breaking news
-
కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఒక వైపు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలే స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమీషన్ల కోసం బెదిరిస్తూ.. మరోవైపు పెట్టుబడులు (Investments) పెట్టమని ప్రాధేయపడితే, వారెలా ముందుకొస్తారని వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్(Nagarjuna Yadav) సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసమంటూ దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా? అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందన్న నాగార్జునయాదవ్.. రాష్ట్రం విడిచివెళ్లిన సజ్జన్ జిందాల్‌కు క్షమాపణ చెప్పి, ఆ రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.ఏపీ ప్రతిష్టను దిగజార్చారు..దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. కూటమి పార్టీల నాయకుల్లో కమీషన్ల కోసం కొందరు, రాజకీయ ఎత్తుగడలతో మరికొందరు ఏడు నెలల్లోనే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో దావోస్ పర్యటనకు వెళ్లిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్.. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పెట్టుబడుల ప్రవాహం వస్తుందని మోసపు మాటలతో మళ్లీ నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.రాష్ట్రం నుంచి తరిమేశారు..జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.3 లక్షల కోట్లతో మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. వాస్తవానికి ఇదే కంపెనీ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ దాదాపు రెండేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో కడపలో రూ.8800 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చి భూమి పూజ కూడా చేశారు. ఇంకా రాష్ట్రంలో సుమారు రూ.50,500 కోట్ల పెట్టుబడులకు 2022లో 6 ఒప్పందాలు కూడా చేసుకున్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన వ్యక్తిని సాదరంగా ఆహ్వానించకుండా చంద్రబాబు ప్రభుత్వం భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేసింది.కమీషన్ల కోసం బెదిరింపులుముంబైకి చెందిన కాదంబరి జెత్వాని అనే నటిని తీసుకొచ్చి ఆమెతో సజ్జన్ జిందాల్‌పై నిందారోపణలు చేసి, అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధించి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారు. జిందాల్ మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. దాల్మియా గ్రూప్‌నకు చెందిన 11 లారీలను కూటమి నాయకులు కప్పం కట్టలేదని నాశనం చేశారు. మరో పెద్ద సంస్థ అదానీ పోర్టుకి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వయంగా కమీషన్ల కోసం వెళ్లి ఉద్యోగులను బెదిరించి వచ్చాడు. అందుకే ఇకనైనా కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల పెద్దలు తమ వైఖరి మార్చుకోవాలి. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు తరలిపోకుండా చూడాలి.జిందాల్‌కు క్షమాపణలు చెప్పాలిఇంకా కూటమి ప్రభుత్వ తీరు కారణంగా వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌కు క్షమాపణలు చెప్పి రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని, గతంలో ప్రభుత్వంతో ఆయన కుదుర్చుకున్న 6 ఒప్పందాలకు సంబంధించిన రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని నాగార్జునయాదవ్ డిమాండ్ చేశారు. మొత్తం ఈ అస్తవ్యస్త పరిస్థితికి మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని ఆయన తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు! -
తప్పు చేసి కులానికి ఆపాదించడమేంటి?
విజయవాడ, సాక్షి: తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. కుల అహంకారంతో ప్రవర్తిస్తే గనుక మిగతా కులాలు తిరగబడతాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం హితవు పలికారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనమని అన్నారాయన. ఏబీవీ ‘కమ్మ’ వ్యాఖ్యలపై తాజాగా తలశిల రఘురాం మీడియాతో మాట్లాడారు. ఆయన అహంకారం తో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారు. కానీ, కుల అహంకారం తో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయి అని తెలుసుకోవాలి. ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్నాడు. దానికి కమ్మ కులం మొత్తానికి అపాదించడం ఏంటి..?ఏబీ వెంకటేశ్వరరావు భాష అభ్యంతకరంగా ఉంది. కమ్మ అధికారులు అందరూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టింగులు చేపట్టారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌లు ఏనాడూ కులం కోసం పని చెయ్యలేదు. ఇద్దరూ కులాలకు అతీతంగా పాలన చేశారు. చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు ఏబీ వెంకటేశ్వరరావు పై చర్యలు తీసుకోలేదు. కమ్మ కులం ఓట్లేస్తేనే టీడీపీ గెలిచిందా?. ఏబీవీ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించరేం?. లేకుంటే.. పవన్ కూడా కమ్మ కులానికి మద్దతిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తారు అని తలశిల అన్నారు.సంబంధిత వార్త: జగన్‌ను కమ్మవాళ్లు అడ్డుకోవాలి -
వినుకొండ రషీద్ కుటుంబానికి సర్కార్ వేధింపులు
పల్నాడు, సాక్షి: ప్రతీకార రాజకీయాలతో ఆ కుటుంబం ఇదివరకే ఓ కొడుకును పొగొట్టుకుంది. ఇప్పుడు అదే రాజకీయానికి మరో కొడుకును జైలుపాలు చేసుకుంది. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. రషీద్ సోదరుడితో పాటు ఆ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించింది. వినుకొండ రషీద్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది. రషీద్ హత్య కేసులో న్యాయం అందించకపోగా.. అతని సోదరుడు ఖాదర్ బాషా తో పాటు కొంతమంది వైఎస్సార్సీపీ నేతలపై స్థానిక పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. రెండున్నరేళ్ల క్రితం బుల్లెట్ దహనం ఘటనలో.. మూడు వారాల కిందట కేసు నమోదు చేసి మరీ అరెస్టులు చేశారు వినుకొండ పోలీసులు. అయితే.. రషీద్ హత్య కేసులో ‘పరారీలో ఉన్న నిందితుడి’ ఫిర్యాదు ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. బుల్లెట్ దహనం బదులుగా ఏకంగా ఇల్లు తగలబెట్టారని పేర్కొంటూ కొత్త సెక్షన్ చేర్చి మరీ ఖాదర్ బాషా, ఇతరులను అరెస్ట్ చేయడం గమనార్హం. 2020లో చనిపోయిన సయ్యద్ బాషా పేరును ఈ కేసులో పోలీసులు చేర్చడం ఇంకో కొసమెరుపు. రషీద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వేధిస్తోందని అడ్వొకేట్ ఎంఎం ప్రసాద్ అంటున్నారు. రషీద్ హత్య కేసులో ఈయనే వాదనలు వినిపిస్తున్నారు. ‘రషీద్ హత్య కేసులో ఆరో నిందితుడు షేక్ జానీ బాషాను ఇంతదాకా అరెస్టు చేయలేదు. ఇంతలోపు.. 2022లో జరిగిన ఘటన ఆధారంగా అదే షేక్ జానీ బాషా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రషీద్ సోదరుడు ఖాదర్ బాషాను ఈ కేసులో అక్రమ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారు. అలాగే.. ఈ కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారు’’ అని ఎంఎం ప్రసాద్ అంటున్నారు..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ పల్నాడ్ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ళ మాధవి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పోలీసుల అక్రమ కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ నేత రషీదును హత్య చేస్తే.. ఆయన సోదరుడ్ని అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. తన తమ్ముడి కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఖాదర్ భాషాను అక్రమ కేసు బనాయించి జైలుకు పంపడం దారుణం. ఇది కూటమి ప్రభుత్వం కాదు కుతంత్రాల ప్రభుత్వం. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు అక్రమార్కులకు వంతపలుకుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని మండిపడ్డారు. ఒక కొడుకును నడిరోడ్డు పైన చంపేశారు మరొక కొడుకును అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఇది ప్రభుత్వమే నా?. రషీద్ హత్య కేసులో ఇప్పటికీ కొంతమందిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఫిర్యాదు ఇచ్చాడని అక్రమ కేసు నమోదు చేసి నా పెద్ద కొడుకును జైలుకు పంపారు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఎక్కడున్నాడు?. పోలీసులేమో జానీ బాషా పారిపోయాడని చెప్తున్నాడు. మరి అందరూ చూస్తుండగానే ఆయన చంద్రబాబును కలుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నా కొడుకుని జైలుకు పంపి మమ్మల్ని వేధిస్తోంది. ::రషీద్ తల్లి శంషాద్ ఆవేదన -
బాబు పబ్లిసిటీకి వందల కోట్లు..! కొత్త ఏజెన్సీకి టెండర్లు
సాక్షి,విజయవాడ:చంద్రబాబు పబ్లిసిటీ కోసం కొత్త ఏజెన్సీని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వందల కోట్లతో పబ్లిసిటీ చేసుకోవాలని సీఎం చంద్రబాబు డిసైడయ్యారు. దీంతో ప్రచారం తారాస్థాయికి వెళ్లడానికి కొత్త ఏజెన్సీ కావాలని ప్రభుత్వం భావించింది. తాజాగా న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ కోసం టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది.ఇప్పటికే సమాచార శాఖ ఉండగా మరో పబ్లిసిటీ ఏజెన్సీ ప్రభుత్వం తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడున్న పబ్లిసిటీ సరిపోకపోవడం వల్లే కొత్త ఏజెన్సీని ఆహ్వానించినట్లు ప్రభుత్వం చెబుతోంది.పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ చెయ్యాలని డిసైడయ్యారు.ఇక నుంచి పబ్లిసిటీ కంటెంట్,ప్రకటనలు అన్ని పత్రికలు,మీడియా,సోషల్ మీడియాకు ప్రభుత్వం ఏజెన్సీ ద్వారానే ఇవ్వనున్నారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చెయ్యడంపై సమాచారశాఖ అధికారులే విస్తుపోతుండడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు -
ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు!
ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పెద్ద స్థాయి వారు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? ప్రజలకు ఎలాంటి మేలు చేయాలి? ఇచ్చిన వాగ్ధానాల అమలు ఎలా? ఆ క్రమంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడం ఎలా? వంటివని మనం అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటీవల అమరావతికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమ భవనంలో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు కూడా హాజరైన ఈ సమావేశంలో వాళ్లు మాట్లాడుకున్న విషయాలు తెలిస్తే సామాన్యులు విస్తు పోవాల్సిందే. తెలుగుదేశం మీడియా చెప్పిన దాని ప్రకారమే.. ఈ సమావేశంలో ప్రధాన చర్చ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న భవనాలపై సాగింది! అంత పెద్ద నేతలు ఇంత చీప్‌గా టైమ్‌పాస్ మాటలు మాట్లాడుకుంటారా? అబద్ధాల ముచ్చట్లు పెట్టుకుంటారా?. జగన్ భవనాల గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటన్న అనుమానం మీకూ రావచ్చు. అయితే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా జగన్‌పై బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న పచ్చ బ్యాచ్‌కు మాత్రం ఈ సందేహం రాలేదు. అందుకే టీడీపీ జాకీ మీడియా ఆ సొల్లు పురాణాన్ని పతాక శీర్షికలకు ఎక్కించి సంతోషించింది. ‘‘జగన్ జల్సా భవన్లు’’లపై ఆరా తీసిన అమిత్ షా అంటూ ఆనందపడింది. టీడీసీ,జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చి ఏడున్నర నెలలు కావస్తున్నా ఈ పచ్చ మూక జగన్‌పై విమర్శలు మినహా సాధించిందేమీ లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూటమి పెద్దలు ఇలా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నివాసాన్ని చూస్తూ, ‘‘నది పక్కన మీ ఇల్లు చాలా బాగుంది’’ అని అమిత్ షా మెచ్చుకున్నారట. పనిలో పనిగా జగన్ పాలెస్ల గురించి ఆరా తీసినట్లు తెలిసిందని ఈ జాకీ మీడియా రాసింది. అది చూస్తే ఒకటి మాత్రం స్పష్టం అవుతుంది. అమిత్ షా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి గురించి అడిగి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అది అక్కడ టాపిక్ కాదు. కానీ.. విజయవాడలో ప్రకృతి వైపరీత్యానికి కారణమైన చంద్రబాబు ఇంటి గురించి హోం మంత్రి అడిగారన్న సమాచారమే బయటకు వెళితే అది తమకు ఇబ్బంది అవుతుంది కనుక టీడీపీ నేతలు పనిగట్టుకుని ఇలా అబద్ధాలు ప్రచారం చేసి ఉండాలి. హైదరాబాద్‌లో జగన్‌కు వంద గదలు ప్యాలెస్ ఉందని టీడీపీ నేతలు చెబితే అమిత్ షా చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారన్నమాట!. ఈ సోది రాసిన పత్రిక వారికి నిజం తెలియదా? నాలుగు బెడ్ రూమ్‌ల ఇల్లు ఉంటే వంద రూమ్లని వీళ్లు రాస్తారా? కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇంత చెత్తగా వార్తా కథనాలు ఇచ్చి పాఠకులను మోసం చేస్తారా?. జగన్ ఇంటి గురించి నిజంగానే సమాచారం కావాలంటే నిమిషాలలో తెప్పించుకునే శక్తి అమిత్ షా కు ఉండదా? బెంగుళూరులో ఇల్లు ఉంది, తాడేపల్లిలో ఇల్లు ఉందని చెప్పారట. ఈ రోజుల్లో కాస్త మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలవారు సైతం ఆయా ముఖ్యమైన నగరాలలో రెండు, మూడు ఇళ్లు కలిగి ఉంటున్నారు. అందులోను హైదరాబాద్‌తోపాటు ఏపీలోని సొంత ప్రాంతంలో కూడా ఇళ్లు ఉంటాయి. దానిని భూతద్దంలో చూపి జగన్ పై దుష్ప్రచారం చేయడానికి వీరు చూపిన శ్రద్ద రాష్ట్ర సమస్యలను వివరించడంపై పెట్టి ఉంటే బాగుండేది. పోనీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు హైదరాబాద్ లో ఇళ్లు లేవా? ఏపీలోని అమరావతి ప్రాంతంలో ఇళ్లు లేవా? అవి ఎంత భారీగా ఉన్నాయో తెలియదా? అవి ప్యాలెస్‌లు కాదా? కృష్ణ కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉండడం లేదా? ఆ ప్యాలెస్ ప్రభుత్వానిది అని ఒకసారి, లింగమనేని రమేష్ ది అని మరోసారి మాటలు మార్చలేదా? ఆ ఇల్లు మునిగిపోకుండా చూడడానికి బుడమేరు లాకులను ఎత్తివేసిన ఫలితంగానే విజయవాడ మునిగిందన్న సంగతి నిజం కాదా? హోం మంత్రి అమిత్ షా కు పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాల నివారణలపై ఏమాత్రం శ్రద్ద ఉన్నా ముందుగా చేయవలసిన పని ఏమిటి? చంద్రబాబు కృష్ణానది ఒడ్డున కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించిన కట్టిన ఇంటిలో ఎలా ఉంటున్నావని హోం మంత్రి ప్రశ్నించాలి కదా? ఆ పని చేయలేదా? చేసినా దాని గురించి ప్రచారం చేయకుండా జగన్ పై కట్టుకధలు వ్యాప్తిలోకి తెచ్చారా? చంద్రబాబుకు జూబ్లిహిల్స్ లో ఉన్నది ఎంత పెద్ద పాలెస్సో ఆ రోడ్డులోకి వెళ్లి చూసిన వారందరికి తెలుస్తుంది. ఆ భవన నిర్మాణానికి ఏ,ఏ దేశాల నుంచి వస్తువులు తెప్పించింది ఆ రోజుల్లో పలు వార్తలు వచ్చాయి కదా? అయినా ఆయన చాలా సింపుల్ గా ఉన్నట్లు అనుకోవాలి. తాజాగా.. అమరావతి సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్నారని చెబుతున్నారు కదా. ఇది కాకుండా కుప్పంలో కూడా గృహ నిర్మాణం చేస్తున్నారు కదా? వీటి గురించి ఏమి చెబుతారు? ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేత వైఎస్ జగన్. అంతేకాదు. సతీసమేతంగా పూర్తిగా అక్కడే నివసిస్తున్న నేత కూడా ఆయనే. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు పూర్తిగా అక్కడే ఉంటున్నారా? చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే నివసిస్తుంటారు కదా! ఇది తప్పని చెప్పడం లేదు. కాని ఎదుటి వ్యక్తిమీద మాత్రం బురద వేసి సంతోషపడుతుండడమే దారుణమనిపిస్తుంది. అమిత్ షా కు మరో విషయం గుర్తుకు రాలేదా? ఈ మధ్య కాలంలో ఏడిఆర్ నివేదిక ఒకటి వచ్చింది కదా? అందులో చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తితో అత్యంత ధనికుడైన సీఎం అని వెల్లడైంది కదా? దానిపై హోం మంత్రి వివరాలు తెలుసుకునే యత్నం చేయలేదా? ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును ఉద్దేశించి అవినీతిపరుడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు కదా! మళ్లీ పొత్తు కుదరగానే నీతిమంతుడు అయిపోయారా? అలాగే చంద్రబాబు కూడా వీరిద్దరిని ఎన్ని మాటలు అన్నారు. జనం ఇవేవి గుర్తుకు తెచ్చుకోరాదన్న ఉద్దేశంతో జగన్ పై డైవర్ట్ చేస్తుంటారు.అమిత్ షా మరుసటి రోజు ఎన్డీఆర్ఎఫ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏపీకి మూడు లక్షల కోట్ల రూపాయల మేర కేంద్రం సాయం చేసిందని ప్రకటించారు. అది నిజమా? కాదా? దానిని ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి కాస్త మార్చి రాశాయి. ఏపీకి మూడులక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా అన్నట్లు ఈనాడు మార్చేసింది. హిందూ పత్రికలో మాత్రం మూడు లక్షల కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం రూ.15 వేల కోట్ల గ్రాంట్ ఇచ్చారని చంద్రబాబు తన ప్రసంగంలో చెబితే, అమిత్ షా మాత్రం దానిని రుణంగానే చెప్పారన్న సంగతి తెలుస్తుంది. హడ్కో, వరల్డ్ బ్యాంకు ద్వారా రూ.27 వేల కోట్ల రుణం ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. వక్రీకరించి వార్తలు రాసి పాఠకులను టీడీపీ జాకీ మీడియా మోసం చేస్తోందని పదే,పదే రుజువు చేసుకుంటున్నాయి. కేంద్రం నిజంగానే రూ.మూడు లక్షల కోట్లు సాయం చేసి ఉంటే ఆ డబ్బంతా ఏమైపోయిందో అర్థం కాదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు ఏమీ చేపట్టకుండా ఆ నిధులు ఎటు మళ్లిస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఇవి చాలక ఇప్పటికే రూ.70 వేల కోట్ల అప్పులు తీసుకు వచ్చారు. కరెంటు ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల మేర బాదారు. ఈ విషయాల గురించి కానీ విభజన హామీల గురించి ప్రస్తావించకుండా అమిత్ షా భజన చేయడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అధిక సమయం కేటాయించినట్లు ఉంది. కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డామని, ఇప్పటికీ పేషంటే అని చంద్రబాబు చెబుతున్నారు. యథాప్రకారం రూ.పది లక్షల కోట్ల అప్పు అని అదని, ఇదని గత ప్రభుత్వానికి సంబంధించి అబద్దాలు చెప్పి అమిత్ షాను మోసం చేస్తే ఏమి లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగైతే సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో తెలపాలి కదా! అమిత్ షా తో తమ సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళిక హామీల అమలు తీరు గురించి మాత్రం చర్చించలేదు. జగన్ ఇళ్ల గురించి ఇంత కీలక నేతలు మాట్లాడుకున్నారంటే ప్రజల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలియడం లేదా! పోచికోలు కబుర్లు చెప్పుకోవడానికి వీరికి ఇంత ఖాళీ టైమ్ ఉంటుందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘కూటమి ప్రభుత్వంలో బీజేపీ స్థాయి ఇదేనా?’
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. రాష్ట్రంలో.. అందునా కూటమిలో పార్టీ పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత అంబికా కృష్ణ(Ambika Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీని మిగతా పార్టీల పెద్దలు పట్టించకోవడం లేదని, ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన జెండాలే కనిపిస్తున్నాయిన ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ‘‘కూటమి ప్రభుత్వంలో బీజేపీ(BJP) ప్రతీ కార్యకర్త బాధపడుతున్నారు. తమకు సరైన గుర్తింపు లేదనుకుంటున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తేనే 164సీట్లు వచ్చాయి. మేమందరం తిరిగితేనే కదా కూటమి గెలిచింది. కానీ, ఇప్పుడు ఎక్కడా జనసేన, టీడీపీ జెండాలు కనబడుతున్నాయి తప్ప బీజేపీ జెండాలు కనబడటం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఏపీ బీజేపీ నేతలకు ఆహ్వానించడం లేదు. ఆఖరికి.. రోడ్లు ఓపెనింగ్ కార్యక్రమాలు జరిగిన పిలవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ సైతం మెమరాండం ఇచ్చాము.. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వ వ్యవహార శైలితో బీజేపీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. మోదీ పథకాలు డబ్బు ద్వారానే రాష్ట్రం నడుస్తోంది. ప్రధానిమోడీ ఇచ్చే డబ్బులు వాడుకుంటూ బీజేపీ నేతలను కార్యక్రమాలకు ఎందుకు పిలవరు.?.. అని అంబికా కృష్ణ నిలదీశారు. తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. సమీక్షా సమావేశంలో బీజేపీ నేతలకు కీలక సూచనలు చేశారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ఇది జరిగి మూడు రోజులు కాకముందే.. ఈ వ్యాఖ్యలు తెరపైకి రావడం గమనార్హం. -
సంజయ్‌పై కక్ష సాధింపు చర్యలు.. రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారమే!
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధికారి, గత సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్‌పై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సర్కార్.. ఇప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణల విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాల్లో ఉంది. ఒకవైపు ఆయన న్యాయపోరాటం చేస్తున్నవేళ.. మరోవైపు విచారణకు రావాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్‌గా సంజయ్(Sanjay) వ్యవహరించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడి స్కిల్ స్కాం కేసు దర్యాప్తు ఈయన పర్యవేక్షణలోనే జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారంలో భాగంగానే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా.. 30 రోజుల్లో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని.. స్పందించకపోతే చర్యలు తీసుకుంటామంటూ నోటీసులో హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్సాక్షి, అమరావతి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి, గత సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్(Subramanyam Sriram)వాదనలు వినిపిస్తూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వివరించారు. ప్రభుత్వం మారిన వెంటనే తనను దురుద్దేశపూర్వకంగా ఈ తప్పుడు కేసులో ఇరికించారని తెలిపారు. అగ్ని యాప్ తయారీలో అక్రమాలు జరిగాయని ఏసీబీ చెబుతోందని, వాస్తవానికి ఆ యాప్ పనితీరుకు టెక్నాలజీ సభ అవార్డు సైతం ప్రదానం చేసిందన్నారు. యాప్ తయారీకి నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచామని, అందులో లోయస్ట్ బిడ్డర్ అయిన సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు అగ్నిమాపక శాఖ పనులు అప్పగించిందన్నారు. ఆ వెంటనే పనులు ప్రారంభించిన సౌత్రికా, యాప్ తయారీని సకాలంలో పూర్తి చేసిందని తెలిపారు. అగ్ని యాప్ తయారీ పూర్తయి, దాని పనితీరు సంతృప్తికరంగా ఉన్న తరువాతే నగదు విడుదల చేశారని పేర్కొన్నారు. పైగా.. మార్కెట్ ధరకంటే 5 శాతం తక్కువకే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే, ఏసీబీ మాత్రం హడావుడిగా డబ్బు చెల్లించామంటూ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో సంజయ్ లబ్ధి పొందారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చాల్సి ఉందని, అందువల్ల సంజయ్‌ని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ముందస్తు బెయిల్(Anticipatory Bail)ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
టీడీపీలో సీనియర్లకు పొగ!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ పార్టీలోని సీనియర్లకు పొగ పెడుతున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీలోని సీనియర్లను బయటకు పంపేసి, పూర్తిగా తన మనుషులతో నింపేందుకు లోకేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా తలొగ్గడంతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేతలకు గడ్డుకాలం వచ్చింది. సీనియర్ల వల్ల ఎటువంటి ఉపయోగంలేదని, పార్టీకి భారమన్న ముద్ర వేసి వారిని బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల్లో ఉన్న పలువురు సీనియర్ నేతలకు త్వరలోనే ఉద్వాసన పలుకుతారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), గంటి హరీష్ మాధుర్, దీపక్‌రెడ్డి వంటి వారికి లోకేశ్ టీంగా పార్టీలో కీలక పదవులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.పార్టీపై లోకేశ్ పట్టు బిగిస్తుండటంతో చాలా కాలం నుంచి సీనియర్ల హవా తగ్గిపోయింది. లోకేశ్ అండదండలున్న నేతలు, ఆయనకు నచ్చిన వారికే పార్టీలో అవకాశాలు దక్కుతున్నాయి. చంద్రబాబు కూడా కుమారుడి మాట కాదనలేని పరిస్థితులు ఏర్పడ్డాయని సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కూడా చాలావరకు లోకేశ్ అభీష్టం మేరకే జరిగినట్లు నేతలు చెబుతున్నారు. కాసులిచ్చిన వారికే సీట్లు దక్కాయని అప్పట్లో అనేక మంది నేతలు గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన మంత్రివర్గంలోనూ లోకేశ్ చెప్పిన వారికే చోటు దక్కింది. మంత్రి పదవులు ఖాయమనుకున్న అనేక మంది సీనియర్లను పక్కన పెట్టి తనకు నచ్చిన వారికి, తనతో లావాదేవీలు జరిపిన వారికే లోకేశ్ మంత్రి పదవులు ఇప్పించారనే ఆరోపణలు వచ్చాయి. లోకేశ్ చేతిలోకి పొలిట్‌బ్యూరో!ఇప్పుడు పార్టీలోనూ అదే తరహా నియామకాలకు రంగం సిద్ధౖమైనట్లు తెలుస్తోంది. పార్టీలో అత్యంత కీలకమైన పొలిట్‌బ్యూరోను చేతుల్లోకి తీసుకోవడానికి లోకేశ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పొలిట్‌బ్యూరో మొత్తాన్ని తన మనుషులతో నింపాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో సీనియర్ నాయకులైన యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి అత్యంత సీనియర్లు ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీరెవరికీ సరైన ప్రాధాన్యం దక్కలేదు. చంద్రబాబు తర్వాత ఆ స్థాయి నేతగా ఉన్న యనమల రామకృష్ణుడికి ఇటీవల పార్టీలో చెప్పుకోలేని అవమానాలు ఎదురయ్యాయి. కళా వెంకట్రావుకి ఎమ్మెల్యే సీటు నిరాకరించి, చివరికి వేరే చోట సర్దుబాటు చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి వారిని పక్కన పెట్టేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కింజరాపు అచ్చెన్నాయుడికి ఇప్పుడు పార్టీలో సరైన స్థానం లేదు. పేరుకి మంత్రిగా ఉన్నా ఆయనకున్న ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. అన్ని జిల్లాల్లోనూ సీనియర్ నాయకులను కాదని కొత్తగా లోకేశ్‌కు దగ్గరైన వారికే పెత్తనం అప్పగించారు. గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, నిమ్మకాయల చినరాజప్ప వంటి వారిని సైతం నియోజకవర్గాలకే పరిమితం చేశారు. వీరంతా గతంలో పార్టీలో చక్రం తిప్పినవారే. అలాంటి వారందరినీ పూర్తిగా పక్కకు తప్పించి పొలిట్‌బ్యూరోలో, ఇతర కమిటీల్లోనూ తనకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకోవడానికి లోకేశ్ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. చంద్రబాబు కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.ఒకటే పదవి ఉండేలా..ఈ క్రమంలోనే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఒక చోటే బాధ్యత ఉండేలా చూసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ పదవులు ఉన్న వారికి ప్రభుత్వ పదవులు ఉండవని, ప్రభుత్వ పదవులు ఉన్న వారికి పార్టీలో పదవులు ఉండకుండా చూసే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇచ్చిన పదవులను కూడా రెండేళ్లకు మాత్రమే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఇదంతా పార్టీపై లోకేశ్ పూర్తిగా పట్టు సాధించేందుకు వేస్తున్న ఎత్తుగడలేనని సీనియర్లు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్లు, ముఖ్య నాయకులకు ఇక మీదట ఇబ్బందులు తప్పవని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. -
భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మా
ఆగండ్రా బాబు.. అసలే అయన తిక్కలోడు.. ఏ క్షణానికి కండువా విసిరేసి వెళ్ళిపోతాడో తెలీదు.. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి.. వచ్చి ఏడాది కూడా కాలేదు ఇప్పుడే మీరు చినబాబు డిప్యూటీ సీఎం .. చినబాబు డిప్యూటీ సీఎం అని కేకలు వేయకండి.. కొన్నాళ్ళు ఆగండి .. పరిస్థితులు చిన్నగా సర్దుకున్నాక అన్నీ చేద్దాం.. ముందే గాయిగాత్తర చేయకండి. అసలే తిక్కలోడికి ఢిల్లీ సపోర్ట్ ఉంది.. వాళ్ళ సపోర్ట్ టోన్ మనం గెలిచాం.. అప్పుడే అల్లరల్లరి చేస్తే లేనిపోని బాధలు. కొన్నాళ్ళు సైలెంట్ ఉండండి అని తెలుగుదేశం అధిష్టానం పార్టీ వీరవిధేయులైన ఎమ్మెల్యేలు.. ఇతర నాయకులకు సూచించింది.వాస్తవానికి ఇది అధిష్టానానికి తెలిసి.. చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోందో..లోకేష్ పట్ల భక్తిభావం పెల్లుబికి.. దాన్ని అణచుకోలేక అంటున్నారో తెలియదు కానీ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అర్జంట్ గా లోకేష్ ను డిప్యూటీ చీఫ్ మినిష్టర్ గా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఆఖరుకు పవన్ కళ్యాణ్ గెలుపులో కీలకపాత్ర పోషించిన పిఠాపురం వర్మ కూడా అదే రాగం ఎత్తుకున్నారు. ఇది గత రెండు నెలలుగా ఉధృతంగా సాగింది. ఐతే ఇన్నాళ్లుగా ఆ భజనను చూస్తూ ఊరుకున్న జనసైనికులు గత కొద్దిరోజులుగా నోరువిప్పుతూ సోషల్ మీడియాలో టీడీపీ మీద కౌంటర్లు వేస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ ఇవ్వండి ఫర్లేదు కానీ అదే టైములో పవన్‌కు సీఎంగా బాధ్యతలు ఇవ్వండి.. అప్పుడు ఎవరికీ అభ్యంతరం లేదు.. అంతేకానీ పవన్‌ను డిప్యూటీ సీఎంగా ఉంచుతూ మళ్ళీ లోకేష్‌కు అదే హోదా ఇస్తేమాత్రం గొడవలైపోతాయి అన్నట్లుగా పోస్టింగులు పెడుతున్నారు. ఈ జనసైనికులను పవన్ సైతం నియంత్రించలేదు. మరోవైపు బీజేపీతో పొత్తు.. జనసేనలో సీట్ల సర్దుబాటు వంటివన్నీ పవన్ దగ్గరుండి మరీ కుదిర్చారు. పవన్ లేకపోతె మొన్న తెలుగుదేశం గెలుపు అసాధ్యం అనేది అందరికి తెలిసిందే అలాంటపుడు మా పవన్‌ను కాదని వేరే వాళ్లకు.. అదే లోకేష్‌కు ఎలా డిప్యూటీ ఇస్తారు అనేది జనసేన వాదన. దీంతోబాటు కేంద్రం సైతం పవన్ తోబాటు ఇంకో డిప్యూటీ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మొన్న అమిత్ షా వచ్చినపుడు సైతం లోకేష్ కు డిప్యూటీ ఇచ్చే అంశం ప్రస్తావనకు రాగా అయన తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో కేంద్రం దన్ను సంపూర్ణంగా ఉన్న పవన్ తో గొడవ ఎందుకు.. అందాకా సైలెంట్ గా ఉండండి అని తెలుగుదేశం తన క్యాడరుకు ఒక మెసేజ్ పంపింది.ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికారికంగా పార్టీ శ్రేణులకు ఒక సందేశం పంపింది. ఇకముందు ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ డిమాండ్లు చేయకండి. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టకండి అంటూ గేటు వేసింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అధికారం రుచి మరిగిన నేపథ్యంలో ఆయన్ను ఇబ్బంది పెట్టి. ఇరిటేట్ చేసేలా ఏదీ చేయొద్దని.. అలాగైతే కూటమిలో చిచ్చు రేగుతుందని చంద్రబాబు గ్రహించి క్యాడర్‌ను నియంత్రించినట్లు చెబుతున్నారు. నాక్కొంచెం తిక్కుంది.. దానికి ఓ లెక్కుంది అనే పవన్ కు తిక్కరేగకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారన్నమాట. --సిమ్మాదిరప్పన్న -
పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన.. నున్న, సూరంపల్లిలో జగనన్న కాలనీలను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గృహ యజమానులు తెలిపారు.నిరుపేదల సొంతింటి కల సాకారం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీల పేరుతో ఏకంగా మినీ సిటీలనే నిర్మించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31.70 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. సెంట్రల్ నియోజకవర్గంలో 23,490 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించాం. తొలిదశలో 14,986 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. 2,712 ఇళ్లు పూర్తి అయ్యాయి. మరో 2 వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్లన్నింటినీ పాడుబెడుతోంది.’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు.‘‘పైగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇస్తామని కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. అమరావతిలో పేదలెవరు ఉండకూడదనే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని 8,504 మంది పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించాం.ఇదీ చదవండి: కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?..కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్దాక్షిణ్యంగా నిర్మాణాలను నిలిపివేసింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, మరోవైపు అద్దెల భారంతో లబ్ధిదారులు ఆర్థిక వెతలను ఎదుర్కొంటున్నారు. తక్షణమే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలి. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి. లేనిపక్షంలో పేదల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుంది’’ అని మల్లాది విష్ణు తెలిపారు. -
కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుతోందా? టీడీపీ వర్గాల్లో కొందరు మంత్రి లోకేష్ భావి సీఎం అంటుంటే.. డిప్యూటీ సీఎం అని మరికొందరు వ్యాఖ్యలు చేయడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు పదవుల్లో ఏది దక్కినా.. ఇప్పటివరకూ కూటమి భాగస్వామి, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోదాకు భంగం కలిగినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీతో కొనసాగితే పవన్ ఎప్పటికీ సీఎం కాలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ నేతను అడ్డుకునేందుకే టీడీపీ లోకేష్‌ను తెరపైకి తెచ్చిందన్న ఆలోచన కూడా జనసేనలో ఉన్నట్లు చెబుతున్నారు.తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పదోన్నతిపై దావోస్ పర్యటన సందర్భంగా చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే చాలని టీడీపీ నేతలు పలువురు బహిరంగంగా కోరుతూంటే.. వీలైనంత తొందరగా సీఎంను చేయాలని చంద్రబాబు నాయుడిపై ఆయన కుటుంబం నుంచే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ చాలా స్పష్టంగా భావి ముఖ్యమంత్రి లోకేష్ అని ప్రకటించగా టీడీపీ నేతలు మాత్రం ఏదైనా ఉంటే కూటమి పక్షాలతో కలిసి మాట్లాడుకుంటామని అంటున్నారు. భరత్ ప్రకటన ఏదో మొక్కుబడి వ్యవహారమని అంటున్నారే కానీ.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసే ప్రతిపాదన ఏదీ లేదని మాత్రం వారు ఖండించకపోవడం గమనార్హం.కొద్దికాలం క్రితం పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ మరో పదేళ్లపాటు చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. లోకేష్‌కు చెక్ పెట్టేందుకు ఆయన ఆ మాట మాట్లాడారా? లేక చంద్రబాబే కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు పవన్ చేత అలా మాట్లాడించారా? అన్నది చెప్పలేము. ఎందుకంటే.. సీఎం పదవిని ఇప్పుడిప్పుడే వదులుకునే ఆలోచన బాబు చేయరు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తే జనసేన నుంచి సమస్యలు రావచ్చునని కూడా బాబుకు తెలుసు. అందుకే ఆయన మధ్యే మార్గంగా ప్రస్తుతానికి లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చు. కాకపోతే ఈ ప్రతిపాదనకు లోకేష్ మద్దతుదారులు, బాబుగారి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాలి.నారా లోకేష్‌కు పదోన్నతిపై ప్రచారం మొదలుపెట్టడం ఒక రకంగా రాజకీయ వ్యూహం. ఇతరుల ద్వారా కొన్ని అంశాలను ప్రచారంలో పెట్టడం.. వ్యతిరేకించే వారిని మానసికంగా సిద్ధం చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. అంగీకరించేవారు ఉండవచ్చు లేనివారు వారి దోవన వారు వెళ్లవచ్చునని సంకేతం ఇవ్వడం కూడా. ఇలాంటి విషయాలలో చంద్రబాబుది ఘనాపాటే. గతంలో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేయడానికి ముందు కూడా ఇలాంటి వ్యూహాన్నే ఆయన అమలు చేశారు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిపై దుష్ప్రచారం చేయించడం, ఆమె పెత్తనం పెరిగిపోవడం వల్ల పార్టీకి నష్టమంటూ వంత మీడియా ఈనాడులో కథనాలు రాయించడం చేసేవారు. ఆ టైమ్‌లోనే అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష్మీపార్వతిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.దీంతో, చంద్రబాబు వర్గం ఈ పాయింట్‌ను అడ్డం పెట్టుకుని కథ నడిపింది. అదే జరిగితే మీ పరిస్థితి ఏమిటన్న ఆందోళనను ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కల్పించడంతోపాటు వారిని తనవైపు తిప్పుకునేందుకు వరాల జల్లు కురిపించారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ చూపారు. పార్టీ అధ్యక్ష పదవిని ఎన్టీఆర్ పెద్దకుమారుడు హరికృష్ణకు ఎరవేశారు. మొత్తమ్మీద ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేశారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే వర్గపోరు వస్తుందని, కుటుంబ పెత్తనం అంటారని ప్రచారం చేయించారు. దగ్గుబాటికి డిప్యూటీ సీఎం, హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి రెండూ దక్కకుండా చూశారు. హరికృష్ణకు మంత్రి పదవి మాత్రమే విదిల్చారు.అయితే మంత్రి పదవి వచ్చేటప్పటికి హరికృష్ణ ఎమ్మెల్యే కాదు. ఆరునెలల్లోపు ఎన్నికై ఉంటే పదవి దక్కేది కానీ.. కాలేకపోయారు. దీంతో మంత్రి పదవి కూడా పోయింది. తరువాతి కాలంలో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైనా హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాబు మార్కు రాజకీయం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గాన్ని నడిపిన చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వర్గాలను సహించనంటూ హెచ్చరికలు చేస్తుండే వారు. ఇప్పటికీ అదే తరహా రాజకీయం చేస్తున్నారు. నిజంగానే లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా లేకపోతే, ప్రకటనలు చేస్తున్న టీడీపీ నేతలను వారించే వారు. కానీ, పార్టీ నేత శ్రీనివాసరెడ్డి ఆయన సమక్షంలోనే లోకేష్ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, ఎన్నికలలో చాలా కష్టపడ్డారని, అందువల్ల ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. చంద్రబాబు దీన్ని వారించలేదు.ఇదే సమయంలో మరికొందరు టీడీపీ నేతలు దాన్ని ఒక డిమాండ్‌గా మార్చారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ లోకేష్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడం కూడా గమనించాలి. పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవని తేలుతుంది. లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించినట్లవుతుందని తెలిసినా కూడా వీరంతా ఇలా మాట్లాడుతున్నారంటే అందులో మతలబు అర్థమవుతూనే ఉంది.మరోవైపు లోకేష్ కూడా తన పార్టీ నేతల ప్రకటనలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నా, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అతిగా వ్యవహరిస్తున్నారన్న భావనతో ఉప ముఖ్యమంత్రి పదవి కోరుకుంటుండవచ్చు. లోకేష్, పవన్ కళ్యాణ్‌ల మధ్య ప్రచ్ఛన్న పోటీకి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ ఇరువురి మధ్య సంబంధాలు గొప్పగా ఏమీ లేవని స్పష్టం చేశాయి. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ చెబితే లోకేష్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తోసిపుచ్చడం.. ఎన్నికలకు ముందు కూడా సీఎం పదవిని జనసేన అధినేతతో పంచుకోవాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చడం మచ్చుకు రెండు ఉదాహరణలు.ఎన్నికల్లో పొత్తు కావాలని టీడీపీ కోరుకుంటూంటే జనసేనకు యాభై సీట్లు ఇవ్వాలని తమకు పాతికి సీట్లు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఈ మాట అనేందుకు కూడా జంకారు. ఇలాంటి షరతులే పెట్టి ఉంటే రాజకీయం ఇంకోలా ఉండేది. పవన్ కళ్యాణ్, బీజేపీలకు కూటమిలో ఎంతో కొంత పట్టు దొరికేది. ఎన్నికలకు ముందు తాను, చంద్రబాబు సమానం అనుకుని పవన్ మాట్లాడేవారు. కొంతకాలం అలాగే నడిచింది. చంద్రబాబు కూడా పవన్‌ను అదే భ్రమలో ఉంచుతూ వచ్చారు. కానీ, కాలం మారుతుంది కదా.. ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుతో సమానంగా పవన్ ఎలా ఉంటారన్న ప్రశ్న టీడీపీలో వచ్చింది.