
కృత్రిమ మేధ ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరమని కొందరు భావిస్తున్నారు. ప్రపంచంలో నిత్యం జరుగుతున్న కొన్ని సంఘటనలే అందుకు కారణం. రజనీకాంత్ రోబో సినిమాలో విలన్ సైంటిస్ట్ తయారు చేసిన రోబో టేబుల్‌పై నుంచి బన్ తీయమంటే గన్ తీస్తుంది కదా. అంతటితో ఆగకుండా ఏకంగా ఆ విలన్‌నే గన్‌తో చంపాలనుకుంటుంది. దాదాపు అలాంటి సంఘటనలే ప్రస్తుతం జరుగుతున్నాయి. హ్యుమనాయిడ్ రోబోల పరీక్ష సమయంలో చాలా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి.
యునిట్రీ అనే కంపెనీ రూపొందించిన హ్యుమనాయిడ్ రోబోను ఇటీవల పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదకర సంఘటన జరిగింది. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో విడుదలైన వీడియో వైరల్‌గా మారింది. అందులోని వివరాల ప్రకారం.. చైనా ఫ్యాక్టరీలో ఈ హ్యుమనాయిడ్ రోబోను క్రేన్ ఆసరాతో నిలబెట్టారు. టెస్టింగ్ సమయంలో ఒక్కసారిగా రోబో ఉన్నట్టుండి తన చేతులతో దాడికి పాల్పడింది. క్రేన్‌కు వేళాడుతున్నా ఆ రోబో చుట్టూ కదులుతూ, క్రేన్‌ను సైతం లాగుతూ సమీపంలోని వస్తువులను చిందరవందర చేసింది. వెంటనే దాన్ని పరీక్షించే వ్యక్తి రోబో కనెక్షన్ కట్ చేయడంతో నిదానించింది.
An AI robot attacks its programmers as soon as it is activated in China. pic.twitter.com/d4KUcJQvtD
— Aprajita Nefes 🦋 Ancient Believer (@aprajitanefes) May 2, 2025
ఇదీ చదవండి: గూగుల్ 200 ఉద్యోగాల్లో కోత!
ఇతర కంపెనీ రోబోలు కూడా..
యునిట్రీ రోబోలు మాత్రమే కాదు.. ఇంతర కంపెనీలకు చెందిన రోబోలు ఇలా విచిత్రంగా ప్రవర్తించిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ ప్రదర్శనలో హ్యూమనాయిడ్ రోబోలు గుంపులుగా వెళ్తూ ఒకటి మానవులపైకి దూసుకొస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈశాన్య చైనాలోని టియాంజిన్‌లో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో తీసిన వీడియోలో జాకెట్ ధరించిన రోబో అకస్మాత్తుగా బారికేడ్ వెనుక గుమిగూడిన ప్రేక్షకుల గుంపు వైపు దూసుకెళ్లింది. గతంలో ఓ కంపెనీ కర్మాగారంలో రోబోట్ ఇంజినీర్‌పై దాడి చేసిందని వార్తలొచ్చాయి. సాఫ్ట్‌వేర్ లోపాలు, అంతర్లీనంగా ఉండే కారణాలతో కొన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏదేమైనా మానవుల సమూహంతో కలిసి వీటిని వాడుకలోకి తీసుకురావాలంటే కచ్చితమైన, స్పష్టమైన ఎన్నో పరీక్షలు నిర్వహించాలని, వీటి పాలసీల్లో పక్కా నిబంధనలు రూపొందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.