breaking news
-
చంద్రబాబు సీఎంగా ఉంటే అంతే.. టీటీడీ బోర్డు రద్దుకు మార్గాని భరత్ డిమాండ్
తూర్పు గోదావరి, సాక్షి: తిరుపతి తొక్కసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాకాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘తిరుపతి ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దారుణం..అత్యంత బాధాకరమైన విషయం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస వసతులు కూడా అందించకుండా అలా ఎందుకు బంధించినట్లు?. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారు?. ఇక్కడ టీటీడీ ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. టీటీడీ దేవస్థానమో(TTD Board) లేదంటే రాజకీయ పార్టీ కార్యాలయమో అర్థం కావడం లేదు.చంద్రబాబు(Chandrababu)కు సంబంధించిన అనే కార్యక్రమాల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాలు 29 మంది ప్రాణాలు కోల్పోయారు . క్రౌడ్ మేనేజ్మెంట్ చంద్రబాబు జమానాలో సాధ్యం కాదా?. అదే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.తిరుపతి(Tirupati) మరణాలకు బాధ్యత ఎవరిది?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ బాధ్యత టీటీడీకి వదిలేశారు. అయితే క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించటం దారుణం. అసలు 1,20,000 టోకెన్లు జారీ చేయాలని భావిస్తే ఆన్లైన్లో ఎందుకు చేయలేదు. చిన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదు ఇది మొత్తం వ్యవహారానికి టిటిడి బోర్డు బాధ్యత తీసుకొని పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వం బోర్డును రద్దు చేయాలి. ఇది హిట్లర్ నియంత పాలన కాదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం చంద్రబాబు గుర్తించాలి. తిరుపతి ఘటనను చీకటి రోజుగా కింద భావించాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి అని మార్గాని భరత్ అన్నారు. -
అహం దెబ్బతిన్న డిప్యూటీ సీఎం?
తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఇంకో నలభైమంది గాయపడిన ఘటన కూటమిలో కాకరేపుతోంది. ఘటన జరిగిన మరుక్షణం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బయటకు వచ్చి ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి మొత్తం అంశాన్ని తాను హైజాక్ చేసారు. అటు చంద్రబాబు ఆ అంశాన్ని నీరుగార్చి చిన్నదిగా చేసి చూపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే పవన్ ఏకంగా బహిరంగంగానే క్షమాపణ చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్, ఈవో మరికొందరు పెద్దలు దీనికి బాధ్యత వహించాలి అని బాణం సంధించారు. అయితే.. దీనికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం తలబిరుసుతో మాట్లాడుతూ.. ఎవరో ఏదో అన్నారని తానెందుకు స్పందించాలి? అని ప్రశ్నిస్తూనే.. క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అంటూ బాధ్యతా రహితంగా మాట్లాడారు. పవన్ అక్కడితో ఊరుకోకుండా టీటీడీ చైర్మన్ భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే అని మరోసారి పిఠాపురంలో డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. టీటీడీ చైర్మన్ విషయంలో పట్టుబట్టినట్లుగా ఉన్న పవన్ ను పదే పదే ఆయన్ను సారీ చెప్పడం కోసం డిమాండ్ చేస్తున్నారు. . ఇదంతా ఒకేగానీ పవన్ ఉన్నఫళంగా టీటీడీ విషయంలో ఇంతగా ఎందుకు పట్టుదలతో ఉన్నారు?. ఆయనకు ఏమైనా ఆత్మాభిమానం గట్రా దెబ్బతిన్నదా ?.. మోదీ సభలో ప్రాధాన్యం తగ్గిందా ?వాస్తవానికి మొన్నటి విశాఖ సభలో ఉంటేగింటే మోదీ తరువాతి ప్రాధాన్యం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకు .. రెండో స్థానంలో ఉన్న పవన్‌కు దక్కాలి. కానీ 24 మంది మంత్రుల్లో ఒకరైన లోకేష్ కు అధిక ప్రాధాన్యం దక్కడం పవన్‌కు నచ్చలేదని అంటున్నారు. కేవలం కేబినెట్లో మంత్రిగా ఉన్న లోకేష్‌ను తనతో సమానంగా మోదీ సమక్షంలో కూర్చోబెట్టి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అంటే మున్ముందు తనతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే తనకు పోటీగా.. లోకేష్ ను తయారు చేస్తూ అవకాశం ఉంటె తనను తొక్కేసేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడడు అని ఇప్పటికే గుర్తించిన పవన్ తన సహజశైలిలో ముందుకు వెళ్తున్నట్లు భావిస్తున్నారు. తనను తొక్కేసి లోకేష్‌ను ఎలివేట్ చేసే ప్లాన్లకు తానెందుకు తలొగ్గాలి.. అసలు కూటమి విజయంలో తనదే కీలకపాత్ర అని నమ్ముతున్న పవన్ ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న తప్పులు.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న దందాలు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అవకాశం దొరికితే మున్ముందు ఇలాంటి అంశాలను బహిరంగంగానే ఖండించి తన వాయిస్ బలంగా వెళ్లేలా చూసుకుని సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. మున్ముందు పవన్ కల్యాణ్ చంద్రబాబు కాలికింద చెప్పులా ఉంటారా? చెప్పులోని రాయిలా మారతారా? చూడాలి..:::సిమ్మాదిరప్పన్న -
స్పందించాల్సిన అవసరం లేదు.. పవన్‌కు టీటీడీ ఛైర్మన్ కౌంటర్
సాక్షి, తిరుపతి: క్షమాపణలు చెప్పితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?.. ఎవరో ఏదో చెప్పారని మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) కౌంటర్ ఇచ్చారు.తొక్కిసలాట ఘటనకు టీటీడీ(TTD) ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు, పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు చోద్యం చూసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసుల వైఫల్యంపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదన్నారు.కాగా, తొక్కిసలాట ఘటనపై ఇవాళ పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు.. ఈవో, ఎఈవో ఘటనకు భాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి ఘటనలో తాను దోషిగా నిలబడాలా? అంటూ వ్యాఖ్యానించారు.మరోవైపు, టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య వార్ కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. పాలకమండలి సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఈవోపై సభ్యులు మండినట్లు సమాచారం.ఇదీ చదవండి: పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి: బొత్సవైకుంఠ ఏకాదశి ఏర్పాట్లుపై సమాచారం పాలకమండలికి టీటీడీ అధికారులు ఇవ్వలేదని.. సమన్వయ లోపం కారణంగానే భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదంటు ఈవోని సభ్యులు నిలదీశారు. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 2 నుండి 5 లక్షలు టీటీడీ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు కేటాయింపుపై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. వైకుంఠ త్రయోదశి తర్వాత టోకెన్ లేకుండా సర్వదర్శనానికి అనుమతించాలని పాలకమండలిలో చర్చ జరిగింది. -
పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి: బొత్స
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ((Botsa Satyanarayana) డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక, వరుస ఘటనలతో తిరుమల ప్రతిష్టపై భక్తుల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, దాన్ని కాపాడాలని న్యాయమూర్తిని కోరారు. టీటీడీ ఛైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపంతోనే ఘటన జరిగిందని పత్రికలు, డిప్యూటీ సీఎం చెబుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన భక్తులు ప్రాణాలు తిరిగి రావని, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ కోరారు.బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే..:ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం:వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవదేవుడి దర్శన టోకెన్ల కోసం వచ్చిన భక్తుల్లో ఆరుగురు చనిపోయిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కారణంగానే తొక్కిసలాట జరిగి ఆరు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 40 మంది క్షతగాత్రులయ్యారు. భక్తులు చనిపోవడం దైవ నిర్ణయం అంటూ.. ఈ దుర్ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించిన తీరు మరింత బాధ కలిగించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు ఇచ్చే కార్యక్రమం విషయంలో ప్రభుత్వం, టీటీడీ అధికారులు కనీసం రివ్యూ మీటింగ్ నిర్వహించి ఉంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు. 8వ తేదీ వరకు కుప్పంలోనే ఉన్న సీఎం చంద్రబాబు కానీ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా టికెట్ల పంపిణీపై కార్యక్రమంపై సమీక్ష చేసి ఉండాల్సింది.హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి:ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరిగినట్టు కాదు. ఏపీ హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గత రెండు రోజులుగా పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకుని సుమోటో కేసుగా స్వీకరించి విచారణ జరపాలి. తిరుమల దేవస్థానం విశిష్టతను కాపాడాలన్నా, భక్తుల్లో ఉన్న అభద్రతను పోగొట్టాలన్నా పటిష్టమైన విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పవన్‌కళ్యాణ్ క్షమించమని చెప్పినంత మాత్రాన సరిపోదు. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తున్నారో చెప్పాలి.ఆ ఇద్దరిపై ఏ చర్యలుండవా?:టీటీడీ ఛైర్మన్, ఈవోల మధ్య సమన్వయం లేదని, క్షతగాత్రుల పరామర్శకు వచ్చిన ముఖ్యమంత్రి ఎదుటే వారిద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారని టీడీపీ అనుకూల పత్రిక బ్యానర్ వార్త ప్రచురించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయం చెప్పారు. కానీ వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?. తొమ్మిది కేంద్రాల్లో దర్శనం టికెట్ల పంపిణీ చేపడితే మూడు చోట్ల జరిగిన తొక్కిసలాటల్లో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక సంఘటనలోనే డీఎస్పీని బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. మూడు చోట్ల జరిగిన తొక్కిసలాటల్లో 40 మంది వరకు క్షతగాత్రులయ్యారు. మరో కౌంటర్లో ఒకరు చనిపోయారు. వాటి విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి. ఎవరిది బాధ్యత?:పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే తప్పు అన్నట్టు నిన్న చంద్రబాబు చెప్పడం, తమ ప్రభుత్వ చేతకానితనాన్ని ఒప్పుకోవడమే. వైఎస్సార్సీపీ హయాంలో నిర్వహించినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. భక్తులు ప్రశాంతంగా దేవదేవుణ్ని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావుడి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడెందుకు క్షమాపణలు చెప్పేసి ఊరుకున్నారు. టీటీడీ ఛైర్మన్, ఈఓ ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలని ఆయన చెబుతున్నాడు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన వారు చేసిన పాపం కరిగిపోతుందా, పోయిన భక్తుల ప్రాణాలు తిరిగొస్తాయా?. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవోలలో ఎవరు బాధ్యత వహిస్తారు?.పరామర్శకు వెళితే క్షుద్ర రాజకీయాలు:తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, ఆ కుటుంబాలకు అండగా నిలవాలని మా నాయకుడు శ్రీ వైయస్ జగన్ బయలుదేరితే అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. నడిరోడ్డుపై కాన్వాయ్ నిలిపి వేయడంతో, ఆయన కొంత దూరం నడిచి వెళ్లారు. ఆయన ఆస్పత్రికి రాకముందే తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని బలవంతంగా డిశ్చార్జ్ చేయాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ, వారు ప్రతిఘటించడంతో ఏమీ చేయలేకపోయారు.ఇదీ చదవండి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు హైడ్రామా: అంబటివైఎస్ జగన్ తొక్కిసలాట బాధితులతో అన్ని వివరాలు ఆరా తీసి, పరామర్శిస్తే.. దానిపైనా విషం చిమ్ముతున్నారు. జగన్ పరామర్శకు వెళితే క్షతగాత్రులకు కవర్లు ఇచ్చి మాట్లాడించారని కూటమి పార్టీలు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయి. ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా? పవిత్ర స్థలంలో అపశృతి జరిగినప్పుడు చింతించాల్సింది పోయి ఇంతలా దిగజారిపోయి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ హర్షించరు. ప్రమాదం జరిగినప్పుడల్లా అధికారులను బాధ్యులను చేస్తూ వారు వైయస్సార్సీపీ అనుకూలురంటూ వ్యాఖ్యలు చేయడం ఫ్యాషనైంది. వారు మీరు నియమించుకున్న అధికారులన్న విషమం మర్చిపోవద్దు. -
తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు హైడ్రామా: అంబటి
సాక్షి, గుంటూరు: ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా వున్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. వైఎస్సార్సీపీపై అక్రమ కేసులు బనాయించేందుకే ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని.. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబేనని విమర్శించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కిందిస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..అంతర్జాతీయంగా తిరుమల తిరుపతి ఆలయానికి గొప్ప గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మొత్తం ప్రపంచం దీనిని గమనిస్తుంది. అటువంటి క్షేత్రంలో ప్రణాళికా లోపం కారణంగా వైకుంఠ ద్వార దర్శనంకు వచ్చిన భక్తులు తొక్కిసలాటకు గురై ఆరుగురు మృతి చెందడం చాలా పెద్ద ఘటనగా భావించాలి. కోట్లాధి మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చాలా సీరియస్‌గా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరం. డీఎస్సీ, గోశాల డైరెక్టర్ లను సస్పెండ్ చేయడంతో చేతులు దులుపుకున్నారు.క్రిమినల్ ముఠాను కాపాడుకునేందుకే చంద్రబాబు తిరుపతి పర్యటనతిరుపతిలో తొక్కిసలాట సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు, హోం, రెవన్యూ, ఎండోమెంట్ మంత్రులతో కలిసి ఘటనా స్థలికి వెళ్లి అధికారులు, మృతుల కుటుంబాలు, క్షతగాత్రులతో మాట్లాడారు. దీనిపై చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ సీఎం మాత్రం తన అనుకూల అధికారులుగా, కావాలని తిరుమల తిరుపతిలో పోస్టింగ్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఆ నలుగురిపై ఈగ కూడా వాలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు చంద్రబాబు ఈ ఘటనపై హుటాహుటిన తిరుపతికి వెళ్ళింది బాధితులు, భక్తుల కోసం కాదు. తను పెంచి పోషిస్తున్న క్రిమినల్ ముఠాలోని నలుగురిని కాపాడుకునేందుకే.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నలుగురూ వైయస్ఆర్ సీపీకి చెందిన వారిపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టాలా అనే ఆలోచనతోనే పనిచేస్తున్నారు. గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ థర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను కేసుల్లో ఎలా ఇరికించాలా అనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందీ, ఇవే లడ్డూలను అయోధ్యలోని రామాలయంకు కూడా పంపారంటూ అత్యంత దారుణమైన తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు.వైఎస్ జగన్ రాకుండా అడుగడుగునా ఆటంకాలుతొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు తిరుపతికి వెళ్ళే క్రమంలో వైయస్ జగన్ గారికి కావాలనే అనేక అడ్డంకులు సృష్టించారు. చివరికి ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆయన వాహనాలకు ఆటంకాలు కల్పించారు. వైఎస్ జగన్ కారు కాలినకడన వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి, వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఇదీ చదవండి: బాబే మొదటి ముద్దాయి: వైఎస్ జగన్‌ముందు నుంచే జగన్.. తిరుపతిలో బాధిత కుటుంబాలను కలవకూడదనే కుట్రతోనే ప్రభుత్వం పనిచేసింది. ముందుగా సీఎం వెళ్లడం, తరువాత వేరుగా డిప్యూటీ సీఎం వెళ్ళడం ద్వారా సమయం లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే దిగజారుడు రాజకీయం చేశారు. ఎక్కడ వైఎస్ జగన్ బాధితులను కలిసి, జరిగిన దానిపై వాస్తవాలు మాట్లాడతారో, ఎక్కడ ప్రజల్లో దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతుందోనని ప్రభుత్వం భయపడింది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే భక్తులు సహించరు. ఆ భగవంతుడు కూడా క్షమించడు.పోలీసుల తప్పుడు కేసులను భయపడేది లేదుపిల్లి బాబూరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై మాపై గుంటూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. దీనిపై ఎల్లో మీడియాలో అంబటి సోదరులపై క్రిమినల్ కేసు అంటూ పెద్ద కథనాలను ప్రచురించారు. పిల్లి బాబూరావు నాకు తెలియదు. ఈ కేసుకు సంబంధించి సమాచారం తెలియగానే డీఎస్సీ, సీఐలతో మాట్లాడాను. ఈ కేసులో ఎప్పుడు మీరు విచారణకు పిలిచినా హాజరవుతాను, లేదా అరెస్ట్ చేసేందుకు వస్తామన్నా కూడా పూర్తిగా సహకరిస్తాను అని చెప్పాను. ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశాను. బాద్యుడైన పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తాను. దీనిపై భయంతో క్వాష్ కు, యాంటిసిపేటరీ బెయిల్ కు ప్రయత్నించను. చంద్రబాబు, లోకేష్ లు చెప్పారని అర్థరాత్రి పూట వచ్చి మా తలుపులు కొట్టవద్దు. ఎప్పుడ రమ్మని ఫోన్ చేసినా నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వస్తాను. ఇటువంటి తప్పుడు కేసులను భయపడేది లేదు. పారిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. -
న్యాయం నా వైపే ఉంది.. సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటా: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. న్యాయం తన వైపే ఉందని.. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఘటన జరిగిన రోజు బాలిక తండ్రి పిలిస్తేనే తాను వెళ్లానని.. కానీ తనపై అనవసరంగా ఫోక్సో కేసు పెట్టారని చెవిరెడ్డి అన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని చెవిరెడ్డి స్పష్టం చేశారు.అసలు జరిగింది ఇదే..కాగా, తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు.కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పారు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్‌కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన చెవిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
తప్పు ఒప్పుకోకుంటే పాపం తగలదా?
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రంగులు మార్చే బుద్ధి చూపిస్తే... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి కొంత స్వతంత్ర ధోరణి, మరికొంత స్వామి భక్తి చూపే ప్రయత్నం చేశారు. దుర్ఘటన జరిగినందుకు ప్రజలకు, భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా పవన్ ఆ పని చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించారు. చంద్రబాబు నాయుడు అధికారులుపై చిర్రుబుర్రులాడినట్లు, వేటు వేసినట్లు కనిపించారు. కానీ.. తనకు కావాల్సిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారన్న సంగతి అర్థమైపోతుంది. ..ఇంతటి ఘోరమైన దుర్ఘటన జరిగినా అందులోనూ రాజకీయం చేస్తూ ఎలాగోలా నెపం వైఎస్సార్సీపీ(YSRCP)పైన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రుద్దాలన్న తాపత్రయం స్పష్టంగా కనిపించింది. అదే టైమ్‌లో టీటీడీ పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉందో, ఉన్నతస్థాయిలో ఉన్నవారి మధ్య గొడవలు ఏ రకంగా ఉన్నాయో బట్టబయలయ్యాయి. చంద్రబాబు నాయుడు ఎదుటే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), కార్యనిర్వాహణాధికారి శ్యామలరావు తీవ్ర స్థాయిలో ఏకవచనంతో దాడి చేసుకున్న వైనం, ఆరోపణలు గుప్పించుకున్న తీరును టీడీపీ జాకీ పత్రికే బహిర్గతం చేయడం విశేషం. టీటీడీ అధ్యక్ష పదవికి బీఆర్ నాయుడును నియామకాన్ని ఆ జాకీ పత్రిక యజమాని వ్యతిరేకించారు. అయినా మంత్రి లోకేష్ పట్టుబట్టి నియమించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్‌లో భూ దందాలు చేస్తున్నారంటూ ఈ పత్రిక కొద్ది రోజుల క్రితం ఒక కథనాన్ని ఇచ్చింది. అయినా చంద్రబాబు స్పందించకపోగా, తన వెంటే తిప్పుకుంటున్నారు. తిరుపతికి వెళ్లిన సందర్భంలో కూడా చంద్రబాబు వెంటే ఆయన ఉన్నారు. బహుశా ఈ కోపంతోనే గొడవ సమాచారాన్ని ఈ పత్రిక బయట పెట్టి ఉండవచ్చు. ఉద్దేశం ఏమైనా, రాజకీయాలు ఎలా ఉన్నా, ప్రజలకు కొన్ని వాస్తవాలను చెప్పిందని ఒప్పుకోవచ్చు. ఇక్కడ సంగతి ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఒక ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ లేదా బదిలీ వేటు వేశారు. కానీ వారిలో కీలకమైన అధికారులు లేరు. తిరుపతి ఎస్పీ సుబ్బనాయుడును బదిలీ చేయాల్సి రావడం ఆయనకు ఇబ్బంది కలిగించేదే. సాధారణంగా ఇంతమంది మరణానికి బాధ్యుడుగా ఎస్పీని సస్పెండ్ చేయాల్సి ఉండిందని చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడు కావడం, రెడ బుక్ రాజ్యాంగం అమలుకు ఏరి కోరి తెలంగాణ నుంచి తెచ్చుకోవడం వల్ల బదిలీతో సరి పెట్టారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈవో శ్యామలరావును, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని టచ్ చేయలేదు. కాకపోతే వారిపట్ల ఆగ్రహం ప్రదర్శించినట్లు వీడియో లీక్ అయ్యేలా చూసుకున్నారు. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిపిన నెయ్యి వాడారని పిచ్చి ఆరోపణను చంద్రబాబు చేసిన అంశంలో వాస్తవాలు శ్యామలరావుకు తెలుసు. పొరపాటున ఆయన అప్పుడు జరిగిన విషయాలపై నోరు తెరిస్తే అది చంద్రబాబుకు ఇరకాటం అవుతుంది. వెంకయ్య చౌదరి చాలాకాలం నుంచి చంద్రబాబుకు సన్నిహితుడు. ఇతర సామాజిక వర్గాల అధికారులపై వేటు వేసి తన సామాజికవర్గం అధికారిని మాత్రం చంద్రబాబు రక్షించుకుంటున్నారని కొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమల కొండపై ఈవో కన్నా ,వెంకయ్య చౌదరి పెత్తనమే అధికంగా ఉందని చెబుతున్నారు. చంద్రబాబుతో నేరుగా మాట్లాడే చనువు ఉండడమే కారణమట. ఈవో, ఏఈవోల మధ్య సఖ్యత లేదు. వీరిద్దరికి, ఛైర్మన్‌కు సత్సంబంధాలు లేవు. బిఆర్ నాయుడు తనకు పదవి రావడంతో చేయవలసింది ఏమిటో తెలియని పరిస్థితిలో పెత్తనం చేయబోతే అధికారులు సహకరించడం లేదు. లోకేష్‌కు ఆప్తుడనైన తననే అవమానిస్తున్నారని ఆయన మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీలో అధ్వాన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తొక్కిసలాట కారణంగా ఆరు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో జన సమూహాలను సమర్థంగా నిర్వహించగల టీటీడీ అప్రతిష్ట పాలైంది. ఇక్కడ ఇంకో కారణం కూడా చెబుతున్నారు. జనసేనకు నాయకుడు టోకెన్లు ఇచ్చే చోట ఏభై మంది కార్యకర్తలను లోపలికి పంపించడం కూడా తొక్కిసలాటకు ఒక కారణమైందని ఒక పత్రిక రాసింది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణంటూ చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. గత అనుభవాలను చూస్తే ఆయన ఫలితం ఏమంత గొప్పగా ఉండదని ముందగానే చెప్పేయవచ్చు. గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మరణించినప్పుడు కూడా ఇలాగే విచారణ కమిషన్ వేశారు. ఉన్నతాధికారుల మాట అటుంచండి.. కనీసం ఒక్క కానిస్టేబుల్‌పై కూడా చర్య తీసుకోలేదు. పైగా ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు చేసిన ఫొటోషూట్ కళ్లెదుటే ఉన్నప్పటికీ ఆయన తప్పేమీ లేదన్నట్టు కమిషన్ నివేదిక ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుపతి తొక్కిసలాట ఘటన కూడా ఇలాగే అవడం గ్యారెంటీ! చంద్రబాబు ఇప్పటివరకూ బి.ఆర్.నాయుడు రాజీనామా కోరలేదు. టీవీ ఛానల్ యజమాని అని ఊరుకున్నారో.. లోకేశ్ మనిషి కాబట్టి చూడనట్లు వ్యవహరిస్తున్నారో తెలియదు మరి! నైతిక బాధ్యత వహించి బీఆర్ నాయుడే రాజీనామా చేసి ఉంటే బాగుండేది కానీ పదవి, అధికారం రుచి మరగిన తరువాత వదులుకోవడం కష్టమని అనుకుని ఉండాలి.ఇక చంద్రబాబు మాట్లాడిన కొన్ని అంశాలు చూడండి. దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని అన్యాపదేశంగా ఆయన వ్యాఖ్యానించడం ఎంత దుర్మార్గం?. ప్రభుత్వ, టీటీడీ అధికారుల, పోలీసు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంటే, ఆయన నెపం వైసీపీపై రుద్దడానిక ప్లాన్ చేశారు. ఎల్లో మీడియా ఇప్పటికే ఈ ప్రయత్నం ఆరంభించింది. ఏటా తిరుపతి వాసుల కోసం ఇలా కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు ఇస్తుంటే, ‘‘అసలు టోకెన్లు ఇవ్వడం ఏమిటి? తనకు తెలియనే తెలియదు’ అని చంద్రబాబు అంటున్నారు. అయితే ఇది బుకాయింపు అవ్వాలి లేదంటే అవగాహన రాహిత్యం కావాలి. ‘‘వైకుంఠ ఏకాదశికి పది రోజుల పాటు టోకెన్లు ఇచ్చి ప్రత్యేక దర్శనం కల్పించడం ఏమిట’’ని ఆయన అంటున్నారు. దాని ద్వారా లక్షలాది మంది భక్తుల కోరిక ను గత ప్రభుత్వం తీర్చిన విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. అసలు తిరుమలకు సంబంధించి తనకు తెలియని విషయం ఉండదని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఇది గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అంటూ నిస్సిగ్గుగా ఆరోపించారు. అదే కరెక్టు అయితే అధికారంలోకి వచ్చి ఏడు నెలల తర్వాత, కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టిన ఇన్ని నెలల తర్వాత కూడా దానినే ఎందుకు కొనసాగించారు?. మరోవైపు.. పవన్ కల్యాణ్ కొంత సొంత వ్యక్తిత్వంతో మాట్లాడినట్లు అనిపిస్తోంది. నాలుగు లక్షల మంది వచ్చిన ప్పుడు కూడా గతంలో జరగని దుర్గటన ఇప్పుడెలా జరిగిందని ఆయన ప్రశ్నించారట. దీనికి చంద్రబాబు, బిఆర్ నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరి బదులు ఇవ్వాలి. అంతేకాదు. భక్తులు, ప్రజలు క్షమించాలని కోరారు. ఈ మాట చంద్రబాబు చెప్పలేకపోయారు. గతంలో చంద్రబాబు లడ్డూ కల్తీ అనగానే గుడ్డిగా పవన్ కళ్యాణ్ సనాతని వేషం దాల్చి నానా రచ్చగా మాట్లాడి పరువు పోగొట్టుకున్నారు. ఈసారి అలా కాకుండా కాస్త జాగ్రత్త పడ్డారన్నమాట. అయితే.. ఆనాడు లడ్డూ విషయంలో అపచారం చేసినందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్షమాపణ చెప్పవలసి వచ్చిందని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఈవో,అదనపు ఈవో, ఛైర్మన్లను బాధ్యులను చేస్తే చంద్రబాబు మాత్రం వారిని రక్షించే యత్నం చేశారు. టీటీడీలో ఉన్న విబేధాలను ఆయన అంగీకరించారు. చంద్రబాబు ఆ విభేధాల ఆధారంగా విమర్శలు తనపైకి రాకుండా కథ నడిపించారు. నిజానికి వారందరిని నియమించింది చంద్రబాబే, వారితో శ్రద్దగా పని చేయించకపోగా, రెడ్ బుక్ రాజ్యంగం అంటూ, టీటీడీని ఆసరాగా చేసుకుని వైఎస్సార్సీపీ ఎలాంటి ఆరోపణలు చేయవచ్చో అనేవాటిపైనే పని చేయించారు. ఇప్పుడు వాటి ఫలితం జనం అనుభవించవలసి వచ్చింది. అసలు పనులు మాని చిల్లర వ్యవహారాలకే టిటిడి బాధ్యులంతా పరిమితం అయ్యారని అంటున్నారు. అధికారులపై, ఛైర్మన్ పై చర్య తీసుకోవాలని, వారిపై కేసులు పెట్టాలని మాత్రం పవన్ చెప్పలేదు. హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అర్జున్‌తోపాటు యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దానిని పవన్ సమర్థించారు. మరి ఇప్పుడు టీటీడీ యాజమాన్యంపై కేసు పెట్టాలని పవన్ ఎందుకు కోరలేదు. వారిని అరెస్టు చేయాలని ఎందుకు చెప్పలేదు. పైగా కొత్తగా కుట్ర కోణం ఉండవచ్చని పవన్ అన్నారు. అంటే ఇక్కడే చంద్రబాబు పట్ల స్వామి భక్తి ప్రదర్శించారా? సందేహం వస్తోంది.ఇది చంద్రబాబు, పవన్ కలిసి ఆడిన కొత్త డ్రామా అని, ఇందుకు బాధ్యులపై చర్య తీసుకోకుండా, మొత్తం డైవర్ట్ చేయడానికి జరుగుతున్న యత్నం అనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబే తొలి ముద్దాయి అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అన్నారు. దానికి కారణం బీఆర్ నాయుడును ఛైర్మన్‌గా నియమించడంతో పాటు, అంతవరకు సమర్థంగా పనిచేసిన అధికారులను తప్పించి, తనకు కావల్సిన అధికారులను పోస్టు చేసి ఈ తొక్కిసలాటకు కారణం అవడమే అనేది విశ్లేషణ. తన పబ్లిసిటీ పిచ్చి కారణంగా పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణిస్తేనే బాధ్యత తీసుకోని చంద్రబాబు ఇప్పుడు ఈ ఘటనలో బాధ్యత వహిస్తారా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు భయం, భక్తి లేవని కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తిరుపతి దేవుడును సైతం తన రాజకీయాలకు వాడుకోవడానికి చంద్రబాబు ఎప్పుడు వెనుకాడలేదు. అలిపిరి వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చితే అదృష్టవశాత్తు ఆయన బయటపడ్డారు. ఆ ఘటన జరిగింది తన ప్రభుత్వ వైఫల్యం వల్ల, పోలీసుల అజాగ్రత్త వల్ల అని చెప్పకుండా చంద్రబాబు తనకు సానుభూతి వస్తుందన్న ఆశతో 2003లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఓటమి పాలయ్యారు. 2024లో తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌ను బద్నాం చేసేందుకు తిరుమల లడ్డూతోసహా అనేక అపచారపు ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఈ ఉదంతంలో దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని దారుణమైన వ్యాఖ్య చేసి మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయడానికి పన్నాగాలు పన్నుతున్నట్లుగా ఉంది. ఇది కూడా తిరుమల పట్ల అపచారంగానే భావించాలి. ఏది ఏమైనా ఒక విశ్లేషకుడు అన్నట్లు పాలకుల పాపాలు ప్రజలకు శాపాలవుతుంటాయట. ఇవన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుందా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు ఎక్కడుంటే అక్కడ మరణాలే!: కేఏ పాల్
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులను చేస్తూ అధికార యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసింది చూశాం. అయితే ఈ పరిణామంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) స్పందించారు. బహుశా చంద్రబాబు తాను ఏపీకి సీఎం అనే విషయాన్ని మరిచిపోయి అలా ప్రవర్తించి ఉంటారేమో అని ఎద్దేవా చేశారు.తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. ఆ టైంలో ప్రధాని, పవన్‌లతో చంద్రబాబు పొలిటికల్ ర్యాలీతో బిజీగా ఉన్నారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన. కాబట్టి చంద్రబాబే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఘటనకు బాధ్యులను చేస్తూ ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, తానే సీఎం అనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారు.చంద్రబాబు(Chandrababu) సీఎంగా ఉన్నప్పుడు.. 2019లో పుష్కరాల సమయంలో 20 మందికి పైగా చనిపోయారు.. మరెందరో గాయపడ్డారు. కందుకూర్లో పొలిటికల్ ర్యాలీ నిర్వహిస్తే అక్కడా చనిపోయారు. గుంటూరులో ర్యాలీ నిర్వహిస్తే ముగ్గురు చనిపోయారు. తారకరత్న కూడా చంద్రబాబు ర్యాలీలో చనిపోయారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తిరుపతి(Tirupati)లో ఆరుగురు చనిపోయారు.సమస్యలను పక్కన పెట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు. అందుకే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి అని పాల్ డిమాండ్ చేశారు. -
పవన్ పర్యటన.. జనసేన మహిళా నేతకు అవమానం!
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వేళ జనసేన మహిళా నేత చల్లా లక్ష్మీకి చేదు అనుభవం ఎదురైంది. సంక్రాంతి సంబరాల వద్ద ఆమెకు అనుమతి లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చల్లా లక్ష్మీని బయటకు పంపారు. దీంతో, తోపులాట జరిగి ఆమె కిందపడిపోవడంతో తలకు గాయమైంది. అనంతరం, ఆమె విలవిల్లాడిపోయింది.సంక్రాంతి సందర్బంగా పిఠాపురం మండలం కుమారపురంలో మినీ గోకులాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, స్థానికులు వచ్చారు. అలాగే, జనసేన ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆమెకు అనుమతి లేదంటూ చల్లా లక్ష్మీని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు తెలిపారు. దీంతో, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ తగలడంతో విలవిల్లాడిపోయారు.ఈ నేపథ్యంలో జనసేన నేతలు, పోలీసులపై జనసేన వీర మహిళలు మండిపడుతున్నారు. పార్టీలో మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే ఇదేనా తమను ఇలా అవమానిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక, గాయపడిన చల్లా లక్ష్మీ అక్కడే ఉన్న మహిళలు సాయం చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా పిఠాపురంలో జనసేన వీర మహిళలకు అవమానం జరిగింది. పవన్ పాల్గొంటున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వెళుతున్న వీర మహిళలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. వీరంతా.. పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకుందామని అక్కడికి వచ్చినట్టు చెప్పారు. కానీ, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గత ఎన్నికల్లో మండుటెండల్ని లెక్క చేయకుండా.. కుటుంబాన్ని వదిలి పవన్ గెలుపు కోసం పని చేశామని వీర మహిళలు గుర్తు చేశారు. ఇద్దరు నేతలే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. -
పవన్ పరామర్శ కోసం పడిగాపులు
కాకినాడ, సాక్షి: ఎవరైనా బాధితులను ఎలా పరామర్శిస్తారు?. స్వయంగా వెళ్లి పరామర్శించే వాళ్లు కొందరైతే.. బాధితుల్నే తమ దగ్గరకు రప్పించుకునేవాళ్లు మరికొందరు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం మూడో రకం!. సమయం-సందర్భం ఈ రెండింటితో సంబంధం లేకుండా బాధితులను తన దగ్గరికి రప్పించుకుని మరీ వాళ్లను వెయిట్ చేయిస్తారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈవెంట్‌కు వెళ్లి మెగా అభిమానులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత సంగతి తెలిసిందే. సినిమా పిచ్చి.. అంతకు మంచి హీరోలంటే వెర్రి అభిమానం తమవాళ్ల ప్రాణాలు తీసిందని ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. అయితే ఈ ప్రమాదం తర్వాత అటు చిత్ర యూనిట్‌గానీ, ఇటు ఆ ఈవెంట్‌కు చీఫ్‌గెస్ట్‌గా హాజరైన పవన్ కల్యాణ్‌గానీ బాధిత కుటుంబాల్ని పరామర్శించి ఓదార్చలేదు. సరికదా.. గత ప్రభుత్వం రోడ్డు సరిగ్గా వేయలేదని, అందుకే రెండు నిండుప్రాణాలు బలయ్యాయంటూ రాజకీయం చేయబోయారు. ఆపై కంటితుడుపు చర్యగా.. తన జనసేన తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే.. పవన్ నియోజకవర్గం పిఠాపురం నుంచి బాధిత కుటుంబాలు ఉండేది పది కిలోమీటర్ల దూరంలోనే. ఘటన జరిగి వారం అవుతున్నా బాధితులను పవన్‌గానీ, జనసేన తరఫు నేతలుగానీ కలిసింది లేదు. పోనీ.. ఇప్పుడు వాళ్లను రప్పించుకున్న సందర్భమైనా బాగుందా? అంటే అదీ లేదు. పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలను ఇప్పుడు తన కోసం పడిగాపులు పడేలా చేశారాయన. పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో వాళ్లను పవన్ పరామర్శించడం చర్చనీయాంశమైంది. ఓవైపు సంబరాలు జరుగుతుంటే.. మరోవైపు ఆ వేదిక వద్ద కింద వాళ్లు కూర్చున్నారు. ఉదయం నుంచి వాళ్లు ఆయన కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఈ ఘటనలో ఎక్కడో మానవత్వం లోపించలేదంటారా?. ఆయన అభిమానులైనా.. ఇదేం పరామర్శ అని అనుకోరంటారా?!. -
బాబే మొదటి ముద్దాయి: వైఎస్ జగన్
వైష్ణవులందరికీ మార్గదర్శకంగా నిలిచే ఆలయం తిరుమల. గతంలో లక్షలాది మంది భక్తులు వచ్చినా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగాం. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శాస్త్రం తెలియదు. ఆచరణలు తెలియవు. దేవుడిపై భయం లేదు. భక్తీ లేదు. భయమూ, భక్తి ఉన్న వాడెవడైనా తిరుమల శ్రీవారి ప్రసాదంపై ఇష్టమొచ్చినట్టుగా అబద్ధాలు చెప్పగలుగుతాడా? టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ముఖ్యమంత్రి అనేవాడు చేస్తాడా? ఈ ఘటనలో ముమ్మాటికీ చంద్రబాబే మొదటి ముద్దాయి.తొక్కిసలాట ఒక ప్రాంతంలో జరగలేదు. రకరకాల ప్రదేశాల్లో జరిగింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ లేకపోవడం, కనీస ఏర్పాట్లు లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంబులెన్స్‌లను ప్రోటోకాల్ ప్రకారం పెట్టాలన్న బాధ్యత కూడా లేదు. తొక్కిసలాట తర్వాత అంబులెన్స్ రావడానికి, క్షతగాత్రులను తీసుకెళ్లడానికి ముక్కాలు గంట (45 నిమిషాలు) పట్టిందని బాధితులు చెబుతున్నారు. అది కూడా అప్పుడొకటి.. అప్పుడొకటి వచ్చాయని చెప్పారు. కొంత మంది వాళ్లంతట వాళ్లే కిందా మీద పడి వచ్చామని చెప్పారు. మరికొంత మంది రోడ్డున పోయే వారి సాయంతో వచ్చామని చెబుతున్నారు. ఈ రకమైన పరిస్థితులుండడం ఎంత దారుణం? ఈ ఘటనకు చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, ఎస్పీ, కలెక్టర్.. బాధ్యత వహించాలి. ఇందులో వీరందరి తప్పు ఉంది. చంద్రబాబు నాయుడుకు ఈ పాపం తగలక మానదు. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశానంటూ దేవుడికి, భక్తులకు క్షమాపణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. సిన్సియార్టీ లేదు. చిత్తశుద్ధి అంతకంటే లేదు. తాను చేసిన తప్పును ఇంకొకరి మీద మోపడమే ఆయనకు తెలుసు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చనిపోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చరిత్రలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. టీటీడీ చరిత్రలో ఇది మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ఈ ఘటనలో ముమ్మాటికీ మొదటి ముద్దాయి చంద్రబాబేనని స్పష్టం చేశారు. తొక్కిసలాటలో గాయపడి, పద్మావతి మెడికల్ కాలేజ్ ఆస్పత్రి (స్విమ్స్)లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర టీటీడీలో ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలను అందరూ ఆలోచించాలన్నారు. తొక్కిసలాట ఘటనలో ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వచ్చాయని చెప్పారు. ‘మనం వైకుంఠ ఏకాదశిని ప్రతి ఏటా జరుపుకుంటాం. ఆ రోజు లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని తరలివస్తారు. 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. ఈ విషయాలన్నీ తెలిసీ.. ప్రభుత్వం ఎందుకు టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర భద్రత చర్యలు, ప్రొటోకాల్స్ పాటించలేదు? అసలు చంద్రబాబుకు 10న వైకుంఠ ఏకాదశి అని తెలుసు కదా? అయినా కూడా కుప్పంలో తన ప్రోగ్రాం పెట్టుకున్నాడు. 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలోనే ఉన్నారు. పోలీసు శాఖ మొత్తం ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కుప్పం తరలిపోయింది. 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన జరిగింది. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు, కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉందని తెలిసినప్పుడు పోలీసులు ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు? అందరూ చంద్రబాబు పర్యటనలో మునిగి పోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క సారిగా గేట్లు తెరవడంతో.. బైరాగిపట్టెడ కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులో ఉదయం 8 గంటల నుంచి భక్తులను గుంపుగా నిలబెట్టారు. రాత్రి 8.30 గంటలకు కౌంటర్ వద్దకు తీసుకొచ్చి గేట్లు తెరిచారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెబుతున్నారు. చీకట్లో.. పార్కులో నిలబెట్టిన భక్తులకు ఉదయం నుంచి ఏమైనా ఇచ్చారా? వచ్చిన భక్తులను వచ్చినట్టు ఎందుకు క్యూలైన్లలోకి పంపించలేదు? అన్ని సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. ఆయా సెంటర్లలో లైన్లలోకి పంపించడానికి పోలీసులు ఎక్కడా లేరు. అందుకే గుంపుగా నిలబెట్టి ఒకేసారి విడిచిపెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు పోలీసులు.. చంద్రబాబు దిక్కమాలిన అబద్ధాలు అడుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటన ఒక చోటే జరిగినట్టు చెబుతున్నారు. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయినట్టు, బైరాగిపట్టెడలో ఐదు మంది చనిపోనట్టు ఎఫ్ఐఆర్లలో నమోదైంది. ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడినప్పుడు వివిధ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటల్లో గాయపడినట్టు చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కుప్పంలో 6,7,8 తేదీల్లో ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. పోలీసులు మొత్తాన్ని తన దగ్గరకే పిలిపించుకున్నారు. తిరుపతిలో మాత్రం భక్తుల కోసం ప్రత్యామ్నాయ భద్రత ఏర్పాట్లను గాలికి వదిలేశారు. ఫలితంగా భారీ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేవుడి దయతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ప్రాణపాయం లేదు. రుయా, స్విమ్స్ ఆస్పత్రులను కలుపుకుంటే దాదాపు 50 నుంచి 60 మంది భక్తులు తొక్కిసలాటలో గాయపడినట్టు సమాచారం. ఒక్క స్విమ్స్‌లోనే 35 మంది ఉన్నట్టు తెలుస్తోంది. భక్తుల భద్రత, వసతులపై చిత్తశుద్ధి ఏదీ? మొట్టమొదటి సారిగా తిరుపతిలో ఇలాంటి దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇక్కడి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు, టీటీడీ పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత తెలియకుండా ప్రవర్తించారు. దశాబ్దాలుగా టీటీడీలో ప్రొటోకాల్స్ ఉన్నా, వీళ్లెవ్వరూ పట్టించుకోలేదు. తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత, వసతుల కల్పన గురించి ఆలోచించలేదు. ఉదయం 9 గంటలకు వస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. అక్కడ మనుషులు ఉన్నారని వీళ్లు పట్టించుకుంటే కదా! మా ప్రభుత్వంలో ఐదేళ్లలో గొప్పగా భక్తులకు దైవ దర్శన సేవలందించాం. అలాంటిది ఈ రోజు భక్తులను క్యూలో నిలబెట్టేవారు లేరు. వారి ఆకలి, దప్పికలను కూడా గాలికి వదిలేశారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి.. ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ ఉచిత వైద్యం అందించాలి. వారు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేటప్పుడు కనీసం రూ.5 లక్షలు అందించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి, దేవదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, ఎస్పీ, కలెక్టర్, రెవెన్యూ అధికారులు అందరూ బాధ్యత వహించాల్సిందే. మొత్తం పోలీసు శాఖను తిరుపతిలో లేకుండా చేసి.. పలచగా అక్కడక్కడా బందోబస్తు పెట్టి, భక్తుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారు⇒ గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న ఘతన ఈ చంద్రబాబుది కాదా? తన షూటింగ్ కోసం అందర్నీ ఒకచోట పెట్టాడు. షూటింగ్ బాగా రావాలని చెప్పి గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ⇒ తిరుపతి ఘటనలో జరిగిన వాస్తవాలు ప్రజలకు చెప్పకూడదని చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయాడంటే.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను నేను రాకముందే ఇక్కడ నుంచి షిప్ట్ చేసే కార్యక్రమం చేశారు. దీనికి మీరే సాక్ష్యం. గాయపడిన వారు చాలా మంది మేము పోము.. మా పరిస్థితి ఇంకా బాగోలేదు.. మమ్మల్ని ఎక్కడకు పంపిస్తారు.. మేము ఎందుకు పోవాలని బీష్మించుకొని ఆస్పత్రిలో ఉండిపోయారు.⇒ వారిని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేందుకు నా కాన్వాయ్‌ని పోలీసులు అడ్డగించారు. ట్రాఫిక్ పేరుతో నా కాన్వాయ్ ముందుకు కదలకుండా చేశారు. ఎస్పీకి ఒక మాట చెబుతున్నా.. చంద్రబాబుతో మీరంతా కుమ్మక్కై దారుణంగా వ్యవహరిస్తున్నారు. దేవుని విషయంలో కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారో పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎస్పీ నుంచి చంద్రబాబు వరకు ఆ దేవుడే గట్టిగా మొట్టికాయలు వేస్తాడు.చిన్న కేసుగా పక్కన పడేసే కుట్రభక్తులు మృతి చెందిన ఘటనపై ఎఫ్ఐఆర్లో పేలవమైన సెక్షన్లు నమోదు చేశారు. ఇందులో 194 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు పెట్టారు. దొమ్మీ జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లతో కేసు నమోదు చేస్తారా? ఇది ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఘటనా? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగితే.. 105 బీఎన్ఎస్ సెక్షన్ పెట్టాల్సింది పోయి.. కావాలని కేసును నీరు గార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటనను ఒక చిన్న కేసుగా.. తీసి పక్కన పడేసేందుకు దారుణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే.. వీళ్లకు అసలు మానవత్వం లేదు. చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలనే ఆలోచన అసలే లేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేసి టీటీడీ లడ్డూ విషయంలో ఒక అబద్ధాన్ని సృష్టించారు. దానికి రెక్కలు కట్టి తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్టపాలు చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇదే పెద్ద మనిషి తన చర్యలతో మరోసారి టీటీడీలో బ్లాక్ మార్కుగా నిలిచిపోయే ఘటనకు కారణమయ్యాడు. దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు సురక్షితంగా భగవంతుడి దర్శనం కల్పించడం. అందుకే క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్న విశిష్టత ఎక్కడా లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు టీటీడీలోకి అడుగుపెట్టాలంటే.. అది కూడా చంద్రబాబు లాంటి పాలకుడు ఉన్నప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయోనని చూపించారు.తప్పంతా చంద్రబాబుదే ⇒ చంద్రబాబు.. ఓ షో పుటప్ చేసి, చిన్న స్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ వారిని బదిలీ, సస్పెండ్ చేసే శిక్షలతో సరిపెట్టే కార్యక్రమం చేస్తుండటం బాధాకరం. ఈ ఘటనలో చంద్రబాబు చేసిన తప్పు కన్పించడం లేదా? 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలో పర్యటించ లేదా? పోలీసులందరినీ తన చుట్టూ పెట్టుకోలేదా? భక్తుల కోసం పోలీసుల కేటాయింపు లేకపోవడం వాస్తవం కాదా? జిల్లా ఎస్పీ.. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే తాపత్రయ పడ్డారే తప్ప, లక్షల మంది భక్తులకు సెక్యురిటీ కల్పించాలని ఆలోచించ లేదు. ఈ విషయంలో ఎస్పీది తప్పు కాదా? ⇒ కలెక్టర్‌ది కూడా తప్పు ఉంది. కనీసం అక్కడున్న వారిని క్యూలైన్లలో నిలబెట్టే కార్యక్రమంపై ప్రొటోకాల్ ప్రకారం ఆదేశాలు ఇచ్చేందుకు రివ్యూలు కూడా చేయక పోవడం తప్పు కాదా? కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. అక్కడకు వచ్చిన భక్తులకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. తినడానికి తిండి లేదు. ఇలా గంటల తరబడి భక్తులు పార్కుల్లో ఉండేలా చేశారు. అన్ని కౌంటర్ల వద్ద పోలీసులు లేకుండా చేయడంలో కలెక్టర్‌ది తప్పు కాదా?⇒ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంత మందిని ప్రవేశింప చేయాలనే నిర్ణయం తీసుకున్నది ఈవో, అదనపు ఈవో. వీరందరినీ అజమాయిషీ చేసేది టీటీడీ చైర్మన్. వీరందరిదీ తప్పు కాదా? టోకెన్ల జారీపై రివ్యూలు తీసుకోకుండా ఇంత మంది చావులకు కారణం మీరు కాదా? మొత్తానికి ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే. -
నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా?
