breaking news
-
ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?: జక్కంపూడి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే, చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ పేదలకు ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వ హయాంలో 72 వేల ఎకరాలు సేకరించి, వాటిలో 17 వేల కాలనీల్లో పూర్తి మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందు కోసం ఏకంగా రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి సంపద సృష్టిస్తే, దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా ఆక్షేపించారు.చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు: నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న ముని శాపం ఉండటం వల్లనేమో చంద్రబాబు ఏనాడూ నిజాలు చెప్పడు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోందని ఊరూరా తిరిగి తప్పుడు ప్రచారం చేశాడు. రాష్ట్రం అప్పులపై కూటమి నాయకులంతా కలిసిమెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తాను అధికారంలోకి వస్తే 40 ఏళ్ల అనుభవంతో సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు నమ్మబలికాడు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుని.. తీరా అధికారంలోకి వచ్చాక బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనేలా పాలన సాగిస్తున్నాడు. అసలే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే, కొత్తగా రకరకాల పన్నుల రూపంలో ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ఇప్పటికే కరెంట్ బిల్లుల రూపంలో ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపాడు.నాడు అప్పులపై దుష్ప్రచారం:ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రం అప్పులు రూ. 14 లక్షల కోట్లని ప్రచారం చేసి, తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు రూ.4.6 లక్షల కోట్లని కూటమి ప్రభుత్వమే ప్రకటించింది. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లని చెబుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలిచ్చారు. ఈ రోజు వాస్తవ అప్పులు రూ. 4.6 లక్షల కోట్లే అని తెలిసినా హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం. గత వైఎస్ జగన్ పాలనలో తీవ్రమైన కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాల అమల్లో సాకులు చెప్పి తప్పించుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం వాగ్ధానాలను అమలు చేయలేక చేతులెత్తేశారు.ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?. తాజాగా ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు 50 శాతం పెంచబోతున్నట్టు ప్రకటించారు. ఆదాయార్జనే ధ్యేయంగా ప్రజల నడ్డి విరచడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎంత వీలైతే అంత దోచుకోవడానికి వ్యూహరచనలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పిన విజనరీ ఏడు నెలల్లోనే ఒక్క పథకం కూడా అమలు చేయకుండానే చేతులెత్తేశాడు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల చంద్రబాబు దావోస్ వెళ్లినా పారిశ్రామికవేత్తులు పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. అందుకే ఒక్క రూపాయి పెట్టుబడులు తీసుకురాలేకపోయారు.సెంటు స్థలం కూడా ఇవ్వని బాబు:సుదీర్ఘకాలం సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదవారికి ఇంటి కోసం సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఆయన మాత్రం హైదరాబాద్‌లో ఇంద్ర భవనం నిర్మించుకుని విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు. దివంగత వైఎస్సార్ హయాంలో పేదవారికి ఇళ్ల పంపిణీ జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఏకంగా 31 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతోపాటు ప్రభుత్వం తరఫున ఇంటి నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ భూములతోపాటు రైతుల నుంచి భూములు సేకరించడం జరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు మా పథకానికి పేర్లు మార్చి తానే చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు.ఇంటి పట్టాల కోసం 71,811 ఎకరాలు సేకరణరూ.11,343 వేల కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటే ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాని విలువ రూ. 31,832 కోట్లు.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే 71,811 ఎకరాల భూమి విలువ కనీసం రూ.75 వేల కోట్లకుపైనే ఉంటుంది. దీంతో పాటు ఇళ్ల స్థలాలకు మౌలిక వసతుల కల్పనకు రూ. 32,909 కోట్లు వెచ్చించడం జరిగింది.ఇళ్ల పట్టాలు పొందిన వారిలో 22 లక్షల మందికి రూ. 1.80 లక్షల చొప్పున హౌసింగ్ శాంక్షన్ ఇచ్చాం. దీంతోపాటు అదనంగా డబ్బులు అవసరం అనుకుంటే పూర్తిగా సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాం. ఇందుకోసం రూ. 57,375 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా రూ. 1.27 లక్షల కోట్లు పేదల ఇళ్ల నిర్మాణం కోసం గత జగన్ ప్రభుత్వ ఖర్చు చేయడం జరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలతో ఊర్లకు ఊర్లే రూపుదిద్దుకున్నాయి. దాదాపు 17వేలకుపైగా కాలనీలు ఏర్పడ్డాయి. ఆయా కాలనీల్లో అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ గ్రావెల్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, కరెంట్ పోల్స్ వంటి మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉచితంగా ఎలక్ట్రిక్ మీటర్లు కూడా బిగించాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సబ్ స్టేషన్లతో పాటు అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేశాం.ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా అందంగా తీర్చిదిద్దాం. ఇంటి పట్టాను కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి వారి గౌరవాన్ని మరింత పెంచాం. పేదలకు మంచి చేయాలని ఇంత గొప్పగా ఆలోచిస్తే చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు. అమరావతి రాజధానిలో పట్టాలు పంపిణీ చేస్తే సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని కోర్టుకెళ్లిన దిక్కుమాలిన ఆలోచన చేసిన ఘనుడు చంద్రబాబు అని జక్కంపూడి రాజా గుర్తు చేశారు. -
గుడివాడ టీడీపీ నేత తులసి బాబుపై టీడీపీ డ్రామాలు
సాక్షి, విజయవాడ: గుడివాడ టీడీపీ నేత తులసి బాబుపై టీడీపీ డ్రామా మొదలుపెట్టింది. తులసి బాబుకి టీడీపీతో సంబంధం లేదంటూ పల్లా శ్రీనివాస్ ప్రకటించారు. టీడీపీలో ఇన్నాళ్లు ఉన్నా తమకు సంబంధం లేదంటూ టీడీపీ ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు కేసులో టీడీపీ నేత తులసిబాబు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.గుడివాడ టీడీపీ ఎమ్మెల్యేకి బినామిగా ఉన్న నిందితుడు తులసిబాబు.. నారా లోకేష్‌తోనూ గతంలో ఫోటోలు దిగాడు. గుడివాడలో కలెక్టర్ ఇతర అధికారులతోనూ తులసిబాబు సమీక్షలు చేశారు. టీడీపీకి ఇప్పుడు సంబంధం లేదంటూ పల్లా శ్రీనివాస్ వింత ప్రకటన చేశారు. గుడివాడ టీడీపీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన తులసిబాబు.. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి వ్యవహారాలు చక్కపెట్టారు.ఇదీ చదవండి: నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా! -
నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్‌ల దావోస్ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులేవీ తేకపోయినప్పటికీ ఒక రకంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే అంతటి ముఖ్యమైన కార్యక్రమాలనూ రాజకీయాలకు వేదికగా చేసుకోవచ్చునని, తమకు కావాల్సిన విధంగా ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చునని టీడీపీ ప్రభుత్వం నిరూపించింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా, ఏపీ బ్రాండ్ అంటూ కొత్త డైలాగుతో మీడియా మేనేజ్మెంట్లో తమకు తామే సాటి అని చెప్పుకోవడం హైలైట్!. దావోస్‌లో చంద్రబాబు, లోకేష్‌లు చాలా కష్టపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాత్రం లోకేషే భావి ముఖ్యమంత్రి అని పొగడటంలో బిజీ అయిపోయారు. ఏపీలో లోకేష్‌లాగా చదువుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడగడం ఒక హైలైట్ అయితే.. ఆ మిషతో భావి ఉప ముఖ్యమంత్రి ఆయనే అని జనసేన అధినేత పవన్‌కు సిగ్నల్స్ ఇవ్వడం ఇంకో హైలైట్. అయితే దావోస్ పర్యటనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఇచ్చిన కవరేజీ బహుశా బాబు, లోకేష్‌లను ఇరకాటంలో పెట్టేసి ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి రావడమే తరువాయి అన్నట్టుగా సాగింది ఈ మీడియా బ్యాండ్ బాజా. తీరా పర్యటన ముగిసిన తరువాత చూస్తే.. సున్నకు సున్నా.. హళ్లికి హళ్లి!! ప్రతిపక్షంలో ఉండగా పవన్.. 'దావోస్ వెళ్లి సాధించే పెట్టుబడులు ఏముంటాయి? సూటు,బూటు వేసుకువెళ్లి హడావుడి చేయడం తప్ప.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటే పారిశ్రామికవేత్తలే ఏపీకి వస్తారు’ అని చెప్పినట్లే.. ఇప్పుడు రెడ్‌బుక్ రాజ్యాంగం పుణ్యమా అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అనుకోవాలి. మహారాష్ట్రకు రూ. 15 లక్షల కోట్లు, తెలంగాణకు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడమేమిటి.. ఏపీకి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదరక పోవడం ఏమిటి? కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి బాబు, లోకేష్‌లు సాధించింది ఏమిటీ అంటే.. ‘‘ఏపీ బ్రాండ్’’ను ప్రచారం చేసి వచ్చారట! మరి.. చంద్రబాబు గతంలోనూ చాలాసార్లు దావోస్ వెళ్లివచ్చారే? అప్పట్లో ఏపీకి బ్రాండ్ ఇమేజీ రానట్టేనా? పైగా అప్పట్లో దావోస్ వెళ్లిన ప్రతిసారి అదిగో పెట్టుబడులు.. ఇదిగో ఇన్వెస్ట్మెంట్లు అని ఎల్లోమీడియా భలే బాకాలూదేదే? బాబు స్వయంగా తనను చూసి బోలెడన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు కదా? ఈసారి ఏమైంది? విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినప్పుడు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రచారం జరిగింది. అయితే.. వీటిల్లో అధికమొత్తం బోగస్ ఒప్పందాలన్న విమర్శ వచ్చింది. దారిన పోయేవారిని కూడా కంపెనీ సీఈవోలుగా ముస్తాబు చేసి ఫొటోలు దిగారు అని ససాక్ష్యంగా నిరూపితమైంది. ఇప్పుడు ఆ డ్రామా కూడా ఆడలేకపోయారు. చంద్రబాబు, లోకేష్‌లు కంపెనీలతో చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. మంచిదే. కానీ అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం గురించి, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి కంపెనీల్లో అనుమానాలు రేకెత్తించారా? ఈ అనుమానం ఎందుకొస్తుందంటే.. జగన్ మళ్లీ వస్తాడేమో అని పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు లోకేష్ చాలాసార్లు వ్యాఖ్యానించారు మరి!. అలాగే ‘జగన్ రాడు’ అని బాండ్ రాసి ఇమ్మంటున్నారని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతుంటారు. పారిశ్రామికవేత్తలు ఆ బాండ్లను నమ్మలేదా? జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్లు నమ్మారని అనుకోవాలా?.. ఇదీ చదవండి: దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్యమూడేళ్ల క్రితం జగన్ దావోస్ వెళ్లినప్పుడు రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఈ పారిశ్రామికవేత్తలే. విశాఖలో సదస్సు పెడితే అంబానీ, అదాని వంటివారూ వచ్చి జగన్‌ను అభినందించి వెళ్లారే? ఆ తరువాత అదానీ పెద్ద ఎత్తున సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో విద్యుత్ ఉత్తత్తి ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యారే? కూటమి అధికారంలోకి వచ్చాక అదానీ సిబ్బంది పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లాలో దాడులు చేశారే? ఆ విషయం ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయేందేమో!. ఇక లోకేష్ రెడ్ బుక్ ఉండనే ఉంది. ఏపీలో కూటమి అదికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ వారు వైసీపీ వారిపై చేసిన దాడులు, హింసాకాండ, అరాచకాల సమాచారం కూడా వారికి అందిందేమో! ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జగన్ టైమ్ లో ముందుకు వచ్చారు. కాని కూటమి అధికారంలోకి రావడంతోనే ఎవరో మోసకారి నటిని పట్టుకొచ్చి ఏపీలో పోలీసు అధికారులపైనే కాకుండా, జిందాల్ పై కూడా కేసుపెట్టి అరెస్టు చేసే ఆలోచనవరకు వెళ్లారే..సహజంగానే ఒక పారిశ్రామికవేత్తను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా హింసించే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా?. అందువల్లే పైకి కబుర్లు చెప్పినా, పెట్టుబడి కింద వందల, వేల కోట్లు వ్యయం చేయడానికి ఏపీకి రావడానికి భయపడ్డారేమో! దాని ఫలితంగానే ఏపీకి జిందాల్ గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. జిందాల్‌ను ఇబ్బందిపెట్టకపోయి ఉంటే ఆయన ఇక్కడ కొన్ని వేల కోట్లు అయినా పెట్టుబడి పెట్టడానికి సిద్దమై ఉండేవారేమో కదా? ఆ రకంగా ఏపీకి పెట్టుబడి రాకుండా ఒక పారిశ్రామికవేత్తను తరిమేశారన్న అపఖ్యాతిని చంద్రబాబు, లోకేష్‌లు మూటకట్టుకున్నట్లయింది కదా! ఎల్లో మీడియా ఇప్పటికి జగన్ పై తప్పుడు రాతలు రాస్తుంటుంది. ఆయన టైమ్‌లో పరిశ్రమలను తరిమేశారని పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేశాయి. కాని ఫలానా పరిశ్రమ వెళ్లిపోయిందని మాత్రం చెప్పలేదు. కేవలం వదంతులు సృష్టించి ప్రజలలో అనుమానాలు రేకిత్తించడంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా బాగా కృషి చేసింది. ఇదీ చదవండి: దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారుదావోస్లో యూరప్ లోని టీడీపీ అభిమానులుగా ఉన్న ఏపీ ప్రవాసులతో సమావేశం అయి కూడా రెడ్ బుక్, అందులో రాసుకున్నవారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ స్వయంగా చెప్పినట్లు వీడియోలు వచ్చాయి కదా!. కక్ష సాధింపు లేదంటూనే ఈ మాట చెప్పాక, ఎవరైనా పరిశ్రమలవారు భయపడకుండా ముందుకు వస్తారా? పోనీ వచ్చిన తెలుగువారిలో ఎవరైనా పరిశ్రమలు పెడతామని ఎందుకు ఆసక్తి చూపలేదు? అమరావతి ప్రపంచం అంతా ఆకర్షితమవుతోందని చెబుతారు కదా. అక్కడ కూడా ఏమైనా పెట్టుబడులు పెడతామని ఎవరూ చెప్పలేదే?. ఇప్పుడేమో దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయని అనడం మిథ్య అని బాబు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. అంతకాడికి కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి వెళ్లడం ఎందుకు! అక్కడేదో అద్భుతం జరగబోతోందని బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నట్లు? ఎవరూ ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఏపీ పరువును అంతర్జాతీయంగా నడిబజారులో తీసేసినట్లు కాలేదా! చంద్రబాబు మాటలు ఎప్పటికీ మిథ్య అన్నది మరోసారి తేలినట్లే కదా!!!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రాజకీయాల్లో ఒత్తిళ్లు సహజం : అయోధ్య రామిరెడ్డి
గుంటూరు, సాక్షి: అన్ని కరెక్ట్‌గా జరిగి ఉంటే ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్పీనే గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన మీడియాతో స్పందించారు. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళిపోయారో ఆయనే చెప్పాడు. ఆయన మంచి వ్యక్తి. విజయసాయి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయన వ్యక్తిగతం.అలాగే ప్రతీ రాజకీయ పార్టీకి ఎత్తు పల్లాలు ఉంటాయి. అలాగే రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉంటాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిళ్లు ఉన్నాయి. ఓటమిలో కూడా తట్టుకొని నిలబడాలి. కష్టాలు వచ్చినప్పుడే పోరాటాలు చేయాలి.. నిలబడాలి. అప్పుడే పార్టీ మనుగడ కొనసాగుతుంది’’ అని అయోధ్య రామిరెడ్డి అన్నారాయన. -
మోసకారి బాబు.. మళ్లీ ఫెయిల్: YSRCP నేతలు
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయలేనని సీఎం చంద్రబాబు చేతులత్తేయడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం(జనవరి28) ఈ విషయమై వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు స్పందించారు. ఎన్నికల హామీలు ఎగ్గొట్టే తన నైజాన్ని బాబు మరోసారి బయటపెట్టుకున్నారని, ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపిస్తున్నారని విమర్శించారు.కొవిడ్లోనూ వైఎస్ జగన్ సంక్షేమం అందించారు: వైఎస్ అవినాష్‌రెడ్డి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలో చంద్రబాబు విఫలమయ్యడని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. ఏపీ అప్పుల్లో ఉందంటూ చంద్రబాబు ఏ పథకమూ ఇవ్వలేమని చేతులెత్తేశాడన్నారు.‘2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు అప్పు ఉండేది. అప్పుడు రాష్ట్ర ఖజానాలో రూ.100 కోట్లు మాత్రమే ఉంది. రెండు సంవత్సరాలు కొవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.కొవిడ్ సమయంలో కూడా వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలను ప్రజలకు అందజేశారు.మేనిఫెస్టోను దైవంగా భావించి పథకాలను పేదలకు వైఎస్ జగన్ అందించారు.హామీల అమలులో బాబు, వైఎస్ జగన్‌లకు చాలా తేడా ఉంది’అని అవినాష్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట తప్పడం బాబు నైజం: కాటసాని రాంభూపాల్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో తల్లులకు 15 వేలు, పిల్లలకు 15 వేలు అంటూ వారు ప్రచారం చేసి మోసం చేశారుటీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలను మోసం చేశారుసంక్షేమ పథకాలు అమలు చేయకుంటే చొక్కా పట్టుకోమని చెప్పిన నేతలు ఇప్పుడు ఎక్కడున్నారుచంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందరికి సంక్షేమ పథకాలు అందించారుప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్రం అప్పుల పాలయ్యిందని బాబు చెప్పుకొస్తున్నారు40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన రాష్ట్రానికి ఏమి చెయ్యడం లేదురాష్ట్రంలో క్వాలిటీ చదువు కన్న క్వాలిటీ మద్యాన్ని చంద్రబాబు అందిస్తున్నారుచంద్రబాబు సూపర్ సిక్స్, రాష్ట్రంలో డూపర్ సిక్స్ అయింది, టీడీపీ నేతలు కూడా ఎవరు సూపర్ సిక్స్ పై మాట్లడం లేదుతెలుగు దేశం పార్టీ నేతలు ఎమ్మెల్యేలు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పడం లేదుబాబు, పవన్ సమాధానం చెప్పాలి: పోతిన మహేష్ సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని,ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేమని బాబు చేతులెత్తేశారుఇది ప్రజలను మోసం చేయడం కదా అని చంద్రబాబు ,పవన్ చెప్పాలి..సూపర్ సిక్స్ అమలు చేయించే బాధ్యత నాదని పవన్ చెప్పాడు..ఇప్పుడు పవన్ స్పందించాలిచంద్రబాబు పాలన సంక్షేమ పధకాల కోత..పన్నుల మోత గా ఉంది..రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు చేపడుతున్నాడు. హెల్మెట్ లేకపోతే వెయ్యి నూట ముప్పై ఐదు రూపాయలు కట్టించుకొంటున్నారు..విద్యుత్ చార్జీల పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, చాలనాలు వసూళ్లు చేయడం సంపద సృష్టించడం అంటారా?వైఎస్ జగన్ దగ్గర చంద్రబాబు , పవన్ ట్యూషన్ చెప్పించుకోవాలి..వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అమలులో సెంచరీ కొడితే... పవన, చంద్రబాబు డక్ ఔట్ అయ్యారు..బీజేపీ చంద్రబాబు పవన్ పట్టుకున్న మ్యానిఫెస్టో పట్టుకోలేదు..ప్రజలు చంద్రబాబు, పవన్ మాయలో పడ్డారు..దావోస్ లో చంద్రబాబు ని చూసి పారిశ్రామిక వ్యక్తలు పారిపోయారు..ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేదు..తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష 78వేల కోట్లు ఎంవోయూలు చేసుకొని పండగ చేసుకుంటున్నారు..40ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ని చూసి పారిశ్రామిక వేత్తలు ఎందుకు రాలేదు..పవన్ దావోస్ పెట్టుబడులపై మాట్లాడాలి.. ఇది ప్రభుత్వ వైఫల్యం కదా?కర్నూల్ గ్రీన్ కో అత్భుతంగా వుందని చెప్పిన కంపెనీ జగన్ హయాంలో వొచ్చింది..దావోస్ పర్యటన తరువాత చంద్రబాబు నాలిక మడతపడుతుంది..వినేవాళ్ళు ఉంటే చంద్రబాబు చార్మినార్ కట్టారని చెపుతారు.2014 నుండి 2019 వరకు టీడీపీ ఒక్క పని కూడా చేయలేదు.. ఒక్క శాశ్వత నిర్ణయం కూడా చెప్పట్టలేదు..అమరావతి కి ఔటర్ రింగ్ రోడ్ కట్టింది.. విజయవాడ వెస్ట్ బైపాస్ కట్టింది.. అమరావతి లో తిరుపతి తరహా గుడి కట్టింది వైఎస్ జగన్ సింగపూర్ కంపెనీకి అమరావతి నిర్ణయం గురించి మాట్లాడారుఅమరావతి లో రిజిస్ట్రేషన్ చార్జీలు లేవని చంద్రబాబు చెపుతున్నారు..పేద మధ్యతరగతి వాళ్ళు సెంటు భూమి కొనగలరా?పేదలు కొనే దగ్గర రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి.. పెట్టుబడి దారులు కొనే దగ్గర చార్జీలు తగ్గుతాయి.పేదల ఇంట్లో , మహిళల కళ్లల్లో వెలుగులు వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది..చంద్రబాబు చెప్పినట్లు కేంద్రం నిధులు దారి మళ్ళితే పోలవరం పని పూర్తి అవుతుందా?ఏ పని చేయలేక.. ఏ పని చేతకాక గుడ్డ కాల్చి వైఎస్ జగన్ పై వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు..ఉద్దానం సమస్య కు శాశ్వత పరిష్కరం చూపిన నేత వైఎస్ జగన్ప్రాంతం చూడలేదు.. జగన్ సమస్య ను మాత్రమే చూసారు..చంద్రబాబు ప్రకటనలో మోసం,వంచన:మల్లాది విష్ణుచంద్రబాబు ప్రకటనలో మోసం ,దగా , వంచన స్పష్టంగా కనిపిస్తున్నాయిరైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో మోసం చేశావ్2024 ఎన్నికల్లో ఏపీ శ్రీలంక అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారుసూపర్ సిక్స్ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు గొంతు చించుకున్నారుజగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలిస్తామని చెప్పారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల జీవన స్థితిగతులను పట్టించుకోలేదుగద్దెనెక్కిన దగ్గర్నుంచి వైఎస్ జగన్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారుజీడీపీ 15 శాతం కంటే ఎక్కువ ఉంటేనే సంక్షేమం ఇస్తామంటున్నారు పథకాలివ్వాలంటే ఎనిమిది తొమ్మిదేళ్లు పడుతుందంటున్నారుమూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల ముందు తెలియదా ఏపీ ఆర్ధిక పరిస్థితిమా పథకాన్ని కాపీకొట్టి తల్లికి వందనం 15 వేలు ఇస్తామన్నారు..చేతులెత్తేశారు54 లక్షల మంది రైతన్నలను మోసం చేశారు18 వేలు ఇస్తామని కోటి 80 లక్షల మంది మహిళలను మోసం చేశారుకోటి మంది నిరుద్యోగులను దగా చేశారుబటన్ నొక్కడానికి జగన్ ఎందుకు ముసలమ్మ సరిపోతుందన్నారుఅమరావతి పేరుమీద వేల కోట్లు అప్పులు చేయడానికి మీరే కావాలాపోలవరానికి కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయడానికి మీ కూటమి అవసరమాప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డిజగన్ హయాంలో ఏపీలో పేదరికం 11.5 నుంచి 6శాతంకు తగ్గిందని నీతి ఆయోగ్ చెప్పిందినీతి ఆయోగ్ గణాంకాలకు ఏం సమాధానం చెబుతావ్ చంద్రబాబు ఈ ఏడు నెలల్లో తెచ్చిన లక్ష కోట్లకు పైగా అప్పు సొమ్మును ఏంచేశారో సమాధానం చెప్పాలి -
బాబు అబద్ధాల బుద్ధుడు.. లోకేష్ కోసమే సంపద సృష్టి: భూమన
తిరుపతి, సాక్షి: సూపర్ సిక్స్ హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలపై బాబు యూటర్న్ ప్రకటనపై మంగళవారం ఉదయం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు.‘‘చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాజకీయమంతా లాక్కోవడమే. అధికారంలోకి వచ్చాక ప్రజాద్రోహమే చంద్రబాబు నైజం. ఏమాత్రం ప్రజల సంక్షేమం పట్టించుకోరాయన. అలాగే ఇప్పుడూ చంద్రబాబు కోట్లాది మందిని మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్‌పై నిందలు వేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతూ ఆచరణ సాధ్యం కాదని చెబుతూ కపట నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు ప్రజా ద్రోహం, ప్రజలకు పొడిచే వెన్నుపోటు ఎలా ఉంటుందో నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ అమలుకు పరిస్థితి లేదు అని, వృద్ధి రేటు 15% పెంచిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పడం దారుణం. .. చంద్రబాబు మోసపు హామీలు ఒంటి కన్ను నక్క కథ గుర్తుకు వస్తోంది. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు. కరోనా సమయంలో కూడా దేశంలో ఆదర్శంగా పాలన సాగించారు. కానీ, చంద్రబాబు మాత్రం ఒంటి కన్ను నక్కలా ఇప్పుడు హామీల గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఐదు లక్షల ఫించన్లు కట్ చేశారు. విధ్యుత్ చార్జీలు పెంచము అని చెప్పి రూ. 19 వేల కోట్లు ప్రజలు పై విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారు. తల్లికి వందనం కాస్త.. తల్లికి తద్దినంగా మారిపోయింది. అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది. ఆడబిడ్డ నిధి పథకం ఆడబిడ్డ ఏడుపు పథకంగా మారిపోయింది. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది.సంప్రదాయ దుస్తుల నిబంధన ఏమైంది?కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు, 4 సార్లు కొండపై ఎర్రచందనం దొరికింది. వీఐపీ దర్శన సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళాలి అనే నిబంధన గాలికి వదిలేశారు. విజిలెన్స్ వ్యవస్థ నిద్ర పోతోంది. అదనపు ఈవో వెంకన్న చౌదరి ఏం చేస్తున్నారు?. సనాతన ధర్మ ఉద్యమ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ దీనిపై మాట్లాడాలి.లోకేష్ కోసమే సంపద సృష్టి:రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలన సాగుతోంది. ఆయన ఈ ఏడు నెలల పాలనంతా వంచన, మోసం, దోపిడీతోనే సాగింది. తాను సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెబితే, అది లోకేష్ కోసమని జనం గుర్తించలేకపోయారు. బాబు మాటలను గుడ్డిగా నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు ప్రజల్లో చంద్రబాబు మీద తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ చరిత్రలో ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజల ముందుకు వెళ్లే ధైర్యముందా?. .. చంద్రబాబును మోసిన పవనాందుల వారు ఏం చేస్తున్నారు?. పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారు. చంద్రబాబు అబద్ధాల బుద్ధుడు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజల కోపాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కాకతప్పదు’’ అని భూమన అన్నారు. -
అలిగిన లోకేష్..!సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన
సాక్షి,విజయవాడ:డిప్యూటీ సీఎం పదవి రాకపోవడంతో మంత్రి నారా లోకేష్ అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ డిప్యూటీ సీఎం ఆశలపై బీజేపీ అగ్రనేత,కేంద్ర హెం మంత్రి అమిత్‌షా నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. తనను డిప్యూటీ సీఎం చేయడానికి అమిత్ షా ఒప్పుకోలేదని లోకేష్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. లోకేష్,పవన్‌కల్యాణ్ మధ్య జరిగిన పోరులో లోకేష్ పరాజయం పాలయ్యారని కూటమి వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇందుకే లోకేష్ అలిగి పార్టీ పదవి వదులుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబునే టార్గెట్ చేసి లోకేష్ పార్టీ పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది.లోకేష్ ప్రభుత్వంలో పార్టీలో సూపర్‌పవర్‌గా ఉండాలని చంద్రబాబు భావించారు. అయితే తమ ప్లాన్ పారకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల దావోస్ పర్యటనలోనూ చంద్రబాబు లోకేష్‌ను ఆకాశానికెత్తిన విషయం తెలిసిందే.కాగా, ఇటీవల లోకేష్‌ను సీఎం చేయాలంటూ టీడీపీలో సీనియర్లతో పాటు ముఖ్యనేతలంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ డిమాండ్ చేశారు. లోకేష్ యువగళం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని పొగడ్తలు కురిపించారు. వీటికి కౌంటర్‌గా అటు జనసేన నేతలు తమ నేత పవన్‌కల్యాణ్‌ను సీఎం చేయాలని మాట్లాడే దాకా వెళ్లారు.దీంతో కూటమిలో టీడీపీ, జనసేనల మధ్య లోకేష్ డిప్యూటీ సీఎం అంశం చిచ్చుపెట్టేదాకా వెళ్లింది. చివరికి అమిత్‌షా మోకలడ్డడంతో లోకేష్‌కు అసంతృప్తి మిగిలి పవన్‌దే పైచేయి అయిందన్న ప్రచారం జరుగుతోంది. -
వైజాగ్‌కి వైన్ కోసం వస్తారు..
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకులు వైజాగ్‌కు వైన్ తాగడానికి రాకపోతే.. కాఫీ తాగడానికి వస్తారా అంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. వైజాగ్ బీచ్‌కు వచ్చేది టీ, కాఫీలు తాగడానికి కాదని, ఎంజాయ్ చెయ్యడానికని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. జర్మనీ తరహాలో బీచ్‌లో చిన్న హట్స్ ఏర్పాటు చేసి టిఫిన్స్, బీరు, డ్రింక్ ఇచ్చేలా ఏర్పాట్లు చెయ్యాలన్నారు. మద్యం విరివిగా లభించేలా పాలసీలు తీసుకొస్తేనే డెవలప్మెంట్ ఉంటుందని అన్నారు. గోవా, బెంగళూరుతో పోలిస్తే వైజాగ్‌ని ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోతున్నామో ఆలోచించాలన్నారు. టూరిస్ట్‌కి ఎంటర్టైన్మెంట్ కావాలని, ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇద్దరు కూర్చుంటే పోలీసులు కేసులు పెట్టేస్తారని అన్నారు. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారని చెప్పారు. రూల్స్ అవసరమే కానీ, వెసులుబాట్లు ఉండాలని, ముఖ్యంగా టూరిజానికి మినహాయింపులు ఇవ్వాలని అన్నారు. ప్రకృతి వనరులు ఉన్నా పర్యాటకాభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడంలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి లంబసింగికి పర్యాటకులు వస్తున్నా కనీస వసతులు లేవని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలన్నారు. గిరిజనులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగలరా అని అన్నారు. ట్రైబల్ యాక్ట్‌లో మార్పులు చెయ్యాలని చెప్పారు. ఎవరైనా పెట్టుబడికి పర్మిషన్ కోసం వస్తే యస్ ఆర్ నో అని చెప్పడానికి అధికారులు 6 నెలలు, సంవత్సరం ఎందుకు తిప్పుతున్నారని ప్రశి్నంచారు. అనంతరం డిప్యూటీ సీఎం వివాదంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు అయ్యన్న స్పందిస్తూ.. ఒకరిని డిప్యూటీ సీఎంని చేయాలని అడగడానికి రాజకీయ నాయకులు ఎవరని ప్రశి్నంచారు. అది ప్రజలు నిర్ణయించాలని అన్నారు. -
చంద్రబాబు అసమర్థతను అంగీకరించారు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. ఆయన సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ లెక్కలంటూ.., వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థి క వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఏ హామీనీ అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు.అయినా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేశారని, ఆ తర్వాత వారు ప్రవేశ పెట్టిన బడ్జెట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు రూ.6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు. అంటే చంద్రబాబు ఊహించిన దానికన్నా అప్పులు 50 శాతం తక్కువేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. అయినా ఆర్థి క పరిస్థితి అధ్వానంగా ఉందని, వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులే కారణమని ఎలా చెబుతారని నిలదీశారు. చంద్రబాబు అసమర్థత వల్లే పెట్టుబడులు రాలేదు రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందంటూ కుమారుడు, అధికారులతో కలిసి ఆర్భాటంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు ఉత్త చేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసినా ఒక్క ఎంఓయూ లేదని చెప్పారు. చంద్రబాబు అసమర్థతే ఇందుకు కారణమన్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికే దావోస్‌లో ఎంఓయూలు మిథ్య అంటూ చాలా గొప్పగా సెలవిచ్చారని, ఇలా చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మరి ఎందుకు దావోస్ వెళ్లారని నిలదీశారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా కోటు వేసుకోలేరని, అయినా అంతగొప్ప చలిలో కూడా కోటు తొడుక్కోకుండా పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నించారంటూ ఎల్లోమీడియా దిగజారుడు రాతలు రాసిందన్నారు.సీఎంగా వైఎస్ జగన్ దావోస్‌కు వెళ్లి రూ.1.26 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. టెక్ మహేంద్ర రూ.200 కోట్ల ప్లాంట్, అదానీ గ్రూప్ రూ.60 వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలో రూ.37వేల కోట్లతో గ్రీన్ కో కంపెనీ ప్రాజెక్టు, అరబిందో గ్రీన్ ఎనర్జీ రూ.28వేల కోట్ల ప్రాజెక్టు వంటివన్నీ వైఎస్ జగన్ తెచి్చనవేనని తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను కోడిగుడ్డాయన అంటున్న లోకేశ్ పెద్ద పప్పుసుద్ద కాదా అని అన్నారు. లోకేశ్ ఎర్ర బుక్కుకు తన కుక్క కూడా భయపడదని, అక్రమ కేసులతో ఎంతమందిని జైలుకు పంపినా వైఎస్సార్సీపీ వెనుకంజ వేయదని స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డికి బిగ్ షాక్!
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆనం విజయకుమార్ రెడ్డి.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిపోయారు. 31వ డివిజన్‌కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి. ఈ సందర్బంగా విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. అలాగే, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికార పార్టీలకు చెందిన కార్యకర్తలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకపోవడంతో కూటమి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్‌పై మండిపడుతున్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో పతాక స్థాయికి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి అరాచకాలుకోటంరెడ్డి దురాగతాల్ని భరించలేక టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలో చేరిన 200 మంది కార్యకర్తలు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు 200 మంది కార్యకర్తలకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ… pic.twitter.com/ST1wReMtti— YSR Congress Party (@YSRCParty) January 27, 2025 -
రెడ్‌బుక్‌కు మా ఇంటి కుక్క కూడా భయపడదు: అంబటి
సాక్షి,గుంటూరు : ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విజనరీ, అనుభవం ఉన్న నేతగా తనను తాను గొప్పగా చిత్రీకరించుకునే చంద్రబాబు తాజాగా తన అబద్దాలతో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...నీతి అయోగ్ వెల్లడించిన లెక్కలను చూపుతూ తాజాగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను బట్టి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను అని అంగీకరించారు. దానికి కారణం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని సాకులు చూపుతుండటం ఆయన అసమర్థతకు నిదర్శనం. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలంటే, తాను ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం అయ్యిందని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు అనేక వాగ్ధానాలు చేశారు. వాటిని అమలు చేస్తానని చెప్పారు. ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు హామీలు అమలు చేయలేనివి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుగుణంగా లేదని చెప్పారు. అయినా కూడా నేను అన్నీ చేయగలను అని చంద్రబాబు ప్రజలను నమ్మించి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.రాష్ట్ర అప్పులపైనా అబద్దాలుఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని విష ప్రచారం చేశారు. ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బడ్జెట్ సందర్భంగా మీరే అధికారికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు రూ. 6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారు. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన అప్పుల కన్నా యాబై శాతం తక్కువగానే గత ప్రభుత్వం అప్పులు చేసింది అని తెట్టతెల్లం అయ్యింది. అంటే మీరు ఊహించిన దానికన్నా అప్పుల తక్కువగా ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ వాస్తవాలను ఒకవైపు అంగీకరిస్తూనే, మరోవైపు ఎన్నికలకు ముందు మేం ఊహించిన దానికన్నా ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది, దానికి వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అప్పులే కారణం అని ఎలా చెబుతారు? చంద్రబాబు తన మాటలను తానే ఖండించుకుంటున్నారు. ఇలా గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా?తన ప్రజంటేషన్ లోనూ తప్పుడు వాదనలుతాజాగా చంద్రబాబు నీతి అయోగ్ లెక్కల గురించి ఇచ్చిన ప్రజంటేషన్ లో మాట్లాడుతూ 2022-23లో సీఎం వైఎస్ జగన్ చేసిన పెట్టుబడి వ్యయం రూ.7,244 కోట్లు, అప్పులు రూ.67,985 కోట్లు అని చెప్పారు. ఇలా చేయడం అన్యాయం, అక్రమం అని చెప్పారు. 2024-25లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ఏడు నెలల్లో చేసిన అప్పులు రూ.73,685 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.8,894 కోట్లు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేసింది పోల్చుకుంటే ఎక్కడా పెద్ద తేడా కనిపించడం లేదు. మరి చంద్రబాబు దీనిని ఎలా సమర్థించుకుంటారు? చంద్రబాబు తన మీడియా సమావేశంలో ఇలా గతంలో జరిగిందంతా తప్పు, తాను చేస్తున్నవి మాత్రం అత్యుత్తమమైన ఒప్పు అని ఎటువంటి సిగ్గు లేకుండా చెబుతుంటే, ఈ మీడియా సమావేశంలో చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియా ప్రతినిధులు 'మీరు చాలా తక్కువగా చెబుతున్నారు, ఇంకా కొన్ని కలుపుకుంటే చాలా ఎక్కువ అప్పులు కనిపిస్తాయి' అంటూ చంద్రబాబు అబద్దాలకు తాళం వేస్తున్న పరిస్థితి చాలా దురదృష్టకరం. ఇటువంటి అబద్దాలను చెబుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగవేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం.చంద్రబాబు అసమర్థత వల్లే పెట్టుబడులు రాలేదుఇటీవల చంద్రబాబు దావోస్ పర్యటనకు తన కుమారుడు లోకేష్‌తో పాటు పలువురు అధికారులతో తీసుకుని ఎంతో ఆర్భాటంగా పర్యటనకు వెళ్లారు. ఇంకేముందీ రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందనే స్థాయిలో ఈ ప్రచారం జరిగింది. తీరా ఉత్తి చేతులతో చంద్రబాబు బృందం రాష్ట్రానికి తిరిగి వచ్చింది. ఒక్క ఎంఓయు లేదు, కోట్ల రూపాయల ప్రజాధనంను వ్యయం చేశారు. కనీసం దారి ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మాట్లాడుతూ దావోస్‌లో ఎంఓయులు అనేవి ఒక మిథ్య అంటూ చాలా గొప్పగా సెలవిచ్చారు. దావోస్ వెళ్ళినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ అని కొత్త అంశాన్ని వెల్లడించారు. అలాంటప్పుడు చంద్రబాబు, ఆయన బృందం ఎందుకు దావోస్ వెళ్ళారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా ఆయన కోటు వేసుకోలేని స్థితిలో ఉన్నారు. దానిని కూడా ఎల్లో మీడియా అంతగొప్ప చలిలో కూడా కోటు తొడుక్కోకుండా పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నించారంటూ దిగజారుడు రాతలు రాసింది. అనుకూలంగా ఉంటే ఒకరకంగా, వ్యతిరేకం అయితే మరోరకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. టక్కుటమార విద్యలకు చంద్రబాబు ప్రసిద్ది. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని భక్తితో పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ఎల్లో మీడియాకు తెలిసింది. 2014-19 హయాంలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ నిర్వహించారు. 328 ఒప్పందాల ద్వారా రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని డబ్బా కొట్టుకున్నారు. ఇందులో ఎన్ని ఒప్పందాలు ఆచరణలోకి వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పగలరా? సీఎంగా వైఎస్ జగన్ కూడా దావోస్‌కు వెళ్ళి రూ. 1.26 లక్షల కోట్ల రూపాయల ఎంఓయులపై సంతకాలు చేశారు. టెక్ మహేంద్ర సీఈఓ గుర్నానీ రూ.200 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఆదానీ గ్రూప్ రూ.60 వేల కోట్లతో పెట్టుబడులతో వస్తే, భూములు కేటాయించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే 37వేల కోట్ల పెట్టుబడులతో కర్నూలు జిల్లాలో గ్రీన్ కో కంపెనీ పనులు కూడా మా హయాంలోనే ప్రారంభమయ్యాయి. అరబిందో గ్రీన్ ఎనర్జీ 28వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చింది. ఇవ్వన్నీ జగన్ హాయంలో జరిగినవి.ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబుఒక పర్యాయం సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటనకు వెళ్ళలేకపోతే చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియా ఈనాడు పత్రిక 'ఓసోస్ దావోస్ మనకెందుకూ' 'పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళలేరా?' అంటూ ఒక కథనాలను ప్రచురిస్తూ, సీఎం దావోస్ ఎందుకు వెళ్ళలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పొరుగు రాష్ట్రాల సీఎంలు దావోస్ కు వెళ్ళి పెట్టుబడులు తెచ్చుకుంటుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు అంటూ తమ కథనాల్లో ప్రశ్నించారు. మరి నిత్యం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూ స్వామిభక్తిని చాటుకునే ఇదే ఎల్లో మీడియాకు చెందిన ఈనాడు పత్రికకు ఉత్తి చేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు బృందం అసమర్థత కనిపించడం లేదా? దావోస్ వెళ్లినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే సమంజసమే అన్నట్లుగా అనుకూల కథనాలను రాయడానికి ఏమాత్రం వెనకాడలేదు. అంటే వైఎస్ జగన్ దావోస్ వెళ్ళకపోతే పెట్టుబడులు అక్కరలేదా అని ప్రశ్నిస్తారు, అదే చంద్రబాబు తన అసమర్థత వల్ల పెట్టుబడులు తీసుకు రాలేకపోతే మరే ఫరవాలేదు అంటూ చంద్రబాబును సమర్థిస్తారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల సీఎంలు లక్షల కోట్లు పెట్టుబడులతో తమ రాష్ట్రాలకు వచ్చారు, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఎంఓయు కుదుర్చుకోకుండా వచ్చారు. ఇది ఎల్లోమీడియాకు కనిపించదు. ఇదీ ఎల్లో మీడియా, దానిని నిర్ధేశిస్తున్న చంద్రబాబు నిజస్వరూపం. నరంలేని నాలుకను ఎటువైపు అయినా తప్పి మాట్లాడటంలో ఎంతో ఘనుడు. ఈ విషయంలో చంద్రబాబు, ఆయనకు ప్రచారం చేసే ఎల్లో మీడియాను మించిన వారు లేరు.పగిలిన గ్లాస్ కథను ప్రచారంలోకి తెచ్చారుదావోస్ లో చంద్రబాబు ఎంత బాధ్యతతో వ్యవహరించారో ఆయనతో పాటు పర్యటనలో పాల్గొన్న ఒక అధికారి ఎల్లో మీడియాకు చెందిన ఒక చానెల్ కు తెలిపిన కథనాన్ని చాలా గొప్పగా ప్రసారం చేశారు. ఈ కథనంలో దావోస్ లో మైనస్ 12 డిగ్రీల చలిలో చంద్రబాబు బృందం నిద్రిస్తున్న గదుల్లో గ్లాస్ పగిలి, గడ్డకట్టించే చలిలో రాత్రంతా నిద్రలేకుండా గడిపారని, తెల్లవారుజామున వారు కొద్దిసేపు నిద్రించి ఆలస్యంగా లేచారట. సదరు అధికారులు తెల్లవారిన తరువాత లేచి చూస్తే చంద్రబాబు గదిలో లేరని, ఆయన గదిలో కూడా గ్లాస్ పగిలినా, గడ్డకట్టే చలిలో రాత్రంతా వణికిపోతూ నిద్ర లేకుండా గడిపి, ఉదయానే అలసటను కూడా పట్టించుకోకుండా దావోస్‌లోని మీటింగ్ హాల్‌కు వెళ్ళిపోయారట. అంతేకాదు మిగిలిన రాష్ట్రాల వారు ఇంకా తమ స్టాల్స్ ను ప్రారంభించక ముందే అందరికంటే ముందుగా చంద్రబాబు ఏపీ స్టాల్ కు వెళ్ళి, దానిని ప్రారంభించి, అప్పటికే అక్కడకు వచ్చిన కొందరు విదేశీ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతూ కనిపించారట. అక్కడ ఉన్న విదేశీ పారిశ్రామికవేత్తలు కోట్లు, రగ్గులు కప్పుకుని ఉంటే, చంద్రబాబు మాత్రం తాను రోజూ ధరించే అదే ఖద్దరు దుస్తులతో వారితో మాట్లాడుతూ కనిపించారట. అది చూసి అధికారులు సిగ్గుతో చంద్రబాబు వద్దకు వచ్చి ఇంత చలిలో మీరు ఎందుకు అందరికంటే తొందరగా వచ్చారని వారిలోని ఒక అధికారి ప్రశ్నిస్తే, మనం ప్రభుత్వ సొమ్ముతో, వారు చెల్లించిన పన్నులతో విమానాల్లో ఇక్కడకు వచ్చాం, అందరికంటే ముందుగా ఇక్కడకు వస్తే కనీసం ముందుగా వచ్చే పారిశ్రామికవేత్తలతో మాట్లాడవచ్చు, వారిలో ఒకరిద్దరు అయినా పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే బాధ్యతతో ఇక్కడకు వచ్చాను అని అన్నారట. అది విన్న సదరు అధికారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయని అత్యంత అద్భుతమైన ఒక కథను ప్రచారం చేశారు. ఈ మొత్తం కథను 2023 నవంబర్ 13వ తేదీన టీవీ5 అనే ఛానెలో లో ప్రజంటేటర్ మూర్తికి, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మధ్య జరిగిన సంభాషణ. ఇదే స్టోరీని అదే ఛానెల్ లో అదే ప్రజంటేటర్ మూర్తి 20.1.2025న తాజాగా జరిగినట్లు చెప్పడం చూస్తే వీరు ఎంతగా దిగజారిపోయారనేది ప్రజలకు అర్థమవుతుంది. ఈ కథనంను ప్రచురించి ఎల్లో మీడియా చానెల్ టీవీ5 మరెవరిదో కాదు ఇటీవలే చంద్రబాబు ఆశీస్సులతో టీటీడీ చైర్మన్ గా పదవిని దక్కించుకున్న బీఆర్ నాయుడిది. తనకు పదవి ఇచ్చినందుకు గానూ కృతజ్ఞతతో తన చానెల్ లో గత ఏడాది నవంబర్ లో సినీ నిర్మాత బండ్ల గణేష్ చెప్పిన కథను తాజాగా ఇప్పుడే జరిగింది అని చెప్పి, దానిని ప్రచారంలోకి తీసుకురావడం చూస్తే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? 2023న పగిలిన గ్లాసు కథను టీవీ5 మూర్తి 2025లో జరిగినట్లు చెప్పడం ఎంత దారుణం.చంద్రబాబు కుమారుడిగానే లోకేష్ కు గౌరవంవైయస్ఆర్ సీపీ హయాంలో మేం చేసుకున్న ఒప్పందాల్లో భాగంగానే ప్రాజెక్ట్ లను ఇప్పుడు ప్రారంభిస్తున్నారి మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్న మాటలను మీడియా నారా లోకేష్ వద్ద ప్రస్తావిస్తే అమర్ నాథ్ గురించి 'ఆ.. కోడిగుడ్డాయనా' అని ఎద్దేవా చేశాడు. లోకేష్ పెద్ద పప్పుసుద్ద కాదా? చంద్రబాబును చూసి ఆయనను గౌరవిస్తున్నారు. గుడివాడ అమర్ నాథ్ ఒక మాజీ మంత్రి కుమారుడు. ఆయన చనిపోయిన తరువాత కూడా అమర్ నాథ్ ప్రజల నుంచి గౌరవం పొందుతున్నాడు. కేవలం చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే లోకేష్ కు గౌరవం. ఇది నిజంగా లోకేష్ కు ఉన్న గౌరవం కాదు. లోకేష్ ఎర్ర బుక్కుకు నా కుక్క కూడా భయపడదు. ఎంతమందిని జైలులో అక్రమ కేసులతో జైలుకు పంపినా వైఎస్సార్సీపీ వెనుకంజ వేయదు.రిపబ్లిక్ డే ప్రసంగంలోనూ డొల్లతనంవైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ప్రసంగం ద్వారా 1.03 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు, 2.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. రూ.3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, అమ్మ ఒడి ద్వారా లక్షలాధి మంది తల్లులకు అండగా నిలుస్తామని ఇలా పలు కార్యక్రమాల గురించి చెప్పాం. వాటిని తరువాత అదే తరహాలో ఆచరణలో కూడా చూపాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం తమ తొలి రిపబ్లిక్ డే నాడు ప్రసంగంలో ఒక్క కార్యాచరణపైన కూడా నిర్ధిష్టమైన విషయాలను చెప్పలేకపోయింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపైనా, వైజగన్పైనా విమర్శలు చేయడంతోనే కాలం గడుపుతోంది. ఆంధ్రా బ్రాండ్ ను దావోస్ కు వెళ్లి పెంచామని సిగ్గులేకుండా చెబుతున్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి, లేనిపక్షంలో వైఎస్సాఆర్సీపీ నుంచి మిమ్మల్ని నిలదీస్తాం. సూపర్ సిక్స్ హామీల అమలు ఏదీ? తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు అమలు విస్మరించలేదా? తమ అసమర్థతను దాచుకుంటూ జగన్ గారి వల్ల అమలు చేయలేకపతున్నామని చెప్పడానికి తెగబడుతున్నారు.మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూలోకేష్ రెడ్ బుక్ చూసి పారిపోలేదు, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. విజయసాయిరెడ్డిని అప్రూవర్ గా మారమని చాలా వత్తిడి తెచ్చారని ఆయనే చెప్పారు. ఇలా వత్తిడి తెచ్చిన వారు ఎవరో ఆయనే చెప్పాలి. జగన్ మీద పెట్టిన ఏ కేసులోనూ ఆధారాలు లేవు, రాజకీయ కక్షతోనే ఆయనను జైలుకు పంపారు. లోకేష్ వేధింపులపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఎర్ర పుస్తకంలో పిచ్చిరాతలు రాసుకుని, అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్న దానికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు. వైజాగ్ లో జగన్ హయాంలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణాలను ఏం చేసుకోవాలో తెలియని అయోమయంలో లోకేష్ ఉన్నారు. జగన్ మించిన ప్రజాధరణ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో మరొకరు లేరు. రాజకీయపార్టీలు ఓటమి పాలైన తరువాత నాయకులు బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం వైఎస్ఆర్ సీపీకే పరిమితం కాదు. గతంలో చాలా మంది టీడీపీ నుంచి బయటకు వెళ్లారు. అంతమాత్రాన టీడీపీ అధికారంలోకి రాకుండా మిగిలిపోయిందా. పార్టీ నుంచి వెళ్ళడం అనేది వెళ్ళినవారి నైతికతకు సంబంధించిన విషయం. కష్టాలను తట్టుకునే శక్తి, నష్టాలను పూడ్చుకునే శక్తి కూడా వైఎస్సార్సీపీకి ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్రజలను మెప్పిస్తాం’అని అన్నారు. -
ఫ్లైయాష్ దందా.. ఆదినారాయణరెడ్డి వర్గీయులు కొట్లాట
సాక్షి వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో ఉద్రికత్త నెలకొంది. ఏపీలో ఫ్లైయాష్ కోసం కొట్లాట కొనసాగుతోంది. తాజాగా ఆర్టీపీపీ ఫ్లైయాష్ కోసం ఆదినారాయణరెడ్డి వర్గీయులు వారిలో వారే దాడులకు దిగారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డినట్టు సమాచారం. దీంతో, ఫ్లైయాష్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఆర్టీపీపీ ఫ్లైయాష్ కోసం ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఒకరినొకరు తన్నుకున్నారు. తాజాగా ఉచితంగా వచ్చే ఫ్లైయాష్‌ను అమ్ముకునేందుకు ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్యే రగడ చోటుచేసుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రామ్మోహన్‌రెడ్డి అనే స్థానిక నాయకుడికి ఫ్లైయాష్ అందకుండా మరో వర్గం అడ్డుకుంది. దీంతో రామ్మోహన్‌రెడ్డి, సంజీవరెడ్డి వర్గీయుల మధ్య తీవ్రమైన వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్దతుదారులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. కర్రలతో దాడులకు తెగబడటంతో పలువురు గాయపడినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులను ఫ్లైయాష్ వద్దకు రానివ్వకుండా ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో రెండు జిల్లాల నేతల మధ్య పెద్ద ఎత్తున రగడ జరిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. అనంతరం, పలు పరిణామాల మధ్య జేసీ సైలెంట్ అయ్యారు. కానీ, తాజాగా ఆదినారాయణ రెడ్డి వర్గం మాత్రం ఫ్లైయాష్ విషయంలో మరోసారి దాడులకు దిగింది. -
‘టీడీపీ, షర్మిల’.. కార్యకర్తలే వైఎస్సార్సీపీ బలం: రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. గ్రామగ్రామాన వైఎస్సార్సీపీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్నంతకాలం తమ పార్టీకి ఏమీ కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఆదినారాయణ రెడ్డి లాంటి వారు వైఎస్ జగన్‌ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజకీయంగా దూరం కావాల్సి వచ్చింది. ఇలా చేసేవారందరికీ భవిష్యత్తులో ఇదే గతిపడుతుంది. విజయసాయి రెడ్డి వెళ్లడంతోనే వైఎస్ జగన్ విశ్వసనీయత దెబ్బతిన్నదని విమర్శిస్తున్న షర్మిలకు మా పార్టీలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు కనిపించలేదా?. సాయిరెడ్డి రాజీనామాతో ఇక వైఎస్సార్సీపీ పని అయిపోయిందని కూటమి నాయకులు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు. వారందరికీ నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ద్వారా అత్యున్నత పదవులు అనుభవించి.. పార్టీ అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉండగా కొంతమంది వదిలేసిపోయారు. వారు స్వార్థంతో వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వెళ్తున్నారు. వైఎస్ జగన్ కి ద్రోహం చేస్తున్నారని ప్రజలే అంటున్నారు. ఎందుకు వదిలిపెట్టిపోవాల్సి వచ్చిందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది పార్టీకి, వైఎస్ జగన్‌కు చేసిన ద్రోహంగానే ప్రజలు పరిగణిస్తున్నారు.టీడీపీ, షర్మిలకు కౌంటర్..టీడీపీ నాయకులు, షర్మిలకు, ఆదినారాయణరెడ్డికి అందరికీ చెబుతున్నా.. కొంతమంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్సీపీ పని అయిపోతుందా?. వైఎస్ జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకే కాదు.. మళ్లీ ఇంకో జన్మ ఎత్తయినా సరే జగన్ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకునే కార్యకర్తలు నాతోపాటు ఊరూరా లక్షల్లో ఉన్నారు. వారే మా పార్టీకి బలం. వైఎస్ జగన్‌ని విమర్శించే వారంతా ఆయన పేరు వింటేనే పక్క తడుపుకునే వాళ్లు. వాళ్లకు జగన్ మీద మనసు నిండా కుట్ర, ఒళ్లంతా అసూయ ఉంది. జగన్ చనిపోలేదు.. కేవలం ఓడిపోయాడని ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్న మాటలే దీనికి సాక్ష్యం. అంత భయం ఉంది కాబట్టే ఇంతగా కూటమి నాయకులు శత్రువు గురించి భయపడుతున్నారు.ఉత్సాహంగా ప్రజల్లోకి త్వరలోనే..వైఎస్ జగన్‌కి మేమెప్పుడూ బలం కాదు.. ఆయనే మా అందరికీ బలం. పోరాటం, ధైర్యం, విశ్వసనీయత ఆయన బలం. ఆయన వ్యక్తిత్వం, ప్రజల్లో ఆయనకున్న మంచి పేరే ఆయనకు శ్రీరామరక్ష. కార్యకర్తలే జగన్ బలం. కార్యకర్తలు ఉన్నంతకాలం ఆయన్ను ఏం చేయలేరు. త్వరలోనే ఆయన మళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, వంటి వారు పార్టీ మారలేదా?. విశ్వసనీయత, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని అలాంటి చంద్రబాబే 2024 మళ్లీ సీఎం కాలేదా? అలాంటిది జగన్ సీఎం కాలేరా?. ఆయన మళ్లీ సీఎం కావడం తథ్యమని తెలుసు కాబట్టే శత్రువులంతా భయంతో వణికిపోతున్నారు.ఇద్దరు ముగ్గురు వదిలేసి వెళ్లినంత మాత్రాన జగన్ భయపడేవారే అయితే 2014లో 23 ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసినప్పుడే మా పార్టీ కనుమరుగయ్యేది. ఆరోజే ఆయన ఏమాత్రం అధైర్యపడలేదు. వైఎస్ జగన్‌ను కాదని వెళ్లిపోయిన ఈ ఆదినారాయణ రెడ్డి మళ్లీ గెలవలేదు. ఇప్పటికే 2019-24 మధ్య ఒకసారి విశ్రాంతి తీసుకున్న ఆదినారాయణరెడ్డి.. మరోసారి అందుకు సిద్ధంగా ఉండాలి. ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్‌ను నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయి. వైఎస్సార్సీపీ మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
లోకేష్‌కు డిప్యూటీ సీఎం డిమాండ్.. అయ్యన్న వ్యాఖ్యల అర్థమేంటి?
విశాఖ : ఏపీలో తారా స్థాయికి వెళ్లిన అధికార టీడీపీ నేతల నారా లోకేష్ భజనను స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుబట్టారు. లోకేష్ డిప్యూటీ సీఎం అంశంలో టీడీపీ నేతల డిమాండ్‌పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చెయ్యడానికి మేం ఎవరు..? డిప్యూటీ సీఎం కావాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. దీంతో అయ్యన్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విస్మయానికి గురవుతున్నారు. మరి అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు- 2025 జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొనే ఈ సదస్సులో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పలువురు మంత్రులు పాల్గొన్నారు. అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు సైతం టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేషే వారసుడు.. చిన్నపిల్నాడి అడిగినా చెప్తాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తామేం తక్కువ కాదన్నట్లు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు.టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేతలు ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. -
సీబీఐ విచారణకు సిద్ధమా?.. పరిటాల శ్రీరామ్‌కు తోపుదుర్తి సవాల్
అనంతపురం, సాక్షి: మహేష్ రెడ్డి అనే యువకుడి మృతి కేసులో తనపై వస్తున్న రాజకీయపరమైన ఆరోపణలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. సోమవారం ఉదయం ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ‘‘తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి వాట్సాప్ స్టాటస్ లో లవ్ ఫెయిల్యూర్ కు సంబంధించిన మేసేజ్ లు ఉన్నాయి. అలాంటిది మా అన్నదమ్ముల పాత్ర ఉందంటూ పరిటాల శ్రీరామ్ చెప్పడం సరికాదు. ఈ కేసులో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం. మహేష్ రెడ్డి మృతికి మేము కారణమని ఆరోపించటం సరికాదు. తోపుదుర్తి మహేష్ రెడ్డి ఆత్మహత్య పై సీబీఐ విచారణ కు సిద్ధం.. మీరు సిద్ధమా?’’ అని శ్రీరామ్‌కు సవాల్ ప్రకాష్ రెడ్డి విసిరారు. మహేష్ రెడ్డి కి పరిటాల శ్రీరామ్ తో సత్సంబంధాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి ని పరిటాల శ్రీరామ్ వాడుకుని వదిలేశారు అని ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి.. సోమలదొడ్డినాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. అయితే అతని మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని, ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డిల ప్రమేయం ఉందంటూ ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. -
Vijaysai Reddy: అందుకే గుడ్‌బై చెప్పారా?
వైఎస్సార్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం సంచలనమైనదే. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన నేత, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన. రాజీనామా చేసినప్పటికీ వైఎస్ కుటుంబంతో అనుబంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడం ఆసక్తికరమైందే. రాజీనామా సందర్భంగా ఆయన జగన్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, అభిమానంగా మాట్లాడటం ఆ తర్వాత వైసీపీ స్పందన రాజకీయాలలో కొత్త ఒరవడిగా ఉన్నాయి. వైఎస్సార్సీపీపై కానీ, జగన్‌పై కానీ ఆయన వీసమెత్తు విమర్శ చేయకుండా గౌరవంగా బయటకు వెళ్లడం మంచి పరిణామం. మరోవైపు..ఆమోదయోగ్యం కానప్పటికీ తాము విజయసాయి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వైఎస్సార్‌షీపీ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇక విజయసాయి రాజీనామా సరైన నిర్ణయమేనా?. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా?. ఏదో బలమైన కారణం లేకుండానే ఇలా చేసి ఉంటారా?. అనే ప్రశ్నలు తలెత్తడమూ సహజమే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సంయమనంగానే వ్యవహరించారు. తెలుగుదేశం జాకీ మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆవేశపడలేదు. తాను అబద్దాలు చెప్పడం లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. అంతేకాక తనపై అసత్య కథనాలు రాసిన టీడీపీ మీడియాపై పరువు నష్టం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ సీపోర్టు వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, దానిపై కూడా పరువు నష్టం కేసు ఉంటుందని తెలిపారు. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు. దానికోసం పార్లమెంటు సభ్యత్వాన్ని వదలుకోనవసరం లేదు.ఈ మధ్యకాలంలోనే ఆయన ఒకటి, రెండు పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. అంటే ఆయన యాక్టివ్‌గా ఉండదలిచే ఆ పదవులను తీసుకున్నట్లే కదా! మరి ఇంతలోనే ఏమైంది?. ఇంతకుముందు ముగ్గురు ఎంపీలు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి అదే సీటు పొందగలిగారు. బీదా, మోపిదేవిలు టీడీపీ ప్రలోభాలకు ఆకర్షతులయ్యో, రెడ్‌బుక్‌కు భయపడో ఆ పార్టీ చెప్పినట్లు విన్నారు. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం ఈయన రాజీనామా చేసినట్లు కనబడుతుంది. ఒరిజినల్‌గా మొదటి నుంచి వైఎస్సార్సీపీలోఉన్నది మోపిదేవే. ఆయనకు రాష్ట్రంలో ఏదో పదవి ఇస్తామని టీడీపీ ఆశ చూపిందని అంటారు. మరో సీటు లోకేష్‌కు సన్నిహితుడని చెబుతున్న వివాదాస్పద వ్యక్తి సానా సతీష్ కు దక్కింది. ఈ రాజీనామాల ద్వారా రాజ్యసభలో టీడీపీ తిరిగి ఎంటర్ కాగలిగింది. బహుశా టీడీపీ రాజకీయ వ్యూహాన్ని గమనించిన బీజేపీ తను అడ్వాంటేజ్ పొందాలని అనుకుని ఉండాలి. మొత్తం 11 సీట్లు వైఎస్సార్సీపీ(YSRCP) ఖాతాలో ఉండగా, ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో నాలుగు సీట్లను వైసీపీ కోల్పోయినట్లయింది. మరో ఎంపీ అయోద్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయవచ్చని వదంతులు వచ్చినా, ఆయన ఖండించారు. వర్తమాన రాజకీయాలలో అధికారం లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో, అధికారం ఉంటే ఎలా పెత్తనం చేయవచ్చన్న దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. విజయసాయి మీడియా సమావేశంలో చేసిన రెండు వ్యాఖ్యలు గమనించదగినవి. గవర్నర్ పదవికి ఆశపడి తాను రాజీనామా చేయలేదని తొలుత చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. భవిష్యత్తులో ఏ పదవి చేపట్టబోనని ప్రకటించినట్లుగా లేదు. అలాగే తనకంటే శక్తి కలిగిన వ్యక్తికి ఈ పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే దాని అర్ధం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎవరైనా ప్రముఖుడు ఈ సీటు పొందబోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇది ఒక ఆపరేషన్ అయి ఉంటుందని, బీజేపీ పాత్ర ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రత్యేకించి.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపిన వైనం ఇందుకు ఆధారంగా నిలుస్తుంది. అలాగే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని, పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ దాడులు, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం అవ్వాలని భావించారా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం. గతంలో జగన్‌తో పాటు ఇంతకన్నా పెద్ద కేసులనే ఆయన ఎదుర్కొన్నారు. ఏడాదిపాటు జైలులో ఉండడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో ప్రముఖ నేతగా ఉండి రెండుసార్లు ఎంపీ అయ్యారు. టీడీపీ నేతలు కాని, టీడీపీ మీడియా కాని ఆయనపై ఇప్పటికీ విమర్శలు కొనసాగించాయంటే ఆ పార్టీలోని వారితో కాంటాక్ట్ ఏర్పడ లేదనుకోవచ్చు!. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ స్నేహ హస్తం అందించినట్లు అనిపిస్తుంది. బీజేపీ, జనసేన పార్టీలు ఈయనపై విమర్శలు చేయడం లేదు. టీడీపీకి తెలియకుండానే ఈ కధ నడించిందని అంటున్నారు. బీజేపీలో చేరడానికి తెలుగుదేశం అనుమతి తీసుకోవాలన్నట్లు ఆ పార్టీ జాకీ మీడియా అధినేత ఒకరు చెబుతున్నా, బీజేపీ అంత బలహీనంగా లేదేమో అనిపిస్తోంది. ఆ మాటకు వస్తే చంద్రబాబే పదే, పదే మోదీ, అమిత్ షాలను ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తే ఆయనకు ఏదో భయం పట్టుకుందన్న అనుమానం కలుగుతోంది. మరో వైపు ఎల్లో మీడియాలోని ఒక భాగం విజయసాయికి అనుకూలంగా కథనాలు ఇస్తోంది. ఆయనపై సానుభూతి కురిపిస్తోంది. విజయసాయి వైసీపీలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నా, వాటి గురించే రాజకీయాలనుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చే భీరువు ఆయన కాదు. ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్నవో, పెద్దవో సమస్యలు ఉంటాయి.అయినా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉండదు. కాకపోతే ఎవరైనా పార్టీని వీడడానికి అలాంటివాటిని సాకులుగా చూపుతారు. ఆ మాట కూడా విజయసాయి చెప్పలేదు. టీడీపీ జాకీ మీడియా అధినేత చేసిన కొన్ని ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆ మీడియా అధినేతను విజయసాయి కలిసింది వాస్తవమా? కాదా? బీజేపీలో చేరాలని యత్నించారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వగలగాలి. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఇప్పుడు కూడా విజయసాయిపై ఆరోపణలు చేయడం ద్వారా ఒక సంకేతం ఇచ్చింది. విజయసాయి పై టీడీపీ అదే కక్షతో ఉందని, ఆయన ఇలా రాజీనామా చేస్తారని టీడీపీ కూడా ఊహించలేకపోయిందన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఒకవేళ బీజేపీ పెద్దలు ఈ సీటు తమదే అన్నప్పుడు చంద్రబాబు కాదనగలుగుతారా? అనేది ప్రశ్న. అలాకాక టీడీపీనే ఈ సీటు తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉండవచ్చు. గతంలో 2019లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబే వారిని పంపించి తన దూతలుగా పెట్టుకున్నారని అంటారు. కాని జగన్ అలాంటి దొంగ రాజకీయాలు చేయరని మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ఎంపీలను ఎవరిని ఆయన బీజేపీలోకి పంపలేదు. పార్టీ వీడిన వారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లారు. వారిలో ఇద్దరు టీడీపీలో చేరారు. దీనిని బట్టి అర్థం అయ్యేదేమిటంటే, అలాంటి కుట్ర రాజకీయాలు, లొంగుబాటు రాజకీయాలు జగన్ చేయరని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చని, ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పాత్ర ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్న నేపద్యంలో వాటినుంచి కాస్త ఉపశమనం పొందడానికి విజయసాయి ఇలా చేసి ఉండవచ్చా? అనేది పలువురి డౌటుగా ఉంది. కాని అలాంటివాటికి తాను భయపడనని ఆయన చెబుతున్నారు. విజయసాయి ఏ కారణంతో రాజకీయాలకు దూరం అయినట్లు చెబుతున్నా, భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తారో చెప్పలేం. ఈ రాజీనామా ప్రభావం వైఎస్సార్సీపీ(YSRCP)పై ఏ మేరకు ఉండవచ్చన్నది చర్చ. తొలుత కొంత దిగ్భాంతికి గురవుతారు. ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. విజయసాయి మీడియా సమావేశంలో జగన్ బలం గురించి చెప్పిన తీరు విన్నాక పార్టీ క్యాడర్ లో యథా ప్రకారం ఆత్మస్థైర్యం వచ్చింది. తనలాంటి వారిని వెయ్యిమందిని జగన్ తయారు చేయగలరని ఆయన అనడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాక విజయసాయి ప్రత్యక్షంగా ప్రజలతో నిత్యం సంబంధాలు నెరపే వ్యక్తికాదు. 2024లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తప్పనిసరి స్థితిలోనే పోటీ చేశారు. ఓటమి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆ రకంగా చూస్తే ప్రజల కోణంలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కార్యకర్తలు అప్పుడే విజయసాయి వెళ్లిపోయినా పార్టీకి ఏమీ కాదని ధైర్యంగా చెప్పడం ఆరంభించారు. కొద్దిరోజుల పాటు చర్చించుకుని ఈ విషయాన్ని వదలివేయడం సహజంగానే జరుగుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వంటివారు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీ కేబినెట్ లో పనిచేసిన జగ్ జీవన్ రామ్,కాసుబ్రహ్మానందరెడ్డి,సి.ఎమ్.లుగా చేసిన దేవరాజ్ అర్స్, మర్రి చెన్నారెడ్డి వంటి వారు కొంతకాలం ఆమెకు రాజకీయంగా దూరం అయ్యారు. తిరిగి ఆమెకు ఉన్న ప్రజాదరణను గమనించి ఆమె పార్టీలోనే చేరారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.పక్కనే కూర్చుని ఉన్న ఉప నేత రఘుమారెడ్డి 1994 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్(YS Jagan) ఒంటరిగానే రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద పార్టీని తయారు చేసుకుని గెలుపు,ఓటములను చవిచూశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, ఇప్పటికీ జగన్ అంటే భయపడే పరిస్థితిలోనే ఆ పార్టీలు ఉన్నాయి. చదవండి: దటీజ్ జగన్.. పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!మళ్లీ వచ్చే ఎన్నికలలో జగనే గెలుస్తారేమోనని ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే ఎలాగొలా వైఎస్సార్సీపీని, జగన్ ను బలహీనపర్చాలని టీడీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది. వాటిలో ఎక్కువ భాగం కుటిల రాజకీయాలే అనే సంగతి తెలిసిందే. ఈలోగా బీజేపీ తన గేమ్ తాను ఆడుతోంది. అయినా జగన్ తొణకలేదు.బెణకలేదు. ఎందరు ఎదురు నిలబడ్డా తనదారిలోనే వెళ్లే నేత ఆయన. సోనియాగాంధీ అత్యంత శక్తిమంతంగా ఉన్న రోజులలోనే తనకు రిస్క్ ఉందని తెలిసినా, ఆమె కక్ష సాధింపుతో జైలు ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరించినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కున్నారే తప్ప తలవంచలేదు. ఈ పదిహేనేళ్ల రాజకీయంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఎదుర్కున్న జగన్.. వచ్చే నాలుగున్నరేళ్లు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడడానికి సన్నద్దమవుతున్నారు. అదే ఆయన బలం అని చెప్పాలి. ఆ గుండె ధైర్యాన్ని చూసే కార్యకర్తలు స్పూర్తి పొందుతుంటారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ(జనవరి 27, సోమవారం) విచారణ జరిపింది. అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం.. ‘‘కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా?’’ అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఒకానొక తరుణంలో పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది.. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. వాదనలు ఇలా.. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. అయితే.. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని.. ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అన్నివైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మస్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. -
విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ ‘పోరుబాట’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపై పోరుబాట(Porubata)కు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు చేపట్టబోతోంది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనుంది. త్వరలో ఈ పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయనుంది.ఒకవైపు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒకదఫా ఫీజు బకాయిలను కూడా చంద్రబాబు సర్కార్ చెల్లించలేదు. మరోవైపు..ఫీజులు చెల్లించలేదని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత విద్యార్థులకు అండగా పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. బాబు సర్కార్‌కు డిమాండ్లుఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి -
ధర్మవరంలో ఉద్రిక్తత.. టీడీపీ-బీజేపీ నేతల మధ్య ఘర్షణ
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు మైనార్టీ నేత జమీన్ సిద్ధమవ్వగా, జమీన్ చేరికను టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో మైనార్టీ నేత జమీన్ ఫ్లెక్సీలను పరిటాల శ్రీరామ్ వర్గీయులు చించివేశారు. ఈ క్రమంలో టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో రెండు స్కార్పియో వాహనాలు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.మరో వైపు, సామాన్యులపై కూడా టీడీపీ నేతల అనుచరులు రెచ్చిపోతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రధాన అనుచరుడు దాదు.. శివమాలధారణలో ఉన్న బలిజ శ్రీనివాసులు అనే ఆటోడ్రైవర్‌పై అకారణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. కాళ్లతో తన్నుతూ అవమానించాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం చోటు చేసుకుంది.బాధితుడి కథనం మేరకు.. పెనుకొండ దర్గాపేటకు చెందిన దాదు కారులో వస్తూ స్థానిక దర్గా సర్కిల్లో అతని ఫ్లెక్సీకి ఎదురుగా శ్రీనివాసులు ఆటో నిలిపి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆటో పక్కన పెట్టాలని హూంకరించాడు. ఆటో పక్కన పెడతానని అతను చెబుతుండగానే.. దాదు ఆగ్రహంతో ఊగిపోతూ ‘లం.. కొడకా’ అని దూషిస్తూ చెప్పుల కాలితో తన్నుతూ దాడి చేశాడు. అక్కడున్న వారు సముదాయించినా అతను వినకుండా విచక్షణారహితంగా కొట్టాడు.సమాచారం అందుకున్న బలిజ సంఘం, వీహెచ్‌పీ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వివాదం ముదరడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవన్.. వివిధ మండలాల ఎస్ఐలను రప్పించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, ఏఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో ఆనంద్‌కుమార్ పెనుకొండ చేరుకున్నారు. వివాదాన్ని సద్దుమణచడానికి ప్రయత్నించినా ఆందోళనకారులు శాంతించలేదు. ఇదీ చదవండి: బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు -
పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టమేమీ లేదు: వంగా గీత
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడు అని చెప్పుకొచ్చారు పార్టీ నాయకురాలు వంగా గీతా. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరమని అన్నారు. పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోయినా వారి లోటు తీర్చలేము అంటూ వ్యాఖ్యలు చేశారు.గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వంగా గీతా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరం. పార్టీలో ముఖ్యమైన, కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి. పార్టీ నుండి ఎవరూ వెళ్ళినా.. వారి లోటు తీర్చలేము. పార్టీ నుండి ఎవరూ బయటకు వెళ్ళినా వైఎస్సార్సీపీ కొనసాగుతుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా దృఢమైన నాయకుడు. ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అధికార మార్పిడి జరిగినప్పుడు ఆయా పార్టీల నుండి వ్యక్తులు బయటకు వెళ్ళడం.. మరి కొందరు చేరడం నిరంతర ప్రక్రియ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. పార్టీ అధినేత నడిచే విధానంపై పార్టీ ఉనికి ఉంటుంది. వైఎస్ జగన్‌పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదే విషయమై అంతకుముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని వైఎస్ జగన్ తయారు చేయగలరని సాయిరెడ్డి చెప్పారు. పార్టీ మారే వారిని వద్దని చెబుతాము.. అలాంటి వారిని ఆపలేం కదా?. నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్‌కు తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు. -
పవన్‌కు కొత్త ట్విస్ట్.. అన్నా ఎన్నాళ్లీ అవమానాలు!
అన్నయ్యా.. మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం కానీ నువ్వు విన్నావు కాదు.. మనం లేకుంటే వాళ్లకు కుర్చీ ఎక్కే ఛాన్స్ దక్కేనా?. అలాంటప్పుడు మనం గౌరవప్రదమైన సీట్లు తీసుకుని పోటీ చేద్దాం అంటే నువ్వు ఒప్పుకోలేదు.. జస్ట్ గుప్పెడు సీట్లు తీసుకుని వాటితో మనం చేసేదేం లేదు.మనం గేమ్‌లో అరటిపండులం అయిపోతాం తప్ప గేమ్ చేంజర్స్ కాలేం. వాళ్ళు ఆట ఆడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలి. ఈ ఖర్మ మనకు ఎందుకు అన్నయ్యా.. కలలు కనండి.. అవి నిజం చేసుకోవడానికి కృషి చేయండి అని అబ్దుల్ కలాం చెప్పారు కానీ ఆయన మన సొంత కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడాలని చెప్పారు తప్ప వేరే వారి కలలు నిజం చేసేందుకు మనం శ్రమించాలని చెప్పలేదు.వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తారు.. పాలనను అస్తవ్యస్తం చేస్తారు .. ఆ ఫెయిల్యూర్స్‌ను నీ మీద నెట్టేస్తారు చూస్తూండండి.. ఏదైనా మంచి జరిగితే వాళ్ళ ఖాతాలో వేసుకుని.. తప్పులన్నిటికీ మనను నిందిస్తారు.. ఎందుకొచ్చిన దరిద్రం మనకు.. బయటకు వెళ్ళిపోదాం.. ప్రతిపక్షంలో ఉందాం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. మనకు ఈ అధికారం అనే లంపటం వద్దు.. అంటూ ఆవేదనతో జనసైనికులు కడపజిల్లాలో ఫ్లెక్సీలు కట్టారు.వాస్తవానికి పవన్ సపోర్ట్‌తోనే చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో గెలిచారని.. ఇంకా చెప్పాలంటే చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన ఏనాడో విశ్వసనీయతను కోల్పోయారని.. కానీ కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనకుండి.. బాబు ఇచ్చిన హామీలకు తానూ బాధ్యుడిగా ఉంటూ వాటిని నెరవేర్చే బాధ్యతను నెత్తిన పెట్టుకుంటానని చెప్పడంతోనే ప్రజలు విశ్వసించి ఈ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారని కేడర్ భావిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో కనీసం యాభై సీట్లయినా తీసుకోకుండా కేవలం 21 సీట్లలో పోటీ చేయడం ద్వారా ప్రభుత్వంలో క్రియాశీలకంగా.. కీలకంగా ఉండలేని పరిస్థితి వస్తోందని కేడర్ లోలోన బాధ పడుతోంది.పైగా చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌ను సైతం అడుగడుగునా అవమానిస్తున్నారని.. మొన్నటి దావోస్ సభలకు సైతం డిప్యూటీ సీంఎను తీసుకుని వెళ్లలేదని.. కేవలం చంద్రబాబు.. లోకేష్ వెళ్లి ఆయనను పక్కనబెట్టేశారని.. తీరా అట్నుంచి ఇద్దరూ ఒట్టి చేతులతో వచ్చారని ఆ ఫ్లెక్సీల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వారిమీద నమ్మకం లేకనే పెట్టుబడులు రాలేదని.. అదే పవన్ వెళ్లి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని.. పవన్‌ను చూసి అయినా కనీసం నాలుగైదు కంపెనీలు వచ్చేవని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయినా అట్నుంచి వచ్చాక బాబును ఎలివేట్ చేస్తూ టీవీలు.. ఛానెళ్లలో ప్రోగ్రామ్‌లు నడుపుతున్నారని. కేడర్ ఆవేదన చెందుతోంది.తప్పులు చేసేది వాళ్ళు.. ఒప్పుకునేది మీరుతిరుమలలో తొక్కిసలాట వంటి ఘోరాలు జరిగినపుడు వారెవరూ తమకు సంబంధం లేనట్లు ఉంటారు.. మీరు మాత్రం నిజాయితీగా జనంలోకి వెళ్లి తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబుతున్నారు. కానీ, ఆ ఘోరానికి కారణమైన చంద్రబాబు తాలూకా మనుషులు మాత్రం కనీసం చీమ కుట్టినట్టు అయినా భావించడం లేదు. మనం ప్రతిపక్షంలో ఉండి .. ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుండు.. అధికారంలో భాగమై ఎందుకూ విలువలేకుండా పోతున్నాం.. అంటూ ఏర్పాటైన ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.సగటు జనసైనికుడి ఆవేదన.. అంతర్మథనాన్ని ఆ ఫ్లెక్సీలో పాయింట్లుగా రాసి అందర్నీ ఆలోచింపజేస్తున్నారని అంటున్నారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు జనసేన కేడర్ ఫోన్లలో సర్క్యులేట్ అవుతూ వారిని ఆలోచనలో పడేసింది. -సిమ్మాదిరప్పన్న. -
విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్సార్సీపీ స్పందించింది. ‘‘మేము మీ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాము. మా పార్టీ ఆవిర్భావం నుండి మీరు మా పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరిగా ఉన్నారు. కష్టాలు, విజయాలు రెండింటిలోనూ మీరు మాతో నిలబడే ఉన్నారు. ఇప్పుడు పార్టీ నుండి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము’’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది.‘‘హార్టికల్చర్‌లో మీ అభిరుచిని కొనసాగించడానికి.. రాజకీయాల నుండి వైదొలగాలనే మీ నిర్షయానికి మేము గౌరవిస్తున్నాము. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. "Even though we do not approve your decision, we still respect your choice. You’ve been one of the pillars of strength for our party since its inception, standing with us through both tough times and triumphs. We respect your decision to step away from politics to pursue your… https://t.co/NCoaEYxCEq— YSR Congress Party (@YSRCParty) January 25, 2025 -
చంద్రబాబు దావోస్ టూర్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి: అరుణ్‌కుమార్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దావోస్ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. దావోస్ పర్యటన పేరుతో చంద్రబాబు బృందం పెద్ద ఎత్తున ప్రజాధనంను దుర్వినియోగం చేసిందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మండిపడ్డారు. కనీసం ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకురాలేక పోయారని ఆక్షేపించారు.చంద్రబాబు, నారా లోకేష్ ప్రచార ఆర్భాటానికే దావోస్ పర్యటన పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ పర్యటనకు ఎంత ఖర్చు చేశారు? ఎందరు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు? ఎన్ని కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి? అన్న వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.దావోస్ పర్యటనకు కొత్త అర్థం:సీఎం దావోస్ పర్యటనపై ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నారు?. ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తల ముందు ఎలా ప్రజెంట్ చేశారోనని ఎదురు చూశారు. కానీ, తీరా దావోస్ నుంచి తిరిగి వచ్చిన సీఎం, మీడియా ముందు మాట్లాడింది చూసి ప్రజలు అవాక్కయ్యారు. దావోస్ అంటే కేవలం పెట్టబడులు కావు. నెట్ వర్కింగ్. పది మందిని కలవడం. అందరితో మాట్లాడటం. కాఫీలు తాగడం. అందరితో ఫోటోలు దిగి వాటిని మీడియాకు విడుదల చేయడం.. అంటూ చంద్రబాబు చెప్పడం నివ్వెర పరుస్తోంది. దావోస్ పర్యటన అంటే పెట్టుబడులు మాత్రమే కాదు, నెట్ వర్కింగ్ అని కొత్త అర్ధం చెబుతున్నారు. చంద్రబాబు వల్లనే..:14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అనేకసార్లు దావోస్ వెళ్లారు. ఈసారి పర్యటనలో ఒక్క పారిశ్రామికవేత్తతో అయినా ఎంఓయూ చేసుకోలేకపోయారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణాలో 2 లక్షల కోట్లు, మహారాష్ట్రలో ఏడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. కానీ, చంద్రబాబు బృందం మాత్రం ఒక్కటంటే ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేక పోయింది. కేవలం చంద్రబాబు సీఎంగా ఉండడం వల్లే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదా? దావోస్ పర్యటనపై చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. టీవీ ఛానల్స్‌కు కోట్ల రూపాయలు ఇచ్చారు. యథేచ్ఛగా ప్రజాధనంతో పెయిడ్ మార్కెటింగ్ చేసుకున్నారు. ఇంత చేసినా చంద్రబాబు పాలనపై పారిశ్రామికవేత్తలు విశ్వాసం వ్యక్తం చేయలేదు. ఒక్కరు కూడా ఏపీలో పెట్టుబడులకు సాహసించ లేదు.లోకేష్ ప్రమోషన్ కోసమే..:నారా లోకేష్‌ను రాజకీయ వారసుడుగా, కాబోయే సీఎంగా ప్రచారం చేసుకునేందుకే చంద్రబాబు దావోస్ పర్యటన. పారిశ్రామికవేత్తలతో 32 సమావేశాల్లో పాల్గొన్నామని చంద్రబాబు చెబుతుంటే, కాదు 38 మీటింగ్స్‌లో పాల్గొన్నట్లు లోకేష్ చెబుతున్నారు. అందులో 20 కంపెనీలు మనదేశానికి చెందినవే. మరో ఎనిమిది కంపెనీలు హైదరాబాద్‌కు చెందినవి. ఆయా కంపెనీలతో సమావేశాలకు దావోస్ దాకా వెళ్ళాలా?.జగన్ తమ హయాంలో ఒకేసారి దావోస్ వెళ్ళారు. ఏకంగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. గ్రీన్ ఎనర్జీ, ఇథైనల్ ఫ్యాక్టరీల వంటివి తీసుకువచ్చారు. అయినా ఆనాడు ఎల్లో మీడియా నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తూ, కథనాలు రాసింది. ఇప్పుడు అదే చంద్రబాబు, ఈసారి దావోస్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణలో పూర్తిగా విఫలం కావడంతో.. ఆ టూర్‌కు ఆయన పూర్తిగా కొత్త అర్ధం చెబుతున్నారు. తన మీద నమ్మకం లేక పారిశ్రామికవేత్తలు ముందుకు రాకపోయినా, దానిపై ప్రజల దృషి మరల్చేందుకు ఏవేవో కొత్త బాష్యాలు చెబుతున్నారు.చంద్రబాబు ఘోర వైఫల్యం:దావోస్‌లో చంద్రబాబు బృందం ఎవరితో తమ మొదటి సమావేశం నిర్వహించిందని చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. హైదరాబాద్ సోమాజీగూడలోని స్టోన్ క్రాఫ్ట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులతో మొదటి సమావేశం జరిగింది. 150 ఎకరాల భూమి ఇస్తే దానిలో గోల్ఫ్ కోర్ట్ పెడతామనే అంశంపై చర్చించారు. దీన్ని బట్టి చంద్రబాబు బృందం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.దావోస్‌లోని అంతర్జాతీయ వేదికపై నుంచి మన రాష్ట్రంలోని వనరులు, మానవ నైపుణ్యాలు, ప్రగతిదాయకమైన ఆర్థిక విధానాలు, ఉత్తమ పాలన, పారిశ్రామిక ప్రోత్సాహక పాలసీలను గురించి మాట్లాడి ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలి. కానీ దీనికి బదులుగా రాష్ట్ర ఐటీ మంత్రి దావోస్ వేదికపైన మాట్లాడుతూ మా భవిష్యత్ నేత నారా లోకేష్, ఆయన సీఎంగా రావాలని కోరుకుంటున్నాం అంటూ మాట్లాడటాన్ని పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యంతో విన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ప్రోత్సాహకాలను ఇస్తామో చెప్పకుండా తమను తాము పొగుడుకుంటూ మాట్లాడిన మాటలను చూసి అందరూ నవ్వుకున్నారు. చివరికి దావోస్ వేదికపై నుంచి జగన్‌గారిపై విమర్శలు చేశారు.దావోస్ పర్యటనలపై చంద్రబాబు గొప్పలు:రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఎటువంటి వ్యూహాత్మక ప్రణాళికలను అనుసరించాలని నిర్ధేశించాల్సిన ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కేవలం ప్రచారం ఎలా చేసుకోవాలి అనే దానిపైనే దృష్టి పెట్టింది. సీఎంగా దావోస్ వెళ్లిన ప్రతిసారి చంద్రబాబు ఒక కొత్త విషయాన్ని ప్రజలకు చెబుతుంటారు. ఆనాడు ఐటీకి తానే ఆరాధ్యుడిని అన్నారు. ఇప్పుడు ఎఐకి ప్రాముఖ్యతను కల్పించింది తానే అని చెప్పుకుంటున్నారు.తాను దావోస్ వెళ్తుండడం చూసి మిగిలిన సీఎంలు కూడా తనను అనుసరించారని, ఆనాటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ తనను చూసే దావోస్ వచ్చారని చెబుతున్నారు. అలాంటప్పుడు బెంగుళూరు ఐటీ హబ్‌గా దేశంలోనే ఒక ప్రత్యేకతను సాధించింది. బెంగుళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఎందుకు వెనుకంజలో ఉందో చంద్రబాబు చెప్పాలి. దావోస్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ అంటే పాకిస్తాన్‌లోని హైదరాబాదా అని అడుగుతుండేవారు అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక సీఎం హోదాలో ఉండి ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పి ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారా?ఎప్పుడూ ఆర్భాట ప్రకటనలే..వచ్చింది లేదు:2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దావోస్ పర్యటన సందర్భంగా 2016లో దావోస్‌లో 32 ఎంఓయులపై సంతకాలు చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. రూ.4.78 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి అందులో 95 శాతం ఎంఓయులన్నీ నకిలీవే. 2017లో మళ్ళీ దావోస్ వెళ్ళి ఏపీని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాను చేస్తానని చెప్పారు. వైజాగ్‌లో ఫిన్‌టెక్ వ్యాలీలో రూ.4,550 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. తీరా చూస్తే అది ఒక డెడ్ ప్రాజెక్ట్ అయింది. 2018లో దావోస్ వెళ్ళి అమరావతిని స్కిల్ హబ్ చేస్తానని చెప్పారు.కానీ, రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు పాల్పడ్డారు. 2017లో దావోస్ వెళ్ళి వచ్చి అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నాను, పారిశ్రామికవేత్తలు అమరావతికి రావాలని ఆహ్వానించారు. తీరా అవరావతి ల్యాండ్ పూలింగ్ స్కాంలో ఇరుక్కుపోయారు. 2019లో రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడారు. గతంలో తన ప్రభుత్వంలో ప్రతిఏటా ఏదో ఒక అంశంపై మాట్లాడి ప్రచారం చేసుకున్నారు.ఇప్పుడు 2024లో దావోస్‌కు వెళ్ళి వచ్చి బ్లూ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంథన వనరులు అని మాట్లాడుతున్నారు. మీ కంటే ముందే గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ 2019–24 వరకు బ్లూ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడటమే కాదు పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు కూడా తీసుకువచ్చారు. ఆదానీ గ్రూప్‌తో రూ.20 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రారంభించాం. రూ.37 వేల కోట్లతో గ్రీన్ కో సంస్థతోగ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇదే ప్రాజెక్ట్‌ను ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించి అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది అని కొనియాడారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. పనులు:వాటర్ వేస్, బ్లూ ఎకనామీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏపీకి సుదీర్ఘమైన సముద్రతీరం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టింది. రామాయపట్నంలో 19 బెర్త్‌లతో 138 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా లక్ష్యంగా పనులు చేశాం. ఇక మచిలీపట్నం పోర్ట్‌లో నాలుగు బెర్త్‌ల్లో మొదటి రెండు దశలు పూర్తి చేశాం. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్ట్, కాకినాడ గేడ్ వే పోర్ట్ పనులు కూడా మా హయాంలోనే చేశాం.ఇవి కాకుండా పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను ప్రారంభించాం. మొదటి దశలో ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను ప్రారంభించాం. జువ్వలదిన్నెలో 88 శాతం పనులు పూర్తిచేశాం. నిజాంపట్నంలో 70 శాతం పనులు పూర్తి చేశాం. రెండోదశలో ఊడుగంట్లపాలెం, పుడిమాడిక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప వంటి హార్బర్ల పనులు ప్రారంభించాం.మార్కెటింగ్ ఏజెంట్‌గా..:అన్ని పనులు చేసిన మేము, ఏనాడూ రాష్ట్రంలో బ్లూ ఎకానమీ గురించి మీలాగా ప్రచారం చేసుకోలేదు, ఆచరణలో చూపించాం. జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ద్వారా 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, వైఎస్సార్ జిల్లా చక్రాయిపాలెం వద్ద 400 మెగావాట్ల ప్రాజెక్ట్, సత్యాసాయి జిల్లా ముదిగుంపు వద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనకానపల్లి, రాప్తాడ్ లో 1050, బొమ్మనహళ్ళలో 850 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే. జగన్ చేసిన పనులను చెప్పుకునేందుకు మీరు దావోస్ వెళ్లారని అర్థం చేసుకోవాలి. గతంలో చంద్రబాబు తనను తాను సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేవారు. కానీ, ఇప్పుడు జగన్ ప్రగతిని ప్రచారం చేసే మార్కెటింగ్ ఏజెంట్‌గా మారిపోయారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. -
‘బాబూ.. ప్రజలకు వైద్యం ముఖ్యమా లేక ఎయిర్‌పోర్టులా?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రైవేటీకరణపైనే ఉంటుందన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వమే నిర్మించి, పర్మిషన్లు కూడా తెప్పించిన మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రయివేటీకరణ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సేఫ్ క్లోజ్ పేరుతో మెడికల్ కాలేజీలను మూసివేయడం దారుణం. చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రయివేటీకరణ మీదే ఉంటుంది. ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదు. కానీ, వైఎస్ జగన్ తెచ్చిన కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో సీటుకు కోటిన్నర వరకు వసూలు చేస్తారు. దాని వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి. తాము అధికారంలోకి వస్తే పైసా కూడా విద్యార్థుల దగ్గర వసూలు చేయమని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారు.ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. 2,450 జనరల్ సీట్లను చంద్రబాబు వలన రాష్ట్రం కోల్పోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వమే నిర్మించి, పర్మిషన్లు కూడా తెప్పించిన మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు?. ప్రైవేటీకరణ అవసరం ఏముంది?. చంద్రబాబు వలన గ్రామీణ ప్రాంతాల్లో ఇక ముందు పని చేసే డాక్టర్లే ఉండరు. ప్రజలకు విమానాశ్రయాలు ముఖ్యమా?.. మెడికల్ కాలేజీలు ముఖ్యమా? అని ప్రశ్నించారు. -
‘దావోస్‌నే ఇక్కడకు తెస్తామన్నారు.. ఏమైంది చంద్రబాబు?’
వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఏపీలో ఎక్కడ చూసినా మహిళలపై దురాగతాలు, గంజాయి, పేకాట క్లబ్‌ల పాలనే సాగుతోందన్నారు. మట్టి నుంచి ఇసుక వరకూ దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. ఇంతటి దుష్ట దుర్మార్గ పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదన్న రవీంద్రనాథ్‌రెడ్డి.. దావోస్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu) ఏమి తెచ్చాడని ప్రశ్నించారు. దావోస్(Davos)నే ఇక్కడకు తెస్తానంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. మైదుకూరు వ్యక్తికి కోటు వేసి చర్చలు జరపారని ఎద్దేవా చేశారు. వీళ్ల చేతగానితనానికి కూడా జగనే కారణమంటూ మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలందరికీ వీళ్ల చేతగానితనం, మోసం అర్థమవుతోందని, వైఎస్ జగన్ ఉంటే బాగుండేదని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.మత్స్యకార భరోసా, అమ్మ ఒడి వంటి అనేక పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం పంగనామాలు పెట్టిందని రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం తప్ప వీళ్లు చేసింది ఏమీ లేదని విమర్శించారు. వీళ్ల పరిపాలనకు దావోస్ పర్యటన నిదర్శమని, అక్కడ కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం తెలిసిపోయిందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినవి వచ్చే వరకూ తాము ప్రజాపోరాటాలు చేస్తామని రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.