విద్యార్థులను మోసగించిన చంద్రబాబు సర్కార్‌: లేళ్ల అప్పిరెడ్డి | YSRCP Fees Poru On February 5th Over Fee Reimbursement Funds Not Release In AP, More Details Inside | Sakshi
Sakshi News home page

విద్యార్థులను మోసగించిన చంద్రబాబు సర్కార్‌: లేళ్ల అప్పిరెడ్డి

Jan 23 2025 3:17 PM | Updated on Jan 23 2025 4:09 PM

Ysrcp Fees Poru On February 5th

ఫిబ్రవరి 5న ఫీజు పోరు నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.

ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు

చంద్రబాబు పోకడలు.. పేద విద్యార్థులకు విఘాతం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్‌ వేధింపులు

సాక్షి, తాడేపల్లి: ఫిబ్రవరి 5న ఫీజు పోరు (YSRCP Fees Poru) నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల  అప్పిరెడ్డి(Lella Appi Reddy) తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్రాలలో ఈ ఫీజు పోరు చేస్తామని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పోకడలు పేద విద్యార్థులకు విఘాతం కల్గిస్తున్నాయని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement) నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్‌ వేధిస్తోందని అప్పిరెడ్డి అన్నారు.

‘‘చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా సమాజానికి మేలు చేకూరే పని చేయరు. పేద విద్యార్థులకు ఏ ప్రయోజనం చేకూర్చరు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని 
2004లో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తెచ్చారు. ఆయన వలనే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవగలిగారు. కానీ చంద్రబాబు వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.

వైఎస్‌ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రూ.18 వేల కోట్లను విద్యా రంగానికి ఖర్చు చేశారు. ఐదేళ్లలో ఆలస్యం కాకుండా నిధులను విడుదల చేశారు. చంద్రబాబు మాత్రం ఇప్పటికే 3,900కోట్లు బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెడుతూ విద్యారంగాన్ని విస్మరించారు. బకాయిలను చెల్లించాలని కోరుతూ కలెక్టర్లను కలవబోతున్నాం. రూ.3,900 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలపడలేదని చంద్రబాబు గుర్తించాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

ఇంతవరకు విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదు

ఇదీ చదవండి: దటీజ్‌ జగన్‌..పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement