breaking news
-
డిప్యూటీ సీఎంగా లోకేష్.. జనసేన స్ట్రాంగ్ కౌంటర్లు
వైఎస్సార్, సాక్షి: టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రయత్నాలకు జనసేన మోకాలడ్డు వేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కూటమిలో చిచ్చు రగల్చింది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్‌ను డీ.సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ డిమాండ్‌కు జనసేన పార్టీ అంతే ధీటుగా.. ఘాటుగా కౌంటర్లిస్తోంది.టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి(R Srinivasulu Reddy) వాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై జననేత ఘాటుగా స్పందిస్తోంది. ఒకవేళ.. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తమ అధినేత పవన్‌ను సీఎం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర మంత్రిగా వెళ్తే బాగుంటుందని కొందరు జనసేన నేతలు శ్రీనివాసులుకు సూచిస్తున్నారు. పైగా ఆ బాధ్యతలను శ్రీనివాసులు రెడ్డినే తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు జనసేన ఉమ్మడి కడప జిల్లా నేత విశ్వం రాయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. మరోవైపు.. బాబుకు వయసైపోయింది!నారా లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్(Nara Lokesh Babu)కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. అయితే.. లోకేష్‌ను డిప్యూటీ సీఎం(Deputy CM) చేయడం ద్వారా పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు చెక్ పెట్టొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తూ ఉండొచ్చు. ఈ క్రమంలోనే తమ పార్టీ కీలక నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేసి ఉండొచ్చు. తద్వారా వాళ్ల డిమాండ్‌ను చూపించి.. లోకేష్‌ను డీ.సీఎం. చైర్లో కూర్చోబెట్టడమే ఆయన ఆలోచనగా స్పష్టమవుతోంది. అదే జరిగితే తమ అధినేత పరిస్థితి ఏంటో? అనే ఆందోళనలో జనసేన ఉందిప్పుడు. ఈ క్రమంలోనే ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.ఇదీ చదవండి: ‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’ -
విజయవాడ: ‘గో బ్యాక్ అమిత్ షా’
విజయవాడ, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలో నిరసన సెగ తగిలింది. అంబేద్కర్‌పై షా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ‘‘ గో బ్యాక్ అమిత్ షా’’ నినాదాలతో నగరంలో ఆదివారం వామపక్షాలు నిరసన చేపట్టాయి. అంబేద్కర్‌ని అవమాన పరిచిన అమిత్ షా రాజీనామా చేయాలని, ఆయన వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు వాళ్లు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని మోది అమిత్ షాకు మద్దతు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికి మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా. అంబేద్కర్ ను అవమానించిన షా.. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘పార్లమెంట్ వేదికగా నిండు సభలో అవమానించారు. పైగా ఆయన తన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటున్నారు. అమిత్ షా ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలి’’ అని సీపీఎం నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: అమిత్ షానగరంలోని నోవాటెల్ హోటల్లో ఏపీ బీజేపీ (BJP) నేతలతో ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా (Amit shah) సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. కీలక అంశాలపై రాష్ట్ర భాజపా నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల పార్టీ, వీహెచ్‌పీ నేతలకు అమిత్‌షా అభినందనలు తెలిపారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై కేంద్రహోంశాఖ దృష్టిపెట్టిందని అమిత్‌షా చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేతలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో షా.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని 10వ NDRF బెటాలియన్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ముగ్గురు మొక్కలు నాటారు. అంతకు ముందు.. నగరంలోని నోవాటెల్‌లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పది నిమిషాలపాటు భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కొండపావులూరు చేరుకున్నారు. అంతకంటే ముందే పవన్ అక్కడికి చేరుకున్నారు. -
‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’
తిరుపతి, సాక్షి: తిరుమలలో వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. రాత్రికిరాత్రే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) స్పందించారు. ‘‘అధికారంలోకి వచ్చాక తిరుమలపై పాప ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan kalyan) చెప్పారు. అయితే ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకొక పోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది. వరుస ఘటనలపై నిగ్గు తేల్చేందుకు అధికారిని కేంద్రం పంపుతామంది. కానీ, విజయవాడకు వచ్చిన అమిత్ షాను చంద్రబాబు, పవన్ బతిమిలాడారు. రాత్రికి రాత్రే నిర్ణయాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. హడావుడిగా ఇచ్చిన జీవోలో అధికారుల సంతకాలు లేవు’’ అని భూమన ఆరోపించారు. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం ఏదో ఒకటి జరుగుతోంది. అధికారుల అలసత్వంతో.. అవినీతితో విచ్చలవిడితనం కనిపిస్తోంది. బ్రహ్మాండనాయకుడి కొండపై మద్యం, బిర్యానీలు లభ్యమవుతున్నాయి. మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు అంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోంది. తిరుమలలో ఈ మధ్యకాలంలో నాలుగుసార్లు ఎర్రచందనం దొరికింది. మిమ్మల్ని చూసుకుని సప్లై చేస్తున్న దొంగలు ఎవరు? అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ ఏం చేస్తున్నారు?. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై కొండపై అరాచకాలు పెరిగిపోయాయి. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన(Jana Sena) నాయకులు టికెట్లు అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారు. ఇది దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు. సర్వ సాక్షి అయిన వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదు. ఆరుగురి మరణానికి కారకులెవరూ?‘‘క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామలయానికి పంపిన ఘనత మాది. మీ పాలనలో టీటీడీ పరువు తీశారు. వైకుంఠ దర్శనానికి వచ్చిన భక్తులను పశువుల దొడ్డిలో పడేశారు. తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరం. ఆ మరణాలకు బాధ్యులు ఎవరు?. ప్రమాదానికి కారకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్‌పై చర్యలు తీసుకోకుండా.. తూతూమంత్రంగా ఎస్పీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. పైగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. వైకుంఠ ఏకాదశి కు సునీత గౌడ అనే కర్ణాటక భక్తురాలు 70 లక్షలు ఖర్చు చేసి పుష్ప అలంకరణ చేస్తే బయట పెట్టేశారు. అక్షర మాయకు ఆ దేవుడే బదులిస్తాడుచంద్రబాబు పాపలపుట్ట కొండగా మారుతోంది. ఒక న్యూస్ చానల్ అధినేత బీఆర్ నాయుడు(BR Naidu)కు చైర్మన్ పదవి ఒక్కటే ప్రామాణికం కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ అసత్య ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీపై బురద జల్లాలని ప్రయత్నించారు. లడ్డూ వ్యవహారంలో సిట్ ఏం తేల్చింది?. ఇప్పుడు నెపాన్ని మా మీద నెట్టేసే పరిస్థితులు కూడా దాటిపోయాయి. ఈ అపచారాలకు భగవంతుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. చంద్రబాబు ఎల్లో మీడియా అక్షర మాయతో మాపై బురద చల్లితే.. విష్ణు మాయ ముందు చంద్రమాయ భస్మం కాక తప్పదు’’ అని భూమన అన్నారు. -
అమిత్ షాకు చంద్రబాబు విందు
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు శనివారం రాత్రి విందు సమావేశంలో పాల్గొన్నారు. వారు కొద్దిసేపు రాజకీయ అంశాలపై చర్చించినట్లు కూటమి నేతలు తెలిపారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడీఎం), ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ క్యాంపస్‌లను అమిత్‌షా ఆదివారం ప్రారంభించనున్నారు. ఇందుకోసం విజయవాడ వచ్చిన ఆయనకు సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. అమిత్‌షా శనివారం రాత్రి 8.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. విందు అనంతరం అమిత్ షాతో వారిద్దరూ సమావేశమయ్యారు. ఈ విందు సమావేశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా విజయవాడలోని ఓ హోటల్లో బస చేశారు.విమానాశ్రయంలో అమిత్‌షాకు ఘనస్వాగతంకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కె. అచ్చన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నారా లోకేశ్, కొలుసు పార్ధసారథి, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, డోలా బాల వీరాంజనేయులు స్వామి, నాదెండ్ల మనోహర్, వాసంశెట్టి సుభాష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, సీఎం రమేష్, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఐజీ నరేంద్రసింగ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. -
టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నామినేటెడ్ పోస్టులు, ఇతరత్రా వ్యవహారాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతల లంచాల బాగోతాన్ని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డే బయటపెట్టారు. జిల్లాలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ప్రతి పదవినీ అమ్ముకుంటున్నారని చెప్పారు. తిక్కారెడ్డి వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన సొంత పార్టీ నేతల లంచగొండితనాన్ని వెల్లడించారు. డీలర్‌షిప్‌లు, గ్రామాల్లో పోస్టులకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తల దగ్గరే ఇలా లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కురబ సామాజిక వర్గానికి చెందిన ఓ సాధారణ ఎంపీటీసీ బస్తిపాటి నాగరాజును చంద్రబాబు ఎంపీని చేశారని, ఆయన గ్రామంలో ఓ పోస్టు విషయంలో జోక్యం చేసుకుంటే అక్కడి ఎమ్మెల్యే, ఇన్చార్జి అడ్డుపడ్డారన్నారు. పదవులు ఇచ్చేందుకు ఆయన ఎవరంటూ ఎంపీనే ధిక్కరించారని చెప్పారు. ఎంపీ చెప్పిన వారికి కాకుండా లంచాలు ఇచ్చేవారికి పదవులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఎంపీ నాగరాజు కోడుమూరు నియోజకవర్గం పంచలింగాల వాసి. దీన్నిబట్టి చూస్తూ తిక్కారెడ్డి అక్కడి ఎమ్మెల్యే దస్తగిరి, ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డిపై పరోక్షంగా ఆరోపణలు చేశారని స్పష్టమవుతోంది. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల అవినీతి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని తిక్కారెడ్డి చెప్పారు. -
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీను నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస రావు, కాగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
దావోస్ టూర్..బాబు పబ్లిసిటీకి భారీ ఖర్చు
సాక్షి,విజయవాడ:సీఎం చంద్రబాబు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) టూర్ పబ్లిసిటీ కోసం కూటమి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. దావోస్ టూర్‌కు భారీ ప్రచారానికి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డబ్బులిచ్చి మరీ పబ్లిసిటీ చేయించుకోవాలని బాబు సర్కారు నిర్ణయించింది. జాతీయ బిజినెస్ టీవీ చానల్ సీఎన్‌బీసీ(CNBC) ద్వారా పబ్లిసిటీ కోసం రూ.కోటి 15 లక్షల రూపాయిలు కేటాయిస్తూ పరిపాలన అనుమతుల జీవోను ప్రభుత్వం శనివారం(జనవరి18) జారీ చేసింది.ఇప్పటికే ఎన్డీటీవి ద్వారా పబ్లిసిటీ రూ.74లక్షలు,డిజిటల్ మీడియాలో పబ్లిసిటీ కోసం బిజినెస్ టుడేకు రూ.60 లక్షల దాకా మంజూరు చేశారు.రెండు ఛానళ్ల ద్వారా దావోస్‌లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం సర్కారు రూ.2 కోట్లకుపైగా దుబారా చేస్తోంది. పెట్టుబడుల విషయంలో కేవలం చంద్రబాబును పొగడడం కోసమే ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.గతంలో టీడీపీ(TDP) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో సహా చంద్రబాబు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు వెళ్లారు. ప్రభుత్వం తరపున సీఎం, మంత్రులు వెళ్లాల్సిన సదస్సుకు కుటుంబ సభ్యులు అది కూడా ప్రత్యేక విమానం వేసుకుని వెళ్లడమేంటన్న విమర్శలు వచ్చాయి. దావోస్ సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు శనివారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి ఐదురోజుల పాటు దావోస్‌లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. దావోస్‌కు వెళ్లేందుకు చంద్రబాబు మంత్రులు లోకేష్, టీజీ భరత్ మరో ఐదుగురు ఉన్నతాధికారులు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వీరందరికి సహాయకులుగా మరో 15 మంది దాకా దావోస్‌కు వెళ్లనున్నారు.ఇదీ చదవండి: స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత -
ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ సీరియస్
సాక్షి,గుంటూరు:తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం(జనవరి20) కొలికపూడిని పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11వ తేదీన ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కొలికిపూడి శ్రీనివాస్ దాడి ఘటనను సీరియస్ టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.ఘటనకు సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు వివరించాలని అధిష్టానం కొలికపూడిని ఆదేశించింది.తిరువూరులో జరిగిన ఘటనపై ఇప్పటికే తీవ్ర సీఎం చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎస్టీ మహిళపై దాడి అంశంలో క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణను పార్టీ అధిష్టానం దృష్టికి క్రమశిక్షణ కమిటీ బృందం తీసుకువెళ్లనుంది.కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికపుడిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.వివాదస్పద వ్యాఖ్యలు చేయడం, దౌర్జన్యాలకు దిగడం కొలికపూడికి సర్వసాధారణమైపోయిందని టీడీపీలోని పలువురు నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో కొలికపూడి రైతులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. కుక్కలకైనా విశ్వాసముంటుంది కానీ రైతులకు లేదని వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు. లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించానని, రైతులకు తన పట్ల విశ్వాసం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఒక సందర్భంలో క్రిస్టియన్లుగా మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ల వర్తింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
పేదల ఇళ్ల స్థలాలు లాక్కుంటున్నారు: టీజేఆర్ సుధాకర్‌బాబు
సాక్షి,తాడేపల్లి: ఇళ్ల పట్టాల రూపంలో చంద్రబాబు పేదలపై పిడుగులు వేశారని,బాబు హయాంలో గతంలో ఏనాడూ పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. శనివారం(జనవరి18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసులో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.‘వైఎస్ జగన్ తన హయాంలో 30.6లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు.71 వేల ఎకరాల భూమిని పేదలకు పంచారు.25,374 ఎకరాలను పేద ప్రజల కోసం వైఎస్ జగన్ కొనుగోలు చేశారు. టిడ్కో ఇళ్లను కట్టించి ఇచ్చారు.అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు లక్షల మందికి భూమిని పంచి పెట్టారు.ఆయన కుమారుడు మళ్ళీ 33 లక్షలమందికి పట్టాలిచ్చారు.చంద్రబాబు కూడా అలాగే భూమిని కొనుగోలు చేసి ఇస్తే అందరూ సంతోషించేవారు.కానీ వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను తొలగించి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు పంచాలనుకోవటం దారుణం. వైఎస్ జగన్ రాజకీయాలు చూడకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలాలను లాక్కునే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు? ఒక్కొక్కరికి మూడు నుంచి పది లక్షల విలువైన భూమిని వైఎస్ జగన్ అందించారు.పేదలకు సంపద సృష్టించి,ఆత్మగౌరవం నిలపెట్టేలా వైఎస్ జగన్ వ్యవహరించారు.80 శాతం మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీలకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు వారి నుంచి భూములను లాక్కుని రోడ్డున పడేస్తారా? 17 వేల ఊర్లను వైఎస్ జగన్ నిర్మించారు.ఇలా చేయాలనుకుంటే చంద్రబాబు కూడా భూమిని కొని పేదలకు అందించాలి. వైఎస్ జగన్ నిర్మించిన కాలనీలు,గ్రామ సచివాలయాలు,బాగుపడిన స్కూళ్లలోకి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లడం లేదు? అక్కడకు వెళ్తే వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని భయమా? సచివాలయ వ్యవస్థను చంద్రబాబు ఎందుకు గౌరవించటం లేదు? సచివాలయాల నిర్మాణాలు తప్పయితే అదే విషయాన్ని ప్రకటించాలి.రాజధానిలో చంద్రబాబు పెద్ద ఎత్తున భూ స్కామ్ చేశారు. దీనిపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. 9 లక్షల ఎకరాలను జగన్ 22A నుంచి తప్పించి రైతులకు హక్కులు కల్పించారు.25 లక్షలమంది రైతులకు మేలు చేశారు. రాజధానిలో 50 వేల మంది పేదలకు వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలిచ్చారు.చంద్రబాబు వారందరికీ అన్యాయం చేస్తూ స్థలాలను లాగేసుకున్నారు. రాజధానిలో ఎస్సీ,ఎస్టీలు ఉండకూడదా? పేదల స్థలాలను లాగేసుకుంటే న్యాయపోరాటం చేస్తాం’అని సుధాకర్‌బాబు హెచ్చరించారు. ఇదీ చదవండి: బాబు పవన్.. తిరుమలలో ఏం జరుగుతోంది: భూమన -
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత మాధవ్
సాక్షి, విశాఖపట్నం: కుర్మాన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ శిబిరం వద్ద బీజేపీ సంబరాలు జరుపుకుంది. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతలను బీజేపీ నేత మాధవ్ అవమానించారు. పోరాటాన్ని శంకించే విధంగా మాట్లాడారు. లెఫ్ట్ పార్టీ యూనియన్ నేతలు నిరంతరం విషం చిమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు.‘‘సమస్య పరిష్కారం కావాలని కార్మిక సంఘాలకు లేదు. సమస్య పరిష్కారం కాకుండా ఉంటే వారికి కూడు దొరుకుతుందని వారి భావన.. కార్మిక సంఘాలే కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న యూనియన్లు అన్ని కుహనా యూనియన్లు. ప్రైవేటికరణ ఆపేస్తామని ఏమి చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుంది’’ అంటూ నోరు పారేసుకున్నారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది -
బాబు, పవన్.. తిరుమలలో ఏం జరుగుతోంది?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి సర్కార్ అధికారంలో ఉండగా జరుగుతున్నదేమిటి? అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందన్న భూమన.. చంద్రబాబు పాలనలో మద్యం, మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయని దుయ్యబట్టారు.‘‘శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యాని పట్టుబడిందంటే.. టీటీడీ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. మారణాయుధాలలతో వచ్చిన పట్టించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేశారు. టీడీపీ నాయకులు సేవలో టీటీడీ చైర్మన్ పని చేస్తున్నారు, భక్తులను పట్టించుకోవడం లేదు...తిరుమల కొండపై ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ 4సార్లు పట్టు బడ్డారు. 40 సార్లు పట్టుబడకుండా తప్పించుకు తిరిగి ఉంటారు. లడ్డూ ప్రసాదం విషయంలో మాపై నింద మోపారు. మాపై నేరారోపణలు చేశారు. సనాతన హిందూ ధర్మం కోసం పీఠాధిపతులు, హిందుత్వ సంఘాలు.. పవన్ కల్యాణ్, చంద్రబాబును ప్రశ్నించాలని కోరుతున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ వెనుక మతలబు ఏంటి?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ జగన్ వ్యతిరేకమే అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్సార్సీపీ వల్లే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. స్టీల్‌ప్లాంట్ కార్మికులకు అండగా వైఎస్సార్సీపీ నిలబడిందని అమర్నథ్ తెలిపారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ కేవలం ఆక్సిజన్‌లా పని చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ జగన్ వ్యతిరేకం. వైఎస్సార్సీపీ వలనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. ఈ మాట స్వయంగా కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది అని మంత్రి చెప్పారు. కార్మికులకు అండగా వైఎస్సార్సీపీ నిలబడింది.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాము. రూ.11,400కోట్ల ప్యాకేజీలో గతంలో ఇచ్చిన 1500 కోట్లు మినహాయించి మిగిలిన రూ.9800కోట్లు ఇస్తున్నారని మాకు సమాచారం ఉంది. ప్రధాని మోదీ సభలో ఎందుకు ప్యాకేజీ ప్రకటించలేదు. మీ ప్యాకేజీ వెనుక మతలబు ఏంటి?. స్టీల్ ప్లాంట్ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉంది. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని ఉద్దేశ్యం ఉంటే ప్రైవేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకోలేదు.కేంద్రం ఇచ్చే ప్యాకేజీ అప్పులకే సరిపోతుంది. ప్లాంట్‌లో వీఆర్ఎస్ను ఎందుకు తీసుకువచ్చారు. 25వేల మందితో నడవాల్సిన ప్లాంట్ 10 వేల మందితో నడుస్తుంది. ఇంకా ఉద్యోగులను తొలగిస్తే ప్లాంట్ ఎలా నడుస్తుంది. స్టీల్ ప్లాంట్ ఎంతో సెంటిమెంట్‌తో ఏర్పడింది. 55వేల కోట్లు పన్నుల రూపంలో కట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్స్ పెడుతున్నాం. స్టీల్ ప్లాంట్‌కు ట్యాక్స్ హాలీడే ఇవ్వాలి. ప్లాంట్‌ను సేయిల్‌లో విలీనం చెయ్యాలి. సొంతంగా గనులు కేటాయించాలి.200ఏళ్లకు సరిపడే గనులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రాష్ట్రపతి పేరు మీద ఉన్న స్టీల్ ప్లాంట్ భూములు స్టీల్ ప్లాంట్ పేరు మీద మార్చాలి. కూటమి పాలన వచ్చిన తర్వాత కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగులను తొలగించారు. అలెవెన్స్ కూడా ఇవ్వలేదు. పీఎఫ్ డబ్బులు వాడేశారు. ఇన్నీ చేసి.. ఎందుకు కూటమి నేతలు సంబురాలు చేసుకున్నారో అర్థం కాలేదు. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీలు అందించాయి’ అంటూ కామెంట్స్ చేశారు. -
లోకేష్‌కు ఫుల్ ఎలివేషన్.. కాబోయే డిప్యూటీ సీఎం?
టీడీపీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా నారా లోకేష్ మాత్రమే నంబర్ టూగా చెలామణీ అవుతున్నారు. ఆయనకు సంబంధం లేకపోయినా అన్నీ శాఖల్లోనూ అలవిమాలిన జోక్యం చేసుకుంటున్నారు. ఒక్కసారిగా పార్టీమీద పట్టు సాధించాలని స్టేట్ మొత్తం తన కంట్రోల్లో ఉండాలని ఆయన చాలా తాపత్రయపడుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉంటున్నాయి.ఏపీ కేబినెట్లో చంద్రబాబు తరువాత నంబర్ టూగా అధికారికంగా మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయనకు మాత్రమే కేబినెట్లో సెకెండ్ పొజిషన్ ఉంది. అయితే, తనకు అధికారికంగా పవన్ కన్నా తక్కువ గుర్తింపు ఉండటంతో దాన్ని అధిగమించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. నేడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. అందులో ఎన్టీఆర్ ఫొటోకు అటు ఇటుగా చంద్రబాబు.. లోకేష్ ఫోటోలు ఉంచారు.. అంటే పార్టీలో లోకేష్‌ను ఇంకోమెట్టు ఎక్కించేసారన్నమాట.పవన్ దూకుడుకు బ్రేకులు..రాష్ట్రంలో తెలుగుదేశం సభ్యత్వాలు కోటి దాటాయని.. ఇదంతా లోకేష్ ఘనత అని చెబుతూ ఆయన్ను ఉన్నపళంగా అందలం ఎక్కిస్తున్నారు. మరోవైపు, కొంతమంది వీరవిధేయులు అయితే నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అటు పవన్ కళ్యాణ్ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నా ఇండిపెండెంట్‌గా ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తిరుమల తొక్కిసలాట సందర్భంలో టీటీడీ ఈవో చైర్మన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేవని.. అవసరం అయితే తానే హోంశాఖను తీసుకుంటానని ప్రకటించడం వంటివి చంద్రబాబుతో పాటు లోకేష్‌కు లోలోన కోపం తెప్పించినా ఏమీ చేయలేని పరిస్థితి కావడంతో మిన్నకున్నారని అంటున్నారు.ఇక, కేబినెట్లో ఒకే ఒక డిప్యూటీ ఉండటం.. పైగా పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావడంతో ఆయన కాస్త స్వేచ్ఛగా.. మాట్లాడినా.. చంద్రబాబు ఏమీ అనలేకపోతున్నారు. పైగా ఆయన్ను నియంత్రించడం.. వంటివి చేస్తే మళ్లీ ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి కావడంతో ఆయన్ను అలాగే ఉంచి అయన పక్కన డిప్యూటీ హోదాలో లోకేష్‌ను నిలబెడితే ఆటోమేటిక్‌గా పవన్ ప్రాధాన్యం తగ్గిపోతుందని.. ఇప్పుడు డిప్యూటీగా చేసేస్తే.. మున్ముందు చంద్రబాబు వయసు రీత్యా పదవి నుంచి తప్పుకున్నా లోకేష్‌ను సీఎంగా చేసేయవచ్చు అని టీడీపీ ఆలోచనగా ఉంది. ఇక కేబినెట్లో తనకు పోటీగా ఇంకో వ్యక్తిని డిప్యూటీ సీఎంగా చేస్తే పవన్ ఎలా స్పందిస్తారో అనేది చూడాల్సి ఉంది. -సిమ్మాదిరప్పన్న. -
టీడీపీ ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ!
పులివెందుల రూరల్: వైఎస్పార్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఇసుక టెండర్లలో బీటెక్ రవి అనుచరులు హంగామా సృష్టించిన విషయం సద్దుమణగక ముందే శుక్రవారం రాంగోపాల్ రెడ్డి వర్గీయుడు ప్రకాష్‌ను చితకబాది కిడ్నాప్ చేయడం కలకలం రేపింది.నియోజకవర్గంలో చౌక దుకాణాలకు డీలర్లను నియమించేందుకు శుక్రవారం పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాత పరీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గీయుడైన వేంపల్లెకు చెందిన ప్రకాష్ స్థానికంగా దుకాణం కోసం ఈ పరీక్ష రాయడానికి వచ్చాడు. అంతలో వేంపల్లెలోని అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకులు, బీటెక్ రవి అనుచరుడు రామమునిరెడ్డి, మరికొంత మంది అక్కడికి చేరుకుని.. ప్రకాష్‌ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.చితక బాది కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాంగోపాల్ రెడ్డి సతీమణి భూమిరెడ్డి ఉమాదేవి అనుచరులతో కలిసి పరీక్ష కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ప్రకాష్‌ను విడిచి పెట్టే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని అక్కడికి వచ్చిన పోలీసులకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కొద్దిసేపటికి బీటెక్ రవి అనుచరులు ప్రకాష్‌ను వదిలేశారు. అనంతరం ఉమాదేవి మాట్లాడుతూ.. ఒకే పార్టీలో ఉంటూ బీటెక్ రవి వర్గీయులు ఇలా చేయడం తగదని మండిపడ్డారు. టీడీపీకి చెడ్డపేరు వచ్చేలా చేస్తున్న వారిని ఉపేక్షించమని చెప్పారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రకాష్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబు అంకెల గారడీ: కాకాణి
సాక్షి, తాడేపల్లి: విజన్-2047 పేరుతో చంద్రబాబు(Chandrababu) డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకి ఇలాంటి తొండాట ఆడటం కొత్తేమీకాదన్నారు. ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తాడు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను పక్కన పెట్టేస్తాడు’’ అని మండిపడ్డారు.‘‘రంగురంగుల మేనిఫెస్టోలు, కలర్ పేజీల డాక్యుమెంట్లతో జనాన్ని మభ్యపెట్టటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఏమీ చేయకపోయినా చేసినట్టు ఎల్లోమీడియాలో బాకాలు ఊదుకుంటారు. ఐదేళ్ల అబద్దాలను నిన్న ఒక్కరోజే చంద్రబాబు చెప్పారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి, వృద్దిరేటు గురించి ఏమాత్రం మాట్లాడలేదు. మాటల గారడీ చేసే చంద్రబాబు ఈసారి అంకెల గారడీ కూడా చేశారు’’ అంటూ కాకాణి దుయ్యబట్టారు.‘‘రాష్ట్ర ఆదాయం ఏమాత్రం పెరగకుండా జీఎస్డీపీ ఎలా పెరిగిందో చంద్రబాబుకే తెలియాలి. ప్రభుత్వ ఆదాయం 1.15 శాతం తగ్గితే మరి జీఎస్డీపీ ఎలా పెరిగింది?. తాను ఏం చెప్పినా జనం నమ్ముతారనుకోవటం చంద్రబాబు భ్రమ. వాస్తవాలను దాచి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు పెరగాలని చంద్రబాబు అంటున్నారు. ఈ స్థాయిలో వృద్దిరేటు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. బిల్‌క్లింటన్ వచ్చినప్పుడు బిచ్చగాళ్లని తీసుకుని వెళ్ళి ఎక్కడో వదిలేశారు. తద్వారా తమ రాష్ట్రంలో పేదరికం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు...చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే వృద్దిరేటు పెరిగిందని కేంద్ర సంస్థలే చెప్పాయి. పారిశ్రామిక నికర ఉత్పత్తి 11వ స్థానంలో ఉంటే జగన్ హయాంలో 9వ స్థానానికి వచ్చింది. అంటే జగన్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి పెరిగింది. తలసరి ఆదాయాల విషయంలో కూడా చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. ఇంటర్మీడియట్ తప్పిన చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబులాగా మాట్లాడితే మా దేశంలో జైలులో పెడతారని గతంలోనే స్విట్జర్లాండ్ మంత్రి అన్నారు..చంద్రబాబు హయాంలో అతివృష్టి, అనావృష్టితో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మేనిఫెస్టో హామీలను అమలు చేయకుండా జనాన్ని ఊరిస్తూనే ఉన్నారు. చెప్పినవి చేయకుండా జనాన్ని నిలువునా మోసం చేశారు. గతంలో జగన్ పేదలకు ఇచ్చిన స్థలాలను తీసుకుని తన మనుషులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని మరొకటి లేదు’’ అని కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
పులివెందుల టీడీపీలో వర్గపోరు.. కార్యకర్తపై బీటెక్ రవి అనుచరుల దాడి!
సాక్షి, వైఎస్సార్: పులివెందులో టీడీపీ(TDP) నేతల మధ్య వర్గపోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రేషన్ షాప్ డీలర్ల విషంయలో తమ ఆధిపత్యం చాటుకునేందుకు పచ్చ నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో, టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వాగ్వాదంలో అతడి చొక్కా చిరిగిపోయింది. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.వివరాల ప్రకారం.. పులివెందులలో రేషన్ షాపుల కోసం టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. నేడు రేషన్ షాప్ డీలర్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ వర్గానికి చెందినవారే పరీక్షకు హాజరు కావాలంటూ రెండు వర్గాలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కేవలం తమ వాళ్ళే పరీక్ష రాసి షాపులు పొందాలంటూ ఇరువర్గాల పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో వాగ్వాదం మరింత పెరిగింది.ఘర్షణ అనంతరం, వేంపల్లికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిపై బీటెక్ రవి అనుచరులు దాడి చేశారు. దీంతో, దాడికి నిరసనగా పరీక్షా కేంద్రం వద్ద ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత నాటకీయంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పరీక్షా కేంద్రం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తతకర పరిస్థితిలు నెలకొన్నాయి. మరోవైపు గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఇసుక టెండర్ల కోసం బీటెక్ రవి అనుచరులు హంగామా సృష్టించారు. ఆ ఘటన మరవక ముందే శుక్రవారం పులివెందులలో మరోసారి రెచ్చిపోయారు. -
‘సంక్రాంతికి వెరైటీ దోపిడీ.. కూటమి సూపర్ ఫైవ్ ఇవేనా?’
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja). ఏపీలో నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. పేకాట, గుండాట, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్, మద్యం అమ్మకాలు.. ఇదే కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు.రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబు(Chandrababu), పవన్(Pawan Kalyan) ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. సంక్రాంతి(sankranthi) సంబరాలు అంటే గంగిరెద్దులు ముగ్గులు, అక్కడక్కడ కోడిపందాలు మాత్రమే గతంలో ఉండేవి. సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చారు కూటమి నేతలు.. నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు.. గుండాటలు జరిగాయి.ఒక్కో మహిళకు నెలకు 15వేలు చొప్పున ఆర్థిక సాయం అన్నారు.. సూపర్ సిక్స్ మేనిఫెస్టో దేవుడి పేరిట అటకెక్కింది. పేకాట, గుండాట.. కోడిపందాలు.. రికార్డింగ్ డ్యాన్స్.. మద్యం అమ్మకాలు.. ఇవే కూటమి మేనిఫెస్టో. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చూసినట్టు కోడి పందాలను, ప్రీమియర్ లీగ్‌లా నిర్వహించి పార్కింగ్ పేరిట సామాన్యుడి దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో భూపాలపట్నంలో డ్రగ్స్.. రేవ్ పార్టీలు.. రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి తీసుకొచ్చారు. అనకాపల్లిలో గంజాయి దొరికితే.. అందులో రాజానగరం నియోజకవర్గం కాపవరం గ్రామానికి చెందిన జనసేన నేతలు మూలాలు ఉన్నాయి.గంగాధర్ అనే వ్యక్తి గుండాటలో డబ్బులు పోయాయని ఆత్మహత్య చేసుకున్నాడు. బహిరంగంగా పోలీసులను కూడా వేదికలపై నుండి బయటకి గెంటేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గాల్సి వచ్చింది. కొన్నిచోట్ల సంక్రాంతికి అసలు పోలీసులు ఉన్నారా లేరా అనే ప్రశ్న తలెత్తింది. రాజమండ్రి పేపర్ మిల్‌పై వేలమంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి చేస్తున్నాడు. ప్రవీణ్ చౌదరికి తెలుగుదేశంలో మూలాలు ఉన్నాయి.. బుచ్చయ్య చౌదరి అడుగుజాడల్లో నడుస్తాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
వాట్సాప్ పాలన.. అలాంటి విజన్ కాదుగా!
ఎప్పటికి ఎయ్యేది ప్రస్తుతమో అప్పటికి.. ప్రజలను మాయ చేయడమనేది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిత్యకృత్యంలా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలు తయారు చేసి ప్రజలపైకి వదులుతూంటారు ఈయన. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఆత్మ పరిశీలనను ఏమాత్రం చేసుకోరు. సరికదా.. తాను చేసిందే రైట్ అన్నట్టుగా వ్యవహరిస్తూంటారు. ఏ రోజుకు ఆ రోజు మీడియాలో కనిపించామా లేదా? అన్నదే ఆయన ఆలోచనగా ఉంటుంది. ఇలా బాబు గారి బుర్రకు తట్టిన సరికొత్త నినాదం ‘వాట్సప్ పాలన’!!!. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మాల చెంతకు చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎనిమిది నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచి మరీ ఈ వ్యవస్థకు మంగళం పాడేశారు. ఇప్పుడు కొత్తగా వాట్సప్ పాలన రాగం అందుకున్నారు. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు గారు గతంలోనూ ఇలాంటి గిమ్మిక్కులు చాలానే చేశారు. ఒకసారి సుపరిపాలన అంటారు ఇంకోసారి కంప్యూటర్ పాలన అంటారు. జన్మభూమి కమిటీలతో పాలన అని రకరకాల పేర్లతో ప్రజల్లో ఏదో ఒక భ్రమ నిత్యం ఉండేలా చూస్తారన్నది తెలిసిందే. వాట్సప్ పాలన కూడా ఇదే కోవకు చెందిందా? ప్రజలకు ఏమైనా ప్రయోజనం లభిస్తుందా? లేక బాబుగారి ప్రచార ఆర్భాటాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోతుందా?.... వాట్సప్ పాలన ఆలోచన నిజాయితీతో కూడినదైతే తప్పు లేకపోవచ్చు. అయితే కొంచెం తరచి చూస్తే దీని లక్ష్యం ఇంకోటి ఏదో అని అనిపించకమానదు. ఎందుకంటే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని, గౌరవ వేతనాన్ని రూ.ఐదు నుంచి రూ.పది వేలకు పెంచుతామని చంద్రబాబు గత ఏడాది ఉగాది పర్వదినం రోజున దైవసాక్షిగా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనికి ‘ఊ’ కొట్టారు. పెంచిన జీతం పక్కా అని ఊదరగొట్టారు. కానీ పాత లక్షణాలు అంత తొందరగా పోవంటారు. మాట ఇచ్చి తప్పడమనే బాబుగారి పాత లక్షణం కూడా మాసిపోలేదు. ఎన్నికలయ్యాక యథా ప్రకారం క్రమ పద్ధతిలో వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ బాబు ఒకడుగు ముందుకేసి ‘‘వలంటీర్ల వ్యవస్థ ఎక్కడుంది?’’ అని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని, అందువల్ల అసలు వ్యవస్థే లేనప్పుడు జీతాలు ఇస్తామని వీరు అమానవీయ ప్రకటనలు చేశారు. అప్పటికి గాని వలంటీర్లకు చంద్రబాబు, పవన్ అసలు స్వరూపం తెలియరాలేదు. రెండు లక్షల మంది వరకూ ఉన్న వలంటీర్లకు ఉన్న కాస్తా అదరువు కూడా లేకుండా పోయింది. ప్రజలకు అందాల్సిన సేవలూ నిలిచిపోయాయి. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి వ్యాధి నియంత్రణకు ఈ వ్యవస్థ చేసిన కృషిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. గ్రామాల్లో ఎవరికి ఏ అవసరమొచ్చినా వలంటీర్‌కు చెబితే చాలు అన్నీ జరిగిపోతాయన్న భరోసా ఉండేది. కులం, నివాస, ఆదాయం.. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా గంటల వ్వవధిలో ఇంటికి చేర్చేవారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇళ్ల వద్దే వృద్దులకు ఫించన్లు అందచేసేవారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ప్రజల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ప్రభుత్వం వాట్సప్ పాలన ఆలోచన!. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను వాట్పప్ ద్వారా అందివ్వాలన్నది ఈ వాట్సప్ పాలన ప్రాథమిక ఆలోచన. దీంతోపాటే మరో 150 రకాల ప్రభుత్వ సేవలూ అందిస్తామని చెబుతున్నారు. బాగానే ఉంది కానీ.. అంత సులువుగా అంతా జరిగిపోతుందా? ప్రజలు ఆఫీసులకు వెళ్లకుండానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయా? ప్రజలు వాట్సప్ ద్వారా తమ అవసరాలు తెలియజేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారా? ఆ స్థాయిలో యంత్రాంగం ఉంటుందా? వాట్సప్‌లో నకిలీ సర్టిఫికెట్లు వస్తే ఏమి చేయాలి? ఎవరైనా వాట్పప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చా? అనేది చూడాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా ఈ వాట్సప్ పాలన అదిరిపోతుందని ఇకపై ప్రచారం చేయవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ప్రజలు మర్చిపోవడానికి దీనిని ప్లాన్ చేసి ఉండవచ్చు. ఇది డైవర్షన్ టాక్టిస్లలో ఒకటని చెప్పవచ్చు. ఇదే టైమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన ప్రచారానికి కూడా ఈ వ్యవస్థను వాడుకునే అవకాశం ఉంది. గతంలో సుపరిపాలన ,కంప్యూటర్ పాలన అంటూ రకరకాల విన్యాసాలు చేశారు. కాని అవేవీ ప్రజలకు సంతృప్తి కలిగించలేదు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి ప్రతి పనికి ఏభై శాతం వాటా చెల్లించాలని కండిషన్ పెట్టేవారు. ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తే, ఆయనను దించేసి ప్రజల వద్దకు ప్రభుత్వం అంటూ కొంతకాలం హడావుడి చేశారు. అవన్ని ఆయన తన పబ్లిసిటీ కోసమే వాడుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయం. తత్ఫలితంగా 2004లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2014 టరమ్‌లో జన్మభూమి కమిటీల పాలన చేశారు. అది ప్రజలను మరింతగా వేధించింది. దాంతో 2019లో మళ్లీ పరాజయం చెందారు. ఈసారి వాట్సప్ పాలన. ఇది ఏ ఫలితాన్ని ఇస్తుందో?. ఇక.. మరోవైపు ప్రతి కుటుంబం నలుగురు పిల్లలు కలిగి ఉండాలని ఆయన ప్రచారం ఆరంభించారు. కుటుంబ నియంత్రణను తానే గతంలో ప్రచారం చేశానని, ఇప్పుడు పిల్లలను అధికంగా కనమని చెబుతున్నానని అంటున్నారు. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్లే అని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. నిజంగానే 400 ఎకరాలు ఉన్నట్లే అయితే చంద్రబాబు చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వారే తమ కుటుంబంలో ఎందరు పిల్లలు ఉండాలన్నది డిసైడ్ చేసుకుంటారు. చంద్రబాబు ముందుగా తన కుటుంబం, బంధు మిత్రులు, తెలుగుదేశం నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ నలుగురు పిల్లల సిద్ధాంతం చెప్పి ఆచరింపచేయాలని కొందరు సూచిస్తున్నారు. ఉన్నతాదాయ వర్గాల వారు నలుగురు పిల్లలు ఉన్నా బాగానే పోషించుకోగలుగుతారు. ప్రస్తుత సమాజంలో వారేమో ఒక్కరు లేదా ఇద్దరికి పరిమితం అవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటే ఎవరు పోషిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికే అధిక సంతానం ఉన్న పేద కుటుంబాలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో అందరికి తెలుసు. చంద్రబాబును నమ్మి పిల్లలను కంటే కొంప మునుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ఇంటిలో స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎందరు ఉంటే వారందరికి రూ.15 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని టీడీపీ, జనసేన జాయింట్ మేనిఫెస్టోలో ప్రకటించాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదికి తల్లికి వందనం స్కీమ్‌కు ఎగనామం పెట్టారు.అలాగే మహిళలు చంద్రబాబును నమ్మెదెలా? అనే మరో చర్చ నడుస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పోనీ యువత అయినా విశ్వసిస్తారా? అంటే అదీ కనబడడం లేదు. నిరుద్యోగులపై యువకులు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసి తుస్సుమనిపించారు. ఎప్పుడు ఈ స్కీములు అమలు అవుతాయో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు లేదా అంతకుమించి పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత నిబంధన తెస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఎవరికైనా పిల్లలు కలగకపోతే వారు స్థానిక ఎన్నికలకు అర్హులు కారని ప్రభుత్వం చెబితే దారుణంగా ఉంటుంది. అది కేవలం స్థానిక ఎన్నికలకే ఎందుకు? ముందుగా శాసనసభ ఎన్నికలలో నిబంధన పెట్టేలా కేంద్రానికి చెప్పి చేయించవచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలను కనడం కరెక్టా ? కాదా? అన్నది ప్రశ్న కాదు. నిజంగానే ప్రతి కుటుంబం అలా చేస్తే ప్రత్యేకించి, పేద, మధ్య తరగతి కుటుంబాలు వారందరికి సరైన విద్య చెప్పించగలుగుతాయా? వైద్యం అందించగలుగుతాయా? ప్రభుత్వాలు వారందరికి ఉపాధి అవకాశాలు చూపగలుగుతాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఎప్పుడో ఏదో ఒక కొత్త సంగతి చెబుతూ ప్రజలను ఏమార్చుతూ, వేరే అంశాలపై చర్చ జరిగేలా చేస్తే సూపర్ సిక్స్ వంటివాటిని జనం మర్చిపోతారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
అమరావతి, సాక్షి: బ్యూరోక్రసీతో తనకు ఎలాంటి అవసరం లేదని.. తాను కేవలం రాజకీయ పాలనే చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ తరహా పాలన అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. వ్యవస్థలన్నీ కుంటుపడిపోయాయి. సంక్షేమ పథకాలు మూలనపడ్డాయి. ఈ తరుణంలో.. ఇక రాజకీయ పాలనతో ఆ పరిస్థితిని మరింత దిగజార్చాలన్నది చంద్రబాబు (Chandrababu) ప్రయత్నంగా కనిపిస్తోంది. ‘‘రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్‌మార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్‌మార్టం తప్పదు. సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని కంట్రోల్లో పెట్టాం. ఒకరిని చంపితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని.. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారు. పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది పార్టీ కార్యకర్తలే తప్ప బ్యూరోక్రసీ కాదన్నారు. అందువల్ల కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది’’రాజకీయ పాలన పేరుతో మళ్ళీ జన్మభూమి కమిటీ(Janmabhoomi Committee)ల రంగప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కుటుంబాలకు పెన్షన్లు కట్ అయ్యాయి. ఏ పని కావాలన్నా టీటీడీ నేతల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే.. తమ నేతలు చెప్పిన వారికే పనులు చేయాలని అధికారులకూ ఆదేశాలు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. కుర్చీలో కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి మరీ పని చేసిపెట్టాలని ఆయన అన్నారు. ఇక ఇప్పుడు ఏపీలో రాజకీయ పాలనతో అధికార యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. అర్హులకు పెన్షన్లు అందడం లేదు.. అలాగే ఇతర ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి కూడా. -
‘‘రేయ్.. నీ కథ చూస్తా!’’ జేసీ బెదిరింపులు వెలుగులోకి
అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు. దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిలిచినా మీటింగ్‌కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే.. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత! -
ఇసుక కోసం టీడీపీ, జనసేన సిగపట్లు
కడప కోటిరెడ్డి సర్కిల్: ఇసుక కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు గురువారం సిగపట్లు పట్టారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు, సిద్దవటం మండల జనసేన పార్టీ నాయకుడు అతికారి కృష్ణ వర్గీయులు బాహాబాహీకి దిగారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కలెక్టరేట్లోనే ఈ రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణపడ్డాయి. జిల్లాలోని సిద్దవటం మండలం గుండ్లమూల గ్రామం వద్ద ఇసుక రీచ్‌కి గనులు, భూగర్భ శాఖ జిల్లా స్థాయి ఇసుక కమిటీ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 5.30 లోగా టెండర్లు దాఖలు చేయాలని, 17వ తేదీ ఉదయం 10 గంటలకు టెండర్లు తెరుస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెండర్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్ ఆవరణలోని మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి ఇరువర్గాల నాయకులు గురువారం ఉదయమే చేరుకున్నారు. టెండరు పత్రాల దాఖలు సమయంలోనే వివాదం మొదలైంది. తమ సొంత మండలమైన సిద్దవటంలో ఇసుక టెండరు తమకే దక్కాలని అతికారి కృష్ణ వర్గీయులు పట్టుపట్టారు. బీటెక్ రవి వర్గీయులు ససేమిరా అన్నారు. అతికారి కృష్ణ వర్గీయుల నుంచి టెండరు ఫారాలు లాగేసుకున్నారు. టెండర్లు వేయడానికి వచ్చిన ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడి నుంచి పంపేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి, అతికారి కృష్ణ వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహీకి దారి తీసింది. ఒక దశలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో కార్యాలయం ప్రాంతం దద్దరిల్లింది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో అక్కడి ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఘర్షణ వాతావరణంలోనే టెండర్లు వేశారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి వర్గీయులు సైతం టెండర్లకు హాజరయ్యారు. టెండర్లను ఖరారు చేస్తారా లేదా తిరిగి నిర్వహిస్తారా అనే విషయం కలెక్టర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా మైన్స్ అండ్ జియాలజీ డీడీ సూర్యచంద్రరావు అందుబాటులోకి రాలేదు. -
‘తాగు.. తిను.. ఊగు.. సంక్రాంతి పేరుతో కూటమి సర్కార్ దోపిడీ’
సాక్షి, విజయవాడ: సంక్రాంతిని కూటమి ప్రభుత్వం దోచుకుందని.. దోపిడీకి ఏ మార్గాన్ని వదలడం లేదంటూ వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్(Pothina Mahesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంక్రాంతి(Sankranti)ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారు. సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకెళ్లారు. పాఠశాలలను కూడా జూద కేంద్రాలుగా మార్చేశారు’’ అని దుయ్యబట్టారు.‘‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల బరుల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారు. మద్యాన్ని ఏరులై పారించారు. రికార్డింగ్ డాన్స్‌లు చేయించారు. పండుగను అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకున్నారు. పేదలు ఈ సంక్రాంతి పండుగకు దూరమయ్యారు. తాగు... తిను.. ఊగు అనే కొత్త నినాదాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది’’ అంటూ పోతిన మహేష్ ధ్వజమెత్తారు.‘‘సంక్రాంతి సంబరాలను ఆర్గనైజింగ్ క్రైమ్‌గా మార్చేశారు. జూదం అధికారికమే అనేలా కూటమి అనుమతులిచ్చింది. ఐపీఎల్ మాదిరి కోడి ప్రీమియర్ లీగ్‌లు పెట్టారు. పనులు చేసుకోవద్దు.. వ్యసనాలకు అలవాటు పడండని చంద్రబాబు ప్రజలకు చెప్పదలచుకున్నారా సమాధానం చెప్పాలి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు కోడి పందాల్లో పాల్గొన్నారు. మహిళా బౌన్సర్లను పెట్టి విష సంస్కృతి తెచ్చారు. మైనర్లు సైతం గుండాట, పేకాట ఆడారు. కోడి పందాలు ఆడుకోవచ్చని అనుమతులుచ్చారా.. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలి’’ అని మహేష్ నిలదీశారు.‘‘భీమవరంలో క్యాసినో సెంటర్ పెట్టారు. కుక్కుట శాస్త్రం ప్రకారం రూ.కోటి 25 లక్షలతో ముహూర్తం పెట్టి ఆడించారు. చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. కోడి పందాల బరులకు టీడీపీ, జనసేన ట్యాక్స్ కట్టించుకున్నారు. స్కూళ్లలో కోళ్ల పందాలు పెట్టి విద్యార్ధులకు ఏం సందేశం ఇస్తారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. గోదావరి జిల్లాలకు ధీటుగా కృష్ణాజిల్లాలో 320కి పైగా కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు’’ అని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు...ఇదేం పాలన అని జనం చంద్రబాబు, పవన్‌ను తిట్టుకుంటున్నారు. వైఎస్ జగన్‌ను అనవసరంగా వదులుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విజనరీ ఎవరని ప్రజల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రాన్ని కోడి పందాలు.. పేకాటకు కేరాఫ్‌గా మార్చాలనుకుంటున్నారా చంద్రబాబు?. అశ్లీల నృత్యాలేనా పర్యాటకం అభివృద్ధి అంటే. ఇదేనా చంద్రబాబు మీ విజన్ 2047 అంటే. కోడి పందాలను ప్రమోట్ చేసిన ఒక్క సెలబ్రిటీ మీదనైనా కేసు పెట్టారా?. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను చంద్రబాబు, పనన్ సర్వ నాశనం చేస్తున్నారు.ఇదీ చదవండి: పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?..పేకాట, కోడి పందాలు.. అశ్లీల నృత్యాలు చూడాలంటే ఏపీకి వెళ్లాలని పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలు అనుకుంటున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు కట్టిన జగన్ అసలైన విజనరీ. ఉపాధి అవకాశాలు కల్పించలేమని పవన్ చెప్పిన కొద్దిసేపటికే ఇద్దరు యువకులు చనిపోయారు. ఇద్దరి చావుకు కారణమైన పవన్‌పై కేసు పెట్టాలా వద్దా?. పవన్ పదే పదే సనాతన ధర్మం.. సంస్కృతి అంటున్నారు. కోడి పందాలు, పేకాట, గుండాట ఆడటమే ధర్మమా?..అశ్లీల నృత్యాలే మన సంస్కృతా... పవన్ సమాధానం చెప్పాలి. ఇటీవల పవన్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అడిగేవాడు లేక జనసేన కార్యకర్తలు బరితెగించారు. నేషనల్ హైవేపై టోల్ గేట్ పెట్టడమేంటి?. కోడి పందాలు నిర్వహించినందుకు పవన్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదు. పార్టీలో చేర్చుకున్న భూకబ్జాదారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నలు గుప్పించారు. -
కోడి పందెం ముసుగులో గొడవ.. వైఎస్సార్సీపీ నాయకుడి హత్య!
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి పాలనలో వైఎస్సార్సీపీ యువనేత మణితేజ అనుమానస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రశాంతంగా ఉన్న నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పచ్చ గూండాలే హత్య చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక, మణితేజ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.మణితేజ మృతి విషయం తెలుసుకుని నందిగామలోని ఆసుపత్రి వద్దకు వైస్సార్సీపీ నాయకులు చేరుకున్నారు. మణితేజ మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సహా పలువురు పరిశీలించారు.అనంతరం, దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. మణితేజ కుటుంబం వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటోంది. వారంతా పార్టీలో యాక్టివ్‌గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు. మణితేజ హత్యను టీడీపీ, పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు. మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి.ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి. మణితేజ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. మణితేజ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులదే. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడు సంక్రాంతులే. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారు. తప్పుచేసిన వారికి చట్టపరంగా కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం. మణితేజ కుటుంబానికి చంద్రబాబు, పవన్, లోకేష్ సమాధానం చెప్పాలి. రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉంది ముగిసిపోలేదని లోకేష్ అంటున్నాడు. మనుషుల ప్రాణాలు తీయడమేనా రెడ్ బుక్ అంటే అని ప్రశ్నించారు.అనంతరం, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. మణితేజ మృతిని ప్రమాదంగా చిత్రీకరించారు. తలపై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేసినందుకు మణితేజను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోడిపందాల వద్ద గొడవ తర్వాత మణితేజ చనిపోయాడు. మణితేజ మృతిని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరావు మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ హత్యే. మణితేజ మృతిని హత్య కేసుగానే నమోదు చేయాలి. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. జై జగన్ అంటే కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించి తిరిగి మా పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అయ్యన్న ముంగిట్లో సీఎం రమేష్ హడావుడి రగులుతున్న కుంపటి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అయ్యన్న ముంగిట్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంక్రాంతి సందడి చేశారు. నర్సీపట్నంలోని ప్రైవేటు రిసార్టులో గత మూడు రోజులుగా మకాం వేసిన రమేష్... సంక్రాంతి వేడుకలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి నిర్వహించుకున్నారు. ఇటువైపు కనీసం టీడీపీ నేతలు కన్నెత్తి చూడలేదు. మరోవైపు స్పీకర్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జరుగుతున్న మకర జ్యోతి మహోత్సవాలకు సీఎం రమేష్‌ను ఆహ్వానించలేదు. ఒకవైపు నర్సీపట్నం కేంద్రంగా పలువురు నేతలను తనకు తెలియకుండా బీజేపీలో చేర్చుకోవడంతోపాటు పోటీగా రాజకీయాలు చేస్తున్నారని అయ్యన్న భావిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కనీస సమాచారం లేకుండా జరుగుతున్న చేరికలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు కొద్దిరోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన ప్రధాని సభ సందర్భంగా కూడా స్పీకర్ హోదాలో తనకు కనీస గుర్తింపు దక్కలేదని ఆయన కినుక వహించినట్టు తెలుస్తోంది. ప్రధాని సభకు జన సమీకరణ సందర్భంగా... నర్సీపట్నంలో మీరు చేర్చుకున్న నేతల ద్వారా జనాలను తరలించుకోండంటూ సీఎం రమేష్‌కు అయ్యన్న గట్టిగా బదులిచ్చినట్టు సమాచారం. మొత్తంగా నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు రిసార్టు కేంద్రంగా జరిగిన సంక్రాంతి వేడుకలు కాస్తా కూటమిలో భోగి మంటలను మించి వేడిని రాజేశాయని అర్థమవుతోంది. కొరివితో తలగోక్కున్నట్టు...! వాస్తవానికి అనకాపల్లి ఎంపీ పోటీలో స్థానికేతరుడైన దిలీప్‌కుమార్‌కు సీటు ఇవ్వాలని టీడీపీ భావించింది. ఈ సీటును తన కుమారుడి కోసం ఆశించిన అయ్యన్నపాత్రుడు... స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ ఎన్నికల ముందు జరిగిన పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే మాట్లాడారు. అయితే, పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ స్థానంలో ఎంపీ అభ్యరి్థగా సీఎం రమేష్‌ను బీజేపీ ప్రకటించింది. అనూహ్యంగా అయ్యన్నపాత్రుడు రమేష్‌ను వెంటబెట్టుకుని మరీ ఎన్నికల్లో కలియతిరిగారు. మిగిలిన నేతల కంటే ఎక్కువగా సీఎం రమేష్ తో సఖ్యతగా మెలిగారు. తీరా ఎన్నికల తర్వాత నర్సీపట్నంలోనే సీఎం రమేష్ రాజకీయం మొదలుపెట్టారు. దీంతో కొరివితో తలగొక్కున్నట్టుగా పరిస్థితి తయారయ్యిందని అయ్యన్న వాపోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విశాఖలో ప్రధాని పర్యటన సందర్భంగా నర్సీపట్నం నుంచి జనసమీకరణపై సీఎం రమేష్ అయ్యన్నను కదిపే ప్రయత్నం చేశారు. మీరు చేర్చుకున్న నాయకులతో జనాలను తరలించుకువెళ్లండంటూ అయ్యన్న గట్టిగానే బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంక్రాంతి సందర్భంగా సీఎం రమేష్ నర్సీపట్నంలో మకాం వేయడం చర్చనీయాంశమవుతోంది. సీఎం రమేష్ సమక్షంలో బీజేపీలో చేరిన ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లతో పాటు ఓ డాక్టర్, జనసేన నేతలు సదరు ప్రైవేటు రిసార్టు వద్ద హడావుడి చేస్తున్నారు. అయితే, అటువైపు ఏ ఒక్క టీడీపీ నేత కానీ కార్యకర్త కానీ వెళ్లకపోవడం గమనార్హం. విశాఖ డెయిరీ డైరెక్టర్ల చేరికపై...! విశాఖ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ హడావుడిగా అసెంబ్లీలో సభా సంఘాన్ని స్పీకర్ అయ్యన్న ఏర్పాటు చేశారు. దీనిపై పార్టీలోని నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయనే ప్రచారం ఉంది. మరోవైపు తమ పార్టీలో విశాఖ డెయిరీ నేతలను చేర్చుకుంటున్నట్టు సీఎం రమేష్.... అయ్యన్నకు సమాచారమిచ్చినప్పటికీ ఆ విషయంలో ముందుకు వెళ్లడంపై కూడా సీఎం రమేష్ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలోని ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లు సూర్యనారాయణ, రాజకుమారిలను బీజేపీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా నర్సీపట్నంలోని డాక్టర్ కిలాడి సత్యనారాయణను కూడా తాజాగా ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీలో చేర్చుకున్నారు. ఈ చేరిక వెనుక కూడా సీఎం రమేష్ ఉన్నట్టు అయ్యన్న మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ అంటే ఎవరో తెలియని సందర్భంలో ప్రతీ చోట పరిచయం చేసిన తననే లెక్కచేయకపోవడంపై అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ కాస్తా కూటమి నేతల మధ్య కుంపటి రాజేసిందని చెప్పవచ్చు. అది నేనే.. ఇది నేనే..!