breaking news
-
మేము న్యూట్రల్..ఎన్డీఏ కాదు,ఇండియా కాదు: విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం:నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం(డిసెంబర్24) మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కాదు..మేము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నాంరాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యంమేము మొదటి నుండి చెప్తున్నాం జమిలి ఎన్నికలు వస్తాయనిజమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడునిజేపీసీలో ప్రతి రాష్ట్రంలోి పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుందిజేపీసీకి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారువిద్యుత్ ఛార్జీల పెంపుపై 27న నిరసనలు: గుడివాడ అమర్నాథ్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలుఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారుఅధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారుఅధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేలకు కోట్లకు పైగా భారాన్ని మోపారువైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాంవచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుందిఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారుసంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదునాణ్యమైన విద్యుత్తు విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు -
‘‘గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు’’
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపి నందిగాం సురేష్(Nandigam Suresh) అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) అన్నారు. మంగళవారం(డిసెంబర్ 24) గుంటూరు జైలులో సురేష్‌ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.‘ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్‌ను ఎలా ఉంచాలి?అనేది చెబుతున్నారు... ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైఎస్సార్సీపిని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి.కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారు. గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్సార్సీపీకి ఉంది. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు’అని సజ్జల హెచ్చరించారు. -
ఆరు నెలల్లో మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు: అమర్నాథ్రెడ్డి
సాక్షి,అన్నమయ్యజిల్లా: అధికారంలోకి రాకముందు ఎన్నోహామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. మంగళవారం(డిసెంబర్24) రాజంపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో అమర్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు 27న విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడుపై వైఎస్సార్సీపీ పోరాటం చేయనుంది.ప్రతి నియోజక వర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ స్టేషన్ల ఎదుట ధర్నా చేయనున్నాం. విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలి’అని అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. -
లేని ప్రొటోకాల్ కోసం టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి రచ్చ
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి తీరు ఏ మాత్రం మారలేదు. ప్రజా సమస్యలను గాలికొదిలి నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో తనకు మేయర్ పక్కనే కుర్చీ వేయలేదని రచ్చ చేశారు. అజెండా పేపర్లను చించేసి నిరసన తెలిపారు. మేయర్ సురే‹Ùబాబు కార్పొరేటర్లను సస్పెండ్ చేసినా బయటకు వెళ్లకుండా రచ్చ చేస్తూనే, దూషణలు, కవ్వింపుపు చర్యలకు దిగారు. లేని ప్రోటోకాల్ కోసం ఎమ్మెల్యే పంతానికి దిగారు. మేయర్ స్థాయిలో సీటు వేయాలని.. అంతవరకూ సమావేశం జరగనిచ్చేది లేదంటా రభస కొనసాగించారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను వెంటేసుకుని నగరపాలక సంస్థ కార్యాలయం లోపల, బయట యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశాన్ని రెండోసారి కూడా కొనసాగనివ్వకుండా అడ్డుకున్నారు. అధికార దర్పంతోనే.. వాస్తవానికి కార్పొరేషన్ నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యే నగరపాలక సంస్థకు ఎక్స్‌అఫిíÙయో సభ్యులు మాత్రమే. ఎక్స్‌అఫిíÙయో సభ్యులు కూడా కార్పొరేటర్ల చెంతన కూర్చోవాలి. మంత్రులు సైతం మిగతా సభ్యులతో కలిసి కూర్చోవాల్సిందే. సభకు అధ్యక్షత వహించే మేయర్‌కు మాత్రమే పోడియంపై ఆశీనులయ్యే అధికారం ఉంటుంది. కాగా కడప కార్పొరేషన్లో మాత్రం మేయర్ స్థాయిలో తన సీటు ఉండాలని ఎమ్మెల్యే మాధవీరెడ్డి పట్టుబడుతున్నారు. నిబంధనలన్నిటినీ గాలికొదిలేసి తనకు కుర్చీ వేయాల్సిందేనని ఇష్టారీతిన వ్యవహరించారు. దీంతో పాలకవర్గ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన 8మంది కార్పొరేటర్లను అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి దిగారు. అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకుండా..కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రచ్చ చేయడమే ఏకైక అజెండాతో ఎమ్మెల్యే, ఫిరాయింపు సభ్యులు వచి్చనట్టు స్పష్టంగా కని్పంచింది. సమావేశంలోకి రావడంతోనే నేరుగా పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేకు కుర్చీ వేయాలంటూ సభను కొనసానివ్వకుండా అడ్డుకోవడంపై నగరపాలక సంస్థ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 15వ ఆర్థికసంఘం పనులను ఆమోదిస్తేనే కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. కాగా, గత రెండు సమావేశాలనూ ఎమ్మెల్యే అడ్డుకుంటూ నగరాభివృద్ధికి రావాల్సిన నిధులను రాకుండా చేస్తున్నారని మహిళా కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యేకు తాము గౌరవం ఇచ్చినా .. ఆమె నిలుపుకోలేకపోయారని, మేయర్ ఇంటిపై చెత్త వేయించి చెత్త రాజకీయం చేశారని మహిళా కార్పొరేటర్లు వాపోయారు. అలాంటప్పుడు ఆమెకు తామెందుకు లేని గౌరవం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.144 సెక్షన్ ఉన్నా.. దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులుకార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు పోలీసు బారికేడ్లను తోసుకొని ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయానికి దూసుకొచ్చారు. ప్రధాన గేటు వద్ద నినాదాలు చేశారు. వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. 144 సెక్షన్ ఉల్లంఘించినా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయారు. -
పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
YS Jagan Pulivendula Tour Day 1 Updatesపులివెందుల చేరుకున్న వైఎస్ జగన్పులివెందుల నివాసానికి చేరుకున్న జగన్ 08.20PMనూతన జంటకు వైఎస్ జగన్ ఆశీర్వాదంవైఎస్సార్సీపీ నేత ఇంట వివాహ వేడుకవేముల కొత్తపల్లిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ వెన్నపూస వెంకట్రామిరెడ్డి ఇంట వివాహ వేడుకవెంకట్రామిరెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి, సాహితీ రెడ్డిల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్జననేతను చూసేందుకు ఎగబడ్డ జనంకరచలనం, ఫొటోల కోసం ప్రయత్నం 03.52PMకడప ముఖ్యనేతలతో వైఎస్ జగన్కష్టాలు అనేవి శాశ్వతం కావుమనమందరం కలిసికట్టుగా పని చేయాలికష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదుదేశ చరిత్రలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశాంఅబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాంకడప ముఖ్యనేతలు, కార్పొరేటర్లతో వైఎస్ జగన్పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబుఇదీ చదవండి: అందుకే మనం ప్రతిపక్షంలో ఉన్నాం!02.24PMవైఎస్జగన్ను కలిసిన కీలక నేతలుపులివెందుల పర్యటనలో భాగంగా.. ముందుగా ఇడుపులపాయలో వైఎస్ జగన్జగన్ను మర్యాదపూర్వకంగా కీలక నేతలు జగన్‌ను కలిసిన వాళ్లలో..పార్టీ అధికార ప్రతినిధి.. మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి 12.08PMఇడుపులపాయ ఎస్టేట్‌లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు, ఎంపీ అవినాష్ రెడ్డి11.25AMఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన వైఎస్ జగన్ అభిమానులకు అభివాదం చేసిన వైఎస్సార్సీపీ అధినేత 11.08AMఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్సార్ ఘాట్‌లో తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించనున్న వైఎస్ జగన్ నేటి నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలో పర్యటనఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌వద్ద నివాళులర్పిస్తారుఅనంతరం ప్రేయర్ హాల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారుఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారుమధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారుఈ నెల 25న ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారుమధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు26వ తేదీన పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరిగే వివాహానికి హాజరవుతారుఅనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళతారు. -
నేను చెప్తే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లే
ఆదోని టౌన్: ‘ఆదోని నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు, నాయకులను ఆదుకోవడం నా బాధ్యత. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే సంక్షేమ పథకాలను వర్తింపజేసి వాటి ద్వారా కార్యకర్తలు, నాయకులుబ్దిపొందేలా చూసుకుంటా. నేను చెబితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పినట్లే. గతంలో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అన్నివిధాలుగా లబ్ధిపొందారు. ఇక చాలు.. రేషన్‌షాపులు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర పోస్టులను కూటమి నాయకులు, కార్యకర్తలకు వదిలేసి వెళ్లాలి’.. అని కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఐదు రోజుల క్రితం జేబీ ఫంక్షన్ హాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, రేషన్‌షాపు డీలర్లు .. అన్నీ వదిలి వెళ్లిపోవాలి. వైఎస్సార్సీపీ ఐదేళ్లుగా చేస్తున్నది చాలు. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తీసుకొచ్చినా నేను బెదరను. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. అదే చెల్లుబాటవుతుంది. ఆ పిమ్మట ఎవరు చెప్పినా ఏం జరగదు’.. అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, నాయకులకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం చేస్తామన్నారు. ఇక ఎమ్మెల్యే వ్యాఖ్యల అనంతరం ఆదోని పట్టణంలో పది రేషన్ షాపులకు బీజేపీ కూటమి కార్యకర్తలు తాళాలు వేశారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. -
ఎవడబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేస్తున్నారు?
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): పుష్ప2 సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన అల్లు అర్జునే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుట్రలు పన్నుతున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. గత కొంతకాలంగా టీడీపీ, జనసేన నేతలు అల్లు అర్జున్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. తాజాగా మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దీన్నే ధ్రువీకరిస్తున్నాయని అంటున్నారు. ఎవడబ్బ సొమ్మని సినిమాలకు బెనిఫిట్ షోలు వేస్తున్నారని సినీ నిర్మాతల మండలిని టీడీపీ ఎమ్మెల్యే బండారు ప్రశ్నించారు.ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోలు వేస్తున్నారని, ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా అనుమతులు తీసుకుంటున్నారని అన్నారు. మీ లాభాల కోసం బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులివ్వాలా అని ప్రశ్నించారు. కూటమి నేతలతో కలిసి ఆయన సోమవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. సినిమాల బెనిఫిట్ షోలు, హీరోల ఆదాయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో హీరో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో బెనిఫిట్ షోలు చారిటీ కోసం వేసేవారని, ఇప్పుడు సినీ నిర్మాతల లబ్ధి కోసం వేస్తున్నారని అన్నారు. నిర్మాత కోసమో, డబ్బులున్న వాళ్ల కోసమో వీటికి ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వాలని ఆక్షేపించారు.సినిమాలకు రూ.వేల కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇంతకు ముందు బ్లాక్‌లో టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకునేవారని, కానీ ఇప్పడు సినిమా నిర్మాతలే అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలకు వచ్చే డబ్బును ప్రజా శ్రేయస్సు కోసం, సమాజం కోసం వినియోగిస్తేనే అనుమతులివ్వాలని కోరారు. చిన్న ఉద్యోగిని ట్యాక్స్ కట్టలేదని లెక్కలడుగుతున్నారని, సినిమాలకు ఇన్ని వేల కోట్లు కలెక్షన్స్ వస్తుంటే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, బెనిఫిట్ షోలను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలతో ఎవరికి లాభం కలుగుతోందని ప్రశ్నించారు. ఒకవేళ అనుమతించినా వీటిపై నియంత్రణ ఉండాలన్నారు.బాబు కుట్రే.. నిదర్శనమిదే..హీరో అల్లు అర్జున్‌పై చంద్రబాబు అండ్ కో కుట్ర చేసిందనడానికి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే ప్రబల నిదర్శనం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్టు చేసినా, ఆయన ఇంటిపైన దాడి జరిగినా ఇంతవరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదు. పైగా, ఇటీవల టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు పలువురు అల్లు అర్జున్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా’ అంటూ ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. పుష్ప2 సినిమా విడుదలకు ముందు గన్నవరం జనసేన పార్టీ ఇన్చార్జి చలమలశెట్టి రమేష్‌బాబు ‘నువ్వు హీరో అనుకుంటున్నావా..? నువ్వొక కమెడియన్.చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక నంద్యాల టీడీపీ ఎంపీ శబరి ‘ఎక్స్’లో అర్జున్‌పై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. ‘మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. నంద్యాలలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంటిమెంట్ మాకు చాలా బాగా పనిచేసింది. ఆ సెంటిమెంట్ మాదిరిగానే మీ పుష్ప 2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అంటూ శబరి ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పరోక్షంగా అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
‘వైఎస్ జగన్ భద్రతపై ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోంది’
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత గురించి ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.. ‘ఎల్లోమీడియా ఏపీలో ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. ఎస్ఆర్సీ కమిటీ సమీక్ష ప్రకారమే వీఐపీల భద్రతను కల్పిస్తారు. కానీ వైఎస్ జగన్ భద్రతకు అధికంగా వ్యయం చేస్తున్నట్టు రోత మీడియా రాసింది. ..సీఎంకి సంబంధించిన భద్రతని ఏ సీఎం కూడా నిర్ణయించుకోరు. ఇంటిలిజెన్స్, పోలీసు అధికారుల నిర్ణయం మేరకు తీసుకుంటారు. చంద్రబాబు కేవలం 120 మంది మాత్రమే భద్రత అంటూ కథలు రాస్తున్నారు. జగన్‌కు కల్పించిన భద్రత రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. సివిల్ పోలీసులు 18 మంది, ఆర్మడ్ 33 మంది,బెటాలియన్ 89 మంది మాత్రమే ఉన్నారు. బయటకు వెళ్లినప్పడు ఆక్టోపస్ 13 మంది ఉంటారు. మొత్తం 196 మంది వైఎస్ జగన్‌కు భద్రత ఉంటారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇదే విధానం అమలు అవుతుంది. కార్యక్రమాలు, తిరిగే ప్రాంతాలను బట్డి అధికారుల నిర్ణయాలు ఉంటాయి. కానీ ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాస్తోంది...చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపటం లేదా?. చంద్రబాబు గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ మా గురించి తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు. చంద్రబాబు తన మనమడికి కూడా 4+4 సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు?. ప్రభుత్వ ధనాన్ని ఎందుకు వినియోగిస్తున్నారు?. తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం సృష్టించవద్దు. చంద్రబాబు, వైఎస్ జగన్‌లకు ఎంత భద్రత ఉందో అధికారిక రికార్డులను బయట పెట్టాలి. ఆ రికార్డులు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వానికి వారధులుగా ఉండాల్సిన చంద్రబాబుకు తొత్తుగా ఎల్లో మీడియా వ్యవహరిస్తుంది’అని విమర్శలు గుప్పించారు. -
కుర్చీ కోసమే మాధవీరెడ్డి పంతం: మేయర్ సురేష్‌బాబు
సాక్షి,వైఎస్ఆర్జిల్లా:ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా,నియంతలా వ్యవహరిస్తున్నారని కడప మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం(డిసెంబర్23) కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే చేసిన గలాటాపై సురేష్‌బాబు సాక్షి టీవీతో మాట్లాడారు.‘తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే రెండు సార్లు సమావేశాన్ని అడ్డుకున్నారు.దౌర్జన్యానికి దిగి సమావేశ ఎజెండా పేపర్లను చించివేశారు. ఇలా చేస్తున్న ఆమెకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుంది?మిగిలిన కార్పొరేషన్లలో మీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఎక్కడ కూర్చుంటున్నారు..?మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారని గౌరవిస్తే మా ఇంటిపైనే చెత్త వేయించింది.కార్పొరేటర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. వందలాది మంది కార్యకర్తలతో కార్పొరేషన్పైకి దండెత్తారు. ఇదెక్కడి సభ్యత?ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా..?ఎమ్మెల్యే,పిరాయింపు సభ్యులను సస్పెండ్ చేసినా బయటకు వెళ్ళలేదు.ఎజెండా పేపర్లను చింపి సభను అడ్డుకున్నారు.వాళ్ళని బయటకు పంపడంలో అధికారులు వైఫల్యం చెందారు.పార్టీలకు అతీతంగా మేము గౌరవం ఇచ్చినా ఆమె నిలబెట్టుకోలేదు.ప్రజాసమస్యలు చర్చించడానికి యుద్ధానికి వచ్చినట్లు వస్తారా?ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ఎవరూ హర్షించడం లేదు.ఫిరాయింపు సభ్యులు మా పార్టీ సభ్యులపై దాడికి దిగారు.ఇది ప్రజాస్వామ్యంలో సరైన చర్య అని ఎవరైనా అంటారా? మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆమె తన హక్కులు ఏంటో ముందు తెలుసుకోవాలి.ఆమె ప్రజాసమస్యల కంటే తన పంతం ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.15 అర్థికసంఘం పనులు ఆమోదించి పంపాలి..కానీ ఆమె సమావేశం జరగనివ్వడం లేదు.బాధ్యతాయుతమైన ఒక ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరిస్తే ఎలా’అని సురేష్‌బాబు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ సమావేశపు ఎజెండాను కడప కార్పొరేషన్ ఏకపక్షంగా ఆమోదించింది. ఎజెండా మొత్తాన్ని ముక్తకంఠంతో ఆమోదిస్తున్నట్లు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చేతులెత్తారు. ఇదే సమయంలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. సస్పెండ్ చేసినా అజెండా ఆమోదాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రయత్నించారు. అయితే, మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎజెండాలోని అంశాలకు ఆమోదం దక్కింది. ఇదీ చదవండి: కుర్చీ కోసం ఎమ్మెల్యే దౌర్జన్యం -
కూటమి పార్టీల్లో ‘బెనిఫిట్ షో’ వివాదం
సాక్షి,విశాఖపట్నం : కూటమి నేతల మధ్య బెనిఫిట్ షో వివాదం తలెత్తింది. బడా సినిమాల బెనిఫిట్ షోలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమర్థించారు. మరోపక్క ఎంఎల్ఏలు విష్ణు కుమార్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి బెనిఫిట్ షోను వ్యతిరేకించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ‘బెనిఫిట్ షోలు రద్దు చెయ్యాలనేది నా అభిప్రాయం. బెనిఫిట్ షోల వల్ల ఎవరికి లాభం. ఒకవేళ షోలకు అనుమతిచ్చినప్పటికీ నియంత్రణ ఉండాలి.అల్లు అర్జున్‌పై పురందేశ్వరి, కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు’అని స్పష్టం చేశారు. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ‘బెనిఫిట్ షోలు ఎవరికోసం అనుమతినిస్తున్నారు.ఒక్కో హీరో వంద నుంచి 300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. గతంలో బెనిఫిట్స్ అంటే చారిటీ కోసం వేసేవారు.ఇప్పుడు సినిమా నిర్మాతల కోసం బెనిఫిట్ షోలు వేస్తున్నారు.సినిమాలకు వేల కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ,ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారు.ఎవడబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు’అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: నేనే సీఎం.. డిప్యూటీ సీఎం -
‘‘నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం’’
కర్నూలు, సాక్షి: కూటమి ప్రభుత్వంలో ఉండడం ఏమోగానీ.. అధికార మదంతో రోజుకొకరు వార్తల్లో నిలుస్తున్నారు. తాము ఏం చెబితే అదే శాసనం అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆ తరహా దురుసు వ్యాఖ్యలే చేశారు.కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం. నేను చెబితే చంద్రబాబు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కల్యాణ్ చెప్పినట్లే. ఎవరైతే ఇన్నాళ్లూ.. ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు కొనసాగిస్తున్నారో వాళ్లంతా ఉన్నపళంగా వదలేసి వెళ్లిపోవాలి. .. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తేవడాల్లాంటివి ఉండవు. వాళ్లంతా లబ్ధి చేకూర్చేవన్నింటిని విడిచిపోవాలి. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. లేకుంటే లెక్క మరోలా ఉంటుంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. ఐదు రేషన్ షాపులకు తాళాలు వేసి.. ‘ఇక నుంచి ఇవి మావే’ అంటూ ప్రకటన చేశారు. దీంతో రేషన్ డీలర్లు షాక్‌కు గురయ్యారు.‘‘ఎన్టీఆర్ హయాం నుంచి ఆ రేషన్ షాపులను తామే నడుపుకుంటున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా లాగేసుకోవడం ఏంటని, తమ షాపులు లాకుంటే తాము రోడ్డున పడుతామంటూ’’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహం భావంతో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా?
సాక్షి, విశాఖపట్నం: రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి... ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా? అని ఆయన ప్రశి్నంచారు. రాజధాని పేరుతో ఉత్తరాం«ధ్ర, రాయలసీమలను పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘గుంటూరు జిల్లా అమరావతిలో రానున్న మూడేళ్లలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలు, ఇతర నిధులన్నీ దాదాపు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. ఈ రుణభారం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలపైనా పడుతుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. అమరావతి రాజధాని వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉందో తెలీదు కానీ... అన్యాయం మాత్రం తీవ్రంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తిగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని ఆపకుండా... పక్కనే నక్కపల్లిలో ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్లరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించేందుకు మొగ్గు చూపడం ఎంతవరకు సమంజసం? ఈ ఒక్క నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఉత్తరాంధ్రపై ఉన్న ఉదాసీనత బట్టబయలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఉన్న హామీలపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించకపోవడం కూడా మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ వ్యవహారంపై మీరు చూపించిన చొరవపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజధాని పేరుతో బిల్డింగులు, హంగులపై ప్రజల నిధులు ఖర్చు చేసే బదులుగా.. ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడం, ప్రజాస్వామ్య విధానాలపై దృష్టి సారిస్తే మంచిది. వెనుకబడిన ప్రాంతాలను విస్మరించి వేల కోట్ల రూపాయలను రాజధానికి ఖర్చు చేస్తే రాష్ట్ర ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించాలి..’అని లేఖలో శర్మ పేర్కొన్నారు. -
అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే..!?
హైదరాబాద్: ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలుకొట్టడం కొందరికి కంటగింపుగా మారిందని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్ప–2 బ్లాక్ బస్టర్‌గా నిలిచి కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే.. ఆయనపై దుష్ప్రచారాలు సాగుతున్నట్టుగా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్లే దీని వెనుక సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో నేతలు, బాలీవుడ్ నటుల నుంచి సత్వరమే స్పందన వ్యక్తమైంది. ఒక రాత్రి జైలులో ఉండి మరునాడు విడుదల అయిన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆలస్యంగా తూతూ మంత్రంగా స్పందించడం.. అల్లు అర్జున్‌కు దగ్గరి బంధువైన ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ స్పందించకపోవడం.. అల్లు అర్జున్ అరెస్టైన రోజు, విడుదలైన రోజు కూడా హైదరాబాద్‌లోనే ఉన్న పవన్ కనీసం పరామర్శించకుండానే ఏపీకి వెళ్లిపోవడం వంటివి చూస్తుంటే.. ఈ వ్యవహారం వెనుక వీరి ఒత్తిడి ఉందనే అనుమానాలు వస్తున్నాయని సినీ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఎన్నో అనుమానాలు..వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయిన పుష్ప–2 జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, వేడుకగా జరుపుకోవాల్సిన సమయంలో... ఆ రికార్డులకు కారణమైన హీరో అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏముంటుందని సినీ పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా చర్యలు చేపట్టడం.. అదీ కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేకుండా.. రెండు, మూడు రోజులు జైలులో ఉండాల్సి వచ్చేలా శుక్రవారం అరెస్టు చేయడం.. హైకోర్టు సాయంత్రమే బెయిల్ మంజూరు చేసినా అర్ధరాత్రి వరకు పత్రాలు జైలుకు చేరకపోవడం.. రాత్రి జైలులోనే ఉండాల్సి రావడం వంటి ఘటనల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారనే చర్చ సినీ పరిశ్రమ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి పుష్ప–2 సినిమా విడుదలకు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్.. పవన్‌కు దగ్గరి బంధువని తెలిసీ కూడా జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పుష్ప–2 సినిమాను నడవనీయబోమని కూడా జనసేన, టీడీపీ నేతలు ప్రకటనలు చేశారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ముందు నుంచే దుష్ప్రచారం ‘అల్లు అర్జున్‌కు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య మరోమారు మొదలైంది. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలు పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు. ‘అల్లు అర్జున్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. వారిని కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతే వస్తా అంటే, మానేయ్ వెళ్లిపో.. ఎవడికి కావాలి?’ ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?’ అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ను ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (టీడీపీ) ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్‌ని కలిగి ఉన్నట్లుగా మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంట్మెంట్ మాకు చాలా బాగా పని చేసింది. ఆ సెంట్మెంట్ మాదిరిగానే మీ పుష్ప–2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. ‘అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా.. నువ్వు ఒక కమెడియన్. చిరంజీవి, పవన్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గం గన్నవరంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అని గన్నవరం నియోజకవర్గం జనసేన నేత రమేష్ బాబు వ్యాఖ్యానించారు. -
నాగబాబు బెర్త్ ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే
మెగా బ్రదర్... జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి యోగం.. ఉందా..? ఇప్పట్లో..? పండక్కి అవుతుందా ? ఇంకా టైం పడుతుందా ? అంతా గందరగోళం. తన మానాన తాను ట్విట్టర్లో పిచ్చి ట్వీట్స్ చేసుకుంటూ ఎకసెక్కాలు ఆడుకుంటావు ఉంటే ఉన్నఫళాన ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటాం సీఎం చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేసారు. వాస్తవానికి మొన్నామధ్య ఖాళీ అయినా మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి ఆయన్ను ఎంపిక చేసి రాజ్యసభకు ఢిల్లీ పంపుతారని వార్తలు వచ్చాయి కానీ అది కుదరకపోవడంతో ఎకాఎకిన ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అంటూ చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఫలానా వ్యక్తికీ త్వరలో కేబినెట్లో స్థానం కల్పిస్తాం అని ప్రకటన చేయలేదు. దీని మీద అప్పట్లో జరిగాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియావాళ్లు సైతం బాగానే ట్రోల్ చేసారు. కానీ ఇంతవరకు ఆ విషయమై ఏమీ తేలలేదు..ఇదిలా ఉండగా మంత్రిగా ప్రమాణస్వీకారం ఎలా చేయాలన్నదానిమీద నాగబాబు ఇప్పటికే రిహార్సిల్స్ కూడా చేసేసి. కొత్త బట్టలు కుట్టించుకుని రెడీగా ఉన్నారు. కానీ మరి చంద్రబాబు నుంచి .. రాజ్ భవన్‌నుంచి కనీసం పిలుపు రాలేదు. వాస్తవానికి రాష్ట్ర కేబినెట్లో ఒకే ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పటికె పలువురు మంత్రులు రెండేసి పదవులు చేపట్టి బాధ్యతలు మోస్తున్నారు. వాటిలో ఒకటి తీసేసి ఈయనకు ఇస్తారని.. అది కూడా జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు ఇస్తారని కూడా పుకార్లు వచ్చాయి. కానీ ఆ సౌండ్ కూడా ఇప్పుడేం లేదు.. అంతా సైలెంట్ అయిపొయింది.ఆరోజుకు కూల్ చేయడమే చంద్రబాబు లక్ష్యమా ?వాస్తవానికి రాజ్యసభ స్థానం కోసం పట్టుబట్టిన నాగబాబును కూల్ చేయాడానికి అప్పటికపుడు ఆ మంత్రి పదవి పేరిట ఒక ప్రకటన ఇచ్చారు తప్ప ఇప్పుడప్పుడే ఆయన్ను కేబినెట్లోకి తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా అసలు ఏమి పదవి అడగాలి.. ఏది తీసుకోవాలి అనే విషయంలో పవన్ కళ్యాణ్.. నాగబాబులమధ్య చర్చలు కూడా నడిచాయని ఏ శాఖ తీసుకోవాలన్నదానిమీద వారు ఒక అవగాహనకు వచ్చారని కూడా అంటున్నారు కానీ చంద్రబాబు దగ్గర ఇవన్నీ నడుస్తాయా..? అయన ఇచ్చింది తీసుకోవడం తప్ప వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి ఉందా అనే అంశాలూ చర్చకు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ గమ్మున కేబినెట్లోకి దూకేసి హడావుడి చేద్దాం అనుకున్న నాగబాబు స్పీడ్ కు చంద్రబాబు బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాజ్యసభ ఎన్నికల హడావుడి ముగిసింది.. మళ్ళా ఏదైనా అవసరం పడినపుడు. పవన్ బ్రదర్స్ ను కూల్ చేయాల్సిన అవసరం వచ్చినపుడు చూద్దాం అందాక ఊరుకుందాం అని చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.- సిమ్మాదిరప్పన్న -
నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగం
వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం మరోసారి బయటపడింది. నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిని ఘటన బట్టబయలైంది. నీటి సంఘం అధ్యక్షుడిగా గెలిచిన బీటెక్ రవి తమ్ముడు జోగిరెడ్డిని పులివెందుల పోలీసులు ప్రత్యేకంగా అభినందించడంతో ఈ ఎన్నికలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి నిదర్శనంగా నిలిచింది. డీఎస్పీ మురళినాయక్, రూరల్ సీఐ వెంకట రమణలతో పాటు డీఎస్పీ స్థాయి అధికారి టీడీపీ నేతలకు అభినందనలు తెలియజేయడం అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. ఇక పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ పసుపు చొక్కా వేసుకుని మరీ ఎన్నికలు జరిగే చోటుకి వెళ్లడం ఇక్కడ గమనార్హం. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. నీటి సంఘం ఎన్నికలు ఎలా జరిగాయో అనేది ఈ అభినందనలతోనే స్పష్టమవుతుందని వైఎస్సార్సీపీ విమర్శించింది. పులివెందులలో పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారనడానికి ఇదే నిదర్శమని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. మరొకవైపు అధికారుల తీరుపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
కరెంట్ ఛార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట
సాక్షి,తాడేపల్లి : కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో ‘విద్యుత్ చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట’ పేరుతో పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనను ఎండగట్టారు.రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది : మాజీ మంత్రి జోగి రమేష్ ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాడు. దీనిలో భాగంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదు అని ప్రజలను నమ్మించాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను ప్రజలపై మోపుతున్నాడు. గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను అనేక కష్టాలకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆనాడు విద్యుత్ చార్జీలతో నలిగిపోతున్న ప్రజలకు, రైతులకు అండగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమించారు. చంద్రబాబు ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసేందుకు ఏకంగా రైతులపై పోలీసులతో కాల్పులు చేయించి, రక్తపాతానికి కారణమయ్యాడు. నేడు రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు వల్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక ప్రజల నడ్డి విరుగుతోంది. ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ఈనెల 27న తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడంతో పాటు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం.ప్రజలపై చంద్రబాదుడు : మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రజలపై చంద్రబాదుడు కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాదు, వారి కష్టాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, కొనేవారు లేక మద్దతుధర లభించక అల్లాడుతున్న రైతులకు అండగా వైయస్ జగన్ చేసిన ఆందోళనలతో ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలను పెంచడం, గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు సరైన గుణపాఠం నేర్పుతాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 27న విద్యుత్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి.ప్రజలను నమ్మించిన చరిత్ర చంద్రబాబుది : మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నిలకు ముందు విద్యుత్ చార్జీల మోత ఉండదూ అని ప్రజలను నమ్మించిన చంద్రబాబు నేడు దానికి విరుద్దంగా కరెంట్ చార్జీలను పెంచాడు. చంద్రబాబు దిగివచ్చి, కరెంట్ చార్జీల భారంను ఉపసంహరించుకునే వరకు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఉద్యమిస్తూనే ఉంటుంది. ప్రజల గళంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. ప్రజల ఆవేదనకు అండగా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం కనీవినీ ఎరుగని రీతిలో.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అసలు చార్జీల వడ్డింపునకు సిద్ధమైంది. ప్రత్యక్షంగానో, కుదరకపోతే దొంగ దారిలో శ్లాబుల విధానంలోనే కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై మరికొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)తో కసరత్తు పూర్తి చేయించింది.ఈ మేరకు 2025–26 సంవత్సరానికి ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్)ను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి అందజేశాయి. దాని ప్రకారం వచ్చే ఏడాది (2025) ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి రానున్నాయి. ప్రజలపై చార్జీల భారం వేయని వైఎస్ జగన్విద్యుత్ చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచే ప్రభుత్వాలను గతంలో చూశాం. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఇదే కాకుండా, రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్‌ను అందించింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే.వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలోనే. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాటి పాలకులు చేశారు.2024–25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. తద్వారా విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసింది. -
కూటమి కక్ష సాధింపు.. కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు!
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కేసుతో సంబంధం లేకపోయినా పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేస్తున్నారు.మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్టేషన్‌కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని.. అలాగే, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసులో తెలిపారు. అయితే, కేసుతో సంబంధం లేకపోయినా నోటీసులు ఇవ్వడమేంటని పలువురు వైఎస్సార్సీపీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
‘విజన్’ల పేరుతో ఏం సాధించారో కాస్త చెప్పండి చంద్రబాబు..!
ఏపీలో ఎవరు విజనరి? తాను విజనరీని అని నిత్యం ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న విజన్ ఏమిటి? ఎలాంటి పబ్లిసిటీ లేకుండా పలు వ్యవస్థలను తీసుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు ఉన్న విజన్ ఏమిటి అన్నది పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది. విజన్ -2047 డాక్యుమెంట్ ను ఒక డొల్ల పత్రంగా, చంద్రబాబుది మోసపూరిత విజన్‌గా జగన్ అభివర్ణించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని గమనించి ఆలోచించవలసిన అవసరం ఏపీ ప్రజలపై ఉంటుంది.ఆయన ప్రకటన చూస్తే ఎవరు ఏపీకి మేలు చేసే విధంగా విజన్ తో పనిచేశారో తెలుస్తోంది.చంద్రబాబు మొత్తం విజన్ల పేరుతో కథ నడపడమే కాని, చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా?అని జగన్ ప్రశ్నించారు. ఇది అర్దవంతమైన ప్రశ్నే. ఎందుకంటే విభజిత ఏపీలో ఐదేళ్లు, అంతకుముందు ఉమ్మడి ఏపీకి సుమారు ఎనిమిదిన్నరేళ్లు సీఎంగా ఉన్న ఆయన మళ్లీ గత ఆరు నెలలుగా ఆ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.విజన్ 2020 అని ,విజన్ 2029 అని, విజన్ 2047 లని ఇలా రకరకాల విజన్లు పెట్టడమే తప్ప,వాటి ద్వారా ఏమి సాధించింది చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు హైదరాబాద్ లో అది చేశా..ఇది చేశా..అని అనడమేకాని ,విభజిత ఏపీలో తన హయాంలో ఫలానా గొప్ప పని చేశానని వివరించలేకపోతున్నారు.నిజంగానే ఆయనకు అంత మంచి విజన్ ఉంటే,హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అయిన విశాఖపట్నానికి ఐటి రంగాన్ని ఎందుకు తీసుకు రాలేకపోయారు?హైదరాబాద్‌లో ఒక హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం నిర్మించిన మాట నిజం.కాని అంతకుముందే నేదురుమల్లి జనార్ధనరెడ్డి హయాంలో రాజీవ్ గాంధీ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేశారు.మరి ఆయనది విజన్ కాదా?చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హైటెక్ సిటీ ప్రాంతంకాని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంగాని అబివృద్ది చెందాయి ఆ రోజుల్లో దానికి ఎలా అడ్డుపడాలా అన్న ఆలోచనతో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పనిచేసింది. ఈ విధంగా తాము అధికారంలో లేనప్పుడు పలు అభివృద్ది పనులకు ఆటంకాలు కల్పించడంలో మాత్రం చంద్రబాబు టీమ్ కు చాలా విజన్ ఉందని చెప్పవచ్చు.మరో సంగతి కూడా చెప్పాలి. రాజకీయాలలో వైఎస్ కుమారుడు జగన్ దూసుకు వస్తారని ఊహించిన చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి అక్రమ కేసులలో ఇరికించి జైలుపాలు చేశారు.ఈ విజన్ మాత్రం బాగానే ఉందని చెప్పాలి.జగన్ పై ద్వేషంతో చీరాల ప్రాంతంలో అప్పట్లో తీసుకురాదలిచిన వాన్ పిక్ కు అడ్డుపడ్డారు.ఆ పారిశ్రామికవాడ వచ్చి ఉంటే ,ఇప్పుడుతడ వద్ద ఉన్న శ్రీసిటీ మాదిరి అభివృద్ది చెంది ఉండేది.విభజిత ఏపీకి అది పెద్ద ఆభరణంగా ఉండేది. వైఎస్ టైమ్ లో శ్రీసిటీ భూమి సేకరణకు కూడా టీడీపీ,అలాగే ఈనాడు వంటి ఎల్లో మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. అయినా వైఎస్ ఆగలేదు కనుక అది ఒక రూపానికి వచ్చింది. ఇప్పుడేమో శ్రీ సిటీ అభివృద్దిలో తమకు వాటా ఉన్నట్లుగా చంద్రబాబు పిక్చర్ ఇస్తుంటారు.విభజిత ఏపీలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఎంతసేపు సోనియాగాంధీని దూషించడం ,తదుపరి ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిపోయడం, వీటికోసం నవనిర్మాణ దీక్షలని, ధర్మపోరాట దీక్షలని డ్రామాలు ఆడారు. ఆ తర్వాత కాలంలో సోనియాను, మోడీని పొగుడుతూ వారితోనే రాజకీయంగా జత కట్టారు.అది ఆయన విజన్.తన పాలనలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు.ఆ కమిటీలలో టీడీపీ నేతలను పెట్టి గ్రామాలలో అరాచకం సృష్టించారు.అది అప్పటి విజన్ అనుకోవాలి.అదే జగన్ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను తెచ్చి, గ్రామ,వార్డు సచివాలయాలను పెట్టి పాలనను ప్రజల చెంతకు చేర్చారు.దీనిని కదా విజన్ అనాల్సింది.చంద్రబాబు తన టైమ్ లో ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వరంగంలో తీసుకురాలేదు. జగన్ తన టైమ్‌లో పదిహేడు మెడికల్ కాలేజీలను తెచ్చి, వాటిలో ఐదు నిర్మాణం పూర్తి చేశారు.అది విజన్ కాదా? చంద్రబాబు ఏమి చేశారు. కూటమి అదికారంలోకి రాగానే పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం మంజూరు చేసిన మెడికల్ సీట్లను అక్కర్లేదని లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీలను ప్రవేటు రంగంలోకి మళ్లించాలని చూస్తున్నారు.జగన్ నాలుగుపోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు.వాటిలో కొన్ని ఇప్పటికే పూర్తి అయ్యాయి.చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో ఒక్క ఓడరేవు అయినా నిర్మించారా?ఇప్పుడేమో జగన్ తీసుకు వచ్చిన పోర్టులను ప్రైవటైజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది చంద్రబాబు విజన్.వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి ,వారికి తాము నెలకు పదివేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారు.అది చంద్రబాబు విజన్ అనుకోవాలి. గత జగన్ పాలనలో ఇళ్ల వద్దకే ఏ సర్టిఫికెట్ అయినా తెచ్చి ఇచ్చేవారు.చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే ఆ పద్దతి ఆగిపోయింది.మళ్లీ ఆఫీస్ ల చుట్టూ తిరిగేలా చేసిన విజన్ కూటమిది.వృద్దులకు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచింది నిజమే అయినా,ఇప్పుడు అర్హత పేరుతో లక్షల సంఖ్యలో తొలగిస్తున్నారు.స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్ దారులలో దొంగలున్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తాము పెన్షన్ దారులలో అనర్హులను ఏరివేస్తామని చెప్పకపోగా, ఎక్కడైనా ఒకటి,అరా పెన్షన్ దారులలో కోత పడితే జగన్ పై విరుచుకుపడేవారు. ఇప్పుడేమో గెలిచాక టీడీపీ వారు కొత్త రాగం అందుకున్నారు. జగన్ స్కూళ్లు బాగు చేసి ,అందులో ఆంగ్ల మీడియంతో సహా పలు అంతర్జాతీయ కోర్సులను తీసుకు వస్తే చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేస్తోంది.వీరిద్దరిలో ఎవరు విజనరీ అనుకోవాలి.పిల్లలకు టాబ్ లు ఇచ్చి వారి చదువులకు జగన్ ఉపయోగపడితే, వాటిపై దుష్ప్రచారం చేసినవిజన్ టీడీపీది,ఎల్లో మీడియా ఈనాడు ది.ప్రస్తుతం పిల్లలకు టాబ్ లు ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదు. జగన్ పిల్లలకు విద్యే సంపద అని పదే,పదే చెప్పేవారు.చంద్రబాబు గతంలో అసలు విద్య అన్నది ప్రభుత్వ బాధ్యతే కాదని అనేవారు.చంద్రబాబు తన హయాంలో మిగులు రెవెన్యూ చూపారా? అని జగన్ ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే కదా!ఆ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడూ రెవెన్యూలోటే ఎందుకు ఉందని ఆయన అడుగుతున్నారు.జగన్ పాలనలో పేదల చేతిలో డబ్బులు ఉండేవి. దాని ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ కరోనా వంటి సంక్షోభంలో కూడా సజావుగా సాగింది.తత్ఫలితంగా జిఎస్టి దేశంలోనే అత్యధికంగా వచ్చిన రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే అది ఎందుకు తగ్గిపోయింది. గత నెలలో ఏకంగా ఐదువందల కోట్ల జిఎస్టి తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. జగన్ గ్రీన్ ఎనర్జీమీద కేంద్రీకరించి, రైతులకు మంచి కౌలు వచ్చేలా పారిశ్రామికవేత్తలకు భూములు ఇప్పిస్తే చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని తీవ్రమైన విమర్శలు చేసేవారు.కాని ఇప్పుడు అదే పద్దతిని కూటమి ప్రభుత్వం చేపడుతోంది.జగన్ టైమ్ లో రైతులకు కేంద్రం సూచన మేరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలుగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని ఉరితాళ్లుగా ప్రచారం చేసిన విజన్ చంద్రబాబుది. తాము అధికారంలోకి రాగానే యధాప్రకారం స్మార్ట్ మీటర్లను పెడుతున్న విజన్ కూటమి ప్రభుత్వానిది అని చెప్పాలి.జగన్ ప్రజల ఇళ్లవద్దకే వైద్య సదుపాయం కల్పించడానికి ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చారు.అది ఆయనవిజన్ అయితే,ఇప్పుడు ఆస్పత్రులలో దూది కూడా లభించకుండా చేసిన విజన్ ఈ ప్రభుత్వానిదని అనుకోవాలి.కరెంటు చార్జీలు పెంచబోనని,తగ్గిస్తామని పదే,పదే ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిరాగానే పదిహేనువేల కోట్ల మేర భారం వేసిన విజన్ ఆయన సొంతం అని చెప్పాలి.ఇసుక, మద్యం వంటి వాటి ద్వారా కూటమి నేతలు బాగా సంపాదించుకునేలా మాత్రం చంద్రబాబు ప్రభుత్వం విజన్ తో పనిచేసిందని చెప్పాలి.పేదలకు ప్రభుత్వమే అండగా ఉండాలన్నది జగన్ విజన్ అయితే, పేదలను ధనికులు దత్తత తీసుకోవాలన్న ఆచరణ సాధ్యం కాని విజన్ చంద్రబాబుది. అయితే అమరావతిలో ఒక రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టనక్కర్లలేదని చెప్పి, పవర్ లోకి రాగానే ఏభైవేల కోట్ల అప్పు తీసుకువస్తున్న చంద్రబాబుది ఏమి విజన్ అని అడిగితే ఏమి చెబుతాం. ఆయనది రియల్ ఎస్టేట్ విజన్ మాత్రం చెప్పక తప్పదు. జగన్ ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంభించి ప్రజలకు ఉపయోగపడేలా ప్రయత్నించారు.కాకపోతే తనది విజన్ అని ,వంకాయ అని ప్రచారం చేసుకోలేదు.అదే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వంటివారు ఎల్లో మీడియా అండతో స్వర్ణాంధ్ర-2047 అంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజలకు తామిచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేయడానికి విజన్ తో పని చేస్తున్నారని చెప్పవచ్చేమో! ఇచ్చిన వాగ్దానాలను ఎలా అమలు చేయాలా అన్నవిజన్ తో జగన్ పనిచేస్తే, చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు తాము చేసిన ప్రామిస్‌లను ఎలా ఎగవేయాలా అన్న విజన్ తో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ అటు సంక్షేమ రంగంలో కాని,ఇటు అభివృద్ది, పారిశ్రామిక రంగలో కాని, లేదా పరిపాలనను ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడంలో కాని కచ్చితంగా విజన్ తో పనిచేశారని సోదాహరణంగా చెప్పవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్ జగన్ పేదల పక్షపాతి, సంక్షేమ సారథి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
సాక్షి, ప్రకాశం: ఏపీలో ప్రజల మద్దతుతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల పక్షపాతి, సంక్షేమ సారధి అయిన వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మద్దతుతో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసే వరకు కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ చుండూరి రవిబాబులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన కార్యక్రమానికి కార్యకర్తల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.మరోవైపు.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాకాల మండలంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల పక్షనా వైఎస్సార్సీపీ నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. హామీల అమలు చేయకపోతే పాకాల నుంచే పోరాటాలు ప్రారంభిస్తాం. కూటమి నాయకుల దౌర్జన్యాలకు సరైన గుణపాఠం నేర్పుతాం అని హెచ్చరించారు. -
ఎవరేమన్నా.. జగన్ వెంటే జనం!
అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చేతకాదు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ఏరకంగా చూసినా ఆయన జనం మనిషి. వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలూ ఆయన చలించిపోతారు. జనాల కోసం ఎంతదూరమైన వెళ్తారు. ఆ క్రమంలో.. ఎవరెన్ని రకాలుగా నిందించినా, ట్రోల్ చేసినా ఆయన అడుగులు ఆగిపోవు. ప్రజల సమస్యకు సత్వర పరిష్కారం కావాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. సహాయం అందించే విషయంలోనూ ఆయనది అదే ధోరణి. సీఎంగా ఉన్న టైంలో వైఎస్ జగన్ ఎలాంటి కార్యక్రమానికి వెళ్లినా.. కచ్చితంగా ఎంతో కొంత మందికి సాయం అందేది. అలాగే ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వీలైనంత తొందరగా సాయం అందేది!. అయితే ఇప్పుడు సీఎంగా లేకున్నా కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. బహుశా ఈ గుణమే.. జగన్మోహన్రెడ్డి ఎక్కడికెళ్లినా ప్రజాభిమానం కట్టలు తెంచుకునేలా చేస్తోందేమో!.జగన్ ఊరకనే జననేత అయిపోలేదు. ఇప్పటికీ ఫలానా చోటుకి.. ఆయన వస్తున్నారంటేనే జనం తండోపతండాలుగా వస్తారు. బడి ఈడు పిల్లల నుంచి పండు ముసలి అవ్వల దాకా.. చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే జగన్‌ను దగ్గరగా చూడాలని, వీలైతే ఆయన్ని కలవాలని.. షేక్‌హ్యాండ్ ఇవ్వాలని.. ఆయనతో ఓ ఫొటో దిగాలని ఆరాటపడుతుంటారు. అది ఎలాంటి సందర్భం అయినా సరే!. ఆ అభిమానాన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేక అంతే ఒద్దికగా స్వీకరిస్తుంటారాయన. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే!.ఇదీ చదవండి: ఇందుకుకదా జగన్ అంటే జనానికి ఇష్టం!ఎవరైనా తనను కలవడంలో ఇబ్బంది పడడం ఆయన కంటపడితే.. దగ్గరికి పిలిపించుకుంటారు. లేదంటే స్వయంగా ఆయనే వాళ్ల దగ్గరకు వెళ్తారు. అదంతా ‘తరలించిన అభిమానం’ అని కొందరు తీసిపారేయొచ్చేమో!. కానీ, ‘తరలివచ్చిన అభిమానం’ అని నిరూపించిన సందర్భాలు కోకోల్లలు ఉన్నాయి కదా!. పైగా మీరంతా ‘నా వాళ్లు’ అని అన్నివర్గాలను ఉద్దేశించి ఆయన అంటుంటారు కదా!. పోనీ అలా చెప్పే లీడర్లు దేశంలో మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కనిపించరు మరి.జగన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను గమనిస్తే.. ఎలాంటి మాస్ లీడర్ ఇంతకాలం దానిని నిలబెట్టుకునేవారు కాదేమో!. తమ బాగోగుల కోసం జగన్ అంతలా ఆలోచిస్తారని జనం గుర్తించారు కాబట్టే ఆ అంతులేని అభిమానం. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన జనం మధ్య ఉండే మనిషే. ఇది బలమైన ముద్ర. ఎవరెన్ని రకాలుగా అనుకున్నా సరే ఇది అంగీకరించాల్సిన విషయం. #HBDYSJaganఇదీ చదవండి: జగన్.. ఆ ఒక్కడు ఈయనే కదా! -
మనసున్న మారాజు.. జగనన్న
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి ప్రత్యేకమైన విజన్ వుండాలి.మొదటగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలి..ఆ తర్వాత ఆస్తులను రక్షించాలి. అందుకోసం పాలకులు అధికార యంత్రాంగంలో స్ఫూర్తిని నింపి.. చిత్తశుద్ధితో పని చేయాలి. తన పాలనలో అదే పని చేశారు తాను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు ప్రజాసేవకున్ని అని నిరూపించుకున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. మనసున్న నాయకునిగా అడుగులు వేశారు.కరోనా సమయంలో రాజీలేని పోరాటంప్రజలకు ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు..కరోనాలాంటి మహా విపత్తు సమయంలో ఎక్కడా సంయమనం కోల్పోకుండా అడుగులు వేశారు. ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యాత ఇచ్చి రాజీలేని పోరాట పటిమను ప్రదర్శించారు.ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి..ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలు సర్వత్రా వ్యాపించాయి. కరోనా రోగంతో కొంతమంది..భయంతో అనేక మంది చిగురుటాకుల్లా రాలిపోయిన అత్యంత భయానకమైన రోజులవి..అలాంటి గడ్డు పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగానే కాదు.. మానవత్వం ఉన్న నాయకునిగా పని చేశారు. ఎప్పటికప్పుడు అధికారులతో, నిపుణులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించి సరైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల్లో భయమనేది పోగొట్టారు..ఇంట్లో నుంచి జనం బయటకు రావాలంటేనే దడుసుకుంటున్న పరిస్థితుల్లో గ్రామవార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఆయన చేయించిన సేవలను జనం ఎప్పటికీ మరిచిపోరు. నిత్యం ఫీవర్ సర్వేలు చేయించారు. వాటి ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొని కరోనా భూతాన్ని తరిమికొట్టారు. ప్రజలకు కావాల్సిన మందులు దగ్గర్నుంచి ఆహార పదార్ధాల వరకు అన్నిటినీ అందించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా జరగనంతగా సేవా కార్యక్రమాలు దాదాపు రెండేళ్లపాటు కరోనా సమయంలో చేసి చూపించారు.ఒక ప్రభుత్వ పెద్దగా తన కిందనున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చి వదిలేయవచ్చు. కానీ మానవత్వం ఉన్న మనిషిగా స్పందించారు.మన ఇంట్లో వారే కష్టాల్లో ఉంటే మనం ఎలా స్పందిస్తామో అలా ఆయన పాలన సాగించారు. ఉచితంగానే కరోనా టెస్టులు చేయించటం దగ్గర్నుంచి...ప్రజలకు కావాల్సిన మందులను కూడా నేరుగా వారి ఇంటికి పంపించారు. పక్క రాష్ట్రాల్లో లక్షల రూపాయల ఖర్చయిన కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్పించి ఉచితంగానే చేయించారు. ఇది అప్పట్లో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం.క్వారంటైన్ సెంటర్లలో వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లే సమయంలో వెయ్యి రూపాయల చొప్పున అందించటంతోపాటు, ప్రతి ఇంటికీ నెలకు రెండు సార్లు రేషన్ ను కూడా ఉచితంగా ఇప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేయిస్తున్న ఈ సేవా కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం, వ్యాపారాల కోసం వెళ్లిన వారు సైతం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కే వచ్చారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలో జగన్ పాలనలో ఉన్నాం కాబట్టే మేము బతికి బట్ట కట్టాం అనే మాట చాలామంది నోట విన్నాం.వరద బాధితులకు కొండంత అండగా..వరద బాధితులను కాపాడటంలో వైఎస్ జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించటం దగ్గర్నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించటం వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. వరదల సమయంలో వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి అధికారుల కాళ్లకు అడ్డం పడే పనిని జగన్ ఏనాడూ చేయలేదు. ముందుగా అధికారుల సహాయక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు.వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక ప్రభుత్వ పెద్దగా పైనుంచి చూసుకునేవారు. అంతేకాదు.. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టి, బాధితులు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో వారికి రెండు వేల రూపాయల చొప్పున ఇప్పించారు. వరద సహాయ చర్యలకు ఇబ్బంది వుండదని తెలుసుకున్న తర్వాతనే ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో కలిసి మాట్లాడేటప్పుడు తమకు ఏమీ ఇవ్వలేదన్న మాట వారి నుంచి రాకూడదని ముందుగానే అధికారులకు గట్టిగా చెప్పారు.అక్కడక్కడ ఆకస్మిక తనిఖీలు చేసి బాధితులతో మాట్లాడేవారు. ప్రభుత్వం ప్రకటించిన సాయమంతా అందిందా? అని నేరుగా బాధితులనే అడిగేవారు. అంతేకాదు.. మీ కలెక్టర్ కు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చో మీరే చెప్పండని కూడా ప్రశ్నించేవారు.ప్రకృతి విపత్తుల సమయంలో జనంలోకి వెళ్లి, అందునా వరద బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వ సాయం పూర్తిగా అందిందా? అని పాలకులు అడగడం ఒక విధంగా సాహసమే అవుతుంది. అయినాసరే ఆ విషయం తెలిసినా సరే వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు.తన ప్రభుత్వం చేసిన సహాయ కార్యక్రమాల మీద, తన అధికారుల మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది.ప్రతి ఏటా కృష్ణా, గోదావరి వరదల సమయంలో ముంపు బాధితుల విషయంలో అత్యంత ఉదారంగా వ్యవహరించాలని వైఎస్ జగన్ తరచూ అధికారులతో చెప్పేవారు. మన సొంత మనుషులు ఆ బాధితుల్లో ఉంటే మనం ఎలా వ్యవహరిస్తామో అలా ఆలోచించండి అంటూ అధికారుల్లో స్ఫూర్తిని నింపి వారిలోని మానవత్వాన్ని బయటకు తీసేవారు. ఇదంతా కేవలం మనుషుల్ని ప్రేమిస్తేనే చేయగలం. ఆ ప్రేమ జగన్ లో పుష్కలం. ఆయన ఓదార్పు, పాదయాత్ర సమయాల్లోనేఅన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లను దగ్గరగా చూశారు. అందుకే పాలకునిగా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలతో ప్రజల మనసులో జననేతగా పేరు సంపాదించుకున్నారు.కృష్ణలంక వాసుల కష్టాలు తీర్చిన నాయకుడుబుడమేరు వరదలు అనగానే బెజవాడ ప్రజలకు కంటి మీద కునుకు వుండదు. కృష్ణలంక వాసుల కష్టాలయితే పగవాడికి కూడా వద్దనేలాగా వుండేవి. కృష్ణానది పొంగితే అక్కడి వేలాది కుటుంబాల పరిస్థితి మరీ భయంకరం.. గతంలో ఆ ప్రాంత వాసులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక వారధి మీదుగా వెళ్తుండగా కృష్ణలంక వాసుల కష్టాలు కనిపించాయి. ఇక అంతే.. ఆయన వెంటనే అధికారులను పిలిపించి నది ఒడ్డున రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.రిటైనింగ్ వాల్ నిర్మించి మమ్మల్ని కాపాడంటూ ఏ ఒక్కరూ ఆయన్ను నేరుగా అడగకపోయినా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కళ్లారా వారి కష్టాలు చూశారు కాబట్టేఆయన ఆ పని మొదలుపెట్టారు. మొత్తం రూ.474 కోట్లు వ్యయం చేసి రెండున్నర కిలోమీటర్ల పొడవునా వాల్ నిర్మాణం చేపట్టారు.దీంతో సుమారు 80 వేల మందిని మొన్నటి వరదల నుంచి కాపాడటానికి వీలైంది.పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఏ ఇబ్బందీ లేకుండా కృష్ణలంక ప్రాంత ప్రజలు ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇదంతా కేవలం మనసున్న నాయకుడు వైఎస్ జగన్ వలనే సాధ్యం అయింది. ఎవరూ అడగకుండా అన్ని వేల మందికి ఉపయోగపడే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ఆ ప్రాంత ప్రజల మనసుల్లో నిలిచారు వైఎస్ జగన్.ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పదులసంఖ్యలో ప్రజాదరణ పథకాలు నిత్యం అమలయ్యేవి. దాంతో చాలావరకు అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించింది. కీలక విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి..అందుకే వైఎస్ జగన్ మనసున్న నాయకుడయ్యారు. శనివారం(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు.. -
టీడీపీ సుద్దులన్నీ బీసీ నేతలకు మాత్రమేనా?
తెలుగుదేశం పార్టీ రాను రాను మరీ సంకుచితమైన రాజకీయ పార్టీగా మారిపోతోంది. రాజకీయాలన్నీ ఎన్నికల సమయానికి మాత్రమేనని ఆ తరువాత అందరూ కలిసి పని చేయాలని సుద్దులు చెప్పిన చంద్రబాబు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా గౌడ సంఘం నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఒకే వేదికను పంచుకోవడాన్ని ఆ పార్టీ నేతలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. నూజివీడులో జరిగిన ఈ కార్యక్రమానికి సొంత నియోజకవర్గం కావడంతో పార్థసారథి, లచ్చన్న మనవరాలిగా శిరీష వెళ్లారు. వైఎస్సార్సీపీ నేతలు జోగి రమేశ్ కూడా హాజరయ్యారు. అంతే.. టీడీపీ నేతలు జోగి రమేష్ వేదిక పంచుకోవడమే తప్పని, పార్ధసారథిలో వైఎస్సార్సీపీ వాసనలు పోలేదని, శిరీష తప్పు చేశారని టీడీపీ కులోన్మాదులు, లోకేష్ మెప్పుకోసం తాపత్రాయ పడుతున్న నేతలు పెద్ద ఇష్యూ చేసేశారు. అక్కడితో ఆగనూ లేదు. అదేదో పెద్ద నేరం అన్నట్లు టీడీపీ నాయకత్వం పార్ధసారథి, శిరీష్ లతో క్షమాపణ చెప్పించింది. ఎంత దారుణం! వారు కూడా తమ ఆత్మగౌరవాన్ని వదలుకుని చంద్రబాబుకు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లకు క్షమాపణ చెప్పేశారు. అయినా సరే టీడీపీ నేతలు కొందరు పార్దసారథిని విమర్శలతో ట్రోల్ చేశారు. దీంతో ఆయన తాను ఎంత చిత్తశుద్దితో పని చేస్తున్నా టార్గెట్ బాధపడడం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్మాదం ఈ స్థాయికి చేరిందా? అన్న ప్రశ్న వస్తుంది. దీన్ని కులోన్మాదం అనాలా? లేక ఇంకేమైనానా? బీసీ వర్గానికి చెందిన నేతలు మాత్రమే ఇలా కలవకూడదని ఏమైనా టీడీపీ ఆంక్షలు పెట్టిందా? ఎందుకంటే.. కమ్మ, కాపు, రెడ్డి తదితర అగ్రవర్ణాలలోని టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ వారితో, ఇతర పార్టీల నేతలతో కలిసి తిరిగినా, సభలలో మాట్లాడినా, వ్యాపారాలు చేసినా అభ్యంతరం వ్యక్తం కావడం లేదు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌ను ఆహ్వానిస్తారా? అంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటి వారు విరుచుకుపడ్డారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అప్పట్లో ఆనాటి సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం చెబుతానంటూ నాటి మంత్రి జోగి రమేష్ చంద్రబాబుకు ఇంటికి వెళ్లారు. టీడీపీ నేతలు దీన్నే ఒక పెద్ద దాడిగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక జోగిపై కేసు కూడా పెట్టేశారు. అంతమాత్రాన ఆయన ఇలాంటి సభలలో పాల్గొనకూడదని అంటే దానిని ఉన్మాదం అనక ఏమంటాం? విశేషం ఏమిటంటే టీడీపీకి మద్దతు ఇచ్చే కొందరు విశ్లేషకులు కూడా చాలా పెద్ద ఘోరం జరిగిందని టీవీలలో ఇంగితం లేకుండా మాట్లాడారు. ఈనాడు పత్రిక అయితే నీచాతినీచంగా పార్థసారథి, శిరీషల ఫోటోలు వేసి ‘ఇంగితం ఉందా’ అని, కనీస ఇంగితం లేకుండా వార్త రాసింది. ఈనాడు మీడియా స్థాయి అబద్ధాలు చెబుతోందని ఇంతకాలం విమర్శించుకున్నాం కానీ.. దాని స్థాయి అట్టడుగుకు చేరిందనేందుకు ఇదో నిదర్శనంగా నిలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. ఎన్.టిఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీలోకి రాలేదు. సినిమాలలో నటించే వారికి రాజకీయం ఏమి తెలుసు అని విమర్శలు కూడా చేశారు. కాని 1983లో టీడీపీ అధికారంలోకి రావడంతోనే బాబు పార్టీ మారిపోయారు. టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబుకు పార్టీ సభ్యత్వం ఇవ్వద్దని కొందరు సీనియర్ నేతలు అన్నా, ఎన్.టి.ఆర్. వారికేదో చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. తాజా పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎన్.టి.ఆర్కు ఇంగితం లేదనుకోవాలా? పార్టీలో గ్రూపు నడిపి, చివరికి ఎన్.టి.ఆర్.పదవికే ఎసరు పెట్టిన చంద్రబాబును ఏమనాలి? ఆ సమయంలో చంద్రబాబును ఎన్.టి.ఆర్. పలురకాలుగా దూషించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. ఎన్టీఆర్‌కు విలువల్లేవని విమర్శించిన నోటితోనే చంద్రబాబు తాము ఆయన వారసులమని కూడా ప్రకటించుకున్నారు. ఇంగితం లేనిది ఎవరికి?ఎన్.టి.ఆర్. బతికున్నంత కాలంలో అసభ్యకరమైన కార్టూన్లూ, నగ్న కేరికేచర్లు ప్రచురించిన ఈనాడు మరణానంతరం అవసరమైనప్పుడల్లా ఆయన్ను యుగపురుషుడని కొనియాడుతూ కథనాలు రాసింది. ఇక్కడ కూడా ఇంగితం లేనిది ఎవరికి? తన రాజకీయ జీవితం మొత్తం కప్పగెంతులేసిన చంద్రబాబు ఎవరెవరిని ఎప్పుడు దూషించింది.. అదే నోటితో ఎలా పొగిడిందీ తెలియందెవరికి? అందులో ఎవరికీ ఇంగితం జ్ఞాపకం రాకపోవడమే రాజకీయ వైచిత్రి! ఇవన్నీ మరచి కేవలం జోగి రమేష్‌తో ఒక వేదిక పంచుకున్నందుకు పార్థసారథి, శిరీషలకు ఇంగితం లేదని ధ్వజమెత్తుతున్నారు. లచ్చన్న ఒక కుల నాయకుడా అని వీరు తెలివిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాణం అన్ని కుల సంఘాలకూ వర్తింపజేస్తున్నారా మరి? కమ్మ కుల సంఘం మీటింగ్‌లో ఎన్.టి.ఆర్. విగ్రహాన్ని మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు? చంద్రబాబునే ఎందుకు పొగుడుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఆ కుల మీటింగ్‌లోకి హాజరైతే తప్పు లేదా? అంతెందుకు మాజీ మంత్రి పుల్లారావు, మరి కొందరు టీడీపీ నేతలు గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తుండే వారు అంటారు. వంగవీటి రంగ హత్య గురించి బాబుకు ముందే తెలుసన్న తీవ్ర విమర్శలతో చేగొండి హరిరామయ్య పుస్తకం రాస్తే దాని ఆవిష్కరణ సభకు టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ పక్షాల నేతలందరూ హాజరయ్యారే.... టీడీపీ అప్పుడు ఎవరితోనూ క్షమాపణ చెప్పించ లేదే! మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడకులకు రష్యా వెళ్లిన వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారంటారు అంతేకాదు... టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కొందరు కలిసి జూదమాడతారట. వీటికి రాని అభ్యంతరం లచ్చన్న విగ్రహావిష్కరణ సభకు వైఎస్సార్సీపీ నేత హాజరైతే వచ్చిందా? రెడ్డి జన సంఘం సభలకు కూడా వివిధ పార్టీల వారు హాజరవుతుంటారు. అంతెందుకు! లచ్చన్న మరణం తర్వాత జరిగిన ఒక కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, బీవీ రాఘవులుతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అంటే చంద్రబాబు తప్పు చేసినట్లేనా? ఎన్నికల తర్వాత అంతా రాష్ట్రం కోసమే ఆలోచించాలని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని చంద్రబాబు తరచుగా ప్రచారం చేసేవారు.ఇప్పుడు ఇలా ఎందుకు వ్యవహరించినట్లు? అంటే తన కుమారుడు, మంత్రి లోకేష్ కేవలం అవగాహన రాహిత్యంతో పార్థసారథి, శిరీషలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే, దానిని ఆమోదించి చంద్రబాబు కూడా మాట్లాడారా? తెలిసో, తెలియకో లోకేష్ మాట్లాడి ఉంటే సరిచేయాల్సిన పెద్దరికం చంద్రబాబుదే అవుతుంది కదా? అది కూడా చేయలేక పోయారంటే బాబు ఎంత నిస్సహాయంగా ఉంటున్నది అర్థం చేసుకోవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ఖజానాకు మేలు చేసే లక్ష్యంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా నవయుగ సంస్థను తప్పించి మెగా సంస్థను ఎంపిక చేశారు. దీన్ని చంద్రబాబుసహా పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. కానీ ఇప్పుడు అదే మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డితో కలిసి చంద్రబాబు టూర్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి స్వస్థలమైన డోకిపర్రులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చంద్రబాబు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కృష్ణారెడ్డి మంచివాడైపోయారా? మామూలుగా అయితే ఎవరూ వెళ్లవద్దని అనరు. కాని నూజివీడు ఘటన తర్వాత ఇవన్ని ప్రశ్నలు అవుతాయి. 2019 కి ముందు ఎన్ని ఘటనలు జరిగాయి. ప్రస్తుతం అలయ్ బలయ్ అంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అప్పట్లో ఎన్ని మాటలు అనుకున్నారు. మళ్లీ అదే పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు ఎంత తాపత్రయపడింది తెలుసు కదా? అలాగే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు, లోకేష్ లను ఎన్నేసి మాటలు అన్నారు. అసలు తన తల్లినే దూషించారని టీడీపీపై ఆరోపించారు. కాని ఏ ఇంగితం పెట్టుకుని మళ్లీ కలిశారని అంటే ఏమి చెబుతాం. బీజేపీతో తేడా వచ్చాక బీజేపీ అధ్యక్ష హోదాలో తిరుపతి వచ్చిన అమిత్ షాపై టీడీపీ వారు రాళ్లు వేశారు. ప్రధాని మోడీని చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు దూషించారు. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు, పెళ్లాన్ని ఏలుకోలేని వాడు అంటూ పరుష పదాలతో మాట్లాడిన వీరు, తర్వాత కాలంలో మోడీ అంత గొప్పవాడు లేడని చెబుతున్నారు. అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి డిల్లీలో ఎదురు చూశారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్ డిల్లీ వెళ్లి, తన పెద్దమ్మ సాయంతో అమిత్ షాను కలిసి వచ్చారే! ఇందులో ఎవరికి ఇంగితం ఉన్నట్లు?ఎవరికి లేనట్లు? చంద్రబాబు ఎవరినైనా ఏమైనా అనవచ్చు. ఎవరితోనైనా జట్టు కట్టవచ్చు? అది గొప్పతనం. ఆయన తిడితే అంతా తిట్టాలి. ఆయన పొగిడితే అంతా పొగడాలి. ఎటు తిరిగి ఆయన చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి భజన మీడియా ఉంది కనుక ఏమి చేసినా చెల్లిపోతోంది.పార్థసారథి తండ్రి కెపి రెడ్డయ్య గతంలో కాంగ్రెస్, టీడీపీలలో పనిచేశారు. ఎంపీగా పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని కాపాడడానికి మరి కొందరితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో రెడ్డయ్యపై టీడీపీ వారు ఆరోపణలు చేసేవారు. అయినా రెడ్డయ్య వాటన్నిటిని ధీటుగా ఎదుర్కునేవారు. రెడ్డయ్య నోటికి అంతా భయపడే పరిస్థితి ఉండేదని చెబుతారు. ఇప్పుడు ఆయన కుమారుడు పార్థసారథి కూడా ఒకరకంగా అదే ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కుంటున్నారు. కాంగ్రెస్ లోను, ఇప్పుడు టీడీపీలోను మంత్రిగా ఉన్నారు. శిరీష తండ్రి గౌతు శివాజి కూడా ఆరుసార్లు టీడీపీ ఎమ్మెల్యే. అలాంటి కుటుంబానికి చెందిన శిరీషను టీడీపీ నాయకత్వం అవమానించి క్షమాపణ కోరుతుందా?ఒకప్పుడు సమరసింహా రెడ్డి మంత్రిగా ఏదో కాకతాళీయంగా మరో మంత్రి కటారి ఈశ్వరకుమార్తో మాట్లాడుతూ బీసీలా..వంకాయలా అని అన్నారు. అది కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపింది. చంద్రబాబు నాయుడు గత టరమ్ లో బీసీ నేతలు కొందరు సచివాలయానికి వస్తే దేవాలయంవంటి ఇక్కడకు వచ్చి ప్రశ్నిస్తారా? అని మండిపడ్డారు. మరో సందర్భంలో మత్యకారులను ఉద్దేశించి తోకలు కట్ చేస్తానని అనడం వివాదాస్పదమైంది. ఈ మధ్యనే కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావు పై అభియోగాలు చేస్తూ లేఖ రాసిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా టీడీపీ కులోన్మాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నారు. అవమానాలకు గురి కావల్సి వచ్చింది. టీడీపీ బీసీ నేతలు ఇలాంటి వాటిని భరిస్తుండడం విశేషం. కనీసం ధైర్యంగా తాము తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు. మరో వైపు జగన్ బీసీలకు అత్యంత గౌరవం ఇచ్చి ఎన్నడూ లేని విధంగా వారికి నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించారు. వారిలో ముగ్గురు పార్టీని వీడడం దురదృష్టకరం. తమను గౌరవించేవారు కావాలో, లేక అవమానించేవారు కావాలో బీసీ నేతలే నిర్ణయించుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జేపీసీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ : జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది. ఆ 12మందిలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నిక బిల్లును)ను లోక్‌సభ శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇప్పటికే మంగళవారం దిగువ సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని విపక్షాలు ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపాలని డిమాండ్ చేయడంతో లోక్‌సభ జేపీసీకి పంపింది. మరోవైపు లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు.కమిటీలో అనురాగ్ ఠాకూర్, అనిల్ బలూనీ, సంబిత్ పాత్రా, శ్రీకాంత్ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ నుంచి), బాలశౌరి(జనసేన), హరీష్ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు. -
పెన్షన్‌దారులు దొంగలతో సమానం.. అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో పెన్షన్లను తొలగించే కుట్ర జరుగుతోంది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్‌దారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్‌దారులను దొంగలతో పోల్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర లేపింది. పెన్షన్లను తొలగించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అయ్యన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పెన్షన్‌దారులను దొంగలతో పోల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 20 వేల మంది తప్పుడు ధ్రువపత్రాలు చూపించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు. వారంతా దొంగలతోనే సమానం అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో పెన్షన్‌దారుల కారణంగానే ప్రభుత్వానికి నష్టం వస్తోందన్నారు. పెన్షన్ల వలన నెలకు రూ.120 కోట్ల నష్టం వస్తోంది. సంవత్సరానికి రూ.1440 కోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయి. ఎవరు.. ఏం అనుకున్నా నాకు అనవసరం. ఈ పెన్షన్లను తొలగించాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో అయ్యన్నపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబుది 420 విజన్: వైఎస్ జగన్
ఇవాళ ఆరు నెలలు గడవక ముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి. ఆ రోజు నేను ఎన్నికలప్పుడు చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అని. ఇవాళ 6 నెలలు తిరక్క ముందే అది కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది. జగన్ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. పలావు, బిర్యానీ రెండూ పోయాయి. ఏమీ లేకుండా బాబు రోడ్డు మీద నిలబెట్టాడు అన్న చర్చ నడుస్తోంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిచంద్రబాబు విజన్ 2047 అంటున్నాడు. ఏడు నెలల క్రితం చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి మేనిఫెస్టో పేరుతో ప్రచారం చేసి ఊదరగొట్టారు. రూ.15 వేలు నుంచి రూ.48 వేల వరకు హామీలిచ్చుకుంటూ వెళ్లారు. ఇక్కడ ఏడు నెలల క్రితం మేనిఫెస్టో అని చెప్పిన హామీలకే దిక్కులేదు... కానీ, విజన్ 2047 అంటున్నాడు. రంగు రంగుల కథల పుస్తకమైన వారి విజన్ డాక్యుమెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. ఇంకోవైపు బాదుడే బాదుడు మొదలైంది. ముట్టుకుంటే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఆరు నెలలు తిరక్క మునుపే రూ.15 వేల కోట్లు కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన దుర్మార్గుడు చంద్రబాబు మాత్రమే. హామీలపై చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే... ఆ ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామ స్థాయి నుంచి అమలవుతోంది. స్కామ్‌ల మీద స్కామ్‌లు.. లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి డబ్బులివ్వాల్సిందే. ప్రతి విషయంలో నాకింత.. నీకింత.. అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు కళ్లెదుట కనిపిస్తున్నాయి.ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన సాగు నీటి సంఘాల ఎన్నికలను అపహాస్యం చేశారు. ఎన్నికలను ఏకపక్షం చేశారు. గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూస్ సర్టిఫికెట్లు, ప్రతిపక్షానికి, సాధారణ రైతులకు ఇవ్వకుండా వాళ్ల పార్టీ వారికే ఇచ్చుకుని పోలీసుల సాయంతో ఏకపక్షంగా బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపించుకున్నారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు? బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపి... రైతులు సంతోషంగా ఉన్నారని ఎలా చెబుతారు? రైతులు సంతోషంగా ఉన్నారని మీకు అనిపిస్తే రాజీనామా చేసి బయటకు రండి. అప్పుడు పెట్టుబడి సాయం, ఉచిత బీమా ఎక్కడ అని అడుగుతున్న రైతులు మీకు కనిపిస్తారు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే సీఎం చంద్రబాబు రంగు రంగుల కథలు చెబుతూ.. దానికి విజన్ 2047 అని పేరు పెడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే దాన్ని 420 విజన్ అంటారని మండిపడ్డారు. ‘మనిషిని అభివృద్ధి బాటలోకి తీసుకుని పోవాలంటే.. ఆ అభివృద్ధి బాట ఏమిటని చెప్పేదే విజన్ డాక్యుమెంట్. ఇవాళ చిన్న పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడు? అప్పుడు అతడి భవిష్యత్ ఏంటి? ఆ భవిష్యత్ కోసం ఇవాళ సరైన అడుగులు వేస్తున్నామా? లేదా? అన్నదే విజన్. అందులో భాగంగా ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా వాటిని చేసి చూపింది’ అని గుర్తు చేశారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని, పులినోట్లో తలపెట్టడమే అని.. నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఇవాళ ఆరు నెలలు తిరక్క ముందే అదే కనిపిస్తోంది’ అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం దగా చేయడంతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా గొంతు విప్పాలని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని మార్గ నిర్దేశం చేశారు. ‘పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. దేనికైనా మనం సిద్ధమే. ఎవ్వరూ, ఎక్కడా భయపడొద్దు. దేన్నైనా ఢీకొందాం. మీ అందరికీ జగన్మోహన్రెడ్డితోపాటు పార్టీ అండగా ఉంటుంది’ అంటూ నేతలకు భరోసా ఇచ్చారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...జనవరి నుంచి జిల్లాల పర్యటనజనవరి చివరి వారం నుంచి నేను పార్లమెంటు జిల్లాల్లో పర్యటిస్తాను. వారంలో ప్రతి బుధ, గురువారం రాత్రి అక్కడే బస చేసి కార్యకర్తలతో మమేకమవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ కార్యక్రమం మొదలయ్యే లోగా మండల స్థాయి నుంచి మొదలై నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలి. పార్టీ నిర్మాణం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇదంతా ఆర్గనైజ్డ్గా తీసుకు రావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మీరు, నేను కలిసి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకుని పోదాం. విలేజ్ కమిటీలు, బూత్ కమిటీల నియామకం పూర్తి చేస్తాం.సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉందాంఇవాళ మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు.. చంద్రబాబు వేసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ముసుగుతో యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి వాళ్లను ఎదుర్కోవాలంటే మనం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండాలి. జనరేషన్ మారింది. ప్రతి కార్యకర్తకు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలి. గ్రామ స్థాయిలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి. ఎవరికైనా పెన్షన్ రాకపోయినా, బిల్లుల బాదుడు పైనా ప్రశ్నిస్తూ ప్రతి గ్రామం నుంచి విప్లవ ధోరణిలో ప్రశ్నించాలి. గ్రామ స్థాయి నుంచే ప్రశ్నించే స్వరం ఉండాలి. అప్పుడే చైతన్యం వస్తుంది. ఈసారి మన టార్గెట్.. చంద్రబాబుకు సింగిల్ డిజిట్ దాటకూడదు. అది కచ్చితంగా జరుగుతుంది.మనకూ కచ్చితంగా గుడ్ టైమ్ వస్తుందిప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం. జైల్లో కూడా పెడతారు. నేను మీ అందరికీ చెబుతున్నాను. కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. ఏ కష్టం ఎవరికి వచ్చినా నా వైపు చూడండి. ప్రతిపక్షం ఉండదు.. అడిగే వాడు ఉండడని నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి నామీద కేసులు పెట్టాయి. ఏమైంది? ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యాను. పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. జమిలి వస్తుందంటున్నారు. దేనికైనా మనం సిద్ధంగా ఉందాం. మనకూ తప్పనిసరిగా గుడ్ టైమ్ వస్తుంది.ఆరు నెలల్లో 3.14 లక్షల పెన్షన్లు కట్మార్చి, ఏప్రిల్ నెలల్లో.. మన ప్రభుత్వ హయాంలో 66,34,742 పెన్షన్లు ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. డిసెంబర్లో పంపిణీ చేసిన పెన్షన్ల సంఖ్య 63,20,222. అంటే 3.14 లక్షల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా పెన్షన్ ఒక్కరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఇంకా, 3 లక్షల నుంచి 4 లక్షల మంది పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి. ఈ పోరుబాటలో ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను రెపరెపలాడించేలా ఎగుర వేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అభ్యర్థిస్తున్నాను. ఆరు నెలలకే ఇంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు⇒ ఆరు నెలలకే చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ఎన్నికల్లో మనం ప్రచారం చేసినప్పుడు, మన పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు నేను చెప్పిన మాటలు అందరికీ తెలుసు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీలు, మోసాల గురించి నా దగ్గరకు వచ్చిన పార్టీ నాయకులు చాలా మంది చెప్పారు. మనం కుటుంబానికి అంతటికీ మంచి చేశాం. కానీ చంద్రబాబు మోసాలు, అబద్ధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఇంటికి మనం మంచి చేస్తే.. ఆయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేస్తానని హామీ ఇచ్చాడు.⇒ మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని మన పార్టీ నేతలు నాతో అన్నారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ధర్మం కాదనేది నా అభిమతం. ఆ రోజు మనం మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇవి మనం చేస్తున్న పథకాలు.. ఐదేళ్ల మన పాలనలో ఎప్పుడూ జరగని మార్పులు చేశాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయకుండా భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి అమలు చేశాం. చివరకు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయాలు తగ్గినా, మనం సాకులు వెతుక్కోలేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి... బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసి చూపింది. అంత గొప్పగా ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాం.⇒ మనమంతా ఎమ్మెల్యేల తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు మనల్ని ఆప్యాయతతో ప్రజలు ఆదరించారు. మన మీద వ్యతిరేకత లేదు. కానీ పది శాతం మంది చంద్రబాబు మాటలను నమ్మారు. దానికి కారణం కూడా మనమే... అంత గొప్ప పాలన మనం అందించగలిగాం కాబట్టే.. చంద్రబాబు మభ్యపెట్టగలిగాడు. ప్రజలను ఆశ పెట్టగలిగాడు. జగన్ చేసి చూపించాడు కాబట్టి.. చంద్రబాబు కూడా చేసి చూపిస్తాడేమో అని ప్రజలు ఆశపడ్డారు.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లినా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో మోసం చేయగలుగుతాడా.. అన్నంతగా మోసం చేశారు. చిన్నపిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. వారి తల్లులకు నీకు రూ.18 వేలు అని, ఆ అమ్మల తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశ పెట్టారు.ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ పాలన⇒ ఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. రూ.15 వేల కోట్ల మేర కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామస్థాయి నుంచి అమలవుతోంది. మరోవైపు లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, స్కామ్‌లు. ప్రతి పనికీ డబ్బులివ్వాల్సిందే. నాకింత.. నీకింత అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు.⇒ ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టడానికి మనం ఇవాళ కలిసి అడుగులు వేస్తున్నాం. ఏ నాయకుడైనా ప్రజల తరఫున స్పందించ గలగాలి. వారి సమస్యలపై పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని చైతన్యం చేస్తున్నాం. అప్పుడే ప్రజల్లో అధికార పార్టీ మీద పెరుగుతున్న వ్యతిరేకత మనకు సానుకూలంగా మారుతుంది.⇒ ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది. ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్న విషయం మన కళ్లెదుటే కనిపిస్తోంది. రైతులకు గతంలో పెట్టుబడి సహాయంగా రైతు భరోసా కింద ఇచ్చిన రూ.13,500 గాలికెగిరిపోయింది. రూ.20 వేలు ఇస్తానన్న పెట్టుబడి సాయం మోసమని తేలిపోయిన పరిస్థితుల్లో రైతు సాగు చేస్తున్నాడు. రైతులకు ఉచిత పంటల బీమా దక్కే పరిస్థితి పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాపింగ్ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో మనం ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి రైతుకు కనీస మద్దతు ధర వచ్చేటట్టుగా ధాన్యం కొనుగోలు చేసి.. వెంటనే పైకం చెల్లించేలా అక్కడే ‘ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్’ (ఎఫ్టీఓ) కూడా ఇచ్చి, మనం తోడుగా నిలిచాం. ఇవాళ అదే రైతులకు కనీస మద్దతు ధర రాకపోగా, అంత కంటే రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకే వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమం చేశాం.షాక్ కొడుతున్న కరెంటు బిల్లులపై 27న ఆందోళనపట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్న విద్యుత్ బిల్లుల మీద ఈ నెల 27న ఆందోళనకు పిలుపునిచ్చాం. ఇప్పటి వరకు అంటే... 6 నెలల వరకు రూ.6 వేల కోట్ల బాడుదు మాత్రమే. రేపటి నెలలో మరో రూ.9 వేల కోట్ల బాదుడు ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితులలో మహిళలు నిరసన తెలుపుతూ బిల్లులు కాల్చుతున్న పరిస్థితి. ఈ దఫా కరెంటు బిల్లుల పెరుగుదలకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో చేయబోతున్నాం.ఫీజులు రాని పిల్లలకు అండగా నిలుద్దాంమన ప్రభుత్వ హయాంలో ప్రతి 3 నెలలకొకసారి, త్రైమాసికం అయిన వెంటనే పిల్లల తల్లులకు డబ్బులిచ్చి వారి చదువులకు తోడుగా ఉండేవాళ్లం. ఈ రోజు పిల్లలు విద్యా దీవెన, వసతి దీవెన రాక ఇబ్బంది పడుతున్నారు. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏప్రిల్‌లో వెరిఫై చేసి మే నెలలో ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు త్రైమాసికాలు గడిచిపోయాయి. ఏప్రిల్‌లో వసతి దీవెన కింద డబ్బులిచ్చే వాళ్లం. ఇప్పుడు అది కూడా ఎగిరిపోయింది. మొత్తంగా ఫీజులకు సంబంధించి నాలుగు దఫాలు విద్యా దీవెన రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూ.1,100 కోట్లు మొత్తం రూ.3,900 కోట్లు పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల.. పిల్లలు డబ్బులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. పనులకు వెళ్తున్నారు. ఈ పిల్లలకు అండగా, వారికి తోడుగా ఉండే కార్యక్రమం జిల్లా యూనిట్‌గా జనవరి 3వ తేదీన చేయబోతున్నాం.అసలైన విజన్ అంటే ఇదీచంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్‌తో మరో డ్రామాకు తెర తీశారు. అసలైన విజన్ అంటే ఏమిటో మనం చూపించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ బడులతో ప్రైవేటు బడులు పోటీ పడే పరిస్థితి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. నాడు–నేడు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)తో డిజిటల్ బోధన ప్రారంభించాం. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లిష్ మీడియం చేయడంతో పాటు, సీబీఎస్ఈతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణానికి కూడా మన ప్రభుత్వంలోనే అడుగులు పడ్డాయి. రోజుకొక మెనూతో గోరుముద్ద మన ప్రభుత్వంలోనే అమలు చేశాం. తొలిసారిగా మనం చేసిన ఈ మార్పులతో పదో తరగతికి వచ్చే సరికి పిల్లలు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే పరిస్థితి తెచ్చాం. అదీ మన విజన్.ఉన్నత విద్యలో ఊహకందని మార్పుఉన్నత విద్యలో మన డిగ్రీతో ఉద్యోగాలు రాని పరిస్థితి నుంచి వాటిని మరింత మెరుగ్గా చేయడానికి ఎడెక్స్ అనే సంస్థ సహాయంతో ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చాం. ఇందులో మన డిగ్రీ విద్యార్థి తనకు నచ్చిన కోర్సులు తీసుకునే విధంగా.. స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ వంటి పెద్ద, పెద్ద విదేశీ యూనివర్సిటీలు కోర్సులు ఆఫర్ చేసేలా చేశాం. ఆ కోర్సులు ఇక్కడ తీసుకుని పరీక్షలు రాస్తే.. వాటికి ఆ యూనివర్సిటీలు సర్టిఫికెట్స్ ఇస్తాయి. ఆయా యూనివర్సిటీల నుంచి డేటా అనలైటిక్స్, అసెట్స్ మేనేజిమెంట్ వంటి కోర్సుల్లో సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి కోర్సుల కోసం ఆలోచన చేసి వారికి విద్యాదీవెన, వసతి దీవెనతో సహా ఏర్పాటు చేయడమే విజన్.గ్రామ స్థాయిలో ప్రివెంటివ్ కేర్చదువులు, వైద్యం మనిషిని ఎప్పుడైనా అప్పుల్లోకి నెట్టేస్తాయి. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్స్‌కు తీసుకుని పోయి రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందేట్టు చేశాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు–నేడు పనులతో రూపురేఖలు మార్చాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకుని వచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత దేశ వ్యాప్తంగా 67 శాతం ఉంటే... మన రాష్ట్రంలో మాత్రం దాన్ని కేవలం 4 శాతానికి పరిమితం చేశాం. ప్రతి ఆసుపత్రిలో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో కూడిన మందులు ఉండేలా చేశాం. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ అంటే వివిధ రోగాలు తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించి, వాటిని నివారించడానికి గొప్ప అడుగులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పడ్డాయి. ఇదీ విజన్.పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో ప్రగతి..ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి రూ.13వేల కోట్లకుపైగా వ్యయంతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల నిర్మాణాన్ని, రూ. 3,500 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టాం. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. తద్వారా రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయి. ఇదీ విజన్. రైతును చేయి పట్టుకుని నడిపించాంరైతుకు ఇబ్బంది రాకుండా, వారిని చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకే కేంద్రంగా కూర్చోబెట్టడం విజన్. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేయడమే కాకుండా.. రైతుకు తోడుగా ఉంటూ ఇన్సూ్యరెన్స్ చేసుకున్నా, లేకున్నా.. విపత్తు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్సూ్యరెన్స్ వచ్చేట్టు ఉచిత పంటల బీమా తీసుకు రావడం విజన్. రైతుకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల దగ్గరే కొనుగోలు చేసి.. పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టు చేయడం ఒక విజన్. ఈ రకంగా వ్యవసాయ రంగంలో మార్పులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయి.ఇంటి వద్దకే సేవలుమన ప్రభుత్వం రాకమనుపు ఒక రూపాయి ప్రభుత్వం ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఎవరైనా అనుకున్నారా? అలాంటి విజన్‌ను తీసుకొచ్చిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ.. అందులో 540 రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం.. 60–70 ఇళ్లకు ఒక వలంటీర్... కులం, మతం, ప్రాంతం చూడకుండా.. లంచాలు లేకుండా ప్రతి ఇంటికి ప్రతి పథకం చేర్చగలిగే పరిస్థితి వైఎస్సార్‌సీపీప్రభుత్వంలోనే వచ్చింది. ఇదీ విజన్ అంటే.