breaking news
-
బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: బిగ్ టీవీ, మహాటీవీ కథనాలపై వైఎస్సార్సీపీ మండిపడింది. సబ్ రిజిస్టార్ సింగ్, శ్రీకాంత్ వ్యవహారాలను వైఎస్సార్సీపీ నేతలకు అంటగట్టడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.700 కోట్ల విలువైన భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి.తప్పుడు కథనాలను ప్రసారం చేసిన సదరు చిల్లర ఛానళ్లపై చర్యలకు వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇప్పటికే న్యాయ నిపుణులతో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చర్చించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పీఎస్‌లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు -
పెన్షన్‌దారులపై చంద్రబాబు కక్ష: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పెన్షన్‌దారులపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారని.. అందుకే పెన్షన్లను పెంచినట్టే పెంచి పూర్తిగా కోత పెట్టారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు నిలదీశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీని పూర్తిగా రాజకీయంగా మార్చివేశారని.. వీటన్నిటినీ జన్మభూమి కమిటీల ద్వారా పంపిణీ చేయాలనుకోవటం దారుణం అంటూ దుయ్యబట్టారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రమాణంగా పెన్షన్లు అందించారు. 66,34,740 మందికి పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ఇప్పటికే 3,53,227 మందికి పెన్షన్లను తొలగించారు. ఇంకా తొలగించటానికి కమిటీలను ఏర్పాటు చేశారు. వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షన్లను ఎన్నికల సమయంలో కుట్రతో ఆపించారు. చివరికి వందలాదిమంది పెన్షన్లనను తీసుకోవటానికి వెళ్ళి చనిపోవటానికి చంద్రబాబు కారణమయ్యారు. ఇప్పుడు కొత్తగా కమిటీలు వేసి వెరిఫికేషన్ చేయటం ఏంటి?’’ అని సుధాకర్‌బాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల‘‘మానసిక వికలాంగులు, దివ్యాంగులను చంద్రబాబు మానసికంగా అవమాన పరుస్తున్నారు. 112 బృందాలు పెన్షన్లను తొలగించటానికి జల్లెడ పడుతున్నారు. రాజకీయ కోణంలో ఒక్క పెన్షన్ తొలగించినా న్యాయ పోరాటం చేస్తాం. అర్హత కల్గిన ఏ ఒక్క పెన్షన్ దారునికి ఇబ్బంది కలిగినా సదరు అధికారిపై కూడా కోర్టుకు వెళ్తాం. చంద్రబాబు 2014-19లో కూడా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. 108 అంబులెన్సులకు డీజిల్ కూడా కొట్టించలేదు. వైఎస్ జగన్ వచ్చాక అన్నిటినీ సరిచేశారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీకి పూర్తిగా అన్యాయం చేస్తున్నారు’’ అని సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. -
బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల
గుంటూరు, సాక్షి: ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారని.. కానీ, రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ని గద్దె దించాలని అనుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల (Are Syamala) అన్నారు. కూటమి ప్రభుత్వ హామీల ఎగవేతపై శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘దీపం పథకం ఏమైందో చంద్రబాబు(Chandrababu) చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి. కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నమ్మించి.. మాటిచ్చి.. ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదు. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు. చంద్రబాబూ.. ఇదే నా మీ సంతకం విలువ?. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చు.. .. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారు. తల్లికివందనం(thalliki vandanam) పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారు. లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రామానాయుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పొర్లు దండాలు పెట్టుకుంటూ ఎన్నికల ముందు తిరిగారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు.. హామీలు మాత్రం జనంలో ఇచ్చారు. ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెప్తున్నారు?. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలి. దీపం పథకం కింద ఇవ్వాల్సిన రూ.4,115 కోట్లు ఎగ్గొట్టారు. కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎందుకు అమలు చేయటం లేదు?.. 2025 జనవరి ఫస్టున జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్(Nara Lokesh) ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవు. కూటమి నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసింది. రూ.74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవని ఎలా చెప్తారు?. ‘‘ఇప్పుడు గనుక జగన్ మోహన్‌రెడ్డి ఉండి ఉంటే..’’ అని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ హామీల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది’’ అని స్పష్టం చేశారామె.( ఈ క్రమంలో హామీల పేరుతో ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చేసిన హడావిడిని.. ప్రకటనలను వీడియో రూపంలో శ్యామల మీడియాకు ప్రదర్శించారు. -
అరెస్ట్‌పై ప్రశ్నిస్తే కేసులా?.. ఎవర్నీ వదలేది లేదు: కాకాణి హెచ్చరిక
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులే(AP Police) నేరస్థులుగా మారుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘జిల్లాలో పోలీసులే నేరస్థులుగా మారి వెంకట శేషయ్యపై తప్పుడు కేసు పెట్టారు. తనకు సంబంధం లేనట్టు.. జిల్లాకి తాను ఎస్పీ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు చేర్చారు. నేరస్థులను వదిలి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. దీనికి వెంకట శేషయ్య వ్యవహారమే ఉదాహరణ.శేషయ్య అరెస్ట్ వ్యవహారంలో పోలీస్ వ్యవస్థ న్యాయవ్యవస్థను తప్పుదారిలోకి మళ్లించింది. శేషయ్య కేసులో ఎంత ఉప్పు తిన్నారో.. అన్ని నీళ్లు తాగిస్తా.. పోలీసులకు, కూటమి నాయకులకు ఇదే నా హెచ్చరిక. ఈ కేసులో జరిగిన తప్పిదాలను సమాజం ముందు ఉంచుతాం. జిల్లా అధికారులు ఈ కేసులో న్యాయం చేస్తారని మేము భావించడం లేదు. కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఎస్పీ విచారణకు ఆదేశించాలి. నా కళ్ల ముందు జరిగిన వ్యవహారం ఇది. ఇందులో ఎవరినీ వదలం పెట్టేది లేదు. కోవూరులో కొత్త స్టాంపులకు పాత తేదీలు వేశారు. తప్పు చేసిన వారు ఎక్కడున్నా వదలిపెట్టం. శేషయ్య కేసులో జరిగిన లోపాలపై పూర్తి ఆధారాలతో హైకోర్టులోనూ ఫైల్ చేస్తాం. ఇక్కడ పోలీసులపై ప్రైవేట్ కేసు కూడా వేస్తాం అని హెచ్చరించారు. -
టీడీపీ సభ్యత్వ నమోదు పెద్ద డ్రామా: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ(TDP) సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath). పట్టాలు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారని అమర్నాథ్ ఆరోపించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్(nara Lokesh) తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ముచ్చర్లలో 1400 మంది ఓటర్లు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ముచ్చర్లలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్దం. లేనిది ఉన్నట్టు సృష్టించి టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తోంది. ముచ్చర్లలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. గ్రామంలో వైఎఎస్సార్సీపీతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు లేవా?.ముచ్చర్ల గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ పదవులను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 1350 ఓట్లకు గాను టీడీపీకి వైఎస్సార్సీపీకి మధ్య ఓట్ల తేడా 150 ఓట్లు మాత్రమే ఉంది. భీమిలీలో వైఎస్సార్సీపీకి బలమైన కేడర్ ఉంది. 100 శాతం సభ్యత్వం జరిగిందని లోకేష్ ముచ్చెర్ల గ్రామానికి ఎలా వస్తారు?. సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెప్పడం మంచి పద్ధతి కాదు. కొన్ని చోట్ల బెదిరించి సభ్యత్వం నమోదు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల వారికి సభ్యత్వం ఇస్తున్నారు. సంక్షేమ పథకాలిస్తాం.. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు.600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు. గత ఏడు నెలల ప్రవచనాలు చెబుతున్న అనితా గురించి టీడీపీ గెజిట్ పేపర్ ఈనాడులో వచ్చింది. టీటీడీ లెటర్ అమ్ముకునే స్థితికి హోం మంత్రి అనిత పేషీ చేరుకుంది. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు టీటీడీ లెటర్ గురించి ఏం చెబుతారు మరి?. టీటీడీ లడ్డు గురించి రాద్ధాంతం చేసిన నేతలు ఏం చేస్తున్నారు?. మంత్రులు నెల వారీగా వసూళ్లు చేస్తున్నారు అని కామెంట్స్ చేశారు. విశాఖలోని ముచ్చర్లలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు’ అని కామెంట్స్ చేశారు. -
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్‌లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్‌లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్‌గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్‌లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్‌ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్‌కు మొత్తానికి గుర్తుకొచ్చింది!
మొత్తానికి ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు తనకొక రాజకీయ పార్టీ ఉందని.. దానికీ ఆవిర్భావ దినం ఉందని యాదొచ్చింది. ఎంత సేపూ పార్టీని ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కోలా వాడుకోవడం మినహా.. పార్టీ నిర్మాణం.. పధ్ధతి.. దానికొక విధివిధానాలు లేకుండా నడుపుతూ.. పీస్ రేట్.. అంటే చేసినపని డబ్బు తీసుకునే కూలీ లెక్క పార్టీని నడుపుతూ వచ్చిన పవన్ కు ఇన్నేళ్లకు తనకు ఒక రాజకీయ పార్టీ ఉందన్న స్ఫురణకు రావడం గొప్పేనని క్యాడర్ అంటోంది.2014లో జస్ట్ ఎన్నికల ముంది మార్చి 14 న కేవలం చంద్రబాబుకు సాయం చేయడం కోసమే అన్నట్లుగా ప్రారంభమైన ఈ జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. జస్ట్ చంద్రబాబు కు మద్దతు ఇచ్చింది. చంద్రబాబును గెలిపించడమే తన లక్ష్యం అన్నట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో మొత్తానికి బాబును సీఎం చేసారు. అందరినీ ఒడ్డుకు చేర్చి తనుమాత్రం ఒంటరిగా మిగిలిన నావమాదిరి ఉండిపోయిన పవన్ ఆ ఐదేళ్లు.. సినిమాలు చేస్తూ గడిపేశారు. అప్పుడప్పుడు రావడం సినిమా కబుర్లు. స్కిట్లు చేయడం .. అరుపులు కేకలతో గడిపేశారు తప్ప పార్టీని ఏనాడూ నిర్మించలేదు.. అసలు అది అవసరం అనికూడా అనుకోలేదు. ఆ తరువాత 2019లో సింగిల్ గా పోటీ చేసిన జనసేన(Jana Sena) పార్టీ ఘోరమైన దెబ్బతిన్నది. ఆఖరుకు పవన్ సైతం భీమవరం.. గాజువాకలో ఓడిపోయారు.ఆ ఐదేళ్లు అప్పుడప్పుడూ బయటకు రావడం. వకీల్ సాబ్(Vakreel Saab) వంటి సినిమాలు.. ఇప్పటం గ్రామంలో కారుమీదెక్కి రోడ్డు షో.. ఇలాంటివి చేస్తూ టైంపాస్ చేసారు టాప్ పార్టీ రాష్ట్ర.. జిల్లా కమిటీలు ఏమీ వేయలేదు. ఒక్కో ఎలక్షన్ కు ఇలా పార్టీని చంద్రబాబుకు అప్పగిస్తూ వెళ్తే పోయేదానికి పార్టీ నిర్మాణం ఎందుకు అనుకున్నారో ఏమో ఎన్నడూ ఆ విషయాన్నీ ఆలోచించలేదు. అసలు ఆపార్టీలో పవన్, నాదెండ్ల మినహా ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి.. కానీ మొన్నటి 2024 ఎన్నికల సమయంలో నాగబాబు(Nagababu) మాత్రం ప్రధానకార్యదర్శి పేరిట హడావుడి చేయడం.. క్యూ ఆర్ కోడ్ చూపించి చందాలు వసూలు చేసారు తప్ప ఎక్కడా పార్టీ గురించి చర్చలేదు. పార్టీకి ఒక పధ్ధతి.. విధానం లేకున్నా ఇన్నాళ్లు నడిపేసినా.. ఇప్పుడు ఎట్టకేలకు.. అధికారం వచ్చాక పార్టీ గుర్తొచ్చినట్లుంది. మార్చి 12, 13,14 తేదీల్లో పార్టీ ప్లీనరీ.. ఆవిర్భావదినం పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. అంటే పార్టీ పెట్టిన పదేళ్లకు ప్లీనరీ నిర్వహిస్తారా ? అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు.. పార్టీ గుర్తొచ్చిందా..? అనే సౌండ్ వినిపిస్తోంది.పోనీ ఇప్పుడైనా పార్టీకి జిల్లా రాష్ట్ర కమిటీలు వేస్తారా.. ఎమ్మెల్యే టిక్కెట్లు రానివాళ్లు.. గత పదేళ్లుగా పార్టీని కనిపెట్టుకుని ఉంటున్నవాళ్లకు గుర్తింపు ఉంటుందా .. కేవలం పవన్ భజనకు మాత్రమే ఈ ప్లీనరీ నిర్వహిస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి ఏదైతేనేం పవన్ కు పార్టీ గుర్తొచ్చిందనే కామెంట్లు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి.. :::సిమ్మాదిరప్పన్న -
‘చంద్రబాబుగారూ.. ఇంతటి బరితెగింపా?’
గుంటూరు, సాక్షి: హామీల అమలులో అలసత్వం.. నిర్లక్ష్యం.. ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేత కూటమి సర్కార్‌ను నిలదీస్తూ ఎక్స్ ఖాతాలో ఆయన సుదీర్ఘంగా ఓ సందేశం ఉంచారు. ‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?. అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు... వరుసగా కేబినెట్(Cabinet) సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?. చంద్రబాబుగారూ… ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయి. వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచంలేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…?.. ఇక రైతు భరోసా(Rythu Bharosa) తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కాని, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు మేము పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీకూడా అయిపోయింది. ఒక్కపైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్‌లు పెట్టుకున్నా… ఎప్పుడు ఇస్తామో చెప్పడంలేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు, ఆర్బీకేలను నిర్వీర్యంచేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు... ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే, ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాంలే. ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదు. చంద్రబాబుగారూ.. రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుంది’’ అని పేర్కొన్నారాయన. చదవండి👉: బలవంతంగా ఏపీ రాజకీయాలను అందులో ఇరికించారా? -
MLA Vs Ex MLA: టీడీపీలో ఆధిపత్య పోరు!
సాక్షి, అనంతపురం: అనంతపురంలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ పోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఓ స్థలం విషయంలో వీరి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. జిల్లాలో ప్రభుత్వ భూమి విషయంలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. అయితే, అనంతపురం అర్బన్ నియోజకవర్గం రాజీవ్ కాలనీలో మూడు ఎకరాల వంకపోరంబోకు స్థలాన్ని టీడీపీ నేతలు ఆక్రమించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులపై దాడి చేసి స్థలం ఖాళీ చేయించారు. అనంతరం, ప్రభుత్వ వంకపోరంబోకు స్థలంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు పాగా వేశారు. దీంతో, టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరస్పరం దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో దగ్గుపాటి ప్రసాద్ మోసం చేశారంటూ మరో వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని సమాచారం. -
హోంమంత్రి అనిత పీఏ అవినీతి దందా
సాక్షి, అనకాపల్లి: ఏపీలో హోం మినిస్టర్ వంగలపూడి అనిత పేషీలో అవినీతి దందా కొనసాగుతోంది. మంత్రి అనిత అండతో పీఏ జగదీష్ అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో, జగదీష్ అంశం చర్చనీయాంశంగా మారింది.ఏపీ హోం మంత్రి అనిత పీఏ జగదీష్ అవినీతి దందా బయటపడింది. అనిత అండతో జగదీష్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందంటూ టీడీపీ నేతలే ఫిర్యాదులు చేయడం గమనార్హం. చివరికి టీటీడీ సిఫార్సు లేఖలను కూడా జగదీష్ అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి.అలాగే, పేకాట శిబిరాల వద్ద వసూళ్లు, మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఒత్తిడి తేవడం. ఉద్యోగుల బదిలీల్లో లక్షల వసూలు చేశారని విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతలనే తప్పుడు కేసుల్లో జగదీష్ ఇరికించినట్టు తెలుస్తోంది. మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించేవారని సమాచారం. ఎన్ని విమర్శలొచ్చినా అనిత ఆయన్ను పీఏగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. -
నగరిలో పచ్చ బ్యాచ్ ఓవరాక్షన్.. రోజా సీరియస్
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం అండతో పచ్చ బ్యాచ్ రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా నగరిలో టీడీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు.వివరాల ప్రకారం.. చిత్తూరులోని నగరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. నగరి పట్టణంలో మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా సహా కార్యకర్తలు ఉన్న ఫ్లైక్సీలని చించేసి పైశాచిక ఆనందం పొందారు. ఇక, ఘటనపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లైక్సీలు చించేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
అచ్చెన్నాయుడు తమ్ముడికి బంపర్ ఆఫర్
సాక్షి, విజయవాడ: అచ్చెన్నాయుడు తమ్ముడికి చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు కూటమి ప్రభుత్వం మళ్లీ ఉద్యోగం ఇచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు తమ్ముడు ప్రభాకర్ కొద్ది రోజుల కిందటే పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే.అయితే, కింజరాపు ప్రభాకర్‌ను ఓఎస్డీగా నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంంట్లో ఓఎస్డీగా నియామకం చేసింది. విజిలెన్స్ కేసులతో కక్ష సాధింపు కోసమే కింజరాపు ప్రభాకర్‌ని సర్కార్ నియమించిందనే ఆరోపణలు ఉన్నాయి.ఇదీ చదవండి: టార్గెట్ సజ్జల.. ఎల్లోమీడియాపై భగ్గుమన్న వైఎస్సార్సీపీ -
పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!
‘ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పొతే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. పక్కనోడి పనిలో తలదూర్చి, అతన్ని ఇబ్బంది పెట్టి, ఆయన పనిని ఆయన చేయనివ్వకుండా, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా చేస్తే ఫలితాలు తారుమారు అవుతాయి’.. కొరటాల చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. కట్ చేస్తే.. దర్శకుడు శంకర్ కూడా ఇప్పుడు అదే ఫీలింగ్‌లో ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.శంకర్ షణ్ముగం.. టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న దర్శకుల్లో ఒకడు. అందులో ఎలాంటి డౌటు అక్కర్లేదు. కానీ, రైటర్ సుజాత(ఎస్.రంగరాజన్) మరణంతో ఆయనకు కుడి భుజం పోయినంత పనైంది. అప్పటిదాకా సెన్సేషన్ బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. ఘోరంగా తడబడుతూ వరుస ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది. అలాంటి బ్యాడ్ ఫేజ్‌లో విజయ్‌తో సినిమా తప్పింది. ఆపై వెంటనే రాం చరణ్‌తో సినిమా అనౌన్స్ అయ్యింది. గుడ్. శంకర్ సినిమా అంటే కేవలం పాటలకే కోట్లు ఖర్చవుతుంది. మరి అంత భరించే నిర్మాత ఎవరు?. వెంటనే తెరపైకి వెంకట రమణారెడ్డి(దిల్ రాజు) పేరొచ్చింది. వెరీ గుడ్. ఈ మధ్య శంకర్ సినిమాల్లో సుజాత టచ్ లేకపోవడంతో కథలతో పాటు డైలాగుల్లోనూ డెప్త్ లేకుండా పోయింది. అందుకోసం చిరు, బాలయ్య, పీకేలాంటి స్టార్లకు డైలాగులు రాసే సాయి మాధవ్ బుర్రాను తీసుకున్నారు.. వెరీ వెరీ గుడ్. శంకరే స్వయంగా అడిగాడో లేకుంటే శంకర్ మీద నమ్మకం లేకపోవడం వల్లనో మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రాసిన కథతో సినిమా తీసేశారు. ప్చ్.. ఇక్కడ కట్ చేస్తే..సాధారణంగా తాను ఎంత గ్రాండ్‌గా సినిమా తీసినా రెండు, మూడేళ్లకు మించి టైం తీసుకోడు శంకర్(Director Shankar). అలాంటిది గేమ్ ఛేంజర్ కోసం నాలుగేళ్ల టైం తీసుకున్నారు. 2021 సెప్టెంబర్ టైంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలైతే.. 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అయితే ఈ గ్యాప్‌లో ఇండియన్-2, ఇండియన్-3లపై కూడా ఆయన పని చేయడం.. అంతకు ముందు 2.0 తర్వాత ఆరేళ్ల గ్యాప్ రావడంతో లెక్క సరిపోయిందనుకుందాం. మరి 2024 సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన గేమ్ ఛేంజర్.. ఎందుకు పోస్ట్‌పోన్ అయినట్లు?. ఎంత పోస్ట్ ప్రొడక్షన్ పనులైనా, ఇతరత్ర కారణాలైనా.. మరీ ఏడాదిపాటు టైం పడుతుందా?. గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడంటూ ఆ మధ్య రేగిన పుకార్లు కొంపదీసి నిజం కాదు కదా?. .. టీఎఫ్ఐ(TFI)లో జరిగే పరిణామాలపై సోషల్‌మీడియాలోనూ, సగటు సినీ అభిమానుల్లోనూ ఓ చర్చ నడుస్తుంటుంది. కథ దగ్గరి నుంచి హీరోయిన్ల ఎంపిక, ఆఖరికి దర్శకత్వంలోనూ కొందరు హీరోలు, పెద్దలు వేలు పెడుతుంటారని!. నిప్పు లేనిదే పొగ రాదు కదా. అయితే గేమ్ ఛేంజర్‌కు అదనంగా ‘రాజకీయ జోక్యం’ తోడైందన్న అనుమానాలు చిత్ర ట్రైలర్ చూశాక కలగకమానదు.గేమ్ ఛేంజర్(Game Changer) ఓ పొలిటికల్ థ్రిల్లర్ అనే విషయం ట్రైలర్ చూస్తే ఎవరి అర్థమైపోతుంది. అయితే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో చిత్ర నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్లు ఆసక్తికరంగా.. అంతే అతిగా అనిపించాయి కూడా. శంకర్ ఎప్పుడో నాలుగేళ్ల కింద రాసుకున్న కథలో సీన్లు.. ఏపీ రాజకీయాల్లో రియల్‌గా జరిగాయట!. వాటినే తెర మీద ఆడియొన్స్ చూడబోతున్నారట. రాజకీయ పార్టీ స్థాపన, ఈవీఎంల అంశం, పొలిటికల్ నేతల పేర్లు, ఎన్నికల్లో గెలుపు, రేషన్ బియ్యం, అవినీతి మీద పోరాటమంటూ డైలాగులు.. ఇవన్నీ పరిణామాలు ఈ మధ్య ఏడాదికాలంలో చూసినవే కదా!. వీటిల్లో పవన్ రిఫరెన్స్‌లు, పైగా ఏపీ కూటమికి సరిపోయేవే ఉన్నాయి కదా. అలాంటప్పుడు తనది కాని కథలో శంకర్ ఇవన్నీ నాలుగేళ్ల కిందటే ఎలా జొప్పించి ఉంటాడంటారు?. ఇవి ఎవరినో ప్రత్యేకంగా మెప్పించడానికి జొప్పించినట్లు లేదు!.పోనీ.. దిల్ రాజ్(Dil Raju) అతిశయోక్తికి పోయి ఆ కామెంట్ చేసి ఉంటాడు అనుకున్నా.. రేపు థియేటర్లలో సినిమా చూసే ఆడియొన్స్‌కు అర్థం కాదని అంటారా?. ఏది ఏమైనా తెలంగాణలో ఎఫ్డీసీ చైర్మన్‌గా ఉన్న దిల్‌రాజు.. రాజకీయాల కోసం సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దంటూ కోరడం, అదే సమయంలో ఏపీకి వెళ్లి మరీ పవన్‌ను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇక ఎలాగూ ఏపీలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ హాజరుకానున్నారు. ఆ ఈవెంట్లో పొలిటికల్‌గా జాకీలు పెట్టి లేపే ప్రోగ్రాం ఉండక పోదు!. ఇదంతా చూస్తుంటే.. ‘‘జనానికి ఇప్పుడు నీ అవసరం ఉంది. పగిలేకొద్దీ గ్లాసు పదునెక్కుద్ది’’ తరహా సంభాషణల్లాగే.. గేమ్ ఛేంజర్‌లో ‘సీజ్ ద షిప్’ లాంటి రిఫరెన్స్‌లు, డైలాగులు వగైరాలాంటివి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇవన్నీ ఎందుకు అసలు సినిమానే ఆయనతో తీసి ఉంటే సరిపోయేది కదా!. -
పల్నాడు జిల్లాలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ మూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: టీడీపీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. పిడుగురాళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ శివపై దాడి చేశారు. మా ప్రభుత్వ హయాంలో మీరు బయట తిరగడమేంటి అంటూ ఈర్ల శివపై టీడీపీ నేత ఇంతియాజ్ అనుచరులు చెలరేగిపోయారు. టీడీపీ శ్రేణుల దాడిలో శివ తీవ్రంగా గాయపడ్డారు.ఎంపీటీసీపై టీడీపీ నేత దాడిశ్రీకాకుళం జిల్లా: గ్రామ సభలో ఎంపీటీసీపై టీడీపీ నేత దాడి చేశారు. సంత బొమ్మాలి మండలం నౌపాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామ సభలో మాట్లాడుతున్న ఎంపీటీసీ సుధాకర్‌పై టిడిపి నేత వాడపల్లి కృష్ణారావు దాడికి దిగారు.బాధితుడు ఎంపీటీసీ సుధాకర్ మాట్లాడుతూ, పంచాయతీ సెక్రటరీ గ్రామసభకు ఆహ్వానించడంతోనే తాను అక్కడికి వెళ్లానని.. సభలో సమస్యలపై మాట్లాడుతుండగా కృష్ణారావు దాడి చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీవి కనుక తనకు సభలోకి వచ్చే అర్హత లేదంటూ టీడీపీ నేత హెచ్చరించారని.. నా చొక్కా చింపేసి... ఇక్కడ కూర్చునేందుకు కూడా అర్హత లేదంటూ దుర్భాషలాడారని సుధాకర్ తెలిపారు. -
అప్పుల్లో ఏపీని అగ్రగామి చేయడం బాబు టార్గెట్: చెల్లుబోయిన
సాక్షి, రాజమహేంద్రవరం: దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి పచ్చి మోసగాడు మరొకరు కనిపించరు అని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ నమ్మక ద్రోహం, మోసాలతోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు తుది వరకు అదే పంథాను కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిసారీ ప్రజలను నట్టేట ముంచడం అలవాటుగా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు. తాజాగా జరిగిన కేబినెట్ లో అయినా సూపర్ సిక్స్ అమలుపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించినా, మళ్లీ ప్రజలకు మొండిచేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... మళ్ళీ, మళ్ళీ మోసం చేయడానికే..కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు చర్యలు తీసుకుంటాని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు 12 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వపరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో సూపర్ సిక్స్ కు సంబంధించినవి లేవు. తాజాగా గురువారం కూడా కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అయినా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలపై ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఎదురుచూశారు. మళ్ళీ, మళ్ళీ మోసం చేయడమే అలవాటుగా చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు కూడా ప్రజలను నిరాశలోనే ముంచేశాడు.హామీలు అమలు చేయలేక భయం అంటున్నారుసూపర్ సిక్స్ తో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తామని గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీలు గుప్పించాయి. మీ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే, అధికారంలోకి వచ్చిన మీరు వారిని దారుణంగా మోసగించారు. చంద్రబాబు అనుభవం ప్రజలను మోసం చేయడానికే పనికి వస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ అమలుపై అసెంబ్లీ సాక్షిగా వాటిని అమలు చేయాలంటే నాకు భయం వేస్తోందంటూ చంద్రబాబు చెప్పాడు. ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఇచ్చే హామీలు సాధ్యమవుతాయా లేదా అనే విషయం ఇంత అనుభవం ఉన్నా చంద్రబాబుకు తెలియదా?నవరత్నాలను ప్రకటించి చిత్తశుద్దితో అమలు చేశాంఆనాడు జగన్ గారు ప్రజల కోసం నవరత్నాలను ప్రకటించారు. దాని అమలుకు ఒక క్యాలెండర్ ను ప్రకటించి మరీ ప్రజలకు అందించారు. ప్రజలకు సాయం అందించడంలో ఆయన చిత్తశుద్దితో కృషి చేశారు. దానిపైన కూటమి పార్టీలు అసత్య ప్రచారాలు చేశాయి. జగన్ గారి సంక్షేమం వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంకగా మారిందంటూ విమర్శించారు. జగన్ ప్రజల కోసం అప్పులు చేస్తే తప్పు అని అన్న చంద్రబాబు ఈ ఆరు నెలల్లోనే 1.19 లక్షల కోట్ల అప్పులు చేశారు. కానీ ప్రజలకు ఒక్క రూపాయి కూడా తన హామీల మేరకు ఖర్చు చేయలేదు. ఇది ఒప్పు అని ఎలా సమర్థించుకుంటారో చంద్రబాబు చెప్పాలి. జగన్ గారి ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్ నెలలో విద్యార్ధులకు వసతిదీవెన, పొదుపుసంఘాలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యాదీవెన, వైయస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతుభరోసా, మత్స్యకారభరోసా, జూన్ నెలలో అమ్మ ఒడి, జులై నెలలో విద్యా దీవెన, నేతన్న నేస్తం, సెప్టెంబర్ నెలలో చేయూత, అక్టోబర్ నెలలో రైతు భరోసా, నవంబర్ లో విద్యాదీవెన, రైతులకు సున్నావడ్డీ రుణాలు, డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలను క్రమం తప్పకుండా అమలు చేశారు.హామీల ఎగవేతకే జగన్ పాలనపై విమర్శలుప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగవేయాలనే ధోరణితో జగన్ గారి పాలనపై విమర్శలు చేస్తూ, పాలనను గాలికి వదిలేశారు. నా అనుభవంతో సందపను సృష్టిస్తాను, సంక్షేమాన్ని సృష్టిస్తాను అని హామీలు గుప్పించాడు. నాడు జగన్ గారు అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించి, విజయవంతంగా అమలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు దానిని కాపీ కొడుతూ తల్లికి వందనం అనే పథకాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల కాలంలో ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు ఎందుకు కలగలేదు? పైగా ఈ ఏడాది తల్లికి వందనంకు మంగళం పాడుతూ, వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తాంటూ తాజా కేబినెట్ సమావేశంలో తీర్మానించడం ఖచ్చితంగా ప్రజలను మోసగించడమే.వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపైనా అబద్దాలుచంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ను తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాక్షిగా గత ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 7.40 లక్షల కోట్లు అన్ని చెప్పారు. దీనిలో 2014-19 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులే రూ.4.50 లక్షల కోట్లు ఉంది. ఈ లెక్కలన్నీ మీ మంత్రులే చెప్పారు. మోసమే మీ ఎజెండాగా పనిచేస్తున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఘనుడు చంద్రబాబుప్రశ్నించాల్సిన సామాజిక మాధ్యమాలను సైతం ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. వ్యవస్థలన మేనేజ్ చేయడం అలావాటుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఒక్కో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై వేర్వేరు పోలీస్ స్టేషన్ లలో పదుల సంఖ్యలో అబద్దపు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు.కేబినెట్ లో హామీల అమలుపై చర్చ ఏదీ?సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కార్ ఎగనామం పెడుతోంది. నిన్న కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇదే నిజం అని అర్థమవుతోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నిధి, ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగభృతి ఇలా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఈ ఏడాది అమలు చేయడం లేదనే అంశాన్ని మీ కేబినెట్ సమావేశం వల్ల తెట్టతెల్లమయ్యింది. సీఎం చంద్రబాబు ఈ ఏడాది తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల 87.42 లక్షల మంది విద్యార్ధులు ఒక్క ఏడాదికే రూ. 13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టబడి సాయం అందకపోవడంతో రూ.10,000 కోట్ల మేర నష్టపోయారు. గత ఏడాది కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 సాయంను కూడా రైతులకు అందించలేదు. ఈ బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ కోసం కూటమి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ. వెయ్యి కోట్లు మాత్రమే. కోటి మందికి పైగా నిరుద్యోగులకు భృతి ఇస్తామని అన్నారు. 1.80 కోట్ల మంది ఆడబిడ్డలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. ఇవ్వన్నీ మోసం కాదా?అమ్మ ఒడి ఆగిపోయింది... తల్లికి వందనం మాయమయ్యిందిపేదరికం చదువులకు అడ్డు కాకూడదని, పేదింటి తలరాతలు మార్చేశక్తి విద్యకే ఉందని దృఢంగా నమ్మిన మాజీ సీఎం వైయస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ప్రతి తల్లి ఖాతాలో దాదాపుగా రూ. 26,000 కోట్లు జమ చేశారు. 73 వేల కోట్లతో నాడు-నేడు ద్వారా విద్యాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. తతల్లికి వందనం వస్తుందని పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన తీరు గ్రామాల్లో తిరిగితే తెలుస్తుంది. ఎంతమంది స్కూలుకు వెళ్ళే పిల్లలు ఉంటే, ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్న చంద్రబాబు హామీ ఏమయ్యింది. రైతులు అప్పుల పాలు కాకూడదని పెట్టుబడి సాయంను అందించి జగన్ గారు దేశానికే ఆదర్శమయ్యారు. రైతుభరోసాను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రకటించింది. కానీ అమలు మాత్రం పట్టించుకోవడం లేదు. రైతుకు విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా జగన్ గారి ప్రభుత్వం అండగా నిలిచింది.మహిళలను నిలువునా దగా చేశారురాష్ట్రంలో 19-59 సంవత్సరాల లోపు మహిళలకు ఏడాదికి రూ.18వేలు ఇస్తామనని హామీ ఇచ్చి, దారుణంగా మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.80 కోట్ల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం ఈ కేబినెట్ లో అయినా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం దారుణం. ఉచిత గ్యాస్ కింద ఏడాదికి మూడు సిలెండర్లు ఇస్తామని చెప్పి కేవలం ఒక సిలెండర్ తోనే మాయ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4వేల కోట్లు అవసరం. కానీ ఈఏడాది బడ్జెట్ లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటదాయించింది.మత్స్యకార భరోసా మాయంగత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థికసాయానికి చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో 1.30 లక్షల మత్స్యకారులు ఇప్పటికే రూ.260 కోట్లు నష్టపోయారు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో సాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు చెబుతున్నారు. అయితే పథకం అమలు పై ఖచ్చితమైన ప్రతిపాదనలు, నిర్ణయాలు మాత్రం జరగలేదు. విధివిధానాలను ఖరారు చేయలేదు.బాబుగారి మాటలకు భావాలు వేరుఅన్ని వర్గాలను కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసగించింది. చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. బాబుగారి మాటలకు భావాలే వేరు. ఆయన ఏదైనా చెప్పారంటే, ఖచ్చితంగా అది చేయరు అని అర్థం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను నిస్సిగ్గుగా మరిచిపోయి మాట తప్పుతోంది. దీనిని వైయస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. మొన్న రైతుల పక్షాన నిలబడ్డాం. ప్రజలపై దారుణంగా పెంచిన విద్యుత్ చార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమించాం. రేపు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం పోరాడతాం. ప్రజల గొంతుకగా వైయస్ఆర్ సీపీ నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు పాలకుల మీద ఉన్న నమ్మకం సడలిపోతే ప్రజాస్వామ్యానికే విఘాతం కలుగుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి -
టార్గెట్ సజ్జల.. భగ్గుమన్న వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వ(Kutami Prabhutvam) ప్రతీకార పాలన కొనసాగుతోంది. నిత్యం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ఆరోపణలు, తప్పుడు కేసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో తాజాగా.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకుని ఎల్లో మీడియాతో అడ్డగోలు కథనాలను అచ్చేయిస్తోంది.సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కడప జిల్లా సీకేదిన్నె మండల పరిధిలోని అటవీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలను కూటమి అనుకూల మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. అయితే ఈ కథనాలపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. కబ్జా కథనాలను తీవ్రంగా ఖండించింది. ‘‘అసలు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదు. ఆ మీడియా చానెల్స్ చెప్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమికూడా సజ్జల రామకృష్షారెడ్డికి లేదు. అలాంటప్పుడు కబ్జా అన్న ప్రశ్నే తలెత్తదు. 1995 ప్రాంతంలోనే అంటే ఇప్పటి చంద్రబాబు(Chandrababu) అప్పుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఇక్కడ పనికిరాని భూములను సజ్జల, ఆయన సోదరులు కొనుగోలుచేశారు. మామిడితోటలు వేశారు. దీనికి దాదాపు పదేళ్ల తర్వాత సజ్జల రామకృష్షారెడ్డి తన వాటా భూములను సోదరులకు విడిచిపెట్టారు. అప్పటినుంచీ ఆయనకు ఆ భూములతో ఆయనకు సంబంధం లేదు. ఇది జరిగినప్పుడు ఆయన రాజకీయాల్లోకూడా లేరు.2014లో ఫారెస్ట్, రెవిన్యూ విభాగాల మధ్య ఈ ప్రాంతంలో మొత్తం భూముల విషయమై వివాదం నెలకొంది. ఫారెస్ట్ కిందకు వస్తుందని అటవీశాఖ, ఆ ప్రసక్తే లేదని రెవిన్యూశాఖలు తలోరకంగా చెప్తున్నాయి. ఇరుశాఖలకు మొత్తం రికార్డులు కూడా సజ్జల సోదరులు అప్పగించారు. సంయుక్తంగా సర్వే చేసి ఏదో విషయం తేల్చాలని సజ్జల సోదరులే పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు.కేవలం సజ్జల రామకృష్షారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే లక్ష్యంగా ఎల్లోమీడియా ప్రయత్నిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై సజ్జల న్యాయపరమైన చర్యలకు దిగుతున్నారు’’ అని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. -
అంతా మీ ఇష్టమా?.. మంత్రి సత్యకుమార్‌ను నిలదీసిన టీడీపీ నేత!
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి పాలనలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పలుచోట్ల కూటమి నేతలను సొంత పార్టీ నేతలే ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. తాజా మంత్రి సత్యకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంత్రిని టీడీపీ నేత ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.గుంటూరులో మంత్రి సత్యకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్‌పై మంత్రిని టీడీపీ నేత నిలదీశారు. మెడికల్ కాలేజీల్లో ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సిలింగ్ ఎలా పెడతారని సదరు నేత ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్సిటీలో ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. అయితే, సత్య కుమార్ మాత్రం విద్యార్థులు పేరెంట్స్ మాట్లాడుతున్నప్పటికీ వారి మాటలను పట్టించుకోకుండా మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
తల్లికి వందనం పేరుతో బాబు వెన్నుపోటు: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రాష్ట్రంలో స్కూల్ విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయని చెప్పారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టడం దారుణం. ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు లక్షలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉంది.వైఎస్సార్సీపీ హయాంలో డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్ తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్ళీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. -
కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ప్రభాకర్ రెడ్డికి కాషాయ పార్టీ నేతలు కౌంటరిచ్చారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ పార్టీ కంట్రోల్ చేయాలని బీజేపీ నేత హితవు పలికారు.తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇక, అంతకుముందు ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.అలాగే, అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగి ఉంటుందని ట్రావెల్స్ మేనేజర్ అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, గురువారం రాత్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం బస్సు ప్రమాదం కుట్రపూరితంగా జరిగినట్లు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్లైయాష్ వివాదమే కారణమా? నిజానికి.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య ఇటీవల తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీళ్లిద్దరి పంచాయతీ సీఎం వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రభాకర్‌రెడ్డి విమర్శించి ఉండవచ్చునని తెలుస్తోంది. -
బాబు వైఫల్యాలు.. ఒప్పేసుకున్న ఎల్లో మీడియా!
ఏడంటే ఏడు నెలలు.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఏపీ ప్రజలకు అర్థమయ్యేందుకు పట్టిన సమయం ఇది!. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం పెట్టేస్తామన్నట్టుగా సాగిన కూటమి నేతల ప్రచారం ఆచరణకు వచ్చేసరికి పాతాళానికి చేరిన సంగతి తెలిసిందే. ఇదేదో వైసీపీ అనుకూల మీడియా చెబుతున్న విషయం కాదు.. అక్షరాలా టీడీపీ అనుకూల పచ్చ పత్రిక ‘ఈనాడు’ నిగ్గుదేల్చిన వాస్తవం. ఈ కథనంలోనే వైఎస్ జగన్ సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతున్నా.. ఆ మాట నేరుగా చెప్పేందుకు మాత్రం ఈనాడు వారికి నోరు రాకపోయింది!వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. మరో శ్రీలంక అవుతోందని ఈనాడు తన కథనాల ద్వారా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. మా బాబు అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తారని కూడా ఈ మీడియా ఊదరగొట్టింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోంది. సంక్షేమ పథకాల అమలు సంగతి అలా ఉంచండి.. చేసిన అప్పులే కొండంతయ్యాయి!. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేరకు ఆదాయం రాకపోవడం వల్లనే అని కలరింగ్ ఇచ్చేందుకు ఈనాడు ప్రయత్నించి ఉండవచ్చు కానీ.. బాబు నిర్వాకాల పుణ్యమా అని ఏపీ ఇప్పుడు నిజంగానే శ్రీలంక స్థాయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? అన్న అనుమానాలైతే చాలామందిలో వ్యక్తమవుతున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకు ఆదాయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి హయాంలో ఆదాయం తగ్గడమే కాకుండా.. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ అంకెలకు మధ్య తేడా కూడా ఎక్కువైంది. అయితే, ఈనాడు తన కథనంలో వైఎస్ జగన్ హయంలోని అంకెలను ప్రస్తావించకుండా బాబుకు జాకీలేసే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేనలు రెండూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు. రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికార భాగస్వామి. ఇన్ని అనుకూలతలున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు జగన్ కాలం కంటే (రూ.22,213 కోట్లు) తక్కువగా (రూ.9703 కోట్లు) ఉండటం గమనార్హం. దీన్ని బట్టే బాబు కేంద్రంలో తిప్పుతున్న చక్రం వేగం ఏపాటిదో అర్థమైపోతుంది.రాష్ట్రంలో భూముల విలువలు తగిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, తాను అధికారంలోకి వస్తే భూముల విలువలు అమాంతం పెరిగిపోతాయని బాబు ఎన్నికలకు ముందు చెప్పేవారు. టీడీపీ మీడియా, పార్టీ నేతలు ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. జనం చాలా వరకూ నమ్మారు కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత చూస్తే.. ఈ ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అమ్మకాల ద్వారా వచ్చిన రాబడి రూ.5,438 కోట్లు మాత్రమే. గత ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం రూ.6306 కోట్లుగా ఉంది.చంద్రబాబు కలల రాజధాని అమరావతిలోనూ భూమి ధరలు పెరగలేదు. దాంతో కంగారుపడుతున్న చంద్రబాబు అండ్ కో.. హైప్ క్రియేట్ చేయడానికి ఏకంగా రూ.31 వేల కోట్ల మేర అప్పులు తెచ్చి ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం అప్పులు కూడా సమీకరిస్తున్నారు. అమ్మకం పన్ను రాబడి కూడా గత ఏడాది కన్నా సుమారు వెయ్యి కోట్లు తగ్గింది. తాజాగా వచ్చిన జీఎస్టీ లెక్కలు చూస్తే 2023 డిసెంబర్లో 12 శాతం వృద్ధి ఉంటే, 2024 డిసెంబర్లో అంటే కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ మైనస్ ఆరు శాతంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం సమయంలో మూలధన వ్యయం నవంబర్ నాటికి రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, చంద్రబాబు పాలనలో అది కేవలం రూ.8329 కోట్లు ఉంది. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఏం సంపద సృష్టించారో అర్థం కాదు.ఇలా ఏ రంగం చూసుకున్నా వైఎస్ జగన్ ప్రభుత్వంతో పోల్చితే చంద్రబాబు హయంలో ఆర్థిక నిర్వహణ నాసిరకంగా ఉందని అంకెలు చెబుతున్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని టీడీపీ కూటమి ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అవే అబద్దాలను వల్లె వేస్తుంటుంది. ఈనాడు కథనంలో ఇచ్చిన బడ్జెట్ అంకెలను పరిశీలిద్దాం.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13,500 కోట్ల రాబడి అంచనా వేస్తే కేవలం రూ.5438 కోట్లే వచ్చాయి. మిగిలిన నాలుగు నెలల్లో రూ.8వేల కోట్ల ఆదాయం రావడం కష్టమే. అమ్మకం పన్ను ద్వారా రూ.24,500 కోట్లు వస్తాయని లెక్కేస్తే ఇప్పటివరకూ వచ్చింది ఇందులో సగం కంటే తక్కువగా రూ.11303 కోట్లే మాత్రమే. అలాగే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.25,587 కోట్ల ఆదాయాన్ని బడ్జెట్ అంచనాగా చూపారు. ఇప్పటివరకూ వసూలైంది రూ.13154 కోట్లు!. కేంద్ర పన్నులలో వాటా రూ.35 వేల కోట్లని చెప్పారు. వాస్తవంగా అందింది.. రూ.22వేల కోట్లు. ఇతర పన్నులు, సుంకాలు రూ.8645 కోట్లు అంచనా ఆదాయమైతే, నికరంగా లభించింది రూ.3483 కోట్లు మాత్రమే. భూమి శిస్తు మాత్రం రూ.57 కోట్ల అంచనాలకు రూ.194 కోట్లు వచ్చాయి. ఈ కథనం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. అప్పట్లో రూ.47 వేల కోట్లు ఉంటే, అది 2024 నవంబర్ నాటికి రూ.56 వేల కోట్లకు చేరుకుంది. ఇదన్నమాట చంద్రబాబు సృష్టించిన సంపద.రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికి రూ.1.12 లక్షల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం మినహా సూపర్ సిక్స్ హామీల జోలికి వెళ్లకపోయినా, ఈ ప్రభుత్వం ఎందుకింత అప్పులు చేసిందీ ఇంతవరకు వివరించ లేదు. నిజానికి ఇలాంటి వాటిపై శ్వేతపత్రాలు వేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.మరో వైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం రూ.15 వేలు కోట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్దిష్టంగా స్కీములు అమలు చేయడమే కాకుండా, పోర్టులు, మెడికల్ కాలేజీలు, తదితర అభివృద్ది పనులు చేపట్టింది. ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంది. అలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా, స్కీములు అమలు చేయకపోయినా, అభివృద్ది ప్రాజెక్టులు లేకపోయినా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్న కూటమి సర్కార్‌ను ఏమనాలి? ఆర్ధిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్తూ, తమది ‘విజన్-2047’ అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు అండ్ కో వారికే చెల్లిందని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు పాత కేసులు..ఐఏఎస్‌లపై ఒత్తిళ్లు..?
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు పాత కేసుల్లో సాక్షులైన ఐఏఎస్ అధికారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాబు అవినీతి కేసుల్లో ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులను మళ్లీ స్టేట్మెంట్ ఇవ్వాలని సీఐడీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.స్కిల్ డెవలప్మెంట్,ఫైబర్ నెట్,అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్,సిహెచ్ శ్రీధర్ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా వీరిని ఫైబర్ నెట్ స్కామ్,అమరావతి అసైన్డ్ భూముల కేసుల్లో మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఐఏఎస్‌లపై సీఐడీ ఒత్తిడి చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. సీఆర్పీసీ 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చెయ్యడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.ఇదీ చదవండి: సూపర్‌సిక్స్‌కు ఎగనామం -
సూపర్ సిక్స్‌కు చంద్రబాబు ఎగనామం
తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టేశాం! అసలు పథకాన్నే ఎగరగొడదాం..! రైతు భరోసా రెండుసార్లు ఎగనామం.. ఈసారి కేంద్రం ఇచ్చాక చూద్దాం..! ఆడబిడ్డ నిధి అబ్బే..! మనకు ఇప్పుడు అసలా ఆలోచనే లేదు! ఉద్యోగులు, నిరుద్యోగులు ఆ ఊసే మరిచిపోదాం!! సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనూ కేబినెట్ సాక్షిగా సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కారు ఎగనామం పెట్టింది. తల్లికి వందనం నుంచి అన్నదాతా సుఖీభవ దాకా.. ఆడబిడ్డ నిధి నుంచి ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్.. నిరుద్యోగులకు భృతి వరకు ఇదే తీరు!! కొత్త ఏడాది కోటి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్న తల్లులు, రైతన్నలు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మళ్లీ నిరాశ మిగిలింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్.. సెవన్ అంటూ ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు పీఠం ఎక్కిన తరువాత వాటిని పూర్తిగా ఎగ్గొట్టేశారు. సూపర్ సిక్స్ సహా ఇతర హామీలను అటకెక్కించి తొలి ఏడాది గడిపేశారు. కొత్త సంవత్సరంలోనూ నిర్దిష్టంగా ఏమైనా ప్రకటిస్తారనుకున్న వారికి నిరాశే మిగిలింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హామీల అమలుపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. కేబినెట్లో చర్చించారని మంత్రి ప్రకటించడం ప్రజలను మోసగించడమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంతో 87.42 లక్షల మంది విద్యార్ధులు ఒక్క ఏడాదే రూ.13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందకపోవడంతో రూ.10,000 కోట్ల మేర నష్టపోయారు. కోటి మందికిపైగా యువత నిరుద్యోగ భృతి కోసం.. ‘ఆడబిడ్డ నిధి’ కోసం 1.80 కోట్ల మంది మహిళలు పడిగాపులు కాస్తుంటే నూతన ఏడాది నిర్వహించిన తొలి మంత్రివర్గ భేటీలో ఒక్క సానుకూల ప్రకటన కూడా చేయలేదు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే ప్రభుత్వం సాగదీస్తోందని, ఎన్నికల హామీలను నమ్మి తాము మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అదే జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద, ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరువ చేశారు. ఏటా ఏప్రిల్‌లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే నెలలో విద్యా దీవెన, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. జూన్‌లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం.. సెప్టెంబర్‌లో చేయూత.. అక్టోబర్‌లో రైతు భరోసా.. నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ రుణాలు.. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టారు.అమ్మ ఒడి ఆగిపోయి.. తల్లికి వందనం లేక!పేదరికం చదువులకు అడ్డు కాకూడదని, పేదింటి తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని దృఢంగా నమ్మిన మాజీ సీఎం వైఎస్ జగన్ ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను పాఠశాలలు, కాలేజీలకు పంపిన తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేల చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. విద్యా రంగ సంస్కరణకు ఐదేళ్లలో దాదాపు రూ.73వేల కోట్లు వ్యయం చేసిన వైఎస్ జగన్ ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా తల్లులకు అందించి పిల్లల చదువులకు భరోసా కల్పించారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)తో డిజిటల్ బోధన ప్రారంభించారు. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లీషు మీడియం చేయడంతో పాటు సీబీఎస్సీతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణం దిశగా అడుగులు వేశారు. రోజుకొక మెనూతో రుచికరంగా గోరుముద్ద అందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారు ఐబీ, సీబీఎస్ఈ, టోఫెల్‌ను రద్దు చేసి.. తల్లికి వందనం పథకంపై చేతులెత్తేసింది. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. తొలి ఏడాది దీన్ని అమలు చేయకుండా పిల్లల చదువులను నీరుగార్చిన కూటమి సర్కారు అసలు పూర్తిగా పథకాన్నే ఎత్తివేసే దిశగా వ్యూహం రచిస్తోంది. అన్నదాతలకూ ఎగనామమేకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. రైతు భరోసా పేరును అన్నదాతా సుఖీభవగా మార్చడం మినహా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అమలు చేయలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇప్పటికే రైతులకు రెండు విడతలు ఆర్థిక సాయం అందించడం గమనార్హం. చంద్రబాబు సర్కారు ఆ రెండు విడతలూ అన్నదాతలకు సాయం అందించకుండా ఎగనామం పెట్టింది. కేంద్రం తదుపరి ఇచ్చే వాటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాపై ఆలోచన చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. అన్నదాతా సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు రూ.10వేల కోట్లకుపైగా అవసరం కాగా, బడ్జెట్లో రూ.1,000 కోట్లు మాత్రమే విదిలించడం గమనార్హం. ఇంతవరకు పథకం విధివిధానాలే ఖరారు చేయలేదు. ఇక ఖరీఫ్ 2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. సున్నా వడ్డీ రాయితీ ఊసే లేదు. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు సేవా కేంద్రాలను (ఆర్బీకేలు) చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. కాగా రైతులకు రైతు భరోసా పథకాన్ని మరుసటి ఏడాది నుంచి అమలు చేస్తామని వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ తొలి కేబినెట్లోనే నిర్ణయం తీసుకుని తొలి ఏడాది నుంచే వైఎస్ జగన్ అమలు చేశారు.జాడలేని ఆడబిడ్డ నిధి..19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని సూపర్ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ పథకాన్ని నెరవేర్చే ఉద్దేశం కానరాకపోవడం, మంత్రివర్గ సమావేశాల్లో కనీసం చర్చించకపోవడంతో 1.80 కోట్ల మంది మహిళలు మోసపోయినట్లు గ్రహిస్తున్నారు.ఉచిత గ్యాస్‌లోనూ మాయఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేశారు. ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది.మత్స్యకారులనూ ముంచారు..గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయానికి చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో 1.30 లక్షల మత్స్యకారులు ఇప్పటికే రూ.260 కోట్లు నష్టపోయారు. ఇప్పుడు ఏప్రిల్‌లో సాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు చెబుతోంది. అయితే పథకం అమలుపై కచ్చితమైన ప్రతిపాదనలు, నిర్ణయాలు మాత్రం జరగలేదు. విధివిధానాలు ఖరారు చేయలేదు. కేవలం చర్చలు, ఆలోచనలతోనే సరిపుచ్చారు. వైఎస్ జగన్ చెప్పిన మాట మేరకు అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే మత్స్యకార భరోసాను అమలు చేశారు.ఉద్యోగుల ప్రయోజనాలపై చర్చలేదుఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యను పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.బాలాజీ జీవీ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నెలా మంత్రివర్గం సమావేశాలను నిర్వహిస్తున్నా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి చర్చలు లేవన్నారు. పీఆర్సీ అమలుకు కమిటీని నియమించాలిఏపీటీఎఫ్ అమరావతి 12వ పీఆర్సీ అమలు కోసం కమిటీని నియమించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన సంవత్సరంలోనైనా డీఏ ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. తల్లులకు మోసం వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకం ఈ ఏడాది ఇవ్వడం లేదని మంత్రివర్గ సమావేశంలో ప్రకటించి తల్లులను దగా చేసిందన్నారు. అమలు చేయకుంటే ఆందోళనఎస్ఎఫ్ఐ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్, ఎ.అశోక్ గురువారం ఓ ప్రకటనలో ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం అమలు చేయకపోతే ఆందోళన చేస్తామన్నారు.ఉద్యోగులకు మొండిచెయ్యిచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి సారించలేదు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చింది. సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని వాగ్దానం చేసింది. ఇంతవరకూ ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటుతోపాటు కమిషనర్‌ను నియమించింది. అయితే చంద్రబాబు సర్కారు కమిషనర్‌తో రాజీనామా చేయించింది. ఇక పీఆర్సీ కమిషన్ గురించి అసలు పట్టించుకోవడమే లేదు. ఉద్యోగుల సమస్యల్లో ఒక్కటి కూడా పరిష్కరించలేదు. ఇందుకు భిన్నంగా వైఎస్ జగన్ తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ఇప్పుడు 7 నెలలైనా ఐఆర్ గురించి చంద్రబాబు అసలు పట్టించుకోవడమే లేదు. గత సర్కారు ఉద్యోగుల సమస్యలపై సీఎస్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పరిష్కరించగా, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఊసే మరిచింది.నిరుద్యోగికి నయవంచన..యువతకు ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నెలకు రూ.4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి రూ.57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో ఇందుకు పైసా ఇవ్వలేదు. క్యాబినెట్లో కనీసం చర్చించలేదు. దీంతో నిరుద్యోగ భృతి హామీకి నీళ్లు వదిలినట్టయ్యింది.కొత్తవి లేవు.. అన్నీ రద్దులేతాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానంటూ ఉగాది సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. ఇక 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీ బూటకంగా మారింది.ఉద్యోగుల ఆశలపై నీళ్లు..కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఉద్యోగుల గురించి ఆలోచించడం లేదని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని గురువారం మీడియాతో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా ఇవ్వలేదన్నారు. ఐఆర్ ఇవ్వలేదని, డీఏ, జీపీఎస్ బకాయిలు, ఈఎల్స్ సరెండర్ బకాయిలు చెల్లించలేదన్నారు. రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త కమిషనర్‌ను ఇంతవరకు నియమించలేదన్నారు. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో తాము ఒత్తిడి చేయకుండా వేచి చూశామని, కానీ నెలలు గడుస్తున్నా ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. 2019లో గత ప్రభుత్వం జూలై 1 నుంచే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందని వెంకట రామిరెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కూడా అలాగే ఇస్తారని ఉద్యోగులు నమ్మారన్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ఐఆర్ ఇస్తారని ఎదురు చూస్తూ వస్తుంటే ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. గత ప్రభుత్వం రెండు మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించిందన్నారు. సాధ్యం కాకుంటే కనీసం తమకు చెప్పేదన్నారు. పెండింగ్ బకాయిలు దశలవారీగా ఎప్పుడు ఎంత చెల్లిస్తారో పారదర్శకంగా చెప్పేవారన్నారు. ఇప్పుడు అది కూడా లేదన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో అధికారికంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కానీ, ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఉద్యోగులను పిలిచి మాట్లాడడం గానీ జరగలేదన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వేధించడం మొదలు పెట్టిందన్నారు. సచివాలయంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ అధికారులు ఆరుగురిని ఎలాంటి కారణాలు లేకుండా బదిలీ చేసి ముగ్గురికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. ఒక డీఏ ఇవ్వాలని, వెంటనే పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని కోరారు. -
పూలగుచ్ఛం అడ్డుపెట్టి.. కూటమి సర్కార్ నీచ రాజకీయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. ఫ్లెక్సీపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫోటోలు వేశారు. అయితే వారి ఫొటోలు కనిపించకుండా ముఖాలపై కూటమి నేతలు పూల గుచ్చం అడ్డుగా పెట్టారు. టీడీపి, బీజేపీ నేతల ఫోటోలు మాత్రమే కనిపించేలా డెకరేషన్లో ఎత్తుగడ వేశారు.జమ్మలమడుగులో మహిళా సంఘాలతో కేంద్రమంత్రి భేటీకాగా, కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీలను ప్రభుత్వ అధికారులు అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో ఫ్లెక్సీలపై ఎంపీ, ఎమ్మెల్సీ ఫొటోలు వేయక తప్పని పరిస్థితి. పూలగుచ్ఛం అడ్డుపెట్టి పట్టి కూటమి ప్రభుత్వం నీచ రాజకీయానికి ఒడిగట్టింది. జిల్లా అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు -
బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: బాబుకది షరా మామూలే! -
చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే: అంబటి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు మాటలకు అర్థాలే వేరని.. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయాడు. అయినా నిజాయితీపరుడినని చెప్పుకుంటాడంటూ సెటైర్లు వేశారు‘‘ఆరు నెలల్లో లక్ష 20 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. చంద్రబాబు విశ్వాస ఘాతకుడు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అభివృద్ధిని పట్టించుకోకుండా ఆరు మాసాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పేర్ని నాని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. మీ కక్ష సాధింపు చర్యలకు భయపడం. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు’’ అని అంబటి దుయ్యబట్టారు.‘‘నిప్పు లాంటి మనిషి అంటే తుప్పు లాంటి మనిషి అని అర్థం. ఎమ్మెల్యేను కొనడానికి చంద్రబాబు ప్రయత్నించిన విషయం అందరికి తెలిసిందే. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు కంటే గొప్ప నాయకుడు దేశంలోనే లేదు. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఇచ్చిన హామీలను అమలు చేసే దాఖలాలు ఎక్కడైనా ఉందా?. సెకీ కేసులో ఏం లేదని తెలిసే చంద్రబాబు ఊరుకున్నారు. ఆరు మాసాల్లో కక్ష సాధింపు తప్పా అభివృద్ధి లేదు. ఐపీఎస్‌ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు..గోడౌన్లో బియ్యం పోతే డబ్బులు కట్టించుకోవచ్చు. క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటీ?. పేర్ని నాని భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించడం కక్ష సాధింపు కాదా..?. కక్ష సాధింపునకు భయపడే వ్యక్తులం కాదు. రెడ్‌బుక్‌లో పేర్లు రాసి అరెస్ట్ చేయడం కక్ష సాధింపు కాదా?. సెకి ఒప్పందం లడ్డూలా దొరికితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్...చంద్రబాబు అబద్దాలన్నీ లెక్కిస్తే గిన్నీస్ బుక్ లో ఎక్కించవచ్చు. ధనవంతుడైన సీఎం చంద్రబాబు అని ఒక సంస్థ ప్రకటించింది. ఇది ఆయన అక్రమ సంపాదనకు నిదర్శనం. దేశంలో ఎక్కడా లేనంతగా ఎన్నికలను డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబే’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ప్చ్.. Pawan Kalyan సీజ్ ద షిప్