breaking news
-
రేపు నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) రేపు(బుధవారం) నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైరపర్సన్లు హాజరుకున్నారు.రేపు(బుధవారం) నెల్లూరు(nellore) జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా నెల్లూరు జిల్లాకు సంబంధిం తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది. -
బాబూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదా?: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి విడదల రజని(Vidadala Rajini). ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ(aarogyasri) పేదలకు సంజీవిని లాంటింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చూడకూడదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాన్ని వైఎస్ జగన్ మరింత బలోపేతం చేసి పేదలకు అందించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే అని భావించి ఆరోగ్యశ్రీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది.ఈరోజు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు వైద్య సేవలు ఆపేశాయి. ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యత కాదు అని కూటమి సర్కార్ ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో ఎప్పుడూ రాలేదు. కోవిడ్(covid)ను ఆరోగ్యశ్రీలో చేర్చి మా ప్రభుత్వం వైద్యం అందించింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. మూడు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఆరోగ్య శ్రీని హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్‌లో అమలు చేస్తామని చెబుతున్నారు. థర్డ్ పార్టీకి బీమా సౌకర్యం అందించే ప్రయత్నం మంచిది కాదు. బీమా కంపెనీలు సేవా దృక్పథంతో వ్యవహరించవు. అలాగే, బీమా సౌకర్యం ఎన్ని ఆసుపత్రుల్లో అమలు చేస్తారో తెలియదు. ఎన్ని రోగాలకు అమలు చేస్తారో తెలియదు. ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్ విధానాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదన్న సందేశాన్ని ఇస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేయలేకపోయాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 637 కోట్ల పాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించారు అని చెప్పుకొచ్చారు. -
పవన్.. ఆ తల్లికి సమాధానం చెప్పే దమ్ముందా?: రోజా
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అని పవన్‌కు ఆమె హితవు పలికారు. ఈ సందర్బంగా తల్లి రోధిస్తున్న వీడియోను షేర్ చేశారు.అభిమానుల మృతి పట్ల పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో రోజా ట్విట్టర్ వేదికగా..‘కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్ కల్యాణ్?. ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!! అంటూ మండిపడ్డారు.కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా @PawanKalyan? ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!!#SaveAPYouth pic.twitter.com/PboRQmUQXc— Roja Selvamani (@RojaSelvamaniRK) January 7, 2025ఇక, ఇటీవల నటుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. దీంతో, మృతిచెందిన యువకుల తల్లి, కుటుంబ సభ్యులు ఆవేదనతో కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ బిడ్డలను కోల్పోయి రోదిస్తున్నారు.ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా ఏపీ డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఘటన తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెబుతూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాదు జనసేన తరఫున ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇది మంచి విషయమే. అయితే ఇది ఇక్కడితో ఆగి ఉంటే.. మెగా అభిమానులు సంతృప్తి చెందేవాళ్లు కావొచ్చు.కానీ.. ఈ ఘటనను కూడా రాజకీయం చేయాలని పవన్ అనుకున్నారు. అభిమానులు చనిపోయిన నెపాన్ని.. గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని.. గత ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని.. రోడ్డు బాగు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని.. మెసేజ్ చేశారు. అంతేకాదు పైగా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా వెళ్లమని చెప్పామంటూ.. వేగంగా వెళ్లి ప్రమాదానికి గురైన ఆ అభిమానులదే తప్పనేలా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన తీరుపై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం…— Pawan Kalyan (@PawanKalyan) January 6, 2025 -
‘చంద్రబాబు విధ్వంసం.. పురందేశ్వరికి కనబడలేదా?’
సాక్షి, తాడేపల్లి: పురందేశ్వరి (Purandeswari) కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) మండిపడ్డారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, చంద్రబాబు వలన హైందవ ధర్మానికి కల్గిన నష్టాల గురించి ఆమె ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.చంద్రబాబు వలన గోదావరి పుష్కరాలలో 29 మంది హిందూ భక్తులు చనిపోయినా ఆమె పట్టించుకోలేదు. విజయవాడలో చంద్రబాబు 50 ఆలయాలను కూల్చేసినా ఆమెకి కనపడలేదు. కానీ వైఎస్ జగన్ పాలనపై మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించారు. ఆలయాల్లో ఉన్న అర్చకులకు వేతనాలను పెంచారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేసింది కూడా జగనే. వంశపారంపర్య హక్కులను జగన్ తీసుకువచ్చారు’’ అని కొట్టు సత్యనారాయణ వివరించారు.కాణిపాకం, కాళహస్తి, శ్రీశైలం, అమరావతి, ద్రాక్షారామం, కనకదుర్గమ్మ గుడి, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, వాడపల్లి, అంతర్వేది, అయినవల్లి.. ఇలా అనేక ఆలయాల్లో అభివృద్ధి చేశారు. విజయవాడ గుడికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 49 ఆలయాల్లో ఏకకాలంలో కుంభాభిషేకాన్ని జగన్ నిర్వహించారు. కంచి పీఠాధిపతి సైతం దీన్ని మెచ్చుకున్నారు. శ్రీ వాణి ట్రస్టు ద్వారా 3 వేల ఆలయాలను కొత్తగా జగన్ హయాంలో నిర్మించారు. ఇలా చేసిన అనేక మంచి కార్యక్రమాలు పురందేశ్వరికి కనపడలేదు.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. సర్వం లాస్!కేవలం చంద్రబాబు దగ్గర మార్కులు పొందటానికే గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైందవ శంఖారావంలో రాజకీయాలు మాట్లాడటం పురంధేశ్వరికే చెల్లింది. చంద్రబాబు కోసమే ఆమె పని చేస్తున్నారు. సెక్షన్ 83 ని సవరణ చేసి ఆలయ భూముల లీజులు వసూలు చేయటం, అన్యాక్రాంతమైన భూములను కాపాడారు. ఈ చట్ట సవరణను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించాయి. తిరుమల లడ్డూని అనవసరం వివాదం చేశారు.దీని వలన హిందూ సమాజానికి ఏమైనా మేలు జరిగిందా?. హైందవ శంఖారావంలో పీఠాధిపతులు చెప్పినవన్నీ జగన్ చేసి చూపించారు. దాన్ని కొనసాగేలా ఇప్పటి ప్రభుత్వం చూడాలి. అంతేతప్ప ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’’ అని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. -
‘ప్రధాని భూమి పూజ చేసే ప్రాజెక్టులన్నీ మేం తెచ్చినవే’
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో భూమి పూజ చేయనున్న రైల్వే జోన్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టులన్నీ వైఎస్సార్సీపీ హయాంలో సాధించినవేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) చెప్పారు. కానీ ‘సొమ్మొకడిది సోకొకడిది...’ అన్న చందంగా ఇవన్నీ తామే తీసుకొచ్చామన్నట్లుగా మంత్రి లోకేశ్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని, ప్లాంట్ అభివృద్ధి కోసం కర్ణాటక తరహాలో రూ.15 వేల కోట్లను కేంద్రం నుంచి తీసుకురావాలని సవాల్ విసిరారు. స్థానిక మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ శాఖపైనా అవగాహన లేకపోయినా.. సకల శాఖల మంత్రిగా, కలెక్షన్ కింగ్‌గా లోకేశ్ ఏడు నెలల్లో మంచి పేరే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదని చెప్పారు. గత వైఎస్సార్సీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని, దీనిపై లోకేశ్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని అమర్నాథ్ ప్రకటించారు. అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుపై విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో నాటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా చర్చించి ఒప్పందం చేసుకునేలా చూశారని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు అన్ని అనుమతులు ఇవ్వడంతోపాటు గత ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భూమి పూజ చేయాలనుకున్నా ప్రధానికి సమయం కుదరలేదని, ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పారు.బల్క్ డ్రగ్ పార్క్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి దాన్ని సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇది కచ్చితంగా నాటి సీఎం వైఎస్ జగన్ ఘనతేనని స్పష్టంచేశా>రు. రైల్వే జోన్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూములే ఇవ్వలేదని లోకేశ్ పచ్చి అబద్ధాలు చెప్పారని, రైల్వేశాఖకు 52 ఎకరాలు కేటాయిస్తూ జీవీఎంసీ కమిషనర్ గత ఏడాది జనవరి రెండో తేదీన ఉత్తర్వులు ఇచ్చారని వివరించారు. రుషికొండపై టూరిజం గెస్ట్‌హౌస్ ఏమైనా మా సొంత నిర్మాణమా? ప్రభుత్వానిదే కదా? ఏ అవసరం కోసమైనా వాడుకోవచ్చు కదా? ఎందుకా పిచ్చి విమర్శలు? అని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
కేవీరావుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్‌ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.సండూరు పవర్ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందినా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారుడిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందికేవీ రావు నాకు తెలియదు అని చెప్పానుఅతనికి నాకు ఎలాంటి సంబంధం లేదుకాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను తిరుమల కు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పానునేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధంమే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి రావు చెపుతున్నాడుకాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చునేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి అని కోరానురంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించిందినాకు సంబంధం లేదు అని చెప్పానునేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమేశ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పానుశరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారుకుటుంబ రీలేషన్ అని చెప్పానుకాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారులుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళానుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పానువిక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారువిక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదుసండుర్ పవర్ కంపెనిలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారుకొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను -
ఎల్లోమీడియాకు అంబటి రాంబాబు వార్నింగ్
సాక్షి,గుంటూరు: ఎల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం(జనవరి6) అంబటి మీడియాతో మాట్లాడారు. ‘పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం.మళ్లీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేం మీలా కక్ష సాధింపులకు పాల్పడం. గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు. చనిపోయిన వారికి రూ.2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి.పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ గేమ్‌చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదు. సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు ఎవరివల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు.రోడ్డుబాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉంది’అని అంబటి రాంబాబు అన్నారు. -
పోతవరంలో టీడీపీ నేతల బరితెగింపు
తూర్పుగోదావరి జిల్లా: రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రతీ రోజూ టీడీపీ నేతల బరితెగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం పోతవరంలో టీడీపీ నేతలు బరి తెగించారు. వైఎస్సార్సీపీకి చెందిన సానుభూతిపరుల భూమిని దోచుకునేందుకు కుట్ర చేశారు. గందదిపాము రాజ్‌కుమార్‌కు చెందిన భూమిని చిడిపి గోపీ అతని అనుచరులతో కలిసి దోచకునేందుకు ప్రణాళిక రచించారు. దీనిలో ాగంగా తనపై విచక్షణారహితంగా దాడికి దిగాడని గందిపాము రాజ్‌కుమార్ ఆరోపిస్తున్నాడు.తనపై దాడికి దిగిన వారిలో చిడిపి గోపీతో పాటుగా అతని అనుచరులైన మాజీ ఎంపీటీసీ కళావతి, ఏసునాదం, నేకూరి అబ్బులు, కళావతి అల్లుడు ఉన్నారన్నాడు. ఇదే విషయంపై గోపీ అతని అనుచరులు తరచు వేధిస్తున్నారని బాధితుడువాపోతున్నాడు. తన పొలం ఇవ్వకపోతే దాడి చేయడమే కాకుండా కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు విలపిస్తున్నాడు.చిడిపి గోపీ అతని అనుచరులు దాడిలో తీవ్ర గాయాలైన తాము తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధిత కుటుంబ స్పష్టం చేసింది. ఈ దాడిపై ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలతో పాటు ఎమ్మెల్సీ రిపోర్ట్ పంపించినా పోలీసులు కేసు నమోదు చేయడంలో తాత్సారం చేస్తున్నారన్నారు. తనకు తన కుటుంబానికి చిడిపి గోపీ నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు పేర్కొన్నాడు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు బాధితుడు.వైఎస్సార్సీపీ నేత పొలాన్ని తవ్వేసిన పచ్చమూకలు నిన్న(ఆదివారం)పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దుర్గి మండలం కోలగొట్లలో వైఎస్సార్సీపీ నేత కన్నెబోయిన నాసరయ్య పొలాన్ని జేసీబీలతో మట్టిని తవ్వేసి తరలించుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతల బెదిరింపులతో కన్నెబోయిన నాసరయ్య ఊరు వదిలి బయటకు వచ్చి నివసిస్తున్నారు. టీడీపీ నాయకుల దందాను వీఆర్వో దృష్టికి తీసుకువెళ్తే.. టీడీపీ నేతలను సంప్రదించమంటూ సలహా ఇస్తున్నారని నాసరయ్య మండిపడుతున్నారు.ప్రోక్లైన్లతో నాసరయ్య పొలంలో పెద్ద పెద్ద గోతులు పెడుతూ టీడీపీ నేతలు మట్టి తీసుకెళ్లిపోయారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి మరోసారి పొలంలో తవ్వకాలు మొదలుపెట్టిన టీడీపీ రౌడీలు.. భారీగా మట్టి తరలిస్తున్నారు. ప్రభుత్వం మాదంటూ.. పోలీసులు, కలెక్టర్ గాని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో అధికారులు చేతులెత్తేశారు. -
సోషల్‌మీడియా కార్యకర్తపై టీడీపీ మూకల దాడి
సాక్షి,వైఎస్ఆర్జిల్లా:జిల్లాలోని వేంపల్లిలో టీడీపీ రౌడీల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త లోకేష్‌పై టీడీపీ అల్లరిమూకలు దాడి చేశాయి. మాట్లాడాలని పిలిపించి లోకేష్‌ను పిడిగుద్దులు గుద్దారు.టీడీపీ రౌడీలు అల్తాఫ్ ,నాసిర్,ఇమ్రాన్,ఫయాజ్‌లు కలిసి తనను కొట్టారని బాధితుడు లోకేష్ తెలిపారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ సోషల్‌మీడియా కార్యకర్తలపై దాడులు,వేధింపులు ఎక్కువయ్యాయి. టీడీపీ అల్లరిమూకలు సోషల్‌మీడియా కార్యకర్తలపై నేరుగా దాడులు చేయడంతో పాటు వారిపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారు. ఒక్కొక్కరిని నెలల తరబడి జైలులో ఉంచేందుకు ఒక కేసు తర్వాత మరో కేసు పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నారు. కొందరు సోషల్‌మీడియా కార్యకర్తల అదృశ్యం కేసుల్లో అయితే ఏకంగా వారి కుటుంబ సభ్యులు ఏకంగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా వేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. సోషల్‌మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: లోకేష్ అవన్నీ నీ కళ్లకు కనిపించడం లేదా..? -
‘పుష్ప’కేనా నీతులు.. గేమ్ చేంజర్‌కి పాటించరా?
అమరావతి: ‘పుష్ప’ కేమో నీతులు చెప్తారా!, గేమ్ చేంజర్‌కి(Game Changer) పాటించరా! అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్.. ఈ సంక్రాతి బరిలో నిలవడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఇదే విషయంపై అంబటి రాంబాబు(Ambati Rambabu) ‘ ఎక్స్’ వేదికగా స్పందించారు. "పుష్ప" కేమో నీతులు చెప్తారా !"గేమ్ చేంజర్' కి పాటించరా !@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 6, 2025 గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు ఇద్దరు యువకులు. ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాము ఆధారాన్ని కోల్పోయమంటూ బోరున విలపిస్తున్నారు.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తోంది,. తనతో కలిసి పండ్ల వ్యాపారం చేసుకుంటున్న చరణ్‌ను కోల్పోవడంతో తాము అన్నీ కోల్పోయినట్లే ఉందని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.అల్లు అర్జున్ టార్గెట్‌గా వ్యవహారం నడిపారా?పుష్ప-2(Pushpa-2) బెనిఫిట్ షో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆ సినిమా బెనిఫిట్ షోలో భాగంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందింది. అదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఫలితంగా దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. పుష్ప-2 హీరో అల్లు అర్జున్... సంధ్య థియేటర్‌కు బెనిఫిట్ షోకు రావడంతోనే ఇదంతా జరిగిందని అతనిపై కేసు కూడా నమోదైంది. ఒకవైపు ఈ కేసులో A-11గా ఉన్న అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ లభించినా ఈ కేసు వివాదం ఇంకా చల్లారలేదు. ప్రధానంగా అల్లు అర్జున్ టార్గెట్‌గా వ్యవహారం అంతా నడిచిందనే విమర్శలు కూడా వినిపించాయి.మరి గేమ్ ఛేంజర్ సంగతి ఏంటి?పుష్ప సినిమాకు సంబంధించి తెలంగాణలో ఒకరు ప్రాణాలు కోల్పోతే, గేమ్ ఛేంజర్ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఇద్దరు అసువులు బాసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ‘పుష్ప’ రచ్చ ఇంకా హాట్ హాట్‌గా ఉండగానే, గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా జరపడాన్నిప్రశ్నిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ సాయంత్రం సమయంలో జరగడంతో పాటు దానికి భారీగా ఫ్యాన్స్ సేకరణ జరిగిందనే అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు పలువురు విశ్లేషకులు.పుష్ప ఘటన.. పవన్ మాటల్లో కొన్ని.. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించిందన్నాడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటన జరిగిన వెంటనే రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్లే ఇంత జరిగింది. ఒకవేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే ఆయనపై కూడా ప్రజల్లో విమర్శలు వచ్చేవి. సీఎం హోదాలో రేవంత్ స్పందించారనే అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడే కాదు.. కింద స్థాయి నుంచి ఎదిగారు’ అని పవన్ అన్నారు.‘‘గేమ్ ఛేంజర్’ పరామర్శిస్తాడా?ఇ క్కడ కూడా విషాదమే చోటు చేసుకుంది. గేమ్ ఛేంజర్ ఆయా కుటుంబాల్ని పరామర్శిస్తాడా అనే ప్రశ్న తలెత్తోంది. ఆరోజు పవన్ మాటల్ని బట్టి చూస్తే.. రేవతి కుటుంబాన్ని అల్జు అర్జున్ పరామర్శించకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వివాదం పెద్ద అవడానికి కూడా అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కూడా ఒక కారణంగా చూపారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ వెళ్లి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల్సి పరామర్శించాలి కదా. వారి కుటుంబాలకైతే తక్షణ సాయం అయితే అందించారు కానీ వారి కుటుంబాల్ని వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత రామ్ చరణ్‌పై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ‘‘ఒరేయ్ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా -
‘‘ఒరేయ్ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా!’’
ఒక హీరో కోసం జనాలు ఎగబడితే.. అది కొండంత అభిమానం అంటారు. అదే అభిమానం హద్దు మీరితే.. ఇదెక్కడి అభిమానం? అని తిట్టిపోస్తారు. ప్రాణంపోయేంత అభిమానానికి కూడా అది వర్తిస్తుందని మొన్నటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చూశాం. అయితే ఈ ఘటనపై స్పందిస్తూ.. ఫ్యాన్స్ విషయంలో బాధ్యతతో వ్యవహరించాలంటూ సినిమావాళ్లకు నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాఠం చెప్పడం చూశాం. అయితే అది చెప్పడం వరకేనని.. ఆచరణలో లేదనేది తాజాగా రుజువైంది.గేమ్ ఛేంజర్ మెగాఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనపై ఇవాళ(జనవరి 6) ఎక్స్ వేదికగా ఏపీ డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఘటన తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెబుతూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాదు జనసేన తరఫున ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇది మంచి విషయమే. అయితే ఇది ఇక్కడితో ఆగి ఉంటే.. మెగా అభిమానులు సంతృప్తి చెందేవాళ్లు కావొచ్చు. కానీ.. ఈ ఘటనను కూడా రాజకీయం చేయాలని పవన్ అనుకున్నారు. అభిమానులు చనిపోయిన నెపాన్ని.. గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని.. గత ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని.. రోడ్డు బాగు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని.. మెసేజ్ చేశారు. అంతేకాదు పైగా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా వెళ్లమని చెప్పామంటూ.. వేగంగా వెళ్లి ప్రమాదానికి గురైన ఆ అభిమానులదే తప్పనేలా దుర్మార్గమైన వ్యాఖ్య ఒకటి చేశారు.‘‘సినిమా అంటే టీమ్.. అందరి భాగస్వామ్యం.అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగి పోయిందని విచారం వ్యక్తం చేయాల్సింది. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంది’’సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు, ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని.. అంతా అల్లు అర్జున్, చిత్ర యూనిట్‌దే అని పవన్ మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్ట్ సరైన పరిణామమే అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అలాంటప్పుడు ఇప్పుడు రాం చరణ్‌ను అరెస్ట్ చేయిస్తారా?. ఒకవేళ నిజంగా ఆ డిమాండ్ ఒకటి తెర మీదకు(ఆఖరికి సోషల్ మీడియాలో అయినా సరే) వస్తే ప్రభుత్వంలో ఉన్న పవన్ ఏం చేస్తారు?. రోడ్డు ప్రమాదం, అందునా తాను స్వయంగా హాజరైన ఈవెంట్‌కు హాజరై వెళ్తున్న క్రమంలో మరణించిన వాళ్ల పట్ల ఇంత లూస్ టంగ్‌తో మాట్లాడొచ్చా? అనే అభిప్రాయం ఆయన చేసిన ట్వీట్ కామెంట్ సెక్షన్లోనే వ్యక్తం అవుతోంది.(కావాలంటే మీరే పరిశీలించుకోండి.. )నిజానికి.. అభిమానులతో పవన్ వ్యవహరించే తీరు చాలాసార్లు చర్చనీయాంశమైంది. గతంలో ఓపెన్‌గానే ఎన్నోసార్లు వాళ్ల మీద ఆయన చిరాకు ప్రదర్శించారు. ఆఖరికి.. వాళ్లు ఆయన్ని ఆకాశానికెత్తిన సందర్భంలోనూ అసహనం ప్రదర్శించారు. ఇప్పుడు.. చనిపోయింది మెగా అభిమానులు. రాం చరణ్(Ram Charan)ను, ప్రత్యేకించి తనను చూసేందుకు అంత దూరం నుంచి ఆత్రుతగా వచ్చారు. ఆ ఈవెంట్ పవన్ ఎలా మాట్లాడిందో చూశాం.. అభిమానుల్ని, అందునా యువతను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడింది నిజం కాదా?. సినిమా ఫంక్షన్ లో చొక్కాలు చించుకోకపోతే ఎలా?. బైకు సైలెన్సర్లు తీయకుండా, ఎక్సలేటర్లు రేజ్ చేయకపోతే కిక్కు ఏం ఉంటుంది?ఆ వ్యాఖ్యలతో అభిమానులను ఎంతగా కేరింతలు కొట్టిందో చూశాం కదా!. అసలు ఆ ఈవెంట్ జరిగితే రెండు నిండు ప్రాణాలు పోయేవి కాదుగా!. చనిపోయాక.. చిత్ర నిర్మాత దిల్ రాజు, ఆ వెంటనే గేమ్ చేంజర్‌కు ఏమాత్రం సంబంధం లేదని పవన్ ఆర్థిక సాయం ప్రకటించడం దేనికి?. గత ప్రభుత్వం.. అంటూ ఇంకా ఎంత కాలం నిందలేసి తప్పించుకుంటారు?. ఇక్కడ ఎవరి తప్పు లేకపోవచ్చు. కానీ, అల్లు అర్జున్(Allu Arjun) విషయంలో పవన్ చెప్పినదానిబట్టి.. రాం చరణో, లేదంటే చిత్ర యూనిటో, అంతెందుకు అసలు పవన్ కల్యాణో బాధిత కుటుంబాలను పరామర్శిస్తే సరిపోయేది కదా!. ఇక్కడ మానవతా దృక్పథం లోపించినట్లు పవన్‌కు అనిపించలేదా?. అసలు ఇక్కడ రాజకీయ ప్రస్తావన దేనికి?. అంటే.. పవన్ నీతిపాఠాలు చెప్తారు కాని పాటించరన్నమాట!. హీరోల అభిమానులు ఈ విషయం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. అట్టర్ ప్లాపు! -
లోకేష్.. అవన్నీ నీ కళ్లకు కనిపించడం లేదా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్ట్‌లు తమ ప్రభుత్వంలో వచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఏ శాఖ మీదా అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటంబం అని చెప్పారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ మీద మాటలాడి లోకేష్ అభాసు పాలయ్యారు. ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారు. 15ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుండేది.ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రిసెర్చ్ సెంటర్, మూలపేట పోర్ట్ నిర్మాణం లోకేష్‌కు కనిపించలేదా?. మెడికల్ కాలేజీలు, భోగాపురం ఎయిర్‌పోర్టు ఎవరి హయాంలో నిర్మాణ పనులు జరిగాయి. ఇన్ఫోసిస్ ఐటీ పరిశ్రమ ఎవరి హయాంలో వచ్చింది. మేము తెచ్చిన టీసీఎస్ మీరు తెచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటంబం. రుషికొండపై అద్భుతమైన భవనం వైఎస్ జగన్ కట్టారు. ఆ భవనాన్ని ప్రధాని, రాష్ట్రపతి అవసరాల కోసం వాడుకోవచ్చు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధానితో లోకేష్ చెప్పించగలరా?. స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పగలరా?. ఈ ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది. వరదలు విపత్తులకు వైఎస్ జగనే కారణం అంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు నేను మంత్రిగా ఉన్న సమయంలో ఒప్పందం జరిగింది. 1300 ఎకరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాజెక్టుకు అన్ని అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చింది. 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారత దేశం నుంచి బల్క్ డ్రగ్ పార్క్ సాధించాము. రైల్వే జోన్‌కు 52 ఎకరాల భూములు జనవరి నెలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. టీడీపీ హయాంలో బకాయిలు పెట్టిన రూ.50వేల కోట్లు వైఎస్ జగన్ చెల్లించారు. అప్పు తెచ్చిన లక్ష 20వేల కోట్లు ఏం చేశారు?.పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారు అంటున్న లోకేష్, వైఎస్సార్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమవి అని ఎలా చెప్పుకుంటారు. వాలంటీర్లకు 10వేల రూపాయలు ఇస్తామని ఎలా మేనిఫెస్టో పెట్టారు. గంజాయి రవాణా చేసే ఖైదీలు ఉండాల్సిన సెంట్రల్ జైల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. హోం మంత్రి ముందు తన పేషీలో ఉన్న గంజాయి మొక్కను తొలగించారా లేదా?. రోజుకొక మంత్రి అవినీతి బాగోతం బయటపడుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘తల్లికి వందనం’.. బాబు సర్కార్‌కు ఎల్లో మీడియా జాకీలు!
‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు.వైఎస్ జగన్ విజయవంతంగా అమలు చేసిన ‘అమ్మ ఒడి’కి నకలుగా టీడీపీ ‘తల్లికి వందనం’ పేరుతో ఓ పథకాన్ని ఎన్నికల హామీగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ కుటుంబంలో తల్లికి మాత్రమే నగదు ఇచ్చేవాడని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ప్రతీ బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికింది కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతోపాటు నిమ్మల రామానాయుడు వంటి టీడీపీ నేతలు ఈ హామీకి విస్తృతంగా ప్రచారం చేశారు.చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని ఊదరగొట్టారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నలుగురుంటే రూ.60 వేలు అంటూ పేద కుటుంబాలను ఊరించారు. చివరకు కూటమి అధికారంలోకి వచ్చింది కానీ.. పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఎక్కాలు చెప్పుకోవడమే తప్ప, లెక్క (డబ్బు) అందలేదు. ఈ మార్చిలోగా ఇస్తారేమోలే అని పలువురి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇప్పుడు తల్లికి వందనం పెట్టడం లేదని తేల్చేసింది. వచ్చే జూన్‌లో చేస్తామని ప్రకటించింది. అంటే జనం అమాయకులు, పిచ్చోళ్లు, వారికి ఏమీ తెలియదు.. తాము ఏ అబద్దం చెబితే దానిని నమ్ముతారన్నది కూటమి పెద్దల విశ్వాసం. అందుకే ధైర్యంగా ఈ ప్రకటన చేశారనుకోవాలి.తల్లికి వందనం స్కీమ్ దేని కోసం ప్రకటించారు?. పేద పిల్లలు స్కూల్ మానకుండా, విద్యను ఎంకరేజ్ చేయడం కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మ ఒడి స్కీమ్ తెచ్చారు. దీనికి ప్రజలలో విపరీతమైన ఆదరణ లభించింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లను బాగా అభివృద్ది చేయడం, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తీర్చి దిద్దడం, డిజిటల్ విద్య, గోరుముద్ద తదితర కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. దాంతో ఈ స్కీమ్‌ను కాపీ కొట్టి, తామైతే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సాధారణంగా ప్రతీ ఏడాది జూన్ నెలలో ఈ మొత్తాలను తల్లుల ఖాతాలోకి వేయవలసి ఉంది.వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు సుమారు రూ.6000 కోట్ల వ్యయం అయితే.. టీడీపీ, జనసేనలు చెప్పిన వాగ్దానం ప్రకారం సుమారు రూ.13 వేల కోట్ల వరకు వ్యయం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు గడిచినా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయలేదు. ఏదో రకంగా ఈ పథకాన్ని ఎగవేయడమో లేక బాగా కోత పెట్టి అమలు చేయడానికో కసరత్తులు చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కాని అదీ లేదు.. ఇదీ లేదు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పినట్లు తాము పలావు పెడుతుంటే, బిర్యానీ తినిపిస్తామని చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు పలావు పోయే.. బిర్యానీ రాకపోయే.. అని పిల్లలు, తల్లులు ఉసూరుమంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2024 జూన్‌లోనే అమ్మ ఒడి డబ్బులు అందేవి కదా అన్నది ప్రజల భావన.తల్లికి వందనం మాత్రమే కాదు.. మరి కొన్ని స్కీములను కూడా ఇలాగే నీరు కార్చే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రివర్గ నిర్ణయాలు తెలియచేస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20వేల చొప్పున ఇస్తామన్నది ఎన్నికల హామీ అయితే, ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.10 వేలకు మరో రూ.10వేలు జత చేసి ఇస్తామని చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఆ ప్రకారం ఏటా అందించింది. నాలుగేళ్లు ఇస్తామని అన్నా, ఐదేళ్లు చెల్లించింది. అప్పట్లో కూడా కేంద్రం ఇచ్చిన ఆరు వేలతో కలిపి ఈ మొత్తాన్ని ఇస్తే ఇదే చంద్రబాబు, పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం కేంద్రం ఇచ్చే పది వేలతో కలిపి ఇస్తామంటున్నారు. అంటే వారు గతంలో చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకుంటే రైతులకు పది వేల రూపాయలు ఎగవేస్తున్నారన్నమాట. ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని అన్నారే తప్ప స్పష్టంగా నిర్దిష్ట తేదీని చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఈ పంటల సీజన్లో రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉచిత బీమా సదుపాయాన్ని కూడా ఎగవేసింది.తల్లికి వందనం, రైతు భరోసా తర్వాతే మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పించనున్నారని కొత్త లింక్ పెడుతున్నారు. అంటే ఆ రెండు స్కీమ్‌లు ఎప్పుడు ఇస్తారో, ఈ బస్ స్కీమ్ ఎప్పటికి అమలు అవుతుందో దేవుడికే ఎరుక. కాకపోతే ఈలోగా ప్రజలను మాయ చేసే పనిలో బిల్డప్ బాబాయిలు, జాకీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దూసుకెళ్తోంది. జూన్‌లోగా తల్లికి వందనం అని శీర్షికను ఈనాడు పెడితే, తల్లికే తొలి వందనం అంటూ ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇచ్చింది. అంతే తప్ప ఈ ఏడాదికి ఎగనామం పెట్టారని రాయలేదు. పైగా ఈనాడు వారు ఏం బిల్డప్ ఇచ్చారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మరో రెండు పధకాలను అమలు చేయబోతోందని నిస్సిగ్గుగా రాసింది. ఇప్పటికీ ఒక్క పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలినవి ఏవీ అమలు చేయలేదని జనం గగ్గోలు పెడుతుంటే, ఈనాడు మీడియా రాతలు ఇలా ఉన్నాయి.ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెడుతోంది. డీఎస్సీని ఆరు నెలల్లో అమలు చేస్తామని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు తాజాగా వచ్చే జూన్‌కు డీఎస్సీ పూర్తి చేస్తామని అంటున్నారు. నిజానికి అప్పటికి కూడా అది జరగకపోవచ్చని టీడీపీ మీడియానే కథనాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ తదితర సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా శక్తి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. నిరుద్యోగ భృతి అతీగతి లేదు.ఎన్నికల మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని జాకీ మీడియా ఏయే హామీలు అమలు చేసింది చెప్పగలిగితే విశ్వసనీయత వస్తుంది. అంతే తప్ప కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని జాకీ పెట్టి లేపడం కోసం కథనాలు ఇస్తే ప్రజలకు ప్రయోజనం ఏంటి?. ఇప్పటికే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన ఎల్లో మీడియా రోజురోజుకు అధఃపాతాళానికి పడిపోతోంది. ఆ సంగతి పక్కనబెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తల్లికి వందనం గురించి నోరెత్తకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. దీని ద్వారా తల్లిని వారు గౌరవించినట్లా? మోసం చేసినట్లా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ నేత పొలాన్ని తవ్వేసిన పచ్చమూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దుర్గి మండలం కోలగొట్లలో వైఎస్సార్సీపీ నేత కన్నెబోయిన నాసరయ్య పొలాన్ని జేసీబీలతో మట్టిని తవ్వేసి తరలించుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతల బెదిరింపులతో కన్నెబోయిన నాసరయ్య ఊరు వదిలి బయటకు వచ్చి నివసిస్తున్నారు. టీడీపీ నాయకుల దందాను వీఆర్వో దృష్టికి తీసుకువెళ్తే.. టీడీపీ నేతలను సంప్రదించమంటూ సలహా ఇస్తున్నారని నాసరయ్య మండిపడుతున్నారు.ప్రోక్లైన్లతో నాసరయ్య పొలంలో పెద్ద పెద్ద గోతులు పెడుతూ టీడీపీ నేతలు మట్టి తీసుకెళ్లిపోయారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి మరోసారి పొలంలో తవ్వకాలు మొదలుపెట్టిన టీడీపీ రౌడీలు.. భారీగా మట్టి తరలిస్తున్నారు. ప్రభుత్వం మాదంటూ.. పోలీసులు, కలెక్టర్ గాని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో అధికారులు చేతులెత్తేశారు. ఇదీ చదవండి: మాధవీలతపై వ్యాఖ్యలు..క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి -
నూజివీడు టీడీపీలో చిచ్చురేపిన ఎమ్మెల్యే యార్లగడ్డ వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు జిల్లా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలు.. నూజివీడు టీడీపీలో చిచ్చు రాజేశాయి. వెంకట్రావుపై నూజివీడు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నూజివీడు నియోజకవర్గంపై గాలి వార్తలను ప్రచారం చెయొద్దు.. ఏ ఆధారాలతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం పెట్టారంటూ ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు.ఆధారాలు లేకుండా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మా మనోభావాలను దెబ్బతీశారు. నూజివీడులో అక్రమ మైనింగ్ జరగుతుందని ఎవరికైనా చెప్పారా?. మంత్రి కొలుసు పార్ధసారధి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారా?. ఎమ్మెల్యే యార్లగడ్డ వ్యాఖ్యలు నూజివీడు టీడీపీ నేతలందరినీ అవమానించినట్లుగా ఉన్నాయి. నూజివీడులో అక్రమ మైనింగ్ ఎక్కడ జరుగుతుందో యార్లగడ్డ వచ్చి నిరూపించాలి. మాపై నింద వేసి చేతులు దులిపేసుకోవాలని చూడటం ఎమ్మెల్యే యార్లగడ్డకు సరికాదు. నూజివీడు గురించి మాట్లాడే ముందు మంత్రి పార్థసారధితో మాట్లాడితే బాగుంటుంది’’ అని టీడీపీ నేతలు పేర్కొన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం! -
‘సెంట్రల్ జైలులో గంజాయి మొక్కా.. ఇంతకంటే దారుణం ఉంటుందా?’
విశాఖ: గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగావైఫల్యం చెందిందని వైఎస్సార్సీపీ(YSRCP) ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి(Varudu Kalyani) విమర్శించారు. ఇందుకు నిదర్శనమే విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించడమేనన్నారు. ఒక సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించడం దారణమన్నారు వరుదు కళ్యాణి. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తానని హోంమంత్రి అనిత శపథం చేశారని, ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి సాగు అవుతుందని ధ్వజమెత్తారు.సాక్షి టీవీతో ఆదివారం మాట్లాడిన వరుదు కళ్యాణి.. ‘ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి(Ganja) సాగవుతుంది. మీ వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడం కోసం నెపం ప్రతిపక్షంపై నెట్టడం దుర్మార్గం. ఇది చేతకాని ప్రభుత్వం. విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. గంజాయి నిర్మూలనకు కాకుండా ప్రతిపక్షాలని టార్గెట్ చెయ్యడానికి మాత్రమే పోలీసులను వాడుతున్నారు. అందుకే దుర్మార్గులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్(Crime Rate) పెరిగింది. మహిళలపై దాడులు పెరిగాయి. రాష్ట్రంలోగంజాయిని అరికట్టాల్సిందే’ అని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.రెండు రోజుల క్రితం విశాఖలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రాష్ట్రంలో స్కూల్ విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయని చెప్పారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టడం దారుణం. ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు లక్షలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉంది.వైఎస్సార్సీపీ హయాంలో డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్ తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్ళీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు.ఇది చదవండి: బాబూ.. ఛార్జీలు పెంచడం సంపద సృష్టా?: వరుదు కల్యాణి -
చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసింది?: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. నారా లోకేష్ సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీపై నారా లోకేష్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘‘ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. విద్యా శాఖలో లోకేష్ ఏం సంస్కరణలు చేశారో చెప్పాలి. స్కూళ్లలో డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయా?. ఇంగ్లీష్ మీడియంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉందా?. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. గవర్నమెంట్ బడుల్లో చదివే విద్యార్థులు అంటే చంద్రబాబు ప్రభుత్వానికి చిన్నచూపు’’ అంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి‘‘రాష్ట్రంలో చీటింగ్ ప్రభుత్వం పాలన చేస్తోంది. ఒక్క కేబినెట్ మీటింగ్‌లో కూడా ప్రజా సంక్షేమ పథకాల ఊసులేదు. లక్షా 19 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పటం లేదు. అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పి, ఇప్పుడు ఒక్కటీ అమలు చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేస్తూ ప్రజల గురించి ఆలోచించటం మానేశారు. లోకేష్ మంత్రి అయ్యాక విద్యాశాఖ భ్రష్టు పట్టింది. ఈ రోజు వరకు టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్ల మీద ఖర్చు పెట్టటం తప్పు అని ఎల్లోగ్యాంగ్ మాట్లాడుతోంది..ఇంగ్లీషు మీడియాన్ని పేద పిల్లలకు దూరం చేశారు. లోకేష్ మాత్రం విదేశాల్లో ఇంగ్లీషు మీడియం చదివారు, మా పేదలకు మాత్రం ఇంగ్లీషును దూరం చేస్తున్నారు. చంద్రబాబుకే సంపద సృష్టి తప్ప పేద ప్రజలకు కాదని తేలిపోయింది. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు. దళిత ఉద్యోగులు, అధికారుల మీద కక్షకట్టి చర్యలు తీసుకుంటున్నారు. లోకేష్‌కి మిడిమిడి జ్ఞానం. అందుకే విశాఖకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేయలేదంటూ మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ కోసం స్థల సేకరణ నుండి వాల్తేరు డివిజన్ సాధించటం వరకు వైఎస్సార్సీపీనే పోరాటం చేసి సాధించింది. విశాఖకు మెట్రో రైలు డీపిఅర్ని సిద్ధం చేసింది మా ప్రభుత్వమే. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమలు మా హయాంలోనే వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం గీతం యూనివర్శిటీతో భూములను కబ్జా చేయించింది..రాజధానిలో తాత్కాలిక భవనాలను నిర్మించి దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దేశం మొత్తం మీద పెట్రోలు ధర చిత్తూరు జిల్లాలోనే అధికంగా ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే అధికంగా ధర ఉందంటే అయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లోకి వచ్చి చూస్తే వారి ఆగ్రహం ఎలా ఉందో తెలుస్తుంది’’ అని చంద్రశేఖర్ చెప్పారు. -
ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఏపీ గవర్నమెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. వాలంటీర్లకు నెలకు 10 వేలు జీతం ఇస్తామని చెప్పి విస్మరించారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోలేదు’’ అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు.‘‘కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. చిన్న ఉద్యోగులపై కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. కూటమి వేధింపులు తాళలేక ఐదు మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. వందలాది సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులే. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలి’’ అని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.‘‘పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తారో షెడ్యూల్ ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. వీఆర్ఏలకు తక్షణమే జీతాలు పెంచాలి’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!చీకట్లో మహిళా ఉద్యోగులతో పెన్షన్లను పంపిణీ చేయమంటున్నారు. ఇదేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం?. వేరే ఊరులో ఉండే మహిళా ఉద్యోగులు చీకట్లో వచ్చి ఎలా పెన్షన్లు పంచుతారు?. ఇవ్వకపోతే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో మహిళా ఉద్యోగుల గురించి ఎంతో చెప్పారు. కానీ ఆయన శాఖలోనే ఉద్యోగులకు పనిచేసే వాతావరణం లేదు. ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రభుత్వంలోకి తీసుకుంది. గత ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఉద్యోగ నేతలతో సమావేశాలు నిర్వహించేంది. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. ఈ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో ఉద్యోగులను పట్టించుకోలేదు. కనీసం జీతాలు కూడా సరైన సమయంలో వేయటం లేదుట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల విషయంలో వేధింపులకు దిగుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చేయటంలేదు. పైగా హెల్త్ డిపార్ట్మెంట్లో వెయ్యి మందిని ఉన్నపళంగా తొలగించారు. ఒత్తిడి తట్టుకోలేక నలుగురు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పెద్ద వాలంటీర్లుగా మార్చారు. వందలాది మంది ఉద్యోగులకు షోజాజ్ లు ఇచ్చారు. ఆదివారం కూడా పని చేయమని నోటీసులు ఇచ్చారు’’ అని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. -
మాధవీలతకు ‘జేసీ’ బహిరంగ క్షమాపణ
సాక్షి,అనంతపురం:తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. మాధవీలతపై జేసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జేసీ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో మాధవీలతను ఆయన క్షమాపణలు కోరారు.‘ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ’అని జేసీ అన్నారు. అయితే బీజేపీ నేతలపై మాత్రం జేసీ విమర్శలు కొనసాగించారు.బీజేపీ నేతలంతా ఫ్లెక్సీ గాళ్లు అంటూ మరోసారి ఫైరయ్యారు జేసీ. పవర్ ఉందని మంత్రి సత్యకుమార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తాను మీరకున్నంత నీచున్ని కాదన్నారు.పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. నేను జోలి పడితే కోట్ల రూపాయలు ఇచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీడియా ఎదుట నోట్ల కట్టలు విసురుతూ జేసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: తుస్సుమన్న బాబు,పవన్ హామీ -
వైఎస్సార్సీపీకి ఓటేస్తే దాడులు చేస్తారా?: భూమన
సాక్షి, తిరుపతి: ఏపీలో వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దళితుల ఇళ్లపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేయాడం అమానుషమని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదన్నారు. బాబు అధికారంలో ఉన్న ప్రతీసారీ ఇదే జరుగుతోందన్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘నగరి మండలం తడుకుపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దళితులు ఇళ్లపై దాడి, వాహనాలు ధ్వంసం అమానుషం. చుండూరు, కారంచేడు ఘటనల్ని తలపించేలా తడుకుపేట ఘటన జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులపై కూడా ఇదే తరహాలో దాడులు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదు’ అంటూ బాబు సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు, తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘తడుకుపేట దళితులపై దాడి ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టి కు తీసుకువెళ్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువ అయ్యాయి. దళిత హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మరీ ఇంత ద్రోహమా? ఇంత బరితెగింపా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేతపై కూటమి సర్కార్‌ను నిలదీశారు. లక్షలాది మంది తల్లులు, పిల్లలు.. అన్నదాతలంటే మీకు అలుసా.. అని ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయిందని నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.⇒ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?⇒ అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకు ముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వం అని కేబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?⇒ చంద్రబాబు గారూ.. ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30 వేలు ఇస్తామన్నారు. ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయి.వైఎస్సార్సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఏడెనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వం అని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది.⇒ ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ, ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే.. అంటే 2019 అక్టోబర్‌లో ప్రారంభించి నప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల మంది రైతుల చేతిలో, రూ.34,378 కోట్లు పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీ కూడా అయిపోయింది. ఒక్క పైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్‌లు పెట్టుకున్నాం ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు.. కనీస మద్దతు ధరా అందడం లేదు.. ఉన్న ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు.. ఆర్బీకేలను సైతం నిర్వీర్యం చేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు కదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు. ⇒ ప్రతి పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికీ ఇస్తామన్న తల్లికి వందనం మోసమే. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామన్నదీ మోసమే. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18 వేలు ఇస్తామన్నదీ మోసమే. నిరుద్యోగ భృతి కింద యువతీ యువకులకు రూ.36 వేలు చొప్పున ఇస్తామన్నది కూడా మోసమే. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48 వేలు అయినా మోసమే. ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వలంటీర్లకూ మీరు చేసింది మోసమే. ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కామ్‌లే. ఇసుకను వదలడం లేదు, మద్యాన్నీ వదలడం లేదు. ⇒ చంద్రబాబూ గారూ.. రోజులు గడుస్తున్న కొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తోంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరఫున నిలబడుతుంది. -
రూ.5800 కోట్ల దోపిడీకి కూటమి సర్కార్ కుట్ర: సీదిరి అప్పలరాజు
సాక్షి, పలాస: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకానికి నీరుగార్చడమే కాకుండా తాజాగా హైబ్రిడ్ మోడల్ పేరుతో దాదాపు రూ.6 వేల కోట్ల దోపిడికి కుట్ర చేస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పనంగా చెల్లించే ఆ డబ్బంతా తిరిగి నారా లోకేశ్ జేబుల్లోకే చేరబోతుందని పలాసలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రస్టు మోడల్ కన్నా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న హైబ్రిడ్ మోడల్‌తో ఏం ఉపయోగాలున్నాయో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.సీదిరి అప్పలరాజు ఇంకా ఏమన్నారంటే..దేశానికే తలమానికంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ట్రస్టు మోడల్ నుంచి హైబ్రిడ్ మోడల్లోకి మారుస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఆదాయ పరిమితి ఉన్న 1.43 కోట్ల కుటుంబాలకు రూ.25 లక్షల వరకు రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ సేవలను ఉచితంగా అందించడం జరిగింది.ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం రూ.2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆపై మరో రూ.2.5 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలందిస్తామని చెబుతున్నారు. ఇదే జరిగితే కాంక్లియర్ ఇంప్లాటేషన్, బోన్ మ్యారో సర్జరీ వంటి ఖరీదైన చికిత్సలు పేదవారికి ఉచితంగా అందే పరిస్థితి ఉండదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లైయిమ్లు తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటి? అత్యవసర వైద్యానికి అప్రూవల్ రావడంలో ఆలస్యమైతే ఎవరు బాధ్యులు?ఆరోగ్యశ్రీలో 3257 ప్రోసీజర్లకు వైద్యం అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే హైబ్రిడ్ మోడల్లో, అన్ని ప్రొసీజర్లకు వైద్యం అందుతుందన్న గ్యారెంటీ ఉండదు. ఉచితంగా మందులు ఇవ్వరు. రోగి హెల్త్ ప్రొఫైల్‌ని పరిగణలోకి తీసుకుంటే ఇన్సూరెన్స్ వర్తింపజేయరు. ప్రైవేట్ ఇన్సూరెన్స్‌లో ఉన్న ఇబ్బందులను అధిగమించడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్ట్ మోడల్లో తీసుకొచ్చి వేగంగా వైద్య సేవలందించే విధానం తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు మళ్లీ పాత విధానానికి తీసుకెళ్తున్నారు.ఇదంతా మంత్రి లేదా నారా లోకేష్‌కు సంబంధించిన వారి బీమా కంపెనీ కోసమే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కోసం ఐదేళ్లలో రూ.12,677 కోట్లు ఖర్చు చేయగా.. రాష్ట్రంలో కోవిడ్ సమయంలో వైరస్ బారిన పడ్డ రెండు లక్షల మందికిపైగా బాధితులకు ఉచితంగా చికిత్స అందించి, అందు కోసం మరో రూ.744 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకటించిన హైబ్రిడ్ మోడల్లో ప్రీమియమ్ చెల్లింపులు, రాష్ట్రంలో పథకం లబ్ధిదారులను పరిగణలోకి తీసుకుంటే, దాదాపు రూ.19,218 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో కంటే, చాలా ఎక్కువగా వ్యయం చేస్తూ.. ఇందులో రూ.5,800 కోట్ల దోపిడికి కుట్ర కనిపిస్తోంది.కాగా, ఇప్పుడున్న రేట్ల ప్రకారమే ఇంత అదనంగా వెచ్చిస్తుంటే రాబోయే రోజుల్లో రేట్ల పెంపు పేరుతో మరింత దోపిడీకి పాల్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు జేబులు నింపుకోవడమే సంపద సృష్టి అనుకోవాలేమో!. ఏ పథకం అమలు చేయకుండానే కేవలం జీతాలు చెల్లించడానికి, పింఛన్లు ఇవ్వడానికి ఏడు నెలల్లో రూ.1.19 లక్షల కోట్ల అప్పు చేయడం ఏంటి?. ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులకు, చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదు. ఈ అప్పుల దెబ్బకు రాష్ట్రం శ్రీలంక కాదు. ఏకంగా సోమాలియా అయిపోతుందేమో అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. -
బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: బిగ్ టీవీ, మహాటీవీ కథనాలపై వైఎస్సార్సీపీ మండిపడింది. సబ్ రిజిస్టార్ సింగ్, శ్రీకాంత్ వ్యవహారాలను వైఎస్సార్సీపీ నేతలకు అంటగట్టడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.700 కోట్ల విలువైన భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి.తప్పుడు కథనాలను ప్రసారం చేసిన సదరు చిల్లర ఛానళ్లపై చర్యలకు వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇప్పటికే న్యాయ నిపుణులతో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చర్చించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పీఎస్‌లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు -
పెన్షన్‌దారులపై చంద్రబాబు కక్ష: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పెన్షన్‌దారులపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారని.. అందుకే పెన్షన్లను పెంచినట్టే పెంచి పూర్తిగా కోత పెట్టారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు నిలదీశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీని పూర్తిగా రాజకీయంగా మార్చివేశారని.. వీటన్నిటినీ జన్మభూమి కమిటీల ద్వారా పంపిణీ చేయాలనుకోవటం దారుణం అంటూ దుయ్యబట్టారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రమాణంగా పెన్షన్లు అందించారు. 66,34,740 మందికి పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ఇప్పటికే 3,53,227 మందికి పెన్షన్లను తొలగించారు. ఇంకా తొలగించటానికి కమిటీలను ఏర్పాటు చేశారు. వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షన్లను ఎన్నికల సమయంలో కుట్రతో ఆపించారు. చివరికి వందలాదిమంది పెన్షన్లనను తీసుకోవటానికి వెళ్ళి చనిపోవటానికి చంద్రబాబు కారణమయ్యారు. ఇప్పుడు కొత్తగా కమిటీలు వేసి వెరిఫికేషన్ చేయటం ఏంటి?’’ అని సుధాకర్‌బాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల‘‘మానసిక వికలాంగులు, దివ్యాంగులను చంద్రబాబు మానసికంగా అవమాన పరుస్తున్నారు. 112 బృందాలు పెన్షన్లను తొలగించటానికి జల్లెడ పడుతున్నారు. రాజకీయ కోణంలో ఒక్క పెన్షన్ తొలగించినా న్యాయ పోరాటం చేస్తాం. అర్హత కల్గిన ఏ ఒక్క పెన్షన్ దారునికి ఇబ్బంది కలిగినా సదరు అధికారిపై కూడా కోర్టుకు వెళ్తాం. చంద్రబాబు 2014-19లో కూడా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. 108 అంబులెన్సులకు డీజిల్ కూడా కొట్టించలేదు. వైఎస్ జగన్ వచ్చాక అన్నిటినీ సరిచేశారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీకి పూర్తిగా అన్యాయం చేస్తున్నారు’’ అని సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. -
బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల
గుంటూరు, సాక్షి: ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారని.. కానీ, రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ని గద్దె దించాలని అనుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల (Are Syamala) అన్నారు. కూటమి ప్రభుత్వ హామీల ఎగవేతపై శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘దీపం పథకం ఏమైందో చంద్రబాబు(Chandrababu) చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి. కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నమ్మించి.. మాటిచ్చి.. ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదు. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు. చంద్రబాబూ.. ఇదే నా మీ సంతకం విలువ?. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చు.. .. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారు. తల్లికివందనం(thalliki vandanam) పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారు. లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రామానాయుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పొర్లు దండాలు పెట్టుకుంటూ ఎన్నికల ముందు తిరిగారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు.. హామీలు మాత్రం జనంలో ఇచ్చారు. ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెప్తున్నారు?. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలి. దీపం పథకం కింద ఇవ్వాల్సిన రూ.4,115 కోట్లు ఎగ్గొట్టారు. కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎందుకు అమలు చేయటం లేదు?.. 2025 జనవరి ఫస్టున జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్(Nara Lokesh) ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవు. కూటమి నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసింది. రూ.74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవని ఎలా చెప్తారు?. ‘‘ఇప్పుడు గనుక జగన్ మోహన్‌రెడ్డి ఉండి ఉంటే..’’ అని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ హామీల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది’’ అని స్పష్టం చేశారామె.( ఈ క్రమంలో హామీల పేరుతో ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చేసిన హడావిడిని.. ప్రకటనలను వీడియో రూపంలో శ్యామల మీడియాకు ప్రదర్శించారు.