breaking news
-
‘దావోస్‌నే ఇక్కడకు తెస్తామన్నారు.. ఏమైంది చంద్రబాబు?’
వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఏపీలో ఎక్కడ చూసినా మహిళలపై దురాగతాలు, గంజాయి, పేకాట క్లబ్‌ల పాలనే సాగుతోందన్నారు. మట్టి నుంచి ఇసుక వరకూ దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. ఇంతటి దుష్ట దుర్మార్గ పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదన్న రవీంద్రనాథ్‌రెడ్డి.. దావోస్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu) ఏమి తెచ్చాడని ప్రశ్నించారు. దావోస్(Davos)నే ఇక్కడకు తెస్తానంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. మైదుకూరు వ్యక్తికి కోటు వేసి చర్చలు జరపారని ఎద్దేవా చేశారు. వీళ్ల చేతగానితనానికి కూడా జగనే కారణమంటూ మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలందరికీ వీళ్ల చేతగానితనం, మోసం అర్థమవుతోందని, వైఎస్ జగన్ ఉంటే బాగుండేదని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.మత్స్యకార భరోసా, అమ్మ ఒడి వంటి అనేక పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం పంగనామాలు పెట్టిందని రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం తప్ప వీళ్లు చేసింది ఏమీ లేదని విమర్శించారు. వీళ్ల పరిపాలనకు దావోస్ పర్యటన నిదర్శమని, అక్కడ కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం తెలిసిపోయిందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినవి వచ్చే వరకూ తాము ప్రజాపోరాటాలు చేస్తామని రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. -
జగన్ వరుస నిర్ణయాలతో వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం
గుంటూరు, సాక్షి: చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గడువు ముగిసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. సంపద సృష్టి పేరుతో ప్రజలపై పెనుభారం మోపే కుట్రలకు తెర తీసింది కూటమి సర్కార్. దీంతో ప్రజల తరఫున పోరాటాలకు ప్రతిపక్ష బాధ్యతతో వైఎస్సార్సీపీ సిద్ధమైంది. అదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.వైఎస్సార్సీపీలో కొంతకాలంగా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నది చూస్తున్నదే. వరుసగా జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్(YS Jagan) విడివిడిగా భేటీ అవుతూ వచ్చారు. రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution), కీలక నేతలపై అక్రమ కేసులు.. నిర్బంధాలు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వంటి పరిణామాలు చర్చించారు. కూటమి ప్రతీకార రాజకీయాలకు భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని కేడర్‌కు ధైర్యం చెప్పారు. రాజకీయంగా ప్రత్యర్థుల కుట్రలకు తాను ఎంతగా ఇబ్బంది పడింది.. వాటికి ఎదురొడ్డి ప్రజాభిమానంతో చారిత్రక విజయం సాధించింది వివరించారు. రాబోయే రోజులు మళ్లీ మనవేనని.. కాబట్టి పోరాట పటిమ తగ్గకూడదని పిలుపు ఇచ్చారు. అదే సమయంలో ‘మార్పు’ తప్పదనే సంకేతాలిచ్చారు కూడా. అలాంటి వాళ్లకే పదవులువైఎస్సార్సీపీ(YSRCP)లో ఇప్పటికే దాదాపు అన్ని జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తైంది. నియోజకర్గాల కార్యవర్గాల అంశం చివరి దశలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. మండల్, బూత్ లెవల్ నియామకాలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. అయితే.. త్వరలో వైఎస్ జగన్ కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలోనే వాటిని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి.. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించాకే వైఎస్ జగన్ ఈ ప్రక్షాళన మొదలుపెట్టారు. మార్పులపై కీలక నేతలతో చర్చలు జరిపారు. పార్టీలో ఎవరైతే చురుకుగా ఉంటున్నారో.. వాళ్లకే పదవులను అప్పగిస్తున్నారు. తద్వారా పార్టీ కేడర్‌ను చెక్కుచెదరకుండా చూసుకున్నారు. అంతేకాదు.. స్వయంగా తానే కార్యకర్తల దగ్గరకు వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఈ వరుస కొత్త పరిణామాలు.. పార్టీలో నూతనోత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. పోరుబాటలో YSRCP..ఒకవైపు ప్రక్షాళనతో పార్టీ పునఃనిర్మాణం చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని వైఎస్ జగన్ పార్టీ కేడర్‌కు పిలుపు ఇస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) మళ్లీ మేనిఫెస్టో విషయంలో మోసానికి దిగారు. సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా గత ప్రభుత్వంపై నిందలతోనే కాలాయాపన చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని కేడర్‌కు గుర్తు చేస్తున్నారు.ఐదారు నెలలకే చంద్రబాబు సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు కష్టకాలంలో ఉన్నారని, ఈ టైంలో ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. ఇప్పటికే రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి 5న ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ మరో ధర్నాకు సిద్ధమైంది. మొత్తంగా.. పార్టీలో పోరాట పటిమ తగ్గకూడదని వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో మరిన్ని ప్రజాపోరాటాలకు వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ అనే సంకేతాలిస్తోంది. -
దావోస్ తుస్.. పవన్ ఫుల్ ఖుష్!
దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లిన చంద్రబాబు.. లోకేష్ అక్కడ సీఈవోలు.. టెక్ కంపెనీల పెద్దలతో ఫోటోలు దిగారు.. ఎప్పట్లానే కోట్లు కోట్లు.. పెట్టుబడులు అంటూ ఊదరగొట్టినా ఒక్క ఇటుకబట్టీ.. అతుకుల మిల్లు.. అప్పడాల మిషన్ వంటి చిన్న పరిశ్రమల కూడా రాలేదు.. దీన్ని అటు సోషల్ మీడియాలో యూత్ మీమ్స్.. ట్రోలింగులతో పోస్టింగులు పెడుతుండగా అటు టీడీపీ అనుకూల మీడియా మాత్రం సైలెంట్ ఐంది. ఏపీలో అన్ని ప్రాథమిక ప్రక్రియలు పూర్తయి నిర్మాణం మొదలు కావాల్సిన జిందాల్ స్టిల్స్ మహారాష్ట్రకు తరలిపోయింది. అటు కొత్తగా ఒక్కటీ ఒప్పందం జరగలేదు. దీంతో ఇక ఈ దావోస్ విజయోత్సవాలు ఎలా చేయాలన్నదాన్ని పక్కనబెట్టిన తెలుగుదేశం అనుకూల మీడియా ప్రస్తుతానికి ఆ అంశాన్ని చర్చల్లో ఉంచడం లేదు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఈ దావోస్ పర్యటన పెద్దగా ఫలితం ఇవ్వకపోవడాన్ని తెలుగుదేశం కక్కలేక మింగలేక ఉంటున్నా అటు లోలోన పవన్ కళ్యాణ్ మాత్రం సంబరపడిపోతూ సెలబ్రేషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌ను ఇగ్నోర్ చేసిన చంద్రబాబు.. లోకేష్వాస్తవానికి మొదట్లో బాబుపట్ల అత్యంత వినయవిధేయతలతో ఉన్న పవన్ ఒక్కోసారి ఆవేశంతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. శాంతిభద్రతలు బాలేవు.. అవసరం ఐతే నేనే హోం శాఖను తీసుకుంటాను.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను అన్నారు.. తిరుమల తొక్కిసలాట మీద కూడా తాను ముందుగా స్పందించి ప్రజలకు ప్రభుత్వం తరఫున సారీ చెప్పడంతోబాటు మీరెందుకు చెప్పరు మీకేం కష్టం.. అన్నట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఈవో శ్యామలరావును సైతం ప్రశ్నించి ఇరుకునపెట్టేసారు. ఇవన్నీ లోకేష్ ను బాగా ఇరిటేట్ చేశాయని .. పవన్‌ను కంట్రోల్ చేయాలనీ అయన ప్లాన్ చేస్తున్నారని.. అందుకే తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొందరు లీడర్లతో డిమాండ్లు చేయిస్తున్నారన్న ఫీలర్లు కూడా వచ్చాయి. మొత్తానికి అది సమసిపోగా ఇప్పుడు దావోస్ సదస్సుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు తీసుకెళ్లకుండా బాబు.. లోకేష్ ఇద్దరే వెళ్లారు. సీఎం హోదాలో బాబు.. ఐటి మంత్రిగా లోకేష్ వెళ్లారనుకున్నా పవన్‌ను సైతం తీసుకెళ్తే బాగుణ్ణని జనసైనికులు ఆశించారు. కానీ అక్కడ కూడా పవన్ వెళ్తే మీడియా మొత్తం ఆయనచుట్టూ ఉంటుందని.. లోకేష్.. చంద్రబాబును పట్టించుకోదని భయంతోనే ఆయన్ను తీసుకెళ్లలేదని అంటున్నారు..హమ్మయ్య మనకు హ్యాపీఇప్పుడు ఏమీ పెట్టుబడులు లేకుండా తిరిగొచ్చిన లోకేష్.. చంద్రబాబును చూసి పవన్ లోలోన సంతోషపడుతున్నారని అంటున్నారు... తనను పూర్తిగా పక్కనబెట్టేసి అదేదో వాళ్ళ సొంత ఫ్యామిలీ ఫంక్షన్ అన్నట్లుగా వాళ్లిద్దరే వెళ్లడం.. పవన్‌ను కనీసం మాట మాత్రంగా అయినా చెప్పకపోవడం.. ఒకరకంగా ఆయన్ను అవమానించడమే అని అంటున్నారు. ఐటి గురించి నీకేం తెలీదు.. మేం చాలాసార్లు దావోస్ వెళ్లాం.. అవన్నీ నీకు అర్థం కానీ విషయాలు అన్నట్లుగా పవన్‌ను చిన్నచూపు చూసి ఆయన్ను వదిలేశారని ఇది చిన్నతనంగా భావించినా ఏమీ మాట్లాడకుండా పవన్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. ఇక ఇప్పుడు దావోస్ సదస్సు తుస్సుమనడంతో పోన్లే.. మనకు సంబంధం లేని విషయం. వాళ్లిద్దరే వెళ్లారు.. వట్టి చేతులతో తిరిగొచ్చారు.. మనదేం పోయింది.. నన్ను ఇగ్నోర్ చేసినందుకు అలాగే జరగాలి అని పవన్ లోలోన ఖుష్ అవుతున్నారని అంటున్నారు..--సిమ్మాదిరప్పన్న -
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి : రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని వైఎస్సార్సీపీ రాజ్యసభా పక్ష నేత వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తి గతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.‘నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కు, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్టీ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనో ధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల విస్మయం..వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత వి.విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించడం బాధాకరమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తాను ప్రలోభాలకు లొంగలేదని సాయిరెడ్డి పేర్కొన్నప్పటికీ... వైఎస్సార్సీపీ బలంతో గెలిచి ఇంకా మూడున్నరేళ్లు పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం పరోక్షంగా కూటమి పార్టీలకు లబ్ధి చేకూరుస్తుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే... ఆయన రాజీనామా చేసిన స్థానంలో మళ్లీ పోటీ చేసి గెలిచేంత సంఖ్యా బలం ప్రస్తుతం వైఎస్సార్సీపీకి లేదు. అంటే దీని అర్థం.. బీజేపీ, టీడీపీలకు చెందిన వారు ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు ఈ చర్య పరోక్షంగా ఉపకరిస్తుందని విశ్లేషిస్తున్నారు. అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ గొంతుకను మరింత బలంగా వినిపిస్తూ ప్రజల తరఫున పోరాడాల్సిన తరుణంలో ఇలా రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించడం.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి నిర్ణయించుకోవటాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025 -
ప్రత్యర్థుల విష ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం.. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా కమ్యూనికేషన్‌పై వర్క్‌షాపు నిర్వహించారు. మీడియా అంశాలపై పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నేతలకు శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు వంగీపురం శ్రీనాధాచారి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తాజా పరిణామాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని.. సమర్థ వాదనతో ప్రజల్లో సానుకూలత సాధించాలన్నారు. ప్రత్యర్థులు చేసే విషప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సజ్జల చెప్పారు. -
‘సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే.. ప్రభుత్వానికి నష్టం’
వైఎస్సార్ జిల్లా: కడప ఎమ్మెల్యే ామాధవిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ీసీఎం రిలీఫ్ పండ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు. కడపంలో పరిశుభ్రత లేక ప్రజల్లో కిడ్నీ, శ్వాసకోస వ్యాధుల ెపెరిగిపోతున్నాయని సంచలనవ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆస్పత్రి ఖర్చులకు రోగులు సీఎం రిలీఫ్ ఫండ్ఆశ్రయించక తప్పడం లేదన్నారు. అయితే ఇలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం ావాటిల్లుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
‘ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ‘రెడ్‌బుక్’ రాజ్యాంగమే’
సాక్షి, నగరి: పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు (Investments) వచ్చాయని.. చంద్రబాబు(Chandrababu) ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్‌బుక్ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్. పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే.. చంద్రబాబు అండ్ కో కట్టుకథలతో ఏపీకి వస్తోంది’’ అని రోజా దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎంతో చక్కగా మెయింటెయిన్ చేశారు. మూడు పోర్టుల పనులు పరుగులు పెట్టించారు. చంద్రబాబు, లోకేష్ తీరుతో దావోస్‌లో ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. స్పెషల్ ఫ్లైట్లు, సూట్లు, బూట్ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. అంత పెద్ద వేదికపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు, కట్టుకథలు, పచ్చమీడియాతో ప్రజలను మభ్యపెట్టారు. దావోస్‌లోనూ అదే తరహా మభ్య పెట్టాలని చూశారు. కానీ, చంద్రబాబు మాటలు విని పెట్టుబడిదారులు పారిపోయారు’’ అని రోజా చెప్పారు.‘‘వైఎస్ జగన్‌ను చూసి అదానీ, అంబానీ, జిందాల్ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారు. చంద్రబాబును, ఆయన పరిపాలన చూసి ఒక్క పారిశ్రామికవేత్త అయినా వచ్చారా?. మీ అరాచక రెడ్‌బుక్ పాలన చూసి పెట్టుబడుదారులు భయపడుతున్నారు. ఏపీ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తున్నారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్ర పరువు కాపాడాలని ఆ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా. పవన్‌ను చంద్రబాబు ఎందుకు దావోస్ తీసుకెళ్లలేదు?. పవన్ వస్తే లోకేష్ స్థాయి తగ్గిపోతుందని తీసుకెళ్లలేదా?.’’ అంటూ రోజా ప్రశ్నలు గుప్పించారు.ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు.. హోదాకు తగ్గినట్టు మాట్లాడితే బాగుండేది! -
బాబూ.. ఒక్క మెడికల్ కాలేజైనా తెచ్చావా?: సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి సీదిరి అప్పలరాజు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని మండిపడ్డారు. అలాగే, మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీమంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో ఒకే టర్మ్‌లో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. పద్నాలుగేన్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదు.వైఎస్ జగన్ తీసుకువచ్చిన విధానాలను చూసి కేంద్రం, ఇతర రాష్ట్రాలు ముందుకెళ్లాయి. పులివెందులలో మెడికల్ సీట్లు వద్దని కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే. 750 మెడికల్ సీట్లు రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
లోకేష్ కోసమే బాబు దావోస్ పర్యటన: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: మంత్రి నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్లారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు. ప్రజాధనంతో దావోస్‌లో ఎంజాయ్ చేస్తాం అంటే చూస్తూ ఊరుకోము అంటూ హెచ్చరించారు.తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీలో 29 అనుబంధ సంఘాలకు అధ్యక్షులు నియామకం జరిగింది. అధ్యక్షులుగా నియమితులైన వారిని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అభినందించారు. ఈ క్రమంలో చంద్రబాబు , లోకేష్ దావోస్ పర్యటనపై దేవినేని అవినాష్ స్పందించారు. ఈ సందర్బంగా అవినాష్ మాట్లాడుతూ..‘చంద్రబాబు ఆయన కొడుకు 100 కోట్ల ప్రజాధనంతో దావోస్ పర్యటనకు వెళ్లారు. రూపాయి పెట్టుబడి తీసుకురాలేని దావోస్ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమిటి?. నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్లాడు. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు.దావోస్ పర్యటన వల్ల ఏయే పెట్టుబడులు వచ్చాయో ప్రజలకు చెప్పాలి. మహారాష్ట్ర, తెలంగాణ వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. చంద్రబాబు ఐదు సార్లు దావోస్ వెళ్లినా.. వైఎస్ జగన్ ఒక్కసారి వెళ్లిన పర్యటనతో సమానం. వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు తెచ్చారు. రాష్ట్రాన్ని వైఎస్ జగన్ అన్ని విధాలా అభివృద్ధి చేశారని మేం గర్వంగా చెప్పగలం. చంద్రబాబు, లోకేష్‌కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తేవాలి. ప్రజాధనంతో ఎంజాయ్ చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం. ప్రజల్లోకి వెళ్తే పథకాలు గురించి నిలదీస్తారని వెళ్లడమే మానేశారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మధ్య వార్ జరుగుతోంది. తూర్పు బైపాస్‌పై ప్రకటనలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు. కూటమి నేతలు ఎందుకని ఇక్కడి ప్రజల మీద కక్ష కట్టారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బెజవాడ ఎంపీ కలిసి కేంద్ర పెద్దలతో మాట్లాడి తూర్పు బైపాస్‌కి ఒప్పించాలి. కూటమి నేతలు ప్రతీ పనిలో కలెక్షన్లు వెతుక్కుంటున్నారు. కమీషన్, కరప్షన్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. జగ్గయ్యపేటలో దొరికిన గంజాయిపై కూటమి నేతలు మాట్లాడాలి. గంజాయి నిర్మూలన చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో తేల్చాలి. చంద్రబాబు హయంలో కాలనాగులు మళ్లీ పడగ విప్పుతున్నారు. పేద వారిని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పేదల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుంది’ అని కామెంట్స్ ఇచ్చారు. -
నారా లోకేష్ రెడ్‌బుక్ అమలులో ముఖ్య పాత్ర ఆయనదే?
ఏబీ వెంకటేశ్వరరావు.. ఐపీఎస్! పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వార్తల్లోకి ఎక్కిన వివాదాస్పద అధికారి. రిటైర్ అయిన తరువాత కూడా తన వ్యాఖ్యలు, వైఖరితో మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్న వ్యక్తి కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌ల అండతో ఆయన ఈ మధ్య కాలంలో మరింత చెలరేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.తాజాగా ఆయన తన ‘కమ్మ’ కులం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, హితబోధ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎవరేమనుకుంటే తనకేమన్నట్టుగా ఆయన మాట్లాడటం.. తన మాటల వల్ల ఇతర కులాల వారి మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయో ఆలోచించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కులం వారు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోగలరా?. కులమతాలకు అతీతంగా అందరూ ఓట్లేస్తేనే ఒక పార్టీ ఎన్నికవుతుంది కదా?. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా కమ్మ కులం వాళ్లు అన్ని రకాలుగా అడ్డుకోవాలన్నది ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన పిలుపు! ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని, అహర్నిశలు కష్టపడాలని కూడా ఆయన తన కులం వారిని కోరుకున్నారు. కమ్మ వారికి ఏదో పెద్ద సందేశం ఇచ్చానని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు కానీ, దీనివల్ల కమ్మ వారిపై మిగిలిన వారికి మరింత వ్యతిరేకత వస్తుంది. అసహ్యం ఏర్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన లాంటి వ్యక్తులు కమ్మ కులం వారిని భ్రష్టు పట్టిస్తున్నట్లుగా ఉంది.ఈ క్రమంలోనే ఆయన వైఎస్ జగన్‌పై పరుష పదాలతో విమర్శించారు కూడా. సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించని విమర్శలివి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన రెడ్డి, ఇతర కులాల వారిని ఏకం చేస్తున్నారని, వైఎస్ జగన్‌ను అభిమానించే బలహీన వర్గాల వారందరూ ఒక్కతాటిపైకి వచ్చేలా చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పనితీరుకు ఏబీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కూడా అంటున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను చూస్తే అసలు ఆయన ఐపీఎస్ అధికారేనా? అన్న అనుమానం వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు వెనుక కీలక పాత్రధారి ఈయనే అన్న అనుమానమూ వస్తోంది.వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు ఒకప్పుడు ఇంత వివాదాస్పదుడు కానేకాదు. ఇంత చెడ్డ పేరూ లేదు. తెలుగుదేశంతో జత కట్టిన తర్వాతే ఇలా తయారయ్యారు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ కనుసన్నలలో పనిచేస్తూ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కమ్మ వర్గం వారు ఇతర సామాజికవర్గాల దృష్టిలో విలన్ల మాదిరి కనిపించేవారు. తత్ఫలితంగా మిగిలిన కులాలన్నీ ఏకమై తెలుగుదేశం పార్టీని ఓడించాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇదే ధోరణి ఆరంభమైనట్లుగా ఉంది.వీరి రెడ్‌బుక్‌లో ఉన్న పేర్లలో ఎక్కువ భాగం రెడ్డి లేదా షెడ్యూల్ కులాల వారే. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారన్న కారణంగా ఈ వర్గాల అధికారులు కొందరికి ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ముత్యాలరాజు వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగల అవకాశం ఉన్న మహిళా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లను బయటకు తీశారన్న కోపంతో ఏదో ఒక నెపం పెట్టి కొంతమంది ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం, కేసు పెట్టి అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని ఏబీ వెంకటేశ్వరరావు ఫీల్ అవుతుండవచ్చు.కానీ, ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపికై సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించిన ఈయనకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పేషీ, మంత్రులు ఎలా పనిచేస్తారో తెలిసి ఉండాలి. లోకేష్ వంటి అనుభవం లేని వారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే, వారించవలసిన ఈయనే స్వయంగా కుల ప్రస్తావన తెచ్చి ప్రసంగాలు చేయడం శోచనీయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుకునేందుకు దేనికైనా సిద్ధపడాలన్న ఏబీ వ్యాఖ్య వెనుక ఉద్దేశం ఏమిటన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. హింసకు కూడా వెనుకాడవద్దని పరోక్షంగా పిలుపునిస్తున్నారా? అంటూ మీడియాలో కథనాలూ వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల మ్యానిప్యులేషన్ జరిగిందన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ అదే పద్ధతి అవలంబించాలన్నది ఆయన చేస్తున్న సూచనా?. సమాజంలో కులాల కొట్లాటలు ఉంటే ఉండవచ్చు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో పనిచేసే వాళ్లు కూడా ఇంత తక్కువ స్థాయి ఆలోచనలు చేయడం, చెత్త ప్రకటనలు చేయడం ఎంత వరకూ సబబు?. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ శాంతి భద్రతల విషయాన్ని పక్కనబెట్టి రాజకీయంగా వైఎస్సార్సీపీని ఎలా దెబ్బ తీయడమన్న విషయంపైనే దృష్టిపెట్టేవారని చాలా మంది టీడీపీ నేతలు చెబుతారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ సమావేశంలో ఒకసారి మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్ష పదవిని పొందడానికి ఏబీ వెంకటేశ్వర రావు క్లియరెన్స్ తీసుకోవాలని ఆశావహులకు సూచించిన వీడియో అప్పట్లో కలకలం రేపింది.వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రలోభాలు పెట్టడంలో ఏబీతో పాటు ఒక మీడియా అధినేత విశేష పాత్ర పోషించారని చెబుతారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఇజ్రాయిల్ నుంచి గూఢచర్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై కేసు పెట్టి సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఓకే చేసింది. తనపై ఆ కేసు పెట్టినందుకు ఏబీకి ఆగ్రహం ఉండవచ్చు. కానీ, ఆ కేసులో తాను సచ్ఛీలుడినని రుజువు చేసుకోవచ్చు. ఎటూ ప్రభుత్వం వారిదే కనుక తమకు కావల్సిన జీవోలను తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. కోర్టు ద్వారా రిటైర్మెంట్ రోజున సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వు పొందారు. దాన్ని గౌరవించి గత ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఏబీ తన వ్యాఖ్యల్లో వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా విమర్శించారు.అయితే, వైఎస్సార్ హాయంలో ఈయనకు వచ్చినవన్నీ దాదాపు మంచి పోస్టులేనని సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చిన వివరాలను బట్టి అర్ధం అవుతుంది. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు కర్నూలు రేంజి డీఐజీ పోస్టు ఇచ్చింది. వైఎస్సార్ సొంత జిల్లా అయిన కడప కూడా ఈ రేంజ్‌లోనే ఉంది. మరి ప్రాముఖ్యత లభించినట్లా? కాదా? హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిక్రూటింగ్, వైజాగ్ రేంజ్ ఐజీ వంటి బాధ్యతలను కూడా అప్పట్లో అప్పగించారు. వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఈయనను అంతగా ప్రాధాన్యం లేని ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. అయినా వైఎస్సార్‌పై ఈయన విమర్శలు చేయడం ధర్మమా? అన్నది కొందరి ప్రశ్న.ఇక్కడ మరో మాట చెప్పాలి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి అవమానించినప్పుడు కమ్మవారికి అవమానం జరిగినట్లు కాదా?. చంద్రబాబుకో, ఏబీ వంటివారికో ఏదైనా ఇబ్బంది వస్తే, వారిపై ఆరోపణలు వస్తే కమ్మ వారందరికీ వచ్చినట్లా? ఏ కులంలో అయినా లాభం కొందరికే లభిస్తూంటుంది. సంపాదన, పెత్తనం కూడా కొందరికే దక్కుతుంది. అలాంటివారు ఆ కులంలోని ఇతరులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. ఏబీ కూడా సరిగ్గా అదే పని చేసినట్లుగా కనిపిస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు, లోకేష్ వంటివారి ధోరణి వల్ల రెడ్లతో సహా మిగిలిన పలు కులాల వారిలో అభద్రతాభావం ఏర్పడుతుంది. పైకి కాపులను కలుపుకున్నట్లు కనిపిస్తున్నా వారికి క్షేత్రస్థాయిలో అనేక అవమానాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎదుటే ఒక జనసేన నేత ఆత్మహత్యాయత్నం చేయడం. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎంగా ఉంటే, ఆయనకు పోటీగా లోకేష్‌ను కూడా ఆ హోదాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు కాపులలో కాక రేపుతోంది.జనసేన, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ఈ తరహా అసందర్భ ప్రసంగాలు చేసి సమాజంలో మరింత అశాంతికి దోహదపడడం ఐపీఎస్ హోదాకే అవమానం కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చిన ఈయన రిటైరయ్యాక వ్యవహరిస్తున్న తీరు చూశాక, పదవి బాధ్యతలలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నారని ఎవరైనా అనుకోగలరా?. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ బీజేపీలో కలకలం!
సాక్షి, రాజమహేంద్రవరం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (daggubati purandeswari), మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) మధ్య తూర్పుగోదావరి జిల్లా బీజేపీ (bjp) అధ్యక్షుడి నియామకం అంశంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎవరికి వారు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేశారు. తన మాట నెగ్గాలంటే.. తన మాట నెగ్గాలంటూ పావులు కదిపారు. చివరకు వీర్రాజు జాతీయ నేతలను ఒప్పించి తన అనుచరుడైన కొవ్వూరుకు చెందిన పక్కి నాగేంద్రకు జిల్లా అధ్యక్షుడి పగ్గాలు అప్పగించడం.. పురందేశ్వరి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, రాజమహేంద్రవరం సిట్టింగ్ ఎంపీగా ఉండీ కూడా తన అనుచరురాలైన ఎన్.హారికను జిల్లా అధ్యక్షురాలిగా నియమించలేక పోవడం చర్చనీయాంశమైంది. అధిష్టానం వద్ద పురందేశ్వరి మాట చెల్లుబాటు కాకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా పిక్కి నాగేంద్ర ఉత్తర్వులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి సోము వీర్రాజు, పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడచినట్లు సమాచారం. బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని నూతన అధ్యక్షుడికి సోము వీర్రాజు సూచించారు. ఇదే విషయమై పురందేశ్వరి స్పందిస్తూ.. పార్టీ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది కాబట్టే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు విస్మయానికి గురైనట్లు సమాచారం. టీడీపీతో అంటకాగుతున్నందుకేనా? పురందేశ్వరి బీజేపీలో ఉన్నా, ఆమె మనసంతా టీడీపీలోనే ఉందన్న ఆరోపణలున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి టీడీపీ బలోపేతం, అధికారంలోకి తీసుకురావడానికి సొంత పార్టీ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల సమయంలో అనపర్తి ఎమ్మెల్యే స్థానానికి కూటమి అభ్యరి్థగా బీజేపీ నేత శివరామకృష్ణంరాజును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయంతో టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి వర్గంలో అప్పట్లో అలజడి రేగింది. నల్లమిల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో సొంత పార్టీ అభ్యర్థి శివరామకృష్ణం రాజుకు మద్దతు ఇవ్వాల్సింది పోయి.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పక్షాన పురందేశ్వరి నిలబడటం అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా తన మరిది (సీఎం చంద్రబాబు) ప్రయోజనాల కోసమే చేశారని అప్పట్లో చర్చ జరిగింది. అందువల్లే ఆమె సిఫారసులను కమలం పెద్దలు పట్టించుకోవడం లేదని తెలిసింది. పురందేశ్వరి, సోము వీర్రాజుల మధ్య ఆది నుంచి సయోధ్య కుదరడం లేదు. ఎన్నికల సమయంలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌లో ఏ స్థానం ఇచ్చినా ఫర్వాలేదని వీర్రాజు కోరారు. ఇందుకు టీడీపీ అధినేత నిరాకరించారు. ఈ నిర్ణయం వెనుక చిన్నమ్మ ఉన్నట్లు భావించిన సోము వర్గం అప్పటి నుంచి ఆమెను విభేదిస్తోంది. -
‘చంద్రబాబు దావోస్ పర్యటన.. ఖర్చు ఫుల్.. పెట్టుబడులు నిల్’
సాక్షి, విశాఖపట్నం: దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని.. పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన (Davos Tour)ను ఉపయోగించుకున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని.. లోకేష్ భజనతో దావోస్ ముగిసిందన్నారు.‘‘కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు?. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్ను దెబ్బ తీశారు. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్.. దావోస్‌లో కూడా లోకేష్ భజన చేశారు. జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టు బడులు ఇతర రాష్ట్రాలకు తరలించారు. పెట్టుబడిదారులను వేధింపులకు గురిచేశారు. దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు’’ అంటూ అమర్నాథ్ ధ్వజమెత్తారు.‘‘బల్క్ డ్రగ్ పార్క్ వైఎస్సార్సీపీ హయాంలో వచ్చింది. ప్రధాని శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ గ్రీన్ హబ్ వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చింది. ఒక హామీ ఒక స్కీం కూడా అమలు చేయలేదు. నమ్మే వాళ్ళు ఉంటే బిల్ గేట్స్ చంద్రబాబు కలిసి చదువుకున్నాము అంటాడు. చంద్రబాబు బ్రాండ్ ఇమెజ్ పెంచుకోవడానికి దావొస్ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి కాదు.’’ అంటూ గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: విద్యార్థులను మోసగించిన చంద్రబాబు సర్కార్: లేళ్ల అప్పిరెడ్డి -
నాకు చెప్పకుండా ఎలా వస్తావ్..?.. గుంటూరు ఈస్ట్ టీడీపీలో వర్గపోరు
సాక్షి, గుంటూరు: నగరంలోని ఈస్ట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బయటపడింది. ఆర్టీసీ కాలనీలో లోకేష్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరు కాగా, తనకు చెప్పకుండా మా డివిజన్‌లోకి ఎలా వస్తారంటూ ఎమ్మెల్యేను డివిజన్ పార్టీ అధ్యక్షుడు యాసిన్ అడ్డుకున్నారు.ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు యాసిన్ వర్గీయులు వార్నింగ్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై యాసీన్ వర్గీయులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.తంబళ్లపల్లె టీడీపీలో..కాగా, తంబళ్లపల్లె టీడీపీలో ఇప్పటికే వర్గపోరు నడుస్తుండగా.. లోకేష్ బర్త్‌డేతో అది రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, సీఎం అంటూ లోకేష్‌పై సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిచ్చును మరింత రాజేశాయి. ఈ క్రమంలో నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఉన్న ఫ్లెక్సీలను చించిపాడేసింది మరో వర్గం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోగా.. కేసు నమోదైంది.తంబళ్లపల్లె టీడీపీలో మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్సెస్ ఇంఛార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తోంది. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆకర్షించే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బుధవారం రాత్రి శంకర్ వర్గీయులు పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శంకర్ ప్రధాన అనుచరుడు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో.. ఇంఛార్జి జైచంద్రారెడ్డి విడిగా తన అనుచరులతో లోకేష్ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.అందులో శంకర్‌కు చోటు లేకుండా చూసుకున్నారు కూడా!. అయితే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. చంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది చంద్రారెడ్డి వర్గీయుల పనిగా పురుషోత్తం అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. -
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ ఓవరాక్షన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపి కార్యకర్తలు ఓవరాక్షన్‌కు దిగారు. కార్లు, బైకులపై వచ్చి హడావుడి చేశారు. పార్టీ ఆఫీసు ముందు వాహనాలను ఆపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వాహనాల్లో వచ్చి హల్ చల్ చేశారు. -
నారా లోకేష్‌పై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మంత్రులు, టీడీపీ నేతల నారా లోకేష్( Nara Lokesh) భజన తారాస్థాయికి చేరింది. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, డిప్యూటీ సీఎం చేయాలంటూ పచ్చ నేతలు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేషే వారసుడు.. చిన్నపిల్నాడి అడిగినా చెప్తాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించాడు.కాగా, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పలువురు మంత్రులు దావోస్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: దావోస్.. అంతా తుస్మరోవైపు.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే కామెంట్స్‌పై అటు జనసేన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. -
విద్యార్థులను మోసగించిన చంద్రబాబు సర్కార్: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఫిబ్రవరి 5న ఫీజు పోరు (YSRCP Fees Poru) నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(Lella Appi Reddy) తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్రాలలో ఈ ఫీజు పోరు చేస్తామని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పోకడలు పేద విద్యార్థులకు విఘాతం కల్గిస్తున్నాయని.. ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్ వేధిస్తోందని అప్పిరెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా సమాజానికి మేలు చేకూరే పని చేయరు. పేద విద్యార్థులకు ఏ ప్రయోజనం చేకూర్చరు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని 2004లో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారు. ఆయన వలనే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవగలిగారు. కానీ చంద్రబాబు వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రూ.18 వేల కోట్లను విద్యా రంగానికి ఖర్చు చేశారు. ఐదేళ్లలో ఆలస్యం కాకుండా నిధులను విడుదల చేశారు. చంద్రబాబు మాత్రం ఇప్పటికే 3,900కోట్లు బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెడుతూ విద్యారంగాన్ని విస్మరించారు. బకాయిలను చెల్లించాలని కోరుతూ కలెక్టర్లను కలవబోతున్నాం. రూ.3,900 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలపడలేదని చంద్రబాబు గుర్తించాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: దటీజ్ జగన్..పగవాడైనా ఒప్పుకోవాల్సిందే! -
‘ వివాదాస్పదంగా జిల్లా కలెక్టర్ నిర్ణయాలు’
నెల్లూరు: జిల్లా కలెక్టర్ ఆనంద్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ధ్వజమెత్తారు. రెడ్ క్రాస్ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ఆదేశాలను కలెక్టర్ పాటిస్తున్నారని విమర్శించారు.రెడ్ క్రాస్(Red Cross) ప్రాథమిక సభ్యత్వం నుంచి వైఎస్సార్సీపీ(YSRCP) సానుభూతి పరులను తొలగించే అధికారం కలెక్టర్‌కి లేదని స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన కాకాణి.. కలెక్టర్ హోదాలో కూర్చొనే అర్హత ఆనంద్ కి ఉందో లేదో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ జాతీయ చైర్మన్ గా బీజేపీ(BJP) ఎంపీనే ఉన్నారని, రాజకీయ నేతలు ఉండకూడదనే నిబంధన ఎక్కడా లేదన్నారు కాకాణి.ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, రెడ్‌క్రాస్ వివాదాస్పదం కాకూడదనే చైర్మన్ పదవికి చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారని, రెడ్ క్రాస్ విలువ పెంచేలా ఆయన వ్యవహరించారన్నారు.‘రెడ్ క్రాస్ హాస్పిటల్ అభివృద్ధి చెందడానికి కారకులు mlc చంద్రశేఖర్ రెడ్డి అని, ఉచితంగా సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ని మంత్రి నారాయణ వాడుకుని సొమ్ము చేసుకోవాలని ూచూస్తున్నారు. మంత్రి నారాయణకి అడ్డుగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని కావాలనే తొలగించారు. రెడ్ క్రాస్ విషయంలో గత కలెక్టర్లకు రాని ఇబ్బంది, ఇప్పుడు కలెక్టర్‌కి ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. రెడ్ క్రాస్ ద్వారా టీడీపీ నేతలే సేవల చెయ్యాలనే ఆలోచనలో కలెక్టర్ ఆనంద్ ఉన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తాం’ అని ఆయన తెలిపారు.వైఎస్సార్సీపీ వారి సభ్యత్వమే రద్దు చేయడం దారుణంరెడ్ ్క్రాస్ సంస్థలో వైఎస్సార్సీపీ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తప్పుబట్టారు. నెల్లూరు రెడ్ క్రాస్‌లో ఐదు వేల మంది సభ్యత్వం ఉంటే వాటిలో 90 శాతం మంది పొలిటికల్ ాపార్టీ వారే ఉన్నారని, కానీ వైఎస్సార్సీపీ వారికి మాత్రమే సభ్యత్వం రద్దు చేయడం ాదారుణమన్నారు. మంత్రి నారాయణకు రెడ్ క్రాస్ మీద అవగాహన లేదని, కాబట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.ఆయన కనీసం ఇందులో సభ్యత్వం కూడా తీసుకోలేదన్నారు. నారాయణ మెడికల్ కాలేజ్ లోకీలకంగా ఉండే విజయ్ కుమార్ అనే వ్యక్తిని రెడ్ క్రాస్ లోమెంబర్గా చేర్చి, దాన్ని నాశనం చేయాలని మంత్రి చూస్తున్నారన్నారు. మంత్రి నారాయణ అనుచరులతో కొత్త బాడీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆనంద్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రశేఖర్‌రెడ్డి. -
టీడీపీలో నారా లోకేష్ బర్త్‌డే చిచ్చు!
అన్నమయ్య, సాక్షి: టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు ఆ పార్టీలో చిచ్చురాజేసింది. తంబళ్లపల్లె టీడీపీలో ఇప్పటికే వర్గపోరు నడుస్తుండగా.. లోకేష్ బర్త్‌డేతో అది రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, సీఎం అంటూ లోకేష్‌పై సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిచ్చును మరింత రాజేశాయి. ఈ క్రమంలో నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఉన్న ఫ్లెక్సీలను చించిపాడేసింది మరో వర్గం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోగా.. కేసు నమోదైంది.ఏం జరిగిందంటే.. తంబళ్లపల్లె టీడీపీలో మాజీ ఎమ్మెల్యే శంకర్(Shankar) వర్సెస్ ఇంఛార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి(dasaripalli Jai Chandrareddy) వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తోంది. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆకర్షించే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బుధవారం రాత్రి శంకర్ వర్గీయులు పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శంకర్ ప్రధాన అనుచరుడు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో..ఇంఛార్జి జైచంద్రారెడ్డి విడిగా తన అనుచరులతో లోకేష్ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అందులో శంకర్‌కు చోటు లేకుండా చూసుకున్నారు కూడా!. అయితే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. చంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది చంద్రారెడ్డి వర్గీయుల పనిగా పురుషోత్తం అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. -
దటీజ్ జగన్..పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల మధ్య ఓ తేడా ఉంది. ఇద్దరూ పోటాపోటీగా రాష్ట్రం చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేస్తూంటారు. జరిగిన ప్రతి మంచిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూంటారు. కారణమేమిటో తెలియదు కానీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచిని అనివార్యంగానైనా గుర్తిస్తున్నారు. ఏదో మాటవరసకు బాబుగారిని పొగుడుతూన్నట్టు కనిపిస్తాడేగానీ పవన్ ఆంతర్యం మొత్తం గత ప్రభుత్వం తాలూకేనని తేలికగానే అర్థమైపోతుంది.పవన్ ఈ మధ్యే కర్నూలు జిల్లా పెన్నాపురం వద్ద ‘గ్రీన్ కో’ సంస్థ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్తు ప్లాంట్లను పరిశీలించారు. వెళ్లకముందు ఆ కంపెనీ అటవీ భూములను ఆక్రమించిందని, విచారించాలని అధికారులకు సూచించారు. కానీ.. ఆ తరువాత మాత్రం ప్రాజెక్టు ఒక అద్భుతమని కొనియాడారు. బహుశా వ్యతిరేక వ్యాఖ్యలు ఎల్లో మీడియా ఈ ప్రాజెక్టుపై రాసిన తప్పుడు కథనాల ఫలితం కావొచ్చు. సుమారు రూ.28 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేసింది అందరికీ తెలిసిందే. అంతెందుకు అప్పట్లో టీడీపీ నేతలు కొందరు ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై విమర్శలు చేసినా జగన్ వాటిని పట్టించుకోలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న కృత నిశ్చయంతో కంపెనీకి అవసరమైన వనరులను సమకూర్చారు. ఈ గ్రీన్ కో కంపెనీలో ముఖ్యుడు చలమలశెట్టి సునీల్ 2024లో వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. ఈ కారణంగా ఆ కంపెనీపై టీడీపీ, జనసేన ముఖ్యనేతలకు గుర్రుగా ఉండేది. ఆ క్రమంలోనే గ్రీన్ కో రిజర్వు ఫారెస్ట్ పరిధిలో అటవీభూముల ఆక్రమణకు పాల్పడిందని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిందని, అటవీశాఖ మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఆరా కూడా తీశారని ఎల్లో మీడియా ఈనాడు ఒక వార్తను రాసింది. గతంలో సునీల్‌కు ప్రజారాజ్యం, టీడీపీ పక్షాలతో కూడా అనుబంధం ఉంది. అయినా గతసారి వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేశారు కాబట్టి ఎలాగోలా ఇబ్బంది పెట్టాలని ఎల్లో మీడియా ప్రయత్నించింది. అందులో భాగంగానే గత మార్చిలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడు పత్రిక ఎంత ఘోరంగా రాసిందో చూడండి..'అస్మదీయుడికి అదిరేటి ఆఫర్" అంటూ సునీల్ కుటుంబ కంపెనీకి భారీ భూ సంతర్పణ చేశారని, అది కూడా ఎకరా రూ.ఐదు లక్షలకే అని ప్రచారం చేసింది. సుమారు 1500 ఎకరాల భూమిని పరిశ్రమకు ఇవ్వడంపై విషం కక్కింది. అక్కడ విలువ రూ.కోటి ఉంటే తక్కువ ధరకు ఇచ్చారని ఏడ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో కొంతకాలం గ్రీన్ కో పై తప్పుడు రాతలు రాసిందని చెప్పవచ్చు. ఉదాహరణకు 2024 జూలై 18 న ఒక కథనాన్ని వారి టీవీలో ప్రసారం చేస్తూ ‘అడవి తల్లికి గాయం’ అని కంపెనీని ఇబ్బంది పెట్టే యత్నం చేసింది. అదే నెలలో అంతకుముందు వారి పత్రికలో కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అని దుర్మార్గంగా రాసింది. ఆ తర్వాత ఏమైందో కాని మొత్తం ప్లేట్ మార్చేసింది. వారి పత్రికలో 'జల కిరణాలు" అనే శీర్షికన ఈ ప్రాజెక్టును ఆకాశానికి ఎత్తేసింది. ఎత్తైన కొండలు, కశ్మీర్ అందాలు తలపించే లోయలు, జల హోయలు, సౌర ఫలకలు, గాలిమరలు, అబ్బుర పరుస్తున్నాయని ఇదే పత్రిక తెలిపింది. ఎండ, నీరు, గాలి ఆధారంగా చేసే విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ లేని విధంగా నిర్మిస్తున్నారని పేర్కొంది.ఆ కంపెనీతో ఈనాడుకు లాలూచీ అయిందా? లేక బుద్ది తెచ్చుకుని వాస్తవాలు రాసే యత్నం చేసిందా? అన్న ప్రశ్నకు ఎవరు జవాబు ఇస్తారు? ఈ ప్రక్రియలో ఎక్కడా జగన్‌కు క్రెడిట్ ఇవ్వకుండా మాత్రం జాగ్రత్తపడింది. పవన్‌కు ఆ కంపెనీ వారితో ఉన్న పరిచయాలు లేదా సంబంధ బాంధవ్యాల రీత్యా ప్రత్యేకంగా అక్కడకు వెళ్లారు. దానిని పూర్తిగా తిలకించిన తర్వాత ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమని మెచ్చుకున్నారు.ఇది పూర్తి అయితే విదేశాలకు కూడా కరెంటు అమ్మవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగాను, మరో 40 వేల మందికి పరోక్షంగాను ఉపాధి వస్తుందని కూడా ఆయన తెలిపారు. ఈ మాట విన్న తర్వాత ‘‘హమ్మయ్యా.. ఇప్పటికే ఏపీలో పలు విధ్వంసాలు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదలి వేసిందిలే!’’ అనే భావన ఏర్పడింది. ఇది జగన్ ప్రభుత్వ కృషి అని పవన్ ప్రశంసించకపోయినా, ప్రజలందరికి అర్థమైపోయింది. జగన్ ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు ఈ రూపు సంతరించుకుందని.. ఆ రకంగా సోషల్ మీడియాలో విస్తారంగా వీడియోలు వచ్చాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లి ఇది ప్రైవేటు స్కూలేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న బల్లలు, కుర్చీలు, డిజిటల్ బోర్డులు అన్నిటిని గమనించిన ఆయన స్కూల్ ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అంతకుముందు లోకేష్ కూడా ఒక స్కూల్ కు వెళ్లినప్పుడు అదే అనుభవం ఎదురైంది. అంటే ప్రతిపకక్షంలో ఉన్నప్పుడు ఎంత విష ప్రచారం చేసినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తరువాతైనా జగన్ చేసిన మంచిని, అభివృద్దిని ఏదో రకంగా ఒప్పుకోక తప్పలేదు. జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలు, గ్రామ, గ్రామాన నిర్మించిన సచివాలయ భవనాలు, పోర్టులు మొదలైన వాటిని అప్పుడు ప్రజలు గుర్తించారో లేదో కాని, ఇప్పుడు కూటమి నేతలు పర్యటించినప్పుడు జనానికి అర్థమవుతున్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తన శైలిలోనే ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తన గొప్పతనమని, వైఎస్సార్సీపీ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శలు చేస్తుంటారు. దావోస్ పర్యటనలో కూడా ఏపీలో నిర్మాణం చేస్తున్న పది ఓడరేవుల గురించి చంద్రబాబు చెప్పక తప్పలేదు. అవన్నీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నారన్నది తెలిసిన సంగతే. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ హరిత ఇంధన హబ్ గా అవుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకుంటే చెప్పుకున్నారు కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. జగన్ తన హయాంలో సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలోకి తీసుకు వచ్చారు. అప్పుడేమో ఎల్లో మీడియా ‘అదానీ వంటి కంపెనీలకు ఏపీని రాసిచ్చేస్తున్నారు’ అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేసింది. భూములను లీజుకు ఇప్పించడాన్ని కూడా తప్పు పట్టింది. ఇప్పుడు అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తోంది. మరి దీనిని ఏమనాలి?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబును పాన్ ఇండియా స్టార్‌ను చేద్దాం!!
దేశంలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్లు..పాన్ ఇండియా క్రికెటర్లు..పాన్ ఇండియా బిజినెస్ మెన్..పాన్ ఇండియా హీరోలు..పాన్ ఇండియా మార్కెట్ ఉన్న నటీనటులు.. ఇదీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అంశం .అయితే పబ్లిసిటీ అంటే పీక కోసుకునే చంద్రబాబుకు కూడా ఇప్పుడు జాతీయస్థాయి లీడర్‌గా ఎదగాలనే పిచ్చి పట్టుకుంది. దేశంలో తన కన్నా సీనియర్ నాయకులు లేరని. మోడీ తదితరులు కూడా తనకన్నా జూనియర్లు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు పబ్లిసిటీతో అయినా సరే మీడియాను కొనేసి అయినా సరే.. లేకుంటే కొత్త పబ్లిసిటీ వ్యవస్థను ఏర్పాటు చేసి అయినా సరే యమర్జంట్‌గా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అవ్వాలని తెగ ఆరాట పడుతున్నారు.ఈ క్రమంలోనే దావోస్ సదస్సుకు చంద్రబాబు లోకేష్ వెళ్లగా దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ప్రచారం చేసే నిమిత్తం ఎన్డీటీవీ.. ఐబీఎన్ వంటి జాతీయ ఇంగ్లీష్ ఛానల్ కు భారీ ఎత్తున డబ్బు గుమ్మరించారు. దీంతో ఆ చానళ్ళు చంద్రబాబు ఆహా ఓహో అంటూ జాకీలు పెట్టి లేపుతున్నాయి.👉చదవండి : భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మాఆ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు వస్తాయన్నది గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే తేటతెల్లమైంది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న ఏటా దావో సదస్సుకు వెళ్లడం.. ఫోటోలు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఒక్క పరిశ్రమ కూడా వచ్చింది లేదు. కానీ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుగుతున్నాయి... అదిగో భారీ పరిశ్రమ.. ఇదిగో వేలల్లో ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టడం అందరికీ తెలిసిందే.వాస్తవానికి చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ, తోపాటు పదుల సంఖ్యలో వెబ్సైట్లు . వందల సంఖ్యలో ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ పేజీలు.. వేలల్లో సోషల్ మీడియా కార్యకర్తలు నిత్యం భజన చేస్తూ ఎలివేషన్లు ఇస్తున్నారు.చంద్రబాబు ప్రస్తుతం ఏం చేస్తానన్నది ప్రజలకు చెప్పారు కానీ వచ్చే పాతికేళ్లు.. రానున్న 50 ఏళ్లలో రాష్ట్రాన్ని అలా మారుస్తా? ఇలా మారుస్తా అంటూ మభ్య పెట్టడం అందరికీ తెలిసిందే. 30 ఏళ్ల కిందట విజన్ 2020 అంటూ కథలు చెప్పారు కానీ ఏమీ చేసింది లేదు. ఇప్పుడు ఏకంగా విజన్ 2047 అంటున్నారు. ఈ కథలన్నీ ప్రజలతో నమ్మించడానికి సరికొత్త ఏజెన్సీ సృష్టించడానికి ప్రభుత్వం పథకం సిద్ధం చేసింది.👉చదవండి : దావోస్ వెళ్దాం.. పబ్లిసిటీ బారెడు.. దక్కేది చెంచాడు!ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు సమాచారం అందించడానికి ప్రభుత్వం తరఫున సమాచార శాఖ ఉండనే ఉన్నది. దీనిలో ఐఏఎస్ అధికారి తో పాటు ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు, జేడీలు, డీడీలు, ఏడీలు, డీపిఆర్ఓ, కేడర్‌లో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్లంతా సరిపోలేదని మరో ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చి చంద్రబాబు కు ఎలివేషన్..జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అంటే ఆ ఏజెన్సీకి ప్రజాధనం ధారవోసి చంద్రబాబుకు పబ్లిసిటీ ఇప్పిస్తారన్నమాట. దీనికోసం కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భారీ ఎత్తున సిబ్బందిని నియమించి వారితో బాబుకి ఎలివేషన్ ఇప్పిస్తారన్నమాట.దీంతోపాటు ఇద్దరు ఉద్యోగులను ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా నియమించి వారికి రూ.లక్షన్నర జీతం ఇవ్వాలని నిర్ణయించారు. వారు చంద్రబాబు పర్యటనకు..సభలు సమావేశాలకు సంబంధించిన వివరాలను మీడియాకు అందజేస్తారు. ఇటు తమ అనుకూల మీడియాకు కోట్లు దారబోస్తూనే ప్రైవేటు ఏజన్సీ ద్వారా కూడా భారీ ఎత్తున పబ్లిసిటీ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మొత్తానికి ఎదైనాగానీ చంద్రబాబు తక్షణం జాతీయ స్థాయి నాయకుడు అయిపోవాలి..అదే టీడీపీ లక్ష్యం. 👉చదవండి : లోకేష్‌కు ఫుల్ ఎలివేషన్.. కాబోయే డిప్యూటీ సీఎం?సిమ్మాదిరప్పన్న -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. హోం మంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాప్‌లు, గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:మహిళలకు భద్రత లేదు: రాష్ట్రంలో మహిళలు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో రోజులు గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇంత దారుణమైన సంఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు. భీమిలి నియోజకవర్గంలో దివ్యాంగురాలైన ఒక మైనర్ బాలికపైన మద్యం తాగిన దుండగుడు అత్యాచారం చేశాడు. అలాగే మరో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి అక్కడ పని చేస్తున్న మహిళలపై దౌర్జన్యం చేశాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాధమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన స్కూల్ లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కేవలం రోజుల వ్యవధిలోనే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉంటే, ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా వీటిని నివారించడంలో విఫలమయ్యారు. మహిళల రక్షణ కోసం ఎటువంటి ప్రత్యేక చర్యలు లేవు.గతంలో జగన్‌గారి ప్రభుత్వంలో తీసుకువచ్చిన దిశ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్తగా ఎటువంటి వ్యవస్థను తీసుకు రాకపోవడం వల్ల నిత్యం మన రాష్ట్రంలో ప్రతి గంటకు రెండుమూడు సంఘటనలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు. దీనికి ప్రధానంగా మద్యం ఏరులై పారుతోంది. 50వేలకు పైగా బెల్ట్‌షాప్‌లు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా వెలిశాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సంబరాల్లో ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాప్‌లు నిర్వహించినా ప్రభుత్వం పట్టించకోలేదు. ఎనీటైం మద్యం లభించే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ మద్యం మత్తులో మందుబాబులు పట్టపగలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన జాతరలో ఎనబై శాతం మద్యం మత్తులో జరిగినవే.మాదక ద్రవ్యాల నియంత్రణలో చర్యలు ఏవీ?గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చెప్పిన హోం మంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోంది. హోం మంత్రి సొంత నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. సాక్షాత్తు స్పీకర్ చెప్పిన మాటల ప్రకారం విశాఖ కేంద్రంగా గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో అసమర్థమైన పాలన జరగుతోంది. మహిళా రక్షణపై నిత్యం హోం మంత్రి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపుంజులతో ఫోటోలు దిగడం, పోలీసుల పహారాలో కోడిపందాలు, బెల్ట్షాపల్ నిర్వాహణ కొనసాగించారు.హోం మంత్రినే స్వయంగా అలా చేస్తే ఇక అసాంఘిక శక్తులకు పట్టపగాలు ఉంటాయా? మరోవైపు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కొకైన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళల గౌరవానికి రక్షణ లేదు. రాష్ట్రంలోని పోలీసులను ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకే వినియోగించుకుంటున్నారు. చివరికి దావోస్ వెళ్ళిన మంత్రి నారా లోకేష్ అక్కడ కూడా తన రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు.దాడుల ఘటనల్లో బాధితులకు భరోసా ఏదీ?:యలమంచిలి ఏటికొప్పాకలో నాలుగేళ్ళ బాలికపై లైంగిక దాడి జరిగితే రాష్ట్ర హోం మంత్రి ఏమైనా స్పందించారా? మీ పక్క నియోజకవర్గం యలమంచిలిలో రాంబిల్లి గ్రామంలో ఒక యువతిని సురేష్ అనే నిందితుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు అయినా, నేటికీ హోమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యతా యుతమైన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ స్పందించి, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారని తెలియగానే హడావుడిగా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అక్కడికి పరుగులు పెడుతుంటారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్ఎక్కడ తమకు చెడ్డపేరు వస్తుందోనని మాత్రమే వారు స్పందిస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్దితో వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధిత కుటుంబాలకు మేం అండగా ఉంటామనే భరోసాను కల్పించలేక పోతున్నారు. ఎంతసేపు రాజకీయాలు చేయడం, ఇసుక, మద్యం ఆదాయాన్ని పంచుకోవడం, సీఎం, డిప్యూటీ సీఎం అంటూ పదవులను పంచుకోవడంపైనే శ్రద్ద కనపరుస్తున్నారు. మధ్యం, మాదక ద్రవ్యాల కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అందుకే వెంటనే రాష్ట్రంలోని బెల్ట్షాప్లన్నింటినీ తొలగించాలని, మద్యం విక్రయాలను నియంత్రించాలని, లేని పక్షంలో బెల్ట్‌షాప్‌లను మహిళలే ధ్వంసం చేస్తారని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలేవి?: మేరుగ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: గిరిజన కుటుంబంపై దాడికి పాల్పడిన అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును తక్షణం అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే దాడితో మనస్థానం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన వైఎస్సార్సీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటిని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, పార్టీ నేతలు దేవినేని అవినాష్, నల్లగట్ల స్వామిదాసు, రాయన భాగ్యలక్ష్మిలతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా భూక్యా చంటి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ..వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ప్రతినిధి బృందం గోపాలపురంలోని భూక్యాం చంటి కుటుంబాన్ని పరామర్శించింది. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అరాచకం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పూర్తిగా అపహాస్యం పాలవుతోంది. రాజ్యాంగ విలువలకు పూర్తిగా తూట్లు పొడిచేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. భూక్యా చంటిపై దాడి దీనికి నిదర్శనం. వారి కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తిని భాగాలుగా విభజించుకునే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జోక్యం చేసుకోవడం, ఆ కుటుంబంలోని వారిపై బూటుకాలితో తన్ని దాడి చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు.ఇదీ చదవండి: కొలికపూడి కలరింగ్ఈ దాడి వల్ల భూక్యా చంటి మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితిని కల్పించారు. ఇటువంటి అరాచకాలు చేసే ఎమ్మెల్యే కొలికపూడి పరిపాలనలో ఏ రకంగా భాగస్వామిగా ఉండటానికి అర్హుడని ప్రశ్నిస్తున్నాం. దీనికి కొలికపూడి బాధ్యత వహించాలి. తక్షణం ఆయనపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడిని ఖండించింది. గిరిజన కుటుంబంపై అత్యంత హేయంగా జరిగిన ఈ దౌర్జన్యంకు కారకుడైన కొలికపూడి శ్రీనివాసరావును అధికార తెలుగుదేశం పార్టీ వెనకేసుకు రావడం దారుణం. క్రమశిక్షణ సంఘం పేరుతో ఆయనను పిలిపించి, ఏదో మందలించామన్నట్లుగా హైడ్రామా సృష్టించారు. నిజంగా చిత్తశుద్ది ఉంటే తక్షణం కొలికపూడి శ్రీనివాసరావుపై చట్ట పరంగా కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచాలి.అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్న ఎమ్మెల్యే: దేవినేని అవినాష్తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నాడని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. సంక్రాంతికి ముందు ఒక ప్రైవేటు స్థలం వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జోక్యం చేసుకుని గోపాలపురం గ్రామంలోని వైయస్ఆర్సీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటి, ఆమె భర్త కృష్ణ, వారి కుమారులపై ప్రత్యక్షంగా దాడిచేసి గాయపరిచిన ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలి.బాధ్యతయుతమైన ఎమ్మెల్యే స్థానంలో ఉన్న నేత ఇటువంటి దాడులకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా? తెలుగుదేశం పార్టీ ఈ ఘటనపై పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న ఆగ్రహంతో క్రమశిక్షణ సంఘం పేరుతో హంగామా చేసి, చేతులు దులుపుకున్నారు. ఈ దాడిని చిత్రీకరించిన భూక్యా చంటి కుమారుడి సెల్ ఫోన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని దానిలోని వీడియోను డిలీట్ చేయడం ఎంత వరకు సమంజసం? గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏనాడు ఇటువంటి దాడులను ప్రోత్సహించలేదు. నేడు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ ఎమ్మెల్యే అరాచకాలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూక్యా చంటి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుంది. -
ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు: కూటమి సర్కార్‌పై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ క్యాడర్‌పై కూటమి దాడులు చేస్తున్నారని.. పరామర్శకు వెళ్లిన తనపై అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు.అక్రమ కేసులు, అరెస్టులతో మా గొంతును నొక్కలేరు. టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తప్పవు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాం. నా పై మరిన్ని కేసులు పెట్టడానికి సీఐడీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కేసులు, అరెస్ట్‌లతో వైఎస్ జగన్ హార్డ్ కోర్ అభిమానులను ఆపలేరు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదాకా పోరాడుతా’’ అని కాకాణి చెప్పారు.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు! -
కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఒక వైపు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలే స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమీషన్ల కోసం బెదిరిస్తూ.. మరోవైపు పెట్టుబడులు (Investments) పెట్టమని ప్రాధేయపడితే, వారెలా ముందుకొస్తారని వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్(Nagarjuna Yadav) సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసమంటూ దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా? అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందన్న నాగార్జునయాదవ్.. రాష్ట్రం విడిచివెళ్లిన సజ్జన్ జిందాల్‌కు క్షమాపణ చెప్పి, ఆ రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.ఏపీ ప్రతిష్టను దిగజార్చారు..దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. కూటమి పార్టీల నాయకుల్లో కమీషన్ల కోసం కొందరు, రాజకీయ ఎత్తుగడలతో మరికొందరు ఏడు నెలల్లోనే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో దావోస్ పర్యటనకు వెళ్లిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్.. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పెట్టుబడుల ప్రవాహం వస్తుందని మోసపు మాటలతో మళ్లీ నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.రాష్ట్రం నుంచి తరిమేశారు..జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.3 లక్షల కోట్లతో మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. వాస్తవానికి ఇదే కంపెనీ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ దాదాపు రెండేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో కడపలో రూ.8800 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చి భూమి పూజ కూడా చేశారు. ఇంకా రాష్ట్రంలో సుమారు రూ.50,500 కోట్ల పెట్టుబడులకు 2022లో 6 ఒప్పందాలు కూడా చేసుకున్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన వ్యక్తిని సాదరంగా ఆహ్వానించకుండా చంద్రబాబు ప్రభుత్వం భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేసింది.కమీషన్ల కోసం బెదిరింపులుముంబైకి చెందిన కాదంబరి జెత్వాని అనే నటిని తీసుకొచ్చి ఆమెతో సజ్జన్ జిందాల్‌పై నిందారోపణలు చేసి, అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధించి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారు. జిందాల్ మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. దాల్మియా గ్రూప్‌నకు చెందిన 11 లారీలను కూటమి నాయకులు కప్పం కట్టలేదని నాశనం చేశారు. మరో పెద్ద సంస్థ అదానీ పోర్టుకి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వయంగా కమీషన్ల కోసం వెళ్లి ఉద్యోగులను బెదిరించి వచ్చాడు. అందుకే ఇకనైనా కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల పెద్దలు తమ వైఖరి మార్చుకోవాలి. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు తరలిపోకుండా చూడాలి.జిందాల్‌కు క్షమాపణలు చెప్పాలిఇంకా కూటమి ప్రభుత్వ తీరు కారణంగా వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌కు క్షమాపణలు చెప్పి రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని, గతంలో ప్రభుత్వంతో ఆయన కుదుర్చుకున్న 6 ఒప్పందాలకు సంబంధించిన రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని నాగార్జునయాదవ్ డిమాండ్ చేశారు. మొత్తం ఈ అస్తవ్యస్త పరిస్థితికి మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని ఆయన తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు! -
తప్పు చేసి కులానికి ఆపాదించడమేంటి?
విజయవాడ, సాక్షి: తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. కుల అహంకారంతో ప్రవర్తిస్తే గనుక మిగతా కులాలు తిరగబడతాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం హితవు పలికారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనమని అన్నారాయన. ఏబీవీ ‘కమ్మ’ వ్యాఖ్యలపై తాజాగా తలశిల రఘురాం మీడియాతో మాట్లాడారు. ఆయన అహంకారం తో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారు. కానీ, కుల అహంకారం తో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయి అని తెలుసుకోవాలి. ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్నాడు. దానికి కమ్మ కులం మొత్తానికి అపాదించడం ఏంటి..?ఏబీ వెంకటేశ్వరరావు భాష అభ్యంతకరంగా ఉంది. కమ్మ అధికారులు అందరూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టింగులు చేపట్టారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌లు ఏనాడూ కులం కోసం పని చెయ్యలేదు. ఇద్దరూ కులాలకు అతీతంగా పాలన చేశారు. చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు ఏబీ వెంకటేశ్వరరావు పై చర్యలు తీసుకోలేదు. కమ్మ కులం ఓట్లేస్తేనే టీడీపీ గెలిచిందా?. ఏబీవీ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించరేం?. లేకుంటే.. పవన్ కూడా కమ్మ కులానికి మద్దతిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తారు అని తలశిల అన్నారు.సంబంధిత వార్త: జగన్‌ను కమ్మవాళ్లు అడ్డుకోవాలి