ఇక, సీఎం పదవి లోకేష్‌కు ఇవ్వాలన్న వాదన కూడా వస్తుండడంతో లాభం లేదని ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయనను తీసుకురావడానికి వ్యూహరచన మొదలైంది. అందులో భాగంగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చంద్రబాబుకు చెరో వైపు పవన్ కళ్యాణ్, లోకేష్‌ల బొమ్మలు కూడా ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ముద్రించారు. నిబంధనలకు విరుద్ధమైనా లోకేష్ ఫోటో వేయడం చంద్రబాబు మనసులో మాటను చెప్పడమే అవుతుంది. ఆ తర్వాత స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ ప్రకటనలో కూడా పవన్, లోకేష్‌ల ఫోటోలు వేశారు. దీని ద్వారా పవన్‌కు స్పష్టమైన సందేశం పంపించారు. తద్వారా చంద్రబాబుతో సమానం అనుకుంటున్న పవన్ స్థాయిని సక్సెస్ ఫుల్‌గా తగ్గించారు. ఇక లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే, పూర్తి ఆధిపత్యం వచ్చేసినట్లే అవుతుంది. తనకు సీఎం పదవి రాకుండా అడ్డుకుంటున్న పవన్‌కు చెక్ పెట్టినట్లు కూడా ఉంటుంది.ఈ వ్యవహారంలో బీజేపీ నేరుగా వేలు పెట్టకుండా వేచి చూస్తోంది. తెలుగుదేశంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌ను బహిరంగంగా లేవనెత్తడం గమనార్హం. దానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు, నేతలు పవన్‌ను ముఖ్యమంత్రిని చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో రెండు పార్టీల వారు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఎవరి వల్ల ఎవరు పవర్లోకి వచ్చారన్నదానిపై చర్చిస్తున్నారు. అది శ్రుతి మించి బూతులు తిట్టుకునే దశకు వెళ్లారు. అయినా పవన్, లోకేష్‌లు నోరు విప్పలేదు. ఇది పవన్, లోకేష్‌ల మధ్య రాజకీయ వార్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గం కాపులు ఎక్కువ మంది ఉన్నచోట పోటీచేసి గెలిచారని, లోకేష్ మాత్రం ఇటీవలి కాలంలో ఎన్నడూ గెలవని మంగళగిరి నుంచి విజయం సాధించారని, పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే ఎక్కువ అని టీడీపీ అభిమాని ఒకరు పోస్టు పెట్టారు. పవన్ లేకపోతే టీడీపీకి అధికారం ఎక్కడ వచ్చేది.. ఇలాగే చేయండి. మళ్లీ జగన్ సీఎం అవుతారు.. అప్పుడు మీ సంగతి చూస్తారు.. అంటూ కొన్ని అభ్యంతర పదాలతో జనసేన కార్యకర్త ఒకరు పోస్టు పెట్టారు.ఇలా ఇరువైపులా పలువురు విమర్శలు, తిట్ల పురాణం సాగిస్తున్నారు. చంద్రబాబుకు వయసు పెద్దదైందని, అందువల్ల పవన్‌ను సీఎంగా చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని జనసేన వారు కోరుతున్నారు. విశేషం ఏమిటంటే చంద్రబాబుకు వయసు మళ్లిందని జనసేన అంటుంటే, దానిని టీడీపీ వారు కూడా ధృవీకరిస్తున్నట్లుగా మాట్లాడుతూ లోకేష్‌ను సీఎం చేయాలని చెబుతున్నారు. మంత్రి టీజీ భరత్ సీఎం సమక్షంలోనే లోకేష్ ముఖ్యమంత్రి కావాలని అన్నారంటే అర్ధం అదే అన్న భావన కలుగుతుంది. లోకేష్, పవన్‌ల మధ్య సాగుతున్న ఈ గొడవతో చంద్రబాబు నిస్సహాయంగా మిగిలిపోతున్నట్లుగా ఉంది. అటు కొడుకు ఇటు పవన్ కళ్యాణ్ అయిపోయారు మరి. దానికితోడు ఈ మధ్య కాలంలో ఆయన చేసిన వివిధ వ్యాఖ్యలలో అసంబద్ధత ఎక్కువగా ఉంటుండటంతో అంతా వయసును గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్నది ఒప్పందం అని, దానిని ఎలా కాదంటారన్నది జనసేన బాధగా ఉంది. కానీ అధికారం రుచి చూసిన పవన్ కళ్యాణ్ అవమానాలనైనా భరిస్తారు కానీ ఇప్పటికైతే టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతారన్నది ఎక్కువమంది భావన. నిజంగానే లోకేష్ ఈ టర్మ్‌లోనే ముఖ్యమంత్రి అయితే పవన్ తగ్గి ఉంటారా? లేక ఎదిరిస్తారా? అన్నది అప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవడానికి రంగం సిద్ధం అవుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం వంటి డైలాగుల జోలికి వెళ్లకుండా సర్దుకుపోక తప్పదేమో!. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూటమి సర్కార్ కక్ష
సాక్షి, విజయవాడ: ఏపీలో ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS)లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఏడు నెలలైన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనే సీనియర్ అధికారి అయిన శ్రీలక్ష్మికి పోస్టింగ్‌కు ఇవ్వ లేదు. చీఫ్ సెక్రటరీ అర్హత జాబితాలో శ్రీలక్ష్మి తొలి స్థానంలో ఉన్నారు. కనీసం పోస్టింగ్ ఇవ్వకుండా మహిళ అధికారిపై కక్ష సాధిస్తున్నారు. ఆల్ ఇండియా టాపర్, బీసీ అధికారి ముత్యాల రాజుకు కూడా పోస్టింగ్ దక్కలేదు.వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సీఎంవోలో పనిచేశారనే కారణంతోనే ముత్యాలరాజుకు పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం. మురళీధర్‌రెడ్డి, మాధవిలత, నీలకంఠరెడ్డికి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. ఐపీఎస్‌లు రఘురామిరెడ్డి, విశాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డిలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఆంజేయులు, సంజయ్, పీవీ సునీల్, క్రాంతి రాణా, విశాల్ గున్నిలను ప్రభుత్వం వేధిస్తోంది.ఇదీ చదవండి: కాంతి లేని కూటమి పాలన -
లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి: టీజీ భరత్
దావోస్: ఏపీలో మంత్రులు, టీడీపీ నేతలు నారా లోకేష్(Nara Lokesh) భజన చేస్తున్నారు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, డిప్యూటీ సీఎం చేయాలని పచ్చ నేతలు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి టీజీ భరత్(TG Bharath) కూడా అదే లిస్ట్‌లోకి చేరుకున్నారు. నారా లోకేష్‌ను ఏకంగా ముఖ్యమంత్రిని చేయాలని మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), నారా లోకేష్ పలువురు మంత్రులు దావోస్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. నారా లోకేష్ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. దీంతో, లోకేష్ విషయంలో కూటమి రాజకీయంలో రసవత్తరంగా మారింది.మరోవైపు.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే కామెంట్స్‌పై అటు జనసేన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై తాజాగా జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్(Pawan Kalyan)ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటరిచ్చారు. -
రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి ఐదు లక్షలా?: బొత్స
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వం హామీల మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ. మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి.. అది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాట మానవ తప్పిదమే అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించాలి. హామీలను కచ్చితంగా నెరవేర్చాల్సిందే. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు కూటమి నేతలు. విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట ఇవ్వన్నీ.. మానవ తప్పిదాలే. రాష్ట్రంలో పేద విద్యార్థికి ఇంగ్లీష్ వద్దా? సంపన్నులకే ఇంగ్లీష్ మీడియమా? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో.. మూడేళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన (తల నరికిన) కేసులో నిందితుడి(ఏ2)గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తూ అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. ఆ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆరోజు ఘటన జరిగినప్పుడు మా ప్రభుత్వం అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్టు మీరు భావించి ఉంటే, మీ ప్రభుత్వం విచారణ జరిపించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సింది. తప్పుడు కేసు పెట్టారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా, ఒకవేళ అతడు నిందితుడే కాదని మీరు చెప్పదల్చుకుంటే.. కూటమి ప్రభుత్వం అసలు నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయనిధి నుంచి నిందితుడికి ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు. నిందితుడిని డబ్బులివ్వడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?.బహుమానంగా ఇచ్చారా?ఈ ఘటన జరిగినప్పుడు దేవుడు మీద అలవిమాలిన భక్తిని ప్రదర్శించిన మీరు నానా హంగామా చేసి.. అదే కేసులో నిందితుడికి సాయం చేయడం చూస్తుంటే.. ఆ పాపంలో మీ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనలో రాజకీయంగా టీడీపీకి మేలు చేసినందుకు బహుమానంగా ఇచ్చారా?. ఒకవేళ అదే జరిగితే దేవుడి విషయంలో రాజకీయం చేసిన వారు ఎవరైనా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మాత్రం గుర్తుంచుకోవాలి. వారెందుకు నోరు మెదపడం లేదు?:ఇంత దారుణం జరుగుతుంటే హిందూ సనాతనవాదిగా గొప్పగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్, హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేసుకునే బీజేపీ ఏం చేస్తున్నాయి?. వారెందుకు నోరు మెదపడం లేదు?. ప్రభుత్వ చర్యను వారెలా సమర్థిస్తున్నారు?.ప్యాకేజీ మతలబ్ ప్రైవేటీకరణ..విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ అంటూ, ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్యాకేజీ పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు. అందుకే ప్రైవేటీకరణ ఆగిపోతుందని ఏ ఒక్కరూ చెప్పడం లేదు. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని, కేంద్ర హోంమంత్రితో ఆ మాట చెప్పించకపోవడం వెనుక మతలబ్ కూడా ప్రైవేటీకరణ చేయడమేనని స్పష్టంగా తెలుస్తోంది. కూటమి నాయకుల అబద్ధపు హామీలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఎవ్వరినీ వదలకుండా అందరినీ కూటమి నాయకులు వంచించారు’ అని కామెంట్స్ చేశారు. -
దావోస్ వెళ్దాం.. పబ్లిసిటీ బారెడు.. దక్కేది చెంచాడు!
ఉందిలే మంచి కాలం ముందుముందునా.. అందరూ సుఖపడాలి నందనందనా అంటూ ఎగురుతున్నాడు అప్పన్న.. ఏమైందిరా అని అడిగాడు సింహాచలం. అయినా సరే అప్పన్న నిలవలేకపోతున్నాడు.. మరి పర్లేదు ఈ నాల్రోజులు గడిస్తే నాకు నా కొడుక్కి.. నా కూతురికి ఉద్యోగాలు.. మేమంతా హాయిగా ఇంటిల్లిపాదీ ఉద్యోగాలు చేస్తాం.. అందరికీ ఉద్యోగాలు.. నాలుగు జీతాలు.. చేతినిండా డబ్బులు.. మంచి బ్రాండ్లు తాగొచ్చు అనుకుంటూ ఊగిపోతున్నాడు.ఏందిరా అప్పిగా ఏంది నీ గొల్లు.. ఏదీ చెప్పకుండా ఎగురుతున్నావ్.. మెంటల్ గానీ ఎక్కిందేట్రా అన్నాడు సింహాచలం.. మరేట్లేదు.. ముందు ముందు అంతా అదిరిపోతోంది.. ఊళ్లన్నీ ఉద్యోగాలు.. నా కొడుక్కు ఒక మంచి జాబ్.. పాతికవేలు జీతం.. ఇక మా డబ్బులు దాచావుకొవడానికి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలి.. రెండు జీతాలు ఖర్చుపెట్టుకుని ఒక జీతం దాచుకోవాలి అనుకుంటూ ఊగుతున్నాడు. చీప్ లిక్కర్ తాగి పిచ్చిగా వాగుతున్నావా?.. ఎదవా.. అసలు ఏమైంది చెప్పురా అని అప్పన్న టెంకిమీద ఒకటిచ్చాడు సింహాచలం.. టెంకి మీద దెబ్బతో మామూలు పరిస్థితికి వచ్చిన అప్పన్న తుపుక్కున బీడీ పడేసి.. విషయం నీకు తెలీదా.. ఐతే రా చెబుతా అని రాయి మీద కూర్చున్నాడు.మా వోడు.. కొడుకూ కలిపి ఇమానంలో ఎల్లారా.. ఇక పదిరోజుల్లో వచ్చేత్తారు.. రాగానే బోలెడు కంపెనీలు తెచ్చేస్తారు.. ఇక మనకు ఉద్యోగాల జాతరే అన్నాడు అప్పన్న.. ఒరేయ్ అడ్డదిడ్డంగా కూస్తే పీక కొస్తా అని సింహాచలం చెప్పడంతో.. లైన్లోకి వచ్చిన అప్పన్న.. మరేటి లేదురా.. పెదబాబు.. చినబాబు దావోస్ వెళ్లారు. వస్తూనే సంచుల్లో కంపెనీలు తేవడం.. ఉద్యోగాలు ఇవ్వడం.. ఇక ఏపీ ఎలిగిపోవడం.. తథ్యం అన్నాడు. ఇప్పటికే ఇంగ్లీష్ చానెల్లకు డబ్బులు కూడా ఇచ్చేశాం తెలుసా.. పబ్లిషిటీ కోసం అన్నాడు.. అప్పన్న.ఒరేయ్ తాగుబోతోడా.. మీ బాబులు ఇది ఎన్నోసారి దావోస్ వెళ్లడం.. అని అడిగాడు సింహాచలం.. ఎయ్యే ఎన్నోసార్లు వెళ్ళాడు.. మరి ఏమైంది అన్నాడు సింహాచలం.. వెళ్ళాడు అప్పట్లో కర్రీ పాయింట్ పెట్టి.. పాల కూర పప్పు కూడా అందరికి వడ్డించాడు తెలుసా.. గర్వంగా అన్నాడు అప్పన్న. సరే.. కర్రీపాయింట్ కాకుండా ఇంకేం జరిగింది.. అడిగాడు సింహాచలం. ఏమోరా అన్నాడు అప్పన్న. సరే నేను చెబుతా విను.. అంటూ సింహాచలం మొదలెట్టాడు. అప్పట్లో బిల్ గేట్స్ తో ఫోటో దిగాడు.. మరి ఆంధ్రకు మైక్రోసాఫ్ట్ వచ్చిందా.. రాలేదు.. డెలాయిట్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. జనరల్ అట్లాంటిక్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. ఇంటర్నేషనల్ ఆస్పత్రి అన్నారు.. ఫోటోలు దిగారు.. వచ్చిందా.. రాలేదు.అలాగే, గూగుల్, యాక్సెంజర్ డేటా సెంటర్లు అన్నారు.. వచ్చాయా.. రాలేదు.. పైగా సిస్టమ్స్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. మరి ఏమీ రానిదానికి అప్పట్లో ఏ స్థాయి బిల్డప్ ఇచ్చారు గుర్తుంది కదా.. అవునవును యాదొచ్చింది అన్నాడు అప్పన్న.. మరి అప్పుడు రాని కంపెనీలు ఇప్పుడు ఎలా వస్తాయిరా అప్పిగా.. మెల్లగా చురకేశాడు సింహాచలం.. అవునురోయి.. నేను హిస్టరీ మర్చిపోయాను.. అప్పుడు రానివి ఇప్పుడెలా వస్తాయి.. మారేలా అన్నాడు అప్పన్న. ఏమీ లేదు.. మళ్ళీ మన డబ్బుతో తండ్రీ కొడుకులు షికారు వెళ్లి వస్తారు అంతే అంటూ జ్ఞానోదయం చేశాడు సింహాచలం. అయితే మరెలా అన్నాడు బాధపడుతూ అప్పన్న.. ఏమీ లేదు మీ తండ్రీ కొడుకులు ఆటో నడుపుకోండి.. అని సలహా ఇచ్చి అక్కణ్ణుంచి కదిలాడు సింహాచలం. -సిమ్మాదిరప్పన్న. -
‘దావోస్‌లో బాబు.. 2014-19 మధ్య ఒప్పందాల సంగతేంటి?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) దావోస్ వెళ్లారు కాబట్టి రేపటి నుంచి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్‌కి వెళ్తుందన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు నాలుగుసార్లు దావోస్(Davos) వెళ్లి ఏం సాధించారు?. ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో టీడీపీ వారే చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పారిశ్రామిక వేత్తలు ఏపీలో వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు?. ఆంధ్రాకి అలీబాబా, హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, ఏపీకి ఎయిర్ బస్, కుమియుమి 20 బిలియన్ డాలర్లు పెట్టుబడి, రాష్ట్రానికి సౌదీ ఆరాంకో, మైక్రోసాఫ్ట్ సంస్థ హైబ్రిడ్ క్లౌడ్.. అంటూ ఎల్లోమీడియాలో తెగ ప్రచారం చేశారు. చివరికి హీరోహోండా కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో జిందాల్ ఫ్యాక్టరీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు వచ్చేసినట్టే ఎల్లోమీడియాలో భజన చేశారు.కానీ, ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదు. దీనికితోడు నేషనల్ మీడియాలో దండోరా చేయించడానికి కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. కానీ, ఏ కంపెనీని తీసుకురాలేకోయారు. వైఎస్ జగన్ తన హయాంలో ఎలాంటి ప్రచారం లేకుండా దావోస్ వెళ్లారు. అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంటుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి.ఓర్వకల్లు దగ్గర గ్రీన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుని వేగంగా పనులు కొనసాగుతున్నాయి. దీన్ని పవన్ కూడా మెచ్చుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో లక్షా 26 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. అవన్నీ నిర్మాణంలో ఉండగా ఉత్పత్తులు ప్రారంభించాయి. అదీ వైఎస్ జగన్ గొప్పతనం. చంద్రబాబు ప్రస్తుతం దావోస్ వెళ్లారు కాబట్టి రేపట్నించి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్‌కు చేరుకుంటుంది. ఆ ఎలివేషన్‌కు ముందు 2014-19 నాటి ఒప్పందాల వివరాలు కూడా చెప్పాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
పవన్‌ను సీఎం చేయాలి.. జనసేన నేత డిమాండ్
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా మారింది. మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను డిప్యూటీ సీఎంను చేయాలనే వ్యాఖ్యలు కూటమిలో కొత్త చిచ్చుపెట్టాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు జనసేన నేతలు కౌంటరిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై తాజాగా జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి వ్యాఖ్యలపై జనసేన(janasena) నాయకుడు కిరణ్ రాయల్ కౌంటిరచ్చారు. తాజాగా కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్(Pawan Kalyan)ను ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కూడా ఉంది. టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. తమ నేత భద్రత పార్టీకి ఎంతో అవసరం అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, జనసేన నేత వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. మరోవైపు.. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా విశాఖలో హోంమంత్రి అనితను లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవిపై మీడియా ప్రశ్నించింది. ఈ క్రమంలో నారా లోకేష్‌కి మద్దతు తెలపని హోంమంత్రి అనిత. ఈ సందర్బంగా అనిత.. అంతా దైవేచ్చ.. నుదుటి మీద రాసి పెట్టి ఉందేమో చూద్దాం.. అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. -
బనగానపల్లె పీఎస్ వద్ద ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసులు
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్‌పై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయించారు. గత బుధవారం అబ్దుల్ ఫైజ్ ఇంటిపై మంత్రి బీసీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అబ్దుల్ ఫైజ్‌కు న్యాయం చేయాల్సిన పోలీసులు ఆయనపైనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పెద్ద ఎత్తున వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు.ఈ నెల 15న అబ్దుల్‌ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం జరుగుతుండగా.. ఆ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను భయంభ్రాంతులకు గురి చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్‌ఫైజ్ కథనం మేరకు.. పెద్ద కుమారుడు అబ్దుల్‌ఉబేద్ జోడే కావడంతో బుధవారం విద్యుత్ దీపాలంకరణతో ఇంటిని తీర్చిదిద్దారు. ఈ ఇంటిని హైదరాబాద్ నుంచి వచ్చిన డ్రోన్ కెమెరామెన్స్ చిత్రీకరిస్తున్నారు. అబ్దుల్‌ఫైజ్ ఇంటికి సమీపంలో ఉన్న మంత్రి ఇంటి వద్ద నుంచి కొందరు టీడీపీ అనుచరులు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి.. డ్రోన్ కెమెరాను లాక్కొని కిందపడేసి పగులకొట్టారు.అలాగే ఇంట్లో ఉన్న మహిళలను కూడా భయంభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ప్రవీణ్‌కుమార్ వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన కూడా మంత్రి అనుచరులకు వత్తాసు పలికారు. డ్రోన్ కెమెరామెన్ల పై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
అమిత్‌షా పర్యటనతో ఏం ఒరిగింది: పోతిన మహేష్
సాక్షి,విజయవాడ:అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తే వరాల జల్లు కురిపిస్తారని అందరూ ఊహించారని, అయితే అది జరగలేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పోతినమహేష్ విమర్శించారు. మహేష్ సోమవారం(జనవరి20) ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.‘అమిత్ షా రాకను చంద్రబాబు ఏ విధంగా ఉపయోగించుకున్నారో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్,కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అమిత్ షాతో రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించి ప్రకటన చేయించి ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 8వేల కోట్లు ఉన్నాయి. వీటిని తీసుకురావడానికి వైఎస్ జగన్ కృషి చేశారు. కృష్ణా జలాల అంశంపై కనీసం మాట్లాడలేదు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై మాట్లాడడంపై మానేసి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్యాకేజీపై కార్మికసంఘాలు,ప్రజలకు అనుమానాలున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిలపివేస్తున్నామని,సెయిల్ లో కలుపుతున్నామని అమిత్‌షాతో ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు. అమిత్ షా పర్యటనతో రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? చంద్రబాబు నివాసం అక్రమనిర్మాణం కాదా? వరదల్లో మునిగిపోలేదా?ఇటువంటి విషయాలు అమిత్ షాకి చూపించాల్సింది.వైఎస్ జగన్‌పై అబద్దపు ప్రచారాం ఎంతకాలం చేస్తారు. ఇది మంచిపద్దతి కాదు. చంద్రబాబు హైదరాబాద్‌లో కట్టుకున్న ప్యాలెస్‌లోకి ఏ కార్యకర్తనైనా తీసుకుని వెళ్లాడా?కనీసం ప్రవేశం ఉందా? వైఎస్ జగన్ తాడేపల్లి ఇంట్లోనే పార్టీ కార్యక్రమాలు,సమావేశాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ అంశంపై అమిత్ షా స్పందించలేదు. అమరావతిలో 5ఎకరాలు భూమి కొన్నారు.ఈ అంశంపై అమిత్ షా మాట్లాడడలేదు.రుషికొండ భవనాలపై విష ప్రచారం చేస్తున్నారు. పవన్‌కి ఒక్కడికే బాబు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్జగన్ సామాజిక న్యాయం చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు ఇప్పుడు లోకేష్‌కే కాదు.బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. వైఎస్ జగన్ సామాజిక న్యాయం చేస్తే బాబు సామాజిక మోసం చేశారు.పవన్ కళ్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి అమిత్ షా రెకమెండ్ చేస్తే ఇచ్చారని ట్విటర్లో పెట్టారు. బాబు సామాజిక మోసంపై తెలుగుదేశం,జనసేన కార్యకర్తలు మాట్లాడాలి. 30లక్షల మంది పేదవారికి సొంతింటి కలను నేరవేర్చాడం విధ్వంసకర పాలన అంటారా?ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు గ్రామవార్డు సచివాలయాలు పెట్టడం విధ్వంసకర పాలన అంటారా? విద్యా,వైద్య రంగాలను అభివృద్ది చేస్తే విధ్వంసకర పాలన అంటారా?హర్బర్లు,పోర్టులు,మెడికల్ కాలేజీలు పెట్టి అభివృద్ది చేయడం విధ్వంసకర పాలన అంటారా’అని మహేష్ ప్రశ్నించారు. -
తనది రాక్షసపాలనే అని చెప్పడమే బాబు ఆంతర్యమా?
‘‘రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమ తరహాలో ఒకరి పోస్టుమార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్ మార్టమ్ తప్పదు. ఒకరిని చంపితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ వ్యక్తిని కూడా చంపుతారు. సూపర్ సిక్స్ హామీలను ప్రచారం చేసింది కార్యకర్తలే. బ్యూరోక్రసి కాదు. కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది" ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ప్రకటన ఇది. చాలా ప్రమాదకరమైన, బాబు వయసు, హోదాలు రెండింటికీ తగని ప్రకటన ఇది.రాష్ట్రంలో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదని, శాంతి భద్రతల పరిరక్షణ ఏకపక్షంగానే కొనసాగనుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్లు ఉంది. ఒకప్పుడు మాజీ మంత్రి పరిటాల రవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఇలాంటి ప్రకటనే ఒకటి చేశారు. కొంతకాలం తీవ్రవాదిగా ఉండి ఆ తరువాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన పరిటాల రవి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీయార్ కేబినెట్లో మంత్రి అయిన విషయం తెలిసిందే. ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నేతలకు, ప్రత్యర్థి వర్గాలకు రవి అంటే హడల్! తాడిపత్రి కేంద్రంగా రాజకీయం నడుపుతున్న జేసీ సోదరులకు, రవికి అస్సలు పడేది కూడా కాదు. పెనుకొండ ప్రాంతంలో పరిటాల రవి, ఆయన ప్రత్యర్ది మద్దెలచెరువు సూరి వర్గానికి మధ్య పెద్ద ఎత్తున వర్గపోరు నడుస్తూండేది.ఇందులో ఇరుపక్షాల్లోనూ చాలామంది హత్యకు గురయ్యారు. వీరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చివరకు రవి కూడా అనంతపురంలో టీడీపీ ఆఫీసు వద్ద జరిగిన కాల్పుల్లో హతమైన వైనమూ తెలిసిందే. ఫ్యాక్షన్ గొడవలపై ఒకసారి ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది.. ‘‘నాకు తెలుసన్నా.. ఎప్పటికైనా బల్ల ఎక్కాల్సిందే’’ అన్నారాయన. బల్ల ఎక్కడమేమిటి? అంటే.. ‘‘పోస్టమార్టమ్ టేబుల్’ అని సమాధానమిచ్చారు ఆయన. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. జేసీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తాడిపత్రి మున్సిపాలిటీ కాస్తా టీడీపీ తేలికగా స్వాధీనం చేసుకోగలిగింది.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాజాగా ‘పోస్ట్ మార్టమ్’ మాట ఎత్తడానికి ప్రాముఖ్యత ఏర్పడుతోంది. రాయలసీమలోనే కాకుండా.. రాష్ట్రమంతా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామని చెబుతున్నట్లుగా ఉందీ మాటలు వింటే. మంత్రి లోకేశ్ ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న నేపథ్యంలో బాబు ఇలా మాట్లాడటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ను లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో అదంత తేలిక కాదు కానీ.. 74 ఏళ్ల వయసులో, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి కేవలం తన కుమారుడికి అధికారం కట్టబెట్టేందుకు ఇంత దారుణంగా మాట్లాడతారా? అన్న విమర్శలు వస్తున్నాయి.2014లో కూడా చంద్రబాబు అధికారంలోకి రాగానే, తమ పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పారు. కానీ 2019లో జగన్ అధికారం చేపట్టిన తరువాత పార్టీలకు, కులమతాలకు అతీతంగా పాలన సాగించాలని అధికారులకు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎలాగైతేనే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించారు. విధ్వంసాలకు పాల్పడుతున్నారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లను దగ్దం చేయడం, హత్యలకు పాల్పడడం, వేధింపులు మొదలైన చర్యలతో రాజకీయ పాలన దుర్మార్గం మొత్తాన్ని ప్రదర్శించారు.ఇదీ చదవండి: బాబూ.. ఇందులో ఒక్కటైనా వచ్చిందా?అయినా చంద్రబాబుకు తృప్తి కలిగినట్లు లేదు. ఇప్పుడు ఏకంగా పోస్టుమార్టమ్ పాలన అంటున్నారు. ఎంత దారుణం! చంద్రబాబు తన పార్టీవారికి అక్రమాలకు లైసెన్స్ ఇచ్చేశారు. అందువల్లే ఇలాంటి ఘోర కృత్యాలు జరుగుతున్నట్లు ఇప్పుడు తేటతెల్లమవుతోంది. చంద్రబాబు గతంలోనూ రాయలసీమలో ఒకపక్క ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఇంకోపక్క వాటిని అదుపు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తూండేవారు. ఈ సారి మాత్రం నేరుగానే సూచనలిస్తున్నారు. అందుకే టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పాలన పడకేసింది. అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని అనేక మంది చెబుతున్నారు.ఈ మద్య ఏపీకి వెళ్లి వచ్చిన తెలంగాణ సీనియర్ అధికారి ఒకరు ఆసక్తికర పరిశీలన చేశారు. 'చంద్రబాబు పాలన ఇంత వీక్ గా ఉంటుందని ఊహించలేదు. ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరింది" అని ఆయన అన్నారు. అది నిజమేనని పలు ఉదంతాలు తెలియచేస్తున్నాయి. అధికారంలోకి రాగానే వైసీపీ వారిపై దాడులు చేయడమే కాదు.. యూనివర్భిటీలపై టీడీపీ చెందిన అసాంఘిక శక్తులు దాడులు చేసి వైస్ చాన్సలర్ లను దూషించి వారితో రాజీనామాలు చేయించి కొత్త ట్రెండ్ సృష్టించారు. ఆ తర్వాత ప్రభుత్వపరంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇసుక దోపిడీకి గేట్లు ఎత్తివేశారు. సుమారు 40 లక్షల టన్నుల ఇసుకను ఊదేశారు.తదుపరి రాష్ట్రవ్యాప్తంగా మద్యం కొత్త పాలసీని తెచ్చి పార్టీవారే షాపులన్నీ పొందేలా చేశారు.వేరే ఎవరైనా షాపులు ఒందితే అందులో బలవంతంగా 30 శాతం వాటాను, టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు లాక్కున్నారు. యథేచ్ఛగా బెల్ట్ షాపులు పెట్టుకునేందుకు గ్రామాల్లో వేలంపాటలు జరిగే స్థాయికి పరిస్థితి వెళ్లింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన కోడిపందాలు, గుండాట, జూదం ,బెట్టింగ్ వంటివాటిని కూడా టీడీపీ నేతలే నిర్వహించుకున్నారు. ఈ వ్యవహారంలో కొన్నిచోట్ల జనసేన, టీడీపీ బాహాబాహీకి దిగడం, కొన్ని చోట్ల ఘర్షణలు జరగడం ఇటీవలి పరిణామాలే.మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటివి విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల టీడీపీ వారే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, అరాచకాలపై టీడీపీ జాకీ మీడియాలోనే కథనాలు వచ్చాయి. వీటన్నింటిని అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి ఒకటి అర మాటలతో వదిలిపెట్టడమే కాకుండా.. ఇప్పుడు నేరుగా ఆయనే పోస్ట్‌మార్టమ్ మాటలు మాట్లాడుతున్నారు.ఇలా మాట్లాడితే టీడీపీ వాళ్లు పెట్రేగిపోరా? ఈ రాజకీయ పాలన ద్వారా ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలన్నది చంద్రబాబు వ్యూహం కావచ్చు కానీ.. చరిత్ర అలా ఉండదు. ఆయన చెప్పిన సిద్ధాంతాన్నే ఎదుటి పార్టీలు, ప్రత్యర్ధులు కూడా పాటించే అవకాశం ఉంటుంది. అధికారం ఉన్నా, లేకపోయినా ఇలాంటివాటిని ప్రోత్సహించకూడదు. వచ్చేసారి ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే అప్పుడు ఆ పార్టీ వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఊహించుకోవాలి. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రెచ్చగొట్టారు కదా అని టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతే వారికే నష్టం. ఎల్లకాలం తమకు విధేయులుగా ఉంచుకోవాలనే ఫ్యూడల్ ధోరణిలో చంద్రబాబు మాట్లాడారనిపిస్తుంది. ఇది రాజకీయపాలనగా ఉండదు. రాక్షస పాలన మాత్రమే అవుతుందన్న సంగతి గుర్తిస్తే మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్టీల్ ప్లాంట్‌ను ఏం చేస్తారో చెప్పండి: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఇటీవల ఇచ్చిన ప్యాకేజీపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం(జనవరి19) బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ఎందుకు చెప్పలేదు. దీపం పథకంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆపడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రధాని,అమిత్‌షా, సీఎం చంద్రబాబు ప్రయివేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌పై ముసుగులో గుద్దులాట వద్దు.మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఇచ్చే 11 వేల కోట్లకు ఎన్నో షరతులు పెట్టారు. ప్యాకేజీ వెనుక ఏదో మతలబు ఉంది.కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తిరుపతి సంఘటనపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చెయ్యాలి. సొంతగా గనులు కేటాయించాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తాం.మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. కేంద్రహోం మంత్రి వస్తే రాష్ర్ట ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఏమి చేస్తున్నాడు అని మట్లాడుకుంటున్నారా. రుషి కొండ భవనాల కోసం డిన్నర్ మీటింగ్ పెట్టరా. వైఎస్ జగన్‌కు ఎన్ని బెడ్ రూములు, ఎన్ని బాత్ రూములు ఉన్నాయన్న దాని మీద చర్చిస్తారా. రాష్ట్రానికి ఇదేం ఖర్మ. చంద్రబాబు ప్రచారం కోసం దుబారా ఖర్చులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చుకుంటారో వారి ఇష్టం’అని బొత్స అన్నారు. -
లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి: పిఠాపురం వర్మ
సాక్షి,కాకినాడజిల్లా: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు వర్మ ఆదివారం(జనవరి 19) మీడియాతో మాట్లాడారు.‘నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్‌కే దక్కుతుంది. పార్టీ పూర్తిగా పోయిందని,టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ యువ గళంతో సమాధానం చెప్పారు.ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి.లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు.అలాంటిది పార్టీని బలోపేతం చేసి, టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి?కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్‌ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నా.ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు.టీడీపీ కార్యకర్తల మనసులో మాట.ఏదేమైనా అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం’అని వర్మ అన్నారు. కాగా, లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు.మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్‌కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. ఈ నేతల జాబితాలో పవన్‌కల్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చేరడం పొటికల్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ, జనసేన మధ్య సంబంధాలపైనా ఈ వ్యవహారం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అమిత్‌షా ఏం మాట్లాడారో మాకు తెలుసు: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి:అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు తెలిసిన విద్య అని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం(జనవరి19) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘నాడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు అమిత్‌షాపై రాళ్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సమస్యల గురించి మాట్లాడకుండా విందులేంటో. సమస్యలన్నీ పక్కనపెట్టి వైఎస్ జగన్ ప్యాలెస్‌ల గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షాతో చంద్రబాబు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ విషయం మాట్లాడలేదు.లోకేష్‌ను అదుపులో పెట్టుకోమని అమిత్ షా వార్నింగ్..అమిత్‌షా ఏం మాట్లాడారో మాకు సమాచారం ఉంది. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేస్తానని చంద్రబాబు అమిత్‌షాను అడిగారట. లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని, ఆయనను ముందు అదుపులో పెట్టుకోవాలని అమిత్‌షా చంద్రబాబును హెచ్చరించారు. లోకేష్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమైనందున స్పీడ్ తగ్గించుకోవాలని అమిత్ షా బాబుకు సూచించారు.అమిత్ షా సలహాలు బయటికి రాకుండా కథలు వండి వారుస్తున్నారు. గత్యంతరం లేకే చంద్రబాబు పవన్‌కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేశారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది.వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి’అని అంబటి తెలిపారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకంరాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయ్విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయిరాష్ట్రంలోని సమస్యలను వదిలేసి జగన్ ఆస్తుల గురించి అమిత్ షా అడిగారని ప్రచారం చేస్తున్నారుఆవు కథ మాదిరి వైఎస్ జగన్ పై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారుచంద్రబాబు నివాసముండేదే అక్రమ కట్టడంఅక్రమకట్టడంలోనే విందు ఇస్తున్నామని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుఆ ఇల్లు క్విడ్ ప్రోకోలో కొట్టేసిందని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుకృష్ణమ్మ వరద ముంచేసిన ఇంట్లోనే మీరు కూర్చున్నారని ఎందుకు చెప్పలేదుహైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు ఎవరికైనా చూపించాడాచంద్రబాబు మాదిరి జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో ఇళ్లు తీసుకోలేదులోకేష్ ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని అమిత్ షా ను చంద్రబాబు అడిగారుమీ అబ్బాయి లోకేష్ స్పీడ్ ను తగ్గించుకోమని అమిత్ షా చెప్పారుఎక్కడపడితే అక్కడ వేలు పెడుతున్నాడు...కొంచెం తగ్గమని చెప్పారువైఎస్ జగన్ ఇళ్ల గురించి పాతచింతకాయ పచ్చడి కథలెందుకుపోలవరం రెండవ డయాఫ్రమ్ వాల్ పనులు నిన్న ప్రారంభించారుడయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకంటీడీపీలో చేసిన తప్పిదమే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందిచంద్రబాబు,దేవినేని ఉమా , టీడీపీ తప్పిదాన్ని జగన్ పై నెట్టడం తప్పువైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పనులు అద్భుతంగా జరిగాయిస్పిల్ వే , కాఫర్ డ్యామ్ లు జగన్ హయాంలోనే పూర్తి చేశారుతిరుపతి ఘటన మానవతప్పిదంతిరుపతికి ఇప్పుడు రమ్మని చెప్పండి ఎన్డీయేనుతిరుపతి పై ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయిందిలడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని మాపై అభాండాలు వేశారుఆ పాపమే ఇప్పుడు కూటమి పాలనను వెంటాడుతోందిచెప్పేటందుకే చంద్రబాబు నీతులుచంద్రబాబు, ఆయన కుమారుడు ఒక్కొక్కరినే కంటారుపేదలు మాత్రం ఇద్దరు ముగ్గురు కనమంటున్నారుఏపీలో అసమర్ధపాలన సాగుతోందిలోకేష్ భజన తగ్గించాడు...పవన్ చంద్రబాబు భజన మొదలు పెట్టాడుఅలా భజన చేస్తున్నాడు కాబట్టే బాగా లబ్ధి పొందుతున్నాడుమళ్లీ మీరే ఉంటారని గ్యారంటీ ఇవ్వాలని కంపెనీలు లోకేష్ ను అడుగుతున్నాయంటున్నారు ఈ ప్రభుత్వం మీద పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదువైఎస్ జగన్ మళ్లీ రావడం ఖాయమని పారిశ్రామికవేత్తలకు అర్ధమైపోయిందిజగన్ హయాంలోనే పెట్టుబడులు పెడదామని పారిశ్రామిక వేత్తలు ఎదురు చూస్తున్నారుచంద్రబాబు అనుభవజ్ఞుడే అవ్వొచ్చు ...కానీ అసమర్ధుడు -
డిప్యూటీ సీఎంగా లోకేష్.. జనసేన స్ట్రాంగ్ కౌంటర్లు
వైఎస్సార్, సాక్షి: టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రయత్నాలకు జనసేన మోకాలడ్డు వేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కూటమిలో చిచ్చు రగల్చింది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్‌ను డీ.సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ డిమాండ్‌కు జనసేన పార్టీ అంతే ధీటుగా.. ఘాటుగా కౌంటర్లిస్తోంది.టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి(R Srinivasulu Reddy) వాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై జననేత ఘాటుగా స్పందిస్తోంది. ఒకవేళ.. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తమ అధినేత పవన్‌ను సీఎం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర మంత్రిగా వెళ్తే బాగుంటుందని కొందరు జనసేన నేతలు శ్రీనివాసులుకు సూచిస్తున్నారు. పైగా ఆ బాధ్యతలను శ్రీనివాసులు రెడ్డినే తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు జనసేన ఉమ్మడి కడప జిల్లా నేత విశ్వం రాయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. మరోవైపు.. బాబుకు వయసైపోయింది!నారా లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్(Nara Lokesh Babu)కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. అయితే.. లోకేష్‌ను డిప్యూటీ సీఎం(Deputy CM) చేయడం ద్వారా పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు చెక్ పెట్టొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తూ ఉండొచ్చు. ఈ క్రమంలోనే తమ పార్టీ కీలక నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేసి ఉండొచ్చు. తద్వారా వాళ్ల డిమాండ్‌ను చూపించి.. లోకేష్‌ను డీ.సీఎం. చైర్లో కూర్చోబెట్టడమే ఆయన ఆలోచనగా స్పష్టమవుతోంది. అదే జరిగితే తమ అధినేత పరిస్థితి ఏంటో? అనే ఆందోళనలో జనసేన ఉందిప్పుడు. ఈ క్రమంలోనే ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.ఇదీ చదవండి: ‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’