breaking news
-
పవన్.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడమే తన విధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, అన్నమయ్య జిల్లా గాలివీడులో పవన్‌కళ్యాణ్ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని విమర్శించారు. అదే ప్రాంతంలో జరిగిన రైతు ఆత్మహత్యను హేళన చేసేలా డిప్యూటీ సీఎం మాట్లాడటం దారుణమని అన్నారు.గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు:గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో దాడిని రాజకీయం చేస్తూ, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హుటాహుటిన పర్యటించారు. కడపలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పరామర్శించడంతో పాటు, గాలివీడు మండల పరిషత్ కార్యాలయం సందర్శించిన ఆయన, ఏ మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా, ఏకపక్షంగా మాట్లాడడం దారుణం. పిచ్చిగా విమర్శలు చేయడం, హెచ్చరికలు జారీ చేయడం అత్యంత హేయం.గాలివీడులో వాస్తవంగా ఏం జరిగింది?:మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆ ప్రాంతంలో 30 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడుగా ఉన్నారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పని చేస్తున్నారు. ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. కిందిస్థాయి సిబ్బంది పిలవడంతోనే ఆయన ఎంపీపీ ఛాంబర్‌కు వెళ్లారు. ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ వారు ఆయనపై దాడి చేశారు. ఏకంగా పెప్పర్ స్ప్రే ఉపయోగించారంటే వారి ఉద్దేశం అర్థమవుతోంది. అటువంటి దారుణ ఘటనలో న్యాయవాదిగా, మంచిపేరున్న నాయకుడుగా ఉన్న సుదర్శన్‌రెడ్డిపై పోలీసులు హేయంగా వ్యవహరించారు.ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలంటే, ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్స్ డేటా పరిశీలిస్తే, ఎవరు దీనికి ఆదేశాలు ఇచ్చారు? ఎవరు హింసను ప్రేరేపించారు? అన్నది తెలుస్తుంది. బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్‌కళ్యాణ్‌కు ఇవ్వన్నీ తెలుసుకునే ఓపిక లేదు. ఏకపక్షంగా ఆయన మాట్లాడటం, వైయస్ఆర్సీపీని రాజకీయ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం.రాయలసీమపై చులకన భావం:పవన్‌కళ్యాణ్ మాటల్లో రాయలసీమ ప్రజలపై చులకనభావం కనిపిస్తోంది. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఈ వైఖరి పెరిగిపోయింది. ఎక్కడో రైలు తగలబడితే రాయలసీమ గూండాలు చేశారంటూ గతంలో ఆయన మాట్లాడిన మాటలను మరిచిపోలేదు. రాయలసీమ ప్రాంతం నుంచి హైకోర్ట్‌ను, లా వర్సిటీని తీసుకుపోతున్నా పవన్ ఎందుకు స్పందించడం లేదు? ఆయనకు కూడా ఈ ప్రాంతం పట్ల మంచి భావం లేదనేదే దీనికి అర్థం.రైతు ఆత్మహత్యలు కనిపించడం లేదా?:గాలివీడు పర్యటన సందర్భంగా అక్కడకు సమీపంలోనే రైతు ఆత్మహత్య జరిగింది. దీనిపై మీడియా పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించగా ఆయన స్పందించిన తీరు చాలా దారుణంగా ఉంది. రైతులకు పంటలు బాగానే వచ్చాయి. డబ్బులు బాగానే ఉన్నాయి. అయినా, ఎందుకు చనిపోయారు? అంటూ పవన్ చాలా హేళనతో మాట్లాడిన తీరు బాధ కలిగిస్తోంది.దళితులపై అత్యాచారాలు, అవమానాలు జరిగినప్పుడు, తన పార్టీ ఎమ్మెల్యేలే దాడి చేసినప్పుడు పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? కడప అనగానే రాజకీయం చేయాలని ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో జరుగుతున్న సమయంలో, ఇక్కడ కడపలో పవన్‌కళ్యాణ్ రాజకీయం చేశారు. రైతుల ఆత్మహత్యలపై చులకనగా మాట్లాడారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరిస్తారా?తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే పవన్ లక్ష్యం:తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే తన లక్ష్యంగా, వైఎస్సార్సీపీని రాజకీయంగా దూషించడమే తన విధానంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా, దానిలో వైయస్సార్సీపీ ప్రమేయం ఉందనే ఆరోపణలు రాగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తు్తన్నారు. కనీసం ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏకపక్షంగా విషయాన్ని వింటూ, రాజకీయంగా వైయస్ఆర్సీపీపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు.వాటన్నింటిపై ఎందుకు స్పందించలేదు?:కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లకే వినుకొండలో నడిరోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. దానిపై పవన్ మౌనంగా ఉన్నారు. నందికొట్కూరులో బీసీ మెనర్ బాలికపై దారుణ అత్యాచారం చేసి, హతమార్చినా ఆ కుటుంబాన్ని ఇంత వరకు పరామర్శించ లేదు. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావించారు. ఈరోజు దానిపై ఎక్కడా మాట్లాడటం లేదు. బద్వేల్‌కు చెందిన ఒక బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ బాలిక కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. బాలిక కుటుంబసభ్యులను కూడా పవన్ పరామర్శించ లేదు.కాకినాడలో జనసేన ఎమ్మెల్యే నానాజీ ఒక దళిత ప్రోఫెసర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసినా కనీసం తన ఎమ్మెల్యేను ప్రశ్నించే సాహసం చేయలేదు. పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే దానిపైనా మాట్లాడలేదు. యలమంచిలిలో జనసేన ఎమ్మెల్యే విలేకరులను నిర్భందించి వేధిస్తే కనీసం పెదవి విప్పలేదు. ఇదేనా పవన్‌కళ్యాణ్ విధానం?. ప్రశ్నిస్తాను అన్న ఆయన నైజం?హామీలపైనా నోరు మెదపడం లేదు:కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా సూపర్ సిక్స్ హామీల అమలు లేదు. దానిపై పవన్ మాట్లాడ్డం లేదు. ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తొలగిస్తున్నారు. ఉద్యోగులకు డీఎ, ఐఆర్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలను పెద్ద ఎత్తున పెంచుతున్నారు. రైతులను ఆదుకునే చర్యలు అంతకన్నా లేవు. వీటన్నింటిపై పవన్ ప్రశ్నలు ఏమయ్యాయి? సన్నాతన ధర్మం అన్నారు. తిరుపతి లడ్డూ అన్నారు. తరువాత వాటిపై మాట్లాడటమే మానేశారు.ఇకనైనా వైఖరి మార్చుకోవాలి:రాజకీయం కోసమే పవన్‌కళ్యాణ్ ఇలా వ్యవహరించడం దారుణం. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన సంఘటనలో జవహర్‌బాబుకు మంచి జరగాలి. అదే క్రమంలో ఎందుకు పెప్పర్ స్ప్రే చల్లారనే దానిపైనా విచారణ జరగాలి. అలా కాకుండా ఏకపక్షంగా వైయస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుంటూ, ఆ పార్టీని ఎక్కడా ఉండనివ్వకూడదు అనేది దారుణమైన ఆలోచనలు చేయడం అత్యంత హేయం. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అధికారంలో ఉన్న వారు ముందుగా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అలా కాకుండా ఏకపక్షంగా ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే పవన్‌కళ్యాణ్ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. -
‘పవన్.. మీ గొంతు మూగబోయిందా?’
వైఎస్సార్ జిల్లా: ఏపీలో రైతులు కష్టాలు పడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి. విద్యుత్ చార్జీలు పెంచను అని హామీ ఇచ్చి పెంచుతుంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చుగా..?, ప్రశ్నించే గొంతు మూగబోయిందా..? మీరు అధికారంలో ఉన్నా జగన్‌ను మాత్రమే ప్రశ్నిస్తావా’ అంటూ ధ్వజమెత్తారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించడానికి పవన్ ఆగమేఘాలపై వచ్చారు. ఎవర్ని పరామర్శించినా ఆహ్వానించదగినదే. అయితే జరిగిన సంఘటన ఎంత తీవ్రమైంది అనేది కూడా చూడాలి. ఎంపీపీ కుమారుడు మండల ఆఫీసు సిబ్బంది పిలిస్తే వెళ్లారు. అక్కడ ఎంపీపీ(MPP) ఛాంబర్ కు తాళాలు వేశారు..ఓపెన్ చేయండి అని అడిగారు. ముందుగా పథకం ప్రకారం ఎంపీడీవోపై దాడి అంటూ వందల మంది టిడిపి వారు వచ్చేసారు. టీడీపీ వారు రావడంతో అక్కడే తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఎంపీడీవోపై కుర్చీ పడి దెబ్బ తగిలింది. దాన్ని డిప్యూటీ సీఎం పవన్ డైవర్ట్ చేసే కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ చార్జీలపై మేం చేసే పోరుబాటను డైవర్ట్ చెయ్యడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. చంద్రబాబు తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్‌ను పంపుతున్నారు. గాలివీడు సంఘటనను కూడా అలాగే ఉపయోగించుకున్నారు. ముందుగానే ఎవరిపై కేసు పెట్టాలో కూడా నిర్ణయించుకున్నారు. ఎంపీడీవోకి ఏమీ కాకపోయినా ఆయన్ను రిమ్స్‌కి తెచ్చి హడావుడి చేశారు. సింహాద్రిపురం మండలం దుద్దెకుంటలో ఒక రైతు కుటుంబం చనిపోయింది. రైతులకు మద్దతు ధర లేకపోవడం వల్ల, పంట నష్టం ఇవ్వని కారణంగా ఆ రైతు కుటుంబం ఆత్మహత్యకు ఒడిగట్టారు అదే జగన్(YS Jagan) ఉంటే ఆ రైతు కుటుంబం చనిపోయేది కాదు. ప్రశ్నిస్తాను అనే పవన్ కళ్యాణ్ రైతు కష్టాలపై ఎందుకు ప్రశ్నించరు...?, ఇంత దూరం వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ రైతు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..?, చంద్రబాబు అడే డ్రామాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు వద్దకు ఎందుకు వెళ్ళడం లేదు...?, ఉక్కు ఉద్యోగుల తరఫున పవన్(Pawan Kalyan) ప్రశ్నించవచ్చుగా..?, పిఠాపురంలో జాన్ అనే జనసేన నాయకుడు ఓ మైనర్ బాలికను రేప్ చేస్తే ఎందుకు పరామర్షించలేదు..?, మీ ఎమ్మెల్యే నానాజీ ఒక సీనియర్ ప్రొఫెసర్ పై దాడి చేస్తే నువ్వు ఎందుకు కట్టడి చేయలేదు..?, కానీ డైవర్ట్ చెయ్యడానికి గాలివీడు వచ్చి చంద్రబాబు చెప్పినట్లు నటిస్తున్నాడు. మీ నాటకాలన్నీ ప్రజలు చూస్తున్నారు..ప్రజలే బుద్ధి చెప్తారు’ అని మండిపడ్డారు రవీంద్రనాథ్‌రెడ్డి. -
ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: బొత్స
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం వేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మండిపడ్డారు. పోరుబాటలో పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల హామీలను చంద్రబాబు(chandrababu) వెంటనే అమలు చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది. ఇప్పటివరకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల్లోనే 74 వేల కోట్లు అప్పులు చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి 15 వేల కోట్లు అప్పు చేశారు. మొత్తంగా ఈ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు చేసింది. సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమయ్యారా?. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.’’ అని బొత్స చెప్పారు.పోరుబాట విజయవంతం:ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు రూ.1.20 నుంచి రూ.1.25 పైసలు చొప్పున దాదాపు రూ.15,600 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినియోగదారులతో కలిసి వైయస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయమన్న హామీ నిలబెట్టుకోవాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స డిమాండ్ చేశారు.ప్రభుత్వంలో చలనం లేదు:పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న రైతుల తరపున కూడా ఆందోళన చేపట్టి వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను పెడచెవిన పెట్టి ప్రభుత్వం కళ్లబొల్లి మాటలతో కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏడు నెలల్లో లక్ష కోట్లు:ఎన్నికలకు మందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిందని తెలుగుదేశం పార్టీ బాకా పట్టుకుని అబద్దాలు ప్రచారం చేసిందని బొత్స ఆక్షేపించారు. వైయస్సార్సీపీ హయాంలో అన్ని రకాల అప్పులు కలుపుకున్నా రూ.6 లక్షల కోట్లు మించలేదని.. అయినా రూ.14 లక్షల కోట్లు అప్పు అని విపరీతంగా దుష్ప్రచారం చేయడాన్ని తప్పు బట్టారు.మరో వైపు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు తిరక్క ముందే దాదాపు రూ.74 వేల కోట్లు అప్పు చేసిందన్న బొత్స.. అవీ కాకుండా మార్క్ ఫెడ్, సివిల్ సఫ్లైస్, ఏపీఎండీసి వంటి కార్పొరేషన్ల నుంచి కూడా అప్పులు చేస్తున్నారని వెల్లడించారు. వీటికి అదనంగా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15 వేల కోట్ల అప్పులు కలుపుకుంటే, ఇప్పటికే కూటమి ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని గుర్తు చేశారు. ఆ రోజు వైఎస్సార్సీపీ అప్పులు చేసినా, అందులో కీలక భాగం ప్రజలకు పంచిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. వివిధ పథకాల ద్వారా ఆ 5 ఏళ్లలో ఏకంగా రూ.2.74 లక్షల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.మరి ఈ అప్పు అంతా ఏమైంది?:ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిన లక్ష కోట్ల అప్పు ఏం చేశారని మాజీ మంత్రి నిలదీశారు. పెన్షన్ రూ.1000 పెంచినా, ఇప్పటికే వాటిలో 3 లక్షలు కోత పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా, యూనిట్ విద్యుత్‌కు పేదవాడి మీద రూ.1.20 అదనపు భారం వేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు ఉచితంగా ఇస్తున్న 200 యూనిట్లు విద్యుత్ కూడా నిలిపేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా గతంలో దశల వారీగా ఇచ్చే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల రిజిష్ట్రేషన్లు కూడా నిలిపివేశారని ఆక్షేపించారు. ఈ విధంగా అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయం చేస్తూ.. తిరిగి ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోయడం అధికార పార్టీకి అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి బొత్స ఆక్షేపించారు.ఇప్పటికే లక్ష కోట్ల అప్పు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక్క మంచి కూడా చేయలేదని చెప్పారు. ఈ ఆరు నెలల్లోనే లక్ష కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం.. ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేయాడనికి సన్నద్ధమయిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడుందని నిలదీసిన బొత్స సత్యనారాయణ, సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా? అని ప్రశ్నించారు.అన్నింటా కూటమి ప్రభుత్వం విఫలం:అధికారంలోకి వ్చచిన ఆరునెలల్లోనే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కూటమి ప్రభుత్వం కనీసం కొత్త సంవత్సరంలోనైనా ప్రజలను సుభిక్షంగా ఉంచేలా పాలన చేయాలని హితవు పలికారు. ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు లాంటి చిన్న చిన్న హామీలను కూడా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అవగాహన లేకుండానే అన్ని హామీలను ఎలా ఇచ్చారన్న బొత్స.. కేవలం అధికారం కోసమే అబద్దాలు ఆడి ప్రజలను గాలికొదిలేయడం న్యాయమేనా? అని నిలదీశారు.కనీసం డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన డబ్బులైనా ప్రభుత్వం చెల్లించి ఉంటే.. సామాన్యులకు ట్రూఅప్ ఛార్జీల మోత తగ్గేదని చెప్పారు. కానీ, ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్కో వినియోగదారుడి మీద రూ.2 వేల నుంచి రూ.3 వేల భారం పడుతుంటే సామాన్యుడు ఎలా బ్రతుకుతాడని నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లులోనూ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని బొత్స గుర్తు చేశారు. ఒకవైపు 24 గంటల్లో ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెపుతుంటే.. తేమ శాతం ఎక్కువగా ఉందని.. 20 శాతం వరకు డబ్బులు మినహాయించుకుంటున్నారని మండిపడ్డారు.సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను కొత్త ఏడాదిలో ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మీడియా అండదండలున్నాయని కల్లిబొల్లి మాటలతో కాలం వెల్లదీయాలని చూస్తే ఎల్లకాలం సాగదని తేల్చి చెప్పారు.మీడియా ప్రశ్నలకు సమాధానంగా..అందులో తప్పేముంది?: విశాఖ విమానాశ్రయంలో తనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలవడంపై మాట్లాడుతూ.. తాను గతంలో లోకేష్‌ను, పవన్‌కళ్యాణ్‌ను కూడా కలిశానన్నారు. అందులో తప్పేముందన్నారు. కేవలం అభద్రతా భావంతో ఉన్న వాళ్లే ఇలాంటి విషయాలకు భయపడి అనవసర రాద్ధాంతం చేస్తారని చెప్పారు. ఈ వివాదాన్ని సృష్టించిన వారే దీనికి సమాధానం చెప్పాలన్నారు. అధికార పార్టీ అనుకూల ఛానల్లో ఈ వార్త వచ్చిందన్న బొత్స.. మంత్రి శ్రీనివాస్ మీద ఆ పార్టీలోనే కుట్ర జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.ఫోన్ చేస్తే ఎత్తడం లేదు:డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేయడంపై బొత్స సత్యనారాయణ విస్మయం వ్యక్తం చేశారు. తప్పు జరిగితే తొక్క తీస్తానని తరచూ మాట్లాడే పవన్‌కళ్యాణ్ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దీన్ని కూడా జగన్‌గారి ప్రభుత్వ వైఫల్యం అంటారేమోనని ఎద్దేవా చేశారు. డీజీపీ అన్నా, ఆ పదవి అన్నా తనకు చాలా గౌరవమన్న మాజీ మంత్రి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తాను డీజీపీ అన్న విషయాన్ని ప్రస్తుత డీజీపీ మర్చిపోయినట్టున్నారని, అందుకే తాము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారని తెలిపారు.పవన్ ఆ పని చేస్తే బాగుండేది:ఎంపీడీఓ పై దాడి జరిగిందని పరామర్శకు కడప వెళ్లిన పవన్, అదే జిల్లాలో బీరు బాటిల్ తో టీడీపీ నేతల దాడిలో గాయపడిన చంద్రమౌళి అనే వీఆర్వోనూ కూడా పరామర్శిస్తే బాగుండేదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. అందరికీ ఒకటే అని చెప్పుంటే బాగుండేదని సూచించారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చొద్దని బొత్స హితవు పలికారు. సినీ హీరోలను జగన్ నాడు అవమానించారనేది అవగాహన రాహిత్యమన్న మాజీ మంత్రి.. తనను వైఎస్ జగన్, ఎంతో గౌరవించారని చిరంజీవి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. -
రెచ్చిపోయిన పచ్చ మూకలు.. వైఎస్సార్సీపీ నేతలపై కత్తులతో దాడి
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన గుండుబిల్లి నానాజీపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నానాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే గ్రామంలోనక్కా మాణిక్యం, గడి దివాణం అనే మరో ఇద్దరిపైనా టీడీపీ నేతలు దాడికి దిగారు. కాకినాడ రూరల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నానాజీ చికిత్స పొందుతున్నారు.నిన్న(శుక్రవారం) జరిగిన వైఎస్సార్సీపీ పోరుబాటలో పాల్గొనేందుకు ప్రత్తిపాడు వెళ్తుండుగా రెండు చోట్ల దారి కాచి పచ్చమూక దాడులకు తెగబడ్డారు. దాడికి పాల్పడిన తొమ్మిది మందిపై అన్నవరం పీఎస్‌లో కేసు నమోదైంది. మండపంలో పోలీస్ పహరామండలంలోని మండపం గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలపై కూటమి నేతల దాడి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. దాడుల కారణంగా గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. కూటమి నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేతలకు అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్యపడవద్దని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి ముద్రగడ గిరి అన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీపీ పర్వత రాజుబాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఇదీ చదవండి: పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ పోరుబాటపై అక్రమ కేసులు -
పవన్.. సీజ్ ది షిప్ ఏమైంది?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం: విశాఖను ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క నిమిషం కూడా చంద్రబాబు ప్రధానితో మాట్లాడలేదన్నారు. అలాగే, కూటమి పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ఘాటు విమర్శలు చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ సహా అన్నింటినీ అదానీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. రైల్వే జోన్‌ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారు. రైల్వే జోన్ ప్రారంభం కాకుండా కుట్రలు పన్నుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. మొన్న ప్రధానిని చంద్రబాబు కలిసినప్పుడు ఈ ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. విశాఖ ఉక్కు కోసం ఒక్క నిమిషం కూడా ప్రధానితో బాబు మాట్లాడలేదు. మీరు స్టీల్ ప్లాంట్‌ను కాపాడే వ్యక్తులా లేక మిట్టల్‌కు బ్రోకర్లా అని అడుగుతున్నా. మిట్టల్‌కు ఆగమేఘాల మీద అనుమతులు ఎందుకు అడుగుతున్నారు?.ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలి. విశాఖ ఉక్కును బలి చేసి మిట్టల్‌ను తీసుకొస్తామంటే ఊరుకునేది లేదు. ముందు విశాఖ ఉక్కును కాపాడి అప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తాం. కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు రూ.15వేల కోట్లు కుమారస్వామి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడున్న ఎంపీలు ఏం చేస్తున్నారు?. మన ఎంపీలకు ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఢిల్లీలో ధర్నా చేసి స్టీల్ ప్లాంట్‌కు నిధులు తేవాలి. లేనిపక్షంలో ఎంపీలు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి.చంద్రబాబుని ప్రధాని మోదీ ఆడిస్తున్నారు. ఆరు నెలల్లో వెన్నుపోట్లు పొడవద్దు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా అవినీతే కనపడుతోంది. ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పి మహిళలకు శఠగోపం పెట్టారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనపడటం లేదు.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు.. పథకాలు ఇవ్వడంలో ఆ స్పీడ్ ఎందుకు లేదు?. ఈ ప్రభుత్వంపై పేదలు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నాడు. సీజ్ లేదు.. షిప్ లేదు. ఒక్క బియ్యపు గింజను కూడా సీజ్ చేయలేదు. పవన్‌కు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేవుడిలా కనపడుతున్నారు. పవన్ ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మం అంటున్నారు. గిరిజనులకు భూమి హక్కు కల్పించి సనాతన ధర్మ పరిరక్షకుడిగా నిరూపించుకోవాలి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఏ తప్పు చేయలేదు: పేర్ని నాని
గుంటూరు, సాక్షి: రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన. అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు. నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్‌ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.. .. సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
పాయె.. ఇంకో హామీకి కూడా బాబు మంగళం!
ఆంధ్రప్రదేశ్‌లో మరో వంచన పర్వానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం అనుకూల పత్రిక ఈనాడులో వచ్చిన ఒక కథనం చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాకమానదు. ఆర్టీసీకి ఎన్నో సమస్యలున్నాయని చెప్పే ఈ కథనాన్ని బట్టి చూస్తే.. టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఇక అమలు జరగదనే అనిపిస్తుంది. జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలోని 25 హామీల్లో ఇది ప్రముఖమైంది. తెలంగాణలో ఎన్నికల హామీకి తగ్గట్టుగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏడు నెలలవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాష్ట్రంలోని మహిళలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా తెలుగుదేశం సహా కూటమి పార్టీలన్నీ వాగ్ధానాల అమలుపై నానా రచ్చ చేసేవి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చినా ప్రతిపక్షాలు దాని అనుకూల మీడియా నానా వంకలూ పెట్టేవి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేసేవి. ఇప్పుడు మాత్రం.. ఇచ్చిన ఆరంటే ఆరు హామీలకూ మంగళం పాడుతున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతులకు గొంతు పెగలడం లేదు. పైపెచ్చూ జగన్ కారణంగా ఇప్పుడు చంద్రబాబు హామీలను నెరవేర్చలేకపోతున్నారన్న కలరింగ్ ఒకటి! ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు అనకుండా.. వారిపై జనాల్లో సానుభూతి పెంచేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ఎన్నికలప్పుడు కూటమి ఇచ్చిన హామీల్లో వృద్ధాప్య ఫించన్ల మొత్తం పెంపు ఒక్కటే ప్రస్తుతానికి అమలైన హామీగా కనిపిస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లకు పరిమితి పెట్టారు. ఇస్తామన్న మూడూ ఎంతమందికి అందుతోందన్న స్పష్టత లేదు. దీన్ని అమలు చేశారని అనుకున్నప్పటికీ మిగిలిన వాటి సంగతేమిటి? రాష్ట్రం పరిస్థితి చూస్తూంటే భయమేస్తోందని అనడంతోనే చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని పచ్చమీడియా తన బొంకులతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఏమిటన్నది ఈ మాటలతోనే స్పష్టమైపోతోంది కదా?ఎన్నికలకు ముందు... జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు వార్తలు సృష్టించారు. సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసునని బడాయికి పోయారు. మ్యానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కూడా. తీరా అధికారం చేతికొచ్చిన తరువాత చేసిందేమిటి? జగన్ చేసిన అప్పులు బాబు చెప్పిన సంఖ్యలో సగమేనని స్పష్టమైంది. పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ రూ.70 వేల కోట్ల అప్పూ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇంకో రూ.15 వేల కోట్ల భారం ప్రజల నెత్తిన రుద్దారు. ఇంతింత అప్పులెందుకు అని అడిగితే మాత్రం విషాద రాగం ఎత్తుకుంటారు బాబుగారు. ఈ క్రమంలోనే తాజాగా మహిళల ఉచిత బస్ ప్రయాణం హామీకి మంగళం పలకడమో, తూతూ మంత్రంగా అమలు చేయడమో చేసేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రివర్గ ఉప సంఘం, ఆ తర్వాత అధికారిక కమిటీలతో నివేదికలు తయారు చేయిస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం ఉచిత బస్ స్కీమ్ అమలుకు 2000 బస్సులు కావాలి. ఇప్పుడున్న వారికి తోడు మరో 11500 మంది సిబ్బంది అవసరం. మహిళా ప్రయాణికుల సంఖ్య పది లక్షలు పైగా పెరుగుతుందని. ఆర్టీసికి నెలకు రూ.ఆరు కోట్ల నష్టం రావచ్చని అధికారులు అంచనా వేశారని రాసుకొచ్చింది ఈనాడు! అన్ని కలిపి ప్రభుత్వానికి నెలకు రూ.200 కోట్లు, ఏటా రూ.2400 కోట్లూ నష్టమని లెక్కకట్టారు.ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది జీతాలపై నెలకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి విలీనం చేసిన తరువాత కూడా జీతాలు ఈ స్థాయిలో ఎందుకున్నాయో ఎల్లో మీడియా చెప్పడం లేదు. అదనపు సిబ్బంది పేరు చెప్పి.. వీరి నియామకానికి సమయం పడుతుందని.. వీరి జీతభత్యాలు అదనమని చెప్పేందుకు ఈనాడు తన కథనం ద్వారా ప్రయత్నిస్తోందన్నమాట. అయితే.. రాజకీయాల్లో తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే చంద్రబాబుకు హామీ ఇచ్చే నాటికి ఈ విషయాలన్నీ తెలియవని అనుకోవాలా? అంటే.. గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు ఇచ్చారనేగా అర్థం ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేస్తే తీవ్రంగా నష్టపోయేది ఆటోవారు. కాబట్టి వీరికి పరిహారం సంగతి కూడా చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో కొన్ని లోటుపాట్లతో ఈ పథకం అమల్లో ఉంది. కొత్త బస్సులు కొనలేదు.. అదనపు సిబ్బంది నియామకమూ జరగలేదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. ఎగొట్టడానికే అన్నది సామాన్యుడిని అడిగినా వచ్చే సమాధానం. చంద్రబాబు ఎన్నికల హామీల అమలుకు ఏటా రూ.1.5 లక్షల కోట్లు కావాలని వైసీపీ ఎప్పుడో స్పష్టం చేసినా టీడీపీ తమకు అనుభవముందని చెప్పేవాళ్లు. అచ్చంగా 2014లో రైతు రుణమాఫీ హామీ మాదిరిగా అన్నమాట! అప్పట్లో బాబు తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని కూడా విడిపిస్తానని పదే, పదే ప్రచారం చేశారు. దానిని రైతులు చాలా మంది నమ్మి ఓట్లు వేశారు.ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపెట్టింది. రకరకాల కండిషన్లు పెట్టడం, సర్టిఫికెట్ల పేరుతో ఆఫీస్‌ల చుట్టూ తిప్పడం వంటి ఇబ్బందులు పడ్డారు. అయినా రుణమాఫీ కేవలం రూ.15 వేల కోట్ల మేరే చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వం రుణమాఫీ కొనసాగించాలని కూడా టీడీపీ డిమాండ్ చేసేది. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆనాటి రుణమాఫీ బాకీల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే పాత రుణమాఫీ బాకీ గురించి రైతులు అడిగే ప్రశ్న రాదు. ఈ సారి ఇచ్చిన రైతుల పెట్టుబడి సాయం రూ.20 వేలు హామీ ఎప్పుడు నెరవేర్చేది చెప్పడం లేదు. ఈ దశలో ఒక్కో హామీకి సంబంధించి ఇబ్బందులపై ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించి దాటవేయడానికి ప్రయత్నాలు ఆరంభం అయినట్లు అర్ధం చేసుకోవచ్చు. అందులో భాగంగానే మహిళల ఉచిత బస్ హామీకి గుడ్ బై చెప్పడానికి లేదా, గతంలో రుణమాఫీ మాదిరి అరకొరగా చేయడానికి ఒక ప్రాతిపదికను తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
గాలివీడు ఘటన.. కాల్‌డేటా తీస్తే వాస్తవాలు తెలుస్తాయి: శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అన్నమయ్య: గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి. ఎంపీపీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దది అయ్యిందని చెప్పుకొచ్చారు. కాల్‌డేటా తీసుకుని విచారిస్తే వాస్తవాలు ఏంటనేది తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎంపీడీవో కార్యాలయ అధికారులు పిలిస్తేనే సుదర్శన్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. ఎంపీపీ అయిన తన తల్లి సంతకం కావాలని ఎంపీడీవో కార్యాలయ అధికారులు కోరారు. ఎంపీపీకి చెందిన సామాగ్రి లోపల ఉందని, తాళాలు తీయాలని ఆయన అడిగారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. దాన్ని రాజకీయం చేస్తున్నారు.ఎంపీడీవో రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దదైంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ హింసను ప్రోత్సహించకూడదు. ఘటన జరగకముందే టీడీపీ నేతలు అక్కడకు ఎలా చేరారు. వారు ఎంపీడీవో కార్యాలయం వద్ద చేసిన హంగామాపై విచారణ చేయాలి. ఈ ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్ని వివరాలు తెలుకోవాలి. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన్ను కోరుతున్నాను. ముందు కాల్‌డేటా తీసుకుని విచారిస్తే వాస్తవాలేంటనేది తెలుస్తుంది. నిజ నిర్ధారణ జరిపిన తర్వాతే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. -
కూటమిలో కుంపటి.. జనసేన కార్పోరేటర్‌పై టీడీపీ నేతల దాడి
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్‌లో నేతల మధ్య కుంపటి రాజుకుంది. తాజాగా జనసేన మహిళా కార్పోరేటర్‌పై టీడీపీ కార్యకర్త దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని కార్పోరేటర్ కామెంట్స్ చేయడం గమనార్హం.వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలో కూటమి నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఒంగోలు నగర 32వ డివిజన్ కార్పొరేటర్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్త తోటకూర కృష్ణమూర్తి.. అర్థరాత్రి జనసేన కార్పోరేటర్ కృష్ణలత దంపతులను మాట్లాడాలని ఇంట్లో నుంచి బయటకు పిలిచారు. అనంతరం, కృష్ణలత దంపతులపై కృష్ణమూర్తి సహా ఆరో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో వారికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం.అనంతరం, కృష్ణలత దంపతులు మాట్లాడారు. ఈ సందర్బంగా.. టీడీపీ కార్యకర్త కృష్ణమూర్తి తమతో మాట్లాడాలని ఇంట్లో నుంచి పిలిచి మాపై దాడి చేశారని అన్నారు. తన భర్తను కొట్టారని కృష్ణలత తెలిపారు. అలాగే, తనకు, తన భర్త వెంకటేష్‌కు ప్రాణహాని ఉందన్నారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నామన్నారు. -
‘చంద్రబాబు సూపర్ సిక్స్ కాదు.. సూపర్ షాక్‌లిచ్చారు’
సాక్షి, కాకినాడ: గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్ ఇస్తున్నారని.. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అనే పరిస్ధితికి తీసుకువచ్చారంటూ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్సులిన్ కూడా లేని పరిస్ధితి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని.. కొందర్ని తొలగించారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.సూపర్ సిక్స్ కాదు.. సూపర్ షాక్ అన్నట్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. భుజాలపై మోసే సొంత మీడియా ఉండడమే చంద్రబాబు అదృష్టం. పేరులో ఉచితం తప్పా.. ఉచిత ఇసుక ఎక్కడా?. చంద్రబాబుకు ఇస్తున్న షాకులకు ఎవరూ మినహయింపు కాదు. బాబు వస్తే తమకు స్వర్గం అనుకున్న మద్యం ప్రియులకు కూడా షాక్ ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు.‘‘ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఇవాళ వైఎస్సార్సీపీ పోరుబాట దిగ్విజయంగా జరిగింది. విద్యుత్ భారం, మూడు డిమాండ్లను అధికారులకు వినతిపత్రం ద్వారా అందించాం. ఒక్క నెలలోనే ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎంత కాలం జగన్ నామ స్మరణం చేస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. పచ్చి అబద్దాలను కూటమి ప్రభుత్వం మానిఫెస్టోలో పెట్టింది. చంద్రబాబు సర్కార్ ఎన్ని కుట్రలు చేసిన ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరు ఆపదు.’’ అని కన్నబాబు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కరెంట్ కోత.. చార్జీల మోత‘‘ఉచిత విద్యుత్ అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. తొమ్మిది గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. రైతుల ఉచిత విద్యుత్ కోసం ఫీడర్లను ఆధునీకరించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పట్ల ప్రజల ఆగ్రహం బయటకు వచ్చింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాలి’ అని చంద్రబాబు సర్కార్‌ను కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. -
పచ్చమూకల దాష్టీకం.. వైఎస్సార్సీపీ నేత వాహనానికి నిప్పు
సాక్షి, అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్ సీపీ నేత, 23వ వార్డు కౌన్సిలర్ అర్చన వాహనాన్ని టీడీపీ నేతలు దగ్ధం చేశారు అర్థరాత్రి ఎవరు లేని సమయంలో వాహనానికి నిప్పు పెట్టారు. రెక్కీ నిర్వహించి కారును తగలబెట్టారు. టీడీపీ నేత మహేష్, అతని అనుచరులపై అర్చన ఫిర్యాదు చేశారు. -
బయటపడ్డ చంద్రబాబు నిజ స్వరూపం: మేరుగ
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై మోపిన రూ.15,485 కోట్ల భారాన్ని ఉపసంహరించుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. కూటమి పార్టీల మాయమాటలు నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలపై దుర్మార్గంగా విద్యుత్ ఛార్జీల రూపంలో పెనుభారం మోపుతున్నారని మీడియా సమావేశంలో మేరుగ నాగార్జున ఆక్షేపించారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..:కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు:కూటమి ప్రభుత్వ పాలనంతా ‘బాదుడే బాదుడు’ అన్నట్లుగా మారింది. ‘ఓట్లేయండి తమ్ముళ్లూ.. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ’.. అని ఎన్నికల ముందు చంద్రబాబు మాయమాటలు చెప్పారు. అన్ని వర్గాలకు వరాలు కురిపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తిరక్కుండానే యథేచ్ఛగా చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు. తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు. సూపర్‌సిక్స్‌తో సహా, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. ఒక్క హామీపైనా త్రికరణ శుద్ధితో ఈ ప్రభుత్వం పని చేయడం లేదు.ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలు:విద్యుత్ ఛార్జీలపై ఇచ్చిన మాట కూడా మరిచిపోయి ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల బాదుడుకు తెర తీశారు. వాటిలో ఇప్పటికే నవంబరు బిల్లులో రూ.6 వేల కోట్లు వేయగా, వచ్చే నెల నుంచి మరో రూ.9,412 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. అలా ప్రజల నడ్డి విరుస్తున్నారు. దీంతో విద్యుత్ గృహ వినియోగదారులపై 25 నుంచి 55 శాతం వరకు అదనపు వడ్డన చేస్తున్నారు.ఎంత దారుణం అంటే.. ఇది శీతాకాలం. అంటే విద్యుత్ వాడకం తక్కువగా ఉంటుంది. ఇప్పుడే ఇంత భారం మోపితే, ఇక వేసవి కాలంలో విద్యుత్ వాడకంపై ఎంత భారం పడుతుందో అర్థం కావడం లేదు. ఆనాడు జగన్ గారు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసింది. బిల్లులు చెల్లించాల్సిందేనంటూ వారిని వేధిస్తోంది. ఇప్పుడు తాజాగా అన్ని వర్గాలపైనే విద్యుత్ ఛార్జీల కొరడాను ఝుళిపిస్తోంది.ఎక్కడా విద్యుత్ కోతలు లేవంటూ అబద్దాలు:రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 195 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోత విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అయినా అధికారిక నివేదికల్లో విద్యుత్ లోటు, కోతలు లేవంటూ బుకాయిస్తున్నారు. నిజానికి గతేడాది కంటే విద్యుత్ డిమాండ్ 1.17 శాతం తక్కువగా ఉన్నా, అది కూడా సరఫరా చేయలేక ప్రభుత్వం సన్నాయినొక్కులు నొక్కుతోంది. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిండు వేసవిలోనూ, బొగ్గు సరఫరా సంక్షోభంలోనూ ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడం జరిగింది.బాబు జమానాలో సబ్సిడీలో కట్:గతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు రూ.20 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా, వైయస్సార్సీపీ అధికారంలో ఉండగా రూ.47,800.92 కోట్లను సబ్సిడీగా అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. అదీ జగన్ కమిట్మెంట్.విద్యుత్ ఛార్జీలపై పోరాటం:చంద్రబాబులాగా హామీలు ఇవ్వడం, చేతులెత్తేయడం, పారిపోవడం శ్రీ వైయస్ జగన్‌కు తెలియదు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, భావితరాల గురించి ఆయన ఆలోచించారు. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించకుండా వినియోగదారులపైనే ఛార్జీల భారం మోపుతోంది. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతూ, వైఎస్సార్సీపీ రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మేరుగ నాగార్జున వివరించారు. -
‘వైఎస్ జగన్‌కు ఉన్న చరిష్మా దేశంలో ఎవరికీ లేదు’
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఉన్న చరిష్మా దేశంలో ఎవరికీ లేదన్నారు ఆ పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి. స్వయంకృషితో పార్టీ స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని రవీంద్రనాథ్‌రెడ్డి గుర్తుచేశారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాకు వచ్చారని, ఆయనను చూసేందుకు ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే ప్రజలు(Huge Crowd) పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదారణ చూసి జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి(Ravindranath Reddy) మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇంటిపై రాళ్ల దాడి అని ప్రసారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌ను చూసేందుకు తండోపతండాలుగా జనం తరలివస్తుంటే, దానిపై కూడా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాయడం నిజంగా సిగ్గుచేటన్రారు. ప్రస్తుతం రాష్ట్రంలో దరిద్రమైన పాలన కొనసాగుతోందని రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
అదంతా అబద్ధం.. ఓర్వలేకే ఎల్లో మీడియా దుష్ప్రచారం: చెవిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ వద్దకు వస్తున్న ప్రజల్ని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతుందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభూత కల్పనలు సృష్టించి ప్రజలు తప్పుడు సంకేతాలు పంపేయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జగన్ ఆఫీస్‌పై దాడి చేశారనడం అబద్ధమని స్పష్టం చేశారు.‘‘తమ సమస్యలు చెప్పుకోవడానికే జగన్ వద్దకు వచ్చారు. ప్రతి ఒక్కరూ బాబు దుష్టపాలనను జగన్‌కు వివరిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట జనం నడుస్తున్నారనే ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజా నాయకుడే. ప్రజల మనసు నుంచి వైఎస్ జగన్‌ను తొలగించడం టీడీపీకి, ఎల్లో మీడియాకు సాధ్యం కాదు’’ అని చెవిరెడ్డి చెప్పారు.ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి: సాంబశివారెడ్డిఇది చేతకాని ప్రభుత్వం.. చేతగానితనాన్ని ప్రజలు జగన్‌కు వివరిస్తున్నారనే దుష్ప్రచారం మొదలు పెట్టారని వైఎస్సార్సీపీ నాయకులు సాంబశివారెడ్డి ధ్వజమెత్తారు పులివెందుల కార్యాలయంపై దాడి జరిగింది అనడం పూర్తి అబద్ధం. ఇలా ప్రచారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ ఏడు నెలల్లో ఈ ప్రభుత్వం పూర్తి ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంది. ఆ విషయాన్నే ప్రజలు జగన్‌కి వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు జగన్‌ను కలిసేందుకు వచ్చారు. జగన్ ఓపికగా నిలబడే ఉదయం నుంచి వారి సమస్యలు వింటున్నారు. పచ్చ మీడియా ఇకనైనా ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి’’ అని సాంబశివారెడ్డి హెచ్చరించారు.చౌక బారు రాజకీయాలు మానుకోవాలి: సతీష్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో ఆయన పలకరింపు కోసం జనం బారులు తీరారు. సెల్ఫీల కోసం యువకులు ఎగబడ్డారు. పులివెందుల కార్యాలయంపై ఎలాంటి దాడి జరగలేదు. ఎల్లో మీడియా సిగ్గులేకుండా దుష్ప్రచారం చేస్తోంది. పులివెందుల నుంచి తాతి రెడ్డి పల్లెకు 25 కిలోమీటర్లు మాత్రమే. దారి పొడవునా వేలాది మంది ప్రజలను పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. తాతిరెడ్డి పల్లెకు చేరుకోవడానికి 7గంటల సమయం పట్టింది. జన సందోహం మధ్య కార్యకర్తలను చెదరగొట్టే సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు అద్దాలపై పడ్డారు. చిన్న ఇష్యూను దాడి అంటూ ఎల్లో మీడియా స్క్రోలింగ్‌లు వేయడం విడ్డూరం. చౌక బారు రాజకీయాలు మానుకోవాలి’’ అని సతీష్‌కుమార్‌రెడ్డి హితవు పలికారు. -
చంద్రబాబు తీరు దుర్మార్గం.. సీపీఎం నిరసన
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ.. జగదాంబ సెంటర్లో సీపీఎం నిరసన చేపట్టింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గం అంటూ సీపీఎం నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్ పరిస్థితి ఏమిటంటూ వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.వైజాగ్ స్టీల్ కోసం గనులు అడగకుండా మిట్టల్‌కు చంద్రబాబు ఎలా గనులు ఇవ్వాలని కోరుతారంటూ సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని.. వైజాగ్ స్టీల్‌ను కాపాడకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీఎం హెచ్చరించింది. -
వైఎస్సార్సీపీ పోరుబాటపై బాబు సర్కార్ కుట్రలు
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. వేల కోట్లు దండుకుంటున్న కూటమి సర్కార్‌పై నిరసన స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతోంది. దీంతో వైఎస్సార్సీపీ పోరుబాటపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది.విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రేపు(శుక్రవారం) వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుండగా.. పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి సహా వైఎస్సార్ సీపీ నేతలను పీఎస్‌కు పోలీసులు పిలిపించారు.వైఎస్సార్ సీపీ పోరుబాటకు వెళ్లకుండా బైండోవర్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరును వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీ పోరుబాటకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల తరుపున నిరసన తెలిపి, కరెంటు చార్జీలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.ఇదీ చదవండి: కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే! -
బాబూ.. అప్పులేనా నీ సంపద సృష్టి: రోజా
సాక్షి, తిరుపతి: సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని కామెంట్స్ చేశారు.నేడు నగరిలో వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి రోజా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డప్ప, సహా పలువురు పార్టీ నేతలు, కార్తకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నగరి నియోజకవర్గంలో భవిష్యత్తు కార్యచరణపై సమావేశంలో చర్చించారు. అనంతరం, నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘మా గురువు కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన నగరి మరింత నూతన ఉత్తేజం కలిగిస్తుంది. కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్ల వైఎస్సార్సీపీ ఓడిపోయింది. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపారు. ఆరు నెలలకే నరకం చూపిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయి.సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారు. ప్రజలు వైఎస్సార్సీపీ కావాలని నేడు బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసింది. పచ్చ బట్టలేసుకుని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. నేడు నరకం చూపిస్తుంది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ నాడు-నేడు ద్వారా స్కూల్స్ అద్భుతంగా మార్చారు. కానీ కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేసింది. రాష్ట్రాన్ని మద్యంధ్రప్రదేశ్గా చేసింది. వైఎస్ జగన్‌ను ఓడించాలని ఉద్యోగులు కంకణం కట్టుకున్నారు. నేడు ఎందుకు చంద్రబాబును గెలిపించామా? అంటు బాధపడుతున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి అందరికి అండగా ఉన్నారు. నియోజకవర్గంలో నేను, జిల్లాలో కరుణాకర్ రెడ్డి, రాష్ట్రంలో వైఎస్ జగన్ మనకు అండగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం భయబ్రాంతులకు భయపడకండి.. రాబోయేది మన ప్రభుత్వమే. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో.. వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. విద్యుత్ బిల్లుపై రేపు నిరసన ఉంటుంది. జనవరిలో విద్యార్థులకు అండగా పోరాడాలి. పచ్చ చానల్స్ అబద్దాలు చెప్పడం తప్ప ఇంకొకటి ఉండదు. ప్రజల సమస్యలు, మహిళల సమస్యలు అందరికీ తెలియజేయాలన్నారు.భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వం, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నేడు మొదటి సర్వసభ్య సమావేశం ఇది. రోజా నగరికి రాజా లాంటి వ్యక్తి. రోజా కొమ్మకే కాదు, పువ్వులు కూడా ముళ్లు ఉంటాయి. రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న నాయకురాలు. వైఎస్ జగన్ మనసులో చెల్లిగా స్థిరపడ్డారు రోజా. అత్యధిక మెజారిటీతో రోజాను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. నగరి అభివృద్ధి చేసిన వ్యక్తి రోజా.. అందుకే గెలిపించాలని కోరుతున్నాను. ప్రపంచంలో వైఎస్ జగన్ వంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఆయనో గొప్ప వ్యక్తి. ఎవరో పనికిమాలిన వారి కింద పని చేయడం కంటే.. ఉద్యమాల నుండి పుట్టిన వైఎస్సార్సీపీలో ఉండటమే ఎంతో మేలు. ఏ ఒక్క కార్యకర్తలో చిన్న భయం ఉన్నా తొలగించుకోండి. కూటమి, తెలుగుదేశం పార్టీకి ఇక మనుగడ లేదు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి.. నెరవేర్చని మోసపు ప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెలికిస్తాం అంటూ కామెంట్స్ చేశారు.ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి బెదిరింపులకు బెదిరేది లేదు. వైఎస్ జగన్ కోసం పోరాడే వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం, ప్రాధాన్యత ఉంటుంది. మనమందరం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఏ ఒక్కరికి కష్టం ఇచ్చినా కరుణాకర్ రెడ్డి, మేము అండగా ఉంటామన్నారు.మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ..‘భూమన కరుణాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమ నాయకుడు. టీటీడీ చైర్మన్‌గా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ప్రజల అందరు పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈవీఎంల స్కామ్ వల్లే కూటమి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ఈవీఎంల స్కామ్ చేశారు. అందుకే వైఎస్సార్సీపీకి ఓటమి ఎదురైంది. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. అప్పుల మీద అప్పులు చేస్తోంది. నగరిలో రోజాను గెలిపించండి. మీకు మేము అండగా ఉంటాం’ అని కామెంట్స్ చేశారు. -
‘విద్యుత్ చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టండి’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని(power tariff hike) మోపడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లి వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను విధించడం దుర్మార్గమని అన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచము అని ప్రజలకు హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి రాగానే ఏకంగా రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారంను విధించడం దారుణం. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాలి. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మెమోరాండంలను సమర్పించాలి. అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ పోరుబాట పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ నిరసనలపై ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. ప్రజాసమస్యలపై వైఎస్సార్సీపీ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది. ‘విద్యుత్ చార్జీల పెంపుదల అన్ని వర్గాలపై ఆర్థికంగా భారంను మోపుతోంది. అయా వర్గాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. వారంతా వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇటువంటి ప్రజాసంఘాలు, సంస్థలను కూడా కలుపుకుని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ కార్యక్రమం ద్వారా పాలకులకు అర్థం కావాలి. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అని సూచించారు.‘పార్టీ శ్రేణులు, గ్రామ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలి. ఇందుకోసం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీలు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించడం ద్వారానే ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం మరింత పెరుగుతుంది. ప్రజలకు వైఎస్సార్సీపీ(YSRCP కష్ట సమయంలో అండగా ఉంది అనే సంకేతాలను పంపాలి. అలాగే తాజాగా వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు పార్టీ నేతలు రైతులను కలుసుకోవాలి. వారికి వచ్చిన కష్టంలో అండగా ఉంటామనే భరోసాను అందించాలి’ అని పిలుపునిచ్చారు. -
కూటమిలో చిచ్చురేపిన చేరికలు?
సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమిలో పార్టీ నేతల చేరికల విషయంలో రాజకీయ లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ చేరికలను ప్రోత్సహిస్తుంటే.. మరో పార్టీ నేత మాత్రం చేరికలు వద్దంటూ సూచనలు చేస్తున్నారు. దీంతో, కూటమిలో కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ మొదలైంది.తాజాగా ఓ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) మాట్లాడుతూ.. ఏపీలో(Andhra Pradesh) కూటమి పార్టీల్లో మనకు కావాల్సినంత మంది నేతలు ఉన్నారు. పార్టీలు మారే నేతలు నేతలు మనకు అవసరం లేదు. ఇతరులు ఎవరు వచ్చినా.. కూటమి పార్టీల్లో చేర్చుకోవద్దు అంటూ కామెంట్స్ చేశారు. అయితే, అయ్యన్న ఇలా వ్యాఖ్యలు చేసి 48 గంటలైనా గడవక ముందే బీజేపీలోకి ఒక నేత చేరడం చిచ్చు రేపినట్టు తెలుస్తోంది. దీంతో, కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఇక, అయ్యన్న మాటలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Daggubati Purandeswari) పట్టించుకోలేదు. అయ్యన్న సూచనను పరిగణలోకి ఆమె పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్.. బీజేపీలో చేరికకు రంగం సిద్దమైనట్టు సమాచారం. నేడో, రేపో.. పురందేశ్వరి సమక్షంలో ఆనంద్ బీజేపీలో చేరుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. విశాఖ డైరీ అవినీతిపై ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతుండటంతో ట్విస్ట్ చోటుచేసుకుంది. -
ఐటీడీపీ పోస్టులపై హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్
అమరావతి, సాక్షి: ఐటీడీపీ అనుచిత పోస్టుల వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు.‘‘ఐటీడీపీ(iTDP)లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తున్నారు. నాపై , నాకుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేం ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఒక్క కేసు నమోదు చేయలేదు. మాపై వివక్ష ప్రదర్శిస్తున్నారు’’ అని అంబటి పిటిషన్లో పేర్కొన్నారు. తన పిటిషన్ ఆధారంగా.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలువ్వాలని పిటిషన్ ద్వారా అంబటి కోరారు. ఈ పిటిషన్‌పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఐటీడీపీ, టీడీపీ అనుబంధ పేజీల్లో వైఎస్ జగన్(YS Jagan)పై, తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అటు నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. దీంతో తాజాగా ఆయన పట్టాభిపురం పీఎస్ వద్ద నిరసన తెలిపారు. అయితే న్యాయం చేయకపోగా.. అంబటిపైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ఉన్న ఉద్యోగం పీకేసి.. అయినవాళ్ల కోసం! -
ఏపీలో జాబ్ కావాలంటే.. ఆ అర్హత తప్పనిసరి!
విజయవాడ, సాక్షి: జాబ్ కావాలంటే బాబు రావాలి.. ఇది ఒకప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీ. ఆయన మూడుసార్లు సీఎంగా ఉన్న టైంలో అది కలగానే ఉండిపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ ఆయనే అధికారంలో ఉన్నారు. అలాగే ఆ సమస్యా మొదటికొచ్చింది. ఈసారి మరోలా!. ఏపీలో ఇప్పుడు ఉద్యోగం కావాలంటే.. ఆ ఒక్కటి ఉంటే చాలూ!.అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే.. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు తెర లేపింది కూటమి. తాము ఇచ్చిన హామీలనూ ఇప్పటికే అటకెక్కించేసిన చంద్రబాబు.. గత వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. అధికారం ఉందని అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రేషన్ షాపులనూ వదలకుండా.. బలవంతంగా లాక్కుని తమ పార్టీ నేతలకు ఇప్పించేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఉద్యోగుల మీద పడ్డారు!.ఎన్నికల టైంలో అధికారం కోసం చంద్రబాబు అండ్ కో చెప్పింది ఏంటంటే.. ఉద్యోగాలను సృష్టిస్తామని, అది కుదరని పక్షంలో ఉద్యోగభృతి ఇస్తామని. కానీ, ఈ రెండూ చేయడం లేదు. ఖాళీల విషయంలో.. కనీసం సమీక్షలు సైతం జరపడం లేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ.. ఆ స్థానంలో తమవారిని తిరిగి నియమించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఏపీలో ఇప్పుడు ఉద్యోగం కావాలంటే.. కూటమి నేతల రికమండేషన్ ఉంటే చాలూ!.తాజాగా.. ఫైబర్ నెట్ నుంచి ఏకంగా 410 మంది ఉద్యోగులను తొలగించారు. ఇంకొంత మందిని కూడా తొలగించడం ఖాయమని చెప్పారు. ఉద్యోగాల తొలగింపునకు కారణం.. వైఎస్సార్సీపీ మీద పెద్ద అభాండం వేసేశారు. అయితే ఈ యాక్షన్ కూటమి పార్టీల కార్యకర్తల కోసమేనని ఇప్పుడొక ఓ స్పష్టత వచ్చింది. ఇప్పటికే మంత్రుల పేషీల్లో టీడీపీ కార్యకర్తల కోసం ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ప్రతి మంత్రి పేషీల్లో ఇద్దరు సోషల్ మీడియా ఉద్యోగులు, పీఆర్వో నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు ఫైబర్ నెట్ ఉద్యోగులను రోడ్డున పడేయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ల స్థానంలో తమ వాళ్లను నియమించుకోవాలని కూటమి నేత ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే వాట్సాప్ సందేశాలు.. ఫోన్ల ద్వారా టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆదేశాలు వెళ్తున్నాయట!. అదే బాటలో.. మిగిలిన రెండు పార్టీల నుంచి కూడా సిఫారసులు వెళ్తున్నట్లు సమాచారం. సాధారణంగా.. అధికార యంత్రాగాల్లో ఉన్నత స్థాయిలో తమకు అనుకూలరను నియమించుకోవడం.. ఇతరులను సాగనంపడం ఇలాంటివి కనిపిస్తుంటాయి. కానీ, ఫర్ ఏ ఛేంజ్ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏరకంగా చూసుకున్నా.. ఏపీలో నిరుద్యోగ సమస్య తీరింది.. అదీ నిష్పక్షపాతంగా వైఎస్సార్సీపీ హయాంలోనే!.ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ హయాంలో 30 లక్షల ఉద్యోగాలు -
‘నిరుద్యోగుల సంఖ్యను పెంచేస్తున్న చంద్రబాబు!’
గుంటూరు, సాక్షి: ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం లేదు.. దోచుకుంటున్నారని, ప్రభుత్వ రంగంలోకి సంస్థలను అమ్మేసి దండుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మంగళవారం సాయంత్రం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు. ‘ఓటేయండి తమ్ముళ్లు’ అంటూ వేడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. ప్రజలపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. ‘బాదుడే బాదుడు..’ అంటూ రూ. 15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం మోపారు. ఇదేనా సంపద సృష్టి.. ఇదేనా ఆదాయం పెంచడం?’’ అని అంబటి ప్రశ్నించారు . .. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. రాజధాని పేరుతో 31 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. అప్పు కోసం చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు. అప్పులతోనే చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆనాడు స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేశారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని రెచ్చగొట్టారు. ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలుపెట్టారు అని అంబటి మండిపడ్డారు... వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాం. మా హయాంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. 1.34 లక్షల మందికి గ్రామ, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. కానీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు సృష్టించి ఇస్తామన్నారు. లేదంటే నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. వలంటీర్లను పక్కన పెట్టి.. వెల్త్ వర్కర్లను తొలగించారు. ఇప్పుడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి ఏకంగా 400 మందిని తొలగించారు. చంద్రబాబు ఏపీలో నిరుద్యోగుల సంఖ్యను పంచేస్తున్నారు. కానీ నిరుద్యోగ భృతిని మాత్రం ఇవ్వడం లేదు’’ అని అంబటి అన్నారు.ఇదీ చదవండి: మన కేసులు ఎత్తేద్దాం! -
2027 చివర్లో జమిలి ఎన్నికలు: వైఎస్ జగన్
వైఎస్సార్ జిల్లా, సాక్షి: ఎన్నికలకు ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా.. కడప నేతలు, కార్పొరేటర్లతో తాజా పరిణామాలపై ఆయన చర్చించారు.‘‘కష్టాలు అనేవి శాశ్వతం కావు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు.మనమందరం కలిసికట్టుగా పని చేయాలి. దేశ చరితలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మోసపూరిత హామీలతో చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చారు. కానీ, ..మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా పాలన చేశాం. 2027 చివరిలో జమిలి ఎన్నికలు(Jamili Elections) రావొచ్చు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతికార్యకర్తకు అండగా ఉంటాం’’ అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో.. ఆంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటీవల కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) చేస్తున్న అరాచకాలను కడప నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్లలో బలం లేకపోయినా టీడీపీ నేతలు పెత్తనం కోసం ఎలా పాకులాడుతున్నారో తమ అధినేతకు వివరించారు. ‘‘మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలను తెలుసుకుని ఆదరిస్తారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా నిత్యం మనం ప్రజల కోసమే పోరాడాలి’’ అని నేతలకు వైఎస్ జగన్(YS Jagan) సూచించారాయన. -
మేము న్యూట్రల్..ఎన్డీఏ కాదు,ఇండియా కాదు: విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం:నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం(డిసెంబర్24) మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కాదు..మేము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నాంరాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యంమేము మొదటి నుండి చెప్తున్నాం జమిలి ఎన్నికలు వస్తాయనిజమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడునిజేపీసీలో ప్రతి రాష్ట్రంలోి పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుందిజేపీసీకి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారువిద్యుత్ ఛార్జీల పెంపుపై 27న నిరసనలు: గుడివాడ అమర్నాథ్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలుఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారుఅధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారుఅధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేలకు కోట్లకు పైగా భారాన్ని మోపారువైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాంవచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుందిఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారుసంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదునాణ్యమైన విద్యుత్తు విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు