breaking news
-
అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో వింత ప్రకటన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా.. మిగిలిన అన్ని విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన డాక్టర్ అవుతున్నాడు.. మాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు.. రోజూ ఏదో ఒక విషయం ఎత్తుకోవడం.. దానిపై మీడియాతోనో లేకపోతే ఇంకొకరితోనో.. గంటల తరబడి మాట్లాడటం! ఇదీ తంతు! ఈ ధోరణి గతంలోనూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అది మితి మీరిపోతోంది.హామీలు అమలు చేయలేక ప్రజల్లో పలచన అవుతున్నాన్న అపరాధ భావమో.. ఇతరాంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి తప్పించాలనో ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఈ క్రమంలో ఆయన సమతుల్యత తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం..‘పీ-4 కార్యక్రమంలో ఎంత మంది మంత్రులు పాల్గొంటున్నారు? ఎన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు’ అని ఈమధ్య ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. అంతే ఆయనకు ఉన్నట్టుండి కోపం ముంచుకొచ్చింది. ‘కుక్క కరిస్తే, పిల్లి అరిస్తే సీఎం ఏం చేస్తాడు? విలేకరిగా నీకు బాధ్యత లేదా? సచివాలయంలో కూర్చున్నావంటే సొసైటీ నీకు ఆ స్థాయిని కల్పించిందని మర్చిపోవద్దు. మంత్రులను అడుగుతున్నావు.. ప్రెస్‌లో ఎంతమంది దత్తత తీసుకున్నారు? అన్నీ నేనే చూడాలన్న ఆలోచన ధోరణి మారాలి’ అంటూ చిర్రుబుర్రులాడారు.విలేకరి అడిగిన ప్రశ్నకు ఈయన గారి సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడాన్ని కాసేపు పక్కనబెడదాం. వాస్తవానికి తాను అనుకుంటున్న పీ-4 కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఇదో మంచి అవకాశం. మంత్రులు, తన పార్టీ నేతలను ఆ విధమైన సేవాభావం వైపు మళ్లించేందుకు ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఆ ప్రశ్న వేసిన విలేకరినే మందలించడం ఆయన పరిస్థితిని తెలియజేస్తోంది! పైగా ఇలా అసందర్భంగా మాట్లాడితే సీఎం స్థాయి నేత బ్యాలెన్స్ కోల్పోయినట్లు అనుకోరా?. చివరికి ప్రెస్ వారు దత్తత తీసుకోవాలని చెబుతున్నారంటేనే ఆ పీ-4 కార్యక్రమంలో చక్కదనం ఏంటో అర్థమవుతుంది.చంద్రబాబు గతంలో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసేవారు. కాకపోతే ఈసారి అవి శృతి మించాయనిపిస్తుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మీడియా అంతా అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడుతుండాలి. అబద్దాలు పోగు చేసి రాయాలి. లేకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆయనే మీడియా సమావేశాలలో వ్యాఖ్యానిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అంతా అదరహో అని ఊదరగొట్టాలి. టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇదే పనిలో ఉంటాయి. అయినా ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చేస్తుందన్న మాట. ఇంకో విషయం చూద్దాం.ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఫీజుల చెల్లింపును డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దాని గురించి మీడియాలో కథనాలు వస్తే చంద్రబాబు ఆ అంశంపై మాట్లాడకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రులు అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డు, అన్ని మండలాలలో జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చి.. ఆ తరువాత కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన ‘ఇంటింటికి డాక్టర్’ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ, జగన్‌కు పేరు వస్తుందన్న భయంతో ఆ పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సరైన వైద్యమే అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.ఈ విమర్శలకు ప్రతిగా ఆయన చెబుతున్నది ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారట. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పద్ధతిలో.. ఈ రకమైన ఆసుపత్రులకు నష్టాలొస్తే ప్రభుత్వం పదేళ్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తుందట. ఆరోగ్యశ్రీ రోగుల్లో యాభై శాతం మందికి ఇక్కడకు పంపిస్తారట. హాస్పిటల్ లేని నియోజకవర్గాలలో వంద నుంచి 300 పడకలతో ఈ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారట. ఎక్కడో ఒకటి, అర తప్ప, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి?. ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడేను? అదేమని అడిగితే.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తామంటారు. అది ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. పది వ్యాధులకు ఒకరు చొప్పున డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తారట. ఇదేమిటో తెలియదు.ఇంకోపక్క.. ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని వాటికి ఆక్సిజన్ ఇవ్వాలని, కాని డబ్బులు లేవంటున్నారని చంద్రబాబే చెబుతారు. మరి ఆయన చెప్పేవాటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అమరావతిలో ఖర్చు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల, మధ్య తరగతి వారి ఆరోగ్యం కన్నా, భారీ భవంతులు కట్టడం ప్రయోజనకరమని ఆయన భావిస్తున్నారా? ఇలా అడిగితే ఆయన ఊరుకోరు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు అంటూ ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. విరుగుడు మాత్రం ప్రైవేటు మంత్రం అని పరోక్షంగా చెబుతూంటారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదలుకుంటారు. జగన్ తెచ్చిన వైద్య కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తారట.చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. ప్రజలు ఏమేమి తినాలో ఆయన చెబుతున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, జీవన శైలి మార్చుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. జంక్ ఫుడ్స్ వదలిపెట్టి, మిల్లెట్స్ వాడాలని సూచిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, రెండు లీటర్ల నూనె, మూడు కిలోల పంచదారే వాడాలని అన్నారు. ఏదో పెద్ద తరహాలో చెబితే అదో రకం. కాని ఆయన మద్యం తాగమని చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారే! తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా అసెంబ్లీలో చెప్పారే. మరి ఆ మద్యం బాటిళ్లపై హానికరం అని ఉంటుంది కదా! ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందన్న సంగతి అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడిన సీఎంకు మద్యం తీసుకుంటే లివర్ పాడవుతుందని తెలియదా?. ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.యధా ప్రకారం జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలు చెప్పి, జగన్ టైమ్‌లో అలా జరిగింది.. ఇలా జరిగిందని చెప్పి మభ్య పెడితే ప్రజలకు ఒరిగేదేమిటి? కొసమెరుపు ఏమిటంటే మీరు చెబుతున్నవాటిన్నటికి డబ్బు కావాలి కదా? ఎక్కడ నుంచి వస్తాయని అడిగితే, చాలా విషయాలలో డబ్బు కంటే సంకల్పం, పాజిటివ్ దృక్పథం ముఖ్యమని సెలవిచ్చారు. అంటే గాలిలో మేడలు కడుతున్నట్టు అనిపించదా?. కాకపోతే చంద్రబాబు ఉపన్యాసాలు ఈనాడు వంటి టీడీపీ మీడియా ‘ఆరోగ్య భాగ్యం’ అంటూ శీర్షికలు పెట్టి బాజా వాయించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు
సాక్షి తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్‌కు హెలికాప్టర్లు ఇవ్వనీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు.వివరాల ప్రకారం.. ఇటీవల వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ రాప్తాడులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న వెంటనే.. ప్రజలందరూ హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. తమ అభిమాన నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నది. దీంతో, వైఎస్ జగన్‌ను వదిలేసి హెలికాప్టర్ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెరలేపింది. ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్లకు నోటీసులు జారీ చేసింది. దీంతో, వైఎస్ జగన్‌కి హెలికాఫ్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే ప్రభుత్వ పెద్దల కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఆరోపించింది.మరోవైపు.. హెలికాప్టర్ ఘటనపై మరుసటి రోజే హోంమంత్రి అనిత డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కొనసాగింపుగా హెలికాఫ్టర్ సంస్థలకు ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక అందించారు. అయితే, నివేదిక ఇచ్చినా పోలీసుల విచారణ పేరుతో పైలట్, కో-పైలట్‌ను ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం గమనార్హం. నేడు విచారణకు హాజరుకానున్న పైలెట్, కో పైలెట్ వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనలో విచారణకు హాజరుకావాలని హెలికాప్టర్ నిర్వహణ సంస్థ, పైలెట్, కో–పైలెట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు బుధవారం విచారణకు హాజరుకానున్నారు. చెన్నేకొత్తపల్లిలోని రామగిరి పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. అక్కడ ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం’
తాడేపల్లి : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటోంది.లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదు.మా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగలరా?చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది ఉన్నప్పుడు జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్‌కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం. 2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు. -
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పుచేశారు.. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత.. తొందరపాటు చర్య. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.‘‘గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు. పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా... రైతు తరపున మీరు అమ్ముతారా?. ప్రభుత్వం ఉన్నది.. రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా?. 40 అంతస్తుల బిల్డింగ్లు ప్రజలకు ఒరిగేదేంటి. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు?’’ అంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.‘‘ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా.. మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి?. అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు.. ఎవడికి కావాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారు. శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు.. పంటలకు సాగునీరు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించడం లేదా?. చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. పి4 గురించి తర్వాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి చంద్రబాబు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14 వేలు ఇస్తామన్నారు.. ఏమైపోయింది ఆ హామీ?. మెట్రోరైళ్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబూ’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.చంద్రబాబు పి4 స్కీంపై సెటైర్లు చంద్రబాబు పి4 స్కీంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు. పి4 విధానం అంటున్నారు మంచిదే. డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన మూడు విద్యాసంస్థలు మీ నాయకులవే. మీకు చేతనైతే నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో పది శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించండి. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా? మీ హెరిటేజ్ నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లైనా ఇవ్వొచ్చు కదా?పేదల కోసం హెరిటేజ్ కూడా మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు వస్తారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు. -
టీడీపీ కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు: మాజీ ఎంపీ నందిగం సురేష్
తాడేపల్లి,సాక్షి: సీఎం చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాల్లో తిరిగే పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితుల మేలు కోరి అనేక పథకాలను అమలు చేశారు. కానీ చంద్రబాబు రౌడీరాజ్యం కొనసాగిస్తున్నారు. పథకాలు అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాజధానిలో వరద వస్తే మునిగే ఐనవోలు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు చూశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజధాని వరద ప్రాంతం నుండి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.దళితులు,అంబేద్కర్ మీద వైఎస్ జగన్‌కు ఉన్న ప్రేమ అది. చంద్రబాబుకు అధికారం రాగానే మా కుటుంబంపై దాడి చేశారు. టీడీపి కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు. త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతా. ఇదేనా చంద్రబాబూ దళితుల మీద మీకు ఉన్న ప్రేమ? దళితుల మీద కక్షసాధిస్తూ పైకి కపట ప్రేమను చూపించొద్దు. చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయి. దళితుల గురించి చంద్రబాబు, పవన్, లోకేష్ బహిరంగంగా విమర్శలు చేశారు. ఇలాంటి వారికి దళితులే సరైన గుణపాఠం చెప్తారు’అని స్పష్టం చేశారు. -
చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారని.. వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధపాతాళానికి దళితులను తొక్కేశారని.. వారికి సంబంధించిన ఏ పథకమూ అమలు కావటం లేదంటూ నిలదీశారు.‘‘అంబేద్కర్ అందరివాడే, కానీ చంద్రబాబు కొందరివాడు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటి వరకు ఎందుకు సందర్శించలేదు?. సామాజిక న్యాయ మహాశిల్పం దగ్గర ఉన్న వైఎస్ జగన్ పేరును ఎందుకు తొలగించారు?. దళితులకు ఏ పథకం అందించకుండా వారి ఇళ్లకు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు?...బ్లాక్ క్యాట్ కమాండోల సెక్యూరిటీ లేకుండా దళితుల ఇళ్లకు వెళ్లగలరా?. దళితుల ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న చంద్రబాబు వైఖరిని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దళితులను కించపరిచేలా ఒక మంత్రి మాట్లాడితే చంద్రబాబు అతన్ని ఎందుకు డిస్మిస్ చేయలేదు?’ అంటూ టీజేఆర్ ప్రశ్నలు గుప్పించారు.‘‘రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత లోపిస్తుందంటూ కోర్టులో కేసు వేశారు. దళితులను తొలగించి అక్కడ చంద్రబాబు ఎలా ప్యాలెస్ కట్టుకుంటున్నారు?. దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే వారిని చట్టసభలకు పంపించటానికి ఎందుకంత వివక్ష చూపుతున్నారు?. అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదు. చంద్రబాబుని దళితవాడల్లోకి రాకుండా అడ్డుకుంటాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు. -
ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జీడి నెల్లూరు మండలం వరత్తూరు పంచాయతీలో వైఎస్సార్సీపీ కార్యకర్త శంకర్‌రెడ్డికి చెందిన మామిడి తోటను ధ్వంసం చేశారు. టేకు చెట్లను కూడా టీడీపీ నేతలు నరికివేశారు. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి.. రైతు శంకర్‌రెడ్డిను పరామర్శించారు.అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడు ఇలాంటి సంఘటనలు జరగలేదని.. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రైతులకు రక్షణ లేకుండా పోయింది. ఇదేనా చంద్రబాబు ప్రక్షాళన, సంపద సృష్టి అంటూ మాజీ నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మామిడి తోట, టేకు చెట్లను నరికివేసి నాలుగు రోజులైంది. ఇప్పటివరకు రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. 1970 పట్టా, పాసు పుస్తకాలు శంకర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చింది. పచ్చని చెట్లు నరికిన కుటుంబాలు బాగు పడింది లేదు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన పట్టించుకోలేదు. సమాధానం చెప్పలేదు. పాల సముద్రం మండలంలో ఇసుక, మట్టి, గ్రానైట్ సరిహద్దులో ఉన్న తమిళనాడుకు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. సీఎం చంద్రబాబు గంగాధర నెల్లూరు పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులకు ఎలాంటి లబ్ధి చేకూర్చవద్దని బహిరంగ సభలో చెప్పారు.’’ అంటూ నారాయణ స్వామి గుర్తు చేశారు. -
చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లు దేశంలో లౌకిక వాదాన్ని దెబ్బతీసేలా ఉంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఏం పని?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నించారు.‘‘హిందూ ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటిస్తారా?. ముస్లిం, క్రైస్తవ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసింది. చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్. తిరుపతిలో గోవుల మరణాలపై సమగ్ర విచారణ చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.‘‘భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలపై పాజిటివ్‌గా స్పందించాలి. సీఎం చంద్రబాబు, ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి విషయం వైఎస్ జగన్‌కు ఆపాదించడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ వైఖరి మార్చుకోవాలి’’ అని రామకృష్ణ హితవు పలికారు. -
వాస్తవానికి అతకని పచ్చరాతలు!
‘వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం.. మొదటి స్థానంలో తమిళనాడు! తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం పైపైకి..’ ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో పతాక శీర్షికన వచ్చిన కథనం. ఈ కథనాల ప్రకారం వృద్ధిరేటులో ఏపీ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది! అంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉన్నట్లే కదా? ఆ వెనుకబాటు గురించి తెలంగాణలోనూ ప్రచురించాలి కదా? వారి టీవీలలో ప్రసారం చేయాలి కదా!.కానీ, తెలంగాణ ఎడిషన్లలో ఈనాడు, తదితర ఎల్లో మీడియా పత్రికలు అసలు ఆ కథనాలే ఇవ్వలేదు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవాలా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? లేక ఎల్లో మీడియా వ్యాపార ప్రయోజనాలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి కనుక ఆ తరహా వార్తలు ఇచ్చి ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించరాదని? లేక అసలు ఈ వృద్ధి రేటు లెక్కలన్నీ కాకి లెక్కలని తెలుసు కనుకనా?. ఏపీలో తాము భజన చేస్తున్న చంద్రబాబు సర్కారుకు మేలు చేయాలనా? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఏపీలో బాగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ,ఇతర వ్యాపారాలను హైప్ చేయడానికి కూడా ఇది ఒక మార్గం కావచ్చు.జగన్ టైమ్‌లో కేంద్రం ఏపీకి ఏదైనా మంచి ర్యాంకు ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం బ్యానర్ కథనాలు వండివార్చి ప్రజలను మోసం చేస్తోంది. వాస్తవంగా వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉండి ఉంటే ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీలు ఇచ్చినా జనం నమ్ముతారా? ఈ కథనాలు రావడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై కామెంట్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ది జరిగిపోతోందని సంబరపడిపోవడం చూడడానికి బాగానే అనిపించవచ్చు. నిజానికి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేవే. కేవలం ముందస్తు అంచనాలు. ఏ స్వతంత్ర సంస్థ వీటిని ధృవీకరించలేదు. ఈ లెక్కలను అనేక ఇతర రాష్ట్రాలు ఇంకా కేంద్రానికి పంపలేదు కూడా. నిజంగా ఎల్లో మీడియా వార్తలు చదివితే ఈ పది నెలల కాలంలో ఏపీ ఇంతగా అభివృద్ధి చెందిందా? అన్న డౌటు రావచ్చు.తలసరి ఆదాయం పెరిగిపోతే ప్రజలు తమకు స్కీములు ఏవీ ఇవ్వక పోవడంపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?. దానికి వీరెవ్వరూ సమాధానం ఇవ్వరు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒకవేళ డబ్బులు ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అసత్యాలు చెబుతున్నారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా తనకు సూపర్ సిక్స్ హామీల అమలు కష్టంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పులు చేయబోనని, సంపద సృష్టిస్తానని ఊదరగొట్టిన బాబు ఇప్పుడేమో రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. ఒక ఏడాదిలో అమరావతి అప్పులతో సహా సుమారు రూ.1.5 లక్షల కోట్లు చేస్తుండడం దేశంలో మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అయినా వృద్ధిరేటు అధికంగా ఉందంటే ఎలా నమ్మాలి?.ఇక్కడ మరో కోణం చూద్దాం. మొదటి పది నెలల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో 33 శాతం తగ్గుదల ఉంది. మూలధన వ్యయంలో 48 శాతం తగ్గుదల నమోదైంది. అయినా వృద్ధిరేటు మాత్రం 2023-24లో 6.19 శాతం ఉంటే, 2024-25లో 8.21 శాతంగా ఉందని గణాంకాలు తయారు చేశారు. తలసరి ఆదాయం వృద్ధిలోనూ పైపైకి వెళ్లిందని రాశారు. అయితే ఏ రకంగా, ఏ కారణం వల్ల ప్రజల ఆదాయం పెరిగిందన్న వివరణ మాత్రం వీరివ్వరు. ఆదాయం నిజంగా పెరిగి ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లు, ఆస్తుల లావాదేవీలపై ఖర్చు చేస్తారు. చిత్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం అంతకుముందు సంవత్సరంలో పోల్చితే రూ.800 కోట్లు తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే వాణిజ్య పన్నులు కూడా ఆశించిన రీతిలో వసూలు కావడం లేదు. అయితే ఒక మద్యంలో మాత్రం ఆదాయం వస్తుండ వచ్చు. ప్రజలను తాగుబోతులుగా మార్చడం ద్వారా వృద్ధి రేటు వచ్చిందని ప్రభుత్వం చెప్పదలిస్తే మనం ఏమీ చెప్పలేం. కానీ, వృద్ధి రేటు ద్వారా పేద ప్రజల ఆర్థిక స్థితి గతులు మెరుగుపడాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ స్కీములు ఉపయోగపడతాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు అన్ని సంక్షేమ హామీలు అమలు అయ్యాయి. అందువల్ల అప్పట్లో తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గుముఖం పట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ మోతాదు వెయ్యి రూపాయలు పెంచడం మినహా సూపర్ సిక్స్, ఇతర హమీలేవీ అమలు చేయలేదు. అయినా తలసరి ఆదాయం పెరిగిందటున్నారు. రియల్ ఎస్టేట్ ఊపందుకుందని కథనాలు ఇస్తున్నారు. అమరావతితో సహా రాష్ట్రంలో ఏ నగరం, పట్టణంలోనూ భూముల విలువలు పెరగలేదు. కొనుగోళ్లు, అమ్మకాలు పెద్దగా జరగడం లేదని చాలామంది చెబుతున్నారు.కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం మొదలైన పట్టణాలలో ధరలు సగానికి సగం పడిపోయాయి. పోనీ అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్నందున అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందా అంటే చెప్పుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు. ప్రభుత్వం అచ్చంగా అమరావతిలోనే రియల్ ఎస్టేట్ పెరగాలని భావిస్తున్నందున విశాఖతో సహా ఇతర నగరాలలో పరిస్థితి దారుణంగా తయారైందని వార్తలు సూచిస్తున్నాయి. రైతులు గిట్టుబాట ధరలు లేక అల్లాడుతున్నారు. అక్వా రైతులకు ట్రంప్ దెబ్బ తగిలింది. ఏ రంగం చూసినా ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. జీఎస్డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం వంటి వాటిపై ఇచ్చిన లెక్కలు చూసి ఏపీ ప్రజలు ఆనందపడతారా?. వాస్తవంగా వారి జీవితాలు ఎంత భారంగా గడుస్తున్నాయో వారికి తెలియదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హిందూపురంలో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న(సోమవారం) ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు బేడీలు వేసి నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైఎస్సార్సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.ధర్మవరం నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలుమరో వైపు, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ జగన్ ఫోటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్న బాబ్జన్పై దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలు కాడంతో కదిరి ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో ఘటన జరిగింది. ఫోన్లో దూషించిన టీడీపీ నేతలు.. అనంతరం దాడి చేశారు. -
గోవుల మృతిపై చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన కౌంటర్
తిరుపతి: టీటీడీ గోశాలలో అధిక సంఖ్యలో గోవులు చనిపోతే వాటిని తాను బయటపెడితే అవి మార్ఫింగ్ ఫోటోలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి తాను చూపిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవి కాదని, తాను ఏవైతే వ్యాఖ్యలు చేశానో ఏమైతే చూపానో వాటికి కట్టుబడి ఉన్నానన్నారు. తాను చెప్పింది అబద్ధమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని భూమన చాలెంజ్ చేశారు. గోవుల మృతిపై ఎట్టకేలకు టీటీడీ ఈవో, చైర్మన్ లు నిజాన్ని ఒప్పుకున్నారని, వెంటనే ఈవోను సస్పెండ్ చేసి, చైర్మన్ ను తొలగించాలని భూమన డిమాండ్ చేశారు. తిరుపతి నుంచి ఈరోజు(సోమవారం) భూమున ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..‘మీ పాలనలో దళారీలకు కొదవే లేదు. ఇప్పటికి దర్శనం టిక్కెట్లు బ్లాక్ లో అమ్మకాలు చేస్తున్నారు. మీ పాలనలో కొండపై బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టికెట్లను ఇవ్వొద్దు, టిడిపి నాయకులకు కోరినన్ని టికెట్ల ఇవ్వడమే మీ పని. స్వామీజీలు, పీఠాధిపతులు తో వెళ్ళి గోశాలలో పాతిపెట్టినవి వెలికి తీద్దాం. 50 ఏళ్లకు ముందే నేను జైలుకు వెళ్లిన వాడ్నిగతంలో కొండపై చర్చి కడుతున్నారు అంటూ విష ప్రచారం చేశారు, నెయ్యి కల్తీ అని ఎక్కడ నిర్ధారణ కాలేదు.. కల్తీ జరిగింది అని విష ప్రచారం చేశారు. అడుగు అడుగునా విష ప్రచారం చేశారు మీరు చెప్పిన దానికంటే ఎక్కువగా గోవులు చనిపోయాయి, మీరు అంగీకరించారు. 1500 లీటర్లు పాలు మా పాలనలో కొండకు వెళ్తే ఇప్పుడు 500 లీటర్లు. అసలు సమస్యను పక్కదారి పెట్టొద్దు. దళిత గోవిందం అనే కార్యక్రమం నేను ఛైర్మన్ గా ఉన్నపుడు చేశాను. శ్రీవారి కళ్యాణోత్సవాలు దేశం, ప్రపంచం వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది మేము. 36వేల మందికి కళ్యాణోత్సవం ద్వారా పెళ్ళిళ్లు చేయించాం.వేద విశ్వ విద్యాలయం తీసుకు వచ్చింది వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగింది. హైందవ మతం ప్రచారం కోసం 4 వాహనాలు దేశం నలుమూలల చేసేలా చర్యలు తీసుకున్నాం. సాధువులతో, పీఠాధిపతిలతో తిరుపతి మహాతీలో సదస్సు నిర్వహించాము. వందే గోమాతరం కార్యక్రమం చేసిన ఘనత మాది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని తీర్మానం చేశాం. హిందూ ధర్మం అంటున్న టిటిడి బి.ఆర్ నాయుడు కనీసం నాలుగు పద్యాలు పలుకగలరా’ అని భూమన నిలదీశారు. -
‘నిందితుడితో మాజీ ఐపీఎస్ భేటీపై అనుమానాలు’
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్‌కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో వైఎస్ జగన్‌పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడితో గత టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఉనికిని లేకుండా చేయడానికే ఏబీవీని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం విద్వేషపూరిత రాజకీయాలకు తెరలేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ని అంతం చేయాలన్న కుట్రకు టీడీపీ పథక రచన చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో 2018 అక్టోబర్ 25న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యాయత్నంకు పాల్పడిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఈ ఘటనను అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అవహేళన చేస్తూ మాట్లాడటమే కాకుండా కేసును నీరుగార్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ను హత్యాయత్నం జరిగిన సమయంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా వెళ్లి పరామర్శించడం చూస్తుంటే గతంలో మిస్ చేసుకున్న అవకాశాన్ని ఈసారి పక్కాగా అమలు చేయాలన్న కుట్ర కనిపిస్తోంది. ఏబీవీ ఆలోచనపై అనుమానాలు ఉన్నాయి. మా అనుమానాలకు బలం చేకూర్చేలా జగన్ పర్యటనల్లో కూటమి సర్కార్ భద్రతను తగ్గించేసింది. గుంటూరు, అనంతపురం పర్యటనల్లో మాజీ ముఖ్యమంత్రికి కనీస భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిచింది.జగన్‌పై హత్యాయత్నం కేసు నిర్వీర్యంకు ఏబీ యత్నంజగన్ను అంతం చేయాలనే కుట్రతోనే ఎయిర్‌పోర్ట్‌లో మెడ మీద పదునైన కత్తితో శ్రీనివాస్ దాడి చేశాడని, దీనికోసం పక్కాగా ముందస్తు వ్యూహం ఉందని జగన్ పై హత్యాయత్నం ఘటనపై ఎన్ఐఏ తన చార్జిషీట్లో పేర్కొంది. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రణాళిక రూపొందించుకుని తాజాగా ఏబీవీ నిందితుడిని వెళ్లి కలిశాడు. జగన్‌పై తనకున్న వ్యక్తిగత ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాడు. గతంలో ఏబీవీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసి వైఎస్సార్సీపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి మా పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమానికి పాల్పడిన కారణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వని అంశాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు పథకం ప్రకారం విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. కులాల సమావేశాలు ఏర్పాటు చేసుకుని జగన్‌పై తనకున్న కోపాన్ని ప్రదర్శించడంతోపాటు ప్రతిపక్ష నేత గురించి తప్పుడు ప్రచారం చేసి విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. యువతలో చెడు ఆలోచనలకు బీజం వేస్తున్నాడు. హింసను ప్రోత్సహించడమే వారి విధానంజగన్పై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసుపై మాకు మొదటి నుంచీ అనేక అనుమానాలున్నాయి. నిందితుడు శ్రీనివాస్ పై గతంలోనే అనేక కేసులున్నాయి. అలాంటి వ్యక్తి ఎయిర్పోర్ట్ క్యాంటీన్లో ఎలా చేరాడు? ఈ క్యాంటీన్ ను టీడీపీ నాయకుడు హర్షవర్ధన్ చౌదరికి ఎవరు ఇప్పించారు? వైఎస్ జగన్ ఉన్న వీఐపీ లాంజ్‌లోకి ఈ శ్రీనివాస్ ప్రవేశించి అతి దగ్గర నుంచి దాడి చేయడం వెనుక ఎవరు ప్రోత్సాహం ఉంది? వంటి అనేక అనుమానాలను మేం వ్యక్తం చేసినా నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా చంపేశారు. ఆయన్ను ఏ విధంగా దారుణంగా చంపామన్నది నిందితులే పోలీసుల ముందు అంగీకరించారు. చంపిన తర్వాత కూడా ఆయుధాలను ఏం చేశామన్నది కూడా వివరంగా పోలీసులకు చెప్పారు. నిందితులను అప్రూవర్‌గా మార్పించి బెయిల్ ఇప్పించి స్వేచ్ఛగా బయట తిప్పుతున్నారు. వివేకా హత్యలో ఏదో జరిగిందని ప్రజలను డైవర్ట్ చేసేందుకు రోజుకో తప్పుడు కథనం ప్రచారంలోకి తెస్తున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకుని తమకు గిట్టని వారి మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు.అసమర్థ పాలన ఎవరిది బాబూ?చంద్రబాబుకి పాలన చేతకావడం లేదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక చేతులెత్తేశాడు. ఓటేయించుకుని తమను వంచించాడని ఏడాది కూడా కాకుండానే ప్రజలకు కూడా అర్థమైపోయింది. దీన్ని భరించలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. పదే పదే విధ్వంస పాలన అంటూ గత మా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేదలకు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ పాలన కన్నా గొప్పగా చంద్రబాబు ఏం చేశారు. ఆఖరుకి గడిచిన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ విద్యావ్యవస్థలో వినూత్న ఆలోచనలతో సంస్కరణలు తీసుకొస్తే చంద్రబాబు పది నెలల్లోనే నిర్వీర్యం చేశాడు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను తీర్చిదిద్దితే నేడు కనీనం చిన్నారులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందని దుస్థితికి విద్యావ్యవస్థను దిగజార్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. సంపద సృష్టించేలా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. నాడు-నేడు ద్వారా రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే చంద్రబాబు వాటిని ప్రైవేటుకు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు. మద్దతు ధర లేదు. చంద్రబాబు ఇస్తానని చెప్పన అన్నదాత సుఖీభవ హామీని ఇప్పటికీ అమలు చేయలేదు. అప్పులపై అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రచారం చేసి జగన్ పై బుదరజల్లారు. రాష్ట్రంలో నింయంత పాలన నడుస్తోందిరాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులను చూస్తే నియంత పాలన నడుస్తోందని అర్థమవుతోంది. తమకు నచ్చని వారిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఎలా చంపాలన్న ఆలోచన చేయడానికి మాజీ పోలీస్ అధికారి అయిన ఏబీవీని నియమించుకున్నారు. సుదీర్ఘ కాలంపాటు సివిల్స్ సర్వీస్‌లో పనిచేసిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం సమంజసమేనా అని ఆలోచించుకోవాలి. ప్రజలకు మంచి చేసి పేరు సంపాదించుకోవాలనే ఆలోచన చేయకుండా తప్పుడు ఆలోచనలతో ప్రశ్నించే గొంతులను నొక్కాలనుకోవడం అవివేకం. ఏబీ వెంకటేశ్వరరావుకి ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానుకోవాలి. తనకు ఏదైనా అన్యాయం జరిగిందని భావించి ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. వైఎస్ జగన్ పైన వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకోవడం సరికాదు. తనకు ఏదైనా అనుమానాలుంటే వాటిని నివృత్తి చేయడానికి మేం సిద్ధంగా ఉన్నా. బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా’ అని శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. -
రెడ్‌బుక్‌కు వైఎస్సార్సీపీ కేడర్ భయపడేది లేదు: గురుమూర్తి
సాక్షి, నెల్లూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం పీక్ స్టేజ్‌కు చేరుకుందన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. అక్రమ కేసులు, నిర్భందాలకు వైఎస్సార్సీపీ కేడర్ భయపడే రోజులు పోయాయని హెచ్చరించారు. అలాగే, ఏపీలో పరిశ్రమలు మూతపడటానికి ప్రభుత్వ సంస్కరణలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.డాక్టర్ బీఆర్ అంబేదర్క్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరీగ మురళీధర్, నియోజకవర్గ ఇంచార్జులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించే నైతిక హక్కు టీడీపీకి లేదు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని టీడీపీ నేతలు అమలు చేస్తున్నారు.ఏపీలో కక్ష సాధింపు చర్యల వల్ల ఊర్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేధావులు, విద్యావంతులు వ్యతిరేకించాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా మాజీ మంత్రి కాకాణిపై అక్రమ కేసులు పెట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే.. గిరిజనులను బెదిరించి.. కాకాణి మీద SC, ST కేసు పెట్టించారు. న్యాయస్థానాల మీద నమ్మకం వుంది కాబట్టే మాజీ మంత్రి కాకాణి కోర్టును ఆశ్రయించారు. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మైనింగ్ చేస్తూ.. రాష్ట్ర ఖజానాకి గండి కొడుతున్నారు. ఏపీలో పరిశ్రమలు మూతపడటానికి ప్రభుత్వ సంస్కరణలే కారణం. అక్రమ కేసులు, నిర్భందాలకు వైఎస్సార్సీపీ కేడర్ భయపడే రోజులు పోయాయి. గోవుల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినవి అన్నీ వాస్తవాలే. అఖిల పక్షాన్ని తీసుకెళ్లి గోశాలను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలి. టీటీడీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. -
జగన్ విజన్ బాబు తలకెక్కిందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు అసలు విజనరీ ఎవరో అర్థమై ఉండాలి. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ఒకే ఒక్క మంచి పనితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూరదృష్టి, దార్శనికత ఏమిటో తెలిసి వచ్చి ఉంటుంది. బాబు ఇటీవల వెళ్లిన ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అభివృద్ధి.. పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేయడం, చూసిన తరువాత కూడా బాబుకు చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటన్న ఆత్మవిమర్శ చేసుకోకపోతే దానికి ఆయనే బాధ్యుడు అవుతాడు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన సంస్కరణలపై ఇప్పటివరకూ చంద్రబాబు ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక లేదా టీవీ ఛానల్లో రాసిన పచ్చి అబద్దాల వార్తలు మాత్రమే చూసి ఉంటారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకుని ఉంటారు. ఇంతకాలం తాను చేసిందేమిటన్న స్పృహ ఆయనకు వచ్చి ఉంటే మంచిదే. జగన్ ముఖ్యమంత్రిగా విద్య, వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేశారు. స్కూల్స్‌లో బల్లల మొదలు, టాయిలెట్ల వరకు, పిల్లల డ్రెస్ మొదలు, వారు తినే ఆహార పదార్ధాల వరకు జగన్ పర్యవేక్షించేవారు. పిల్లలకు పోషకాహారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.అంతకుముందు చంద్రబాబు 2014 హయాం వరకు పాడైపోయి ఉన్న స్కూళ్లను ఒక విప్లవం మాదిరి జగన్ దశల వారీగా బాగు చేయించారు. ప్రభుత్వ స్కూళ్లు అంటే నరకప్రాయం అన్న అభిప్రాయాన్ని తొలగించి, వాటిని ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా తీర్చి దిద్దారంటే అతిశయోక్తి కాదు. తాగునీటి సదుపాయంతోపాటు, స్కూల్ ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పాఠ్య పుస్తకాలు రెండు భాషల్లో (ఇంగ్లీషు, తెలుగు)నూ చదువుకునే వెసులుబాటు కల్పించారు. అంతర్జాతీయ స్థాయి ఐబీ కోర్సు, టోఫెల్ వంటి పరీక్షలకు మూడో తరగతి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నారు. దాంతో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్దులంతా జగన్ మామ అని పిలుచుకునేవారు.అన్నింటినీ మించి పిల్లలు స్కూళ్లు మానివేయకుండా అమ్మ ఒడి అనే స్కీమ్ ను తెచ్చి విద్యార్ధుల సంఖ్య పెరిగేలా చేశారు. ఇంత చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తుండేది. కానీ, ఎన్నికల నాటికి వాస్తవం తెలుసుకుని విద్యార్ధి ప్రతీ ఒక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు వంటివారు ఎక్కాలు చదివినట్లు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీని మరిచారు. దాంతో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. జగన్ సంస్కరణలు తీసుకు వస్తే వాటికి వ్యతిరేకంగా టీచర్లను టీడీసీ నేతలు రెచ్చగొట్టారు. మెగా డీఎస్సీ నిర్వహించి స్కూళ్లలో టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని ప్రచారం చేశారు.ఇన్ని హామీలు ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా ఉన్న ఐబీ సిలబస్ ఎత్తివేసింది. పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ఉందో, లేదో తెలియదు. టోఫెల్ కోచింగ్ రద్దు చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశే మంత్రి అయినా విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా మారే పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడి సదుపాయాలను పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. వారు ఆంగ్లంలో మాట్లాడుతుంటే బహుశా ఆయన ఆశ్చర్యపోయి ఉండాలి. గతంలో ఆంగ్ల మీడియంను ఆయనతో సహా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యతిరేకించే వారు. చంద్రబాబుకు ఆ పిల్లలలో ఉన్న బలమైన ఆకాంక్ష ఏమిటో అర్థమై ఉండాలి.విద్యార్ధులు వారు చేస్తున్న ప్రయోగాల గురించి ఇంగ్లీష్‌లో వివరిస్తుంటే, బాబు గారు మధ్య, మధ్యలో ఎక్కువ భాగం తెలుగులోనే మాట్లాడారు. ఒక బాలిక ‘‘కలర్‌పుల్ గుడ్ మార్నింగ్’’ అని అన్నప్పుడు అలా ఎందుకు అన్నావు అని ప్రశ్నించి, ఇన్నోవేటివ్‌గా మాట్లాడావు కాబట్టి ఆకర్షించావు అని సీఎం వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన కేవలం ఆ బాలిక మాటలకే కాదు. మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు కూడా ఆకర్షితులై మరో బాలుడిని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అన్నప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని జవాబు ఇచ్చాడు. దానికి ఏమి చదవాలని అడిగితే ఇంగ్లీష్ అని చెప్పేసరికి చంద్రబాబు అవాక్కై ఉండాలి. కొంతకాలం క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో ఒక స్కూల్ ను సందర్శించి ప్రైవేటు స్కూళ్ల మాదిరి సదుపాయాలు ఉన్నాయని ప్రశంసించారు. మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న వాస్తవ పరిస్థితి గమనించి ఒకింత ఆశ్చర్యపడిన వీడియోలు గతంలో వచ్చాయి.ఇప్పుడు చంద్రబాబు స్వయంగా చూశారు. అయినా వారిలో అహం దెబ్బతింటుంది కనుక, జగన్ పాలనలో జరిగిన ఈ మార్పులను అంగీకరించడానికి మనసు అంగీకరించదు. అంతేకాక చంద్రబాబుకు ప్రభుత్వ స్కూళ్లపై అంత నమ్మకం ఉన్న మనిషి కాదని అంటారు. కొందరు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యజమానులకు ఆయన ఆప్త మిత్రుడు. అలాంటి వారిలో ఒకరైన నారాయణ చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి. అయినా ఫర్వాలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ స్కూళ్లను పాడు చేయకుండా వాటిని జగన్ టైమ్ నాటి ప్రమాణాలతో కొనసాగిస్తే మంచిదే. కాని పలు స్కూళ్లలో పారిశుద్ధ్యం కొరవడిందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం గతంలో ఉన్న విధంగా ఇప్పుడు ప్రత్యేక సిబ్బంది లేకపోవడమే. విద్యా రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు యథావిధిగా కొనసాగించితే ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలకు న్యాయం చేసినట్లవుతుంది. జగన్ ఫోబియాతో బాధపడుతున్న వారికి అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. చంద్రబాబు స్కూల్‌కు రావడం సంతోషంగా ఉందని ఒక బాలిక అంది. ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆ బాలిక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందట.అంటే ఏదో మర్యాద కోసం అలా మాట్లాడిందే తప్ప ఇంకొకటి కాదేమో అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అదే జగన్ సీఎం హోదాలో వచ్చి ఉంటే తాము సంతోషానికి ఆ బాలికలు వంద కారణాలు ఉండేవి. మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు స్కూల్‌కు వచ్చినా, రాకపోయినా పెద్దగా తేడా లేదన్న భావన ఉండవచ్చు. ఎందుకంటే వారేమీ తమ హయాంలో స్కూళ్లను ఇలా మెరుగు పరచలేదు కనుక. జగన్ మంచి చదువే పేద పిల్లలకు ఇచ్చే సంపద అని పలుమార్లు చెప్పేవారు. అదే చంద్రబాబు మాత్రం విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్నారు. తన మనుమడు దేవాన్శ్‌ను మంచి ప్రైవేటు స్కూల్లో చదివిస్తుండవచ్చు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలను కూడా అదే తరహాలో భావించి మంచి విద్య ఇవ్వడానికి యత్నిస్తే పేరు వస్తుంది. ఏది ఏమైనా విద్యకు సంబంధించి జగన్ విజన్ ను చంద్రబాబు అంగీకరించక తప్పదు కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నీ నాలుక కోసేస్తాం.. కాళ్లు, చేతులు నరికేస్తాం
యలమంచిలి: బూతులు తిట్టడంలో టీడీపీ నేతలను మించిపోయారు.. కేంద్ర సహాయ మంత్రి, నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మ. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో ఆదివారం పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆయన తర్వాత జరిగిన సభలో మహిళల ఎదుటే వైఎస్సార్సీపీ నేతలపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై శ్రీనివాసవర్మ దూషణలకు దిగారు. ‘ఎర్రిపప్ప కారుమూరి తణుకు మున్సిపాలిటీలో వందల కోట్లు టీడీఆర్ నిధులు స్కామ్ చేశాడు... ఈ పిచ్చి నా..కొ.. త్వరలోనే జైలుకెళ్లి చిప్ప కూడు తింటాడు’ అంటూ అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎర్రిపప్ప కారుమూరి.. నీ నాలుక కోసేస్తాం.. కాళ్లు చేతులు నరికేస్తాం.. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో..’ అంటూ ఇష్టానుసారం మాట్లాడారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీళ్లంతా అవినీతికి మారుపేరని, మనుషుల రక్తం తాగేసేలా ఉంటారని శ్రీనివాసవర్మ తన నోటికి పనిచెప్పారు. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలైంది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2018లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు.అయితే, ప్రసుత్తం ఆయన కూటమి ప్రభుత్వంలో కూడా నామినేటెడ్ పోస్ట్‌లో కొనసాగుతున్నారు. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఏబీ మంతనాలు జరిపారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు కీలక దశలో ఉండగా.. నిందితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులతో ఏబీ వెంకటేశ్వరరావు రహస్యంగా చర్చలు జరపడం చర్చాంశనీయంగా మారింది. శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీనే హత్యాయత్నం చేయించిందని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంతో టీడీపీతో నిందితుడు శ్రీనివాస్‌కు ఉన్న సంబంధాలు బట్టబయలైంది. కొద్దిరోజుల నుంచి జగన్‌పై విషం కక్కుతూ ఏబీవీ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎక్స్‌లో జగన్‌పై ఏబీవీ తన అక్కసును వెళ్లగక్కారు. -
‘చంద్రబాబు తెరలు కట్టుకుని మరీ శంకుస్థాపన చేసుకున్నారు’
తాడేపల్లి : అమరావతిలో ఐదు ఎకరాల్లో భారీ భవంతిని నిర్మిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెరలు కట్టుకుని ఎందుకు శంకుస్థాపన చేసుకున్నట్లో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నిలదీశారు. వందల కోట్లతో చంద్రబాబు ప్యాలస్ కట్టుకుంటూ, దానికి శంకుస్థాపన చేసే క్రమంలో విషయం బయటకు రాకూడదని తెరలు కట్టుకుని మరీ చేసుకున్నారని టీజేఆర్ విమర్శించారు. అమరావతిలో ప్యాలెస్ కట్టుకుంటున్నారు..తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ తాడేపల్లిలో వైఎస్ జగన్ రెండు ఎకరాల్లో పార్టీ ఆఫీసు, ఇల్లు కట్టుకుంటే విష ప్రచారం చేశారు. వాటిపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారు. ఇప్పుడు వందల కోట్ల రూపాయలతో చంద్రబాబు అమరావతిలో ప్యాలెస్ కట్టుకుంటున్నారు. ఐదు ఎకరాల్లో ఈ భారీ ప్యాలెస్ నిర్మాణం చేస్తున్నారు. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, కొండాపూర్ లలో చంద్రబాబు కట్టుకున్న ఇళ్లు, ఫామ్ హౌస్ ల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇంట్లో వాడిన విదేశీ మొక్కల దగ్గర్నుంచీ ఇంటరీయర్ లకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఏ ఒక్కరినీ ఆ ఇంట్లోకి కూడా రానివ్వరు. అమరావతిలో చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు మంత్రులకు కూడా ఆహ్వానం లేదు. స్థానిక దళిత ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం లేదు. ఇంటి శంకుస్థాపనకు కూడా చంద్రబాబు తెరలు కట్టుకుని ఎందుకు శంకుస్థాపన చేశారో చెప్పాలి. అమరావతిలో గజం రూ.60 వేలు ఉందని గతంలో చంద్రబాబు చెప్పారు. కానీ చంద్రబాబు ఇంటికి మాత్రం గజం రూ.7,500కే ఎలా కొన్నారు?, కాంట్రాక్టర్ల కమీషన్లతోనే.. జూబ్లిహిల్స్‌లోని ఇంటి నిర్మాణం పూర్తిగా కాంట్రాక్టర్ల కమీషన్లతో నిర్మించారు. టిడ్కో ఇళ్ల కాంట్రాక్టర్ ద్వారా మంగళగిరిలో టీడీపీ ఆఫీసు నిర్మాణం చేశారు. హైటెక్ సిటీ నిర్మాణ కాంట్రాక్టర్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నిర్మాణం చేశారు. చంద్రబాబు ఇళ్లన్నీ రాజప్రసాదాలే. అందుకే ఆ అంతఃపురాల్లోకి ఎవరికీ ప్రవేశం లేదు. రాష్ట్ర ఖజానాని చంద్రబాబు దోచుకుంటున్నారుజగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చారు. చంద్రబాబు, లోకేష్ లు మాత్రం సిండికేట్ లకు భారీగా కాంట్రాక్టులు కట్టబెడుతూ వేల కోట్లు కమీషన్లు కొల్లగొడుతున్నారు. రాజధానిలో పొలాలు ఇచ్చిన రైతులకు ఎక్కడో స్థలాలు ఇచ్చి, చంద్రబాబు మాత్రం ప్రధాన ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ అమరావతి అంతఃపురానికి పెడుతున్న ఖర్చు ఎంతో చెప్పాలి.జగన్ ఇంట్లోకి మీడియా, సినిమా నటులు, పారిశ్రామిక వేత్తలు సైతం వెళ్లారు. మరి చంద్రబాబు అంతఃపురాల్లోకి ఎవరినీ ఎందుకు రానివ్వటం లేదు?’ అని ప్రశ్నించారు టీజేఆర్. -
‘అమరావతిలో పేదవాడికి సెంటు స్థలం కేటాయించలేదు’
విశాఖ: అమరావతిలో పేదవాడికి సెంటు స్థలం కేటాయించని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన మాత్రం అక్కడ ఐదు ఎకరాల స్థలంలో ఇంటిని కట్టుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలను తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తుంటే అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఆంబేద్కర్ ఆశయాల్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ‘ అంబేద్కర్ జాతివాదు కాదు.. జాతీయ వాది. అంబేద్కర్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ ఖ్యాతిని మరింత విముడింప చేసేలా 125 అడుగుల విగ్రహాన్ని వైఎస్ జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేశారు. విజయవాడలో ఉన్న విగ్రహానికి చంద్రబాబు ఎందుకు నివాళులు అర్పించలేకపోతున్నారు.వైఎస్ జగన్ నూతన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దాన్ని చంద్రబాబు మూసివేస్తున్నారు. అమరావతిలో సెంటు స్థలంలో పేదవాడిని ఇల్లు కట్టుకోనివ్వలేదు సీఎం చంద్రబాబు. కానీ ఆయన మాత్రం అదే అమరావతిలో ఇంటిని నిర్మించుకోవడం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు’ అని జూపూడి ధ్వజమెత్తారు.రాజధాని కోసం లక్ష ఎకరాలు.. ఇది వ్యాపారం కాదా?రాజధాని కోసం లక్ష ఎకరాలు సేకరించిన నాయకుడు చంద్రబాబు తప్పితే చరిత్రలో ఎవరూ లేరన్నారు జూపూడి. ‘పేదల భూములతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు..లక్ష ఎకరాల మధ్యలో తన నివాసాన్ని చంద్రబాబు నిర్మిస్తున్నారు.. ఐదు మంది కోసం ఐదు ఎకరాల స్థలంలో భారీ భవనం కడుతున్నారు.. చంద్రబాబు పోకడ రాచరకాన్ని తలపిస్తుంది..రాజధానిలో పేదలకు స్థానం లేకుండా చేశారు. గతంలో తీసుకున్న 54 వేల ఎకరాల్లో ఒక శాశ్వత భవనమైన నిర్మించారా..రాజధానికి రైతులు ఇచ్చిన భూమితో వ్యాపారం చేస్తారా?’ అని జూపూడి ప్రశ్నించారు. -
‘కూటమి సర్కార్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోంది?’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి పార్టీల పెద్దలకు చెందిన ఆక్వా ఫీడ్ కంపెనీలకు ఈ సర్కార్ కొమ్ముకాస్తోందని అప్సడా వైస్ చైర్మన్, వైఎస్సార్సీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆక్వాఫీడ్లో అధిక శాతం వినియోగించే సోయా కేజీ రూ.100 నుంచి రూ.25కి తగ్గితే, కూటమి ప్రభుత్వం ఫీడ్ రేటులో కేజీకి తగ్గించింది కేవలం రూ.4 మాత్రమేనని మండిపడ్డారు.ముడిసరుకు రేట్లు నాలుగు వంతులు తగ్గితే, ఫీడ్ రేటులో తగ్గించింది నామమాత్రమేనని, ఆక్వా రైతుల కన్నా, తమ పార్టీకి చెందిన ఫీడ్ కంపెనీల ప్రయోజనాలకే మిన్నగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...రాష్ట్రంలో సీడ్, ఫీడ్ తయారీ సంస్థలన్నీ కూటమి పార్టీలకు చెందిన నేతల చేతుల్లోనే ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్లో సోయా కేజీ వంద రూపాయలు ఉండేది. ఇప్పుడు అది పాతిక రూపాయలకు తగ్గింది. ఈ ప్రకారం ఫీడ్ రేట్లు కూడా దాదాపు నాలుగోవంతు వరకు తగ్గాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచిందనే కారణం చూపించి ఫీడు ధరలు కేజీ రూ.6.50లు అదనంగా పెంచారు.దీనిపై వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో హడావుడిగా కేజీ ఫీడ్ రూ.4 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తగ్గిన ముడిసరుకు రేటుతో పోలిస్తే కనీసం రూ.15 రూపాయలు అయినా ఫీడ్ రేట్లు తగ్గాల్సి ఉంది. ఒకవైపు ముడిసరుకు ధరలు తగ్గిపోయినా ఫీడ్ రేటును నామమాత్రంగా తగ్గించి చేతులు దులుపుకుంటున్న ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోంది?ఆక్వా సాధికారిత కమిటీని అటకెక్కించేశారుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆక్వా సాధికారిత కమిటీని ఏర్పాటు చేసి ప్రతివారం సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించేది. వీటిల్లో స్థిరీకరణ కోసం చర్యలు తీసుకుంది. దీని ఫలితంగా ఆక్వా రైతులకు మంచి రేట్లు రావడంతో పాటు సీడ్, ఫీడ్ రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచే ఆస్కారం లేకుండా కట్టడి చేసింది. ఎప్పుడైతే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయో, వెంటనే సాధికారిత కమిటీని పక్కకుపెట్టేశారు. కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా ఒక ఆక్వా కమిటీని ఏర్పాటు చేసింది.దీనిలో తమ పార్టీలకు చెందిన ప్రాసెసింగ్ ప్లాంట్, హేచరీ, ఫీడు కంపెనీల నుంచి ప్రతినిధులకు స్థానం కల్పించారు. ఈ కమిటీ ఆక్వారైతుల గురించి ఏ రకంగా ఆలోచిస్తుంది? మరోవైపు తమ ప్రభుత్వం వచ్చిందన్న భరోసాతో కూటమి పెద్దలు సీడ్, ఫీడ్ రేట్లను ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. దీనితో ఆక్వా రైతులు పూర్తిగా అప్పుల పాలయ్యారు. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో టారీఫ్‌లను చూపించి మధ్య దళారీలు ఇష్టారాజ్యంగా రొయ్య రేట్లను తగ్గించుకుంటూ పోతున్నారు. దీనితో వంద కౌంట్ రొయ్యకు కనీస ధర కూడా లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.సుంకాల పేరుతో రైతులను దోచుకుంటున్నారుఆక్వా రైతులు పడుతున్న కష్టాలపై మాజీ సీఎం వైయస్ జగన్ ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఫీడు ధరలు తగ్గించాలని, రొయ్యల ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆక్వా రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. దీనితో ప్రభుత్వంలో కలవరం ప్రారంభమైంది. రైతుల పక్షాన పనిచేస్తున్నట్లుగా కనిపించేందుకు కూటమి ప్రభుత్వం షరామామూలుగానే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకుంది.ఆక్వా ఫీడు ధర కేవలం రూ.4 తగ్గించి రైతులను ఆదుకుంటున్నట్లుగా ప్రచారం చేసుకుంది. అమెరికా ప్రభుత్వం సుంకం పెంచారనే సాకు చూపించి వందకౌంట్ రొయ్యలను కేజీ రూ.220 కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. అయితే అమెరికా పెంచిన సుంకం అమలుకు 90 రోజుల పాటు సడలింపు ఇచ్చింది. అయినా కూడా రొయ్య రేట్లలో మాత్రం పెరుగుదల కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. రైతులను ఆదుకునేందుకు 100 కౌంట్ రొయ్యల ధరలను కనీసం రూ. 270 లకు పెంచాలి. ధాన్యం కొనుగోళ్ళలో తీవ్ర నిర్లక్ష్యంరాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ అధికారిని నియమించి వారి నేతృత్వంలోనే ధాన్యం కొనుగోలు జరపాలి. రైతులకు మద్దతు ధర చెల్లించాలి. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దేవుడే న్యాయం చేయాలనే ఆకాశంలోకి దీనంగా చూసే దుస్థితికి ప్రభుత్వం రైతులను తీసుకెళ్లింది. కష్టనష్టాల్లో తోడుండి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అప్పులపాలవుతున్న రైతులను కనీసం పట్టించుకోకుండా గాలికొదిలేసింది.వర్షాల కారణంగా రాయలసీమ ప్రాంతంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని వైఎస్ జగన్ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై ఇంతవరకు వారికి న్యాయం జరగలేదు. మిర్చి రైతులకు మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికెళితే కేంద్రానికి తూతుమంత్రంగా లేఖ రాసి వదిలేశారు.అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతే వారి గురించి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు. గత వైయస్ జగన్ పాలనలో ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ అధికారిని ఇన్ చార్జిగా నియమించి ఆర్బీకే సెంటర్ల ద్వారా తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తే ఇప్పుడు తేమ శాతం పేరుతొ మంచి ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు. ఎక్కడ చూసినా దళారుల రాజ్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం ఇలాగే ఉదాసీనంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో రైతుల పక్షాన వైఎస్సార్సీపీ తరఫున భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం. -
‘కూటమి విజయంలో బీజేపీదే కీలక పాత్ర.. టీడీపీ ఓవరాక్షన్ ఎక్కువైంది’
సాక్షి, అనంతపురం: ఏపీలో అధికార కూటమి పార్టీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా టీడీపీ నేతల తీరుపై ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి బీజేపీనే కీలక పాత్ర పోషించింది. అలాంటి బీజేపీ నాయకులపై ఎందుకంత చిన్న చూపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాడిపత్రిలో బీజేపీ నేతలకు కనీస గౌరవం లేదని అసహనం ప్రదర్శించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో బీజేపీ పాత్ర కీలకం. మేము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలతో సమానంగా టీడీపీ, జనసేన శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి మీరెందుకు బీజేపీ నాయకులపై చిన్నచూపు చూస్తున్నారు?. తాడిపత్రి బీజేపీ నేతల సమస్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒకలా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే ఉంది. కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని అన్నారు. -
వైఎస్ జగన్‌కి ముద్రగడ పద్మనాభం లేఖ
కాకినాడ,సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి.. ఆ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముద్రగడ.. వైఎస్ జగన్‌కి లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమీటీ సభ్యునిగా నియమించడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తాను. పేదలకు మీరే అక్సిజన్. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలల పాటు పరిపాలన చేయాలి’ అని పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి:వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌బాబు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రులు షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్‌ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌లను నియమించారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. మరికొన్ని నియామకాలువైఎస్ జగన్ ఆదేశాల మేరకు పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన మరో ప్రకటనలో పేర్కొంది. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షునిగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ పినిపే శ్రీకాంత్, రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి(వై.విశ్వేశ్వరరెడ్డి స్థానంలో)లను నియమించారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డా. పినిపే శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు.'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ' పునర్వ్యవస్థీకరణవైఎస్సార్‌సీపీలో 'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ' పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను PAC మెంబర్లుగా పార్టీ నియమించింది. PAC శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, PAC కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.PAC మెంబర్లు1. తమ్మినేని సీతారాం2. పీడిక రాజన్న దొర3. బెల్లాన చంద్రశేఖర్4. గొల్ల బాబురావు, ఎంపీ5. బూడి ముత్యాలనాయుడు6. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ7. పినిపే విశ్వరూప్8. తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ9. ముద్రగడ పద్మనాభం10. పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు)11. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు12. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)13. వెలంపల్లి శ్రీనివాస్14. జోగి రమేష్15. కోన రఘుపతి16. విడదల రజిని17. బొల్లా బ్రహ్మనాయుడు18. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ19. నందిగం సురేష్ బాబు20. ఆదిమూలపు సురేష్21. పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్22. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి23. కళత్తూరు నారాయణ స్వామి24.ఆర్కే రోజా25. వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంపీ26. షేక్ అంజాద్ బాషా27. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి28. అబ్దుల్ హఫీజ్ ఖాన్29. మాలగుండ్ల శంకర నారాయణ30. తలారి రంగయ్య31. వై.విశ్వేశ్వర రెడ్డి32. మహాలక్ష్మి శ్రీనివాస్33. సాకే శైలజానాథ్ -
రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
సాక్షి, గుంటూరు: రెడ్‌బుక్ రాజ్యాంగానికి డీఎస్పీ బలైపోయారు. పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీని అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టలేదని ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల మండలంలో జూలకల్లులో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.ఈ కేసులో వైఎస్సార్సీపీ వారిని ఇరికించాలని ఓ ఉన్నతాధికారి ఆదేశించగా, ఆ తప్పు తాను చేయలేనని డీఎస్పీ జగదీష్ తోసిపుచ్చారు. దీంతో డీఎస్పీని హెడ్ క్వార్టర్ కు పిలిపించిన ఉన్నతాధికారి దూషించారు. పోస్టింగ్ ఇచ్చిన మూడు నెలలకే డీఎస్పీ జగదీష్‌ను బదిలీ చేశారు. డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై పోలీసులు నిప్పులు చెరుగుతున్నారు. -
వాస్తవాలు తెలుసుకో లోకేష్: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని.. నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందని. టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారు’’ అని మేరుగు నాగార్జున మండిపడ్డారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ అందక 11 లక్షల మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వారెవరూ లోకేష్‌కి కనపడటం లేదా?. నారా లోకేష్ ట్విట్టర్ కింగ్‌గా మారిపోయారు. జగన్‌ని కంసుడు మామ అంటూ ట్వీట్ చేసిన లోకేష్.. వాస్తవాలు తెలుసుకోవాలి...త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున రిలీజ్ చేయాలి. ఇప్పటికే రూ.2,800 కోట్లు బకాయిలు పడ్డారు. మేము గట్టిగా ఆందోళనలు చేస్తే రూ.700 కోట్లు రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థులు కూలి పనులకు వెళ్లే పరిస్థితిని తెచ్చారు. యూనివర్సిటీలను సైతం నిర్వీర్యం చేశారు. పేదల చదువులపై చంద్రబాబుకు మనసు లేదు’’ అని మేరుగు ఆగ్రహం వ్యక్తం చేశారు.