panchyat
-
ఊరు చిన్నదే..కానీ అభివృద్దిలో మేటి!
‘గ్రామం చిన్నదైనా....అభివృద్ధిలో పెద్దది’ అనేలా పేరు తెచ్చుకోవడానికిసర్పంచ్ కృషి ఎంతో ఉంటుంది.అలాంటి ఒక సర్పంచి సంగం అర్పితా రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్లారం గ్రామసర్పంచ్అర్పితా రెడ్డికి జాతీయ స్థాయిగుర్తింపు వచ్చింది. ‘సాంకేతికతతోగ్రామ అభివృద్ధి’ అంశంపై ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన ‘డిజిటల్ కృషి–సమృద్ధి గావ్’ జాతీయస్థాయి పోటీలో గ్రామాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు అర్పితారెడ్డి....పారిశుధ్యం నుంచి డిజిటలీకరణ వరకు అన్ని రకాలుగా మల్లారం గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు అర్పితారెడ్డి. గ్రామంలో ΄పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి ఇంటివారు తడి–పొడి చెత్త వేరు చేసుకునే విధానాన్ని అలవాటు చేశారు. పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేస్తూ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోనే ఇప్పటి వరకు ఏ సర్పంచ్ చేయని విధంగా గ్రామ పూర్తి సమాచారం, ప్రభుత్వ పథకాలతో గ్రామ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.పన్నుల చెల్లింపులు, ధ్రువపత్రాల జారీ, ఫిర్యాదుల నమోదు వంటి సేవలను ఆన్లైన్లో అందించడంతో ప్రజలకు చాలా సౌకర్యంగా మారింది. గ్రామస్థులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గింది. గ్రామంలో భద్రతను మెరుగు పరిచేందుకు 21 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యువత కోసం ఓపెన జిమ్ ప్రారంభించారు. నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా ఒక టీచర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ మహిళ గ్రామాభివృద్ధిలో భాగమయ్యేలా మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు అర్పితారెడ్డి.బాధ్యత పెరిగిందిగ్రామస్థులలో బాధ్యత పెరిగింది. పారిశుధ్యం, పచ్చదనం, గ్రామ అభివృద్ధి గురించి అందరూ చైతన్యంతో ముందుకు వస్తున్నారు. యువత కూడా గ్రామ అభివృద్ధిలో΄ పాల్గొనడం ఆనందంగా ఉంది. మల్లారం గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మహిళా సంఘాలు, యువత భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ప్రతి ఇంటికి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం.– అర్పితారెడ్డి – ఎస్.డి.తాహెర్ పాషా, పుట్టపాక లక్ష్మణ్, సాక్షి, వేములవాడ (చదవండి: సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...) -
వసూల్ రాణిపై విచారణంటేనే హడల్!
చేతులెత్తేసి తప్పుకున్న డీపీఓ వసూళ్లపై ప్రాథమికంగా నిర్థారణ విచారణాధికారిగా జేసీ–2 రాధాకృష్ణ నియామకం సాక్షి ప్రతినిధి, కాకినాడ : వసూళ్ల రాణిపై విచారణ అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఎం.బాలామణిపై శాఖాపరమైన విచారణ చేయలేనంటూ స్వయంగా ఇన్చార్జి డీపీఓ టీవీఎస్‌జీ కుమార్ చేతులెత్తేశారు. డీపీఓ కార్యాలయ ఏఓ బాలామణి పంచాయతీ కార్యాదర్శుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న విషయాన్ని గత నెల 29న ‘వసూళ్ల రాణి’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో గత నెల 30న ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వసూళ్ల వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ డీపీఓ కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన డీపీఓ నలుగురైదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను విచారించి వసూళ్ల విషయం వాస్తవమేనని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. విచారణ ముందుకు వెళితే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమనే నిర్థారణకు రావడంతో అధికార పార్టీ నేతలు విచారణను అడ్డుకునే ప్రయత్నాలకు తెరతీశారు. కాకినాడలోని డీపీఓ కార్యాలయంలో అన్ని వ్యవహారాలు తెలిసి పరోక్షంగా ఆధిపత్యం చెలాయించే ఒక రిటైర్డ్ డీపీఓ కూడా విచారణను ముందుకుసాగకుండా అడ్డుతగులుతున్నారని కార్యాలయ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అసలే ఇన్చార్జి బాధ్యతలు, తనను డీపీఓగా నియమించిన కలెక్టర్ అరుణ్‌కుమార్ బదిలీపై వెళ్లిపోవడంతో ఇప్పుడు అనవసర రాద్ధాంతం నెత్తిన పెట్టుకోవడం ఎందుకనుకున్నారో ఏమో గానీ డీపీఓ కుమార్ హఠాత్తుగా విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవడం కార్యాలయవర్గాల్లో చర్చనీయాంశమైంది. కలెక్టర్ అప్పగించిన బాధ్యతల మేరకు డీపీఓ అప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభమైన నాలుగు రోజులకే అధికార పార్టీ నేతలు అడ్డుచక్రం వేయడం మొదలుపెట్టారు. విచారణ నివేదిక ‘కర్ర విరగకండా...సామెత మాదిరిగా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఇంతలో డీపీఓ విచారణలో వసూళ్ల వ్యవహారం వాస్తవమేనని ప్రాథమికంగా ఒక నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఆ సమయంలోనే విచారణ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేయడంతో కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో డీపీఓ స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తిని విచారణ అధికారిగా నియమించారు. వసూళ్ల వ్యవహారంపై డీపీఓ అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జేసీ–2ను లోతైన విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే విచారించిన గ్రామ కార్యదర్శులతో పాటు కోనసీమలోని పలువురు కార్యదర్శులను విచారించాల్సి ఉందని చెబుతున్నారు.


