవు పలికారు. -
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవు: సంపత్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతోంది. పార్టీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వినోద్ లాంటి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసిందన్న సంపత్.. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు.‘‘ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధాన చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్కు మాదిగల గురించి మాట్లాడే హక్కు లేదు. 10 ఏళ్లు మాదిగల గురించి ఆలోచించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏదో చేస్తామని చెప్తున్నారు. వర్గీకరణ అమలు జరిగిందంటే.. అది కాంగ్రెస్ వల్లనే జరుగుతుంది. మాదిగలు గుండె మీద చెయ్యి వేసుకుని పడుకోండి. చంద్రబాబు హయాంలో వర్గీకరణకు ఎదురైనా సాంకేతిక లోపాలు తెలిసిన వాడిగా సీఎం క్యాబినెట్ కమిటీ వేశారు. ఏక సభ్య కమిటీ వేశారు కమిటీ నివేదిక వచ్చాక ఎస్సీ వర్గీకరణ జరగబోతుంది.వర్గీకరణ పకడ్బందీగా అమలు చేయాలనే దృఢమైన సంకల్పంతో సీఎం ముందుకెళ్తున్నారు. తరతరాలుగా అవమానాలు, అసమానతలు ఎదురొడ్డినా మాదిగలు ధైర్యంగా ఉండండి. అధికారిక సమావేశంలోనే కాంగ్రెస్‌ని డిమాండ్ చేశాను’’ అని సంపత్ పేర్కొన్నారు. -
ఫిబ్రవరి 5న వైస్సార్సీపీ ఫీజుపోరు.. పోస్టర్ విడుదల
సాక్షి, తాడేపల్లి: ఫిబ్రవరి 5న వైఎస్సార్సీపీ చేపట్టే 'ఫీజుపోరు' కార్యక్రమం పోస్టర్‌ను వైఎస్సార్సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్ని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు.. విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు. దీనివలన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారన్నారు.2014-19లో కూడా చంద్రబాబు ఇలాగే బకాయిలు పెడితే వైఎస్ జగన్ వచ్చాక రిలీజ్ ఇచ్చారు. చంద్రబాబు వ్యవహార శైలి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. గడిచిన 8 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు 420 అంటూ జనం విమర్శలు చేస్తున్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోతే పోరాటం తీవ్ర రూపం చేస్తాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారు: జోగి రమేష్ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు. బాధిత విద్యార్థుల తరపున పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. కలెక్టరేట్ల ఎదుట ఫిబ్రవరి 5న పోరాటం చేస్తాం. చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే రిలీజ్ చేయాలివిద్యా వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు: వెల్లంపల్లి శ్రీనివాస్వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదు. జగన్ అభివృద్ధి చేసిన స్కూళ్లను చూసి పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యపోయారు. ప్రైవేట్ స్కూల్‌కు పోటీగా ప్రభుత్వ స్కూల్ ఉందని మెచ్చుకున్నారు.ఇదీ చదవండి: CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి! -
అందుకే పెద్దిరెడ్డి పేరును చంద్రబాబు రోజూ తలుచుకుంటున్నారు: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్షనేత మిథన్ రెడ్డి. అలాగే, చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.అనంతరం, మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. పుంగనూరులో మేము కొనుగోలు చేసిన భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి పేరును ఆయన రోజూ తలుచుకుంటున్నారు. ఏదో ఒక రకంగా కక్ష సాధించాలని చూస్తున్నారు. 2001లోనే మేము భూములను కొనుగోలు చేశాం. అది ప్రభుత్వ భూమి కాదని 1968లోనే గెజిట్ విడుదల చేసింది. అది ప్రైవేట్ ల్యాండ్ అని రికార్డ్స్ చెపుతున్నాయి. ఆ భూమి ఎకర విలువ నాలుగు లక్షల రూపాయలు మాత్రమే. మొత్తం భూమి విలువ మూడు కోట్లు మాత్రమే ఉంటుంది. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. రాజకీయ కక్షతోనే మాపైన కేసులు పెడుతున్నారు. పై కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదు. చంద్రబాబు కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నారు. గతంలో మదనపల్లి ఫైల్స్ తగలబెట్టారని మాపైన ఆరోపణలు చేశారు. రకరకాల కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాకు డిస్టిలర్లో భాగం ఉందన్న ఆరోపణలు రుజువు చేయాలి. మాపై ఇప్పటి వరకు ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. చంద్రబాబు ఆరోపణలు రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలి. కూటమి కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్ జగన్‌కు విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితులు. ఆయన పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. విజయసాయిరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. ఎంపీలు ఎవరూ వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లరు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపారేశారు. ఇదే సమయంలో పోలవరం ఎత్తుపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలి. పోలవరం ఎత్తు తగ్గిస్తారన్న అంశంపై మంత్రి నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, మార్గదర్శి చిట్ ఫండ్స్ కుంభకోణం సహారా కుంభకోణాన్ని మించింది. మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘించిందని సుప్రీంకోర్టుకు ఆర్బీఐ స్పష్టం చేసింది. వేలాది మంది డిపాజిటర్లు మార్గదర్శి వల్ల నష్టపోయారు. నేను పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని లేఖలు రాస్తాను. న్యాయస్థానంలో కూడా కేసులు వేస్తాను అని చెప్పారు. ఇదిలా ఉండగా.. పెద్దిరెడ్డి, చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఓ సందర్భంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు ఇద్దరూ క్లాస్మేట్స్ అని చెప్పారు. అప్పట్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని అన్నారు. అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే అంత కోపమని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పటికీ పెద్దిరెడ్డిపై కక్షతో రగిలిపోతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేసి, ఆయనపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారని అంటూ కామెంట్స్ చేశారు. -
ఎమ్మెల్యే చింతమనేని అరాచకం.. జనసేన నేతపై దాడి
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు కొనసాగుతున్నాయి. జనసేన నూజివీడు మండల అధ్యక్షుడు యర్రం శెట్టి రాముపై చింతమనేని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. 2014 నుండి దుగ్గిరాలలో కౌలు వ్యవసాయం చేస్తున్న యర్రం శెట్టి రాము పొలంలో చెరుకు పంటను నాశనం చేశారు.స్పందనతో పాటు, నారా లోకేష్, టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ జనసేన నేత వాపోతున్నారు.తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో పెట్టామని దుగ్గిరాల వీఆర్వోతో తిరిగి తనపై కేసు పెట్టించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని యర్రం శెట్టి రాము కోరుతున్నారు.ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతయర్రంశెట్టి రాముపై చింతమనేని అనుచరుల దాడిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంపై స్టేషన్ ఎదుట జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా కానీ.. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకొస్తున్నారు అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.దెందులూరులో జనసేన మండల అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని జనసేన నేతలు నిలదీశారు. స్పందనతో పాటు నారా లోకష్‌కు, జనవాణిలో ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదంటున్న జనసేన నేతలు.. చింతమనేని, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
కూటమి నేతల దౌర్జన్యాలకు తగిన గుణపాఠం చెబుతాం: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి నేతల ఉడత బెదిరింపులకు వైఎస్సార్సీపీ బెదిరే అవకాశమే లేదని హెచ్చరించారు పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి. కూటమి నాయకుల బెదిరింపులకు, దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని కౌంటరిచ్చారు. నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో శేఖర్ రెడ్డి సునాయాసంగా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మున్సిపల్ డిప్యూటీ మేయర్లు, చైర్మన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఫిబ్రవరి మూడో తేదీన తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి శేఖర్ రెడ్డిని వైఎస్సార్సీపీ తరపున బరిలో దింపుతాం. సౌమ్యుడైన శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే స్థానిక కూటమి నాయకులు ఫోన్లు చేసి బెదిరించారు. మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఎలా పోటీ చేస్తావ్ నీ అంతు చూస్తాం అని శేఖర్ రెడ్డిని బెదిరిస్తున్నారు.ఇలాంటి ఉడత బెదిరింపులకు వైఎస్సార్సీపీ బెదిరే అవకాశమే లేదు. కూటమి నాయకుల బెదిరింపులకు, దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం. నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో శేఖర్ రెడ్డి సునాయాసంగా గెలుస్తారు. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. మీరు భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు తిరుపతిలోనే ఉంటారు. ఆ సునామీని మీరు తట్టుకోలేరు’ అంటూ హెచ్చరించారు.మరోవైపు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని చంద్రబాబుపై కుప్పం వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందజేశారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఎన్నికల్లో ప్రజలను మోసం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో గ్రామ సచివాలయాలను నిర్మించారు, గ్రామ స్వరాజ్య పాలన సాగించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ వైఎస్ జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి!
దావోస్ పెట్టుబడుల విషయంలో తెలుగుదేశం, ఎల్లోమీడియాలు కలిసికట్టుగా ప్రజలను మోసం చేస్తూ దొరికిపోయారు. దావోస్‌కు వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తను చెప్పే మాటలన్నీ మిథ్యేనని తేల్చేశారు. దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకు రాలేక పోయినందుకు కారణాలు విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకోవల్సిన చంద్రబాబు, ఈ ఏడు నెలల్లోనే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి పారిశ్రామికవేత్తలను, ఆశ్చర్యపరిచారు!!. తమకు ఎవరికి కనపడకుండా ఎప్పుడు ఈ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చేశాయో తెలియక జనం విస్తుపోవాల్సి వస్తోంది ఇప్పుడు.. పోనీ.. నాలుగు లక్షల కోట్ల రూపాయల మొత్తానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయలేదు. మరుసటి రోజు టీడీపీ జాకీ మీడియా ఆంధ్రజ్యోతిలో ఏడు నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని రాశారు. అంటే ఇది కూడా చంద్రబాబు ప్రకటనగానే చూడాలి!. రెండు రోజుల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెంచేశారు. అంతేకాదు.. నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేశాయని బోగస్ వార్తలు రాసేశారు. దీనిని బట్టే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత బాహాటంగా ప్రజలను చీట్ చేస్తోందో అర్దం అవుతోందని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఉంటే,ఇంకా కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లవలసిన అవసరం ఏమి ఉంటుంది? చంద్రబాబు తన మీడియా సమావేశంలోకాని, గవర్నర్ ప్రసంగంలో కాని మరో మాట చెప్పారు. ఏపీ బ్రాండ్ కు ఊపు వచ్చిందని, దావోస్ లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఏపీ బ్రాండ్ ఏమిటి? రెడ్ బుక్ బ్రాండా?లేక చేసిన హామీలు అమలులో వైఫల్యం చెందిన బ్రాండా? దావోస్ కు వెళ్తే పెట్టుబడులు రావని, పెట్టుబడులు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది నెగిటివ్ ఆలోచన అట.మీడియా ఆ భావన నుంచి బయటకు రావాలని కూడా ఆయన హితబోద చెబుతున్నారు. దావోస్ లో నెట్ వర్క్ కోసం వెళ్లారట. దావోస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోయినా, ఆ కంపెనీల సీఈవోలు ఏపీకి భవిష్యత్తులో వస్తారట. అంటే చంద్రబాబు ,మంత్రి లోకేష్ లు దావోస్ లో చేసిన ప్రకటనలను పారిశ్రామికవేత్లలు నమ్మలేదని ఒప్పుకున్నట్లే కదా!. ఇంతకుముందు పలుమార్లు దావోస్ వెళ్లారు కదా!ఆ రోజుల్లో ఏమని ప్రచారం చేశారు.తాను కాబట్టి దావోస్ వెళ్లి పెట్టుబడులు సాధించుకుని వస్తున్నానని చెప్పేవారా? కాదా?వాటిలో ఎన్ని వచ్చాయి?ఎన్ని రాలేదు?అన్నది వేరే సంగతి. కనీసం ఇన్వెస్టర్లకు కొంతైన నమ్మకం కుదిరితేనే కదా వారు MoUలు చేసుకోవడానికి ముందుకు వచ్చేది. అది కూడా లేకపోబట్టే కదా ఈసారి పెట్టుబడులు తేలేకపోయారు. మహారాష్ట్రకు 15 లక్షల కోట్ల మేర, తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.వాటిని మాత్రం చంద్రబాబు స్వాగతిస్తున్నారట.ఆ ఎంవోయూలే మిథ్య అయితే ఆ రాష్ట్రాలకు కూడా అదే వర్తించాలి కదా!. పైగా ఇప్పుడు దావోస్ భేటీకి ముందే పెట్టుబడులు వచ్చాయని జాకీ మీడియాతో వార్తలు రాయించడం ఆత్మ వంచన కాదా!పైగా చంద్రబాబు ఎదురుదాడి చేశారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులుపెట్టి వేధించారని ఆయన తప్పుడు ఆరోపణ చేశారు. ఎక్కడ ఎవరిపై కేసు పెట్టారో చెప్పాలి కదా!ఆయన మిత్రుడు సింగపూర్ లో మంత్రిగా ఉన్న ఈశ్వరన్ ను ఆ దేశ ప్రభుత్వం పదవినుంచి తొలగించడమే కాదు.. ఏకంగా జైలులో పెట్టింది.దానికి వైసిపి కారణమా?లేక ఆయన అవినీతి కారణమా?. అమరావతిలో కూడా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందటూ అబద్దపు ప్రచారం చేసి ,అక్కడి ప్రైవేటు కంపెనీలు కొన్నిటికి వందల ఎకరాల భూములు కట్టబెట్టింది అవాస్తవమా?. కాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేదని భావించిన సింగపూర్ కంపెనీలు జారుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా!. మళ్లీ పిలిచి వారికి భూములు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు?వారు పెట్టిన దారుణమైన షరతులకు అంగీకరిస్తామని కూడా చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా?. జగన్ టైంలో రాష్ట్ర ఇమేజీ కోల్పోయిందట. ఇప్పుడు పునరుద్దరిస్తున్నారట. జగన్ పోర్టులు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, ఊరూరా సచివాలయ, ఆస్పత్రుల ,రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తే ఏపీ ఇమేజీ దెబ్బతిందా?లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక,కొత్తగా జగన్ టైమ్ లో వచ్చిన మెడికల్ కాలేజీలు,సీట్లు తమకుఅక్కర్లేదని కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఇమేజీ పోయిందా?జగన్ ప్రభుత్వపరంగా నిర్మించిన పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సన్నద్దం అవడం వల్ల రాష్ట్రానికి నష్టం రావడం లేదా?. ఏపీ బ్రాండ్ సత్తా అంటూ కొన్ని పెట్టుబడులను ఎల్లో మీడియా ఉదహరించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయట.వీటిలో మెజార్టీ పెట్టుబడులు జగన్ టైమ్ లో వచ్చినవి కాదా?. అయినా నిస్సిగ్గుగా కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.NTPC సంస్థ జగన్ టైమ్ లోనే రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? ఇక ఆర్సెనర్ మిట్టలో స్టీల్ ప్లాంట్ ద్వారా 1.35 లక్షల కోట్లు వచ్చేసినట్లు చెబుతున్నారు.ఇంతకన్నా పచ్చి అబద్దం ఉందా?అసలు ఇంతవరకు ఎమ్.ఓ.యు అయినా కుదిరిందా?చంద్రబాబు కోరినట్లు ఆ కంపెనీకి ఇనుప ఖనిజం రవాణాకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఇచ్చిందా?బిపిసిఎల్ కంపెనీ ప్రతిపాదన కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. అయినా ఇప్పుడు కూడా రావడం మంచిదే.కాని అసలు మొదలే కాకముందే 95 వేల కోట్లు వచ్చేసినట్లు కలరింగ్ ఇవ్వడం ఏమిటి?. ఒకవైపు ప్రభుత్వపరంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ, మరోవైపు ప్రైవేటు రంగంలో రాని ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేస్తే ఏపీ ప్రజలకు ఏమి లాభం జరుగుతుంంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం, పెట్టుబడుల విషయంలోను తమ వైఫల్యాలను జగన్ ప్రభుత్వంపై నెట్టేసి కాలక్షేపం చేస్తోంది. మైక్రోసాప్ట్ భాగస్వామి బిల్ గేట్స్ తో సమావేశం గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ వచ్చింది. పదేళ్ల క్రితం కూడా బిల్ గేట్స్ తో భేటీ అయినప్పుడు ఏ అంశాలు మాట్లాడారో,దాదాపు అలాంటి వాటినే ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారట. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని అప్పుడు కోరారు. ఇప్పుడు మళ్లీ కోరారు.అంటే చంద్రబాబు ఎప్పుడో కోరినా మైక్రోసాఫ్ట్ ఎందుకు ఏపీకి రాలేదు?. హైదరాబాద్ లో తనను చూసే వచ్చిందని చెప్పారు కదా?ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు?. బిల్ గేట్స్‌ను ఏపీలో ఐటీ సలహామండలికి నాయకత్వం వహించాలని, లేదా సభ్యుడిగా ఉండాలని కోరారట. దానికి గేట్స్ స్పందించలేదట!. అయినా ఏపీ గురించే వారిద్దరూ మాట్లాడుకున్నట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఏదో చేద్దామని అనుకున్నట్లు కబుర్లు చెప్పుకున్నారట. డ్రోన్ ల ద్వారా వ్యవసాయం ఇప్పటికే జరుగుతుంటే దాని గురించి చర్చించుకున్నారట.ఆరోగ్య రంగంలో ఏదో చేస్తారట. అసలు ఏమి చేస్తారో చెప్పకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఎవరైనా నమ్ముతారా?. చివరికి జగన్ టైమ్ లో నిర్మించిన విశాఖ ఐటీ ఐకానిక్ భవనాన్ని, జగన్ ప్రభుత్వం చేపట్టిన పోర్టులను చూపించి అదేదో తమ ఘనతగా చెప్పుకోవడం మినహా తాము సాధించింది ఏమిటన్నది మాత్రం చంద్రబాబు,లోకేష్ లు చెప్పుకోలేకపోయారు. కాకపోతే రెండు రోజులలోనే నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు పెట్టుబడులను పెంచేసి కాగితాలపై రాసేసుకున్న ఘనత మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘ఇవి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’
తిరుపతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అండతో ఎల్లో మీడియా తనపై తప్పుడు కథనాలు రాస్తోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం ాదావా వేస్తానని పెద్దిరెడ్డి తెలిపారు. ఆ భూములను గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు కాదని తేల్చిన సంగతిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గుర్తుచేశారు. 2001లోనే ఆ భూమిని కొనుగోలు చేశామని, అప్పట్నుంచి ఆ భూమిలో సాగు చేస్తున్నమన్నారు పెద్దిరెడ్డి. ఎల్లో మీడియాను అడ్డం ెపెట్టుకుని వ్యక్తిత్వం హననానికి పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే తప్పుడు కథనాలు రాయిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. కాగా, పులిచెర్ల మండలంలో అటవీ భూములను తాము కబ్జా చేసినట్లు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రామచంద్రారెడ్డి ఇప్పటికే ివివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఒక్క ఎకరం అయినా కబ్జా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు. పూర్తి చట్టబద్ధంగా తాము 2001లో కొనుగోలు చేసిన భూములపై పచ్చి అబద్ధాలతో కథనాన్ని ప్రచురించడం వెనుక సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.1981లోనే అవి ప్రైవేట్ భూములని నిర్ధారించారు..నిత్యం చంద్రబాబుకు బాకా ఊదుతూ పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు, ఈటీవీ ద్వారా మాపై పలుసార్లు పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలను ప్రచురించారు. వీటిపై ఇప్పటికే చిత్తూరు న్యాయస్థానంలో ఎల్లో మీడియాపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశాం.పులిచర్ల ప్రాంతంలోని 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామని, అటవీ అధికారులకు తెలియకుండా తారు రోడ్డు నిర్మించామంటూ, భూమిని పెంచామంటూ పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో కథనాలను వెలువరించారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీచేశారు.ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడితోట, పశువుల పెంపకం చేపట్టాం. కేంద్ర అటవీశాఖ నుంచి 27.6.2022న క్లియరెన్స్ పొందిన తరువాతే అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చమన్నారు. -
విలువల్లేని ఎల్లో మీడియా.. వివరణ ఇచ్చినా విషం చిమ్ముతూనే ఉంది!
తిరుపతి, సాక్షి: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టీడీపీ అనుకూల మీడియా ఇస్తున్న కథనాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పని గట్టుకుని ఈ విష ప్రచారం చేయిస్తోందని ఆరోపించారాయన. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని ఎల్లో మీడియా ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విష ప్రచారం చేస్తోంది. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించక పోయినా ఉద్దేశ్య పూర్వకంగా మీ రాసిన చెల్లుతుంది విషం చిమ్ముతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన పనిగట్టుకుని అసత్య కథనాలు రాస్తున్నారు. తప్పుడు కథనలుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ కూడా విసిరారు. ఈ అసత్య ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(peddireddy ramachandra reddy) కడిగిన ముత్యంలా బయట పడతారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చకుండా మాపై విషం చిమ్ముతున్నారు. ఎల్లో మీడియా పత్రికలు కనీసం వివరణ ఇచ్చినా పత్రిక విలువలు పాటించడం లేదు. కూటమి ప్రభుత్వం పై మా పోరాటం చేస్తూనే ఉంటాం , ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది అనేది స్పష్టం అవుతోంది అని భూమన అన్నారు. -
ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి చేదు అనుభవం
సాక్షి, విజయనగరం జిల్లా: ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల హామీ మేరకు తమ గ్రామానికి రోడ్డు వేయించాలంటూ వేపాడ మండలం ఆతవ గ్రామస్థులు చుట్టుముట్టారు. దీంతో సమాధానం చెప్పలేక కోళ్ల లలిత కుమారి కారు ఎక్కి వెళ్లిపోయారు. కారుకు అడ్డుపడి గ్రామస్తులు ఆందోళన చేశారు. గ్రామస్తులను చెదరగొట్టిన పోలీసులు ఎమ్మెల్యేను తప్పించారు. -
‘అప్పుడేం చెప్పావో మర్చిపోయావా?.. నటించొద్దు బాబూ’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారం లేనప్పుడు ఒకటి చెప్తాడు.. అధికారం వచ్చాక మరోలా మాట్లాడతాడంటూ సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రం రూ.3 లక్షల కోట్లు కేంద్రం ఇస్తే రైతులకు సాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫీజులు చెల్లించక విద్యార్థులను బయటకు పంపిస్తున్నారు.. వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు.‘‘వైఎస్ జగన్ ఉన్నప్పుడు అప్పులు ఉన్నాయని చెప్పావ్.. ఇప్పుడు నువ్వేం చేస్తున్నాం.. ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నావ్.. అమరావతికి కేంద్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? కేవలం అప్పు మాత్రమే ఇచ్చారు.. స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు గట్టిగా ఎందుకు మాట్లాడటం లేదు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత సీఎం చంద్రబాబుదే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలన్నావ్.. ఆ మాట ఇప్పుడు ఏమైంది?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నలు గుప్పించారు.‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చంద్రబాబు అన్నాడు. ఇప్పడు స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు. దేశం తిరోగమనం వైపు వెళుతుంది.. మత ఛాందసం పెరిగిపోయింది. కుంభమేళాను గొప్పగా చెప్తున్నారు. ఒంటి నిండా బూడిద పూసుకొని పుర్రెలు వేసుకొని తిరుగుతున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా.? సీపీఐ పార్టీ వందేళ్ల ప్రయాణంలో కామ్రేడ్స్ త్యాగాలు మరువలేనివి. బ్రిటీష్ వారిపై పోరాడిన పార్టీ సీపీఐ. ఆర్ఎస్ఎస్ ఏనాడూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు. ఆర్ఎస్ఎస్ నేడు స్వాతంత్రాన్ని అనుభవిస్తుంది. బీజేపీకి 400 స్థానాలు వచ్చి ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం ఉండేది కాదు’’ అంటూ రామకృష్ణ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తప్పుడు వార్తలు.. ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తా: పెద్దిరెడ్డి -
ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తా: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: ఏపీలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు, కుత్రంతాలు ప్రజలకు బాగా తెలుసు అని విమర్శించారు. 2001లో భూములు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎల్లో మీడియా ఫేక్ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసిన ఈనాడు(Eenadu), ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. మాకు సంబంధించిన భూములపై ఎల్లో మీడియా(Yellow Media) తప్పుడు కథనాలు రాస్తోంది. 2001లోనే మేము భూములు కొనుగోలు చేశాం. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే రెవెన్యూ అధికారులు భూమి సర్వే చేశారు. 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం. ఇప్పుడు అది అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చింది. అంతకంటే ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. అప్పుడు కూడా అటవీ భూములు కాదని తేల్చారు. 2001 నుంచి భూములను సాగు చేస్తున్నాం. ఈనాడు, ఈటీవీ తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తాను.గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటనలో తప్పుడు వార్తలు రాశారు. అప్పుడు వారిపై రూ.50కోట్లకి పరువు నష్టం దావా వేశాం. ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని మళ్ళీ వార్త రాశారు. కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయ్యింది అని వార్తలు రాశారు. 19.11.1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు అమ్మిని వారికి ఆర్డర్ ఇచ్చారు. అధునాతన గెస్ట్ హౌస్ కట్టాలని వార్తలు రాశారు. 2001 లోనే అక్కడ పని చేసే వారి కోసం మేము గెస్ట్ హౌస్ కట్టాం. కోర్టులో పిటిషన్ వేసినా కూడా కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 1968లో ఇచ్చిన ఫారెస్ట్ గెజిట్‌లో కూడా ఆ 76 ఎకరాలు వారికి సంబంధం లేదు అని తేల్చారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారు.27.06.2022 లో బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుండి అనుమతులు కూడా వచ్చాయి. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందాన అంటున్నారు. గతంలో ఇసుక ద్వారా 40 వేల కోట్లు మింగేసాను అని, ఆ తర్వాత నేపాల్‌లో నాకు సంబంధించిన ఎర్ర చందనం దొరికింది అని ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఇన్ని రోజులు అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు.బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) కుట్రలు, కుతంత్రాలు అందరికీ తెలుసు.ఎన్నికల సందర్బంగా చెప్పిన ప్రకారం.. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలి. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు. ఏపీలో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. ఎవరు పార్టీలో ఉన్నా, లేకున్నా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్ నాయకత్వంలో మళ్ళీ అధికారం ఖాయం. క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. కరోనాతో ప్రపంచమంతా అల్లకోల్లోలం అయినా కూడా ఎక్కడా పథకాలు ఆపలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సూపర్ సిక్స్ అడిగితే.. డైవర్షన్ రాజకీయాలా?: అరుణ్‌కుమార్
సాక్షి, తాడేపల్లి: ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్దేశమే ఆయనకు లేదని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనాన్ని పచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. సూపర్ సిక్స్ అడిగితే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.‘‘ఎన్నికలకు ముందు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పథకాల గురించి అడిగితే సంపద సృష్టి తర్వాతనే అమలు చేస్తామని అంటున్నారు. చంద్రబాబు ఆర్ధిక అరాచక వాది. కాగ్ లెక్కలను కూడా తప్పుగా మార్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనులను మాపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్లోమీడియా ఉందని ఎలా చెప్పినా జనం నమ్ముతారన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు. 7 నెలల్లోనే లక్షా 13 వేల కోట్ల అప్పు చంద్రబాబు చేశారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు’’ అని అరుణ్‌కుమార్ నిలదీశారు.వైఎస్ జగన్ హయాంలో నీతి ఆయోగ్ ప్రకటించిన జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఏపీ ఉంది. ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి అడిగితే డబ్బులు లేవంటున్నారు. చంద్రబాబు మోసగాడనీ, ఆయన్ను నమ్మవద్దని జగన్ అనేకమార్లు చెప్పారు. జగన్ మాటలతో ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి’’ అని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘బాబు మోసాలను పవన్ ప్రశ్నించరా?’ -
‘పెద్దలు’ దావోస్ వెళ్లేది అందుకేనా..?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)దావోస్‌లో పెట్టుబడుల సదస్సు అంటూ జనవరి 20-24 తేదీల మధ్య నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం అబాసుపాలైంది. ఈ సదస్సులో పెట్టుబడులు,వ్యాపారం,పరిశ్రమల స్థాపన,ఆయా రంగాల్లో నిపుణులు,అనుభవజ్ఞులతో చర్చలు, ఉపచర్చలు అంతిమంగా ఆరోగ్యకరమైన పారిశ్రామిక విధానాల రూపకల్పన వంటివి ఉంటాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అసలా సదస్సు ఉద్దేశ్యం అదే అయినా..వెళ్లినవారి ఉద్దేశాలు వేరని అందరూ అక్కడికి విలాసాలకు కులాసాలకు మాత్రమే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి హోటల్స్ రిసార్ట్స్ బుకింగ్స్ బట్టి ఇదే అర్థం అవుతోందని జాతీయ,అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అక్కడికి వచ్చేవారికి వారి కోరికమేరకు 'వ్యక్తిగత సేవలు' అందించే సంస్థలకు భారీ గిరాకీ దక్కిందని ఈ సర్వీసుల సేవల విలువ దాదాపు రూ.పదికోట్ల పైమాటే అని ఆ కథనాల్లో వివరిస్తున్నారు.పెట్టుబడులు,పారిశ్రామిక విధానాలు,వాతావరణ మార్పుల మీద చర్చలకన్నా అక్కడికి ధనికులు 'గాలి మార్పు' రిలాక్సేషన్ కోసమే ఎక్కువ తాపత్రయపడినట్లు ఓ అంతర్గత నివేదిక బయటకు వచ్చింది. స్విట్జర్లాండ్ లో అలాంటి సేవలు అందించే సంస్థలకు దావోస్ సదస్సు టైమ్‌లో డిమాండ్ గణనీయంగా పెరిగింది అంటూ బ్రిటన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ పత్రిక,వెబ్ సైట్ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. ఇలాంటి బుకింగ్స్ అందుబాటులో ఉంచే ఒక వెబ్ సైట్ ఐతే మొదటి రెండు మూడు రోజుల్లోనే దాదాపు రూ.3 కోట్లు ఆర్జించింది.గత ఏడాది ఈ సర్వీసులు కేవలం 170 సంస్థలు మాత్రమే అందించగా ఈసారి వాటి సంఖ్య దాదాపు మూడు వందలకు పెరిగిందట.దావోస్‌లో పెట్టుబడులు అంటూ వెళ్లే పెద్దలు..పెద్దల ముసుగులో వెళ్లే నాయకులూ అక్కడకు వెళ్లి చేసే రాచకార్యాలు ఇవీ అంటూ హిందూస్తాన్ టైమ్స్,ఎకనామిక్ టైమ్స్ తో పాటు పలు వెబ్ సైట్స్ కూడా బోలెడు ఇన్సైడర్ కథనాలు ప్రచురించాయి.దీనిమీద సోషల్ మీడియాలోనూ పంచులు పేలుతున్నాయి. ఓ నెటిజన్ అయితే దావోస్ సదస్సుమీద వ్యంగ్యంగా పాట కూడా రాశారు..గుడివాడ యెల్లాను... గుంటూరు పొయ్యాను... దావోసూ పోయాను... ఎన్నెన్నో చూశాను. యాడ చూసినా, ఎంత చేసినా ఏదో కావాలంటారు... నోళ్ళు... ‘పెట్టుసచ్చిబడుల వేటకు వచ్చినోళ్ళు’. అంటూ పాట రాశారు. మొత్తానికి పెట్టుబడుల వేట అంటూ వెళ్లిన వేటగాళ్లు.. అసలు పనికన్నా కొసరూపానికి ప్రాధాన్యం ఇచ్చారని.. మీడియా.. సోషల్ మీడియా కోడై కూస్తోంది..-- సిమ్మాదిరప్పన్న -
‘బాబు మోసాలను పవన్ ప్రశ్నించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: పేదల ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు.. ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై.. బుధవారం రాజమండ్రిలో వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.‘‘తల్లికి వందనం, ఫీజు రియింబర్స్‌మెంట్, రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పినా ఇప్పటిదాకా అది జరగలేదు. ఎందుకు?. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఎందుకు ఈ విషయాల్లో మౌనంగా ఉన్నారు?. పవన్ కళ్యాణ్ స్పందించాలి... లేదంటే చంద్రబాబు మాయలో పడి మీరు మోసపోయినట్టే.. అలాగే ప్రజల వద్ద నమ్మకమూ కోల్పోతారు.ఖజానా 100 కోట్లు ఉన్న సమయంలోనే నవరత్న పథకాలను వైయస్ జగన్ అద్భుతంగా అమలు చేశారు. రాష్ట్ర ఆదాయం కూడా ఆయన హయాంలోనే పెరిగింది. 7,000 కోట్లు రూపాయలతో ఖజానా మీ చేతిలో పెడితే ఏం చేశారు?. పదిహేను శాతం వృద్ధిరేటు దాటిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని స్పష్టమవుతోంది. పోలవరం ,అమరావతి చంద్రబాబు అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి.... చంద్రబాబు ఆస్తులు విలువ పెరుగుతుంది మినహా ప్రజలకు ఒరుగుతున్నది ఏమీ లేదు.ప్రజలు మీరు చెప్పిన హామీలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నారు ... వాటిపై దృష్టి పెట్టండి అని హితవు పలికారాయన.చంద్రబాబు పేదల ద్వేషి. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పింది ఎవరు?. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూములు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నారు. మీ వాళ్ళు భూములు కొనుగోలు చేసినందుకు మీ స్వార్థం కోసం అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకపోవడం దారుణం అని వేణుగోపాల్ అన్నారు. -
చంద్రబాబూ..ఇంత మోసమా!: అనంతవెంకట్రామిరెడ్డి
సాక్షి,అనంతపురం:ఇచ్చిన అన్ని హామీలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అమలు చేశారని,నవరత్నాలను నిక్కచ్చిగా అమలు చేసిన ఘనత ఆయనదేనని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రారామిరెడ్డి అన్నారు. బుధవారం(జనవరి29) ఆయన మీడియాతో మాట్లాడారు.‘సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు చేతులెత్తేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంత మోసం చేస్తారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబుకు అవగాహన లేదా? సూపర్‌సిక్స్ హామీలకు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలి.సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు. ప్రజలు అధైర్య పడొద్దు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది’అని అనంతవెంకట్రామిరెడ్డి తెలిపారు.గుమ్మనూరు జయరాం ఆగడాలు పెరిగిపోయాయి‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి.ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది.బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు.టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు’అని అనంతవెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. -
కలెక్టర్ గారూ.. మీకిది తగునా!
ఈ ఫొటోలో మంత్రి నారాయణ పక్కన ఉన్నది వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి. ఆయన గతంలో ప్రైవేట్ విద్యాసంస్థకు అధిపతిగా ఉండేవారు. తర్వాత విద్యాసంస్థను వదిలేసి నారాయణకు ఆప్తుడయ్యారు. ఆ క్రమంలోనే 2024 ఎన్నికల్లో పలుచోట్ల బహిరంగ సభల్లో నారాయణతో పాల్గొన్నారు. ఫొటోలు దిగారు. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో మాట్లాడి ఒకచోట సభను పెట్టించారు. ఈ క్రమంలో తనకున్న అనుభవంతో ప్రైవేటు విద్యాసంస్థల వారిని నారాయణకు ఓటు వేసేలా కృషి చేశారు. నారాయణ గెలుపు కోసం వాకాటి విజయకుమార్‌రెడ్డి పాంప్లెట్స్ వేయించారు. వాటిలో తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను ప్రింట్ చేయించారు. ఆయన గెలుపు కోసం బహిరంగంగా పని చేశారు. నా విజయానికి నీవు సహకరిస్తే.. నీకు రెడ్‌క్రాస్ చైర్మన్ పదవి కట్టబెడతా.. ఇలా ముందస్తుగా అనుకున్న పథకం ప్రకారమే పదవి వాకాటి విజయకుమార్‌రెడ్డిని వరించిందా అంటే అవుననే విశ్లేషకులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయాలని ప్రత్యక్ష రాజకీయాలు చేసిన వాకాటికి కలెక్టర్ ఆనంద్ రెడ్‌క్రాస్ ఎన్నికల్లో సహకారమందించారనేది నగ్నసత్యం. మంత్రి నారాయణ ఒత్తిడి పెట్టినంత మాత్రాన కలెక్టర్ ఒక పార్టీకి కొమ్ము కాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెడ్‌క్రాస్ అంటే సేవ చేసే సంస్థ అని ఇందులో రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వారు ఉండకూడదని నిబంధనల పేరిట కలెక్టర్ ఆనంద్ రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేకర్రెడ్డితో పాటు మరో నలుగురు ఎంసీ మెంబర్లకు నోటీçసులు ఇచ్చారు. వారు అందుకు తగిన వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ సంతృప్తి చెందని కలెక్టర్ రెడ్‌క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు వైఎస్సార్సీపీకి అనుకూలురంటూ ముద్రవేసి మిగతా మేనేజింగ్ కమిటీ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, మలిరెడ్డి కోటారెడ్డి, నేతాజి సుబ్బారెడ్డి తదితరులను తొలగించడమే కాకుండా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసేశారు. అయితే కోర్టుకెళ్లి తిరిగి విజయాన్ని సాధించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరులు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇప్పటికీ రెడ్‌క్రాస్ సభ్యులుగా కొనసాగుతున్నప్పటికీ వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయలేదు. చట్టబద్ధంగా గెలిచినా.. రెడ్‌క్రాస్‌లో ఉన్న 8వేల ఓట్లలో 6వేల ఓట్లు సాధించి రెడ్‌క్రాస్ చైర్మన్, ఎంసీ పదవులు దక్కించుకున్నప్పటికీ కలెక్టర్ ఆనంద్ వారిని తొలగించారు. మంత్రి అనుచరుడిగా ఉన్న వాకాటి విజయకుమార్‌రెడ్డిని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు సహకరించారు. మరి మంత్రి నారాయణతో ఫొటోలు దిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని, వ్యక్తిగత నంబర్ కూడా పాంప్లెట్స్‌లో ఇచ్చిన వాకాటి విజయకుమార్‌రెడ్డి మాత్రం కలెక్టర్‌కు ఎలా రాజకీయేతరుడుగా కనిపించారో తెలియడం లేదు. పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. అధికారులు ఎక్కడికెళ్లినా శాశ్వతం. మరి అలాంటి అధికారులు ఒత్తిడికి తలొగ్గితే ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం సందేహమే. -
బాలయ్య, జూనియర్, లోకేష్.. అంతా చంద్రబాబు మిథ్య!
‘‘అందరినీ అన్నిసార్లూ నమ్మించ లేం’’ అంటుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పుడు అదే రుజువు అవుతోంది. దావోస్‌లో వారసత్వం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కుమారుడు, మంత్రి లోకేష్‌కు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘వారసత్వం అనేది ఒక మిథ్య’’ అని, ‘‘వారసత్వం ఒక్కటే అన్నీ ఇవ్వలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను సొంతంగా దావోస్ తీసుకెళ్లిన మీడియాతో ఆయన ఈ మాట అంటున్నారంటే.. ఆ వ్యాఖ్యల మర్మం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘‘ఎవరికైనా మెరుగైన అవకాశాలు రావచ్చు. వారు వాటిని ఎలా అందిపుచ్చుకుంటారన్నది ముఖ్యం. వ్యాపారంలో ఉండి ఉంటే లోకేష్‌కు సులభంగా ఉండేది. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చారు. ఇందులో వారసత్వం లేదు’’ అని ఆయన చెబుతున్నారు. బాగానే ఉంది కానీ దీన్ని నమ్మేదెవరు? రెండు దశాబ్దాలుగా కుమారుడిని వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబేనాయె! ఏదో మాట వరసకు వారసత్వం అన్నీ ఇవ్వదని అంటున్నా... అనేక ఇతర నేతల మాదిరిగానే లోకేష్‌కూ అదే పునాది అన్నది అందరికీ తెలిసిన విషయమే. లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొస్తారా?.. అనే ప్రశ్నకు ఆయన గతంలో చాలా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు లోకేష్‌కు ప్రజాసేవ చేయాలనుంది అని ఆయనే అంటున్నారు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని ఆయన్ను పక్కకు తప్పించిన విషయం మరీ పాత విషయమైతే కాదు. ఆ తరువాతి ఏడాది జరిగిన మహానాడులో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని బట్టే లోకేష్ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైందని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు.. నగదు బదిలీ పథకాలను తన కొడుకే ఆవిష్కరించినట్లు బిల్డప్‌లు ఇవ్వడమూ మొదలుపెట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఎందుకో మరి పోటీ మాత్రం చేయలేదు. అయితే టీడీపీ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో లోకేష్‌కు ప్రాధాన్యత వచ్చింది. మంత్రిని చేయాలని కుటుంబం నుంచే ఒత్తిడి రావడం మొదలైంది. కాదనలేక చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి ఆ తరువాత మంత్రిపదవి కట్టబెట్టారు. ఇదంతా వారసత్వ రాజకీయం కాదంటే ఎవరైనా నమ్ముతారా? ఎలాంటి కష్టం, ఎదురుచూపు, నిరాశల్లేకుండా అనాయసంగా ఎమ్మెల్సీ, మంత్రి పదవులు రావడం ఆషామాషీ ఏమీ కాదన్నది ఎవరిని అడిగినా చెబుతారు. లోకేష్‌కు ఈ పదవులు మాత్రమే కాదు... తండ్రి పేరుతో లేదంటే ఆయన తరఫున పెత్తనాలు చేసే స్థాయి కూడా వచ్చిందన్నది బహిరంగ రహస్యం. లోకేష్‌ను కలిసేందుకు టీడీపీ నేతలు క్యూ కడితే.. బాబును కలిసి వచ్చారా? అంటూ అప్పుడప్పుడూ చంద్రబాబు కూడా వాకబు చేసేవారని చెబుతారు. 2019 శాసనసభ ఎన్నికలలో లోకేష్ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు రాజకీయాలు సరిపడవని, వ్యాపారం చేసుకోవాలని లోకేష్‌కు సూచించలేదు. బదులుగా పార్టీలో ప్రాధాన్యం మరింత పెరిగింది. పాదయాత్ర చేసి రెడ్ బుక్ అంటూ ప్రచారం చేసి లోకేష్ సొంత గుర్తింపు కోసం ప్రయత్నించి ఉండవచ్చు. అది వేరే విషయం.2024 ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీలో కీలకంగా ఉండడం, తండ్రికి సంబంధం లేకుండా పలు హామీలు ఇచ్చారు కూడా. వారసత్వ అధికారం లేకుండానే అవన్ని చేయగలుగుతారా? రెడ్ బుక్ అంటూ కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నా, అన్ని శాఖలలో జోక్యం చేసుకుంటున్నా, చంద్రబాబు కన్నా లోకేషే పవర్ పుల్ అన్న భావన ఏర్పడినా అదంతా వారసత్వం ఇచ్చిన బలమే. దానిని అడ్డుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరు. నిజానికి చంద్రబాబు ధైర్యంగా లోకేష్ తన వారసుడని చెప్పి ఉండవచ్చు. కానీ అలా అంటే ప్రజలలో ఏమైనా నెగిటివ్ వస్తుందేమోనని అనుమానంతో ఇలా ఫీలర్లు వదులుతూంటారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో తదుపరి టీడీపీ అధినేత లోకేష్ అన్న భావన బలపడేలా చేస్తారన్నమాట. ఎల్లో మీడియా ఈ మాటలకు రకరకాల కలరింగ్ ఇస్తూంటుంది. పని తీరు, ప్రతిభ ఆధారంగానే లోకేష్ వారసుడిగా ఎదగాలి తప్ప తన కొడుకు అన్న ఒక్క కారణంతో వారసుడు కాలేడని చెప్పడం చంద్రబాబు అభిప్రాయమని జాకీ మీడియా విశ్లేషణ చేసింది. అలాగైతే ఎవరు కాదంటారు. ఇంకెవరైనా ఇలాగే రాజకీయాలలోకి వస్తే ఇదే జాకీ మీడియా అడ్డమైన నీచపు రాతలు రాస్తుంటుంది. లోకేష్ సొంత ప్రతిభతో రాజకీయాలలోకి వచ్చారా? లేక వారసత్వంతో వచ్చారా అన్నది అందరికి తెలిసిన సత్యం. దీనికి ఇంత నాటకీయత పులమడం అవసరమా? అన్నదే ప్రశ్న. ఒకప్పుడు ఎన్.టి.రామారావు తన కుమారుడు బాలకృష్ణను రాజకీయ వారసుడని ప్రకటించినప్పుడు.. దాని వల్ల నష్టం జరుగుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్టీఆర్ ఆ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరూ వారసులు కాకుండా తానే చక్రం తిప్పేలా ఆయన వ్యూహ రచన చేసుకున్నారని చెబుతారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరాక కొంతకాలానికి కర్షక్ పరిషత్ ఛైర్మన్‌గా ,ఇతరత్రా అధికారం చెలాయించడం ఆరంభించగలిగారు. దానికి కారణం మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే కదా! కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ నాయకుడిని, ఈ నాయకుడిని ప్రసన్నం చేసుకుని మంత్రి పొందిన చంద్రబాబుకు టీడీపీలో చేరాక ఆ ఇబ్బంది లేకుండా పోయింది. రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారన్న విమర్శలు కూడా వచ్చేవి. 1994లో టీడీపీ మళ్లీ గెలిచిన తర్వాత రెండు కీలకమైన శాఖలు రెవెన్యూ, ఫైనాన్స్ పొందగలిగారంటే మామ అండ ఉండబట్టే కదా.. దీనిని వారసత్వం అని నేరుగా అనకపోవచ్చు. కానీ అల్లుడు గిల్లుడు అని చమత్కరిస్తుంటారు. ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి కూడా బంధుత్వమే ఉపయోగపడింది కదా! అల్లుడు తన పదవి ఎందుకు లాక్కొంటారని ఎన్టీఆర్ అమాయకంగా ఉండిపోయారు. దానిని అడ్వాంటేజ్ చేసుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తనవైపు లాక్కొని సీఎం సీటు ఎక్కుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలంతా అదంతా కుటుంబ వ్యవహారం అనుకున్నారు. ఇందులో చంద్రబాబు కుట్ర రాజకీయాలు కూడా ఉండవచ్చు. అది వేరే విషయం. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు ఎవరూ తనకు పోటీకి రాకుండా జాగ్రత్తపడ్డారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశపెట్టి ఈనాడు రామోజీరావు సాయంతో బయటకు గెంటేశారు. ఇది వారసత్వ గొడవ కాదా? లక్ష్మీపార్వతిని సాకుగా చూపించడంలో ఉన్న మతలబు తెలియదా! హరికృష్ణ పరిస్థితి అంతే. టీడీపీ అధ్యక్షుడిని చేస్తానని వాగ్దానం చేసి, ఆ తర్వాత తాత్కాలికంగా మంత్రిని చేసి, ఆ పదవి కూడా పోయేలా చేశారు. దాంతో హరికృష్ణ పార్టీ వీడిపోయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బాలకృష్ణతో సత్సంధాలు ఉండేలా చేసుకుని వియ్యంకుడిగా మార్చుకుని ఆయనను పూర్తిగా వారసత్వ పోటీ నుంచి తప్పించగలిగారు. ఇవన్ని రాజకీయంగా చంద్రబాబు తెలివిగానే చేశారు. తద్వారా ఎన్టీఆర్ వారసులు కాకుండా, ఇప్పుడు తన వారసుడు లోకేష్ సీఎం అయ్యేందుకు బాట వేసుకున్నారు. అందులో బాగంగానే ప్రభుత్వ ప్రచారం ప్రకటనలలో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా ప్రచురించారు. లోకేష్ డిప్యూటి సీఎంగా ను చేయాలని తన సమక్షంలోనే టీడీపీ నేతలు డిమాండ్ చేసినా ఆయన ఏమీ మాట్లాడలేదు. మరెవరికైనా ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఎదుట అనగలరా? అంటే ఆయన ఊరుకుంటారా? ఇదంతా వారసత్వం కాకపోతే ఏమిటి? చేసేది చేస్తూనే ఏమి తెలియనట్లు నటించడమే చంద్రబాబు రాజకీయం. దానికి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుంటారు. పవన్ కల్యాణ్ వైపు నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ పెద్ద వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు. పవన్ ఒకరకంగా ఇప్పటికే మానసికంగా సిద్దపడ్డారని విశ్లేషణలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల కుమారులు రాజకీయాలలోకి వచ్చారు. సీఎంలు అయ్యారు. అదేదో జరగకూడని సంగతేమీ కాదు.లోకేష్ ను సీఎం పదవి ఇవ్వాలని కుటుంబపరంగా డిమాండ్ వస్తున్నదంటే అది వారసత్వం వల్ల కాక మరేమిటి? ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సరిపెట్టాలని చూస్తున్నది నిజం కాదా? అంతెందుకు! తన తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి కాబోడని, పార్టీ అధినేత కాజాలరని ఇంటకానీ, బయటకానీ చెప్పగలరా? ఉప ముఖ్యమంత్రిని చేయబోవడం లేదని ఇంతవరకు చెప్పలేదు. పైగా కూటమిలో చర్చించుకుంటామని చెప్పి పరోక్షంగా ధృవీకరించారు. అవన్ని కప్పిపుచ్చి, వారసత్వం మిథ్య అని, మరొకటని కబుర్లు చెప్పి, ఆయనేదో వారసత్వానికి వ్యతిరేకమైనట్లు, లోకేష్ ప్రజాసేవకుడు అయిపోయినట్లు పిక్చర్ ఇచ్చుకునే ప్రయత్నమే బాగోలేదు. దానినే హిపోక్రసీ అని అంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు: అంబటి
సాక్షి, గుంటూరు: కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారారని.. కూటమి బలం ప్రకారం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేయకూడదన్నారు. ఎమ్మెల్యేలు సిగ్గు విడిచి కార్పొరేటర్లు ఇళ్లకి వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో కార్పొరేటర్‌కి యాభై లక్షలు ఇస్తామంటున్నారు. కార్పొరేటర్లను కొంటున్న విధానాన్ని ప్రజలు గమనించాలి. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అంబటి మండిపడ్డారు.ప్రజాస్వామ్యానికి టీడీపీ విఘాతం: అప్పిరెడ్డివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ, కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారని.. లక్షల రూపాయలు కార్పొరేటర్లకు వెదజల్లుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తున్నారు.. మా కార్పొరేటర్లు నిజాయితీగా వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాలి’’ అని అప్పిరెడ్డి హితవు పలికారు.ప్రజాస్వామ్యానికి టీడీపీ తూట్లు: మనోహర్మేయర్ కావటి మనోహర్ మాట్లాడుతూ, ఆరు స్టాండింగ్ కమిటీ సభ్యులను గెలుచుకునే బలం మాకుంది. కేంద్ర మంత్రి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కూటమి బలం కేవలం పదకొండు సభ్యులు మాత్రమే. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అరచేతిలో వైకుంఠం.. హామీలతో కనికట్టు.. చంద్రబాబుపై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు జిల్లా: ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, హామీలతో కనికట్టు చేసిన దీ గ్రేట్ మోసగాడు నారా చంద్రబాబు ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తీసేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం సాక్షిగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదు అంటూ చాలా స్పష్టంగా చంద్రబాబు తేల్చి చెప్పేశారని అన్నారు. ఎలాంటి సంకోచం, భయం లేకుండా ప్రజలను మోసం చేయగల ఘనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..సంపద సృష్టించిన తరువాతే హామీల అమలు అని తేల్చేశారుచంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని, పులినోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు మరోసారి నిజం అని చంద్రబాబు నిరూపించుకున్నాడు. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబును, మాట మీద నిలబడ్డ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. జగన్ గారి విశ్వసనీయతను, ఆయన చిత్తశుద్ధి, సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా అందరూ పోల్చి చూస్తున్నారు. చంద్రబాబు అధికారం నుంచి దిగిబోయే సమయం ఖజానాలో మిగిల్చింది కేవలం రూ.100 కోట్లు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి ఖజానాలో ఉన్న మొత్తం రూ.5000 కోట్లు.అటువంటి నేపథ్యంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రజలకు అబద్దాలను నిస్సిగ్గుగా మాట్లాడారు. నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను ఒక్కసారి చూస్తే… ‘‘అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మళ్లీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోరో మనీ ఉంటే మోరో క్యాపిటల్ వ్యయం ఖర్చు పెడతాం. మోర్ గ్రోత్ రేట్ వస్తుంది. మోర్ రెవెన్యూ వస్తుంది. సస్టైనబులిటీ వస్తుంది. ఆ సస్టైనబులిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేం చెప్పిన సూపర్ సిక్స్ఇస్తాం. ఇంకా బెటర్‌గా ఇస్తాం. పీ4 తీసుకొస్తాం.’’ ఇదీ నీతి ఆయోగ్ నివేదిక పై ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు.9 నెలల్లో రూ.1.19 కోట్లు అప్పులుప్రభుత్వం ఏర్పాటై దాదాపు 9 నెలలు కావొస్తోంది. ఈ 9 నెలలకాలంలో దాదాపుగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. మరి అప్పులతో ఎక్కడ సంపద సృష్టించారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీకు ఆర్థికంగా ఎక్కడ కలిసి వస్తుందో అవి మాత్రమే చేస్తున్నారన్నది నిజం కాదా? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను తీసేసి… వారిని రోడ్డు మీదకు పెడుతున్నారన్నది నిజం కాదా? వాలంటీర్లను, గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులు కుదించడం దగ్గర నుంచి, బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఏపీఎండీసీ, పీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ ఇలా ఆయా విభాగాల్లో లక్షలమంది ఉద్యోగులను తొలగిస్తున్నది వాస్తవం కాదా? పైగా జగన్ ఒక ముందుచూపుతో, విజన్ తో సముద్ర తీరం ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ రంగంలోకి మూడు పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మిస్తుంటే.. వాటిని మీ వాళ్లకు తెగనమ్మాలనుకున్నది వాస్తవం కాదా?ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుగా కొన్ని మెడికల్ కాలేజీలను కట్టడంతోపాటు, మరికొన్ని మెడికల్ కాలేజీలను శరవేగంగా నిర్మిస్తుంటే మొత్తంగా జగన్ గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఇప్పుడు మీ మనుషులకు తెగనమ్మే ప్రయత్నంచేస్తున్న మాట వాస్తవం కాదా? ఇక సంపద సృష్టి ఎక్కడ జరుగుతోంది. సంపదలు ఏమైనా సృష్టిస్తున్నారంటే అది మీకోసం తప్ప, మీ నాయకులకుకోసం, చంద్రబాబునాయుడుగారి మనుషులకోసం తప్ప మరెవ్వరికీ కాదు. ఇసుక, మద్యం మాఫియాలు నడిపి మీ కార్యకర్తల జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, ఫ్లైయాష్ ఇలా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు.నియోజకవర్గాల్లో ప్రతి పనికీ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే.. ఈరకంగా సంపద సృష్టి మీ వాళ్లకు జరుగుతోంది తప్ప.. పేదలకు, సామాన్యులకు సంపద సృష్టి దక్కడం లేదు. మీ పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ తో రెండు మూడు సినిమాలు తీస్తే.. వారికి వందల ఎకరాలు దోచి పెడుతున్నారు. సంపద సృష్టి అలాంటి వారికి జరగుతోంది తప్ప, రాష్ట్రానికీ, ప్రజలకూ కాదు. అందుకే చంద్రబాబుగారు… సంపద సృష్టి అన్నది వట్టిమాటలేనని చెప్పకనే చెప్పారు. తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని ముసుగు తీసేసి చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా, స్లోగా ఎక్కించే ప్రయత్నంచేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ కొత్త నివేదికలు.హామీల అమలుకు చంద్రబాబుకు మనసు రావడం లేదుతాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వాగ్దానాలను అమలు చేయలేక, ప్రజలకు ఇవ్వడానికి మనసు రాక, వారికి ఇచ్చేలా తగిన రీతిలో పరిపాలన చేయలేక, చేతగాని తనంతో, అసమర్థతతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు, ఆ నేరాన్ని జగన్ గారి మీద నెట్టేయడానికి ఇప్పటికీ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేవేసిన, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభంలో ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుకున్న ప్రభుత్వం మీద నిందలు వేసి తప్పించుకోవడానికి యత్నిస్తున్నారు. దాంట్లో భాగమే తాజా ఆయన చెప్తున్న నీతి ఆయోగ్ నివేదిక. అసలు నీతి ఆయోగ్ పేరుమీద చంద్రబాబు విడుదలచేసిన రిపోర్టును చూస్తుంటే.. చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.ఒక రాష్ట్రం ఆర్థిక పనితీరు చెప్పాలంటే, ఒక ఏడాదికి, తర్వాత ఏడాదికి పోల్చి చూడ్డం సహజం. అంతే కాకుండా గత పదేళ్లకాలంలో ప్రగతి ఎలా ఉంది? అన్నది ఇయర్ బై ఇయర్ కూడా చూస్తారు. లేదంటో గత ఐదేళ్లతో, తర్వాత ఐదేళ్లతో పోల్చి చూస్తారు. సహజంగా ఎవరైనా చేసే పని ఇది. అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఆయన నేతృత్వంలో పనిచేసిన ప్రభుత్వ పనితీరును ఆయన పనిచేసిన ఐదేళ్లకాలానికి, అంతకుముందు నాయకుడు పనిచేసిన ఐదేళ్లకాలానికి పోల్చిచూస్తారు. ఇద్దరి నాయకుల మధ్య తేడా ఏంటి? ఎవరి పనితీరు ఎలా ఉందో చూస్తారు. పోల్చే విషయంలో సహజంగా పాటించే విధానం ఇది. కాని చంద్రబాబు నాయుడు చూపుతున్న నీతి ఆయోగ్ నివేదికలో చంద్రబాబు దిగిపోయిన 2018-19 ఆర్థిక సంవత్సరంతో, వైయస్ జగన్ గారు పరిపాలించిన ఐదేళ్లకాలంలోని 2022-23 సంవత్సరంతో పోల్చి చూస్తున్నారు. రెండు పరిపాలనా కాలంలో ఎంపికచేసుకున్న రెండు సంవత్సరాల మధ్య పోలిక చూడటం అనే కొత్త పద్దతిని చంద్రబాబు మాత్రమే సిగ్గు లేకుండా ప్రవేశపెట్టారు.మూలధన వ్యయంపైనా అవాస్తవాలుచంద్రబాబు గత పరిపాలనా కాలం అంటే 2014-19 మధ్య కోవిడ్ లాంటి సంక్షోభం ఏమీ లేదు. కాని జగన్మోహన్ రెడ్డిగారి హయాంలో రెండున్నరేళ్లపాటు కోవిడ్ ప్రపంచంమీద దాడిచేసింది. మన దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంక్షోభాన్ని తీసుకు వచ్చింది. ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉత్పత్తి లేదు, చేసిన వాటిని ఎగుమతి చేసే వీలులేదు, పంపిణీ వ్యవస్థలు లేవు. 2020లో మొదటి వేవ్, 2021లో రెండో వేవ్, 2023లో మూడో వేవ్ ఇలా ఆ రెండున్నర సంవత్సరాలు కూడా కోవిడ్ ప్రపంచంమీద దాడి చేసింది. ఇంతటి సంక్షోభం ఉన్నా దాన్ని ఎదుర్కొంటూ జగన్ మెరుగైన పనితీరు చూపించారు.వాస్తవంగా నీతి ఆయోగ్ రిపోర్టును చూస్తే కేవలం జగన్ గారి హయాంలో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ బాగోలేదని, 13వ స్థానానికి దిగిపోయామని చెప్పారు. అదే నీతి ఆయోగ్ రిపోర్టులో కూడా కోవిడ్ లేని సమయంలో చంద్రబాబు హయాంలో కూడా రాష్ట్రం ర్యాంకు 13 కాగా, ఆ తర్వాత కోవిడ్ లాంటి సంక్షోభం ఎదుర్కొన్న జగన్ ప్రభుత్వంలో కూడా రాష్ట్రం ర్యాంకు 13వ స్థానమే. చంద్రబాబు మూలధన వ్యవయం మీద కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. 2014-19 మధ్య కాలంలో, చంద్రబాబుగారి గడచిన ఐదేళ్లలో మూల ధన వ్యయం కింద సగటున ఏడాది రూ.13,860 కోట్లు ఖర్చుపెడితే, జగన్ గారి హయాంలో కోవిడ్ లాంటి విపత్తు ఉన్నా సరే 2019-24 మధ్య సగటున ఏడాదికి రూ. 15,632 కోట్లు ఖర్చు చేశారు. ఇవి కాగ్ ఇచ్చిన లెక్కులు. మరి ఎవరు ఆర్థిక అరాచకవాదో ప్రజలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు హయాంలో క్షీణించిన రుణాల లభ్యతలో స్థిరత్వం2024-25 అంటే నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలలకాలంలో తెచ్చిన అప్పులు వారి లెక్కల ప్రకారమే రూ.73,635కోట్లు కాగా, అందులో మూలధన వ్యయం కింద పెట్టిన ఖర్చు కేవలం రూ.8894.98 కోట్లు మాత్రమే. కోవిడ్ లాంటి విపత్తు ఉన్నప్పుడు జగన్ హయాంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంటే 12 నెలల కాలంలో రూ.67,985 కోట్లు అప్పులు తెస్తే, అందులో సుమారుగా రూ.7300 కోట్లు మూలధన వ్యయం చేశారు. ఒక విపత్తు నడుస్తున్న సమయంలో, ఏ పనులు కూడా నడవని సమయంలో చేసిన ఖర్చు ఇది. మరి ఎవరు ఆర్థిక అరాచకవాది?ఒక రాష్ట్రం తానుచేసిన అప్పులు మీద చెల్లించే వడ్డీల వృద్ధిరేటు, జీఎస్డీపీ వృద్ధిరేటు కన్నా అధికంగా ఉంటే రుణాల లభ్యతలో స్థిరత్వం పూర్తిగా క్షీణించినట్టేనని గొప్ప ఆర్థిక నిపుణుడుగా, విజనరీగా తనను తాను ప్రకటించుకునే చంద్రబాబు కొత్త నిర్వచనం చెప్పారు. 2013-14లో విభజిత రాష్ట్రం జీఎస్డీపీ రూ.4,64,272 కోట్లు అయితే, వడ్డీ చెల్లింపులు రూ.7,488 కోట్లు. అదే 2018-19లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.8,73,721 కోట్లు అయితే, వడ్డీల కింద చెల్లింపులు రూ.15,342 కోట్లు. అప్పులపై కట్టే వడ్డీ వృద్ధిరేటు 15.42% కాగా, GSDP వృద్ధిరేటు 13.48%. అంటే చంద్రబాబు తాజాగా చెప్పిన నిర్వచనం ప్రకారం చేస్తే మీ పాలనలోనే రుణాల లభ్యతలో స్థిరత్వం పూర్తిగా క్షీణించిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంత దారుణమైన పాలన అందించిన చంద్రబాబును ఆర్థిక అరాచకవాది అనడం తప్పవుతుందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూటకో మాటఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అప్పులుమీద కూడా చంద్రబాబు చేస్తున్న డ్రామాలు, గిమ్మిక్కులు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం అప్పులు మీద ఇలాంటి ప్రచారం చేశాడు. కాని అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయాడు. 05.04.2022న రాష్ట్రం శ్రీలంక అవుతోందంటూ చంద్రబాబు ప్రకటన చేశారు.17.05.2022న శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో’.. అని చంద్రబాబు పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. 07.04.2024న రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు అని చంద్రబాబు గారి వదినమ్మ పురంధీశ్వరి గారు ప్రకటించారు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. 21.04.2024న ఎన్నికలకు కొన్నాళ్ల ముందు చంద్రబాబుకు వంతపాడే ఈనాడు దినపత్రిక ఒకాయనను పట్టుకొచ్చి, ఆయన ఆర్థిక నిపుణుడు అని ప్రకటించి ఆయనతో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని చెప్పించారు.అప్పుల లెక్కలపై తన మాటలపైనే చంద్రబాబుకు నిలకడలేదురాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన, అప్పుల పైన ఇంత దారుణంగా ప్రచారంచేసిన చంద్రబాబు మే 29, 2023న రాజమండ్రిలో సూపర్ సిక్స్ అంటూ హామీలను ప్రకటించారు. తర్వాత అధికారంలోకి వచ్చాక తానిచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేయడానికి డబ్బుల్లేవు, కొండల్లా అప్పులున్నాయి, చూస్తే భయమేస్తోందని కథలు చెప్పడం ప్రారంభించాడు. జూలై 10, 2024న ఆర్థికశాఖ పై రివ్యూ చేస్తూ.. రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని లీక్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ తొలి సమావేశాల ప్రారంభం సందర్భంగా జూలై 22, 2024న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ అప్పులు ఉన్నాయని చెప్పించారు.అదే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదలచేస్తూ రాష్ట్రం అప్పులు రూ.12,93,261 కోట్లు ఇది ఆర్ధిక విధ్వంసం అంటూ కొత్త లెక్కలు చెప్పారు. చివరకు అప్పులు మీద తాను చెప్పిన అంకెలు నిజం అని నిరూపించేందుకు చివరకు బడ్జెట్‌ను కూడా వాయిదా వేశాడు. నవంబర్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పులు రూ.4,91,734 కోట్లు అనిమాత్రమే చూపించాడు.ప్రభుత్వ గ్యారెంటీలకు చెందిన అప్పులు రూ.1,54,797 కోట్లు అంటే ఇవి రెండూ కలిపితే రూ.6,46,531 కోట్లు. అంటే చంద్రబాబు గతంలో అప్పులపై చేసిన ప్రకటనలు అన్నీ అబద్దాలే అని స్పష్టం అయ్యింది.బడ్జెట్ సాక్షిగా చెప్పిన లెక్కలను కూడా కాదంటూ ఇప్పుడు చంద్రబాబు నేటి వరకు మొత్తం అప్పులు రూ.9.75 లక్షల కోట్లు మరో కొత్త లెక్క చెబుతున్నాడు. ఒక్క మాట మీదైనా చంద్రబాబుకు నిలకడ ఉందా? పోనీ చంద్రబాబు అప్పులు తీసుకు రావడంలేదా? అంటే ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపు కొడుతూనే ఉన్నాడు. ఈ తొమ్మిది నెలల కాలంలో అన్నిరకాల అప్పులు కలిపి సుమారు రూ.1.19 లక్షల కోట్లు తెచ్చాడు. వాస్తవం ఏంటంటే.. అప్పులు ఎంత కావాలంటే, అంత తీసుకోవడానికి అనుమతి ఉండదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. చట్టం అనుమతించిన ప్రకారం ఆ రాష్ట్ర జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతం వరకూ మాత్రమే అప్పులు తేవడానికి ఆస్కారం ఉంటుంది. కాని చంద్రబాబు గిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. ఆర్థిక పరిస్థితిపై అబద్దాలు చెప్పి హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. -
ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?: జక్కంపూడి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే, చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ పేదలకు ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వ హయాంలో 72 వేల ఎకరాలు సేకరించి, వాటిలో 17 వేల కాలనీల్లో పూర్తి మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందు కోసం ఏకంగా రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి సంపద సృష్టిస్తే, దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా ఆక్షేపించారు.చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు: నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న ముని శాపం ఉండటం వల్లనేమో చంద్రబాబు ఏనాడూ నిజాలు చెప్పడు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోందని ఊరూరా తిరిగి తప్పుడు ప్రచారం చేశాడు. రాష్ట్రం అప్పులపై కూటమి నాయకులంతా కలిసిమెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తాను అధికారంలోకి వస్తే 40 ఏళ్ల అనుభవంతో సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు నమ్మబలికాడు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుని.. తీరా అధికారంలోకి వచ్చాక బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనేలా పాలన సాగిస్తున్నాడు. అసలే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే, కొత్తగా రకరకాల పన్నుల రూపంలో ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ఇప్పటికే కరెంట్ బిల్లుల రూపంలో ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపాడు.నాడు అప్పులపై దుష్ప్రచారం:ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రం అప్పులు రూ. 14 లక్షల కోట్లని ప్రచారం చేసి, తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు రూ.4.6 లక్షల కోట్లని కూటమి ప్రభుత్వమే ప్రకటించింది. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లని చెబుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలిచ్చారు. ఈ రోజు వాస్తవ అప్పులు రూ. 4.6 లక్షల కోట్లే అని తెలిసినా హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం. గత వైఎస్ జగన్ పాలనలో తీవ్రమైన కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాల అమల్లో సాకులు చెప్పి తప్పించుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం వాగ్ధానాలను అమలు చేయలేక చేతులెత్తేశారు.ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?. తాజాగా ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు 50 శాతం పెంచబోతున్నట్టు ప్రకటించారు. ఆదాయార్జనే ధ్యేయంగా ప్రజల నడ్డి విరచడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎంత వీలైతే అంత దోచుకోవడానికి వ్యూహరచనలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పిన విజనరీ ఏడు నెలల్లోనే ఒక్క పథకం కూడా అమలు చేయకుండానే చేతులెత్తేశాడు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల చంద్రబాబు దావోస్ వెళ్లినా పారిశ్రామికవేత్తులు పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. అందుకే ఒక్క రూపాయి పెట్టుబడులు తీసుకురాలేకపోయారు.సెంటు స్థలం కూడా ఇవ్వని బాబు:సుదీర్ఘకాలం సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదవారికి ఇంటి కోసం సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఆయన మాత్రం హైదరాబాద్‌లో ఇంద్ర భవనం నిర్మించుకుని విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు. దివంగత వైఎస్సార్ హయాంలో పేదవారికి ఇళ్ల పంపిణీ జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఏకంగా 31 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతోపాటు ప్రభుత్వం తరఫున ఇంటి నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ భూములతోపాటు రైతుల నుంచి భూములు సేకరించడం జరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు మా పథకానికి పేర్లు మార్చి తానే చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు.ఇంటి పట్టాల కోసం 71,811 ఎకరాలు సేకరణరూ.11,343 వేల కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటే ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాని విలువ రూ. 31,832 కోట్లు.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే 71,811 ఎకరాల భూమి విలువ కనీసం రూ.75 వేల కోట్లకుపైనే ఉంటుంది. దీంతో పాటు ఇళ్ల స్థలాలకు మౌలిక వసతుల కల్పనకు రూ. 32,909 కోట్లు వెచ్చించడం జరిగింది.ఇళ్ల పట్టాలు పొందిన వారిలో 22 లక్షల మందికి రూ. 1.80 లక్షల చొప్పున హౌసింగ్ శాంక్షన్ ఇచ్చాం. దీంతోపాటు అదనంగా డబ్బులు అవసరం అనుకుంటే పూర్తిగా సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాం. ఇందుకోసం రూ. 57,375 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా రూ. 1.27 లక్షల కోట్లు పేదల ఇళ్ల నిర్మాణం కోసం గత జగన్ ప్రభుత్వ ఖర్చు చేయడం జరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలతో ఊర్లకు ఊర్లే రూపుదిద్దుకున్నాయి. దాదాపు 17వేలకుపైగా కాలనీలు ఏర్పడ్డాయి. ఆయా కాలనీల్లో అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ గ్రావెల్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, కరెంట్ పోల్స్ వంటి మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉచితంగా ఎలక్ట్రిక్ మీటర్లు కూడా బిగించాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సబ్ స్టేషన్లతో పాటు అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేశాం.ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా అందంగా తీర్చిదిద్దాం. ఇంటి పట్టాను కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి వారి గౌరవాన్ని మరింత పెంచాం. పేదలకు మంచి చేయాలని ఇంత గొప్పగా ఆలోచిస్తే చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు. అమరావతి రాజధానిలో పట్టాలు పంపిణీ చేస్తే సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని కోర్టుకెళ్లిన దిక్కుమాలిన ఆలోచన చేసిన ఘనుడు చంద్రబాబు అని జక్కంపూడి రాజా గుర్తు చేశారు.