వివాహేతర సంబంధం: భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య | Wife Caught Her Husband Red-Handed With Another Woman | Sakshi
Sakshi News home page

భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

Published Sun, Jun 16 2024 11:38 AM | Last Updated on Sun, Jun 23 2024 4:07 PM

Wife Caught Her Husband Red-Handed With Another Woman

అంబర్‌పేట: కట్టుకున్న భర్త పరాయి మహిళతో సహజీవనం చేయడాన్ని ఓ భార్య తట్టుకోలేకపోయింది.  ప్రియురాలితో ఉంటున్న భర్త ఇంటి చిరునామా తెలుసుకొని..పిల్లలు, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి  రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని ఇద్దరిని చితకబాదింది. ఈ సంఘటన శనివారం అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీస్‌ల కథనం ప్రకారం..రాంనగర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన మెర్సీతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రవీణ్‌కుమార్‌ జీఎస్‌టీ, ఇన్‌కంటాక్స్‌ కన్సల్‌టెంట్‌ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. 

ఇతని వద్ద పనిచేసే మహిళతో సన్నిహితంగా వ్యవహరించాడు. ఆ మహిళతకు సైతం భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రవీణ్‌ ఆ మహిళతో కలిసి  బాగ్‌ అంబర్‌పేట డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నారు. అప్పటినుంచి భార్య మెర్సీ భర్తతో గొడవ పడుతోంది. ఇతని ప్రవర్తనపై మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా మారకపోవడంతో శనివారం డైరెక్టుగా వారిద్దరు నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లి చితకబాదింది. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ప్రవీణ్‌కుమార్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒకరిపై ఒకరు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు కోర్టు పరిధిలో ఉండడంతో న్యాయ సలహా తీసుకొని కేసు విచారిస్తామని ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement