breaking news
-
పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతా బాగానే ఉందా? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం గంటల తరబడి వేచి ఉండి, చివరికి తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణించినా... ప్రభుత్వం, టీటీడీ పెద్దలు అదేదో చాలా చిన్న అంశమైనట్లు వ్యవహరిస్తున్నారా? టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి తమ మధ్య విభేదాలు లేవు.. కలసి పని చేస్తున్నామని చెబితే జనం నమ్మాల్సిందేనా?.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు బీఆర్ నాయుడు ఇతర ఉన్నతాధికారులంతా ఎవరిని మోసం చేస్తున్నారు?. ప్రజలనే కాదు.. తమను తాము మోసం చేసుకుంటూ తిరుమలేశుడిని కూడా మోసం చేయడం కాదా!. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు సూక్తి ముక్తావళి చెబుతున్నారు. తిరుమల లడ్డూ ఉదంతం నుంచి వరసగా జరుగుతున్న అనేక సంఘటనలలో అపచారానికి పాల్పడుతున్నది ఎవరు?. హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నది ఎవరు?. కచ్చితంగా చంద్రబాబు, పవన్‌తో పాటు బీఆర్ నాయుడు కూడా బాధ్యత వహించవలసిందే. 👉బీఆర్ నాయుడు(BR Naidu)కు నిజంగా హిందూ సెంటిమెంట్, దైవభక్తి ఉంటే పదవి నుంచి తప్పుకుని దైవ సన్నిధిలో క్షమాపణ కోరి ఉండాల్సింది. ఒకవేళ రాజీనామాకు మొండికేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవి నుంచి తొలగించి ఉండాలి. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు, టీటీడీ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఉప ముఖ్యమంత్రి పవన్ తిరుపతిలో సనాతన హైందవ ధర్మం సక్రమంగా నడవడం లేదని, తిరుమల పుణ్యక్షేత్రానికి అపచారం జరిగిందని ప్రకటించి కూటమి నుంచి వైదొలగి ఉండాల్సింది. బీజేపీ హిందూ మతానికి తానే ప్రతినిధి అన్నట్లు నటించడం కాకుండా, తాము ఈ పాపానికి బాధ్యత తీసుకోలేమని ప్రకటించి ఉండాలి. వీరెవ్వరూ ఆ పని చేయలేదు. క్షమాపణల డ్రామా నడిపి, ఛైర్మన్, ఇద్దరు ఉన్నతాధికారులను బలవంతంగా కూర్చోబెట్టి అతా బాగున్నట్లు కలరింగ్ ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేశారు. దీంతో మరణించినవారి ప్రాణాలు తిరిగి వచ్చేసినంతగా పిక్చర్ ఇస్తున్నట్లుగా ఉంది. ఇదంతా చంద్రబాబు స్టైలే. పైకి సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తూ, లోపల మాత్రం తుతు మంత్రంగా కథ నడిపిస్తుంటారు. ఇలాంటి తొక్కిసలాటలు(Stampede) జరిగితే పదవుల నుంచి తప్పుకోవడం అనేది నైతిక బాధ్యత. అలా విలువలు పాటిస్తారనుకోవడం అత్యాశే కావచ్చు!. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట వల్ల 29 మంది మరణిస్తేనే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోలేదు. ఇప్పుడు బీఆర్ నాయుడు పదవి ఎందుకు వదలుకుంటారు?. పుష్కరాల తొక్కిసలాట కేసులో ఎవరిపైన అయినా చర్య తీసుకుంటే అది తన వరకు వస్తుందని భయపడ్డ చంద్రబాబు ఒక్కరిపై కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. తిరుపతి ఘటనలో కూడా ఒక ఐదుగురు చిన్న స్థాయి అధికారులపై చర్య చేపట్టి, తనకు కావల్సిన అధికారి ఒక్కరిని మాత్రం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ డ్రామాలో పవన్ తన వంతు పాత్ర పోషించి రక్తి కట్టించారు. కాకపోతే మధ్యలో బీఆర్ నాయుడు చేతిలో పరువు పోగొట్టుకున్నారు. బీఆర్ నాయుడుతో సహా అధికారులంతా అంతా క్షమాపణ చెప్పాలని అన్నారు. కాని టీటీడీ చైర్మన్ మాత్రం పవన్ ఎవరు తనకు చెప్పడానికి అని తీసిపారేశారు. చివరికి ముఖ్యమంత్రి ఒత్తిడితో క్షమాపణ చెప్పినా పవన్ మాత్రం ఏ మాత్రం ఫీల్ కాకుండా సరిపెట్టుకున్నారు. బీఆర్ నాయుడి దెబ్బకు భయపడి ఆయన ఇతర అధికారుల జోలికి వెళ్లలేదు. ఇక చంద్రబాబు ఎదుటే బీఆర్ నాయుడు, శ్యామలరావులు ఘర్షణ పడ్డారు. దీన్ని తెలుగుదేశం జాకీ మీడియానే ప్రముఖంగా వార్త ఇచ్చింది. ‘నువ్వంటే.. నవ్వు...’ అనుకున్నారని కూడా రాశారు. అసలు తమకు ఏమీ చెప్పడం లేదని చైర్మన్ అంటే.. తాను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నానని ఈవో అన్నారు. మధ్యలో రెవెన్యూ మంత్రి జోక్యం చేసుకోవడం, చంద్రబాబు వారించడం వంటి సన్నివేశాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ రోజున వీరెవరూ ఖండించలేదు. కానీ.. తదుపరి బి.ఆర్.నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరిలు ఏమీ తెలియనట్లు నటించారు. ఇక నుంచి కలిసి పనిచేస్తామని చెబితే అది వేరే సంగతి. కాని అసలు గొడవలే లేవన్నట్లుగా మాట్లాడి ఎవరిని ఫూల్స్‌ను చేస్తారు?. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని నాయుడు అనడం మరీ విడ్డూరం. కొద్ది నెలలుగా ఈ అపచారానికి పాల్పడుతున్నది కూటమి పెద్దలు కాదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని అబద్దం చెప్పడం అపచారం కాదా? అలాంటిది ఏమీ లేదని శ్యామలరావు తొలుత చెప్పగా, ఆయనతో మాట మార్పించ లేదా? అది అప్రతిష్ట కాదా? ఆ మీదట పవన్ రెచ్చిపోయి సనాతని అంటూ వేషం కట్టి మరింత పరువు తీయలేదా? ఐదేళ్లుగా అసలు తిరుమలనే దర్శించని బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవికి నియమించడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? ఇప్పుడు లోకేష్ మనిషిగా ఉన్నందున బీఆర్ నాయుడును కనీసం పదవి నుంచి తప్పుకో అని చెప్పలేకపోతున్న చంద్రబాబు నిస్సహాయత వల్ల ఇమేజీ దెబ్బతినడం లేదా? జరగని కల్తీకి సంప్రోక్షణ చేయించిన చంద్రబాబు ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు మరణిస్తే ఎందుకు అలా ప్రత్యేక పూజలు చేయించలేదు? ఇది అపచారం కాదా? ఈ ఘటన కారణంగా భక్తుల సంఖ్య తగ్గిందని అంకెలతో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా అబ్బే అదేమీ లేదని బుకాయించడం అవసరమా?. టీటీడీ బోర్డులో ఛైర్మన్‌తో సహా పలువురు బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావుపై ధ్వజమెత్తడం అసత్యమా? ఆయన గుడికి వెళ్తే ఇతర అధికారులు సైతం పలకరించడానికి భయపడ్డారట!. అది ఎందుకు జరిగింది అంటే ఆయనకంటే వెంకయ్య చౌదరే పవర్ ఫుల్ అనే భావం కాదా? టీటీడీలో టెక్నాలజీని వాడుతున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ద్వారా క్రౌడ్, క్యూలైన్ మేనేజ్ మెంట్ గురించి గూగుల్ అధికారితో సలహాలు తీసుకున్నామని వెంకయ్య చెబుతున్నారు. అది నిజమైతే ఆ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారు?. పెద్ద ఘనకార్యం చేయబోతున్నట్లుగా చెప్పేవారు కదా?. ఇక.. అధికారిక సమావేశంలో కూడా కొందరు అనధికారులను ఎలా కూర్చోబెట్టారు.లక్ష్మణ్ అనే వ్యక్తి లోకేష్ సన్నిహితుడని చెబుతున్నారు. ఆయన, మరికొందరు తిరుమలలో పెత్తనం చేస్తున్న వార్తలను ఎందుకు ఖండించలేకపోయారు? తిరుపతిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు చెప్పినట్లుగానే టీటీడీ అధికారులు వ్యవహరించారని, ఒక డీఎస్పీ వల్ల తొక్కిసలాట జరిగిందని శ్యామలరావు అంటున్నారు. అంటే టీటీడీ అధికారుల తప్పు లేకపోయినా ఒక మహిళా జేఈవో పై చంద్రబాబు ఎందుకు చర్య తీసుకున్నారు?. ఎస్పీపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదు? ఇవన్ని పక్షపాతంతో చేసిన నిర్ణయాలుగానే కనిపిస్తాయి. ఇదేనా దైవభక్తి ఉన్నవారు చేసేది?. గతంలో జగన్ టైమ్‌లో ఉన్నవి, లేనివి సృష్టించి తిరుమలకు అపచారం జరిగిందంటూ చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దారుణ విష ప్రచారం చేసేవి. మరి ఇప్పుడు ఇంత ఘోరం జరిగినా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? కేవలం టీటీడీ ఛైర్మన్ నిర్వాకంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మనోభావాలు దెబ్బతింటాయా? తిరుమలకు అప్రతిష్ట వస్తుందా? గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై పదమూడు మంది మరణించిన ఘటనలో విదేశాలలో ఉన్న యాజమాన్యం వారిని కూడా అరెస్టు చేయాలని చంద్రబాబు, పవన్ లు డిమాండ్ చేశారా? లేదా?. ఆ ప్రకారమే జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించిందా? లేదా?. మరి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు దెబ్బతగిలేనా తొక్కిసలాటలో ఆరుగురు మరణిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఎందుకు కనీసం ఎవరిపైన కేసు పెట్టలేదు?. కేవలం పదవులు అంటిపెట్టుకుని హిందూ మతానికి తీరని పాపం చేస్తున్నది వీరే అని వేరే చెప్పనవసరం లేదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అది నేనే.. ఇది నేనే..!
తిరుపతి రూరల్/చంద్రగిరి: దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రకృతి వ్యవసాయాన్ని తానే ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం నారావారిపల్లె పర్యటనలో భాగంగా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. స్వర్ణ నారావారిపల్లె విజన్ తీసుకువస్తున్నామని వెల్లడించారు. అన్నీ నేనే చేశా.. అన్నీ నేనే చేస్తానంటూ హామీలు గుప్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..⇒ ప్రకృతి సేద్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అప్పట్లోనే కుప్పంలో నేనే ప్రారంభించా.⇒ నారావారిపల్లె పరిధిలోని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు తయారు చేయాల ని కలెక్టర్‌కు సూచించా.⇒ శ్రీసిటీ సౌజన్యంతో రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు సౌకర్యాలు, ఏఐ టెక్నాల జీ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం.⇒ ఫిబ్రవరి లోపు వందశాతం మరుగుదొడ్లు నిర్మిస్తాం.⇒ జల్ జీవన్ మిషన్ కింద రక్షిత మంచినీరు నిరంతరం అందిస్తాం.⇒ ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయిస్తాం.⇒ రంగంపేట నుంచి భీమవరం, మంగళం పేట వరకు రూ.8కోట్లతో రోడ్లు నిర్మిస్తాం.⇒ ప్రతి వీధికీ సీసీ రోడ్డు ఉండేలా చర్యలు చేపడతాం.⇒ విద్యార్థులు, గృహిణులు చదువుకునేందుకు, పనిచేసేందుకు ఐటీ టవర్ నిర్మిస్తాం.⇒ కల్యాణీ డ్యామ్‌ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు.పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు? -
పెళ్లి ఇంట్లో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అనుచరుల వీరంగం
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణంలో వివాహ వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుల వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. బనగానపల్లె పట్టణ వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ కుటుంబంలో జరుగుతున్న పెళ్లి కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు.పెళ్లి ఇంటికి డ్రోన్ షూట్ చేస్తుండగా మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి ఇంటిని షూట్ చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఓవర్‌యాక్షన్ చేశారు. డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. తెల్లవారితే వివాహం జరగాల్సిన ఇంట్లోవారిని భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ కార్యకర్తలను అదుపు చేయాల్సిన పోలీసు అధికారి టీడీపీ పార్టీకి వత్తాసు పలికారు.దీంతో పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనపై అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.ఇదీ చదవండి: స్కిల్ కేసులో సిట్ క్లోజ్.. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ -
‘కూటమి’ అరాచకాలను ప్రశ్నిస్తాం.. ఎదిరిస్తాం: అంబటి
సాక్షి, గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు(Namburu Sankara Rao) కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీకి వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. కొందరు తన కార్యాలయంలోకి చొరబడి ఫ్లెక్సీలు చింపి, అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని.. ఈ అంశంపై ఇవాళ(బుధవారం) జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు నంబూరు శంకర్రావు తెలిపారు.సహించం.. కచ్చితంగా తిప్పి కొడతాం: నంబూరు శంకర్రావు..మా కార్యాలయంపై దాడి చేసి తమ సిబ్బందిపై తిరిగి కేసులు పెట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. గత కొన్ని నెలల క్రితం పెదకూరపాడులో వైఎస్సార్సీపీ నేత సాంబిరెడ్డి కాళ్లు నరికారు. మా పార్టీ, కార్యకర్తలపై పెదకూరపాడులో దాడులు జరుగుతున్నాయి. గతంలో కొమ్మలపాటి శ్రీధర్, కన్నా లక్ష్మీనారాయణ, నేను పనిచేశాం. ఇలాంటి ఘటనలను ఇకపై మేము సహించేది లేదు.. కచ్చితంగా తిప్పి కొడతాం.నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదు. తప్పకుండా ప్రశ్నిస్తాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. వచ్చిన పదవి అవకాశాన్ని మంచిగా ఉపయోగించాలి. నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి’’ అని నంబూరు శంకర్రావు పేర్కొన్నారు.చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి: అంబటి రాంబాబుమాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని.. కూటమి నేతలు ఏడు నెలల్లో చేయకూడని అరాచకాలు చేశారని మండిపడ్డారు. ‘‘ఐదేళ్లు పాటు పెదకూరపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్రావుపై దాడి చేస్తామంటున్నారు. గతంలో నియోజకవర్గంలో రైతులను పరామర్శించేందుకు వెళ్లగా ఆయన కారుపై దాడికి పాల్పడ్డారు.. ఇది సహించరాని ఘటన. కచ్చితంగా పెదకూరపాడు వెళ్తాం.. కార్యకర్తల సమావేశం నిర్వహిస్తాం. పోలీసులే మాకు రక్షణ కల్పించాలి.ఇదీ చదవండి: ఇదేం బ్రొమాన్స్ బాబోయ్.. మోదీ పగలబడి నవ్వింది అందుకే!..రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతుంది. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి. పిల్లిని గదిలో వేసి కొడితే పులి అవుతుంది ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో రోజు రోజుకీ సమస్యలు ముదురుతున్నాయి. పండుగ కూడా చేసుకోకుండా దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులను ఎదిరించి, ధైర్యంగా నిలబడతాం. టీడీపీ చేసే ప్రతి దాడిని, దౌర్జన్యాన్ని ప్రజలకు వివరిస్తాం’’ అని అంబటి రాంబాబు తెలిపారు. -
‘జనసేన వాళ్లమని చెప్పినా చితకబాదారు!’
ఎన్టీఆర్, సాక్షి: పండుగ పూట కూటమి నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్యుల ముసుగుతో అశ్లీల నృత్యాలను దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. అలాగే బరుల్లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకూ పాల్పడుతున్నారు. అయితే.. కోడి పందేలు కూటమి మధ్య లుకలుకలను బయటపెడుతున్నాయి. బరుల్లో తెలుగు తమ్ముళ్లు(TDP Activists) బరి తెగించేస్తున్నారు. ఎవరూ ముందుకు రాకుండా.. ఉత్త పుణ్యానికే దాడులకు దిగుతున్నారు. అయితే ‘‘ఎందుకు కొడుతున్నారు?’’ అని అడిగినందుకు కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దాడిలో ఆరుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ ఆరుగురు జనసేన కార్యకర్తలని తేలింది. కంచికచర్ల(Kanchikarla) మండలం గండేపల్లి కోడిపందేల బరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము జనసేన వాళ్లమని చెప్పిన్నా వినకుండా దుర్భాషలాడుతూ తమను చితకబాదారని బాధితులు వాపోయారు. మరోవైపు తమ కార్యకర్తల పై జరిగిన దాడిపై జనసేన(Jana Sena) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చంద్రబాబు, పవన్‌లు 15 ఏళ్లు కలిసి పొత్తులో ఉందామనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు అలా ఉండనిచ్చేలా లేరు’’ అని అంటున్నారు. తాజా దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో కోడి పందేలు(Rooster Fightings) కూటమి నేతల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. జనసేన, బీజేపీ వాళ్లను టీడీపీ వాళ్లు ముందుకు రానివ్వకపోవడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఘటనలు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇక.. ఏపీలో సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలు. కోడిపందాల బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు కూటమి నేతలు. కోడి పందాల బరుల్లో వాటాల కోసం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. ఈ క్రమంలో.. తమ అనుచరులను రంగంలోకి దించుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల బరుల్లో జూదక్రీడలకు స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. పేకాట, గుండాట, లోన బయట , నంబర్ల గేమ్స్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఇక.. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు , బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ.. తొలి రెండు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తం.. ఈ పండక్కి జూదం ,మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు.. దానిని అంతే పక్కాగా అమలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. కోడిపందాలు , పేకాట ,గుండాటలు ఆడితే తాటతీస్తామని పండగ ముందు పోలీసులు హెచ్చరికల వరకే పరిమితం అయ్యారు. బరుల వద్ద కనీసం కనుచూపుమేరలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపించకపోవడంతో.. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కోడి పందేల కోసం మహిళా బౌన్సర్లు!! -
మోదీ పగలబడి నవ్వింది అందుకే!
దేశ ప్రధాని ఎవరైనా రాష్ట్రాలకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అభినందించడం సహజం. ఎవరూ తప్పుపట్టలేము. కానీ ప్రధానే ఇబ్బందిపడేలా పొగిడితే? ఎంత ఎబ్బెట్టు? ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో ఎన్డీయే సమావేశానికి హాజరైనప్పుడు జరిగింది ఇదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను ఆకాశానికి ఎత్తేయడం చూసి ప్రజలే విస్తుపోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఇది ఆయన సొంతపార్టీ తెలుగుదేశం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేది కూడా!. .. అంత పొగిడినా మోదీ నుంచి ప్రశంసలేవీ రాకపోవడం బహుశా బాబును నిరాశకు గురి చేసి ఉంటుంది. అలాగని ఆ విషయం గట్టిగా చెప్పలేని స్థితి. కేంద్రంలో ప్రభుత్వం తమ పార్టీ మద్దతుతోనే కొనసాగుతోందన్న భ్రమలో టీడీపీ శ్రేణులు ఉన్న సమయంలో.. చంద్రబాబు మోదీని పొగిడి పార్టీలో మరిన్ని సందేహాలకు తావిచ్చారనిపిస్తోంది. బహుశా కేంద్రం స్థాయిలో తనపై ఉన్న కేసులు, భవిష్యత్తులో కుమారుడు నారా లోకేశ్(Nara Lokesh)కు పట్టం కట్టాల్సి వస్తే సమస్యల్లేకుండా చూసుకోవడం వంటివి బాబుకు ఈ పరిస్థితి కల్పించి ఉంటాయని అనుకుంటున్నారు!. చంద్రబాబు తన ప్రసంగంలో అధిక భాగాన్ని మోదీ ప్రశంసలకే కేటాయించడం సొంతపార్టీలోనే చాలామందికి నచ్చలేదట!. ఇది పార్టీ ఆత్మ స్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేదిగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఏదైనా మంచి పని చేస్తే ప్రధానిని మెచ్చుకున్నా ఫర్వాలేదు కానీ చంద్రబాబు తన నోటితోనే 2019 ఎన్నికలకు ముందు దారుణమైన రీతిలో విమర్శించారు. పలు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానమంత్రిని ‘టెర్రరిస్టు’గా అభివర్ణించారు. ముస్లింలను బతకనివ్వని నేతగా చూపించారు. చివరికి భార్యను ఏలుకోలేని వ్యక్తి అని కూడా దూషించారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సైతం చంద్రబాబును తీవ్రంగానే విమర్శించే వారు. పోలవరం, అమరావతిలను చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అంటూ ఎన్నికల సమయంలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ‘యూ టర్న్ బాబు’ అని నామకరణం చేసింది కూడా మోదీనే. కొడుకు కోసమే బాబు పనిచేస్తున్నాడని ఎద్దేవా కూడా చేశారు. దీనికి ప్రతిగా బాబు తనకు కుటుంబం ఉందని, మీకేం ఉందని మోదీని ఘాటుగా ప్రశ్నించారు అప్పట్లో. అయితే 2024నాటికి తిరిగి వారిద్దరూ కలిసిన తీరు రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు అనేదానికి ఒక నిదర్శనం!. పరువు ప్రతిష్టలు, ఆత్మాభిమానం అన్నవి సామాన్య ప్రజలకు సంబంధించినవే కానీ, ఇలాంటి పెద్ద నాయకులకు కాదని అనుకునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి.. మోదీ కన్నా చంద్రబాబే సీనియర్ నేత. ఆయన 1978 నుంచి రాష్ట్ర రాజకీయాలలో ఉన్నారు. 1995లోనే తన మామ ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి ముఖ్యమంత్రి అయ్యారు. తాను సీనియర్‌ను అన్న విషయాన్ని ఆయన చాలాసార్లు పదే పదే గుర్తు చేశారు కూడా. అలాంటి బాబుగారు ఇప్పుడు ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అంటున్నారు. తమ ఇద్దరిది ఒకటే స్కూల్ అని చెబుతున్నారు. తెలుగుతో పాటు ఆంగ్లంలో కూడా ఈ పొగడ్తలను వినిపించడంతో మోదీ నవ్వుతూ కూర్చున్నారు. బహుశా ఇదే చంద్రబాబు గతంలో తనను ఉద్దేశించి ఏమన్నది మోదీకి గుర్తు వచ్చి ఉండవచ్చు!. గత మూడు దశాబ్దాలలో మోదీకి, చంద్రబాబుకు మధ్య పలుమార్లు వివాదాలు వచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు.. జరిగిన మత ఘర్షణలలో ఆయన రాజీనామాకు చంద్రబాబు డిమాండ్ చేశారు. మోదీని హైదరాబాద్ రానివ్వబోమని.. వస్తే అరెస్టు చేయిస్తానిని కూడా హెచ్చరించారు. అప్పటికి బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబు అలా మాట్లాడారు. 2009లో బీజేపీని వదలి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్), వామపక్షాలతో కూటమి కట్టి ఓటమి పాలవడంతో తిరిగి బీజేపీ వైపు మళ్లారు. 2014లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్దిగా ప్రకటించడంతో మెల్లగా ఆయనతో స్నేహం చేయడానికి నానా పాట్లు పడ్డారు. మోదీ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి మాట కలిపే యత్నం చేశారు. ఎలాగైతేనేం..2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. ఆ తర్వాత.. ప్రత్యేక హోదా అంశం పేరుతో బీజేపీని వ్యతిరేకించి కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో అవసరం ఉన్నా, లేకపోయినా మోదీని టీడీపీ ముఖ్యనేతలు దూషించేవారు. ఆ క్రమంలో మోదీని వ్యక్తిగత స్థాయిలో కూడా చంద్రబాబు విమర్శించారు. ఆ దెబ్బకు ఇక వీరిద్దరూ కలవడం అసాధ్యం అనే భావన ఏర్పడేది. దానికి తోడు చంద్రబాబు 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. దానివల్ల తనకు నష్టం జరిగిందని భావించిన చంద్రబాబు.. 2019లో ఏపీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో ఓడిపోవడంతో.. తిరిగి చంద్రబాబు మాట మార్చి బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహంలోకి వెళ్లారు. ఇందుకోసం పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారు. అలాగే.. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించారు. ఇదే టైమ్‌లో బీజేపీతో పొత్తు కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్ సిద్దం కాకపోవడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది!... ఎలాగైతేనేం 2024 ఎన్నికలలో జనసేన, బీజేపీలతో కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు.ఈ నేపథ్యంలో మోదీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పొగుడుతున్నారు. అది విశాఖ సభలో శ్రుతి మించిందని చెప్పకతప్పదు. మోదీ భజన చేస్తే చేశారులే.. ఏపీకి అవసరమైన కీలకమైన అంశాల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాట్లాడతారేమో అని ఆశగా ఎదురు చూసినవారికి మాత్రం నిరాశే ఎదురైంది. ముఖ్యంగా.. విశాఖపట్నంలో ఐదు దశాబ్దాలుగా విరాజిల్లుతున్న విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని మాత్రం కోరలేకపోయారు. పైగా పుండు మీద కారం చల్లినట్లు నక్కపల్లి వద్ద మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేయదలపెట్టిన స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాకు అనుమతి ఇవ్వాలని కోరిన సంగతి గుర్తు చేసి, ప్రధాని పాజిటివ్‌గా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ‘‘విశాఖ స్టీల్ సంగతేమిటి?’’ అని ఎవరికైనా సందేహం వస్తే అది వారి ఖర్మ. కార్మిక సంఘాలు గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న ఆందోళనలు, నిరసన దీక్షలు ఆయనకు పట్టలేదు. పోనీ గతంలో చంద్రబాబు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు అనుకూలమని ఏమైనా చెప్పారా? అంటే అదీలేదు. శాసనసభ ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ అన్నది ఆంధ్రుల హక్కు, ప్రత్యేక సెంటిమెంట్ అని, దానిని కాపాడుకోవాల్సిందేనని, ప్రభుత్వ రంగంలోనే నడవాలని చంద్రబాబు ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తేనే విశాఖ స్టీల్ ను సేవ్ చేయగులుగుతామని, తాము ప్రధానిని ఒప్పించగలుగుతామని చంద్రబాబు, పవన్ నమ్మబలికారు. వాటిని కూడా నమ్మి అక్కడి వారు రికార్డు స్థాయిలో కూటమి అభ్యర్దులను గెలిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మారిపోయింది. పైకి మాత్రం మొక్కుబడిగా స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని చెబుతూ, అక్కడ ఉద్యోగాలు పోతున్నా, ఇనుప ఖనిజం సరఫరా సమస్య అయినా పట్టించుకోవడం మానేశారు. ప్రధానమంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సహా వామపక్షాలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్‌లు ప్రధాని సమక్షంలో దాని గురించి ప్రస్తావించకుండా పిరికిగా వ్యవహరించారు. అదే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అప్పట్లో ఇదే ప్రాంగణంలో జరిగిన సభలో ప్రధాని మోదీని విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయవద్దని, దానికి అసరమైన గనులు కేటాయించాలని కోరారు కదా. మోదీతో తమ సంబంధం రాజకీయాలకు అతీతమైనది అని అంటూనే, ఏపీకి కావల్సిన డిమాండ్లను తీర్చాలని విస్పష్టంగా కోరారు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగారు. కానీ.. ఇప్పుడు కూటమి నేతలు ఎవరూ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. దాని గురించి మర్చిపోయారు. ఇలాంటి కీలకమైన విషయాలను చంద్రబాబు, పవన్ లు ప్రస్తావించకపోవడంతో ప్రధాని మోడీకి సమాధానం చెప్పే అవసరమే లేకుండా పోయింది.విశాఖ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలకే కూటమి నేతలంతా పరిమితం అయ్యారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులకే ఇప్పుడు శంకుస్థాపనలు చేశారు. అందులో కొన్ని ప్రాజెక్టులకు ఆరోజుల్లో తెలుగుదేశం నేతలు అడ్డుపడే యత్నం కూడా చేశారు. పలు రాష్ట్రాలు పోటీపడినా ఏపీకి బల్క్ డ్రగ్ పార్కును జగన్ ప్రభుత్వం సాధించింది. దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు దానిని నక్కపల్లి వద్ద ఏర్పాటు చేస్తే అది తమ ఘనతేనని నిస్సిగ్గుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఎన్.టి.పి.సి ఏర్పాటు చేయతలపెట్టిన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కు సంబంధించిన ఒప్పందం చేసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే. అలాగే రైల్వేజోన్ కు అవసరమైన భూమిని కేటాయించింది సైతంం జగన్ సర్కారే. కానీ ఆ భూమిపై లేనిపోని వివాదాలు సృష్టించారు. చివరికి అదే భూమిలో శంకుస్థాపన చేశారు. అయినా మంచిదే ప్రధాని వచ్చి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం.కాకపోతే వేగంగా ఈ ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలగాలి. శ్రమ ఎవరిదైనా ఫలితం దక్కించుకోవడంలో ,ప్రచారం చేయించుకోవడంలో చంద్రబాబు మించినవారు ఉండరేమో!. ప్రధాని మోదీని రాష్ట్ర ప్రయోజనాల కోసం పొగిడితే అదో పద్దతి అనుకోవచ్చు. అలాకాకుండా ఏదో వ్యక్తిగత రాజకీయాల కోసం భజన చేస్తే ఏపీ ప్రజలకు ఏమి ప్రయోజనం?. ఇంతకీ మోదీని ఆనాడు చంద్రబాబు దూషించడాన్ని సమర్ధించాలా? లేక ప్రస్తుతం పొగడడాన్ని ఒప్పుకోవాలా?.. అంటే ఏమి చెబుదాం. అలాగే ఒకప్పుడు అవినీతిపరుడు అన్న చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న మోదీని ఏమనుకోవాలి? మొత్తం మీద వీరిద్దరు కలిసి ప్రజలను పిచ్చోళ్లను చేశారా?!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి👉🏾: ‘చంద్రబాబు ఎన్డీయేకి ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం!’ -
మా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు: నందిగం సురేష్ సతీమణి
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎదుగుదల ఇష్టం లేకనే ఆయనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని సురేష్ సతీమణి బేబి లత ఆరోపించారు. ఈ విషయమై ఆమె మంగళవారం(జనవరి14) మీడియాతో మాట్లాడారు. ‘అర్ధరాత్రి మా ఇంటి చుట్టూ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై తిరిగారు. ఒక వ్యక్తి బైక్ నడుపుతుంటే మరొక వ్యక్తి మా ఇంటి ఫోటోలు తీస్తున్నారు.దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నందిగం సురేష్ అనుచరులపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి నా భర్తను 134 రోజులు జైల్లో ఉంచారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాల్సిన కేసుల్లో కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు’అని బేబి లత ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గతంలో జైలులో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. సురేష్‌కు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఆయన సుదీర్ఘ కాలం పాటు జైలులోనే ఉండాల్సి వస్తోందని ఆయన భార్య బేబిలత పలు సందర్భాల్లో వాపోయారు. సురేష్ బెయిల్ విషయమై సుప్రీం కోర్టులో కూడా ఆమె పిటిషన్ వేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కహానీలు చెబితే కడుపు నిండుతుందా..? -
‘చంద్రబాబు ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం’
గత రెండు సార్వత్రి ఎన్నికల్లో 280 ఫ్లస్ సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి.. 2024 ఎన్నికల్లో 240 సీట్లకు పడిపోయి మిత్రపక్షాల మీద ఆధారపడే స్థాయికి చేరుకుంది బీజేపీ. అయితే కింగ్మేకర్లుగా తమ తమ రాష్ట్రాలకు కావాల్సింది సాధించుకోవడంలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌లు విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు ఎన్డీయే కూటమికి ఎప్పుడు హ్యాండిస్తారో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించారు. సోమవారం ఇందిరాగాంధీ పంచాయితీ రాజ్‌భవన్‌లో లోక్స్వరాజ్ మంచ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘‘400 సీట్లు సాధిస్తామని ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు 240 సీట్లకే పరిమితమయ్యారు(పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ..). చంద్రబాబు ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదు. నితీశ్ కుమార్ ఎప్పుడు తన మద్దతు వెనక్కి తీసుకుంటారో తెలియదు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతమని భావించకూడదు.. .. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచీచెడులు ఉంటాయి. కీర్తి అనేది తాత్కాలికం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలిచిన వారే, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకుని శాశ్వతంగా గుర్తుండిపోతారు అని అన్నారాయన. అలాగే ఇండియా కూటమి మధ్య బీటల అంశంపై ప్రస్తావిస్తూ.. లోక్‌సభ ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉన్నాయని, ఈలోపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో బీజేపీ(240) తర్వాత టీడీపీ 16 స్థానాలు, జనతాదళ్ (యూ) 12, అతిపెద్ద పార్టీలుగా ఉన్నాయి. -
కహానీలు చెబితే కడుపు నిండుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా తీరు భలే విచిత్రంగా ఉంటుంది. వారికి లాభం జరిగితే ప్రజలందరికీ జరిగినట్లే. వారి ఇబ్బందులు ప్రజలందరి సమస్యలు! ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికీ సంక్రాంతి వరాలు వచ్చేశాయట!. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందట!. పచ్చి అబద్ధాలను వండి వార్చేఈ ఎల్లో మీడియా ఉరఫ్ ఈనాడులో వచ్చిన కథనాల్లో కొన్ని ఇవి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలు చేసి ఉంటే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్లు కానీ.. తిమ్మిని బమ్మి చేసినట్లు ప్రతి వాగ్ధానాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు కూటమి నానా తంటాలూ పడుతూంటే ఎల్లోమీడియా ఆ అబద్ధాలకు వంతపాడుతూ మురిసిపోతోంది. ఎన్నికలకు ముందు ఒక రకమైన అసత్యాలు.. ఇప్పుడు ఇంకో రకంగా బిల్డప్ ఇస్తూ జనాన్ని మభ్యపెడుతోంది. 😱కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు.. రాష్ట్రంలో అరాచకమే ఎక్కువ. జగన్ టైమ్‌లో జరిగిన అభివృద్దిని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వృద్దుల ఫించన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే ఇతర హామీని పూర్తిగా అమలు చేయని కూటమి, ఎన్నికల ప్రణాళికలో ఉన్న సుమారు 175 వాగ్దానాల జోలికే వెళ్లలేదు. దీన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రోజుకో కొత్త రకం భజన కీర్తలను పాడుతోంది. అయితే.. 👉జనం వాస్తవాలు తెలుసుకుంటున్నారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నేతలు చేసిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ఈ మధ్య ఒక సీనియర్ పాత్రికేయుడు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించినప్పుడు ప్రజల్లోని ఈ అసంతృప్తిని గమనించారు. జగన్ ఉండి ఉంటే ఫలానా స్కీమ్ కింద తమకు ఇంత డబ్బు వచ్చి ఉండేది.. చేతులలో డబ్బు ఆడేది.. అని చెప్పుకుంటున్నారట. కానీ అంతకు మూడు రెట్లు సాయం చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తమను వంచించారని ఎక్కువ మంది భావిస్తున్నారట!.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఏ స్కీమ్ కూడా ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. ‘అమ్మ ఒడి’ని మార్చి ప్రతి బిడ్డకు రూ.15 చొప్పున ఇస్తామన్న కూటమి నేతలు, కావాలంటే ఇంకా పిల్లలను కనండని బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తూచ్ అనేశారు. జాకీ మీడియా కూడా ‘అమ్మ ఒడి’ అంటే బటన నొక్కడమని ధనం వృధా చేయడమేనని ఊదరగొట్టింది. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో చూడండి. 👇ఈ ఏడాదికి తల్లికి వందనం లేదు పొమ్మన్నారురైతు భరోసా జాడ కనిపించడం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఏమయ్యాయో తెలియదు. ఆరోగ్య శ్రీని నీరుకార్చే పనిలో ఉన్నారు. జగన్ ఇంటింటికి డాక్టర్ ను పంపిచే స్కీమ్ తెస్తే, ఇప్పుడు అది గాలికి పోయినట్లు ఉంది. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలందించేందుకు జగన్ తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని జీతాలూ పెంచుతామని చంద్రబాబు ఉగాది పండగనాడు దైవ సాక్షిగా ప్రకటించినా.. ఇప్పుడు దానికి మంగళం పలికారు. మరోవైపు.. ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వంట నూనెల ధరలే లీటర్‌కు రూ.30 నుంచి రూ.40 వరకూ పెరిగాయి. పప్పులు, కూరగాయల ధరలన్ని అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నిటి ఫలితంగా సంక్రాంతి వచ్చినా ప్రజలు చేతిలో డబ్బులు ఆడక ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు కూడా తగ్గాయి. ఇందుకు ఉదాహరణ ఏమిటంటే.. లెక్కలు ఇలా.. 👇ఒక్క కృష్ణా జిల్లాలోనే వైఎస్ జగన్ పాలనలో 2023 లో పండగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో వస్త్ర వ్యాపారం రూ.3000 కోట్ల మేర జరిగితే కూటమి పాలన వచ్చిన 2024లో అదే కాలానికి కేవలం రూ.1200 కోట్లుగానే ఉంది. కిరాణా వ్యాపారం పరిస్థితి అలాగే ఉంది. గతంతో పోల్చితే ఈసారి లావాదేవీలు రూ. వెయ్యి కోట్ల తగ్గాయి. బంగారం వ్యాపారం రెండు నెలల టైమ్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3000 కోట్ల టర్నోవర్ జరిగితే, కూటమి పాలనలో అది రూ.1500 కోట్లుగా ఉంది. ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా సగానికి సగం పడిపోయాయి. అప్పట్లో రూ.800 కోట్లు ఉంటే, ఈ సారి రూ.400 కోట్లే ఉంది. వీటి ఫలితంగా జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయమూ తగ్గింది. ఏపీలో జీఎస్టీ వసూళ్లు బీహారు కన్నా తక్కువ కావడం పరిస్థితిని తెలియచేస్తుంది. జగన్ టైమ్ లో 12 శాతం జీఎస్టీ వసూళ్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర భాగాన ఉంటే, ఈ సారి ‘- 6’ శాతం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 👉ఈ లెక్కలు ఇలా ఉన్నా, ఎల్లో మీడియా మాత్రం సంక్రాంతికి ప్రజలంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. అవును.. నిజమే.. మార్గదర్శికి సంబంధించిన కేసులలో గత ప్రభుత్వం జప్తు చేసిన రూ.వెయ్యి కోట్లను ఈ ప్రభుత్వం రాగానే తీసి వేసింది కదా!.. అందువల్ల ఈనాడు వారికే పండగే కావచ్చు. సామాన్యుడికి వస్తే ఎంత? రాకపోతే ఎంత? సంక్రాంతి వరాలు రూ.6700 కోట్లు అంటూ పెద్ద బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. గతంలో జగన్ ఒక్క స్కీమ్ కింద ఈ స్థాయిలో ప్రజలకు డబ్బు ఇచ్చేవారు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు చేసినా, ఆ డబ్బు అంతా ఏమైందో కాని స్కీమ్ లు అమలు చేయలేదు. 🤔నిజంగానే చెప్పిన హామీలు చెప్పినట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమలు చేసి ఉంటే సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఇచ్చి ఉండాలి. కానీ అందులో ఆరోవంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన మొత్తాలలో కొద్ది, కొద్దిగా ఇచ్చి పండగ చేసుకోమంటోంది. ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు ఉంటే రూ.1300 కోట్లు ఇచ్చారు. ఇది ఏ మూలకు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కీమ్, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అర కొరగానే ఇచ్చారని చెబుతున్నారు. ఉద్యోగులకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటెరిమ్ రిలీఫ్ ప్రకటిస్తామని అన్నా, దాని గురించి మాట్లాడడం లేదు. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని వాస్తవ పరిస్థితి చెప్పడం వేరు. మొత్తం హామీలు అమలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేసుకోవడం వేరు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. 😥గతంలో ధరలు కొద్దిగా పెరిగినా, విద్యుత్ చార్జీల సర్దుబాటు జరిగినా ఇదే చంద్రబాబు ,పవన్ ఏ స్థాయిలో విమర్శలు చేసేవారు! ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటివి ఎంత దారుణమైన కథనాలు రాసేవి. మరి ఇప్పుడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం మోపినా, రెండున్నర లక్షల మంది వలంటీర్ల నోటికాడి కూడు తీసేసినా, తల్లులకు ప్రతి ఏటా వచ్చే రూ.15 వేలు ఎగ్గొట్టినా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేసినా, నిరుద్యోగులకు రూ.3,000 ఖాయమని చెప్పి ఊరించి తూచ్ అంటున్నా, వారంతా సంతోషంగా ఉన్నారని భ్రమ పడాలన్నది ఎల్లో మీడియా లక్ష్యంగా ఉందనుకోవాలి. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందని ఈనాడు బోగస్ వార్తలు ఇస్తోంది. ప్రజల చేతిలో డబ్బు ఉంటే సంక్రాంతి పండగ బాగా చేసుకుంటారు కాని, కహానీలు చెబితే కడుపు నిండుతుందా?. కాకపోతే క్యాసినోలు, జూదాలు, కోడి పందేలు ఆడించి, ఎక్కడబడితే అక్కడ మద్యం అమ్మించి ఇదే సంక్రాంతి అనుకోండని అంటున్నారు. పేదలు వీటితో సరిపెట్టుకోవలసిందేనా!..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అలా చేయకుంటే కోర్టుకెళ్తాం.. ‘కూటమి’కి వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్
సాక్షి, ప్రకాశం జిల్లా: తిరుమల తొక్కిసలాట (Tirupati stampede) దురదృష్టకరమని ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ (YSRCP) రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ తరఫున కోర్టుకెళ్తామని హెచ్చరించారు. లడ్డూ విషయంలో హంగామా చేసిన చంద్రబాబు, పవన్ ఎందుకు సెలైంట్‌గా ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.పల్లెల్లో సంక్రాంతి కళ కనిపించడం లేదు. రైతుల మొఖాల్లో ఆనందం లేదు. రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఏడు నెలలైనా పింఛన్ తప్ప ఏం సంక్షేమ పథకం అమలు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. హామీలు అమలు చేసి మాపై ఆరోపణలు చేయండి’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
పాత స్నేహితుడిని అరెస్ట్ చేయించిన మంత్రి సుభాష్
సాక్షి టాస్క్‌ఫోర్స్: గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన వ్యక్తిని ఆ మంత్రి పండగ రోజుల్లో కటకటాలు లెక్కించేలా చేశారు. ఆ వివరాలివీ.. ప్రస్తుత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం మసకపల్లికి చెందిన మేడిశెట్టి ఇశ్రాయేల్ గతంలో మంచి స్నేహితుడు. దీంతో గత సార్వత్రిక ఎన్నికల ముందు మండపేటలో చంద్రబాబు నిర్వహించిన శ్రీరా..కదలిరా..శ్రీ సభలో సుభాష్‌తో పాటు మేడిశెట్టి ఇశ్రాయేల్ కూడా టీడీపీలో చేరారు. ఎన్నికల్లో సుభాష్ రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన తరువాత దొంగల బ్యాచ్‌ను ప్రోత్సహిస్తూ.. అటు టీడీపీకి, ఇటు శెట్టిబలిజ కులానికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ ఇశ్రాయేల్ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రజలకు వివరించేవారు. శెట్టిబలిజ పెద్దలకు మెదడు మోకాళ్లలో ఉందంటూ.. రామచంద్రపురంలోని శెట్టిబలిజ సామాజిక భవనానికి తొలిసారి వచ్చిన సందర్భంగా మంత్రి సుభాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కులానికి సుభాష్ క్షమాపణ చెప్పాలని ఇశ్రాయేల్ డిమాండ్ చేశారు. అక్కడి నుంచి మంత్రి సుభాష్ ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులు ఇసుక దొంగతనాలు, సెటిల్మెంట్ల వంటి వాటికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తూనే, ఆ పార్టీ అగ్రనాయకులను ఇశ్రాయేల్ నేరుగా కలసి ఫిర్యాదులు చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం నుంచి నేరుగా హెచ్చరికలు రావడంతో తన ప్రధాన అనుచరుడు దొంగల శ్రీధర్‌ను మంత్రి దూరం పెట్టాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి సుభాష్‌కు ఇశ్రాయేల్ మెయిన్ టార్గెట్ అయిపోయారు. దీంతో తాళ్లపొలం గ్రామానికి చెందిన భూ వివాదం ఆధారంగా ఇప్పటికే అతడిపై రెండు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి ఎస్సీ, ఎస్టీ కేసు. అలాగే, బైకులు, చిల్లర దొంగతనాలు చేసే ఓ వ్యక్తిని తీసుకుని వచ్చి సినీఫక్కీలో తాళ్లపొలంలో స్కూటర్ తగులబెట్టించి, ఈ కేసులో ఆ గ్రామ సర్పంచ్, ఆయన కుమారులతో పాటు ఇశ్రాయేల్‌ను ఇరికించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన శెట్టిబలిజ సంఘ పెద్దలను వెంటపెట్టుకుని ఇశ్రాయేల్, తాళ్లపొలం సర్పంచ్‌లు ఈ నెల 10న అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తమను తప్పుడు కేసుల నుంచి కాపాడాలని అభ్యర్థించారు. శనివారం రామచంద్రపురానికి కొత్త సీఐ బాధ్యతలు చేపట్టారు. శ్రీసీఐ గారు మాట్లాడి పంపించేస్తారశ్రీని చెప్పి ఇశ్రాయేల్‌ను అదే రోజు సాయంత్రం తీసుకుని వెళ్లిన పోలీసులు అతడిపై కొత్త కేసులు నమోదు చేసి అర్ధరాత్రి సబ్ జైలుకు తరలించారు. నియోజకవర్గంలో శెట్టిబలిజలపై తప్పుడు కేసులు మోపి, జైలు పాలు చేస్తున్న అదే వర్గానికి మంత్రి సుభాష్ వైఖరిపై ఆ సామాజిక వర్గీయులు మండిపడుతున్నారు. -
కొలికపూడి ప్రగల్భాలు.. గాలి తీసిన టీడీపీ కార్యకర్తలు
సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు గాలి తీసేశారు పచ్చ నేతలు, కార్యకర్తలు. పది రోజుల క్రితం తిరువూరులో జూదం ఆడనివ్వను అంటూ ఎమ్మెల్యే కొలికపూడి ప్రగల్భాలు పలికారు. కానీ, ఆయన మాటలను కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు ఎవరూ లెక్క చేయలేదు. తిరువూరులో కమీషన్ తీసుకుని మరీ టీడీపీ నేతలు పందేలు, జూదం ఆడిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరువూరులో టీడీపీ నేతలు హల్చల్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా కమీషన్లు తీసుకుని పందేలు, జూదం ఆడిస్తున్నారు పచ్చ నేతలు. ఇక, పోలీసులు సైతం జూదం నిర్వాహకులతో కుమ్మక్కు అయినట్టు తెలుస్తోంది. గుండాట, పేకాట, లోనా బయట, గ్యాబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. కూటమి నేతలు జూద క్రీడలకు ప్రత్యేక ధరలు నిర్ణయించి అమ్మేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే, పది రోజుల క్రితమే తిరువూరులో జూదం ఆడనివ్వనంటూ ఎమ్మెల్యే కొలికపూడి ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. కానీ, ఆయన మాటలను టీడీపీ కార్యకర్తలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. జూదం ఆడుతున్న శిబిరాల వద్దనే పబ్లిక్‌గా మద్యం విక్రయాలు కూడా జరుగుతున్నాయి. మామూళ్లు తీసుకుని ఎక్సైజ్ అధికారులు.. మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఇక, అంతకుముందు.. కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహిస్తే ఊరుకోనని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ప్రస్తుతం విచ్చిలవిడిగా జూదం ఆడుతున్నా కమిషనర్ రాజశేఖర్ బాబు మాత్రం పట్టించుకోవడం లేదు. తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే, కోడి పందెం బరులు , జూద క్రీడల వద్ద పోలీసులు కనిపించకపోవడం విశేషం. -
YSRCP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయపోరాటం
గుంటూరు, సాక్షి: తిరుపతిలో పాలనాపరమైన వైఫల్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణిస్తే.. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టింది. ఈ పరిణామంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. ఈ విషయంలో ప్రభుత్వంపై న్యాయపోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. క్రౌడ్ మేనేజ్మెంట్లో ఘోర వైఫల్యానికి ముఖ్య కారణం ఎస్పీ సుబ్బారాయుడు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కోసం వేలమంది వస్తారని తెలిసి కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు. పైగా నిర్లక్ష్యంగా కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించి పక్కకు తప్పుకున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటారేమోనని అంతా అనుకున్నారు. అయితే.. తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన ఎస్పీ సుబ్బరాయుడును కేవలం ట్రాన్స్‌ఫర్‌తోనే సరిపెట్టింది ప్రభుత్వం. దీంతో.. ప్రభుత్వ వైఖరిపై న్యాయపోరాటం చేయాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఈ పోరాటంపై పార్టీ నుంచి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అవి పచ్చి అబద్ధాలు: భూమనహైందవ భక్తులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మాపై ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలు అన్ని పచ్చి అబద్ధాలు అని గుర్తించాలి. భక్తులు ప్రాణాలు కోల్పోతే లెక్కలేనితంగా ఈరోజు టీటీడీ వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ పై చర్యలు తీసుకోకుండా నామ మాత్రంగా బదిలీ చేసి. ప్రభుత్వం జాప్యం చేస్తోంది. టీటీడీ ఈవ, అడిషనల్ ఈవో, తిరుపతి జిల్లా ఎస్పీలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
అబద్ధాలను అందంగా అల్లటంలో ఆరితేరారే!
ఆంధ్రప్రదేశ్‌లో పాలన రోజు రోజుకూ అధ్వాన్నమవుతోంది. ఈ మాట ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అధికార పక్షానికి వత్తాసుగా నిలుస్తున్న పచ్చమీడియానే అప్పుడప్పుడూ తన కథనాల ద్వారా చెబుతోంది. చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు కొందరు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతికి హద్దుల్లేకుండా పోయాయని టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు తమ కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వారు తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే.. రింగ్ మాస్టర్లు అదేనండి.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లకు ఎక్కడ మకిలి అంటకుండా నెపం ఇతరులపైకి నెట్టేయడం!. కిందటేడాది ఆగస్టు 28న చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ మాట్లాడుతూ ఒక మాటన్నారు.. ‘‘ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు తాను ఇటుక ఇటుక పేరుస్తూంటే.. ఎమ్మెల్యేలు కొందరు జేసీబీలతో కూలగొడుతున్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నా ఒకరిద్దరి తప్పుల వల్ల పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. బాబుగారి నేర్పరితనం ఏమిటంటే తన వైఫల్యాలు మొత్తాన్ని దారిమళ్లించేందుకు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులను మందలించినట్లు పోజ్ పెట్టారు. సరే అనుకుందాం కాసేపు. మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చిందా? ఊహూ అదేమీ కనబడదు. చంద్రబాబు కూడా ఏ చర్య తీసకోకుండా కథ నడుపుతూంటారు. ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు అధికారుల బదిలీలు, పొస్టింగ్లలో భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు... ఒక మంత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో మకాం వేసి మరీ ఈ దందా చేస్తున్నారని టీడీపీ పత్రిక తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలియ చేసిందని కూడా ఆ మీడియా పేర్కొంది. బ్లాక్‌మెయిలింగ్‌లో దిట్టగా పేరొందిన ఆ మీడియా బహుశా ఆ మంత్రిని బెదిరించడానికి ఏమైనా రాశారా? లేక నిజంగానే మంత్రి అలా చేశారా? అన్నది ఇంతవరకు అటు ఏపీ ప్రభుత్వం కాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాని వెల్లడించలేదు. ఈ రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పార్టీలకు అతీతంగా సాగుతున్న బంధాన్ని ఈ విషయం తెలియ చెబుతుంది. సదరు మంత్రి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని సోషల్ మీడియాలో ప్రచారమైంది. సీపీఎం నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ మంత్రి ఖండించలేదు. చంద్రబాబు కాని, ఆయన పేషీ కానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా ఈ మధ్య తిరుపతి సందర్శనలో కూడా చంద్రబాబు ఆ మంత్రిని పక్కన పెట్టుకుని తిరగడం విశేషం. మరో కథనం ప్రకారం.. ఆ మంత్రికి హైదరాబాద్ శివార్లలో ఉన్న భూమి విషయంలో ఏర్పడిన వివాదం రీత్యా తరచు ఇక్కడకు వచ్చి పంచాయతీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తున్నది చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా?. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి అధికారి అంటూ మరో జాకీ పత్రిక ఈ మధ్య ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే అచ్చెన్నాయుడుకు సంబంధం లేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చినట్లు కనిపించినా, కేవలం ఒక అధికారి సొంతంగా అవినీతికి పాల్పడతారా? అలాగైతే ఆ మంత్రి అంత అసమర్థుడా అన్న ప్రశ్న వస్తుంది. ఈ కథనం ఇచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా స్పందించినట్లు కనబడదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పీఏపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ పీఏ ని తొలగించానని, తను ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తి అని అనిత వివరణ ఇచ్చినప్పటికీ, ఆ ఆరోపణలకు మంత్రికి సంబంధం లేదని అంటే ఎలా నమ్ముతారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఈ విషయమై బీజేపీ పెద్దలకు ఢిల్లీలో ఫిర్యాదు చేసి వచ్చారని అంటారు. ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితుడునని చెప్పుకుంటూ ఒక ప్రముఖుడు మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగ్ లలో హవా సాగిస్తున్నారని, తనకు కావల్సింది తనకు ఇచ్చి, మీకు కావల్సింది మీరు తీసుకోండని ఓపెన్ గా చెబుతున్నారంటూ జాకీ పత్రిక చానా ముదురు శీర్షికన కథనాన్ని ఇచ్చింది. 'చానా" అనగానే అది సానా సతీష్ గురించే అని, అతను లోకేష్ తరపున వ్యవహారాలు చక్కదిద్దుతుంటారని టీడీపీలో ప్రచారం అయింది. అది రాజ్యసభ ఎన్నికల సమయం కావడంతో అతనికి టిక్కెట్ రాకుండా ఉండడానికి ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలింగ్ వార్త రాసిందని కూడా టీడీపీ వర్గాలు భావించాయి. ఈ వార్త లోకేష్ కు తీవ్ర అప్రతిష్ట తెచ్చింది. దాంతో లోకేష్ కు, ఆంధ్రజ్యోతి యజమానికి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీని నడిపే శక్తి ఇంకా రాలేదని వ్యాఖ్యానిస్తూ ఆ ఓనర్ తన వ్యాసంలో రాసి ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమి నుంచి విడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆందోళన చెందారు. విశేషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సానా సతీష్ పై అంత దారుణమైన కథనం ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసినందునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ పేషీ గురించి నేరుగా రాయకపోయినా, అక్కడ జరిగేవి ఇతర మంత్రులకు తెలియవా? అందుకే ఏ మంత్రిని మందలించే పరిస్థితి చంద్రబాబుకు లేదని కొందరి వాదనగా ఉంది. మరికొందరు మంత్రులపై కూడా పలు అభియోగాలు వస్తున్నాయి. చంద్రబాబు స్టైల్ ఏమిటంటే రహస్యంగా ఎవరు ఏమి చేసినా వారి జోలికి పద్దగా వెళ్లరు. అదే మరీ అల్లరైతే, తాను మందలించనట్లు ప్రచారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు, కూటమి నేతలు మద్యం, ఇసుకలలో ఎలా దండుకుంది బహిరంగమే. నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైపోయినా ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పెదవి కదపలేదు. మద్యం వ్యాపారంలో అనేక మంది ఎమ్మెల్యేలు 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి ఏ మాత్రం భయం లేకుండా తనకు నిర్దిష్ట శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మద్యం షాపులకు హెచ్చరిక పంపించారు. అఅంతేకాదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ మధ్య పవర్ ప్లాంట్ బూడిద రవాణాపై చెలరేగిన గొడవ తెలిసిందే. చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేయడానికి యత్నించారు. ఇక ప్రభాకర రెడ్డి కొందరు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి లేదు. కాకపోతే జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మైనింగ్ లీజుల దందాపై సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు వినాల్సిందేనని టీడీపీ ముఖ్యనేత ఆదేశించడంపై కూడా మైనింగ్ యజమానులు మండిపడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అరాచకంపై నిత్యం కథలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్టీ కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి. చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టిన రోజు వేడుకకు పోలీసులు హాజరై కేక్ కట్ చేయించడం పై విమర్శలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కూడా పోలీసు అధికారులపై రుసురుసలాడిన తీరు అందరికి బహిరంగ రహస్యమే. మదనపల్లె నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే ఒకరికి నెలకు 30 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక మహిళా తహశీల్దార్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన విషయం సంచలనమైంది. సదరు ఎమ్మెల్యే ఖండించినా నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా అంతా భావించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి దౌర్జన్యాలపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడలో ఒక దళిత ఫ్రొఫెసర్ ను ఆయన తన అనుయాయులతో కలిసి వెళ్లి బెదిరించారు. అలాగే ఒక టీషాపు ను కూల్చి వేయించిన విషయం వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ కడపలో ఒక మండల అధికారిపై వైసీపీ నేత ఎవరో దౌర్జన్యం చేశారంటూ అక్కడకు వెళ్లి హడావుడి చేసి వచ్చారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేనని, రేషన్ షాపుల వారిని, మధ్యాహ్న భోజనం ఏజెన్సిల, ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించారు. ఇక కాంట్రాక్టర్ లను బెదిరించడం వంటివి నిత్య కృత్యమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఏకంగా అదానీ కంపెనీ సిబ్బందిపైనే దాడి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళా టీడీపీ నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. వారి మధ్య టీడీపీ నేతలు రాజీ చేశారు తప్ప ఆయనపై చర్య తీసుకోకపోవడం విశేషం. కృష్ణపట్నం ఓడరేవు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మద్యం దుకాణాలలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వలేదని నరసరావుపేటలో ఆయన అనుచరులు రెస్టారెంట్ పై దాడి చేసి వధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మట్టి దందాకు పాలపడుతున్నాడని కథనాలు వచ్చాయి. రోజూ ఇలాంటి స్టోరీలు పుంఖానుపుంఖాలు గా వస్తున్నా కూటమి అధినేతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. మరో వైపు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు ఐదువేల ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చారంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కంపెనీ యజమాని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్డర్ ఇవ్వరాదట. ఆ ఆర్డర్ చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారని ఈ పత్రిక చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. అంత పెద్ద ఆర్డర్ ముఖ్యమంత్రికి తెలియకుండా వెళుతుందా? ఇవన్ని చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన సాగిస్తోందన్న అభిప్రాయం రాదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బకాయిలు కొండంత.. చెల్లించేది గోరంత
సాక్షి, అమరావతి: ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిలకుగానూ అరకొర నిధులను విడుదలచేస్తూ, సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25,000 కోట్లు ఉంటే, కూటమి ప్రభుత్వం రూ.1,300 కోట్లే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఇవ్వాల్సిన బకాయిలెంత? ఇప్పుడు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం బయటపడుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకునేది. కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కు పిలిచి మాట్లాడిన దాఖలాల్లేవు. ⇒ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన రూ.1,300 కోట్లలోనూ రూ.519 కోట్లు జీపీఎఫ్ కోసం, రూ.214 కోట్లు పోలీస్ విభాగం ఒక విడత సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం రూ. 300 కోట్లు మాత్రమే కడతామని చెబుతున్నారు. ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక? ⇒ జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు. దీనికి మొత్తం ఇవ్వకుండా రూ. 519 కోట్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం? ఏడాదికి 15 రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్ చేసుకునేందుకు వీలుంది. దీనిని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కు.. అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు. సీపీఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు. ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద రూ.265 కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. 36 ఏళ్లు ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగిగా ప్రభుత్వ తీరు అర్థం కావడంలేదు. ⇒ రాష్ట్రంలోని 3.80 లక్షల మంది పెన్షనర్లకు ఏమాత్రం మేలు చేయడంలేదు. డీఎ ఎరియర్స్, పీఆర్సీ ఎరియర్స్, సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటేషన్ ఆఫ్ లీవ్, గ్రాట్యూటీ వంటి బెనిఫిట్స్ పెండింగ్ లో పెడుతున్నారు. అలాగే, మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్, ఏపీజేఎల్ వంటివి రూ. కోట్లలో ఉన్నాయి. వాటిల్లో ఇంతమేరకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టంచేయాల్సి ఉంది. ⇒ మంచి పీఆర్సీని, మధ్యంతర భృతిని ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీలిచ్చింది. 7 నెలలు గడుస్తున్నా పీఆర్సీని నియమించలేదు, ఐఆర్‌ను ప్రకటించలేదు. రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రతి ఆరునెలలకు కేంద్రం డీఏను ప్రకటిస్తుంది. ఏపీలో 2024లో రావాల్సిన రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ⇒ కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామన్నారు. తొలి రెండు నెలలే అలా ఇచ్చారు. హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు కొంత, ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది. ప్రతిసారీ ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడంవల్ల ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి. సకాలంలో ప్రభుత్వ వాటా చెల్లించాలి. -
చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, ఆరుగురు మరణించిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యల విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan mohan reddy) ఆదివారం మండిపడ్డారు. టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో విచారణ చేసి.. వారిని జైల్లో పెట్టాల్సిన ప్రభుత్వం వారిని విడిచిపెట్టిందంటే దానర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు.చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్లందరినీ వెంటనే డిస్మిస్ చేసి.. కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవునిపట్ల మీ భక్తిని చాటుకోవాలని సీఎం చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే..తొక్కిసలాటను సీరియస్‌గా తీసుకోలేదు..చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ ఆరో తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయకపోవడం మొదలు.. టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ సహా, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలింది. ఈ నేపథ్యంలో.. విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనే కదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు? ఈ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం.. వెంటనే టీటీడీ చైర్మన్‌ను, ఈఓను, ఏఈఓను, ఎస్పీ, కలెక్టర్‌ను డిస్మిస్ చేయకపోవడం.. ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా!డిప్యూటీ సీఎం డిమాండ్లు హాస్యాస్పదం..ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబుగారు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు.. డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలన్నట్లుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, డిప్యూటీ సీఎంగారేమో, లేదు క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు.ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉంటుందా? టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీలేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు. -
కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్ జగన్
తాడేపల్లి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి తొక్కిసలాట(tirupati stampede) జరిగి ఆరుగురు మృతి చెందితే ఆ ఘటనకు సంబంధించిన బాధ్యుల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan mohan reddy) ధ్వజమెత్తారు ఈ విషయంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్. మొత్తం పోలీసుల బలగం అంతా చంద్రబాబు చుట్టూనే..‘‘చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మొదలు, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాలమీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా, స్థానిక కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో, విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనేకదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్‌ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్‌ను డిస్మిస్ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా?’ అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తీరు ఇంకా హాస్యాస్పదంప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబుగారు దాన్నికూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎంగారేమో, లేదు… క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట(tirupati stampede Incident) జరిగి, 6 గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు. చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్లందరినీ వెంటనే డిస్మిస్ చేసి, వీరిపై కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని హెచ్చరించారు వైఎస్ జగన్.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, 6గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో @ncbn గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2025 -
చిన్న బాస్ క్లాస్మేట్.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కోట్ల విలువైన విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను పడింది. ఫ్రీ–హోల్డ్ భూములను చేజిక్కించుకునేందుకు చిన్న బాస్ క్లాస్మేట్ కిలాడీ విశాఖలో మకాం వేసినట్టు తెలుస్తోంది. ప్రధాని పర్యటన సమయంలో ఇక్కడకు వచ్చిన సదరు కిలాడీ భీమిలి, ఆనందపురంతో పాటు సబ్బవరం తదితర ప్రాంతాల్లోని విలువైన భూముల వివరాలను సేకరించినట్టు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వ వ్యవహారాల్లో చిన్న బాస్ మిత్రుడిగా ‘శానా’ అతిచేస్తున్న మరో నేత కూడా కలిసి ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం రైతులకు కేటాయించిన డీ–పట్టా భూములను ఫ్రీ–హోల్డ్ చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా వాటిని తమ అవసరాలకు వినియోగించుకునేందుకు రైతులకు అవకాశం కల్పించింది. అయితే, కొత్త ప్రభుత్వం వీటిపై గత కొద్ది నెలలుగా నిషేధం విధించింది. రానున్న మూడేళ్ల కాలంలో ఫ్రీ–హోల్డ్ కానున్న (20 ఏళ్లు పూర్తయిన) భూముల వివరాలనే సదరు కిలాడీ టీమ్ సేకరిస్తోంది. కొంతమంది రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వివాదాస్పద భూములపై కూడా వీరి కన్ను పడింది. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల మాటకు విలువ లేకుండా ఇప్పటికే చక్రం తిప్పుతున్న సదరు కిలాడీ టీమ్.. మొత్తం భూ దందాను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు రెవెన్యూ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఫ్రీ–హోల్డ్ భూములపై కన్ను! వాస్తవానికి రైతుల వద్ద 20 ఏళ్ల నుంచి ఉన్న డీ–పట్టా భూములను తమ అవసరాల కోసం వినియోగించుకునేందుకు వీలుగా ఫ్రీ–హోల్డ్ చేసేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. విశాఖ జిల్లాలో సుమారు 100 ఎకరాల భూములు మాత్రమే ఫ్రీ–హోల్డ్ జరిగింది. దీనిపై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు అనేక ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరిపించారు. ఎటువంటి అవకతవకలు జరగలేదని ఈ ప్రభుత్వం నియమించుకున్న అధికారులే తేలి్చచెప్పారు. మరోవైపు ఫ్రీ–హోల్డ్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. 20 ఏళ్లు పూర్తయిన డీ–పట్టా భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈలోగా ఈ భూములను కొట్టేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సదరు కిలాడీ కాస్తా విశాఖపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 20 ఏళ్లు పూర్తయిన వాటితో పాటు రానున్న 3 ఏళ్లల్లో ఏయే భూములు ఫ్రీ–హోల్డ్ అయ్యే అవకాశం ఉందో... ఆ వివరాలను సేకరిస్తున్నారు. తద్వారా ఆయా రైతుల నుంచి వీటిని కారుచౌకగా కొట్టేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సదరు కిలాడీ ఇక్కడే మకాం వేసినట్టు సమాచారంప్రధాని పర్యటన ఏర్పాట్లలోనూ..! వాస్తవానికి ఆయనకు ప్రభుత్వంలో ఎటువంటి అధికారిక పదవి లేదు. కేవలం చిన్న బాస్ మిత్రుడని మాత్రమే అందరికీ తెలుసు. ఇప్పటికే అమరావతిలో చిన్న బాస్ ఆదేశాలతో పూర్తిస్థాయిలో అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్న సదరు కిలాడీ.. ఇప్పుడు విశాఖలోనూ చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినప్పటికీ... ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులతో కలిసి ఏయూ గ్రౌండ్స్‌లో హల్చల్ చేశారు. అధికారులకు ఆదే శాలు ఇస్తూ ఏర్పాట్లపై సమీక్షించారు. ఎటువంటి హోదా లేకపోయినప్పటికీ చిన్న బాస్ క్లాస్ మేట్ హోదాలో సకల వ్యవహారాలు సదరు కిలాడీనే చూసుకుంటున్నారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. సాక్షాత్తూ ప్రధాని పర్యటన ఏర్పాట్ల వ్యవహారంలోనూ జిల్లా లోని అధికారులకు కూడా ఈ విషయం అర్థమైనట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సదరు కిలాడీ భీమి లి, ఆనందపురం, సబ్బవరం తదితర ప్రాంతాల్లోని ఫ్రీ–హోల్డ్ భూములపై వివరాలు సేకరించారు. ఆయా రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలు తీసుకొని.. రైతుల నుంచి చౌకగా కొట్టేసి... ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తమకు చెందేలా వ్యవహారాలు సర్దుబాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. -
ఈ సంక్రాంతి.. పచ్చ నేతలకే పండగ.. ప్రజలకు కాదు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: గత సంక్రాంతికి ఈ ఏడాది పండగకు చాలా వ్యత్యాసం ఉందని.. గత ఏడాది సంక్రాంతికి ప్రతి కుటుంబాన్ని వైఎస్ జగన్ చేయి పట్టుకుని నడిపించారని.. ఈ సంక్రాంతికి చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పేదల పండగ కాదు.. పచ్చ నేతల పండగ అంటూ దుయ్యబట్టారు. పేదల జేబుల్లో డబ్బుల్లేవు.. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలు తరిమేసినవారు పండక్కి రావడానికి భయపడుతున్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం లేదు’’ అని కన్నబాబు చెప్పారు. ఈ సంక్రాంతికి చంద్రన్న కానుక పథకం ఏమైంది?. కూటమి నేతలకే పండగ.. ప్రజలకు కాదు. ఇష్యూ వస్తే డెవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌ను తిట్టడమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారు. తిరుపతి తొక్కిసలాట చూసి కూటమి నేతలు సిగ్గుపడాలి. తిరుపతి తొక్కిసలాట కూటమి ప్రభుత్వ వైఫల్యం కాదా?. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్లు బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాటపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. తిరుమల ప్రసాదంపై కూడా దుష్ప్రచారం చేశారు. వెంకన్న స్వామిని రాజకీయాల్లోకి లాగితే ఫలితాలు ఇలానే ఉంటాయి’’ అని కన్నబాబు వ్యాఖ్యానించారు.‘‘భక్తుల ఫోన్ నంబర్లతో కూటమి ప్రభుత్వానికి ఏం పని?. చంద్రబాబు మనుషులు చేసే తప్పులకు భక్తులు బలైపోతున్నారు. టీటీడీ సమావేశంలో ప్రైవేట్ వ్యక్తులకు ఏం పని?. సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలు ప్రైవేట్ వ్యక్తులపై ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..! -
ఏపీ బీజేపీలో నాయకత్వ మార్పు!?
సాక్షి, అమరావతి: బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఈ నెలాఖరులోగా ఎన్నిక జరగనుంది. అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి స్థానంలో కొత్త వారు నియమితులవుతారని పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది. 2023 జూలైలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆమెను కొనసాగించే అవకాశం లేకపోలేదని కూడా కొందరు నేతలు అంటున్నారు. అయితే, పురందేశ్వరి పార్టీ అధ్యక్ష బాధ్యతల కంటే.. కేంద్ర మంత్రివర్గంలో చోటుకోసమే ఎక్కువ ఆసక్తితో ఉన్నారని చెబుతున్నారు. కాగా.. పార్టీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 10 మంది వరకు పోటీ పడుతున్నట్టు పేర్కొంటున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న విష్ణువర్థన్‌రెడ్డితో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండల కమిటీల ఎన్నిక పూర్తవగా, వచ్చే వారంలో జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలోనే ఏకాభిప్రాయం ప్రకారమే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నిక పూర్తి చేసేందుకు పార్టీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికీ రాష్ట్ర పార్టీలో పలువురు సీనియర్ నాయకులు ఈ నెల 3, 4 తేదీల్లో వివిధ జిల్లాల్లో పర్యటించి నేతల అభిప్రాయాల మేరకు ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులకు పేర్లను రాష్ట్ర పార్టీకి నివేదిక రూపంలో అందజేశారని సమాచారం. నివేదికలో సూచించిన పేర్లపై కొద్ది రోజుల క్రితం పార్టీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్ నేతృత్వంలో కోర్‌కమిటీ సమావేశమై చర్చించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే వారం, పది రోజుల్లోనే జిల్లాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. -
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దౌర్జన్యం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దౌర్జన్యానికి దిగారు. ఏ.కొండూరు మండలం గోపాలపురంలో వైఎస్సార్సీపీ నేత భూక్య కృష్ణ ఇంటిపై దాడి చేశారు. దాడిని చిత్రీకరిస్తున్న కృష్ణ కుమారుడిపైనా దాడికి పాల్పడ్డారు. కృష్ణ కుమారుడు గోపిచంద్ ఫోన్‌ను ఎమ్మెల్యే కొలికపూడి ధ్వంసం చేశారు. భూక్య కృష్ణ భార్యను కూడా కొలికపూడి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపంతో కృష్ణ భార్య పురుగుల మందు తాగారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు వైద్యులు రిఫ్ చేశారు. కొలికపూడి దౌర్జన్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.భూక్యా కృష్ణ- భూక్యా నాగేశ్వరరావు, భూక్యా భీమ్లా ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా ఉండగా, ఆస్తి పంపకాలు సవ్యంగా చేస్తామని గతంలో పెద్ద మనుషులు ఒప్పించారు. భూక్యా కృష్ణ ఆమోదంతో అతని స్థలంలో నుంచి నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. స్థలం వివాదం తేలకపోవడంతో తన స్థలంలో నిర్మించిన సీసీ రోడ్డుకు అడ్డంగా భూక్యా కృష్ణ తీగ వేశారు.ఇదిలా ఉండగా, గోపాలపురం గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి హాజరయ్యారు. గోపాలపురం 5వ వార్డు వైఎస్సార్సీపీ సభ్యుడిగా ఉన్న భూక్యా కృష్ణపై ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా భూక్యా కృష్ణ ఇంటికెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. వారిపై దాడి చేశారు. సంఘటనను ఫోన్లో చిత్రీకరిస్తున్న భూక్యా కృష్ణ కుమారుడు గోపీచంద్‌పైనా దౌర్జన్యం చేశారు. -
నిజమైతే నిరూపించండి.. మంత్రి ఆనంకు భూమన సవాల్
సాక్షి, తిరుపతి: తిరుపతి తొక్కిసలాట(tirupati stampede)లో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సందర్భంగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) చేసిన అర్థం లేని ఆరోపణలపై వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) వీడియో ద్వారా ధీటుగా బదులిచ్చారు.భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే..:‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాపై చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయి. నిజానికి మీ నిర్వాకం వల్ల ఆరుగురు మరణిస్తే, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, జగన్‌పై ఆరోపణలు చేశారు. ఇది కచ్చితంగా మీరు స్థాయి దిగజారి మాట్లాడటమే. ఇంత హీనంగా మాట్లాడగలనని మీకు మీరు నిరూపించుకున్నారు. మీ మాటలతో తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులు, క్షతగాత్రులను దారుణంగా అవమానించారు’.‘తొక్కిసలాట బాధితులపై సానుభూతి చూపాల్సింది పోయి, పరామర్శించి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. మేం డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నామనడం రాజకీయం కాదా?. దీన్ని బట్టే ఎవరు రాజకీయం చేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. మీకు క్షతగ్రాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదని అర్థమవుతోంది. వారు మీ గురించి మాట్లాడలేదని మీరు ఇలా మాట్లాడుతారా? మీ అస్తిత్వానికి ఇబ్బంది వస్తుందని ఇలా ఆరోపణలు చేస్తారా?’.‘మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకోవడం దారుణం కాదా?. కనీస భధ్రత ఇవ్వాలని కూడా తెలియదా?. జగన్ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంతసేపు అక్కడెందుకు ఉన్నారు?. అది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా?. జగన్ ఆసుపత్రికి రాకుండా కుట్ర చేసిన మాట నిజం కాదా?’.ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా!‘మిమ్మల్ని తిట్టించడం కోసం మేం ఆస్పత్రిలో డబ్బులిచ్చామన్నది సీసీ కెమెరాలో రికార్డయిందని అంటున్నారు కదా?. ఆనం రామనారాయణ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. తొక్కిసలాట క్షతగాత్రులతో మిమ్మల్ని తిట్టించడం కోసమే మేము వారికి డబ్బులు ఇచ్చామంటున్నారు కదా!. ఒకవేళ అది నిజమైతే, మీకు నిజంగా దేవుడిపై భక్తి కలిగి ఉంటే మేం కేవలం మిమ్మల్ని తిట్టించడం కోసమే తొక్కిసలాట క్షతగాత్రులకు డబ్బులిచ్చినట్లు మీరు నిరూపించాలి. ఆ పని చేయలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి’.‘నిజానికి జగన్ వచ్చేవరకు మమ్మల్ని ఆసుపత్రి వైపు మీ పోలీసులు, అధికార గణం వెళ్లనీయలేదు. ఆ విషయం గుర్తుంచుకొండి. చంద్రబాబు పాలనపై ప్రజలకు ఏ అభిప్రాయం ఉందో ఇప్పటికే అందరికీ అర్థమవుతోంది. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా.. మీ పార్టీలో ఎవరూ గుర్తించడం లేదనే మీరు, ఇలా ఆరోపణలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది’’ అని భూమన పేర్కొన్నారు. -
చంద్రబాబు అసమర్థ పాలనకు ఇదే నిదర్శనం: ఎమ్మెల్సీ తలశిల
సాక్షి, విజయవాడ: తిరుమలలో భక్తుల మృతికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం (Talasila Raghuram) అన్నారు. ఈ ఘటనకు కింది స్థాయి అధికారులు, ఉద్యోగులను బాధ్యులను చేయడం దారుణమంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అధికారులకు ప్రజల కోసం పని చేసే స్వేచ్ఛలేదని దుయ్యబట్టారు.చంద్రబాబు అధికారులను కేవలం కక్ష సాధింపు కోసమే వాడుతున్నారు. అందుకే తిరుమల లాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కులాల ఆధారంగా అధికారులను టార్గెట్ చేయడం దారుణం. తిరుమల తొక్కిసలాట (tirupati stampede) ఘటనలో కులం ఆధారంగా అధికారులను టార్గెట్ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్, జేఈవో దీనికి బాధ్యులు కాదా.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పై కనీసం టీటీడీ బోర్డు సమావేశం కూడా చైర్మన్ నిర్వహించలేదు. చంద్రబాబు ఎదుట టీటీడీ చైర్మన్, ఈవో పొట్లాడుకున్నారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇదే నిదర్శనం. క్షమాపణలు చెప్పించడం కాదు.. ఆరుగురు మృతికి కారకులను శిక్షించాలి’’ అని తలశిల రఘురాం డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా!ఇది ప్రభుత్వ వైఫల్యమే: ఎంపీ మిథున్రెడ్డిచిత్తూరు జిల్లా: వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట చాలా బాధాకరమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యమే ఈ దారుణానికి కారణమని.. ఇది కేవలం క్షమాపణలు చెప్పి సర్దుకునేంత చిన్న విషయం కాదన్నారు. కచ్చితంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధం లేని అధికారులపై కంటితుడుపు చర్యలు తీసుకున్నారు...అసలు ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పవన్ కల్యాణ్ కనీసం తప్పు జరిగిందని ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. చంద్రబాబు ఆ పని కూడా చేయకుండా ఘటన వెనుక కుట్రకోణం అని మళ్లీ రాజకీయం చేయాలని చూశారు. ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు. -
సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఇంకా బుద్ధి రాలేదు: ఆర్కే రోజా
చిత్తూరు, సాక్షి: తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా కారకులపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నగరిలో శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘‘సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే.. 14 మందిపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అలాంటిది తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ఘటన జరిగింది మూడు రోజులు గడిచింది. అయినా ఇంకా చర్యలు కనిపించడం లేదు. చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈవో, ఎస్పీ.. కారకులైన అందరిపైనా కేసు నమోదు చేయాలి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి. .. తొక్కిసలాట ఘటన(Stampede Incident) వల్ల భక్తులు తిరుమలకు రావడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అసలైన నిందితులపై చర్యలు తీసుకోకపోగా.. ఇంకా కాపాడాలనే చూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తోంది. అయినా టోకెన్ సిస్టమ్ ఎందుకు తీయలేదు? అని ప్రశ్నించారామె. పవన్‌కు సూటి ప్రశ్న‘‘సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మానవత్వం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. మరి గేమ్ ఛంజర్ ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు చనిపోతే.. బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు. అల్లు అర్జున్‌కు ఉన్న మానవత్వం కూడా మీకు లేదా?. లడ్డూ వ్యవహారంలో చేయని తప్పునకు కాషాయం కప్పేసుకుని మాట్లాడారు. మరి తిరుపతిలో ఇంత ఘోరం జరిగితే ఇప్పుడేం మాట్లాడరే?. తప్పు చేసిన వాళ్లు ఫలానా వాళ్లే అని మీరే చెబుతున్నారు. మరి వాళ్ల తాట ఎందుకు తీయడం లేదు’’ అని రోజా ప్రశ్నించారు. -
బాబు డ్రామాలో పవన్ బకరా!
తిరుపతిలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం ‘సారీ’లతో ముగించేస్తోందా?. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించి పరువు పోగొట్టుకుంటే.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఏకంగా పవన్ గాలి తీసేందుకే ప్రాధాన్యమిచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగినట్లు అయ్యింది. చివరకు బీఆర్ నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి. అయితే..స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓ సారీ చెప్పించాల్సి వచ్చింది. మొత్తమ్మీద చూస్తే.. ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పూ లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు.. ఇటు టీటీడీ ఉన్నతాధికారులూ జారుకున్నారు. స్వామివారిపై భక్తితో భక్తులు తిరుమతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి!!.వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకన్ల జారీ కాస్తా తొక్కిసలాటకు దారితీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ, పోలీసుల వైఫల్యం, అలసత్వం సుస్పష్టం. పైరవీలతో టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్‌ల బాధ్యతారాహిత్యం కూడా కనపడతూనే ఉంది. అంత పెద్ద ఘోరం జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకూ చూశారు. సహకరించే మీడియా ఉండనే ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్టపాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆటలో అరటి పండు చందంగా ఎవరూ పట్టించుకోనిది.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి!. అందుకేనేమో.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు.గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు. కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ విడిగా వెళ్లి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు. జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేయడమే కాకుండా, ప్రభుత్వం తరుఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్.. తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందా? అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్లీ అదే డిమాండ్ చేశారు. అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును, టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేహం కలిగింది. కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్ నాయుడు పవన్ కల్యాణ్ ఎవరో అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు. ఎవరో ఏదో చెప్పారని తానెందుకు స్పందిస్తానని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇది కాస్తా పవన్ వర్గానికి చిర్రెత్తించింది. చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి. ఆ వెంటనే చంద్రబాబు రంగంలో దిగి బీఆర్ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారీ చెప్పి, తన వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించి కాదని బుకాయించే యత్నం చేశారు.నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రుల మాదిరే ఒక మంత్రి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి. ఈయనకేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇతర మంత్రులపై, తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటలలోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది.చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది. లేకుంటే పవన్ తిరుపతి ఆస్పత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యులో వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనాలి. అవేవి చేయకుండా క్షమాపణల డ్రామా ఆరంభించారు. దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ అసలు విషయం బయటపడ్డాక, పవన్ కల్యాణ్ మళ్లీ భక్తులను, ప్రజలను మోసం చేశారని తేటతెల్లమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు. అప్పుడు వేసుకున్న సనాతని వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు.గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు. ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరగని దారుణ ఘటన జరిగితే, దానిని సైడ్ ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా హడావుడి చేసి చివరికి సారీలతో తుస్సుమనిపించారు. విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై, ప్రచార ప్రకటనలలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కు కొంత అసంతృప్తి ఉందని, దానిని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్లి తొక్కిసలాటకు తానే బాధ్యుడిని అన్నట్లు క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు. పవన్ చర్య కొంత మంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పవన్ లు కలిసే ఈ కథ నడిపించారన్న అభిప్రాయం చివరికి కలుగుతుంది. కాకపోతే బీఆర్ నాయుడు తెలివితక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది. ఈ మొత్తం వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే. కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకుని మిగిలిన వారిని బలి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు ఛైర్మన్, సభ్యులు మాటల దాడి చేశారట. అంతేకాక ,శ్యామలరావు దేవాలయానికి వెళ్లినా అధికారులు ఎవరూ ఆయనతో మాట కలపలేదట!. దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్నారన్న ప్రచారం ఆరంభమైంది. బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను, అల్లు అర్జున్ వంటివారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలేదు. వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట. పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు మంటూ ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట. అయినా అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. దాంతో బాధిత కుటుంబాలు తమవాళ్లు పోయారన్న విషాదంతో పాటు, ఈ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది.ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్ర ప్రజలకు సినిమా వైబ్ అనండి.. పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు. వారివల్లే పవన్ వంటివారు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత