Love You Raa Movie
-
ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. వాటిలో లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి', తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు సిస్టమ్, మధువిధు, టీఎన్ 2026 తదితర డబ్బింగ్ మూవీస్తోపాటు 'మేం కాప్‌లం' అనే తెలుగు సిరీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. వీటితో పాటు మరో మూడు తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఒకే ఓటీటీలోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో ఉన్నాయి?(ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా.. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్)గతేడాది జూలై 5న థియేటర్లలో రిలీజైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా '14'. లక్ష్మీ శ్రీనివాస్ దర్శకుడు కాగా నోయల్ సీన్, రామ్ రతన్, విశాఖ ధీమాన్ ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పుడిది ఆహా ఓటీటీలోకి వచ్చింది. ముఖ్యమంత్రి కొడుకు రతన్, జూనియర్ డాక్టర్ నేహా ప్రేమలో ఉంటారు. ఓ రోజు నేహా ఫ్లాట్‌లో ఇద్దరూ శవాలై కనిపిస్తారు. ఆత్మహత్య అని పోలీసులు తేలిస్తే.. సుబ్బు అనే జర్నలిస్ట్, తన మిత్రులతో కలిసి ఇది హత్య అని దర్యాప్తు చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.గతేడాది జూలై 19న థియేటర్లలోకి వచ్చిన 'రాజు గాని సవాల్' కూడా ఆహా ఓటీటీలోకి వచ్చింది. హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. లెలిజాల రవీందర్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించాడు. చిన్న మొబైల్ రిపేర్ షాపు నడుపుకొనే రాజు అనే వ్యక్తి.. స్నేహితులతో కలిసి తన బస్తీలో గణేష్ ఉత్సవాలు చేయాలనుకుంటాడు. కానీ ఆ ఉత్సవాల వల్ల స్థానిక నాయకుడితో రాజుకు విభేదాలు వస్తాయి. ఈ క్రమంలోనే రాజు తన కుటుంబాన్ని, బస్తీని ఎలా కాపాడుకున్నాడనేదే మిగతా స్టోరీ.గతేడాది సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ సినిమా 'లవ్ యూ రా'. చిన్ను, గీతికా రతన్ జంటగా నటించారు. ఇందులో ప్రధానంగా స్నేహితుల మధ్య జరిగే పందెం, దాని చుట్టూ తిరిగే హారర్, నవ్వులు పుట్టించే అంశాలే ఈ మూవీ స్టోరీ. ఇది కూడా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
‘లవ్ యూ రా’ కడుపుబ్బా నవ్వించేస్తుంది: హీరో చిన్ను
చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రానున్న చిత్రం ‘లవ్ యూ రా’. ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్లో..హీరో చిన్ను మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో మా వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. ‘లవ్ యూ రా’ ఆద్యంతం అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. గీతిక పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణ సాయి కారెక్టర్ అందరినీ నవ్విస్తుంది. చంద్ర శేఖర్ గారి పాత్ర చాలా బాగా వచ్చింది. మా చిత్రంలో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఈశ్వర్ గారు మాకు మంచి పాటలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్లు ఆడియెన్స్ వరకు చేరుకుంటాం. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.చంద్రశేఖర్ మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ చిత్రం సెప్టెంబర్ 5న రాబోతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఈ మూవీ వందకు రెండొందల శాతం సక్సెస్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.హీరోయిన్ గీతిక మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ టీం అంతా కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