తిరుమల... ఎంత ప్రతిష్టాత్మక, పవిత్రమైన దేవాలయం..? ఎంత గొప్ప పేరు ఉన్న పుణ్య క్షేత్రం..? కానీ ఈ రోజు జరుగుతున్నదేమిటి? ఆంధ్ర ప్రదేశ్‌కే కాదు.. దేశానికే గర్వకారణమైన దేవస్థానంలో వైకుంఠ ద్వార ప్రవేశ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఉదంతం ప్రపంచ వ్యాప్త హిందువులను కలచి వేస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక , చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో ఘోరాలు జరగుతున్నాయి. అకృత్యాలు, విధ్వంసాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. చివరికి తిరుమలేశుని కూడా వదలిపెట్టలేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడానికి కూడా వెనుకాడని నాయకత్వం ఇప్పుడు ఏపీలో పాలన చేస్తోంది. హిందూ మత ఉద్దారకులుగా పైకి ఫోజు పెట్టడం, లోపల మాత్రం ఎన్ని దందాలు చేయాలో అన్నీ చేయడం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినా వారిని అసౌకర్యం లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించే వారు. అయోధ్య ఆలయ నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదెలాగో నేర్చుకోవడానికీ టీటీడీ అధికారులను ఆయోధ్యకు ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. అది జగన్ జమానా.. మరి ఇప్పుడు...??? అంతటి ఖ్యాతి వహించిన టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్లో విఫలమైంది. వేలల్లో వచ్చిన జనాన్నే నియంత్రించలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. యాభై మంది వరకూ గాయపడ్డారు. ఇంతటి విషాదం... దశాబ్దాలలో ఎన్నడూ జరగలేదు. ఈ ఘటన తిరుపతి గొప్పదనాన్ని దెబ్బ తీసిందని చెప్పక తప్పదు. తిరుమలను పరిరక్షించేందుకు, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి, జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ పలు సంస్కరణలు తెచ్చింది. ఇప్పుడు ఆ పని మాని గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల కాలంలో ఏమైనా తప్పులు జరిగాయా? అని భూతద్దం పెట్టి అన్వేషించి వైఎస్సార్సీపీ రాజకీయ కక్ష సాధించడానికి, జగన్ ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో టీటీడీ పరువును పణంగా పెడుతోంది. కొత్తగా టీటీడీ ఛైర్మన్ అయిన ఒక టీవీ సంస్థ యజమాని బీఆర్ నాయుడు పూర్తి అసమర్థంగా వ్యవహరించారనిపిస్తుంది. గొడవ జరుగుతుందని ముందుగానే తనకు తెలుసునని ఆయన చెప్పడం గమనార్హం. గొడవ జరుగుతుందని తెలిస్తే ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేకపోయారన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేక మళ్లీ మాట మార్చారు. ఈ మొత్తం ఘటనను బాధ్యతను అధికారులపైకి నెట్టి తప్పించుకునేందుకు చంద్రబాబు, బీఆర్ నాయుడులు చూస్తున్నారు. మరో ఘట్టం గురించి కూడా మాట్లాడుకోవాలి. తిరుమల ప్రసాదం లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ లడ్డూను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. అలాంటి లడ్డూపై తీవ్రమైన అనుచిత ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘోర అపచారానికి పాల్పడ్డారని భక్తులు భావిస్తారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ని వాడారంటూ చంద్రబాబు నీచమైన ఆరోపణ చేసి గత ముఖ్యమంత్రి జగన్ కు రుద్దాలని ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ సడన్ గా సనాతని వేషం కట్టి బాండ్ బాజా వాయించారు. దానికి జగన్ మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకోండి... కాని స్వామి వారికి అపచారం చేస్తున్నారు సుమా! అని హెచ్చరించారు. అయినా టీడీపీ, జనసేన, బీజేపీలు ఇష్టారీతిన దుర్మార్గపు ప్రచారం చేసి తిరుమల ఔన్నత్యాన్ని దెబ్బతీశాయి. ఒకవేళ లడ్డూకు సంబంధించి నిజంగానే ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే వాటిని సరిచేసి బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రే తన రాజకీయ స్వార్థం కోసం ఒక వదంతిని ప్రచారం చేశారు. చివరికి దానిపై సీబీఐ విచారణ వేస్తే ఏమైందో అతీగతీ లేదు. అనంతరం చంద్రబాబే మాట మార్చారు. దీనివల్ల స్వామి వారి ఆలయానికి అపవిత్రత తెచ్చిన అపఖ్యాతిని చంద్రబాబు, పవన్ లు పొందారు. కేవలం జగన్‌పై ద్వేషంతో ఆయన పాలనలో వీరు తిరుమలపై అనేక విమర్శలు చేసేవారు. దానివల్ల తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఎన్నడూ ఫీల్ అయ్యేవారు కారు. జగన్ పై మతపరమైన ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలన్న యావ తప్ప మరొకటి ఉండేది కాదు. చంద్రబాబు ,పవన్ లు నిజాలు చెప్పరులే అని ప్రజలు భావించారు కాబట్టి సరిపోయింది కాని, లేకుంటే కూటమి పెద్దలు తిరుమలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించడానికి యత్నించారు. తిరుమలలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంక్రాంతి పర్వదినాల నుంచి వారం రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం జరిగింది. దీనిని చాలా పవిత్రంగా భక్తులు పరిగణిస్తారు. దానికి అధికారులు కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కానీ ఈసారి తిరుపతిలో తొమ్మిది చోట్ల 90 కౌంటర్లు ఏర్పాటు చేసినా, ఈ తొక్కిసలాట జరిగిందంటే పర్యవేక్షణ లోపం తప్ప ఇంకొకటి కాదు. కారణం ఏమైనా బైరాగి పట్టెడ అనే చోట అకస్మాత్తుగా గేటు తెరవడంతో టిక్కెట్లు ఇస్తున్నారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా తోసుకు వచ్చారు. అంటే అక్కడ అలా తోపులాట లేకుండా ముందుగానే అధికారులు చర్య తీసుకోలేదన్నమాట. గురువారం ఉదయం నుంచి ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక మొదలైన రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బుధవారం మధ్యాహ్నమే తరలివచ్చారు. అధికారులు ఈ విషయాన్ని గమనించినా వారి నియంత్రణకు తగిన ప్రణాళిక రూపొందించలేదు. అందరిని ఒక పార్కులో పెట్టేశారు. మంచినీటి వసతి కూడా కల్పించలేకపోయారు. మరో రెండు చోట్ల కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఇలాంటి వాటిపై కదా.. టీటీడీ ఛైర్మన్ ,పాలక మండలి, ఉన్నతాధికారులు దృష్టి పెట్టవలసింది?. గతంలో సమర్థంగా పనిచేసిన అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి, వారిని తొలగించి తమ అంతేవాసులను నియమించుకున్నారు. తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ఒక పోలీసు అధికారిని ప్రత్యేకంగా పోస్టు చేశారట. వారు ఆ పనిలో ఉంటారు కాని, ప్రజల అవసరాలను ఎందుకు పట్టించుకుంటారు? పైరవీ చేసుకుని టీటీడీ ఛైర్మన్ అయిన బిఆర్ నాయుడుకు అసలు ఇలాంటి విషయాలలో ఏమి అనుభవం ఉంది? లేకపోయినా ఫర్వాలేదు. ఆయన నిబద్ధత ఏమిటి? కేవలం ఒక టీవీ సంస్థ ద్వారా తనకు బాజా వాయిస్తే పదవి ఇచ్చేశారు. పదవి తీసుకున్న తర్వాత అయినా టీటీడీ ఉద్దరణకు కృషి చేశారా? పోసుకోలు ఇంటర్వ్యూలు, ప్రకటనలు చేస్తూ కాలం గడిపి అసలు భక్తులను ఇక్కట్ల పాలు చేశారు. టెక్నాలజీని తానే కనిపెట్టినట్లు చంద్రబాబు మాట్లాడుతుంటారు. అయినా ఆన్ లైన్ లో కాకుండా ఇన్ని వేల మందిని, అది కూడా గంటల తరబడి వేచి ఉండేలా చేయడం అంటే ఈ ప్రభుత్వ చేతకాని తనమే కాదా? చంద్రబాబు నాయుడు గతంలో పుష్కరాల సమయంలో పబ్లిసిటీ కోసం, సినిమా షూటింగ్ కోసం సామాన్య భక్తుల స్నాన ఘట్టంలో స్నానం చేసి నప్పుడు కూడా ఇలాగే గేట్లు సడన్ గా తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. ఆ విషయంలో ఒక్క కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోలేదు. సీసీటీవీ ఫుటేజీ సైతం మాయమైంది. ఆయన టైమ్ లో కేసును నీరుకార్చేసినా, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కూడా దానిపై దృష్టి పెట్టలేదు. తదుపరి కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభలలో పదకుండు మంది మరణించినా, చంద్రబాబుపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. అయినా చంద్రబాబు పోలీసులదే వైఫల్యం అని దబాయించి, రోడ్లపై సభలు వద్దన్నందుకు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఇటీవల హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే, దానికి నటుడు అల్లు అర్జున్ కారణమని ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అలా చేసినందుకు, టీడీపీ, జనసేన శ్రేణులు సమర్థించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టాయి. అదే కొలమానంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరిపై చర్య తీసుకోవాలి. ఎవరిని అరెస్టు చేయాలి? టీటీడీ ఈవో, జాయింట్ ఈవో, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ మొదలైనవారిని బాధ్యులు చేస్తారా? లేదా? ఎలాంటి చర్య తీసుకుంటారు? అసలు ఈ ఘటనకు నైతిక బాధ్యతగా బిఆర్ నాయుడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? ఒకవేళ ఆయన చేయకపోతే చంద్రబాబు ఆ మేరకు ఆదేశిస్తారా? అంటే అది జరిగే పని కాకపోవచ్చు. ఎందుకంటే బిఆర్ నాయుడుని నియమించిన చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.అలాగే పనికట్టుకుని తనకు కావల్సిన అధికారులను నియమించి ,వారిని తన అడుగులకు మడుగులు ఒత్తేవారిగా మార్చుకున్న ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికి చంద్రబాబు, పవన్ లు రెచ్చిపోయి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవారు. ఎల్లో మీడియా గోల,గోల చేసేది. ఇప్పుడు మాత్రం అంత గప్ చిప్ అయ్యారు. అదేదో అధికారులదే తప్పన్నట్లుగా కథ నడపాలని చూస్తున్నారు. మొత్తం తిరుమలకు అపవిత్రత వచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మోక్షం పొందవచ్చన్న కొండంత ఆశతో వెళ్లిన భక్తులకు చంద్రబాబు ప్రభుత్వం నరకం సృష్టించడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘చంద్రబాబు అసమర్థ పాలనకు తిరుపతి ఘటన నిదర్శనం’
సాక్షి, కాకినాడ జిల్లా: టీటీడీ ఛైర్మన్ వాఖ్యలు బాధ్యతారాహిత్యం అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని.. టీటీడీ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయాలు, ప్రచార ఆర్భాటాలు తప్పా దేన్ని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.‘‘లడ్డూలో కల్తీ జరిగిందని సాక్షాత్తూ వెంటేశ్వరస్వామిని రాజకీయానికి వాడుకున్నారు. టీటీడీ నిర్లక్ష్యానికి ఏడుగురు భక్తుల నిండు ప్రాణాలు బలైపోయాయి. పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోతే.. కనీసం ఒక్క నిముషం మృతుల కోసం చంద్రబాబు బాధపడిన సందర్భం లేదు. టీడీడీ ఛైర్మన్ వాఖ్యలు బాధ్యతారాహిత్యం. తొక్కిసలాటకు తప్పు వెంకటేశ్వర స్వామీదా?..తొక్కిసలాటకు బాధ్యత ఎవరూ తీసుకుంటారు.?. ఇప్పటికైన ప్రజల ముందుకు వచ్చి.. దేవుడు ముందు తప్పు తమదేనని లెంపలేసుకోండి. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎంతసేపూ జగన్‌పై విష ప్రచారం.. రెడ్ బుక్ రాజ్యంగం అంటూ పాలనను గాలికి వదిలేశారు’’ అని కన్నబాబు ధ్వజమెత్తారు. -
తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి: ఆర్కే రోజా
సాక్షి,తాడేపల్లి: టీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శమని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు. తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎటు వెళ్లారు?. సనాతన యోధుడు అని చెప్పుకున్న పవన్ స్పందన ఏది?. నిజమైన సనాతన యోధుడైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు.‘‘చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే. గతంలో కూడా చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. మృతుల కుటుంబాలకు రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. టీటీడీ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు అసమర్థత, వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగింది. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనంగా తిరుపతి ఘటన ఉంది. దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలి’’ అని రోజా పేర్కొన్నారు.‘‘పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారు. వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఇది ప్రభుత్వం చేసిన హత్యలే. అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. అల్లు అర్జున్‌కు సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగితే ఆయనపై కేసు పెట్టారు. మరి తిరుపతి ఘటనలో చంద్రబాబు నుంచి బీఆర్ నాయుడు, ఎస్పీలపై కేసులు పెట్టాలి. 105 సెక్షన్ పెట్టాల్సి ఉండగా.. 194 సెక్షన్ ఎలా పెడతారు?. ఏడుగురు భక్తులు చనిపోతే.. హైందవ శంఖారావం నిర్వాహకులు ఏం చేస్తున్నారు?. ఆ పీఠాధిపతులు బయటకు రావాలి. చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. మోదీ కూడా దీనిపై స్పందించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణాలు జరుగుతున్నాయి. సనాతన యోధుడిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?’’ అంటూ రోజా ప్రశ్నించారు.ఇదీ చదవండి: తప్పు ఎవరి వల్ల జరిగింది?.. తొక్కిసలాటకు కారకులు ఎవరు? -
లోకేష్‌కు ప్రత్యేక హోదా వచ్చింది..
ప్రధాని మోదీ విశాఖ పర్యటన పూర్తయింది. గతంలో వైఎస్ జగన్ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు సంస్థలు మళ్లీ అదే ఒప్పందాలు ఇప్పుడే కుదర్చుకున్నట్లు ఫోటోలు దిగాయి.. అదంతా బాబు గొప్పతనం అన్నట్లుగా మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఇక పత్రికల్లో భారీ ప్రకటనలు.. రాష్ట్ర స్వరూపం మారిపోతున్నట్లు పెద్ద పెద్ద హోర్డింగులు.. ఇవన్నీ చంద్రబాబు హయాంలో సహజమే అయితే ప్రధాని మీటింగ్ వలన రాష్ట్రానికి. విశాఖ నగరానికి పెద్దగా ప్రయోజనం ఏమీ లేకున్నా లోకేష్ కు మాత్రం ప్రత్యేక హోదా దక్కింది.మోదీ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పెద్దపెద్ద పత్రికా ప్రకటనలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఆ ప్రకటనల్లో పెట్టారు అంటే అర్థం ఉంది కానీ కేబినెట్లో అందరిలా మంత్రి పదవి తప్పితే ప్రత్యేకమైన ఏ గుర్తింపు లేని లోకేష్ ఫోటోలు ఎందుకు పెట్టినట్లు.. సీఎం, డిప్యూటీ సీఎం సహా లోకేష్‌ను ప్రధానితో వేదిక మీద ఎందుకు కూర్చోబెట్టినట్లు. ఆయనకు చంద్రబాబు కొడుకుగా కాకుండా ప్రత్యేక గుర్తింపు ఏముంది.?ఇప్పటికే అన్నిశాఖల్లోనూ విపరీతంగా జోక్యం చేసుకుంటూ పెత్తనం సాగిస్తున్న లోకేష్ ఇప్పుడు అనధికార సీఎంగా.. సూపర్ పవర్‌గా ఎదిగారని అధికారులే అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పెద్ద ఫైల్ కదలాలన్నా.. ఎవరికీ ఏ పోస్టింగ్ ఇవ్వాలన్నా లోకేష్‌ను కలవాలి అనేది ఒక అనధికారిక జీఓ మాదిరి నడుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన్ను డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా నియమించడమే తరువాయి అని అంటున్నారు.ప్రస్తుతానికి అధికారికంగా అయితే చంద్రబాబు తరువాత పవన్‌కు మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ప్రాధాన్యం దక్కుతోంది. ఇక త్వరలో లోకేష్‌కు కూడా డిప్యూటీ స్థాయికి ఎలివేషన్ ఇచ్చారంటే ఇక పవన్ ప్రాధాన్యం తగ్గినట్లే.. ఇక డిప్యూటీ హోదాలో లోకేష్ మరింతగా రెచ్చిపోయి శాఖలన్నింటినీ కెలికేస్తాడు. పాపం ఇటు పవన్ తన పంచాయతీ రాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పనులే అర్థం కాక తికమకపడిపోతున్నారు. రానున్న రోజుల్లో పవన్ ప్రాధాన్యం తగ్గించి లోకేష్‌ను ముందుకు తెచ్చేందుకు ఈ మోదీ పర్యటన బాగా ఉపయోగించుకున్నారని అర్థం అవుతోంది.-సిమ్మాదిరప్పన్న -
తొక్కిసలాటకు చంద్రబాబుదే బాధ్యత: భూమన
తిరుపతి, సాక్షి: పోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) అన్నారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.నెలరోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు, పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ.ఇవాళ ఆయన పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ, నిన్న తొక్కిసలాట సమయంలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరు. తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలి... తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అనే వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడంతోనే తొక్కిసలాట జరిగింది. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం. తమిళనాడు శ్రీరంగం తరహాలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని.. రెండు రోజులు నుంచి పది రోజులకు పెంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. భక్తులకు మేలైన నిర్ణయాలే తీసుకున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అద్భుతంగా నిర్వహించాం. తిరుమల పవిత్రతను మేము కాపాడినట్లు ఇంతదాకా ఎవరు కాపాడలేరు. కానీ, టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయక్రీడా మైదానంగా మార్చేశారు. భక్తులకు నీళ్లు, ఆహారం లేవు.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మీరు చేస్తున్న తప్పులకు, భక్తులకు కష్టాలు పడుతున్నారు. పశువులను మందలో తోసినట్లు భక్తులను క్యూ లైన్లలో తోసిపారేశారు. ఇది ప్రభుత్వ తప్పిదం కారణంగా జరిగిన ఘటన. ప్రభుత్వం చేసిన హత్యలే. అందుకే మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. క్షతగాత్రులకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్(Pawan kalyan) ఇప్పుడేం మాట్లాడతారు?. లడ్డూ విషయంలో వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేశారు. గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో ఇద్దరు అభిమానులు చనిపోతే , రోడ్డు బాలేదని మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలకు, చేసే చేతలకు పొంతన లేదు. తిరుమలను, దేవుడిని చంద్రబాబు తన రాజకీయాల కోసం పావుగా వాడుకుంటున్నారు.దేవుడితో పెట్టుకుంటే ఆయనే చూస్తాడు అంటూ చంద్రబాబు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది, లడ్డు ప్రసాదంతో రాజకీయ ఆటలు ఆడితే స్వామి చూశారు. టీటీడీ చైర్మన్ ను కనీసం ఈవో, అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి కు చంద్రబాబు సేవ తప్పా, భక్తులు సేవ లేదు. బ్రేక్ దర్శనాలు 7 వేలకు పైగా ఇస్తున్నారు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి కూడా ఘటనకు బాధ్యత వహించాలి. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయిలో పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరిలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ను ఏవిధంగా అరెస్టు చేయించాలి అనే కుట్రలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి పై ఏడుపే తప్ప, పాలన లేదు. తిరుపతి తొక్కిసలాట ఘటన.. ప్రభుత్వం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం’’ అని భూమన అన్నారు.ఇదీ చదవండి: ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం! -
మోదీ భజనకే బాబు, పవన్ పరిమితం.. ఇక ఉక్కు ఉద్యమం ఉధృతం
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని మోదీ సభలో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రసంగాలపై ఉక్కు పోరాట కమిటీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నిర్ణయిస్తూ.. పోరాటానికి సన్నద్ధమవుతోంది. 35 గంటలకే దీక్ష విరమించి పెద్ద ఎత్తున నిరసన చేయాలని పోరాట కమిటీ నిర్ణయించింది.ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు పోరాట కమిటీ నిర్ణయించింది. పోరాట కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ తో సహా మరి కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. దీక్షా శిబిరం వద్దే ఉక్కు కార్మికులు ఉక్కు కార్మికులు బైఠాయించారు. కాగా, ఇప్పటికే దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసన చేస్తే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తామంటూ పోలీసులు హెచ్చరించారు.ఏపీ హక్కులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గాలికొదిలేశారు. రాష్ట్ర హక్కుల కోసం ప్రధాని మోదీ ముందు వారు కనీసం నోరు విప్పలేదు. స్టీల్ ప్లాంట్ సహా ఏ సమస్యపై కూడా చంద్రబాబు, పవన్ అడగలేదు. కేవలం ప్రధాని మోదీ భజనకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది.ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అడగని చంద్రబాబు.. ప్రత్యేక హోదా కోసం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వే జోన్ కోసం అడగని చంద్రబాబు.. పోలవరం నిర్వాసితుల నిధులపై కూడా స్పష్టత కోరలేదు.చంద్రబాబు, పవన్‌లపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడిదంటూ నిత్యం ప్రగల్భాలు పలికే చంద్రబాబు, పవన్.. ఎంపీల బలం ఉన్నా ఏపీ హక్కుల కోసం నోరువిప్పలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సాగిలపాటు వైఖరి విశాఖ, ఏపీ ప్రజలను పూర్తిగా నిరాశపరిచింది. -
అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ (Visakha Steel Plant)పై చంద్రబాబు (Chandrababu) మోసం మరోసారి బయటపడింది. విశాఖ మోదీ (PM Modi) సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కనీసం ప్రస్తావించని సీఎం చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవాలని ప్రధానికి కనీసం విజ్ఞప్తి కూడా చేయలేదు.1400 రోజులకుపైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గనుల గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ప్రధానికి అపాయిమెంట్ ఇప్పించాలని కార్మికుల కోరిన కూడా చంద్రబాబు పట్టించుకోలేదు.విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు తీరని ద్రోహం చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ వద్ద కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసెత్తని చంద్రబాబు.. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం ఐరన్‌ఓర్ సప్లై చేసేందుకు పైప్‌లైన్ వేసేందుకు అనుమతించాలని మోదీని చంద్రబాబు కోరారు.స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ అడగకుండా.. మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సప్లైకు పైప్ లైన్‌ను చంద్రబాబు అడిగారు. రైల్వే జోన్‌పై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదంటూ ప్రధాని సభలో పచ్చి అబద్ధాలు చెప్పారు. మొత్తం పెట్టుబడులు తానే తీసుకువచ్చానంటూ చంద్రబాబు డాంబికాలు పలికారు.ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్ఏడు నెలల్లో తామే అంతా చేశాం అన్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు.. నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తించారు. అటు ఇంగ్లీషు, ఇటు హిందీలోనూ ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. -
కూటమి పాలనలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగం’
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో యథేచ్ఛగా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగం జరుగుతోందని, గ్రామాల్లో సర్పంచ్ల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం లభిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆక్షేపించారు.ఎన్ఆర్ఈజీఎస్ నిధులను కూటమి పార్టీ నేతలు తమ సొంత నిర్మాణాలకు వాడుకుంటున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు వేసినట్లు చెప్పారు. కూటమి నేతలకు దమ్ముంటే, ఉపాధి హామీ నిధుల వినియోగంపై చర్చకు రావాలని రవీంద్రారెడ్డి సవాల్ చేశారు.వెన్నపూస రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం తన ఏడు నెలల పాలనలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఎంపీపీకి పంపితే, వారు జిల్లా పరిషత్‌కి పంపితే జిల్లా పరిషత్ అధికారులు కలెక్టర్‌కు పంపడం అనేది నిబంధన. కానీ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి అధికార పార్టీ ఎమ్మల్యేలు చెప్పిన వారికే పనులు కేటాయిస్తున్నారు. చివరకు ఉపాధి హమీ పథకంలో పని చేసే దాదాపు 12 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను తెచ్చుకుంటున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రతి పంచాయతీకి రూ.10 వేలు ఇస్తామని ఆర్బాటంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, ఒక్క పంచాయతీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కు కూడా రూ.1800 కోట్లు ఇస్తే, అది వారి ఘనత అన్నట్లు సీఎం, డిప్యూటీ సీఎం నిసిగ్గుగా ప్రచారం చేసుకున్నారు. వారికి నిజంగా గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్లో అదనంగా ఒక్క రూపాయైనా తెచ్చారా?ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్ గ్రామాల్లో సర్పంచ్ల తీర్మానం లేకుండా ఎమ్మెల్యేల సిఫార్సులతో ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. అలా స్థానిక సంస్థల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల విషయంలో తమ వైఖరి ఏమిటో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలి.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రతి గ్రామంలో దాదాపు రూ.2 కోట్ల వరకు వెచ్చించి సచివాయాలు, హెల్త్ సెంటర్లు, ఆర్బీకేలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టడం జరిగింది. అలా గ్రామాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించి సంపద సృష్టించాం. టీడీపీ కూటమి పాలనలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగంపై మూడు జిల్లాల పరిధిలో జరిగిన పనులకు సంబంధించి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం’’ అని వెన్నపూస రవీంద్రారెడ్డి వివరించారు. -
ఇదేనా చంద్రబాబు సాధించిన ప్రగతి?: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబే దేశంలోనే ధనవంతుడైన సీఎం అని.. మిగతా అందరి సీఎంల అందరి ఆస్తులు కలిపినా చంద్రబాబు కంటే తక్కువేనంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి (Gadikota Srikanth Reddy) వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu) వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా, ఆయన మాత్రమే సంపద సృష్టించుకున్నారన్నారు.‘‘సంక్రాంతి పండుగ వచ్చినా ఏ కానుకలూ ప్రజలకు ఇవ్వలేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచేశారు. మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేశారు. జగన్ అధికారంలో ఉన్నట్లయితే ఇప్పటికే అనేక పథకాల కింద ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేవి. చంద్రబాబు ఇవేమీ ఇవ్వకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు..మెగా డీఎస్సీ అంటూ చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. మహిళలకు అనేక పథకాల ఆశలు చూపించి గొంతు కోశారు. ఆరోగ్యశ్రీని ప్రయివేటు పరం చేయబోతున్నారు. రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని సైతం పేదలకు జగన్ అందిస్తే.. చంద్రబాబు దాన్ని పక్కన పెట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేశారు.ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్..జగన్ తెచ్చిన ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రధానితో శంకుస్థాపన చేయిస్తున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటీ తేలేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పటికే మూడు లక్షల ఉద్యోగాలు తొలగించారు. రెండేళ్లపాటు అసలు మాట్లాడకూడదనుకున్నాం. కానీ చంద్రబాబు చేస్తున్న మోసాలు, దోపిడీలపై పోరాటం చేయక తప్పటం లేదు. ఎక్కడ చూసినా గంజాయి, మద్యం షాపులే కనిపిస్తున్నాయి. ఇదేనా చంద్రబాబు సాధించిన ప్రగతి?’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు...మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ప్రభుత్వంలో కనీసం స్పందనేలేదు. జగన్ కార్యకర్తలకు మంచి భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పాలనపై ఎక్కువ దృష్టి పెట్టటం వలన కొన్ని సమస్యలు వచ్చాయి. ఇక మీదట కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని జగన్ చెప్పారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు అన్నీ జగన్ తెచ్చినవే. రాష్ట్రంలో జగన్ హయాంలో పెట్టుబడులు వచ్చాయి. వాటికే చంద్రబాబు ఇవ్వాళ శంకుస్థాపన చేసుకుంటున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. -
ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్(YS Jagan) పాలనలోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని.. గణాంకాలతో సహా వైఎస్సార్సీపీ(YSRCP) రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్(Margani Bharat) వివరించారు. బుధవారం ఆయన ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకే ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీతో శంకుస్థాపనలు చేయిస్తోందన్నారు.ఈ ప్రభుత్వంలో ఆరున్నర నెలల్లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని.. ప్రధాని పర్యటనతో సీఎం చంద్రబాబు షో చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారని మార్గాని భరత్ దుయ్యబట్టారు. అంతకు ముందు చంద్రబాబు పాలన కన్నా, గత ప్రభుత్వంలో జగన్ పాలనలోనే పారిశ్రామిక రంగం గణనీయంగా పురోగతి సాధించినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. మరోవైపు కమీషన్ల కోసం టీడీపీ నాయకుల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు హడలెత్తిపోతున్నారని మార్గాని భరత్ చెప్పారు.‘‘రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్టుల శంకుస్ధాపనల కోసం రావడం మంచి పరిణామం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ ఆయన ఆ దిశలో ఏం సాధించలేదు. ఈ రోజు ప్రధాని శంకుస్ధాపనలు చేయబోయే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వే జోన్, బల్క్ డ్రగ్ పార్కు.. ఇవన్నీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు. అయితే సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్టు వీటిని ఈరోజు తామే సాధించి తెచ్చినట్టు చంద్రబాబు కలరింగ్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ..నిజంగా వారికి దమ్ము, ధైర్యం ఉంటే, రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో ప్రకటన చేయించడంతో పాటు, కర్నాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్‌కు ఇస్తున్నట్లు రూ.15వేల కోట్ల కేటాయింపు జరిగేలా చూడాలి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుపై వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఒప్పందం జరిగింది. బల్క్ డ్రగ్ పార్క్‌ను 17 రాష్ట్రాలతో పోటీపడి, నాడు మన రాష్ట్రం సాధించింది. దక్షిణాదిలో మరే రాష్ట్రానికి అప్పుడు అది సాధ్యపడలేదు...పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారంటూ, టీడీపీ పిచ్చి విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు ఎక్కువగా ఎవరి హయాంలో నమోదైంది అన్నది చూస్తే, పారిశ్రామికవేత్తలు అసలు ఎవరిని చూసి భయపడుతున్నారో అందరికీ తెలుస్తుంది. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి పారిశ్రామిక వృద్ధి రేటు 11.92 శాతంగా ఉంటే, 2024లో జగన్ దిగిపోయే నాటికి ఆ వృద్ధి రేటు 12.61 శాతంగా నమోదైంది. ఇంకా చంద్రబాబు హయాంలో రాష్ట్ర రుణంలో 19.54 శాతం పెరుగుదల కనిపిస్తే, అది జగన్ హయాంలో 15 శాతం మాత్రమే.ఇదీ చదవండి: జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా: వైఎస్ జగన్ ..అలాగే తలసరి ఆదాయం (పీసీఐ) 2018–19 నాటికి రూ.1.54 లక్షలు కాగా, 2023–24 నాటికి అది రూ.2.19 లక్షలకు పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తుల విలువలో చంద్రబాబు హయాంలో దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, జగన్‌గారి పాలనలో 2022–23 నాటికే 8వ స్థానానికి ఎగబాకింది. దేశ జీడీపీలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్ర జీడీపీ వాటా 4.47 శాతం కాగా, జగన్ హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది...నిజానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను దారుణంగా వేధిస్తున్నారు. వారిని బెదిరిస్తున్నారంటూ.. రాజమండ్రిలోని ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు నిర్వాహకులను రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి ఆదిరెడ్డి అప్పారావు బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో వినిపించారు. ఆ పేపర్ మిల్లు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ చౌదరి తాత గారు చిట్టూరి ప్రభాకర్ చౌదురి గతంలో రాజమండ్రి ఎమ్మెల్యేగా పని చేశారు. ..వేల కోట్ల టర్నోవర్ ఉన్న పేపర్ మిల్లు మూతపడితే అందులో పని చేసే వేలాది కార్మికుల జీవితాలు రోడ్డున పడిపోవా? అలా టీడీపీ నేతలు డబ్బుల కోసం బెదిరిస్తుంటే, వారు కంపెనీలు ఎలా నడుపుతారు?. నిజానికి పేపర్ మిల్లు లాకౌట్ సమయంలో ప్రభుత్వం కలుగజేసుకుని, అది కొనసాగించేలా చూడటమో లేదా కార్మికులను ఆదుకోవాలన్న కనీస ప్రయత్నం కూడా చేయలేదు’’ అని మార్గాని భరత్ ఆక్షేపించారు.కార్మికుల వేతన ఒప్పందంలో టీడీపీ పాత్ర లేదుతాము అధికారంలో ఉన్నప్పుడు 2019 జనవరిలో వేతన ఒప్పందం చేశామని టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ అది అవాస్తమని పేపర్ మిల్లు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ చౌదరి అన్నారు. ‘‘పేపర్ మిల్లు కార్మిక సంఘం తరఫున వేతన ఒప్పందం చేసింది నేను. తమ హయాంలో ఒప్పందం జరిగింది కాబట్టే అది తామే చేశామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. వేతన ఒప్పందంలో ఏ ఎమ్మెల్యే, లేదా మంత్రి సంతకం కూడా లేదు. టీడీపీ నాయకుల పాత్ర లేదని చెప్పడానికి ఈ ఒప్పందమే సాక్ష్యం’‘‘నాటి ఎంపీ మార్గాని భరత్ నేతృత్వంలో కార్మికులకు రూ.6 వేలు చెల్లించేలా పేపర్ మిల్లు యాజమాన్యాన్ని ఒప్పిస్తే.. తండ్రీ కొడుకులు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్.. గత ఎన్నికల్లో లబ్ధి కోసం రూ.10 వేలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఎన్నికల్లో గెల్చిన తర్వాత నెల రోజుల్లో రూ.10 వేలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పేపర్ మిల్లు కార్మికులు నమ్మి ఓటేస్తే పట్టించుకోకుండా నట్టేట ముంచారు.’’ అని ప్రవీణ్ చౌదరి చెప్పారు. -
జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటామని ధైర్యానిచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు.కానీ, ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రతీ ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. మనం ఇచ్చిన పథకాలను రద్దుచేశారు, అవి అమలు కావడంలేదున్నారు...ప్రతీ ఇంటికీ వెళ్లి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ హామీలు గుప్పించారు. చాలామంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుంది. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ మాట నిలబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారు. అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుంది. అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో సందర్భంగా ప్రజంటేషన్ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం.జగనే కరెక్ట్ అంటున్నారు..బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ నెలలో ఏ క్యాలెండర్ అమలు చేస్తామో క్యాలెండర్ విడుదల చేశాం. ప్రజల సంతోషం కోసం నిరంతరం తాపత్రయ పడ్డాం. మనం చేస్తున్న హామీలకు ఇంత ఖర్చు అవుతోంది, చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని సూచించాను. పులినోట్లో తలకాయపెట్టడమే అని చెప్పాను. ఈరోజు ఆ వీడియోలు చూస్తే.. జగన్ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రతీనెలా ఏదో పథకం ద్వారా ప్రజలకు మేలు చేశాం. చంద్రబాబుకు, జగన్‌కు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్ డెలివరీ జరిగేది. మరి చంద్రబాబు పాలనలో ఎందుకు ఇలా జరగడంలేదు?. ఎందుకు చంద్రబాబు మనలా చేయలేకపోతున్నాడు?. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతీ ఇంట్లోనూ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే.. ప్రతీనెలా ఏదో పథకం వచ్చేది. ఐదేళ్ల పాటు షెడ్యూల్ ఇచ్చి పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. బాబు బాదుడు..కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవి ఇప్పుడు జరగడం లేదు. మన పార్టీలో ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా వెళ్లగలడు. మనం చెప్పినవి చేసి చూపించాం. అబద్ధాలు చెప్పలేదు, మెసాలు చేయలేదు. అధికారం కోసం ఏ గడ్డైనా మనం తినలేదు. ఇప్పుడు కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరు, వారికీ ఆ ధైర్యంకూడా లేదు. ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఆరు నెలల తిరక్కముందే కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు. గ్రామీణ రోడ్లలో టోల్గేట్లు కూడా పెడుతున్నారు. నేషనల్ హైవేల మీదలానే టోల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. స్థలాల్లోని పాత ఇళ్ల మీద కూడా ఛార్జీలు వేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించడం లేదు. మనం ప్రతీ మూడు నెలలకూ విద్యా దీవెన కింద డబ్బులు చెల్లించాం. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్‌లో పెట్టారు.ఆరోగ్యశ్రీ కింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం. ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఈ 8 నెలల కాలంలోనే రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు. పేదవాడు ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉచితంగా వైద్యం అందుకునే పరిస్థితి ఎక్కడా లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన.. ఈ నాలుగు రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం బాధ్యత. కానీ, ఈ నాలుగు రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.రెడ్ బుక్ రాజ్యాంగమే..రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇంటి వద్దకే డోర్ డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తోడుగా ఉన్నవారే నాయకులుగా ఎదుగుతారు. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. పార్టీని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ప్రతీ గ్రామంలో కూడా పార్టీ నిర్మాణం ఉండాలి. కమిటీల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావాలి.నెలఖారు నుంచి ప్రజలతోనే..నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తాను. ప్రతీ వారంలో మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిది చేస్తాను. ప్రతీ రోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. మండల స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ పార్టీ బలోపేతం కావాలి. గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలు ఇవన్నీ కూడా బలోపేతం కావాలి. సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలి. కేవలం మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు. చెడిపోయి ఉన్న మీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్ మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది.సోషల్ మీడియా వినియోగించుకోవాలి..గ్రామస్థాయిలో ఉన్న ప్రతీ కమిటీ సభ్యుడు కూడా సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించాలి. ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలి. చంద్రబాబుని నిలదీసే కార్యక్రమం చేయాలి. దాదాపు మూడున్నర లక్షల పెన్షన్లు కట్ అయిపోయాయి. ఇక దివ్యాంగుల మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు.కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం. ఇకపై మరోలా చూస్తాం. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు భరోసాగా ఉంటాం. అన్యాయానికి గురైన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. మీకు అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు కచ్చితంగా నిలబెడతాం. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాను’ అని భరోసా ఇచ్చారు. -
సూపర్ సీఎం సెల్ఫ్ గోల్స్.. టీడీపీ ఫుల్ హ్యాపీ!
రాజకీయాలలో ఓర్పు,నేర్పు అవసరం. వ్యూహం కూడా ముఖ్యమే. ఏపీలో జరుగుతున్న కూటమి రాజకీయాలను పరిశీలిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు అభాసుపాలు అవుతున్నారు. అది ఆయనకు అర్దం కావడం లేదేమో కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగానే అవగతమవుతోంది. రాజకీయాలలో కలిసి ఉంటూనే బోల్తా కొట్టించడం ఒక ప్లాన్ గా ఉంటుంది.ఈపాటికే పవన్ కళ్యాణ్ కు ఆ విషయం బోధపడవలసి ఉంది.కాని అలా జరగడం లేదు. దానికి కారణం.... ఆయనకు అనూహ్యమైన రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ,దానిని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉండడం ఒకటైతే.. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో తొందరపడుతున్న వైనం మరో కారణంగా కనిపిస్తుంది. రాజకీయాలలో ఎల్లకాలం అబద్దాలు ఆడితే అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు!. ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శైలి అలవరచుకుని నిత్యం అబద్దాలు చెప్పడం ద్వారా ప్రజలలో పలుకుబడి పెంచుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. జనంలో అవసరం ఉన్నా,లేకపోయినా తిరుగుతూ తానేదో సూపర్ సీఎంనని అనుకుంటే అది అంత తెలివైన పని కాదని ఇప్పుడు తెలియకపోవచ్చు. ఆ క్రమంలో పవన్ ఇటీవల పలు ఘట్టాలలో చేసిన ప్రకటనలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయనే చెప్పాలి.రాజమండ్రి వద్ద గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ చేసిన ప్రసంగం చాలా అభ్యంతరకరంగా ఉంది. యువకులకు మంచి మాటలు చెప్పవలసిన బాధ్యతలో ఉన్న పవన్.. అల్లరి ,చిల్లర పనులు చేయండని సలహా ఇవ్వడం పై విమర్శలు తలెత్తాయి.యువకులకు ఉద్యోగాలు రావడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ,ఇలాంటి సినిమా ఉత్సవాలలో పాల్గొనాలని, సినిమాలు చూస్తూ చొక్కాలు చించుకోవాలని, స్టంట్ లు నేర్చుకోవాలని, మోటారు సైకిళ్ల సైలెన్సర్ లు తొలగించి విపరీతమైన ధ్వని సృష్టిస్తూ గోల చేయాలని చెప్పడం చూస్తే పవన్ కు అసలు మెచ్యూరిటీ ఉందా అన్న సందేహం కలుగుతుంది.ఒక వైపు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువత,పేద వర్గాలు మంచి విద్య అభ్యసించాలని, చదువే సంపద అని హితబోధ చేస్తూ వచ్చారు. కానీ, పవన్ మాత్రం అల్లరి చేయండని చెబుతున్నారన్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.గేమ్ చేంజర్ సినిమా కార్యక్రమానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించడం విషాదం. ఇందుకు ఎవరైనా బాధ పడతారు. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా తప్పు చేసినట్లు చెప్పరు. కాని హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఉదంతంలో ఆయనకు బంధువు, మరో నటుడు అయిన అల్లు అర్జున్ పట్ల వ్యవహరించిన తీరు .. చేసిన వ్యాఖ్యలు మెడకు చుట్టుకున్నాయి. అల్లు అర్జున్ కు తొక్కిసలాటతో సంబంధం లేకపోయినా తెలంగాణ పోలీసులు కేసు పట్టారని సినిమా ప్రముఖులంతా భావించి ఆయనను పరామర్శించారు. చివరికి ఆయన పార్టనర్ చంద్రబాబు కూడా ఫోన్ చేసి పలకరించారు. కానీ, ఫోన్ పలకరింపు కూడా చేయలేదు పవన్?!.పైగా..రేవంత్ కు మద్దతుగా ప్రసంగించారు.అల్లు అర్జున్ మానవత్వంతో వ్యవహరించలేదని అనుచిత వ్యాఖ్య చేశారు.తొక్కిసలాట లో మరణించిన రేవతి కుటుంబానికి సుమారు రెండు కోట్ల మేర వివిధ రూపాలలో సాయం అందింది. అయినా రేవంత్ ను ప్రసన్నం చేసుకోవడానికి అనేట్లు పవన్ కామెంట్లు చేశారు.పోనీ అదే సమయంలో బెనిఫిట్ షో లు, టిక్కెట్ల దరలు పెంచుకోవడానికి , తొక్కిసలాటకు ఏమి సంబంధం అని పవన్ ప్రశ్నించలేదు.సినిమా టిక్కెట్ల రేట్లతో ప్రభుత్వానికి ఏమి సంబంధం అని గతంలో జగన్ ప్రభుత్వంపై పెద్దపెట్టున అరచిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో మాత్రం ధైర్యం చేయలేకపోయారు. రాజమండ్రి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు, మెగా కుటుంబ వీరాభిమానులు మరణిస్తే జనసేన తరపున చెరో ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.ఇది మానవత్వమేనా? అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. పవన్ కళ్యాణ్ కాని, రామ్ చరణ్ తేజ కాని, గేమ్ చేంజర్ సినిమా బృందం కాని ఎవరూ బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదన్న ప్రశ్నకు జవాబు దొరకదు.అర్జున్ విషయంలో ఒక నీతి, తన వరకు వచ్చేసరికి మరో రీతా అనే విమర్శ వచ్చింది.పైగా జగన్ టైమ్ లో రోడ్డు బాగు చేయలేదు కనుక ప్రమాదం జరిగిందని దిక్కుమాలిన ఆరోపణ చేశారు.తీరా చూస్తే ఆయన అబద్దం ఆడారని తేలిపోయింది. ప్రమాదం జరిగిన చోట రోడ్డుపై ఎక్కడా ఒక్కగొయ్యి కూడా లేదు.అయినా ప్రమాదం జరిగింది. తమ అభిమానులు మరణించిన విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం పవన్ ఈ ప్రయత్నం చేశారని అనుకోవాలి.మరణించిన యువకుల కుటుంబ సభ్యులు రోదిస్తూ మెగా కుటుంబం పట్ల వారికి ఎంత అభిమానమో వివరించారు. ఈ సినిమా పిచ్చి తోనే వారు మరణించారని వాపోయారు. దాని గురించి పవన్ నోరెత్తడం లేదు. రోడ్డు బాగోలేదని చెబుతున్నారు. నిజానికి ఆ ఏడీబీ రోడ్డు దశాబ్దాల తరబడి రకరకాల సమస్యలను ఎదుర్కుంటోంది. దాంతో రోడ్డు పాడవుతోంది. అయినా తాము రాగానే అన్నీ చేసేస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఈ ఏడు నెలలు ఏమి చేసినట్లు అన్న ప్రశ్న కూడా వస్తుంది.తాజాగా కూటమి ఎమ్మెల్యే ఒకరు తనకు కమిషన్ ఇవ్వకుండా మెటల్ గ్రావెల్ తొలనివ్వడం లేదని ఆరోపణ వచ్చింది.ఇలా ఏది పడితే అది మాట్లాడితే పవన్ కు ఏమి ఉపయోగం?. అది టీడీపీకే ప్రయోజనం అవుతుంది. పవన్‌కు సీఎం అవ్వాలనే కోరిక ఉన్నా, ఆయన తీరు ఆ స్థాయిలో లేదని , లోకేష్ సీఎం అయితేనే బెటర్ అని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తాయి.నిజానికి అబద్దాలు చెప్పడం పవన్‌కు కొత్త కాదు.ఆయన ఈ విషయంలో చంద్రబాబు వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.కాని అబద్దాలు ఆడడంలో చాకచక్యం కూడా అవసరమే అని అంటారు. అందులో చంద్రబాబు సిద్దహస్తులనే అభిప్రాయం ఉంది. ఆ విషయం తెలియక చంద్రబాబు చెప్పినట్లే చెబుతూ, ఆయన చేసినట్లే చేస్తూ పవన్ పరువు పోగొట్టుకుంటున్నారు. గతంలో పవన్ ఏపీఅంతటా 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ తప్పుడు ఆరోపణ చేసి.. దానికి వలంటీర్లను బాధ్యులు చేసి అప్రతిష్ట మూట కట్టుకున్నారు.చంద్రబాబుతో పాటు అనేక వాగ్దానాలను చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా ఇప్పుడు ప్రజలు భావించే పరిస్తితి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయంటూ ,హోం మంత్రి బాధ్యతలు చేపడతానంటూ వ్యాఖ్యానించి , ఆ తర్వాత జారిపోయి,దానిని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సూచించినట్లు సోషల్ మీడియాపై దాడి చేశారు. ఆ విషయం జనానికి అర్ధం అయింది.పవన్ తాను ఎక్కడకు వెళితే అక్కడే పుట్టానని చెప్పడం,చదువుపై ఒక్కోసారి ఒకరకంగా మాట్లాడడం వంటివాటిని ఆయన అభిమానులు కూడా సరిపెట్టుకున్నారు.కాని అధికారం వచ్చిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. అది చంద్రబాబు మెప్పుదల కోసమో లేక, తాను సూపర్ సీఎం అని పరోక్షంగా ప్రజలు అనుకోవాలన్న లక్ష్యంతోనో ఇలా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు👉 తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు ఒక అసత్య ఆరోపణ చేశారు. వెంటనే పవన్ సనాతని అవతారం ఎత్తి అంతకన్నా గట్టిగా ప్రచారం చేసి బోల్తా పడ్డారు.👉తన పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన రేప్ బాధితులను ,జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ-ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యాలకు గురైన బాధితులను పరామర్శించకుండా.. కడపలో జరిగిన ఒక చిన్న ఘటనపై ఆవేశంగా స్పందిస్తూ అక్కడకు వెళ్లిన తీరుతో అపహాస్యం పాలయ్యారు.👉 వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కంపెనీ భూముల వద్దకు అవసరం లేకపోయినా సందర్శించి ఏదో చేయాలని అనుకున్నారు. కాని అధికారులు అక్కడ ఏమీ లేదని చెప్పడంతో తుస్సుమన్నారు.👉కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లి తనకు అధికారం లేకపోయినా ‘‘సీజ్ ద షిప్’’ అంటూ ఆదేశించి ఈయనేం ఉప ముఖ్యమంత్రి? అని అధికారులు తల పట్టుకునేలా చేసుకున్నారు.ఇవన్నీ చూస్తే తాను లోకేష్ కన్నా సమర్ధుడనని, అన్ని వ్యవహారాలలో తను జోక్యం చేసుకోగలనని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నట్లుగా ఉంది. బీజేపీతో కలిసి భవిష్యత్తులో వేరు కుంపటి పెట్టవచ్చని పవన్ పై ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాయడం ఆరంభించింది. పవన్ వేస్తున్న తప్పటడుగులతో జనసేన కార్యకర్తలు నెత్తి,నోరు కొట్టుకుంటుంటే.. టీడీపీ నేతలు, శ్రేణులు మాత్రం లోలోపల సంతోషిస్తున్నాయి. ఇలాంటి పిచ్చి చేష్టలు, ప్రకటనల ద్వారా పవన్ కల్యాణ్ భ్రష్టు పడితే అది తమకే మరింత ఉపయోగమన్నది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పైకి ఏదో పవన్ కు బాగా మర్యాద ఇస్తున్నట్లు కనిపిస్తూ.. మరోవైపు ఆయా సందర్భాలలో పవన్ సెల్ఫ్ గోల్ వేసుకునేలా టిడిపి నాయకత్వం ,ముఖ్యంగా లోకేష్ అనుచర వర్గం ప్రయత్నిస్తున్నట్లు కొందరి భావనగా ఉంది. ఎందుకంటే లోకేష్ సీఎం కాకుండా పవన్ అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం ఏర్పడడమే!.ఈ టరమ్ మాత్రమే కాకుండా ఆ పై పదేళ్లు కూడా చంద్రబాబు సీఎంగా ఉండాలని చెప్పి సంతోషపెడుతున్నానని పవన్ భావిస్తుండవచ్చు.కాని ఇది లోకేష్ కు మంట పుట్టించే అంశమే అవుతుంది. వైఎస్సార్సీపీ చేసే విమర్శల వల్ల జరిగే నష్టం కన్నా.. టీడీపీ నేతలు అమలు చేసే వ్యూహాల వల్లే పవన్ కు అధికనష్టం కలుగుతోంది. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ పూర్తిగా టీడీపీకి, చంద్రబాబుకు సరెండర్ అయినట్లు కాకుండా.. తనకంటూ ఒక మంచి టీమ్ ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. సరైన రీతిలో రాజకీయం చేయకపోతే నష్టపోయేది పవనే అవుతారు. ఏపీలో గత ఏడు నెలల పరిస్థితులు చూస్తే.. ఏదో రకంగా వచ్చిన రాజకీయవకాశాన్ని పవన్ తనకు తాను చేజార్చుకుంటున్నారన్న భావన ఏర్పడుతోంది.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ఆరోగ్యశ్రీ’పై ఎందుకింత కక్ష బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘ఆరోగ్యశ్రీ’పై మీకు ఎందుకింత కక్ష? పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారు? అంటూ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బకొడుతున్నారు? కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారు? అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం “ఆరోగ్య శ్రీ’’ని నిర్వీర్యంచేసిన మాట వాస్తవం కాదా? మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్య శ్రీ లేదనే మాట వినిపిస్తున్నా ఎందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు?..ఈ 8 నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో, ఆస్తులు తాకట్టుపెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నా ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆస్తిగా వైయస్సార్సీపీ సృష్టించిన 17 మెడికల్ కాలేజీలను స్కాంచేస్తూ మీ మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదంటారా?’’ అంటూ ప్రశ్నలు గుప్పించారు.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. సర్వం లాస్!‘‘ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్తలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా చంద్రబాబు. మరి ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే.. వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే వారి ధ్యేయం అయినప్పుడు ప్రజాప్రయోజనాలు ఎంతవరకు సాధ్యం? కోవిడ్‌వంటి కొత్త రోగాలతో, అరుదైన వ్యాధులతో, ప్రమాదాల సమయంలో ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతోమందిని కాపాడుకుంది...ప్రొసీజర్ల జాబితా వ్యాధుల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం అనేక మార్లు ఆదుకుంది. మరి ప్రైవేటు కంపెనీలు ఈ పని చేయగలవా? మీరు చేయించగలరా? విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోయిన మాట వాస్తవం కాదా? ఇంత మంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏమిటి?..చంద్రబాబు.. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. కాని, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఏరోజైనా ఆ ప్రయత్నంచేశారా? పోనీ దివంగత మహానేత వైఎస్సార్ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతంచేసేలా ఒక్కపనైనా చేశారా? వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్స అందుకునే ప్రొసీజర్ల సంఖ్యను 1,000 నుంచి 3,257కి పెంచాం. మేనిఫెస్టోలో వాగ్దానంచేసినట్టుగా సంవత్సరాదాయం రూ.5లక్షలలోపు ఉన్నవారికి కూడా వర్తింపచేసి మధ్యతరగతివారికీ మేలు చేశాం. రూ.25లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవాడికి మంచి చేశాం...ఐదేళ్లకాలంలో 45.1లక్షల మందికి రూ.13,421 కోట్లు ఖర్చుచేసి ఉచితంగా వైద్యాన్ని అందించాం. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా, చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో పేషెంటుకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని తెచ్చి, దానికింద మరో రూ.1,465 కోట్లు అందించి రూ. 24.59 లక్షల మందికి ఆరోగ్య ఆసరాగా నిలిచాం. మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారు. కొత్తగా అంబులెన్స్‌లు తీసుకు వచ్చి 104,108 సేవలను మేం మెరుగుపరిస్తే, మీరు నెలల తరబడి బకాయిలుపెట్టి ఆ అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేశారు...చంద్రబాబు.. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల్లో మీరు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మీర్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఇచ్చిన హామీలను ఎలాగూ ఎగరగొడుతున్నారు. మేం ఇచ్చిన పథకాలనూ రద్దుచేస్తున్నారు. ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా, ఉన్న గ్యారంటీని తీసేశారు. ప్రజలకు నష్టంచేసే మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. @ncbn గారూ… “ఆరోగ్య శ్రీ’’పై మీకు ఎందుకింత కక్ష? పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారు? వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 7, 2025 -
రేపు నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) రేపు(బుధవారం) నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైరపర్సన్లు హాజరుకున్నారు.రేపు(బుధవారం) నెల్లూరు(nellore) జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా నెల్లూరు జిల్లాకు సంబంధిం తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది.