breaking news
-
పూలగుచ్ఛం అడ్డుపెట్టి.. కూటమి సర్కార్ నీచ రాజకీయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. ఫ్లెక్సీపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫోటోలు వేశారు. అయితే వారి ఫొటోలు కనిపించకుండా ముఖాలపై కూటమి నేతలు పూల గుచ్చం అడ్డుగా పెట్టారు. టీడీపి, బీజేపీ నేతల ఫోటోలు మాత్రమే కనిపించేలా డెకరేషన్లో ఎత్తుగడ వేశారు.జమ్మలమడుగులో మహిళా సంఘాలతో కేంద్రమంత్రి భేటీకాగా, కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీలను ప్రభుత్వ అధికారులు అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో ఫ్లెక్సీలపై ఎంపీ, ఎమ్మెల్సీ ఫొటోలు వేయక తప్పని పరిస్థితి. పూలగుచ్ఛం అడ్డుపెట్టి పట్టి కూటమి ప్రభుత్వం నీచ రాజకీయానికి ఒడిగట్టింది. జిల్లా అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు -
బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: బాబుకది షరా మామూలే! -
చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే: అంబటి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు మాటలకు అర్థాలే వేరని.. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయాడు. అయినా నిజాయితీపరుడినని చెప్పుకుంటాడంటూ సెటైర్లు వేశారు‘‘ఆరు నెలల్లో లక్ష 20 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. చంద్రబాబు విశ్వాస ఘాతకుడు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అభివృద్ధిని పట్టించుకోకుండా ఆరు మాసాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పేర్ని నాని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. మీ కక్ష సాధింపు చర్యలకు భయపడం. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు’’ అని అంబటి దుయ్యబట్టారు.‘‘నిప్పు లాంటి మనిషి అంటే తుప్పు లాంటి మనిషి అని అర్థం. ఎమ్మెల్యేను కొనడానికి చంద్రబాబు ప్రయత్నించిన విషయం అందరికి తెలిసిందే. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు కంటే గొప్ప నాయకుడు దేశంలోనే లేదు. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఇచ్చిన హామీలను అమలు చేసే దాఖలాలు ఎక్కడైనా ఉందా?. సెకీ కేసులో ఏం లేదని తెలిసే చంద్రబాబు ఊరుకున్నారు. ఆరు మాసాల్లో కక్ష సాధింపు తప్పా అభివృద్ధి లేదు. ఐపీఎస్‌ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు..గోడౌన్లో బియ్యం పోతే డబ్బులు కట్టించుకోవచ్చు. క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటీ?. పేర్ని నాని భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించడం కక్ష సాధింపు కాదా..?. కక్ష సాధింపునకు భయపడే వ్యక్తులం కాదు. రెడ్‌బుక్‌లో పేర్లు రాసి అరెస్ట్ చేయడం కక్ష సాధింపు కాదా?. సెకి ఒప్పందం లడ్డూలా దొరికితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్...చంద్రబాబు అబద్దాలన్నీ లెక్కిస్తే గిన్నీస్ బుక్ లో ఎక్కించవచ్చు. ధనవంతుడైన సీఎం చంద్రబాబు అని ఒక సంస్థ ప్రకటించింది. ఇది ఆయన అక్రమ సంపాదనకు నిదర్శనం. దేశంలో ఎక్కడా లేనంతగా ఎన్నికలను డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబే’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ప్చ్.. Pawan Kalyan సీజ్ ద షిప్ -
Pawan Kalyan సీజ్ ద షిప్.. ప్చ్!
కాకినాడ, సాక్షి: సీజ్ ద షిప్.. పోర్టులో కొద్ది రోజుల కిందట కాకినాడ పోర్టులో బియ్యం తనిఖీల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) అన్న మాట వైరల్‌గా మారింది. ఎంతలా అంటే.. ఆయన హార్డ్‌కోర్ అభిమానులకు ఆ డైలాగ్ నిద్రలేకుండా చేసింది. తమ అభిమాన నటుడు.. ప్రియతమ నేత రంగంలోకి దిగి మరీ అధికారులపై శివాలెత్తిపోయి ఆదేశాలివ్వడంతో మురిసిపోయారంతా. ఆ వెంటనే సోషల్ మీడియాలో వాళ్లు ఇచ్చిన ఎలివేషన్లు.. ఎక్స్‌లో #Seizetheship హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి రావడం.. మాములుగా సాగలేదా హడావిడి. అయితే ఆ వ్యవహారంలో తాజా పరిణామం.. ఆయన అభిమానులకు మింగుడు పడనివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నౌక ‘స్టెల్లా ఎల్- పనామా- ఐఎంవో 9500687’. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ షిప్‌ను అయితే సీజ్ చేయమని చెప్పారో.. ఆ షిప్ త్వరలో ఇంటి ముఖం పట్టబోతోంది. ఈ నెల 5 లేదంటే 6వ తేదీల్లో స్లెల్లా నౌక కాకినాడ నుంచి బయల్దేరనుందని సమాచారం. ఆపై అది వెస్ట్ ఆఫ్రికా కోటోనౌ పోర్టు(Port of Cotonou)కు చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ ఈపాటికే లభించినట్లు సమాచారం.పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్(Benin) దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు.. కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి బియ్యం నిల్వలు దీని ద్వారా చేరవేయాల్సి ఉంది. ఇందుకోసం హల్దియా నుంచి కాకినాడ తీరానికి నవంబర్ 11న ‘స్టెల్లా’ నౌక వచ్చింది.ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా నౌకలో 52,200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 ఎగుమతి సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 32,415 టన్నులు లోడ్ చేశారు. అయితే నవంబర్ 27న కలెక్టర్ తనిఖీలు చేసి 640 టన్నుల పేదల బియ్యం గుర్తించి నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. రెండ్రోజుల తర్వాత కాకినాడ తీరంలో పర్యటించారు. స్వయంగా బోటులో షిప్ దగ్గరకు వెళ్లి మరీ సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో (వనమాడి వెంకటేశ్వరరావు)పాటు ఎస్పీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులపైనా ఆయన సీరియస్ అయ్యారు.అయితే.. విదేశీ నౌకను సీజ్ చేసే అధికారం లేకపోవడంతో అధికార యంత్రాంగం తర్జనబర్జన పడింది. అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండడం.. దేశాల మధ్య ఎగుమతి- దిగుమతుల సమస్య కావడం కారణాలు. అందుకే స్టెల్లా షిప్ సీజ్ చేయడం అంత సులువు కాదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ తేల్చేశారు. కావాలంటే నౌకలోని రేషన్ బియ్యం అన్లోడ్ చేశాక ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఇష్యూ నుండి బయట పడేందుకు మల్టీ డిసిప్లెయినరీ కమీటీ కూడా ఏర్పాటు చేశారు. ఆపై వాస్తవ పరిస్థితిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెండ్ల మనోహర్‌కు పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు. ఈలోపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రకరకాల కారణాలతో రేషన్ బియ్యాన్ని దించడం కాస్త ఆలస్యమైంది. చివరకు.. తాజాగా నౌకలో గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఆన్ లోడ్ చేసి పోర్ట్ గోడౌన్లకు అధికారులు తరలించారు. ఆ వెంటనే షిప్ వెళ్లిపోయేందుకు క్లియరెన్స్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి.. పవన్ సీజ్ ద షిప్ వ్యవహారం సోషల్ మీడియా రీల్స్ కే పరిమితమైందన్నమాట!.ప్చ్..కొసమెరుపు..కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాకు అక్రమంగా తరలించే వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనిని కూటమి అనుకూల మీడియా ఘనంగా ప్రచారం చేసుకుంది. ఇందులోనూ వైఎస్సార్సీపీ ప్రస్తావన తెచ్చి బద్నాం చేయజూసింది. అయితే.. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. ఆ సిట్ అధికారులు ఇప్పటిదాకా కాకినాడ ముఖం చూడలేదు. అదే సమయంలో పట్టుబడిన రేషన్ బియ్యం తాలుకా 6ఏ కేసులు నమోదు అయినప్పటికీ సివిల్ సప్లై అధికారులు మాత్రం క్రిమినల్ కేసులు పెట్టకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: పవన్‌కు చంద్రబాబుతోనే పోటీ! -
‘తల్లికి వందనం’ పథకానికి మంగళం.. ఈ ఏడాది లేనట్టే..
సాక్షి, విజయవాడ: తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడేసింది. చంద్రబాబు కేబినెట్ విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్ చేతులు దులుపుకుంది. ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయింది.అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయలేదు. తల్లికి వందనం పథకం అమలపై కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో 80 లక్షల మందికి 15 వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా, ఈ ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కేబ్‌నెట్ భేటీ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ, సూపర్ సిక్స్‌లో పథకాలపై చర్చించామన్నారు. తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని తెలిపారు. ఈ అకడమిక్ సంవత్సరంలో అప్పుల కోసం ఆరా తీశాం. వచ్చే విద్యా సంవత్సరం లోపు తల్లికి వందనం చెల్లిస్తాం. రైతు భరోసా చెల్లింపుపై చర్చించాం. కేంద్రం ఇచ్చే షేర్ బట్టి రాష్ట్ర ప్రభుత్వం షేర్ రైతులకు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇస్తాం. కేంద్రం నిర్ణయం బట్టి ఎంత చెల్లిస్తామో నిర్ణయిస్తాం’’ అని మంత్రి చెప్పారు.కాగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామంటూ మంత్రి నారా లోకేష్ ఊదరగొట్టారు. తల్లులు, పిల్లల డేటా సిద్ధంగా ఉన్నా.. విధివిధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతోందని చెబుతూ.. ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: కిక్కే.. కిక్కుతల్లికి వందనం అమలుకు విధివిధానాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని అడిగామని, దీనిపై మంత్రులందరితో చర్చిస్తున్నట్టు చెప్పారు. తాజాగా, కేబినెట్ కూడా చేతులెత్తేసింది. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. అయితే, తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే చర్చ ప్రజల్లో మొదలైంది. -
‘అక్రమ కట్టడం.. అధికారిక నివాసమా?.. ఇది సబబేనా బాబూ?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని.. నదీ పరీవాహకంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మరి చట్టాలు తయారు చేసేవారే అక్రమ నివాసాల్లో ఉండటం సబబేనా? అంటూ ప్రశ్నించారు.‘‘అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ఎలా నిర్ణయిస్తారు?. 2014లోనే ఇది అక్రమ కట్టడం అని అధికారికంగానే తేల్చారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇది అక్రమ కట్టడం అని చెప్పారు. దీన్ని కూల్చాలంటూ ప్రకటన కూడా చేశారు. మేథాపాట్కర్, రాజేంద్రసింగ్ వంటి పర్యావరణ వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు’’ అని శివశంకర్ గుర్తు చేశారు.‘‘నదీ పరివాహక చట్టం ప్రకారం వంద మీటర్ల లోపు ఎలాంటి కట్డడాలు చేయకూడదు. కానీ చంద్రబాబు నివాసం నదీ పరివాహకంలోనే ఉంది. లోకాయుక్త సైతం 2015లో ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించింది. అయినాసరే ఆ అక్రమ నివాసాన్ని కూల్చకుండా చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఇటీవల వచ్చిన వరదలతో చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసి విజయవాడ కలెక్టరేట్లో తల దాచుకున్నారు. ఈ అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు బుడమేరు వరదని విజయవాడ మీదకు తిప్పారు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బాబుకది షరా మామూలే!‘‘ఆ ఇంటిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుందని.. ఓనరు లింగమనేని రమేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో ఆ బిల్డింగ్‌కి అద్దె కడుతున్నానని చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అబద్దం చెప్పారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమే’’ అని పుత్తా శివశంకర్ దుయ్యబట్టారు. -
‘రిచెస్ట్ సీఎం.. వరస్ట్ పాలన’
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు నెలల పాలన.. ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి నేతల మోసాలకు ప్రజలు బలైపోయారని అన్నారు. చంద్రబాబు ప్రజలను ఫుల్స్‌ను చేశారని ఘాటు విమర్శలు చేశారుఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. 50 శాతానికి పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారు. 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుంది. చంద్రబాబు గజినీల పాలన చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఫుల్స్ చేశారు. చంద్రబాబు ఏడు నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉంది. ఎలుగుబంటి తోలు ఎన్నిసార్లు ఉతికినా నలుపు నలుపే అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉంది.ఎన్నికలకు ముందు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారు. దేశంలో వరస్ట్ పాలన చేసే ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలపై టీడీపీతో నేను బహిరంగ చర్చకు సిద్ధం. గతంలో మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసివేస్తే.. నేడు ఆలోచనల్లో నుంచే మేనిఫెస్టోను చంద్రబాబు తీసివేశారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు మోసానికి బలైపోయారు. కూటమికి ఓటు ఓటేస్తే లక్షాధికారులను చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నించారు. -
బాబుకది షరా మామూలే!
బాబుకది షరా మామూలే! ‘‘చంద్రబాబూ..కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో నీకు నీవే సాటి’’ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడిని ఉద్దేశించి తరచూ చేసిన వ్యాఖ్య ఇది. 1999-2004 మధ్యకాలంలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ విపక్ష నేత అన్నది తెలిసిన విషయమే. ఆ తర్వాత ఐదేళ్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు విపక్ష నేతగా బాబు ఉన్నారు. ఈ సమయంలో ఆయా సందర్భాలలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్నిసార్లు టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను, బాబు చేసిన ప్రకటనల్లోని అబద్ధాలను వేలెత్తి చూపుతూండేవారు. ‘‘అబద్దాలు చెప్పకపోతే తల వెయ్యి ముక్కలవుతుంది అని శాపం ఉంది’’ అని కూడా వైఎస్సార్ ఎద్దేవ చేసేవారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైన ధోరణిలోనే ప్రసంగాలు సాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అసత్యమైనా తన అవసరానికి తగ్గట్టు మాట్లాడేవారని చెప్పాలి.ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు ఎక్కువసార్లు సఫలమయ్యారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆ తరువాత ఇంకో మాట మాట్లాడటం విషయంలో ముప్పై ఏళ్ల క్రితం మాదిరిగానే ఇప్పుడూ బాబు ఉన్నారు. అబద్దాల విషయంలో స్థిరత్వం పాటించిన నేత అన్నమాట! చంద్రబాబు తాజా ప్రసంగం ఒకటి వింటే ఔరా అనిపిస్తుంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను తెగ ఊరించిన ఆయన వీటితోపాటు మేనిఫెస్టోలో మరో 175 హామీలు ఇచ్చారు. అధికారంలోకి రావడంతోనే అమలు చేస్తామని, సంపద సృష్టించడం తనకు తెలుసు అంటూ నమ్మబలికారు. లోకేష్, పవన్కళ్యాణలు కూడా బాబు వాగ్ధానాలను ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు అవుతాయా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు... ‘‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’’ అని ప్రకటించేశారు. అరె... తమకు తెలియకుండా అన్ని హామీలెప్పుడు అమలు చేశారబ్బా అని ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతైంది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలు బాగా పనిచేశాయంటే అర్థం చేసుకోవచ్చు. అవి ఉత్తుతివే అని అందరూ అనుకుంటున్నప్పుడు ఎన్నికల సంగతి ఎవరూ ప్రస్తావించరు. అందుకే హామీలన్నీ అమలు చేసేశామన్న భ్రమ కల్పించేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారని అనుకోవాలి. అయితే వృద్ధుల ఫించన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం మినహా మరే ఇతర హామీ అమలు కాలేదన్నది వాస్తవం. పైగా... లక్షల మంది ఫించన్లకు కోత పెట్టిన తరువాత కానీ మొత్తం పెంపు జరగలేదు.ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. ఎంతమందికి నిజంగా అందిందన్నది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారనుకున్నా, మరో నాలుగు నెలల వరకు ఆ ఊసే ఎత్తడానికి వీలు లేదు. అంటే నెలకు రూ. 200ల చొప్పున రాయితీ మాత్రమే ఇచ్చారన్నమాట. ఇతర వాగ్దానాలు అమలు చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని అడిగితే సమాధానం మాత్రం బాబూ అండ్ కో నుంచి ఉండదు. ఇదేం న్యాయమని అడిగితే వారి గొంతు నొక్కేందుకు పోలీసులు కేసులు బనాయించేస్తారు. కేసులు వస్తాయి. జైలుపాలు కావాల్సి ఉంటుంది. మహిళా శక్తి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికీ రూ.1500 చొప్పున ఇస్తామని అప్పట్లో ప్రచారమైతే చేశారు కానీ.. ఇచ్చింది సున్నా! తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని.. గతంలో జగన్ కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఇస్తే తాము ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామని ఊదరగొట్టారు. ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు వస్తాయని, ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని కూడా చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చిన విషయం ఎవరూ మరచిపోలేదు కానీ అధికారంలోకి వచ్చాక ఒక విద్యార్ధికి ఈ పథకం అంది ఉంటే ఒట్టు! రైతు భరోసా కింద ప్రతి రైతుకు జగన్ హయాంలో ఇచ్చిన రూ.13500 కాకుండా రూ.20 వేల చొప్పున ఇస్తామన్న హామీ గురించి అసలు మాట్లాడటమే లేదిప్పుడు. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ప్రజలు బిత్తరపోవడం తప్ప చేసేది ఏముంటుంది. ఇక నిరుద్యోగుల సంగతి సరేసరి.ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని, అంతవరకు నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామన్న భృతి కూడా ఇప్పటివరకూ అమలు కాలేదు. ఇవి కాకుండా మానిఫెస్టోలో వలంటీర్ల కొనసాగింపు, వారి జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం, బీసీ, ఎస్సీఎస్టీ వర్గాల వారికి యాభై ఏళ్లకే రూ.4 వేల చొప్పున ఫించన్, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న హామీ కూడా అమలు కాకపోగా.. అసలుకే మోసం వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వలంటీర్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు పోగా.. ప్రజలపై రూ.15 వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం పడింది. బహుశా చంద్రబాబు సృష్టిస్తానన్న సంపద ఇలా జనాలపై బాదడం ద్వారానే అనుకోవడం ప్రజల వంతైంది. ఒకపక్క ప్రజలకు పైసా విదల్చని ప్రభుత్వం ఇంకోపక్క వారానికి వారం కొత్త కొత్త అప్పులు తెచ్చుకుంటున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏడు నెలల వ్యవధిలోనే లక్ష కోట్ల రూపాయల అప్పులు తేవడం ఆర్థిక వేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 1996 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాగే అలివికానీ హామీలు బోలెడన్ని చేసి ఎన్నికల తరువాత అన్నీ తూచ్ అనేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014లో హామీ ఇచ్చిన బాబు తరువాత ఎన్ని పిల్లిమొగ్గలు వేసింది ఇటీవలి అనుభవమే. ప్రత్యేక తెలంగాణ అంశంలో చూసుకున్నా, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్, బీజేపీలతో జత కట్టే అంశంలో గమనించినా, ఎన్నికల పొత్తులలో పలు భిన్నమైన విధానాలు కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా, అన్ని అవకాశవాద రాజకీయాలు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబ్బాబూ పుణ్యముంటుంది.. ఆయన్ను అరెస్టు చేయండి..
ఇళ్లకొచ్చి అడుక్కునే ముష్టివాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ట్రాఫిక్ సిగ్నళ్లలో, గుడులూ, హాస్పిటళ్లూ, హోటళ్ల దగ్గరే ‘బాబ్బాబూ ధర్మం చేయండి బాబూ.. పుణ్యముంటుంది బాబూ..’ అంటూ అడుక్కునే ముష్టివాళ్లు మనకు దండిగా కనిపిస్తుంటారు. ఈ ముష్టివాళ్ల సంగతి సరే.. నిజానికి ఇంకోరకం ముష్టివాళ్లు కూడా ఉంటారు. వారికి అనేకానేక వంకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ వంకర ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అడ్డు పడేవారి మీద కక్ష పెంచుకుంటారు. ఆ కక్ష సాధించుకోవడానికి ఇంకో రకం ముసుగులు తగిలించుకుని, చవకబారు ముష్టెత్తుతూ ఉంటారు.పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి బియ్యం నిల్వల తేడా వచ్చిన కేసులో అటు పోలీసులకు, ఇటు పౌరసరఫరాల శాఖకు, ప్రభుత్వానికి లేని శ్రద్ధ పచ్చ మీడియాకు మాత్రం విపరీతంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చట్టప్రకారం అవకాశం ఉన్నా లేకపోయినా కూడా.. పేర్ని నానిని అరెస్టు చేసేవరకు తాము కారుకూతలు కూస్తూనే ఉంటాం.. బురదచల్లుడు చవకబారు రాతలు రాస్తూనే ఉంటాం.. అనే ధోరణిని పచ్చ మీడియా ప్రదర్శిస్తున్నది.పేర్ని నాని స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాతనే.. బియ్యం నిల్వల్లో తేడా వచ్చిన సంగతి బయటపడింది. అప్పటికీ నిబంధనల ప్రకారం అధికారులు ఎంత జరిమానా విధించారో.. అదంతా కూడా డీడీల రూపంలో చెల్లించేశారు. అయినాసరే.. పేర్నినానిని అరెస్టు చేసేదాకా పచ్చమీడియా కళ్లు చల్లబడేలా కనిపించడం లేదు.‘మేం కేసు పెడతాం అంతే.. అరెస్టులు మాత్రం చేయం.. మీరు కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందేవరకు వేచిచూస్తూ ఉంటాం.. అన్నట్టుగా పోలీసులు వేచిచూస్తున్నారంటూ..’ పచ్చమీడియా వారి వెంటపడుతోంది. పేర్నినాని వ్యవహారం బయటకు వచ్చిన నాటినుంచి.. చట్టం తనశైలిలో తాను పనిచేసుకుంటూ పోతోంది. అయితే పచ్చమీడియా మాత్రం అత్యుత్సాహం ఆపుకోలేక.. ఆయనను అరెస్టు చేయడం లేదు, కొల్లు రవీంద్ర గానీ, పార్టీపెద్దలు గానీ.. ఆయన గురించి విమర్శలు చేయడం లేదు. అరెస్టు చేయాలని పోలీసుల వెంటపడడం లేదు.. పేర్ని నానితో కుమ్మక్కు అయినట్టుగా పనిచేస్తున్నారు.. అంటూ రకరకాల కారుకూతలు, చవకబారు రాతలు రాశారు.తీరా పచ్చమీడియా పోరు పడలేకపోతున్నట్టుగా.. కొల్లు రవీంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఏదో పేర్నినాని మీద కొన్ని నిందలు వేసి దులుపుకున్నారు. ఆ తర్వాత.. రకరకాల మలుపులు తిరిగిన వ్యవహారంలో గోడౌన్ యజమానిగా రికార్డుల్లో ఉన్న జయసుధకు ముందస్తు బెయిలు వచ్చింది. పచ్చమీడియా పెద్దలు హతాశులయ్యారు. ఈలోగా పోలీసులు.. ‘విచారణలో తెలిసిన సమాచారం మేరకు..’ అనే ముసుగులో పేర్ని నాని పేరును కూడా ఏ6గా కేసులో చేర్చారు.కక్షపూరితంగా వేధించదలచుకుంటున్నారనే భయంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళితే.. నానా చెత్తరాతలు రాసిన పచ్చమీడియా.. ఇప్పుడు ముందస్తు బెయిల్ తర్వాత జయసుధ విచారణకు హాజరైనా కూడా ఓర్వలేకపోతోంది. కుట్రపూరితంగా తన పేరును కూడా ఇరికించిన నేపథ్యంలో పేర్ని నాని ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోవడం కూడా పచ్చమీడియాకు కంటగింపే. ఆయనకు ముందస్తు బెయిల్ రావడం కూడా ఖరారే అని సంకేతాలు అందుతున్న వేళ.. తక్షణం ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ పచ్చ మీడియా పాపం.. ఆవేదన చెందుతోంది.టీడీపీ, జనసేనల్లో పేర్ని నాని సన్నిహితులున్నారని, వారే ఆయనను కాపాడుతున్నారని పచ్చ మీడియా పాపం కుమిలపోతున్నది. అయినా.. చట్టప్రకారం ఆయన దోషి అయితే గనుక.. కాపాడటం ఎవరి తరం అవుతుంది? జరిగింది నేరం కానప్పుడు.. బియ్యం నిల్వల తేడాకు సంబంధించి.. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం జరిమానా మొత్తం చెల్లించేసినప్పుడు.. ఇక ఆయనను ఏ రకంగా శిక్షించగలరని పచ్చ మీడియా ఆరాటపడుతున్నదో అర్థం కావడం లేదు. వ్యవహారం మొత్తం గమనిస్తే.. నాని అరెస్టుకోసం పచ్చ మీడియా ముష్టెత్తుకుంటున్నట్టుగా.. బాబ్బాబూ.. మీకు పుణ్యముంటుంది.. అరెస్టు చేయండి బాబూ.. అని దేబిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.-ఎం.రాజేశ్వరి -
కూటమి సర్కార్ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు నోటీసులిచ్చారు. రాజకీయ కక్ష సాధింపు కోసం మహిళలను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పదే పదే విచారణకు పిలిచి పేర్ని నాని కుటుంబాన్ని అవమానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ నాడు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పీఎస్‌కు పేర్ని నాని సతీమణి జయసుధ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పీఎస్‌కు వెళ్లారు. ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు.ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందే..స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతూ జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో జయసుధతో పాటు లాయర్లను పోలీసులు అనుమతించలేదు. జయసుధతో పాటు వచ్చిన వైఎస్సార్సీపీ మహిళా నేతలను సైతం పోలీసులు బయటికి పంపించేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.అనారోగ్యంతో ఉన్నప్పటికీ జయసుధ విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ తరఫు న్యాయవాది వరద రాజులు మీడియాతో మాట్లాడుతూ, న్యాయస్థానం విధించిన షరతులకు లోబడి పోలీసుల విచారణకు జయసుధ హాజరయ్యారయ్యారని.. జయసుధ స్పైనల్ కార్డ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ విచారణకు హాజరయ్యారన్నారు. గంట నుంచి పోలీసులు విచారిస్తున్నారని.. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసుల విచారణకు జయసుధ సహకరిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరి ష్యూరిటీ సర్టిఫికెట్లను పోలీసులకు అందజేశామని వరద రాజులు తెలిపారు.అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు.. -
బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు'
సాక్షి, అమరావతి: వారం.. వారం అప్పులే! బడ్జెట్లోనూ.. బడ్జెట్ బయటా అప్పుల మోతలే! ఎటు చూసినా రుణ భారమే! ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మంగళవారం అంటే అప్పుల బేరమే! రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తాజాగా రూ.1.19 లక్షల కోట్లను దాటేశాయ్! చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సంపద సృష్టి అంతా కరెంట్ చార్జీల బాదుడు.. ఉచిత ఇసుక ముసుగులో పచ్చ ముఠాల దందాలు.. మద్యం విక్రయాల పేరుతో జనం జేబులను గుల్ల చేయడంలోనే కనిపిస్తోంది. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే మంగళవారం చేసిన రూ.5,000 కోట్ల అప్పుతో చంద్రబాబు సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా రూ.74,827 కోట్లకు చేరాయి. తాజాగా ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.ఐదు వేల కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇక బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకు ఎగబాకింది! సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అప్పులు చేయడం, ప్రజలపై భారం మోపడమే సంపద సృష్టి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మూడు నెలల ముందే..మార్కెట్ రుణాల ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.71,000 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు మిగిలి ఉండగానే అంతకు మించి అప్పు చేసింది. బడ్జెట్లో చెప్పిన దానికి మించి రూ.74,827 కోట్ల అప్పులు చేసింది. ఇంత అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని ‘కాగ్’ ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ వరకు మూలధన వ్యయం కేవలం రూ.8,329 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కార్పొరేషన్ల పేరుతో మరిన్ని..కేవలం మార్కెట్ రుణాల ద్వారానే ఇంత అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి గ్యారెంటీలతో మరిన్ని అప్పులు చేసింది. ఏపీ ఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పును సమీకరించేందుకు సలహాదారు–మర్చంట్ బ్యాంకర్‌ను నియమించాల్సిందిగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బడ్జెట్ బయట ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ, ఏపీ ఎండీసీ, హడ్కో ద్వారా మరిన్ని అప్పులు చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇంత అప్పు చేసినప్పటికీ సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనవి ఒక్కటీ అమలు చేయకపోవడం గమనార్హం. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం కూడా చేయలేదు.పథకాలు లేవు.. మరి ఏం చేస్తున్నట్లు?వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందని, సంక్షేమ పథకాల కోసం వైఎస్ జగన్ బటన్లు నొక్కుతున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున విషం చిమ్మిన విషయం తెలిసిందే. లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు గణాంకాలతో మభ్యపుచ్చే యత్నం చేశారు. మరిప్పుడు సూపర్ సిక్స్, సెవెన్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. కొత్త పథకాలను అమలు చేయకపోగా పేదలకు జగన్ ఇచ్చిన అన్ని పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు స్కూలు పిల్లలకు ‘అమ్మ ఒడి’ లేదు. విద్యార్థులకు రూ.3,900 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించక పేదలు అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. హామీలను అమలు చేయకుండా.. పథకాలను నిలిపివేస్తూ.. ఎడాపెడా అందినకాడికి అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని కూటమి సర్కారు అంధకారంలోకి గెంటేస్తోంది. మరి ఆ అప్పులన్నీ దేనికి వ్యయం చేస్తున్నట్లు? గత సర్కారు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినా అది పెద్ద నేరంగా చిత్రీకరించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకుంటున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. అటు అప్పులు.. ఇటు అమ్మకాలుఒకపక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు మరోపక్క వైఎస్సార్ సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడ రేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు పాతరేయడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. అప్పులతోనే అమరావతి!రాజధాని అమరావతి కోసం తొలి దశలో రూ.52 వేల కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.15 వేల కోట్లు అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి రూ.5 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు సీఆర్డీఏను అనుమతిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా రూ.21 వేల కోట్ల రుణ సమీకరణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
‘చంద్రబాబు.. మీరు ఏనాడైనా ప్రాజెక్టుల గురించి పట్టించుకున్నారా?’
తాడేపల్లి : తన హయాంలో ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu).. ఇప్పుడు కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu).ఈరోజు(మంగళవారం) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన అంబటి.. నదుల్లో ప్రవహించే ప్రతి నీటిబొట్టు భూమి మీదుకు రావాలని దివంగత మహానేత వైఎస్సార్ ఆశించారని, అందుకే పెద్ద ఎత్తున జలయజ్ఝాన్ని(Jalayagnam) ప్రారంభించారన్నారు. అటువంటింది ఇప్పుడు కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్లాన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అంబటి గుర్తు చేశారు. కృష్ణా నదిలో నీరు సరిపడా రాకపోయినా గోదావరి నీటితో పల్నాడు, రాయలసీమకి ఉపయోగపడుతుందని జగన్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. దీనికి డీపిఅర్ కూడా జగన్ ప్రభుత్వమే తయారు చేసి కేంద్రానికి పంపిందన్నారు. కానీ చంద్రబాబు తానే చేసినట్టుగా ఏమాత్రం సిగ్గు పడకుండా చెప్పుకుంటున్నారని, చివరికి ఈ ప్రాజెక్టును కూడా ప్రయివేటు పరం చేయబోతున్నారని విమర్శించారు అంబటి.చివరికి సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రయివేటు పరం చేయటాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. ఇది జల హారతి కాదని, చంద్రబాబు హారతి అని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికే పోర్టులు మెడికల్ కాలేజీలు, రోడ్లను ప్రయివేటు పరం చేశారన్నారు. రౌడీయిజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారురాష్ట్రంలో రౌడీయిజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారన్నారు. కొందరు పోలీసులు కూడా రౌడీయిజం చేస్తున్నారన్నారని అంబటి మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదనే గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు ధనిక ముఖ్యమంత్రి అని, రెండు ఎకరాల నుండి వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజా ఉద్యమాలు త్వరలో రావడం తథ్యమన్నారు. -
విశాఖ ఉక్కుకు.. కూటమి సర్కార్ తుప్పు!
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ కూడా అటకెక్కిందా? ఎన్నికల సమయంలో ఈ అంశం ఆధారంగా విశాఖ ప్రజలను అడ్డంగా రెచ్చగొట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. అధికారం చేతికొచ్చాక నాలుక మడతేస్తున్నారా?. కేంద్రం తీసుకున్న నిర్ణయానికీ జగన్ బాధ్యుడిని చేస్తూ అభాండాలు మోపిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూండటం వెనుక కారణం ఏమి?. ఈ అనుమానాలకు, ప్రశ్నలకు కారణం ఒక్కటే.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ని కలిసి రాష్ట్ర సమస్యలంటూ వినతిపత్రాలు సమర్పించిన బాబుగారు.. వాటిల్లో మచ్చుకైనా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకపోవడం. అదే సమయంలో వస్తుందో రాదో కూడా తెలియని ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని ప్రధానిని కోరడం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అక్కడ తాను కలిసే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర సమస్యలు, కీలకాంశాలను కచ్చితంగా వినతిపత్రం ద్వారా వారి దృష్టికి తీసుకొచ్చేవారు. కానీ తన కేసుల కోసమే ఢిల్లీ వెళతాడని బాబు అండ్ కో అబద్ధపు ప్రచారానికి దిగేది. మరి.. ప్రస్తుతం కేంద్రంలోనూ కీలకంగా ఉన్న టీడీపీ ప్రజా సమస్యల కోసం ప్రధానిని కలిసిందా? లేక ఇంకేదైనా లోగుట్టు ఉందా?. విశాఖ ప్లాంట్ మూతకు గనులు లేకపోవడమే కారణమంటున్నప్పుడు ఓ ప్రైవేట్ కంపెనీ ప్రయోజనాల కోసం గనులు కేటాయించమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కోరడం ఏమిటి? ఈ నెపంతో ఆయన తనపై ఉన్న కేసులు ముందుకు రాకుండా మేనేజ్ చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా, ఏపీ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు మణిహారం వంటి విశాఖ స్టీల్ విషయంలో కూటమి డ్రామా ఆడుతున్న విషయం తేటతెల్లం అవుతోంది. ఎన్నికలకు ముందు ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)లు చేసిన గంభీర ప్రసంగాలు ఒకసారి చూడండి. ఆ తర్వాత వీరి వ్యవహారం ఏమిటో గమనించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని, ఆ సెంటిమెంట్ కాపాడతామని చంద్రబాబు అప్పట్లో పదే, పదే ప్రచారం చేశారు. పవన్ అయితే తనకు ఇద్దరు ఎంపీలను ఇచ్చినా ప్రైవేటీకరణపై పార్లమెంటులో బలంగా గొంతెత్తుతానని కూడా చెప్పుకున్నారు. శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను నివారించలేని జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన గగ్గోలు పెట్టారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. స్టీల్ ప్లాంట్ ఒక్కో యూనిట్‌ను నిర్వీర్యం చేస్తున్నా వీరు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నందున తమకు సమస్యపై స్పష్టమైన అవగాహన లేకపోయిందని, అఖిలపక్షం వేసినా విమర్శలు తప్ప ప్రయోజం ఏమీ ఉండదని తేల్చేశారు. సెయిల్‌లో విలీనం చేయబోతున్నారంటూ ఎన్నికల సమయంలో వచ్చిన ఎల్లో కథనాలు కూడా వట్టివేనని స్పష్టమైపోయింది. టీడీపీ, జనసేనలకు ఉమ్మడిగా 18 మంది ఎంపీలతో కేంద్రంలో కీలకంగా ఉన్నా ప్రైవెటీకరణను నిలిపివేతకు మోడీ ఒప్పుకోరా అని కార్మిక సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాని చంద్రబాబు అసలు ఆ ఊసే లేకుండా ఢిల్లీ టూర్ చేసి వస్తున్నారు. మరో వైపు కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్స్ పునరుద్ధరణకు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) ఏకంగా రూ.15 వేల కోట్లు మంజూరు చేసుకున్నారు. విశాఖకు కూడా అదేరీతిలో సాయం చేయవచ్చు కదా! అని అడిగే నాథుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితం విశాఖ కూటమి నేతలను శిక్షించాలని జన జాగరణ సమితి పేరుతో ప్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలు విశాఖ స్టీల్ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తున్నారని, ఈ ముగ్గురు మోసగాళ్లను శిక్షించాలని సింహాచలం అప్పన్న స్వామిని వేడుకుంటున్నట్లు ప్లెక్సీలలో రాశారు. అయినా కూటమి నేతలలో ఉలుకు, పలుకు లేకుండా పోయింది. విశాఖ స్టీల్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పట్లో సీఎంగా ఉన్న టైంలో వైఎస్ జగన్ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న విశాఖ సభలో ప్లాంట్‌ను కాపాడాలని వేలాది మంది సమక్షంలో కోరారు. విశాఖ స్టీల్‌కు ఉన్న వేల ఎకరాల భూమిలో కొంత అమ్మి రక్షించాలని సూచించారు. దీనిపై కూడా టీడీపీతో పాటు ఎల్లో మీడియా నీచమైన కథనాలను ప్రచారం చేసింది. జగన్ విశాఖ స్టీల్ భూములను ఎవరికో కట్టబెడుతున్నారని వక్రీకరించింది. ఇప్పుడేమో భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని కూటమి మంత్రులు అంటుండడం విశేషం. CM YS Jagan wrote a letter to PM Modi on “Vizag Steel Plant Privatisation” CM Jagan requested to refrain the process of Vizag Steel Plant Privatisation and continue to invest on Esteemed organization which is producing profits recently.#VizagSteelPlant #YSJaganCares pic.twitter.com/Qe6ibOahV6— Latha (@LathaReddy704) February 6, 2021ఎన్నికల సమయంలో జగన్ చాలా స్పష్టంగా.. కూటమికి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని హెచ్చరించారు. అయినా కూటమి నేతల మాయ మాటలు నమ్మో, మరే కారణమో తెలియదు కాని ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ది పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారి అసలు రంగు బయటపడింది. ప్లాంట్ ను అమ్మివేయడానికి కేంద్రం ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి ఒకసారి విశాఖ వచ్చి ప్రైవేటైజ్ చేయబోమని చెప్పినా, అది మాటవరసకే అని అర్థమైపోయింది. శాసనమండలిలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విశాఖ స్టీల్ లో రెండు యూనిట్లను నిలిపివేశారని, రెగ్యులర్ ఉద్యోగులకు 30 శాతం జీతాలే ఇస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సభ దృష్టికి తెచ్చారు. జగన్ వల్లే ఐదేళ్లపాటు ప్రైవేటీకరణ ఆగిందని వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు, పవన్‌లు విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా విశాఖలో కూటమి తీరుపై నిరసనలు వస్తున్నా, ఇంకా అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాలేదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దాల్చే అవకాశం లేకపోలేదు. అయితే.. స్టీల్ ప్రైవేటైజైషన్ సమస్యను డైవర్ట్ చేయడానికి విశాఖకు టీసీఎస్ వస్తోందని, అనకాపల్లిలో మిట్టల్ ప్లాంట్ వస్తుందని, ఇలా రకరకాల ప్రచారాలు ఆరంభించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సెంటిమెంట్లు గుర్తుకు వస్తాయి. అధికారంలోకి రాగానే ఇంకేం సెంటిమెంట్ అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు పవన్ కూడా ఆయనకు తోడయ్యారు. అలా మాట మార్చడం వారికి మాత్రమే సాధ్యమైన కళ!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: నమ్మకానికి, మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు.‘‘రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం రూ.20 వేలు ఏమైంది?. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయిలు పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు.ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తామని మొదట్లోనే చెప్పాం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అన్ని జిల్లాల్లో పోరుబాట ఉధృతం చేస్తాం. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఎండగడతాం’’ అని అమర్నాథ్ తెలిపారు.‘‘ఈ ఏడాది వైఎస్ఆర్సీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చూశారు. ప్రజలు నమ్మించి మోసం చేసిన పార్టీ కుటమిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. వైఎస్ జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు. ఐదేళ్లలో 2.75 లక్షల కోట్లు ప్రజల ఖాతాలో వేశారు...భోగాపురం ఎయిర్పోర్ట్, సచివాలయాలు, మెడికల్ కాలేజీలు నిర్మించారు. నాడు-నేడు ద్వారా విద్య వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేశారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మొదటి సంతకం చంద్రబాబు పెట్టారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. సూపర్ సిక్స్ అని చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. మేము చేసిన ప్రజా వ్యతిరేక పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది.ఇదీ చదవండి: అత్యంత ధనిక సీఎం చంద్రబాబు..తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలు లేదు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, ఒక్కొక్క మహిళకు 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు..\ ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. త్వరలో జిల్లాలు వారీగా వైఎస్ జగన్ పర్యటిస్తారు. ఏడు నెలల కాలంలో లక్ష 12 వేల కోట్లు అప్పు చేశారు. గతంలో 400 కోట్లు ఉంటే దేశంలో ధనిక సీఎం వైఎస్ జగన్ అని ప్రచారం చేశారు. సుమారు రూ. 950 కోట్లు చంద్రబాబు సంపాదించారు. దేశంలోనే ధనిక సీఎం గా చంద్రబాబు పేరు సంపాదించారు. చంద్రబాబు ఆస్తుల పక్కన ఒకటో రెండో సున్నాలు మర్చిపోయి ఉంటారు.’’ అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.‘‘రెండు ఎకరాల నుంచి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారు?. చంద్రబాబు ఆస్తులపై ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ఉంగరం వాచ్ ఫోన్ పెట్టుకోలేనంత మాత్రాన ఆస్తులు లేవంటే ప్రజలు నమ్మరు. సంక్షేమ పథకాలు అమలు చేయక చివరికి దేవుడుకి ఆదాయం కూడా పడిపోయింది. బీసీ మంత్రులను కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు. గౌతు శిరీషతో క్షమాపణ చెప్పించారు. ఉత్తరాంధ్ర మంత్రి బొత్స సత్యనారాయణ కు ఎదురు పడితే ఆ మంత్రిని టార్గెట్ చేశారు. ప్రధాని పర్యటన ముందే స్టీల్ ప్లాంట్ పై కూటమి తమ వైఖరిని చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా లేదా అనేది ఎంపీకి తెలియక పోవడం ఆశ్చర్యం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు.. -
ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది.పేర్ని నానిపై కక్ష సాధింపు కుట్రతో ఆయన కుటుంబానికి చెందిన గోదాముల్లో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది. ఏకంగా 4,500 బియ్యం బస్తాలు తగ్గాయని అధికారులు ఏకపక్షంగా నివేదిక ఇచ్చేశారు. గోదాములకు బియ్యం బస్తాలు తీసుకువచి్చనప్పుడు తేమ శాతం అధికంగా ఉంటుంది. దాంతో బియ్యం నిల్వలు బరువు ఎక్కువ ఉంటాయి. కానీ గోదాముల నుంచి బియ్యాన్ని తరలించేటప్పుడు తేమ శాతం తగ్గుతుంది. దాంతో బియ్యం నిల్వల బరువు తగ్గుతుంది. ఇది సహజం. కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా 4,500 బస్తాలు తగ్గాయని ఏకపక్షంగా నిర్ధారించేశారు.రూ.1.68 కోట్లు రికవరీ కింద చెల్లించాలని నోటీసులిచ్చారు. తమ తప్పు ఏమాత్రం లేకపోయినప్పటికీ.. అంతా సక్రమంగా ఉన్నప్పటికీ పేర్ని నాని కుటుంబం అందుకు సమ్మతించింది. ఈ వ్యవహారంపై ఓ వైపు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తూనే మరోవైపు ప్రభుత్వం చెప్పినట్టుగా రూ.1.68 కోట్లు చెల్లించింది. నోటీసులకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా రికవరీగా చెల్లించమన్న మొత్తం చెల్లించేయడంతో నిబంధనల ప్రకారం దాంతో ఈ వ్యవహారాన్ని ముగించాలి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం వేధించాలన్న ఏకైక కుట్రతో ఆ గోదాం యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి జ యసుధపై అక్రమ కేసు నమోదు చేసింది.రికవరీ మొత్తం చెల్లించినప్పటికీ మరోసారి చెల్లించాలంటూ జేసీ ఈనెల 29న ఇచ్చిన నోటీసు బెయిల్‌ను సహించలేని ప్రభుత్వం ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును సవాల్ చేస్తూ పేర్ని నాని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ గోదాము వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను ఆధారాలుగా న్యాయస్థానానికి సమరి్పంచింది. తాము గోదాము నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించనే లేదని వీడియో ఆధారాలతో సహా తమ వాదనను బలంగా వినిపించింది. పేర్ని నాని కుటుంబ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. పేర్ని జయసుధకు సోమవారం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.రికవరీ మొత్తం చెల్లించాలని పేర్ని నాని కుటుంబానికి కృష్ణా జిల్లా జేసీ జారీచేసిన నోటీసుదాంతో చంద్రబాబు ప్రభుత్వం తమ పన్నాగానికి మరింత పదును పెట్టింది. అధికారులను సోమవారం మరోసారి ఆ గోదా ము కు పంపించింది. మరో రూ.1.67 కోట్లు రికవరీ మొత్తంగా చెల్లించాలని నోటీసులు ఇ చ్చింది. తద్వారా తమకు నిబంధనలు పట్టవని.. అక్రమ కేసులతో వేధించడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు ప్రభుత్వం బాహాటంగా వెల్లడించింది. ముందు చెప్పిన రికవరీ మొత్తాన్ని చెల్లించినా సరే మరోసారి రికవరీ మొత్తం చెల్లించాలని నోటీసులివ్వడాన్ని పరిశీలకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.ఇదీ చదవండి: ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే' -
జనసేన ఎమ్మెల్యే నానాజీ అనుచరుల భూకబ్జా
కాకినాడ: కూటమి ప్రభుత్వంలోని నేతల ఆగడాలు రోజు రోజుకు శ్రుతిమించితూనే ఉన్నాయి. కాకినాడలో జనసేన నేతల భూకబ్జా బాగోతం తాజాగా వెలుగుచూసింది. కాకినాడు రూరల్‌లో ఎమ్మెల్యే పంతం నానాజీ(Pantham Nanaji) అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. సర్పవరం ఇండస్ట్రియల్ ఏరియాలో కోటుల విలువ చేసే లే అవుట్ ప్లాట్లు కబ్జా(Land Grabbing) చేశారు. జనసేన నేత పుల్లా శ్రీరాములు కోట్లు విలువ చేసే భూమికి కబ్జా చేశారు. తన భూమిని జనసేన నేత పుల్లా శ్రీరాములు కబ్జా చేశారని కలెక్టర్, ఎస్పీలకు మాధవపట్నంకు చెందిన గుత్తుల జాన్సన్ కుటుంబం ఫిర్యాదు చేసింది.పోస్టల్ ఎంప్లాయిస్ సొసైటీ లేవుట్‌లో 658 గజాల భూమిని 2008-09లో రెండు ప్లాట్లుగా కొనుగోలు చేసింది జాన్సన్ కుటుంబం. అప్పటినుండి ఆ భూమి తనదే అంటూ శ్రీరాములు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే కోర్టును ఆశ్రయించారు. బాధితులు.మళ్లీ ఇటీవల తన అనుచరులతో జాన్సన్‌కు చెందిన ప్లాట్లను ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ నిర్మించారు. ఈ నేపథ్యంలో ఆ కాంపౌడ్ వాల్‌ను తన మనుషులతో కూలగొట్టించింది జాన్సన్ కుటుంబం. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెచ్చిపోతున్నపంతం నానాజీ అనుచరులు కాకినాడ లో కాకినాడలో ఎమ్మెల్యే నానాజీ అనుచరులు రెచ్చిపోతున్నారు. కొన్ని రోజుల క్రితం మత్స్యకారుల(Fishermen) దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ. 10 లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలోనే ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా జరగ్గకపోతే దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు. -
పవన్ ఓపెన్ అయితే ఇలా ఉంటుంది పుష్పా!
ఇంతకీ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో?.. అని ఇంతకాలం అటు రాజకీయ వర్గాలు, ఇటు సినీ వర్గాలు ఒక కుతూహలంతో ఎదురు చూశాయి. తీరా ఆయన ఓపెన్ అయ్యేసరికి.. ఆయన తన అభిప్రాయం చెప్పకపోయి ఉంటేనే బాగుండు అనుకుంటున్నాయి. ఈ ఇష్యూపై మీడియా చిట్‌చాట్‌లో పవన్ మాట్లాడి.. ఇంకా గంటలు కూడా గడవలేదు. కానీ, ఈ కామెంట్లు ఎంత ఫాస్ట్‌గా ప్రభావం చూపాయంటే.. మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్లీ తన్నుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసేంతలా.. !సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ జైలుకెళ్లి వచ్చాక దాదాపు సినీ పరిశ్రమ మొత్తం ఆయన్ని పరామర్శించింది. పవన్ మాత్రం ఇక్కడికైతే రాలేదు. ‘‘వచ్చేస్తున్నారహో..’’ అంటూ థంబ్‌నెయిల్స్‌తో సోషల్ మీడియాలో ఊదరగొట్టేశారు. అల్లుడి కోసం కదిలి వస్తున్నాడంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. అయితే అల్లు వారిని కనీసం ఫోన్ ద్వారా అయినా ఆయన పరామర్శించినట్లు ఎక్కడా సమాచారం లేదు. ఇది అల్లు అర్జున్ అభిమానులతో పాటు పవన్ అభిమానులను ఒకింత ఇబ్బందికి గురి చేసింది. వరుసకు మామ బంధుత్వంతోనైనా బన్నీని కలిసి ఉంటేనే.. పెద్దరికం నిలబెట్టుకున్నట్లు ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు.. ఈ ఇష్యూ మొదట్లో రాజకీయంగా తాము ఇబ్బందికి గురవుతున్నామన్న అభద్రతాభావం సినీ పెద్దల్లో కనిపించింది. అలాంటి టైంలో దాదాపు ముప్పై ఏళ్లపాటు సినీ రంగంలో ఉన్న పవన్ కల్యాణ్ తమకు మద్దతుగా ఒక్క మాట అయినా అంటారేమోనని యావత్ సినీ పరిశ్రమ భావించింది. కానీ, ఇవేవీ జరగక.. తనదైన శైలిలో కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. పవన్ ఏమన్నారో యధాతథంగా ఓసారి గమనిస్తే..‘‘ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు. మేము సినిమా థియేటర్‌కు వెళ్లడం ఎప్పుడో మానేశాం. విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు. చిరంజీవి(Chiranjeevi) ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు. నేనూ అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో స్టాఫ్ అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక... ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం!. అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదు. కానీ..ఇటువంటి ఘటనల్లో పోలీసులను నేను తప్పు పట్టను. ఎందుకంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు... అర్జున్‌కు చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చ అవకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే... ఆ నటుడుపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంటుంది. వెళ్లి ఆ బిడ్ట కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. సినిమా అంటే టీం... అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదు.ఈ ఘటనలో గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయంఅల్లు అర్జున్(Allu Arjun Row) విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపీంచింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. రేవంత్ రెడ్టిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందని.. సీఎం హోదాలో ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డికి రాంచరణ్, అల్లు అర్జున్‌లు చిన్ననాటి నుంచీ తెలుసు. అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా. కొన్నిసార్లు పరిస్థితులు బట్టి నిర్ణయాలు ఉంటాయి.రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడు. కింద నుంచి ఎదిగారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అలా చేశారు అని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) వీటన్నింటికీ మించిన నాయకుడు. ఆయన వైఎస్సార్సీపీ విధానాల తరహాలో అక్కడ(తెలంగాణలో) వ్యవహరించలేదు. అక్కడ బెన్ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపుకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పుష్ప సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచారు. ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. ‘సలార్’, ‘పుష్ప2’వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. ‘పుష్ప2’ సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుంది. మరి మనం రేవంత్ రెడ్డిను ఎలా తప్పు బడతాము?.రెండ్రోజుల కిందట.. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప రిమ్స్ వద్ద మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ విలేకరి అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి ప్రశ్నించారు. ఇది సంబంధం లేని ప్రశ్న అంటూ పవన్ దాటవేసే యత్నం చేశారు. ‘‘మీ ఫ్యామిలీ మెంబర్ కదా?’’ అని అదే విలేకరి ప్రశ్నించగా.. ఆవేశంతో ఊగిపోయిన పవన్.. ‘‘ఇప్పుడు మనుషులు మరణిస్తుంటే సినిమాల గురించి ఎందుకు? పెద్ద పెద్ద సమస్యలకు సంబంధించిన విషయాలు అడగండి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను.. బియాండ్ సినిమా గురించి డిబేట్ పెట్టండి. ఇక్కడ సమస్యల గురించి మాట్లాడండి. అరాచకాలపై డిబేట్ పెట్టండి'' అని క్లాస్ పీకారు.కట్ చేస్తే.. దిల్ రాజుతో భేటీ అయిన సందర్భంలోనే అల్లు అర్జున్ ఇష్యూ.. ఆయనకు పెద్ద సమస్యగా కనిపించిందేమో!. అందుకే ప్రధానంగా భావించి చాలాసేపు మాట్లాడారు. ఒకవైపు తన అల్లుడిదే తప్పనంటూ.. మరోవైపు చంద్రబాబు శిష్యుడనో లేకుంటే తోటి పొలిటీషియన్ అనో కాకుంటే ఒక స్టేట్‌కు సీఎం అనో.. రేవంత్ చేసిందే కరెక్ట్ అంటూ ప్రశంసలు గుప్పించారాయన. అదే సమయంలో.. ఇక్కడ పాపం అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు అంటూ కర్రతో కాల్చి ఆపై బర్నల్ రాసినంత పని చేశారు. ఒకప్పుడు పవన్ కల్యాణ్(P)awan Kalyan) ప్రసంగాలు అంటే.. గజిబిజి గందరగోళంగా ఉండేవన్న పేరు ఉండేది. ఆయన ఎప్పుడు.. ఏం మాట్లాడాతారో అర్థంకాక అభిమానులు తలలు పట్టుకునేవారు. అదృష్టవశాత్తూ.. ఎన్నికల టైంలో ఆయన్నొక తోపుగా సోషల్ మీడియా విపరీతమైన హైప్ తెచ్చి పెట్టింది. అయితే.. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన వైఖరిలో మార్పు వస్తుందేమోనని భావించిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. పైపెచ్చు.. పబ్లిక్‌గా అభిమానులనే తిడుతూ పబ్లిక్‌గా అసహనం ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అనే చందాన హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై పవన్ మాట్లాడారు. అయితే ఇది ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తే.. ఇలాగైనా తమ లీడర్‌కు ఎలివేషన్ ఇద్దామని భావించిన ఆయన ఫ్యాన్స్‌ను మాత్రం షరామాములుగా అయోమయంలో పడేసింది. ఏది ఏమైనా పవన్ తన వ్యాఖ్యలతో మరోసారి ఫ్యాన్స్ వార్‌కు మాత్రం ఆజ్యం పోశారు. -
నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి : నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్లో అవకాశం ఇవ్వడం లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పవన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..‘భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు.గతంలో జరిగిన ఎన్నికల్లో నాకు కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు వేయలేదు. అందుకే ఇక్కడ అన్నింటిని పక్కన పెట్టి ధైర్యమైన నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నాను.బీసీ, ఎస్సీ,ఎస్టీలు,అధికార, ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారు. జనసేన బలమైన పార్టీగా ఎదిగేదాకా నాకు ఆ వర్గాల నుంచి మద్దతు దొరకడం కష్టం. నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్లో అవకాశం ఇవ్వడం లేదు. నాతో సమానంగా పనిచేశారు. నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఇంకెవరు ఉన్నా ఇచ్చే వాళ్లం. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు.నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత నాతో కలిసి చేసి ఉంటే వాళ్ళకే కేబినెట్ పదవి ఇచ్చే వాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళను వారసత్వంగా చూడలేం. మొదట ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబు కేబినెట్లోకి వస్తారు. వచ్చే ఏడాది మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు’ అని వ్యాఖ్యానించారు. -
సీన్ మారిందని ఎల్లోమీడియాకూ స్పష్టమైనట్లుంది!
అంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల తిరుగుబాటు వేడి బాగానే తగులుతున్నట్లుంది. టీడీపీ జాకీమీడియా ‘ఆంధ్రజ్యోతి’ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పెడుతున్న శోకండాలే దీనికి నిదర్శనం. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు, ర్యాలీలు విజయవంతం కావడంతో టీడీపీ, దాని తోకమీడియాలిప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ప్రభుత్వంపై ఆరునెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అంచనాలను వైఎస్సార్సీపీ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరు దాన్ని ధ్రువీకరించింది. తమ కోడి కూయనిదే తెల్లవారదనుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఈ వార్తలను కప్పిపుచ్చేందుకు, గత ప్రభుత్వం పాలనే ఛార్జీల పెంపునకు కారణమంటూ బుకాయించే యత్నం చేసింది. కాకపోతే ప్రజలు తమకు కలిగిన నొప్పిని కూడా మరచిపోతారని అనుకుందీ ఎల్లో మీడియా! చంద్రబాబు మాకిచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అన్న ఆలోచన, విచక్షణ లేకుండా ప్రజలుంటారా? ప్రజల చెవుల్లో పూలు పెట్టి అధికారమైతే కొట్టేశామని టీడీపీ, జనసేన, బీజేపీలు సంతోషించవచ్చు. తమ వంచన చాతుర్యానికి ఈనాడు, ఆంధ్రజ్యోతులు మురిసి పోతూండవచ్చు. అయితే ఇది ఎంతో కాలం నిలవదన్న విషయం ఈపాటికి వీరికి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా స్వర్గంగా మారిందన్న భ్రమ కల్పించడానికి కూటమి, ఎల్లో మీడియా తంటాలు పడుతున్నాయి. తమ ఈ తాజా పాచిక పారడం లేదన్న విషయమూ వారికి స్పష్టమవుతోంది. మనసులోని ఆందోళనను మరింత పెంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై ఏకంగా రూ. 15 వేల కోట్ల భారం పెట్టింది ప్రభుత్వం. దీంతో సహజంగానే ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పంతా జగన్‌దే అని జాకీ పత్రిక నీచమైన కథనం ఇచ్చింది. ‘‘నాడు షాకులు ..నేడు శోకాలు’’ అంటూ హెడింగ్ పెట్టి, విద్యుత్ చార్జీల బాదుడు జగన్ దే అని నిస్సిగ్గుగా రాసింది. ఇది నిజమే అయితే చంద్రబాబుకు తాను విద్యుత్ చార్జీలు పెంచవలసిన అవసరం ఏమి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదని, వచ్చే ఏడాది సర్దుపోటు ఉందని ఎల్లో మీడియా చెబుతోంది. దానిని ఎవరైనా నమ్ముతారా? ఇది ఏ రకంగా జరుగుతుందో ఎక్కడైనా చెప్పారా? అంటే ఇప్పటికైతే నోరుమూసుకుని ఈ రూ.15 వేల కోట్లు చెల్లించాలని చెప్పడమే కదా? చంద్రబాబు టైమ్ లో పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.47 వేల కోట్ల బిల్లులను జగన్ పాలనలో చెల్లించారా?లేదా? అప్పుడు జగన్ ఏమైనా చంద్రబాబు నిర్వాకం గురించి ఏనాడైనా శోకించారా? మరి ఇప్పుడు ఎందుకు ఈ జాకీ మీడియా గుక్కపెట్టి రోదిస్తోంది?విద్యుత్తు సంస్కరణలకు తానే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు కాలం నుంచే సర్దుబాటు ఛార్జీల విధానం ఉందన్న విషయాన్ని మరచిపోయింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలుసు. ఇందుకు తగ్గట్టుగానే.. అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని, 30 శాతం మేర తగ్గిస్తానని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఆయన ఆ తరువాత యాభై నుంచి వంద శాతం పెంచేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా ఈ పెంపునూ సమర్థించేందుకు జగన్‌పై నిందలేసే పనిలో పడ్డాయి. ఇచ్చిన హామీ ఎందుకు తప్పుతున్నారని మాత్రం ప్రశ్నించవీ పత్రికలు! ఆర్థిక, రాజకీయ సంబంధాల కారణంగానే ఎల్లో మీడియాకు ప్రజావసరాల కంటే సొంత ప్రయోజనాలే ఇలాంటి కథనాలు రాస్తున్నారని అనుకోవాలి. చంద్రబాబు టైమ్‌లో అధిక రేట్లకు చేసుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించేందుకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రయత్నిస్తే... చంద్రబాబు, ఆయన జాకీ మీడియా కాని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని యాగీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా చౌకగా అంటే యూనిట్‌కు రూ.2.49లకే కొనుగోలు చేసినా దాన్ని ఈ మంద మెచ్చుకోలేదు సరికదా అభాండాలేసింది. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరుందంటూ తప్పుడు కథనాలు రాసింది. కేంద్రం సూచనల మేరకు రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు జగన్ చేసిన ప్రయత్నాన్ని ఉరితాళ్లుగా అభివర్ణించిన ఎల్లోమీడియా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని కొనసాగిస్తూండటం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. మీడియా ఇంత దుర్మార్గంగా మారితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఆలోచించాలి.విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపునకు స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉండింది. కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు ఆరు నెలలకే రోడ్లపైకి రావడమేంటని ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు కూడా. టీడీపీ కూటమి కేసులు పెడుతుందన్న భయం దీనికి ఒక కారణమైంది. కానీ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం ఈ సమస్యపై ప్రజల గొంతుకయ్యారు. పార్టీకి కట్టుబడి ఉన్న నేతలు ధైర్యంగా బయటకు రావడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్లయింది.ఆరు నెలలుగా వైఎస్సార్సీపీని అణచి వేసేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీకి ఇది అశనిపాతమే. ఎల్లోమీడియా మాత్రం తనదైన శైలిలో వాస్తవాలను వక్రీకరించేందుకు తన వంతు ప్రయత్నం మానలేదు. ఈ నేపధ్యంలోనే జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వెళ్లి స్వాగతం పలుకుతున్నారు.ఎవరు నిజాయితీగా పాలన చేసింది ప్రజలు అర్దం చేసుకుంటున్నారనిపిస్తుంది. ధర్మవరం మీదుగా బెంగుళూరు వెళుతున్నప్పుడు ఆయా గ్రామాల వద్ద పార్టీ కార్యకర్తలు, ప్రజలు అభివాదం పలికి ఆయనతో సెల్పీలు దిగడానికి పోటీపడిన వైనం, జయ జయ ధ్వానాలు చేసిన తీరు ఆయన క్రేజ్ ను తెలియచేస్తున్నాయి. పార్టీ కార్యకర్తల్లో పెరిగిన విశ్వాసానికి ఇవన్ని దర్పణం పడుతున్నాయని చెప్పవచ్చు. ‘‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ అన్న చంద్రబాబు నినాదం అసలు అర్థం కాస్తా.. ‘బాబు ష్యూరిటీబాదుడు గ్యారంటీ’గా మారిపోయిందన్నమాట.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రైతులను నమ్మించి వంచించడం చంద్రబాబు నైజం: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవసాయ రంగం(Agricultural sector) సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన చెందారు.ఇప్పటివరకు 95 మంది రైతులు(Farmers) ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా, అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైగానే ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి గుర్తు చేశారు.కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:సంక్షోభంలో వ్యవసాయ రంగం:ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతుల సమస్యలు పరిష్కరించకపోగా, ఎప్పటికప్పడు డైవర్షన్ పాలిటిక్స్‌తోనే సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం. ఒక పక్క భారీ వర్షాలు, వరదలు. మరోవైపు కరవు పరిస్థితి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.రైతుల ఆత్మహత్యలు బాధాకరం:తాజాగా వైయస్సార్ జిల్లాలో కన్నబిడ్డలతో సహా నాగేంద్ర, వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతో కలిచి వేసింది. ఇది ప్రభుత్వ అసమర్థతను, వ్యవసాయ రంగం పట్ల వారి ఉదాసీనతను తెలియజేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారిక లెక్కల ప్రకారం 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య 150కి పైగానే అని సమాచారం.రైతు ఆత్మహత్యలపై కూటమి పార్టీ నాయకులు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆత్మహత్యలు ఎక్కువ చూపిస్తే చంద్రబాబు అసమర్థ పాలనపై ప్రజల్లో ఆగ్రహం వెల్లుబుకుతుందని వారి భయం. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం దండగ అని గతంలో ఒకసారి చంద్రబాబు అనడం అందరికీ గుర్తుంది.పరిహార చెల్లింపులోనూ బాబు వంచన:రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటుంటే వారి కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఆయనది అదే ధోరణి. లక్ష రూపాయల పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారిని కించపర్చేలా మాట్లాడిన చంద్రబాబు, నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2003 నాటికి ఆ పరిహారం కూడా ఆపేశారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన తర్వాత కూడా 2015, ఫిబ్రవరి 18 వరకు ఆ పరిహారం రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చారు. దాన్ని రూ.5 లక్షలకు పెంచుతామని చెప్పి, ఆ డబ్బును నేరుగా బాధిత కుటుంబానికి కూడా అందజేయకుండా వంచించారు.లక్షన్నర బ్యాంకు రుణాల కోసం కేటాయించి, మిగతా మూడున్నర లక్షలు కూడా వారికి ఇవ్వకుండా బ్యాంకుల్లో జమ చేసి వడ్డీతోనే జీవించాలనేలా చేసి మోసగించాడు. 2014– 19 మధ్య చూస్తే దాదాపు 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ప్రభుత్వం గుర్తించింది కేవలం 1223 మందిని మాత్రమే. ఆ మొత్తం కుటుంబాలకు కాకుండా, కేవలం 450 కుటుంబాలకు మాత్రమే రూ.20.12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిహారం:2019లో జగన్‌గారు సీఎం అయ్యాక, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని ఒకేసారి రూ.7 లక్షలకు పెంచడంతో పాటు, చంద్రబాబు పాలనా కాలంలో ఆత్మహత్యల పరిహారం అందని కుటుంబాలకు కూడా న్యాయం చేశారు. ఆ విధంగా 474 మంది రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1794 కుటుంబాలకు రూ.116.10 కోట్ల పరిహారం అందించగా, వారిలో 495 కుటుంబాలు కౌలు రైతులవి.రైతులకు చంద్రబాబు మోసం:నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తే.. 2014 అధికారంలోకి రావడం కోసం రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్న చంద్రబాబు, వారిని దారుణంగా మోసగించారు. మళ్లీ మొన్న ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, దాన్ని కూడా అమలు చేయకుండా మరోసారి మోసం చేశారు. రైతు భరోసా కింద వైయస్సార్సీపీ ప్రభుత్వం 53.58 లక్షల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం చేసింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వారికి రూ.20 వేలు ఇవ్వాలంటే, ఈ ఏడాది రూ.10,718 కోట్లు కావాలి. కానీ, బడ్జెట్లో ఆ కేటాయింపు చేయకుండా మరోసారి చంద్రబాబు రైతులను వంచించారు.ఎన్నికల కోడ్ వల్ల గత ప్రభుత్వం చెల్లించలేకపోయిన రూ.930 కోట్ల రైతుల ప్రీమియం, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చెల్లించని కారణంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు దక్కాల్సిన రూ.1385 కోట్ల బీమా దూరమైంది. ఉచిత పంటల బీమా పథకానికి కూడా కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. మా ప్రభుత్వ హయాంలో యూనివర్సలైజేషన్ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేకుండా నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియం, కేంద్ర ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది. ఇదీ చదవండి: చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గనరైతులకు బాబు బకాయి రూ.12,563 కోట్లు:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఏమేం ఎగ్గొట్టిందనేది చూస్తే.. ఆ విలువ ఏకంగా రూ.12,563 కోట్లు. 2023–24 రబీ సీజన్లో దాదాపు 3.91 లక్షల మంది రైతులకు చెందాల్సిన కరువు సాయం రూ.328 కోట్లు. సున్నావడ్డీ రాయితీ కింద 2023 సీజన్‌కి సంబంధించి 6.31 లక్షల మంది రైతులకు రూ.132 కోట్లు. పెట్టుబడి సాయం. సున్నా వడ్డీ పంట రుణాలు. కరవు సాయం.. ఇలా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు హామీ ఇచ్చి చంద్రబాబు ఎగ్గొట్టిన మొత్తం సాయం దాదాపు రూ.12,563 కోట్లు. వెంటనే ప్రభుత్వం వాటన్నింటినీ అందించాలి.కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు:రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 54.55 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు బీమా పరిహారం చెల్లించడం జరిగింది. ఇంకా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తూ 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పుడు కూటమి పాలనలో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైంది.ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగడం లేదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సరిపడా ఎరువులు అందడం లేదు. రైతులే బహిరంగంగా కూటమి పాలనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియాపై రూ.100 అదనంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. కొన్నిచోట్ల కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తే తప్ప యూరియా దొరకని దుస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ధాన్యం కొనుగోళ్లలో దళారుల రాజ్యం నడుస్తోంది. వాట్సాప్‌లో హాయ్ అని పెడితే కొంటానని చెబుతాడే తప్ప ఎక్కడా మద్దతు ధరకు కొనుగోలు చేసిన పరిస్థితులు కనిపించడం లేదు.ఇవీ మా డిమాండ్స్:ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేల చొప్పున అందించాలి. ప్రతి పంటకు ఈ–క్రాపింగ్ చేసి ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి. ఆర్బీకే వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలి. రైతులకు బోనస్‌తో కలిపి మద్ధతు ధర చెల్లించాలి. ప్రభుత్వం ఇంకా రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే, వారి పక్షాన నిలబడి పోరాడుతామని కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు. -
2 రోజులే గడువుందంటూ.. టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తిరుపతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుకు డ్వాక్రా మహిళలకు టీడీపీ నేతలు వాయిస్ మెసేజ్‌లు చేస్తూ బరితెగించేశారు. రూ.100తో టీడీపీ సభ్యత్వ నమోదు, సీఎంఆర్ఎఫ్, రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. స్వయం ఉపాధి డ్వాక్రా మహిళలను టీడీపీ నేతల ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు.టీడీపీ నేతల సభ్యత్వ నమోదు వైరల్‌గా మారింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇదే వైఖరి టీడీపీ అవలంభిస్తోంది. 2 రోజులే గడువు ఉందంటూ డ్వాక్రా గ్రూప్‌లో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలంటూ డ్వాక్రా సంఘాలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు.అధికారుల సాక్షిగా.. తమ్ముళ్ల దాష్టీకం!భాకరాపేట: అధికారం ఉంది కదా అని ప్రభుత్వ అధికారులు.. పోలీసుల సాక్షిగా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రైతులతోపాటు పంట పొలాలపై దాడికి తెగబడ్డారు. అన్నదాతలపై ప్రతాపం చూపారు. పట్టా భూమిలో కాలువ, కాలినడక బాట ఉందంటూ అర్ధరాత్రి పచ్చని చెట్లను నరికివేశారు. పంట పొలాల చుట్టూ ఏర్పాటు ఏర్పాటుచేసిన కంచెను జేసీబీలతో పెకలించేశారు. పట్టా భూమిలో దౌర్జన్యం చేస్తున్న వారికి కోర్టు ఉత్తర్వులు చూపించేందుకు వచ్చిన రైతులపై దాడిచేశారు. సాక్షాత్తు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఓ రైతుకు చెందిన పట్టా భూమిలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా రోడ్డు ఏర్పాటు చేశారు.కళ్లముందు రైతులపై టీడీపీ నేతలు దాడి చేస్తున్నా పోలీసులు చూస్తుండిపోయారు. ఇదంతా ఎక్కడో కాదు ముఖ్యమంత్రి స్వగ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం దిగవూరు రెవెన్యూ గ్రామం మట్లువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధితులు, స్థానికుల వివరాల మేరకు.. దిగవూరు రెవెన్యూ లెక్క దాఖలు 182, 183 సర్వే నంబర్లులో విశ్రాంత అధ్యాపకుడు దొడ్డిపల్లి రాజారెడ్డికి దాదాపు 12.5 ఎకరాల వారసత్వ ఆస్తి ఉంది. ఈ భూమికి ఆనుకుని ఉన్న కాలినడక వదలివేసి కంచె వేసుకున్నానని రాజారెడ్డి చెబుతున్నారు.తమకు చెందిన భూమిలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేదని, పొలంలో వర్షపు నీరు వెళ్లడానికి చిన్న కాలువ తీసుకుంటే అదే కాలువను బండిబాటగా వేయాలని టీడీపీ నాయకులు వచ్చి తనను, తన సోదరుడు సుధాకర్‌రెడ్డిని చితకబాదినట్లు రాజారెడ్డి తెలిపారు. సుధాకర్‌రెడ్డి సెల్‌ఫోన్ ధ్వంసం చేశారని తెలిపారు. ఇదంతా భాకరాపేట ఎస్ఐ, పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా.. వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలానికి వేసుకున్న రెండు గేట్లు తొలగించి, వారికి ఇష్టం వచ్చినట్లు ఎక్కడబడితే అక్కడ కంచెను తొలగించి దారి ఏర్పాటు చేసుకున్నారన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు కూడా వినలేదని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తన పొలం తనకు అప్పగించి న్యాయం చేయాలని విన్నవించారు. -
కూటమి ‘కుట్ర’ రాజకీయాలు: మనోహర్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిందని చేస్తున్నారని వైఎస్సార్సీపీ లీగల్ (YSRCP Legal Cell) సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడపలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నానా అల్లరి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి సమావేశం జరగకుండా గొడవ చేశారని.. గాలివీడు(Galividu)లో కూడా ఇదే తరహాలో టీడీపీ నేతలు వ్యవహరించారని మనోహర్‌రెడ్డి(Manohar Reddy) నిప్పులు చెరిగారు.‘‘జల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. కారప్పొడి, పెప్పర్ స్ప్రేతో 100 మందికి పైగా దాడి చేసేందుకు యత్నించారు. సుదర్శన్ రెడ్డి దౌర్జన్యం చేశారని కట్టుకథ అల్లారు. నిత్యం ప్రజల్లో ఉండే సుదర్శన్ రెడ్డికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న సుదర్శన్ రెడ్డిని తీవ్రవాది మాదిరి ఈడ్చుకుంటూ పోవడం దారుణం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ కక్ష, రాజకీయ దురుద్ధేశంతో చేసినవే’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘గాలివీడులో వైఎస్సార్సీపీలో చురుగ్గా ఉండే నాయకులపై కేసులు బనాయించాలని కుట్ర చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. బాధితుల పక్షాన నిలబడకుండా రాజకీయ దురుద్ధేశంతోనే పవన్ గాలివీడులో పర్యటించారు. బలవంతంగా వైఎస్సార్సీపీ వారి ఆస్తులు లాక్కుంటున్నా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ప్రభుత్వంపై ఎవరు నిరసన తెలిపినా.. వారి పై కేసులు పెడుతున్నారు. అధికారంలోకి రాకముందు 34 వేల మంది మహిళలు అపహరణకు గురయ్యారని పవన్ చెప్పారు. ఈ రోజు ఆ 34 వేల మంది ఎక్కడున్నారో పవన్ సమాధానం చెప్పాలి’’ అని మనోహర్‌రెడ్డి నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గన‘‘కాకినాడలో దళిత డాక్టర్‌పై జనసేన ఎమ్మెల్యే బూతులు తిడుతూ దాడి చేస్తే పవన్ ప్రశ్నించలేదు. పరామర్శించలేదు. యలమంచిలి ఎమ్మెల్యే విలేకరిని కిడ్నాప్ చేస్తే పవన్ ప్రశ్నించలేదు.. పరామర్శించలేదు. ముచ్చుమర్రిలో మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ స్పందించలేదు. పిఠాపురంలో టీడీపీ నేత బాలికపై లైంగికదాడి చేస్తే ఆ కుటుంబాన్ని పవన్ ప్రశ్నించలేదు. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేత వీఆర్వో పై బీర్ బాటిల్ తో దాడి చేస్తే స్పందించలేదు.. ఖండించలేదు. కేవలం రాజకీయదురుద్ధేశంతోనే పవన్ గాలివీడులో పర్యటించాడు’’ అని మనోహర్‌రెడ్డి చెప్పారు.‘‘మూడు పార్టీలు ఏకమైతేనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జగన్ సింగిల్‌గా పోటీ చేస్తే 40 శాతం ఓట్లు వచ్చాయని పవన్ గుర్తుంచుకోవాలి. ఆరు నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రేగింది. మరో ఆరు నెలల తర్వాత గన్మెన్లు లేకుండా కూటమి నేతలు ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. గాలివీడు ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. పోలీసులు కూటమి నేతలు మాటలు వినడం మానుకోవాలి. గాలివీడు ఘటనను న్యాయవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుంది’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: అప్పుడు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు.. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అలాగే, ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు.మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు 1998లో కూడా విజన్-2020 అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు. ప్రజలు ఐదేళ్ల కోసం గెలిపించుకుంటారా? వచ్చే 20 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా?. మన మేనిఫెస్టోనే మన విజన్. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి నీకు 15వేలు, నీకు 18వేలు అంటూ లెక్కలేసి హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు మేనిఫెస్టోనే కదా. ఆరు నెలలు అయ్యింది. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది?.పథకాల అమలేదీ..యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా.. నిరుద్యోగ భృతి అన్నారు.. ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు.. అది కూడా ఇవ్వడం లేదు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అదీ లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు.. అది ఏమైంది?. తల్లికి వందనం అమలు చేయాలంటే రూ.12,450 కోట్లు అవసరం. కానీ, కేవలం రూ.5,386కోట్లు కేటాయించారు. అంటే, తల్లికి వందనం లేనట్టే. దీపం పథకానికి రూ.3,955 కోట్లు అవసరం ఉంటే.. కేవలం రూ.895 కోట్లు కేటాయించారు. అంటే ఈ ఏడాది దీపం పథకం కూడా లేనట్టే. ఆడబిడ్డ నిధికి రూ.37,313 కోట్లు అవసరం.. కానీ, కేటాయింపులు మాత్రం సున్నా. దీంతో, అది కూడా లేనట్టే.ప్రశ్నిస్తానన్న నేత ఎక్కడ?కూటమిలో ఒక వ్యక్తి ప్రశ్నిస్తా అన్నాడు.. కాన్నీ, ప్రశ్నించడం లేదు. కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఓ నేత పక్కకు వెళ్లిపోయారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన మహిళల బంగారం బయటకు తెస్తామన్నారు. అలాగే, బెల్టు షాపులు రద్దు అన్నారు.. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తామన్నారు.. ఒక్కరికైనా ఇచ్చారా?.అప్పుల్లో బాబుదే రికార్డ్..2014-19 మధ్యలో కాపులకు ఐదేళ్లలో 5వేల కోట్లు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. చేనేత రుణాలకు మాఫీ అన్నాడు. ఏమీ చేయలేదు. పుట్టిన ప్రతీ బిడ్డకు మహాలక్ష్మీ పథకం కింద డబ్బులు ఇస్తామన్నాడు.. ఇచ్చాడా?. హామీలు అమలు చేయకుండా ఇప్పుడు విజన్ డ్యాకుమెంట్ రిలీజ్ చేస్తున్నాడు. జూన్‌లో రూ.6వేల కోట్ల అప్పు. జూలైలో రూ.10వేల కోట్లు, ఆగస్టులో రూ.3వేల కోట్లు, సెప్టెంబర్‌లో రూ.4వేల కోట్లు, అక్టోబర్‌లో రూ.6వేల కోట్లు, నవంబర్‌లో రూ.4వేల కోట్లు, డిసెంబర్లో రూ.9వేల కోట్లు అప్పులు చేశారు. ఒకేసారి రూ.5వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర టీడీపీదే. కేవలం అమరావతి పేరుతో రూ.31వేల కోట్లు అప్పులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి. అప్పులు ఎవరు కడతారు. వైఎస్సార్సీపీ హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు.. మీరు ఏకంగా 22.6 శాతం అప్పులు చేశారు’ అని చెప్పారు. -
జనవరి 3న జరగాల్సిన వైఎస్సార్సీపీ ధర్నా వాయిదా
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ధర్నాలో మార్పు జరిగింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా విద్యార్థులకు బాసటగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళనన కార్యక్రమాన్ని జనవరి 29కి ఆ పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, 3వ తేదీన ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా 29న నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది.పోరుబాట విజయవంతం:ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు రూ.1.20 నుంచి రూ.1.25 పైసలు చొప్పున దాదాపు రూ.15,600 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినియోగదారులతో కలిసి వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయమన్న హామీ నిలబెట్టుకోవాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స డిమాండ్ చేశారు. -
పవన్.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడమే తన విధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, అన్నమయ్య జిల్లా గాలివీడులో పవన్‌కళ్యాణ్ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని విమర్శించారు. అదే ప్రాంతంలో జరిగిన రైతు ఆత్మహత్యను హేళన చేసేలా డిప్యూటీ సీఎం మాట్లాడటం దారుణమని అన్నారు.గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు:గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో దాడిని రాజకీయం చేస్తూ, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హుటాహుటిన పర్యటించారు. కడపలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పరామర్శించడంతో పాటు, గాలివీడు మండల పరిషత్ కార్యాలయం సందర్శించిన ఆయన, ఏ మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా, ఏకపక్షంగా మాట్లాడడం దారుణం. పిచ్చిగా విమర్శలు చేయడం, హెచ్చరికలు జారీ చేయడం అత్యంత హేయం.గాలివీడులో వాస్తవంగా ఏం జరిగింది?:మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆ ప్రాంతంలో 30 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడుగా ఉన్నారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పని చేస్తున్నారు. ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. కిందిస్థాయి సిబ్బంది పిలవడంతోనే ఆయన ఎంపీపీ ఛాంబర్‌కు వెళ్లారు. ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ వారు ఆయనపై దాడి చేశారు. ఏకంగా పెప్పర్ స్ప్రే ఉపయోగించారంటే వారి ఉద్దేశం అర్థమవుతోంది. అటువంటి దారుణ ఘటనలో న్యాయవాదిగా, మంచిపేరున్న నాయకుడుగా ఉన్న సుదర్శన్‌రెడ్డిపై పోలీసులు హేయంగా వ్యవహరించారు.ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలంటే, ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్స్ డేటా పరిశీలిస్తే, ఎవరు దీనికి ఆదేశాలు ఇచ్చారు? ఎవరు హింసను ప్రేరేపించారు? అన్నది తెలుస్తుంది. బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్‌కళ్యాణ్‌కు ఇవ్వన్నీ తెలుసుకునే ఓపిక లేదు. ఏకపక్షంగా ఆయన మాట్లాడటం, వైయస్ఆర్సీపీని రాజకీయ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం.రాయలసీమపై చులకన భావం:పవన్‌కళ్యాణ్ మాటల్లో రాయలసీమ ప్రజలపై చులకనభావం కనిపిస్తోంది. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఈ వైఖరి పెరిగిపోయింది. ఎక్కడో రైలు తగలబడితే రాయలసీమ గూండాలు చేశారంటూ గతంలో ఆయన మాట్లాడిన మాటలను మరిచిపోలేదు. రాయలసీమ ప్రాంతం నుంచి హైకోర్ట్‌ను, లా వర్సిటీని తీసుకుపోతున్నా పవన్ ఎందుకు స్పందించడం లేదు? ఆయనకు కూడా ఈ ప్రాంతం పట్ల మంచి భావం లేదనేదే దీనికి అర్థం.రైతు ఆత్మహత్యలు కనిపించడం లేదా?:గాలివీడు పర్యటన సందర్భంగా అక్కడకు సమీపంలోనే రైతు ఆత్మహత్య జరిగింది. దీనిపై మీడియా పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించగా ఆయన స్పందించిన తీరు చాలా దారుణంగా ఉంది. రైతులకు పంటలు బాగానే వచ్చాయి. డబ్బులు బాగానే ఉన్నాయి. అయినా, ఎందుకు చనిపోయారు? అంటూ పవన్ చాలా హేళనతో మాట్లాడిన తీరు బాధ కలిగిస్తోంది.దళితులపై అత్యాచారాలు, అవమానాలు జరిగినప్పుడు, తన పార్టీ ఎమ్మెల్యేలే దాడి చేసినప్పుడు పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? కడప అనగానే రాజకీయం చేయాలని ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో జరుగుతున్న సమయంలో, ఇక్కడ కడపలో పవన్‌కళ్యాణ్ రాజకీయం చేశారు. రైతుల ఆత్మహత్యలపై చులకనగా మాట్లాడారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరిస్తారా?తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే పవన్ లక్ష్యం:తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే తన లక్ష్యంగా, వైఎస్సార్సీపీని రాజకీయంగా దూషించడమే తన విధానంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా, దానిలో వైయస్సార్సీపీ ప్రమేయం ఉందనే ఆరోపణలు రాగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తు్తన్నారు. కనీసం ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏకపక్షంగా విషయాన్ని వింటూ, రాజకీయంగా వైయస్ఆర్సీపీపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు.వాటన్నింటిపై ఎందుకు స్పందించలేదు?:కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లకే వినుకొండలో నడిరోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. దానిపై పవన్ మౌనంగా ఉన్నారు. నందికొట్కూరులో బీసీ మెనర్ బాలికపై దారుణ అత్యాచారం చేసి, హతమార్చినా ఆ కుటుంబాన్ని ఇంత వరకు పరామర్శించ లేదు. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావించారు. ఈరోజు దానిపై ఎక్కడా మాట్లాడటం లేదు. బద్వేల్‌కు చెందిన ఒక బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ బాలిక కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. బాలిక కుటుంబసభ్యులను కూడా పవన్ పరామర్శించ లేదు.కాకినాడలో జనసేన ఎమ్మెల్యే నానాజీ ఒక దళిత ప్రోఫెసర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసినా కనీసం తన ఎమ్మెల్యేను ప్రశ్నించే సాహసం చేయలేదు. పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే దానిపైనా మాట్లాడలేదు. యలమంచిలిలో జనసేన ఎమ్మెల్యే విలేకరులను నిర్భందించి వేధిస్తే కనీసం పెదవి విప్పలేదు. ఇదేనా పవన్‌కళ్యాణ్ విధానం?. ప్రశ్నిస్తాను అన్న ఆయన నైజం?హామీలపైనా నోరు మెదపడం లేదు:కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా సూపర్ సిక్స్ హామీల అమలు లేదు. దానిపై పవన్ మాట్లాడ్డం లేదు. ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తొలగిస్తున్నారు. ఉద్యోగులకు డీఎ, ఐఆర్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలను పెద్ద ఎత్తున పెంచుతున్నారు. రైతులను ఆదుకునే చర్యలు అంతకన్నా లేవు. వీటన్నింటిపై పవన్ ప్రశ్నలు ఏమయ్యాయి? సన్నాతన ధర్మం అన్నారు. తిరుపతి లడ్డూ అన్నారు. తరువాత వాటిపై మాట్లాడటమే మానేశారు.ఇకనైనా వైఖరి మార్చుకోవాలి:రాజకీయం కోసమే పవన్‌కళ్యాణ్ ఇలా వ్యవహరించడం దారుణం. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన సంఘటనలో జవహర్‌బాబుకు మంచి జరగాలి. అదే క్రమంలో ఎందుకు పెప్పర్ స్ప్రే చల్లారనే దానిపైనా విచారణ జరగాలి. అలా కాకుండా ఏకపక్షంగా వైయస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుంటూ, ఆ పార్టీని ఎక్కడా ఉండనివ్వకూడదు అనేది దారుణమైన ఆలోచనలు చేయడం అత్యంత హేయం. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అధికారంలో ఉన్న వారు ముందుగా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అలా కాకుండా ఏకపక్షంగా ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే పవన్‌కళ్యాణ్ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.