Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Chalasani Srinivas Comments On TDP
ప్రత్యేక హోదా వద్దన్నవారు దుర్మార్గులు: చలసాని శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: విభజన హామీలను వెంటనే అమలు చేయాలని.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నవారిని దుర్మార్గులుగా చూస్తామంటూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం.. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన హామీలు అమలైతేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.‘‘గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న వారు తాజాగా ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చారు. రాష్టం బాగుపడటం, భవిష్యత్‌ కూడా ముఖ్యమే. తెలుగు జాతి హక్కుల కోసం రాష్ట్ర ‍ప్రభుత్వం కాంప్రమైజ్‌ కావొద్దు. ఏపీకి ప్రత్యేక హోదా తేవాలి. కేంద్రం నుంచి హామీలు తీసుకోవడం కాదు.. అమలయ్యేలా చూడాలి’’ అని చలసాని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.చంద్రబాబు, జనసేన విభజన అంశాలపై మాట్లాడలేదు.. నయనో, భయనో ప్రత్యేక హోదా తీసుకురావాలి.. పోలవరం పై కుట్ర జరుగుతుంది.. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు ఇవ్వాలి’’ అని చలసాని అన్నారు. ‘‘ఏపీలో మీడియాపై నిషేధం సరికాదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిషేధించిన ఛానల్స్‌ను పునరుద్ధరించాలి’’ చలసాని కోరారు.

Elon Musk Tweet About EVM
ఈవీఎంలు రద్దు చేయాలి: మస్క్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచంలోని చాలాదేశాల్లో ఓటింగ్ ప్రక్రియకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) ఉపయోగిస్తున్నారు. దీనిపైన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఇటీవల ప్యూర్టో రికో దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లలో అవకతవకలు జరిగాయని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వందల కొద్దీ ఓటింగ్ అక్రమాలను ఎదుర్కొన్నట్లు వివరాయించారు. అదృష్టవశాత్తూ, పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్ళీ పేపర్ బ్యాలెట్‌లకు తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు.రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ ట్వీట్ మీద మస్క్ స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలి. వీటిని ఎవరైనా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ఒక దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంటుందని మస్క్ అన్నారు.మస్క్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మస్క్ అబ్రిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తున్నారు. నిజానికి ఈవీఎంలో ఎంత సేఫ్టీ టెక్నాలజీలను ఉపయోగించి తయారు చేసినా.. అంతకు మించిన టెక్నాలజీతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నికల విషయంలో పేపర్ ఓటింగ్ ఉత్తమం అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh— Elon Musk (@elonmusk) June 15, 2024

12 CCS Inspectors Transferred To Multizone 2 In Hyderabad
హైదరాబాద్‌ సీసీఎస్‌ ప్రక్షాళన.. 12 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అవినీతికి అడ్డాగా మారిపోవడంతో సీసీఎస్‌ ప్రక్షాళనకు హైదరాబాద్‌ సీపీ చర్యలు చేపట్టారు. 12 మంది సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లను మల్టీజోన్‌-2కు బదిలీ చేశారు. వెంటనే రిపోర్ట్‌ చేయాలని హైదరాబాద్‌ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టీఎస్‌ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీమ్‌–7 ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతోందనే ఆరోపణ వినిపిస్తోంది.సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కాములను సీసీఎస్‌ అధికారులు దర్యాప్తు చేస్తారు. రూ.25 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న సొత్తు సంబంధిత నేరాలు, రూ.75 లక్షలకు మించిన మొత్తంతో కూడిన మోసాల కేసులు సీసీఎస్‌ పరిధిలోని వస్తాయి. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీసుస్టేషన్లలో నమోదైన వాటిని సిటీ పోలీసు కమిషనర్‌ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు. సీసీఎస్‌ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం రూ.కోట్లతో ముడిపడి ఉంటాయి.

Scotland Has Scored Their Highest Ever Total In T20 World Cup
T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (జూన్‌ 16) జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల చరిత్రలో స్కాట్లాండ్‌ ఇదే అత్యధిక స్కోర్‌. 2022 ఎడిషన్‌లో ఐర్లాండ్‌పై చేసిన 176 పరుగులు ఈ మ్యాచ్‌ ముందు వరకు ఆ జట్టు అత్యధిక స్కోర్‌గా ఉండింది. నేటి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఓడినా రికార్డు నెలకొల్పింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. సూపర్‌-8కు చేరే క్రమంలో స్కాట్లాండ్‌కు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకమై ఉండింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే స్కాట్లాండ్‌ సూపర్‌-8కు చేరి ఉండేది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఓడటం.. నమీబియాపై ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించడంతో ఇంగ్లండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. గ్రూప్‌-బి నుంచి ఇదివరకే ఆస్ట్రేలియా సూపర్‌-8కు క్వాలిఫై అయ్యింది.ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (60), బెర్రింగ్టన్‌ (42 నాటౌట్‌), మున్సే (35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో మ్యాక్స్‌వెల్‌ 2, ఆస్టన్‌ అగర్‌, నాథన్‌ ఇల్లిస్‌, ఆడమ్‌ జంపా తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. ట్రవిస్‌ హెడ్‌ (68), మార్కస్‌ స్టోయినిస్‌ (59), టిమ్‌ డేవిడ్‌ (24 నాటౌట్‌) చెలరేగడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. స్కాట్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ వాట్‌, షరీఫ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్‌ వీల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

Ukraine-Russia war may erupt again as G7 backs Zelensky
జీ-7 మద్దతు: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం! మళ్లీ బీభత్సమేనా!

ఇటలీలోని అపులియాలో నిర్వహించిన జీ-7 దేశాల సమ్మిట్‌ రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. అదేవిధంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ సైతం జీ-7 సమ్మిట్‌లో పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పశ్చాత్య దేశాల మద్దతు కారణంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఫ్రాన్స్‌ బలగాలు ఉక్రెయిన్‌ యుద్ధం భూమిలో దిగనున్నాయి. యూకే 300 కిలోమీటర్ల రేంజ్‌ ఉండే స్టార్మ్ షాడో క్షిపణులు అందజేయనుంది. రష్యాను టార్గెట్‌ చేయడానికి పలు అధునాత రాకెట్లు, మిసైల్స్‌ను అమెరికా ఉక్రెయిన్‌కు సరఫరా చేయనుంది. జీ-7 దేశాల సమ్మిట్‌ ద్వారా ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పాశ్చాత్య దేశాల మద్దతు మరింత కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా భారీ ఆర్థిక, సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని స్థావరాలపై ఉక్రెయిన్‌ టార్గెట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.జీ-7 దేశాల సమ్మిట్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి జెలెన్‌స్కీ మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్‌కు సహకరించాడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఖండించిన విషయం తెలిసిందే. అదే విధంగా రష్యా సార్వభౌమత్వానికి ముప్పు వస్తే.. అణ్వాయుధాలు వినియోగించడాకి కూడా వెనకడబోమని గతంలోనే ఆయన హెచ్చరించారు. చదవండి: జీ-7లో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్‌.. ఏంటంటే?

Sakshi Editorial On Chandrababu Andhra Pradesh Politics By Vardhelli Murali
రెడ్‌బుక్‌ రాజ్యాంగం చెల్లదు!

ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్‌పాట్‌ మీకు రోల్‌మోడల్‌గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్‌ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్‌ బుక్‌? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్‌బుక్‌లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్‌బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్‌ పోలింగ్‌కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్‌ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్‌ మార్క్‌ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది. ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్‌ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్‌ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్‌బుక్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్‌ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్‌బుక్‌ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్‌ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌ చేసుకున్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్‌రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్‌బుక్‌ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ బెంగాల్‌లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్‌ స్టేషన్‌లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్‌’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్‌ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్‌’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్‌ డౌన్‌’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్‌ నెంబర్‌వన్‌ బీజేపీ, ఛాంపియన్‌ నెంబర్‌ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలు, మెగా రిచ్‌ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్‌ డౌన్‌ ఎకనామిక్స్‌ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్‌ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్‌ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్‌మెంట్‌ ఎకనామిక్స్‌ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్‌ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్‌బుక్‌తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

డి గ్
Darshan: రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..

బనశంకరి: రేణుకాస్వామి హత్యకేసులో నటుడు, చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడతో పాటు 14 మందికి 5 రోజుల పాటు బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పోలీస్‌ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 19 మందిని అరెస్ట్‌ చేశారు. శనివారం కస్టడీ ముగిశాక కోర్టులో హాజరు పరిచారు. దర్శన్‌, పవిత్రగౌడ, పవన్‌, రాఘవేంద్ర, నందీశ్‌, జగదీశ్‌, అనుకుమార్‌, వినయ్‌, నాగరాజ్‌, లక్ష్మణ, దిలీప్‌, ప్రదోశ్‌ , కేశవమూర్తి అనే వారిని మరింత విచారించాలని, కాబట్టి కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో వారిని విచారణకు తరలించారు. కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ముఖం కనిపించకుండా పవిత్ర కొంగు కప్పుకుంది. జడ్జి ముందు విలపిస్తూ నిలబడింది.ప్రత్యేక న్యాయవాది నియామకంరేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ప్రసన్న కుమార్‌ను సర్కారు నియమించింది.క్షమించమన్నాడు, డబ్బులు ఇచ్చి పంపించమన్నాదొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో దర్శన్‌ పదేపదే చెబుతున్నట్లు తెలిసింది. అయితే తాను, పవిత్రగౌడ కలిసి రేణుకాచార్యను ఉంచిన షెడ్‌కు వెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దర్శన్‌ ఏం చెప్పారంటే... సార్‌.. నాకేం తేలీదు. రేణుకాస్వామిని తీసుకువస్తున్నట్లు నాకు ముందుగా చెప్పలేదు. బ్రూక్‌ రెస్టారెంట్‌లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పవన్‌ వచ్చి రేణుకాస్వామిని పట్టుకు వచ్చామని చెప్పాడు. దీంతో పవిత్రగౌడను తీసుకుని షెడ్‌ వద్దకు వెళ్లాను. క్షమాపణ చెప్పించి వార్నింగ్‌ ఇచ్చి వదిలేద్దామని అనుకున్నాను. పవిత్రను చూడగానే రేణుకాస్వామి తప్పు జరిగింది, క్షమించమని వేడుకున్నాడు. దీంతో అతడికి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఊరికి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి వచ్చేశాను. నేడు షెడ్‌ నుండి బయటకు రాగానే వీళ్లంతా కలిసి రేణుకాస్వామిని కొట్టి హత్య చేశారు. ఇంతకు మించి తనకేం తెలీదని చెబుతున్నాడు. షెడ్‌ వద్దకు దర్శన్‌, పవిత్ర కార్లు రావడం, శవం పడేసిన చోటు కూడా వారి కార్లు తిరిగినట్లు సీసీ కెమెరాల్లో ఉండడం ఇద్దరికీ క్లిష్టంగా మారింది.రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..దొడ్డబళ్లాపురం: డి.బాస్‌ ముఠా ఆగడాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని ఎలా హత్య చేసిందీ పోలీసులు వివరాలు లాగేకొద్దీ కొత్త సంగతులు బయటపడుతున్నాయి. 8వ తేదీ సాయంత్రం రేణుకాస్వామిని షెడ్‌లో బంధించి హింసించిన నిందితులు బిరియాని తెప్పించి మాంసం ముక్కలు నోట్లో కుక్కారు. లింగాయత కులానికి చెందిన రేణుకాస్వామి పూర్తి శాకాహారి. ఆ సంగతి తెలిసి కావాలనే అతనితో చనిపోయే ముందు బిరియాని తినిపించారు. బాస్‌ వస్తారు, ముక్కలు తిని రెడీగా ఉండు, తన్నులు తినడానికి బలం కావాలి కదా.. అంటూ ముఠా సభ్యులు అతన్ని హేళన చేశారు. నిందితుల్లో ఒకడైన దీపక్‌ పోలీసుల విచారణలో ఇదంతా చెప్పాడు.

Happy Father's Day 2024: When Is Father's Day, Significance & History
ఒకప్పుడు నాన్న అంటే హడల్‌..కానీ ఇప్పుడు..!

తండ్రి విలువను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఏటా జూన్‌ మూడో ఆదివారం ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా వాషింగ్టన్‌లో ఓ యువతి ఇందుకు చొరవ చూపింది. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రే అన్నీ అయి ఆరుగురు కూతుళ్లను పెంచి పెద్ద చేశాడు. అందుకే ఈయన పుట్టిన రోజును తండ్రుల దినోత్సవంగా జరిపింది. కాలక్రమంలో 1966లో అధికారికంగా గుర్తింపు లభించింది. చ‌రిత్ర: 1910లో వాషింగ్ట‌న్‌లో ప్రపంచ నాన్నల దినోత్సవం ప్రారంభం అయింది. కాకపోతే 1972 లో తండ్రుల దినోత్సవానికి గుర్తింపు వచ్చింది. పిల్లల కోసం తన జీవితాన్ని ధారపోసే తండ్రుల కోసం సంవత్సరంలో ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఫాదర్స్ డేను ప్రారంభించారు. తల్లులకు గౌరవంగా ప్రపంచ మాతృ దినోత్సవం ఉంది. అయితే.. తల్లులతో పాటు.. పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించి బాధ్యతకు మారుపేరుగా నిలిచే తండ్రికి కూడా ఒక రోజు ఉండాలని యూఎస్‌కు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఈ ప్రచారాన్ని మొదలు పెట్టింది. అలా వాషింగ్ట‌న్‌లో మొదటిసారి 1910లో ప్రపంచ నాన్నల దినోత్సవాన్ని జరిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆ దేశాలన్ని కలిసి జూన్ మూడో ఆదివారాన్ని ప్రపంచ తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. అన్నీ తానై.. ఒకప్పుడు నాన్నంటే పిల్లలకు ఎంతో భయం.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాన్న స్నేహితుడుగా మారిపోయాడు. త్యాగానికి ప్రతిరూపమయ్యాడు. పిల్లల భవిత కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు. నాన్న మనసు మంచుకొండలా మారింది. మారాం చేసినా.. తప్పు చేసినా పాతరోజుల్లో తండ్రి మందలిస్తే నేడు ఆస్థానాన్ని అమ్మకు వదిలేసి తాను మాత్రం ఆప్యాయతనే పంచుతున్నాడు. బిడ్డ ఓటమి పాలైనా భుజాలపై చెయ్యేసి ఊరడించే అమృతమూర్తి.(చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!!)

Society Of The Snow Movie Review In Telugu
Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి

ఓటీటీ వేదికలు సినిమా అభిమానులకు బాగా దగ్గరయ్యాయి. సినిమా బాగుంది అంటే చాలు కొత్త, పాత అనే తారతమ్యం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సర్వైవల్‌ థ్రిల్లర్‌ మూవీ అంటే చాలు.. ఎన్ని పనులున్నా తప్పకుండా చూస్తున్నారు. చరిత్రలో జరిగిన భయంకరమైన సంఘటనను సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకుల కోసం కొందరు మేకర్స్‌ విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చిన హాలీవుడ్‌ చిత్రమే 'సొసైటీ ఆఫ్ ది స్నో'. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. J. A. బయోనా దర్శకత్వం వహించారు. 96వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌లో ఉత్తమ విదేశీ (స్పెయిన్‌) చిత్రంగా ఎంట్రీ దక్కించుకుంది.కథేంటంటే..ప్రకృతి వల్ల ఏర్పడే ప్రమాదాన్ని ఊహించలేం. వాతావరణంలోని మార్పుల వల్ల 1972లో ఫ్లైట్‌-571 ఆండిస్‌ పర్వత శ్రేణుల్లో కూలిపోయింది. అందులో ఉరుగ్వేకు చెందిన 45 మంది సభ్యులతో కూడిన యువ రగ్బీ టీమ్‌ ఉంది. వారందరూ ఉరుగ్వే నుంచి టోర్న‌మెంట్ కోసం చిలీలోని శాంటియాగోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరుగుతుంది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే మృతి చెందితే.. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. కానీ, కొందరు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతుంటారు. చుట్టూ ఎత్తైన మంచు ప‌ర్వ‌తాలు ఉండటం వల్ల మైన‌స్ 20 డిగ్రీల‌కు పైగా చ‌లి ఉంటుంది. వారికి తిన‌డానికి తిండి కూడా దొరకదు. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో వారు ఎలా బయటపడ్డారు..? 45 మందిలో చివ‌ర‌కు ఎంత మంది ప్రాణాల‌తో తిరిగొచ్చారు..? మనుసులే జీవించలేని ఆ మంచుకొండల్లో 72రోజుల పాటు వారు తీసుకున్న ఆహారం ఎంటి..? వారిని ఏవియేషన్‌ సిబ్బంది ఎలా కనిపెట్టారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించే ఈ నిజజీవిత కథను మీరూ చూసేయండి.ఎలా ఉందంటే..సర్వైవల్‌ థ్రిల్లర్స్‌ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్‌ అయిపోతాయి. రీసెంట్‌గా వచ్చిన మంజుమ్మల్‌ బాయ్స్‌ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 'సొసైటీ ఆఫ్ ది స్నో' చిత్రంలో కూడా 45 మంది ప్లేయర్స్‌ రెండు నెలల పాటు మంచు కొండల్లో చిక్కుకుని తీవ్రమైన చలిలో ఎలా బతికారనే కాన్సెప్ట్‌ను చాలా భావోద్వేగభరితంగా చూపించడంలో దర్శకుడు J. A. బయోనా విజయం సాధించాడు. మ‌నిషి బ్ర‌త‌క‌డానికి అవకాశమే లేని అత్యంత క‌ఠినమైన ప‌రిస్థితుల్లో కూడా ఆత్మ‌విశ్వాసం ఉంటే చాలు విజయం సాధించవచ్చు అనే స్ఫూర్తిని సినిమాలో ఆవిష్క‌రించారు. వారిలో ప్రేమ‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అన్ని ఈ క‌థ‌లో అద్భుతంగా తెరకెక్కించాడు. రగ్బీ ఆడుతున్న యువకులతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్తాడు. ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్నా ఒక్కసారి వారందరూ విమానం ఎక్కగానే అసలు కథ మొదలౌతుంది. వెండితెరపై కనిపించిన విమాన ప్రమాదం తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చావుబతుకుల మధ్య వారందరూ పోరాడుతుంటే ప్రేక్షకుల్లో కన్నీరు తెప్పిస్తుంది. ప్రాణాల‌ను నిలుపుకోవ‌డానికి మ‌ర‌ణించిన తమ స్నేహితుల శ‌వాల‌ను తినాల్సిందేనని వారు చర్చించుకునే తీరు, వారిలో కనిపించే తీవ్రమైన భావోద్వేగంతో కన్నీటిసుడులు తిరుగుతాయి. స్నేహితుల ఆహారం కోసం ప్రాణత్యాగం చేసేందుకు కూడా వెనకడుగు వేయరు. అలా 72 రోజుల తర్వాత సైన్యం వారిని కనిపెట్టినప్పుడు వారిలో కనిపించే సంతోషాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా చలించిపోతాడు. ఆ సమయంలో వారి శరీరం కేవలం ఎముకల గూడుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటేసొసైటీ ఆఫ్ స్నో మూవీలో నటించిన వారందరూ కూడా హాలీవుడ్‌ వారే కావడంతో మనకు పెద్దగా వారి పరిచయాలు ఉండవ్‌. కానీ ఈ ఒక్క సినిమా వారిని మనకు దగ్గర చేస్తుంది. ఈ చిత్రంలో చాలా వ‌ర‌కు నూమా అనే పాత్ర అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అతనే హీరో అని చెప్పవచ్చు. ఆయన పాత్ర కూడా చాలా విషాదాంతంగానే ముగిసిపోతుంది. డైరెక్టర్‌ జె.ఎ. బయోనా ఈ చిత్రంలోని మంచు పర్వతాలను తెరపై ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సర్వైవల్‌ థ్రిల్లర్‌గానే కాకుండా భావోద్వేగాలతో గుండెలను బరువెక్కేలా నిర్మించడంలో విజయం సాధించాడు. కథ నెమ్మదిగా సాగుతుంది. కాస్త ఓపికగా చూస్తే మిమ్మల్ని కూడా తప్పకుండా కన్నీళ్లు పెట్టిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ నందు తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Vande Bharat Sleeper Coach Concept Pictures Released
స్లీపర్‌ వందేభారత్‌ ప్రత్యేకతలివే..

త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ రైలు గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ న్యూ జనరేషన్‌ రైలు పూర్తిగా భారత్‌లోనే తయారు కావడం విశేషం. ఇప్పటి వరకు వందేభారత్‌ రైలులో కేవలం చైర్ కార్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు స్లీపర్ వందే భారత్ మరిన్ని సౌకర్యాలతో మనముందుకు రానుంది. ఈ రైలుకు సంబంధించిన కార్యకలాపాలను ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024, ఆగస్టు 15న ఈ రైలు ట్రయల్ రన్ జరగనుంది.తాజాగా స్లీపర్ వందే భారత్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌చేస్తున్నాయి. భారీ గాజు అద్దాల కిటికీలు రైలుకు ప్రీమియమ్ లుక్‌ని ఇస్తున్నాయి. బోగీలోని పైసీటు కాస్త కిందకే ఉంది. దాన్ని ఎక్కడానికి అమర్చిన మెట్లలో గ్యాప్ తక్కువగా ఉంది. అంతేకాకుండా మెట్లపై కుషన్లు కూడా ఏర్పాటు చేశారు. బోగీలో ఒకవైపు మూడు సీట్లు ఉన్నాయి.సీటు రంగు లేత గోధుమ రంగులో ఉంది. ఫ్యాన్సీగా కనిపించే లైట్లను అమర్చారు. ఇది కోచ్‌కు మరింత అందాన్నిచ్చింది. రాబోయే ఐదేళ్లలో 500 వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను పట్టాలపై పరుగులు తీయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement