Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో టీడీపీ నాయకులు ధ్వంసం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇల్లు
ఆగని టీడీపీ దాడులు.. పెరిగిన విధ్వంసం

సాక్షి నెట్‌వర్క్‌: టీడీపీ పార్టీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన అభి­వృద్ధి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపనల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాల వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రాలున్న శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశాయి. శనివారం ఉదయం విధులకు హాజరైన సచివాలయ సిబ్బంది దీనిని గుర్తించారు. ఈ ఘటనపై తణుకు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు తెలిపారు. నూజివీడులో శిలాఫలకం కూల్చివేత ఏలూరు జిల్లా నూజివీడు నెహ్రూ పేటలో శనివారం తెల్లవారుజామున ఒక శిలాఫలకాన్ని కూల్చివేశారు. వారం రోజుల క్రితం చాట్రాయి మండలం పోలవరంలో నాలుగు శిలాఫలకాలను ధ్వంసం చేయగా.. ఈ నెల 11న రాత్రి నూజివీడు మండలం బోర్వంచలో గ్రామ సచివాలయ భవనం కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఎంఎన్‌పాలెంలో రెండు శిలాఫలకాలను, సీతారామపురంలో ఒక శిలాఫలకాన్ని, తూర్పుదిగవల్లిలో గ్రామ సచివాలయం బోర్డును ధ్వంసం చేశారు. సచివాలయంపై టీడీపీ జెండా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం సచివాలయం ప్రారం¿ోత్సవ శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు నెలకుర్తి దినే‹Ù, గుత్తా మహేందర్‌ ధ్వంసం చేశారు. సచివాలయం, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనం వద్ద ఉన్న శిలాఫలకం కూడా ధ్వంసం చేశారు. అనంతరం గ్రామ సచివాలయంపై టీడీపీ జెండా పెట్టారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలను టీడీపీ కార్యకర్తలు వీడియో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టి మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని కామెంట్లు పెట్టారు. ధ్వంసం చేసిన శిలాఫలకాల బోర్డులను, సచివాలయ భవనాలను శనివారం వైఎస్సార్‌సీపీ నాయకులు, సర్పంచ్‌ వడ్లమూడి మురళీమోహన్, ఎంపీటీసీ కోండ్రు వెంకటేశ్వర్లు, మాజీ వైస్‌ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు పరిశీలించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి నాగార్జున ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ మాధవరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ, ఎస్‌ఐ చెప్పారు. వైఎస్సార్‌ పేరు తొలగింపు ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని నూతన మునిసిపల్‌ కార్యాలయంపై గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు, కార్యాలయం ప్రవేశ ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ పేర్లను టీడీపీ నాయకులు శనివారం తొలగించారు. మునిసిపల్‌ కార్యాలయం 6 నెలల క్రితం ప్రారంభం కాగా.. ఆర్చిని బూచేపల్లి శివప్రసాదరెడ్డి సొంత నిధులతో నిర్మించారు. వీటితో పాటు చీమకుర్తిలోని ప్రభుత్వాస్పత్రి ప్రవేశ ద్వారం ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ పేర్లను కూడా తొలగించారు. ఈ ఘటనలపై వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, కౌన్సిలర్‌ సోమా శేషాద్రి, గోపురపు చంద్ర, ఆముదాలపల్లి రామబ్రహ్మం తదితరులు సీఐని కలిసి వినతిపత్రం అందించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Sakshi Editorial On Chandrababu Andhra Pradesh Politics By Vardhelli Murali
రెడ్‌బుక్‌ రాజ్యాంగం చెల్లదు!

ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్‌పాట్‌ మీకు రోల్‌మోడల్‌గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్‌ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్‌ బుక్‌? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్‌బుక్‌లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్‌బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్‌ పోలింగ్‌కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్‌ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్‌ మార్క్‌ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది.ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్‌ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్‌ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్‌బుక్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్‌ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్‌బుక్‌ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్‌ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌ చేసుకున్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్‌రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్‌బుక్‌ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ బెంగాల్‌లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్‌ స్టేషన్‌లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్‌’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్‌ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్‌’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్‌ డౌన్‌’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్‌ నెంబర్‌వన్‌ బీజేపీ, ఛాంపియన్‌ నెంబర్‌ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలు, మెగా రిచ్‌ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్‌ డౌన్‌ ఎకనామిక్స్‌ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్‌ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్‌ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్‌మెంట్‌ ఎకనామిక్స్‌ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్‌ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్‌బుక్‌తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Father Day Special: father sentiment Upcoming movies in tollywood
నాన్న... ఓ సూపర్‌ హీరో

చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించి, జీవితంలో మెట్టు మెట్టు పైకి ఎక్కించే నాన్నని చాలామంది తమ ‘సూపర్‌ హీరో’లా భావిస్తారు. అందుకే కొందరు నాన్న ప్రేమను, ఆస్తిని మాత్రమే కాదు పగను కూడా పంచుకుంటారు. నాన్నని కష్టాలపాలు చేసినవారిపై పగ తీర్చుకుంటారు. మొత్తానికి నాన్నతో ఓ ఎమోషనల్‌ బాండింగ్‌ పెంచుకుంటారు. రానున్న కొన్ని చిత్రాల్లో తండ్రీ కొడుకుల రివెంజ్, ఎమోషనల్‌ డ్రామా వంటివి ఉన్నాయి. నేడు ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ ‘సలార్‌’లో తండ్రీకొడుకుగా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి భాగం ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ గత డిసెంబరులో విడుదలైంది. ఈ చిత్రంలో కొడుకు దేవా పాత్రలో ప్రభాస్‌ కనిపించారు. మలి భాగం ‘సలార్‌: శౌర్యాంగపర్వం’లో దేవా తండ్రి ధారా పాత్రకు చెందిన విషయాలు ఉంటాయి. తండ్రికి దక్కాల్సిన ఖాన్సార్‌ సామ్రాజ్యాధికారం, గౌరవాన్ని తాను తిరిగి తెచ్చుకునేందుకు దేవా ఏం చేస్తాడనేది మలి భాగంలో ఉంటుందని భోగట్టా. ఫస్ట్‌ పార్ట్‌లో కొడుకు పాత్రలో కనిపించిన ప్రభాస్‌ మలి భాగంలో తండ్రీకొడుకుగా కనిపిస్తారట. ⇒ తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకు పాత్రలో ఎన్టీఆర్‌ను ‘దేవర’ చిత్రంలో చూడబోతున్నామట. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారతదేశంలో విస్మరణకు గురైన తీర్రపాంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. మరి.. దేవర (తండ్రి పాత్ర)ను ఎవరు మోసం చేశారు? ఎందుకు చేశారు? అనేది థియేటర్స్‌లో చూడాలి. తొలి భాగం సెప్టెంబరు 27న రిలీజ్‌ కానుంది. తొలి భాగంలో కొడుకు పాత్ర ప్రస్తావన ఎక్కువగా, చివర్లో తండ్రి పాత్ర గురించిన పరిచయం ఉండి, రెండో భాగంలో తండ్రి పాత్ర చుట్టూ ఉన్న డ్రామాను రివీల్‌ చేయనున్నారట.⇒తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే కొడుకు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారని తెలిసింది. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘గేమ్‌ చేంజర్‌’. ఈ చిత్రంలో ఐఏఎస్‌ ఆఫీసర్‌ రామ్‌నందన్‌ పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారని భోగట్టా. రామ్‌నందన్‌ తండ్రి పేరు అప్పన్న (ప్రచారంలో ఉన్న పేరు). అప్పన్న రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు. కానీ అతని స్నేహితులు కొందరు మోసం చేస్తారు. ఈ క్రమంలోనే అప్పన్న చనిపోతాడట. ఆ తర్వాత అతని కొడుకు ఐఏఎస్‌ ఆఫీసర్‌గా ఛార్జ్‌ తీసుకుని, తన తండ్రికి అన్యాయం చేసినవారికి ఎలా బుద్ధి చెప్పాడు? అన్నదే ‘గేమ్‌ చేంజర్‌’ కథ అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకుగా రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.⇒ మా నాన్న సూపర్‌ హీరో అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తండ్రీతనయుల మధ్య సాగే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని యూనిట్‌ పేర్కొంది.⇒ హాస్యనటుడు ధన్‌రాజ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘రామం రాఘవం’. తండ్రీకొడుకు మధ్య నెలకొన్న బలమైన భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో ధన్‌రాజ్‌ నటిస్తున్నారు. తనయుడు బాధ్యతగా ఉండాలని తాపత్రయపడే తండ్రిగా సముద్ర ఖని, తనను తన తండ్రి అర్థం చేసుకోవడం లేదని బాధపడే కొడుకుగా ధన్‌రాజ్‌ కనిపిస్తారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ కానుంది.⇒కరోనా నేపథ్యంతో తండ్రీకొడుకుల ఎమోషన్‌ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన సినిమా ‘డియర్‌ నాన్న’. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో సూర్యకుమార్‌ భగవాన్‌ దాస్, కొడుకు పాత్రలో చైతన్యా రావ్‌ నటించారు. యష్ణ చౌదరి, సంధ్య జనక్, శశాంక్, మధునందన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘డియర్‌ నాన్న’ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇలా తండ్రి భావోద్వేగం ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.

G7 Summit 2024: G7 blames China for enabling Ukraine war
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం

రోమ్‌: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచి్చంది? అమెరికాతోపాటు పశి్చమ దేశాలు డ్రాగన్‌ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచి్చపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్‌ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్‌పై దాడుల తర్వాత రష్యాపై పశి్చమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. టిబెట్, షిన్‌జియాంగ్‌తోపాటు హాంకాంగ్‌లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్‌ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. ఎలక్ట్రికల్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్‌ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశి్చమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి.

Complaint by victim Paleti Rajkumar to Human Rights Commission
చినబాబు బ్యాచ్‌ చిత్రహింసలు!

సాక్షి, అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్‌ అనుచరులు ఈ నెల 9వ తేదీన తనను కిడ్నాప్‌ చేసి రాత్రంతా చిత్ర హింసలకు గురి చేసినట్లు పెదవడ్లపూడికి చెందిన బాధితుడు పాలేటి రాజ్‌కుమార్‌ సుప్రీం కోర్టు, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. లోకేశ్‌ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బెదిరించి క్షమాపణ చెప్పించి చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు.వీటి ప్రభావంతో పాఠశాలలో చదువుతున్న తన పిల్లలు అవమానభారంతో ఇంటికొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు పదే పదే బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని అరికట్టకుంటే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని విన్నవించుకున్నాడు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై చట్టప్రకారం పోలీసులతో విచారణ జరిపి వ్యక్తిగత, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులను పరిరక్షించాలని కోరాడు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు ఇవీ.. ⇒ మంగళగిరి నియోజకవర్గంలో 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మా కుటుంబంతో కలసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశా. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. నారా లోకేశ్‌ అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. ⇒ ఈ నెల 9వతేదీన సాయంత్రం 4.30 గంటల సమయంలో నారా లోకేశ్‌కు సన్నిహితుడైన జవ్వాడి కిరణ్‌చంద్‌ అనుచరులు నరేంద్ర, షేక్‌ బాజీ, జానీ తదితరులు నేను మా అత్త ఇంట్లో ఉన్న సమయంలో మారణాయుధాలతో దాడి చేశారు. ఫరీ్నచర్‌ను ధ్వంసం చేశారు. ఏపీ 39 జీబీ 3333 వాహనంలో నన్ను కిడ్నాప్‌ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. నా చొక్కా విప్పించి నారా లోకేశ్‌ ప్లెక్సీ ఎదుట మోకాళ్లపై మోకరిల్లి ముకుళిత హస్తాలతో క్షమాపణ చెప్పాలని బెదిరించి వీడియో చిత్రీకరించారు. ఈనెల 10వతేదీ తెల్లవారు జాము 4 గంటలకు బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వదిలేసి వైఎస్సార్‌ సీపీకి మద్దతు పలికితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ⇒ నాపై దాడి చేసిన వారిపై అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్‌ నెంబరు 78/2024) చేశా. ఫిర్యాదు వాపసు తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులు పదే పదే ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ⇒ మానవ హక్కులను కాలరాయడంపై తక్షణమే జోక్యం చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి నాకు, నా కుటుంబానికి రక్షణ కలి్పంచాలి. నా ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నా.

Land value increase from August 1 in Telangana
ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు కొత్త ప్రభుత్వ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈనెల 18 నుంచి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, జూలై 31 నాటికి పూర్తి కానుంది. అనంతరం ఆగస్టు 1 నుంచి కొత్త ప్రభుత్వ విలువల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. భూములు, ఆస్తుల విలువలను మరోమారు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విలువల నిర్ధారణకు అనుసరించాల్సిన పద్ధతులు, ఇరు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ప్రాతిపదికలు, విలువల సవరణ ప్రక్రియ షెడ్యూల్‌తో కూడిన ఈ మార్గదర్శకాలను ఆ శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ సంబంధిత అధికారులకు పంపారు. వీటి ప్రకారం సవరించిన విలువలను ప్రజలకు అందుబాటులో ఉంచి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజులు గడువు ఇవ్వనున్నారు. ఈ అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే అధికారంగా కొత్త విలువలను నమోదు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సవరణ ప్రక్రియ ఇలా... ⇒ వ్యవసాయేతర వినియోగానికి అనువుగా (ప్లాట్లు, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమలు, సెజ్‌లు, వినోద సౌకర్యాల ఏర్పాటు) జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లోని భూముల విలువను అధికంగా పెంచాలి. ⇒ ఈ క్రమంలో గ్రామపటాలను తీసుకుని ఇప్పటికే ఇంటి స్థలాలుగా మారిన సర్వే నంబర్లు, మారే యోగ్యత ఉన్న సర్వే నంబర్లు, జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లను వేర్వేరుగా గుర్తించాలి. ⇒ సబ్‌రిజి్స్ట్రార్, జిల్లాల రిజి్స్ట్రార్లు ఈ గ్రామాలకు ప్రత్యేకంగా వెళ్లి సమాచారం సేకరించాలి. ఆయా గ్రామాల్లోని పెద్దలు, రెవెన్యూ పంచాయతీ అధికారులతో మాట్లాడి ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో భూములు, ఆస్తులకు ఉన్న విలువను గుర్తించాలి. ⇒ బహిరంగ మార్కెట్‌ విలువలను సేకరించే విషయంలో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వొద్దు. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల బ్రోచర్లు, భూసేకరణ పరిహారం, బ్యాంకులు, రెవెన్యూ వర్గాలు నిర్వహించిన వేలం లాంటి వివరాలను విలువల నిర్ధారణకు వాడుకోవచ్చు. బహిరంగ మార్కెట్‌ విలువలను సేకరించిన తర్వాత ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువలతో పోల్చుకుని సవరించాల్సిన విలువలను ప్రతిపాదించాలి. ⇒ 5–6 కిలోమీటర్ల రేడియస్‌లోని గ్రామాల్లో ఉండే తేడాలను జాగ్రత్తగా గమనించాలి. ఆ వ్యాసార్థంలోని గ్రామాల్లో ఏ పాయింట్‌లో ఎంత విలువ ఉంది, ఏయే పాయింట్‌కు ఎంత మారుతోందనే అంశాలను జాగ్రత్తగా గమనించాలి. ⇒ ఒకే గ్రామంలో ఉన్నా వేర్వేరు చోట్ల ఉన్న భూములు, ఆస్తులకు రెండు కంటే ఎక్కువ విలువలను కూడా ప్రతిపాదించవచ్చు. ⇒ వ్యవసాయ భూముల విషయంలో ప్రస్తుత బహిరంగ మార్కెట్‌ విలువలను రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి తీసుకోవాలి. ⇒ గతంలో పొరపాటుగా బహిరంగ మార్కెట్‌ విలువల కంటే ప్రభుత్వ విలువలను ఎక్కువగా నమోదు చేసి ఉంటే వాటిని వ్యక్తిగతంగా డీఐజీ స్థాయి అధికారులు పరిశీలించి కమిటీ ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలి. వ్యవసాయ భూముల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇలా... ⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అధికారికంగా నిర్ధారించిన ప్రాంతాల వివరాలను సేకరించి నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలకు వేర్వేరుగా ఆ ప్రాంతం మొత్తానికి ఒకే విలువ నిర్ధారించాలి. సదరు ప్రాంతాల్లో కొన్ని కాలనీలు, వీధులను కలపాల్సి వచి్చనా విలువలు మాత్రం ఒకేలా ఉండాలి. ⇒ రోడ్డుకిరువైపులా ఉన్న ఆస్తులకు ఒకే విలువ ప్రతిపాదించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి తాజా డోర్‌ నంబర్ల వివరాలను ఫామ్‌–2లో పొందుపరచాలి. ⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా విలీనం చేసిన గ్రామాల్లో విలువల ప్రతిపాదన కసరత్తు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగినట్టు ఉండాలి. ఈ గ్రామాలను ఆనుకుని ఇప్పటికే వార్డులు, బ్లాక్‌లుగా ఉన్న మున్సిపల్‌ ప్రాంతాల్లో విలువలు ఆయా గ్రామాలకు సమీపంగా ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ⇒ నివాస ప్రాంతాల్లో ఉన్న డోర్‌ నంబర్లను వాణిజ్య ప్రాంతాలుగా పొరపాటున నమోదు చేసినా, వాణిజ్య ప్రాంతాల డోర్‌ నంబర్లను నివాస ప్రాంతాలుగా నమోదు చేసినా వాటిని సవరించాలి. ⇒ గ్రౌండ్‌ ఫ్లోర్, ఇతర ఫ్లోర్‌లకు వేర్వేరు విలువలు నిర్ధారించే అంశాన్ని కేవలం ప్రధాన రహదారుల పక్కన ఉండే నివాస సముదాయాలకు మాత్రమే వర్తింపజేయాలి. సాధారణ మార్గదర్శకాలు: ⇒ భారత స్టాంపుల చట్టం–1899లోని సెక్షన్‌ 47(ఏ) ప్రకారం ఆస్తుల విలువలను సవరించే సమయంలో క్రమానుగుణంగా జరిగిన ప్రక్రియ, విలువలను పరిగణనలోకి తీసుకుని సవరణ విలువలను ప్రతిపాదించాలి. (అంటే ఒకేసారి పెద్ద ఎత్తున పెంపు, తగ్గింపు ఉండకూడదు.) –గ్రామీణ ప్రాంతాల డేటా, రికార్డులను తహశీల్దార్లు, గ్రామపంచాయతీల నుంచి తీసుకోవాలి. ⇒ ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువల కంటే ఎక్కువ విలువలతో ఒక ప్రాంతంలో పలు లావాదేవీలు జరిగి ఉంటే ఆ విలువను సవరణకు ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ⇒ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్‌ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో జోనల్‌ అభివృద్ధి మ్యాప్‌లను, మిగిలిన పట్టణ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల మాస్టర్‌ప్లాన్‌లను విలువల సవరణకు ప్రాతిపాదికగా తీసుకోవాల్సి ఉంటుంది.

Weekly Horoscope 16 June 2024 To 22 June 2024 In Telugu
ఈ వారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషంఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. పోటీపరీçక్షల్లో అనుకూల ఫలితాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.వృషభంపనులు సకాలంలో పూర్తయి ఊపిరిపీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీపడతారు. చర,స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. సన్మానయోగం. వారం ప్రారంభంలో శ్రమ వృధా. బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆందోళన. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి.మిథునంవ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఇంటి నిర్మాణంలో ఎదురైన ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు ఒక హోదా దక్కవచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు. ఖర్చులు అధికం. గులాబీ, తెలుపు రంగులు, పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.కర్కాటకందీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు. తండ్రితరఫు వారి నుంచి ధన, వస్తులాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వృద్ధి, కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. తెలుపు, చాక్లెట్‌రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.సింహంపనులలో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు, మీ నిర్ణయాలను బంధువులు వ్యతిరేకిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉండి లాభాలు నామమాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నేరేడు, లేత ఆకుపచ్చరంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.కన్యఅదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఒక సమాచారంతో ఊరట చెందుతారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి ఊహించని పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఎరుపు, బంగారురంగులు, శివపంచాక్షరి పఠించండి.తులకొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల్లో అనుమానాలు నివృత్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా పడతాయి. పసుపు, తెలుపురంగులు, గణేశాష్టకం పఠించండి.వృశ్చికంకొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన బాకీలు అంది ఖర్చులకు ఇబ్బంది ఉండదు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ, కళారంగాలవారికి విదేశీ పర్యటనలు.వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. నేరేడు, లేత ఎరుపు రంగులు, గణేశాష్టకం పఠించండి.ధనుస్సుఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు పూర్తయ్యే వరకూ విశ్రమించరు. ఆలోచనలు అమలు చేసి అందర్నీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో మీ పాత్ర పెరుగుతుంది. ఇంతకాలం పడిన ఇబ్బందులు, సమస్యలు తీరే సమయం. పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నిరాశ తొలగి అడుగు ముందుకు పడుతుంది. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు. రాఘవేంద్రస్వామిని స్మరించండి.మకరంఅనుకున్న వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఏదీ అసంపూర్తిగా విడిచిపెట్టరు. గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తారు. స్థిరాస్తులు కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు చేస్తారు. దూరపు బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. ఊహించని ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. వ్యాపారాలు సమృద్ధిగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఊరట కలుగుతుంది. బాధ్యతల భారం తగ్గవచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. ప్రయాణాలలో ఆటంకాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కుంభంసంఘంలో మీరు చెప్పిన విషయాలు అందర్నీ మెప్పిస్తాయి. కుటుంబంలోనూ కీలకంగా మారతారు. వివాహాది ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధల నుండి విముక్తి లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యక్తి ద్వారా అత్యంత కీలక విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు విస్తరణకు సమాయత్తమవుతారు. ఉద్యోగాలలో ఈతిబాధలు, సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. చోరభయం. నిర్ణయాలలో మార్పులు. పసుపు, నీలం రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మీనంఎటువంటి వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి అధికంగా అందులో గడుపుతారు. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వచ్చే వీలుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆర్థిక లావాదేవీలు చాకచక్యంగా నిర్వహించి అప్పులు చేయకుండా గడుపుతారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలుకు వస్తున్న ఆటంకాలు అధిగమిస్తారు. సోదరుల నుండి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు ఒక ఊహించని పదవి దక్కవచ్చు. గులాబీ, ఎరుపు రంగులు. వారం మ«ధ్యలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. శివాష్టకం పఠించండి.

T20 World Cup 2024: England Beat Namibia By 41 Runs Through DLS Method, Stay ALive In Super 8 Race
T20 World Cup 2024: చెలరేగిన బ్రూక్‌.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలుపు

టీ20 వరల్డ్‌కప్‌ 2024 సూపర్‌-8 అవకాశాలను ఇంగ్లండ్‌ సజీవంగా ఉంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. నమీబియాను ఓడించింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను హ్యారీ బ్రూక్‌ (20 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ (8 బంతుల్లో 11; 2 ఫోర్లు), మొయిన్‌ అలీ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు), లివింగ్‌స్టోన్‌ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జోస్‌ బట్లర్‌ డకౌటయ్యాడు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్‌మన్‌ 2, డేవిడ్‌ వీస్‌, బెర్నాల్డ్‌ స్కోల్జ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం 123 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. ఇంగ్లండ్‌ బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.నమీబియా ఇన్నింగ్స్‌లో వాన్‌ లింగెన్‌ 33, నికోలాస్‌ 18 (రిటైర్డ్‌ హర్ట్‌), డేవిడ్‌ వీస్‌ 27 (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, క్రిస్‌ జోర్డన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ సూపర్‌-8 అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌ సూపర్‌-8కు చేరాలంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ భారీ తేడాతో ఓడాల్సి ఉంది.

NEET UG 2024: Candidates Paid Rs 30 Lakh For Leaked Papers
30 లక్షలకు నీట్‌ ప్రశ్నాపత్రం!

పట్నా: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్‌ గ్రాడ్యుయేట్‌(నీట్‌–యూజీ)లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్‌ అయ్యిందని, పరీక్షలో రిగ్గింగ్‌ జరిగిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను సైతం ఆశ్రయించారు. నీట్‌–యూజీని రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని చాలామంది డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు గ్రేసు మార్కుల వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. బిహార్‌లో నీట్‌ అక్రమాలపై జరగుతున్న దర్యాప్తులో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్‌ అక్రమాలకు సంబంధించి బిహార్‌ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్‌ ఇంజనీర్‌ కూడా ఉండడం గమనార్హం. రూ.30 లక్షలు ఇచ్చి నీట్‌ ప్రశ్నపత్రం కొనుగోలు చేశామని ప్రాథమిక విచారణలో పలువురు అభ్యర్థులు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పకడ్బందీగా స్కెచ్‌ బిహార్‌లో పేపర్‌ లీక్‌ చేసి, అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా పకడ్బందీగా వ్యవహరించారు. తమకు డబ్బులు ముట్టజెప్పిన అభ్యర్థులను తొలుత సురక్షిత స్థావరాలకు తరలించారు. వారికి అక్కడే ప్రశ్నపత్రం అప్పగించారు. జవాబులు సైతం చెప్పేశారు. తర్వాత నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. మధ్యలో ఎవరినీ కలవనివ్వలేదు. ఇదంతా ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. నీట్‌ పేపర్‌ లీకేజీపై బిహార్‌ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను, అనుమానితులను ప్రశ్నించింది. శనివారం మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరంతా బిహార్‌లో వేర్వేరు జిల్లాలకు చెందినవారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నుంచి అభ్యర్థుల వివరాలు తెలుసుకొని, నోటీసులు ఇచ్చామని ఈఓయూ డీఐజీ మనవ్‌జీత్‌ సింగ్‌ థిల్లాన్‌ చెప్పారు. కన్సల్టెన్సీలు, కోచింగ్‌ సెంటర్ల ముసుగులో.. నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు రాగానే బిహార్‌ పోలీసులు వేగంగా స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేశారు. అనుమానిత అభ్యర్థులు, పేపర్‌ లీక్‌ చేసిన బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అభ్యర్థులు నోరు విప్పారు. బ్రోకర్లకు రూ.30 లక్షలకుపైగా ఇచ్చి నీట్‌ ప్రశ్నాపత్రం కొనుగోలు చేశామని ఒప్పుకున్నారు. బిహార్‌ ప్రభుత్వ జూనియర్‌ ఇంజనీర్‌ సికిందర్‌ కుమార్‌ యాదవేందు(56)ను పోలీసులు అరెస్టు చేసి, ప్రశ్నించారు. పేపర్‌ లీక్‌ ముఠాతో తాను చేతులు కలిపినట్లు అంగీకరించాడు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానని చెప్పాడు. ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ సంస్థను నడిపిస్తున్న నితీశ్, అమిత్‌ ఆనంద్‌ అనే వ్యక్తులను తన ఆఫీసులో∙కలిశానని, వారు మే 4వ తేదీన నీట్‌ ప్రశ్నాపత్రం తీసుకొచ్చారని వెల్లడించారు. పట్నాలోని రామకృష్ణానగర్‌లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశామని, బేరసారాలు అక్కడే జరిగాయని పేర్కొన్నాడు. నితీశ్, అమిత్‌ ఆనంద్‌ అరెస్టయ్యారు. అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశామని పోలీసుల విచారణలో వెల్లడించారు. బిహార్‌ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష కుంభకోణంలో నితీశ్‌ కుమార్‌ ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. పేపర్‌ లీకేజీలో ఆరితేరాడు. లీకేజీ ముఠా సభ్యులు ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలు, కోచింగ్‌ సెంటర్ల ముసుగులో అభ్యర్థులను సంప్రదించి, ప్రశ్నాపత్రాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఇలాంటి కన్సల్టెన్సీలు, కోచింగ్‌ సెంటర్లకు ప్రభుత్వ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇదిలా ఉండగా, బిహార్‌లో బయటపడిన నీట్‌ అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ గానీ, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ గానీ ఇంతవరకు స్పందించలేదు.

Problem with lack of coordination between Metro, MMTS and Citybuses
దరి చేర్చని దారి!.. గ్రేటర్‌లో 80లక్షలు దాటిపోయిన వాహనాల సంఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ మెట్రోరైల్‌స్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో సుమారు 1500కుపైగా కాలనీలు ఉంటాయి. ఆ కాలనీల నుంచి ప్రతి రోజూ వేలాది మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మెట్రో ఉన్నా వినియోగించుకొనే పరిస్థితి లేదు. దానికి కారణం ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడమే. అంటే కాలనీ నుంచి మెట్రో స్టేషన్‌కు.. రైలు దిగాక మెట్రోస్టేషన్‌ నుంచి ఆఫీసుకో, మరేదైనా చోటికో వెళ్లడానికి సరైన ప్రజా రవాణా సదుపాయాలు లేకపోవడమే. మెట్రోలో అయితే త్వరగా వెళ్లగలిగినా.. ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్‌ నుంచి ఆఫీసుకు వెళ్లడానికి ఆటో ఎక్కితే ఖర్చు అడ్డగోలుగా పెరిగిపోతోంది. దీంతో జనం సొంత వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ఇది నగరంలో భారీగా ట్రాఫిక్, పొల్యూషన్‌ పెరిగిపోవడానికి కారణమవుతోంది.ఉదాహరణకు..: ఉప్పల్‌ సమీపంలోని కాలనీ వ్యక్తి రాయదుర్గంలోని ఆఫీసుకు వెళ్లాలంటే.. కాలనీ నుంచి మెట్రోస్టేషన్‌కు వెళ్లేందుకు రూ.75 నుంచి రూ.100 చార్జీతో ఆటోలో ప్రయాణించాలి. అక్కడి నుంచి మెట్రోలో రాయదుర్గం వరకు రూ.55 చార్జీ ఉంటుంది. రైలు దిగి ఆఫీసుకు చేరేందుకు మరో రూ.50 వెచ్చించాలి. తిరిగి ఇంటికి వెళ్లడానికి మళ్లీ ఖర్చు తప్పదు. ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వచి్చన దుస్థితి ఇది. ఒక్క ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌ మాత్రమే కాదు. మూడు మెట్రో కారిడార్లలోని అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు సరైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రయాణం భారంగా మారుతోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాల వినియోగానికే మొగ్గుచూపుతున్నారు.సవాల్‌గా మారిన సమన్వయం..గ్రేటర్‌లో మొదటి నుంచీ ప్రజారవాణా సదుపాయాల మధ్య సమన్వయం లేదు. సిటీబస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, మెట్రో రైళ్ల సేవలు ఇప్పటికీ విడివిడిగానే ఉన్నాయి. 2017లో మెట్రో సేవలను ప్రారంభించినప్పుడు అన్ని స్టేషన్లకు చేరేందుకు బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రయాణికులను స్టేషన్లకు చేరవేసేందుకు ఆర్టీసీ మినీ బస్సులను ప్రతిపాదించింది. ఫీడర్‌ చానళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అవేవీ అమల్లోకి రాలేదు. గతంలో ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు అనుసంధానంగా ప్రత్యేకంగా సిటీబస్సులను ప్రవేశపెట్టినా ఎంతో కాలం కొనసాగలేదు. దీంతో ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సమస్య అలాగే ఉండిపోయింది.మెట్రోకు అనుసంధానం లేక..నాగోల్‌–రాయదుర్గం, ఎల్‌బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మధ్య ప్రస్తుతం ప్రతిరోజూ 5 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. రోజుకు 1,000 ట్రిప్పులకుపైగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ లేక ఇంకా లక్షలాదిమంది మెట్రోకు దూరంగానే ఉంటున్నారు. మెట్రోస్టేషన్‌కు కనీసం 5 కిలోమీటర్ల పరిధిలో ఫీడర్‌ చానల్స్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది.ఓలా, ఉబర్, ర్యాపిడో,యారీ వంటి యాప్‌ ఆధారిత క్యాబ్‌లు, ఆటోలు మినహాయిస్తే మెట్రోస్టేషన్ల నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ చాలా తక్కువ. 16 ఆర్టీసీ సైబర్‌ లైనర్‌ బస్సులు, 135 మెట్రో సువిధ (12 సీట్లవి) వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైటెక్‌సిటీ, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలకు వెళ్లే సైబర్‌ లైనర్లు, సువిధ వాహనాలకు డిమాండ్‌ ఉంది.జనాభా పెరుగుతున్నా.. సదుపాయాలు అంతే! గ్రేటర్‌ హైదరాబాద్‌ జనాభా సుమారు 2 కోట్లకు చేరువైంది. ఏటా లక్షలాది మంది నగరానికి వచ్చి స్థిరపడుతున్నారు. అన్ని వైపులా పెద్ద సంఖ్యలో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. కానీ ఇందుకు తగినట్టుగా ప్రజారవాణా సదుపాయాలు పెరగడం లేదు. బెంగళూరు వంటి నగరాల్లో సుమారు 6,000 బస్సులు అందుబాటులో ఉంటే.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2,550 బస్సులే ఉన్నాయి. ఇక 70 ఎంఎంటీఎస్‌ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. నగర అవసరాల మేరకు మరో 100 ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాల్సి ఉంది. మెట్రో రైళ్లు కూడా మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. అన్ని సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.‘వాహన విస్ఫోటనం’!హైదరాబాద్‌ నగరంలో వాహన విస్ఫోటనం ఆందోళన కలిగిస్తోంది. ఏటా 2 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రస్తుతం వాహనాల సంఖ్య 80 లక్షలకుపైనే ఉంది. వీటిలో 70 శాతానికిపైగా వ్యక్తిగత వాహనాలే కావడం గమనార్హం.కోవిడ్‌ అనంతరం 2022 నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ అవసరం బాగా పెరిగింది. మొదట 15 రూట్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 58 స్టేషన్లకు విస్తరించినట్లు అధికారులు చెప్తున్నారు. మెట్రో రైడ్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఆర్‌ఐ), ఈవీ ఆటోలు నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సదుపాయం ఉన్న మెట్రో స్టేషన్లు చాలా తక్కువ. కనెక్టివిటీ పెరిగితే మరో 5 లక్షల మందికిపైగా మెట్రోలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.నగరంలో ప్రతి కిలోమీటర్‌కు 1,732 ద్విచక్రవాహనాలు, మరో 1,000 కార్లు ప్రయాణిస్తున్నాయి. అన్ని మార్గాల్లో కలిపి ఒకే సమయంలో సుమారు 55,000 బైకులు, మరో 30,000 కార్లు వెళ్తున్నాయి. రవాణా నిపుణుల అంచనా మేరకు రోడ్లపై వాహనాల సంఖ్య 25,000 దాటితే అత్యధిక వాహన సాంద్రత ఉన్నట్లుగా పరిగణించాలి. సొంత బండితోనూ.. తప్పని కష్టాలుమెట్రోలు, ఎంఎంటీఎస్‌లలో ప్రయాణించలేక.. చాలా మంది సొంత కారు, ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. దీనితో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో నాగోల్‌ నుంచి రాయదుర్గం చేరుకొనేందుకు 45 నిమిషాల సమయం పడితే.. బైక్‌ జర్నీకి గంటన్నర, కారులో అయితే 2 గంటలకుపైగా సమయం పడుతుంది. పైగా మానసిక ఒత్తిడి, పొల్యూషన్‌ సమస్య. ముంబైలో కనెక్టివిటి బాగుండటంతో.. ఎక్కువ దూరం ప్రయాణించేవారిలో చాలా మంది రైళ్లలోనే వెళ్తారు.కామన్‌ మొబిలిటీ టికెట్‌ ప్రవేశపెట్టాలి ప్రజారవాణా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. నేషనల్‌ కామన్‌ మొబిలిటీ టికెట్‌ (ఎన్‌సీఎంటీ)ను ప్రవేశపెట్టాలి. సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, ఆటోలు, బైక్‌ ట్యాక్సీలు తదితర అన్ని రవాణా సదుపాయాలను ఒకే కార్డుతో వినియోగించుకొనే అవకాశం ఉండాలి. దాని వల్ల ప్రయాణికులు ఒక రవాణా సదుపాయం నుంచి మరో రవాణా సదుపాయానికి ఈజీగా మారుతారు. ప్రస్తుతం మెట్రో కనెక్టివిటీ లేని ఎల్‌బీనగర్‌– నాగోల్‌ వంటి రూట్లలో ఆర్టీసీ ఉచిత బస్సులను ప్రవేశపెడితే ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. – మురళి వరదరాజన్, ఎల్‌అండ్‌టీ మెట్రో చీఫ్‌ స్ట్రాటజీ అధికారి రవాణా అవసరాలు తేల్చేందుకు ఇంటింటి సర్వే.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజారవాణా అవసరాలపై హుమ్టా సంస్థ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. లీ అసోసియేషన్‌ ద్వారా ఈనెల 18 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నాం. ప్రతి ఇంటి రవాణా అవసరాలు, వినియోగిస్తున్న వాహనాలపై ఈ అధ్యయనం ఉంటుంది. అలాగే ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన ట్రాఫిక్‌ రద్దీ ఉత్పన్నమవుతోందనేది కూడా పరిశీలిస్తాం. లీ అసోసియేషన్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ రకమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందనేదానిపై స్పష్టత వస్తుంది. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 3 నెలల్లో లీ అసోసియేషన్‌ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. – జీవన్‌బాబు, హుమ్టా ఎండీ ప్రజా రవాణా విస్తరించకపోవడం వల్లే.. ప్రజారవాణా విస్తరించకపోవడం వల్ల కూడా సొంత వాహనాల వినియోగం పెరిగింది. బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభించడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. సొంత కారు, సొంత బైక్‌ సిటీ కల్చర్‌లో ఒక భాగంగా మారింది. ఒకప్పుడు సైకిళ్ల నగరంగా పేరొందిన హైదరాబాద్‌ ఇప్పుడు బైక్‌ల నగరంగా మారింది. – ఎం.చంద్రశేఖర్‌గౌడ్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్, రంగారెడ్డి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement