IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఆర్సీబీపై గ్రాండ్‌ విక్టరీ | Royal Challengers Bengaluru lost by 55 runs to Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఆర్సీబీపై గ్రాండ్‌ విక్టరీ

May 22 2026 11:59 PM | Updated on May 22 2026 11:59 PM

Royal Challengers Bengaluru lost by 55 runs to Sunrisers Hyderabad

ఐపీఎల్‌-2026లో ఉప్పల్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌తో బెంగళూరుతో జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సత్తాచాటింది. ఈ మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 90 పరుగుల తేడాతో గెలిచి ఉంటే పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో నిలిచి ఉండేది.

కానీ అది జరిగకపోవడంతో ఆరెంజ్‌ ఆర్మీ పాయింట్ల పట్టికలో మూడో స్ధానంతో సరిపెట్టుకుంది. ఇక మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చే హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 255 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. 

సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో ఇషాన్ కిషన్‌ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఆర్సీబీ బౌలర్లలో రాసిక్‌ ధార్‌ సలామ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. సూయష్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా తలా వికెట్‌ సాధించారు.

అనంతరం 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. బెంగళూరు బ్యాటర్లలో రజత్‌ పాటిదార్‌(56) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కృనాల్‌ పాండ్యా(41), వెంకటేశ్‌ అయ్యర్‌(44) రాణించారు. విరాట్‌ కోహ్లి మాత్రం కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. 

సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఇషాన్‌ మలింగ రెండు, షకీబ్‌, హెడ్‌ తలా వికెట్‌ సాధించారు. సన్‌రైజర్స్‌ మే 27 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది. నాలుగో స్ధానం కోసం రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, కేకేఆర్‌ మధ్య పోటీ నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement