స్పిరిట్ నుంచి దీపిక తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా?
రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి దీపిక పదుకోన్ తప్పుకోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. పని గంటల విషయం కారణంగానే ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా అసలు కారణం మరొకటంటూ ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.దీపిక రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా నెట్ ప్రాఫిట్లో 10 శాతం వాటా కోరినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు. ఈ డీల్ వర్కవుట్ కాదని భావించిన 'స్పిరిట్' చిత్రబృందం మరో హీరోయిన్ కోసం చూడాలని నిర్ణయించిందట. అదే సమయంలో కథ, పాత్రలకు సంబంధించిన వివరాలు కూడా ఆమె పీఆర్ టీమ్ ద్వారా మీడియాలోకి లీక్ కావడంపై సందీప్ తీవ్రంగా అసంతృప్తికి గురయ్యాడు. దీంతో దీపికను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని ప్రణయ్ పేర్కొన్నారు.ఇక స్పిరిట్‌లో సౌత్ కొరియా స్టార్ హీరో డాన్ లీ నటిస్తున్నారన్న వార్తలకు కూడా చెక్ పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఫ్యాన్స్ హంగామా చూసి ఒక దశలో డాన్ లీ కోసం కాస్త గట్టిగానే ఆలోచించాడట. అయితే హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలో ఆయన పాత్ర సెట్ కాకపోవడంతో ఆ ఆలోచనను సందీప్ రెడ్డి విరమించుకున్నారట. అలాగే చిరంజీవి స్పిరిట్‌లో నటిస్తున్నారన్న ప్రచారం కూడా కేవలం పుకారేనని ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ మాత్రం ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. వాయిస్ టీజర్లో ఆయన స్వరం వినిపించినా సినిమాలో కనిపించరట.
యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. లగ్జరీ కార్ల వేగానికి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న వరుస ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి దుర్మరణం చెందింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజుష్‌పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆగస్టు 16న ఏం జరిగింది? ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయం. మాదాపూర్ ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ అసోసియేట్‌గా పనిచేస్తున్న భారతి ముఖి అనే 26 ఏళ్ల యువతి, తన సహోద్యోగి పూజా అశోక్‌తో కలిసి ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో లంచ్ తీసుకురావడానికి వెళ్లింది.లంచ్ ప్యాకెట్ తీసుకుని తిరిగి మాల్‌లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. ఒక్కసారిగా దూసుకొచ్చిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ 'ఆస్టన్ మార్టిన్' (TG-09-G-0666) అత్యంత వేగంగా భారతిని ఢీకొట్టింది. ఆ ధాటికి భారతి గాల్లోకి ఎగిరి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.లింగమనేని రమేశ్ కుమారుడే నిందితుడుఈ ఘటనపై లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, కారు వివరాలు పరిశీలించిన పోలీసులు.. కారు నడుపుతున్నది జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజుష్ (21) అని గుర్తించారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు తీసినందుకు గాను పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సంజుష్‌కు చట్టపరమైన నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిత్యం ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలతో రద్దీగా ఉండే సైబరాబాద్ ప్రాంతంలో ఇలాంటి సూపర్ లగ్జరీ కార్ల ర్యాష్ డ్రైవింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. బతుకుదెరువు కోసం గ్రామాల నుంచి నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న అమాయకులు ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లకు బలవుతున్నారు.కోట్లలో విలువై చేసే స్పోర్ట్స్ కార్లను నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటించకపోవడం ఎంతటి విషాదాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా, చట్టం ముందు అందరూ సమానమే అని పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా పూర్తి నివేదిక ఏం తేలుస్తుంది అనేది చూడాల్సి ఉంది.మాదాపూర్‌లో విషాదం.. కారు ఢీకొని యువతి మృతి
‘మేం జెన్‌జీలం' అంటూ సైన్యంతో వాగ్వాదం.. చివరకు క్షమాపణలు చెప్పింది
సాక్షి,న్యూఢిల్లీ: ‘అసలేం జరుగుతుందో తెలియదు. కానీ, మేం జెన్‌జీలం.. మీ అరాచకాల్ని సహించం. అవసరమైతే నినదిస్తాం’ అంటూ ఓ యువతి భద్రతా సిబ్బందిని నిలదీసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. అసలు విషయం తెలుసుకున్న సదరు యువతి చివరకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. లడఖ్‌లోని ద్రాస్ ప్రాంతంలో మినిమార్గ్ చెక్‌పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జులై 26న ‘కార్గిల్ విజయ్ దివస్’ ఏర్పాట్లు, వీఐపీల రాకపోకల భద్రతా కారణాల దృష్ట్యా మినిమార్గ్ - జోజిలా - సోనమార్గ్ రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ రోడ్డు మూసివేత కారణంగా లడఖ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న పర్యాటకులు గంటల తరబడి అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. ఎలాంటి సరైన సమాచారం ఇవ్వకుండా, కారణం చెప్పకుండా తమను గంటల తరబడి ఆపడంపై పర్యాటకుల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది.అదే సమయంలో అక్కడే ఉన్న ఒక మంత్రిని వెళ్లనిచ్చి, మిగతా ప్రయాణికులను మాత్రం ఎందుకు ఆపారంటూ 25 ఏళ్ల సదరు యువతి భద్రతా సిబ్బందిని, పోలీసులను నిలదీశారు. అక్కడున్న ఇతర పర్యాటకులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి వీడియో వైరల్ కావడంతో ఆమె మీడియాతో మాట్లాడారు.తన ప్రవర్తనకు చింతిస్తున్నట్లు తెలిపారు.అసహనంతోనే అలా మాట్లాడాను ఆ రోజు ఉదయం మూడు, నాలుగు గంటల పాటు వేచి ఉన్నాము. వీఐపీల రాకపోకల వల్ల దారి మూసివేశారని మాకు తెలియదు. ఇంకా ఎంత సమయం పడుతుందని సైనికులను అడిగినా సరైన సమాచారం రాలేదు. ఆవేశం, అలసట, తీవ్ర అసహనంతోనే నేను ఆ మాటలని మాట్లాడాను. అవి ఎంతమాత్రం సరికావు’అని ఆమె పేర్కొన్నారు. భారత సైన్యాన్ని, భద్రతా బలగాలను నేను ఎంతో గౌరవిస్తాను. నా మాటల వల్ల వారికి బాధ కలుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. సైన్యాన్ని లేదా పోలీసులను అవమానించాలనే ఉద్దేశం గానీ, దీని ద్వారా ప్రఖ్యాతి పొందాలనే ఆలోచన గానీ నాకు ఎప్పుడూ లేదు’అని స్పష్టం చేశారు. తీవ్ర మానసిక ఒత్తిడి నేను కేవలం సాధారణ యువతిని. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇంతలా వైరల్ అవుతుందని, ఇంతటి విమర్శలు వస్తాయని ఊహించలేకపోయాను. దీన్ని ప్రతికూల కోణంలో చూపించడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. దేశ ప్రజలకు, భారత సైన్యానికి, జమ్మూ-కశ్మీర్ పోలీసులకు, లడఖ్ పోలీసులకు, సీఎం ఒమర్ అబ్దుల్లాకు మరోసారి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను’అని ఆమె వెల్లడించారు. ఆ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ‘మేం జెన్‌జీలం’ అనే పదం. దీనిపై స్పందిస్తూ.. ఆ సమయంలో తన చుట్టూ ఉన్న స్థానికులు, పర్యాటకులు రెచ్చగొట్టడం వల్ల అది అప్రయత్నంగానే నోటి నుంచి వచ్చిందని ఆమె వివరించారు. మా వెనుక ఉన్న కొందరు.. 'మీరు పర్యాటకులు కాబట్టి ఇది మీకు కొత్తగా ఉంది. మాకు ఇది రోజూ జరిగేదే' అంటూ మమ్మల్ని రెచ్చగొట్టారు. ఆ ఉద్రిక్త వాతావరణంలో ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలియదు. జెన్‌జీ గురించి ప్రస్తావించి ఎలాంటి ప్రత్యేక ప్రకటన చేయాలనే ఉద్దేశం నాకు లేదు’అని ఆమె తేల్చిచెప్పారు.యువతి మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై జమ్మూ-కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఎక్కడపడితే అక్కడ ‘మేం జెన్‌జీలం’ అని బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదని, ఇది కొత్త రకమైనా దురహంకార ధోరణికి దారితీసే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. This “we are Gen Z” has become the new “jaantay nahin ho mera baap kaun hai”. The quickest way to erode any Gen Z goodwill is to start using it as a threat at the slightest perceived affront. https://t.co/ya5OJTgxIn— Omar Abdullah (@OmarAbdullah) August 19, 2026
ఏపీ డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూ.14.5 లక్షలు బాధితురాలి నుంచి టీడీపీ నేతలు వసూలు చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసం రూ.14.5 లక్షలు వసూలు చేశారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి డీఎస్సీ బాధితురాలు రాధిక ఫిర్యాదు చేశారు. మంత్రి లోకేష్ కోటాలో ఉద్యోగం అంటూ మోసం చేశారని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పరీక్ష లేకుండా నాకు డీఎస్సీ ఉద్యోగం ఇస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలు మెడికొండ జ్యోతి, అడపా భాను ప్రకాష్‌లు డబ్బులు తీసుకున్నారు. ఆ ఉద్యోగం వేరే వ్యక్తికి ఇచ్చి నన్ను మోసం చేశారు. ఆ వ్యక్తి దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశా.. 10 నెలలైనా చర్యలు లేవు. నన్ను చంపుతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు...ఎస్పీ ఆఫీస్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్ట్ ఇస్తామని మోసం చేశారు. నా దగ్గర ఆధారాలున్నా.. నిందితుడిని అరెస్ట్ చేయలేదు. నాకు జరిగిన మోసాన్ని వైఎస్ జగన్‌కు వివరించాను’’ అని రాధిక తెలిపారు.
ఎనిమిదో స్థానంతో హంపి ముగింపు
అనుకున్నది సాధించాం: రమణా రెడ్డి సోమ
అక్టోబరులో కిల్లర్
లివింగ్ బ్యాంకులివి లవ్ డ్రా చేసుకోండి
ఆరోగ్యకరమైన కామెడీ ఉంటుంది: దర్శకుడు చంద్రమోహన్ చింతాడ
తెలుగు రాదు కానీ డబ్బింగ్ చెప్పాను: నక్షత్ర
వరాలతల్లి.. కల్పవల్లి
కథ వినగానే సూర్య అలా అన్నారు!: వెంకీ అట్లూరి
‘భోగి’ సినిమా రిలీజ్ వాయిదా
బంగారం రుణాల్లోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్
ఎన్నో సంస్కరణలు, అద్భుతాలు సృష్టించారు.. మీ టాలెంట్‌తో కరువు కనబడకుండా చేయండి సార్!
‘ఓహో..నీకు పీరియడ్స్ సమయమా’ అని చులకనగా చూసేవాడు: అనుపమ
ఇంత వరకూ ఆయన తప్ప ఎవరూ మెచ్చుకోలేదట... కృతజ్ఞతగానట!!
పగటి కలలు కనొద్దు.. రాందేవ్‌కు కంగనా ఘాటు కౌంటర్
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
మరో 79 పరుగులు చేస్తే రూట్ ప్రపంచ రికార్డు
యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు
‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’
మద్యం సేవిస్తే బైక్ స్టార్ట్ కాదు.. బైక్‌కు కొత్త సిస్టమ్
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా
అందుకే.. అప్పు చేసి ఆస్తులు కొంటున్న కియోసాకి!
'బాబు' అనే పిలుపే హంతకులను పట్టించింది!
పవిత్రగౌడ మాజీ భర్త మృతి!
లంకపై విజయం.. గంభీర్ ప్లాన్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్!
విజయ్-త్రిష బంధంపై నటి సంజన కీలక వ్యాఖ్యలు
ఆ ఒక్క కారణం వల్లే మా ఆయన దూరమయ్యారు: మీనా
బాబు, లోకేశ్‌కు వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్
ముందుచూపే ఇరాన్‌ను బతికించిందా?.. ఇక మీదట ఎలా?
ఎనిమిదో స్థానంతో హంపి ముగింపు
అనుకున్నది సాధించాం: రమణా రెడ్డి సోమ
అక్టోబరులో కిల్లర్
లివింగ్ బ్యాంకులివి లవ్ డ్రా చేసుకోండి
ఆరోగ్యకరమైన కామెడీ ఉంటుంది: దర్శకుడు చంద్రమోహన్ చింతాడ
తెలుగు రాదు కానీ డబ్బింగ్ చెప్పాను: నక్షత్ర
వరాలతల్లి.. కల్పవల్లి
కథ వినగానే సూర్య అలా అన్నారు!: వెంకీ అట్లూరి
‘భోగి’ సినిమా రిలీజ్ వాయిదా
బంగారం రుణాల్లోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్
ఎన్నో సంస్కరణలు, అద్భుతాలు సృష్టించారు.. మీ టాలెంట్‌తో కరువు కనబడకుండా చేయండి సార్!
‘ఓహో..నీకు పీరియడ్స్ సమయమా’ అని చులకనగా చూసేవాడు: అనుపమ
ఇంత వరకూ ఆయన తప్ప ఎవరూ మెచ్చుకోలేదట... కృతజ్ఞతగానట!!
పగటి కలలు కనొద్దు.. రాందేవ్‌కు కంగనా ఘాటు కౌంటర్
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
మరో 79 పరుగులు చేస్తే రూట్ ప్రపంచ రికార్డు
యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు
‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’
మద్యం సేవిస్తే బైక్ స్టార్ట్ కాదు.. బైక్‌కు కొత్త సిస్టమ్
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా
అందుకే.. అప్పు చేసి ఆస్తులు కొంటున్న కియోసాకి!
'బాబు' అనే పిలుపే హంతకులను పట్టించింది!
పవిత్రగౌడ మాజీ భర్త మృతి!
లంకపై విజయం.. గంభీర్ ప్లాన్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్!
విజయ్-త్రిష బంధంపై నటి సంజన కీలక వ్యాఖ్యలు
ఆ ఒక్క కారణం వల్లే మా ఆయన దూరమయ్యారు: మీనా
బాబు, లోకేశ్‌కు వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్
ముందుచూపే ఇరాన్‌ను బతికించిందా?.. ఇక మీదట ఎలా?
ఫొటోలు
స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)
చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)
చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)
విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)
నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్
'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)
మరమనుషుల కేరింతలు.. అబ్బురపరుస్తున్న వింత రోబోలు! (ఫొటోలు)
బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్
'మోడ్రన్ మిస్మమ్మ' మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోలు)
కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సినిమా
స్పిరిట్ నుంచి దీపిక తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా?
రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి దీపిక పదుకోన్ తప్పుకోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. పని గంటల విషయం కారణంగానే ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా అసలు కారణం మరొకటంటూ ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.దీపిక రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా నెట్ ప్రాఫిట్లో 10 శాతం వాటా కోరినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు. ఈ డీల్ వర్కవుట్ కాదని భావించిన 'స్పిరిట్' చిత్రబృందం మరో హీరోయిన్ కోసం చూడాలని నిర్ణయించిందట. అదే సమయంలో కథ, పాత్రలకు సంబంధించిన వివరాలు కూడా ఆమె పీఆర్ టీమ్ ద్వారా మీడియాలోకి లీక్ కావడంపై సందీప్ తీవ్రంగా అసంతృప్తికి గురయ్యాడు. దీంతో దీపికను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని ప్రణయ్ పేర్కొన్నారు.ఇక స్పిరిట్‌లో సౌత్ కొరియా స్టార్ హీరో డాన్ లీ నటిస్తున్నారన్న వార్తలకు కూడా చెక్ పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఫ్యాన్స్ హంగామా చూసి ఒక దశలో డాన్ లీ కోసం కాస్త గట్టిగానే ఆలోచించాడట. అయితే హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలో ఆయన పాత్ర సెట్ కాకపోవడంతో ఆ ఆలోచనను సందీప్ రెడ్డి విరమించుకున్నారట. అలాగే చిరంజీవి స్పిరిట్‌లో నటిస్తున్నారన్న ప్రచారం కూడా కేవలం పుకారేనని ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ మాత్రం ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. వాయిస్ టీజర్లో ఆయన స్వరం వినిపించినా సినిమాలో కనిపించరట.
ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈసారి థియేటర్లలో రవితేజ హీరోగా నటించిన ఇరుముడి రిలీజ్ కానుంది. దీనిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది. తండ్రి కూతురు నేపథ్యానికి అయ్యప్ప స్వామి మాల, 41 రోజుల దీక్ష అనే పాయింట్ జోడించి దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీతో పాటు అమీర్ లోగ్, ద రెడ్ బ్యాగ్ అనే చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం పెద్దఎత్తున సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ ఫ్రైడే చెన్నై లవ్ స్టోరీ, జన నాయగన్ మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.(ఇది చదవండి: బేబీ జంట మూవీ.. క్రేజీ సాంగ్ రిలీజ్)నెట్‌ఫ్లిక్స్ ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 21 ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21 ఐ స్వేర్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 22జీ5 జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 21 ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ మూవీ) - ఆగస్టు 21జియో హాట్‌స్టార్ వెల్కమ్ టూ ద జంగిల్ (హిందీ సినిమా) - ఆగస్టు 21సోనీ లివ్ చెన్నై లవ్ స్టోరీ (తెలుగు సినిమా) - ఆగస్టు 21అమెజాన్ ప్రైమ్ క్లీనప్ కంపెనీ (హిందీ సిరీస్) - ఆగస్టు 21లయన్స్ గేట్ ప్లే స్నేక్స్ 5 (చైనీస్ మూవీ) - ఆగస్టు 21 మాంచెస్టర్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21 స్టిల్ వాటర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21ఆపిల్ టీవీ ప్లస్..అట్లాస్కింగ్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 21హెచ్‌బీవో మ్యాక్స్..మదర్మేరీ(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 21
32 ఏళ్ల పాత చీరలో నివేదా.. పూసల చీరలో నిధి
32 ఏళ్ల పాత కాంచీవరం చీరలో నివేదా థామస్పూసల చీరలో అందంగా నిధి అగర్వాల్కొంటెచూపుతో క్యూట్ లుక్స్‌లో అనన్య నాగళ్లనైట్ గౌనులో గ్లామర్ చూపిస్తున్న దివిస్విమ్మింగ్ పూల్‌లో అందాలతో దివ్య భారతినాభి అందాలతో మాయ చేస్తున్న రాశీ సింగ్ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial)
ఆ ఒక్క కారణం వల్లే మా ఆయన దూరమయ్యారు: మీనా
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో మీనా ముందు వరుసలో ఉంటుంది. సౌత్ స్టార్ హీరోలైనా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, చిరంజీవి, వెంకటేశ్, మోహన్‌లాల్, మమ్ముట్టిల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసింది. తెలుగులో తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ సొంతం చేసుకుంది.అయితే కొన్నేళ్ల క్రితం ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కొంతకాలం పాటు తీవ్రమైన డిప్రెషన్లో ఉంది. ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె.. తన భర్త మరణానికి గల కారణాలను వివరించింది. ఆ ఓక్క కారణం వల్లే విద్యాసాగర్‌ను కాపాడుకోలేకపోయానని తెలిపింది.( ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)మా ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైందని మీనా వెల్లడించింది. ఆ సమయంలో డోనర్ దొరకలేదని తెలిపింది. ఇందులో ఉండే మెడికల్ ప్రాసెస్ చూసి నేనే చాలా ఆశ్చర్యపోయా.. చాలా రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగడంతో మా ఆయన ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. లంగ్స్ కోసం చాలా ప్రయత్నాలు చేశానని..కానీ దాతలు దొరక్కపోవడంతో అమెరికా వెళ్లేందుకు ట్రై చేశానని తెలిపింది. కానీ ఇలాంటి సమయంలో అమెరికా తరలించడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారని గుర్తు చేసుకుంది. ఆయనను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా దురదృష్టవశాత్తూ మాకు దూరమయ్యారని వెల్లడించింది. నా భర్త మరణించాక కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నానని.. అయితే నా ఫ్రెండ్స్, సినిమాలతో ఈ విషాదం నుంచి కోలుకుంటున్నట్లు మీనా చెప్పుకొచ్చింది.
క్రీడలు
‘నాకు నేనే పోటీ’
ముంబై: భారత షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్ ఇటీవల అద్భుత ప్రదర్శనతో వరుస విజయాలు అందుకుంది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ ప్రపంచ కప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో పాటు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కూడా చేరుకుంది. మ్యూనిక్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఆమె భారత్‌కే చెందిన ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం సాధించింది. ‘నేను ఏ ఈవెంట్లో బరిలోకి దిగినా ఎవరినో ఓడించడానికి కాకుండా నాకు నేనే పోటీగా భావిస్తా. నేను తలపడే క్రీడాంశంలో ముఖాముఖీ పోరు ఉండదు. కాబట్టి నా ఆటపై దృష్టి పెడితే సరిపోతుంది. నా ప్రదర్శనను మెరుగుపర్చుకోవడం కోసమే శ్రమిస్తా. గత ఏడాది కాలంగా చాలా మంది ఫలితాలు రావడం సంతోషంగా ఉంది. నా శిక్షణలో నేను పడిన కష్టమంతా ఫలితాల రూపంలో కనిపిస్తోంది. నేను నేర్చుకున్న దానిని సమర్థంగా వాడుకోవడంతోనే విజయాలు దక్కుతున్నాయి’ అని ఇషా సింగ్ వ్యాఖ్యానించింది. త్వరలో జరిగే ఆసియా క్రీడలకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇటీవలి ప్రదర్శన పట్ల తనలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందని కూడా ఇషా చెప్పింది. ‘ప్రస్తుతం నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో పోటీ పడగలగుతున్నా. తాజా విజయాలు నాలో ఈ నమ్మకాన్ని పెంచాయి. కేవలం పతకాలు గెలవడం మాత్రమే కాదు మొత్తంగా నా ప్రదర్శన కూడా సంతృప్తినిచ్చింది. ఆసియా క్రీడల్లోనూ దీనిని కొనసాగిస్తా’ అని ఆమె పేర్కొంది. మను భాకర్ సహా ఇతర భారత షూటర్లందరితో తనకు స్నేహం ఉందని, అందరి మధ్య బంధం బాగుంటుందున్న ఇషా... షూటింగ్ క్రీడ స్వభావం కారణంగా సాంకేతిక అంశాల గురించి తాము ఎప్పుడూ చర్చించుకోమని స్పష్టం చేసింది. తన శిక్షణా పద్ధతుల్లో ప్రత్యేకంగా ఎలాంటి మార్పులు చేయలేదని, అయితే ఇంత అనుభవం తర్వాత కూడా ప్రాధమిక అంశాల్లో కొన్ని లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని ఇషా వెల్లడించింది.అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున మరిన్ని పతకాలు గెలవడమే తన లక్ష్యమని ఈ తెలంగాణ షూటర్ పేర్కొంది. ఒక ప్లేయర్‌గా తాను పోటీ పడే ప్రతీ టోర్నీలో గెలవాలనే అంతా భావిస్తారని, అయితే కొన్ని సార్లు ఇది సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి అనూహ్య పరాజయాలు ఎదురైన సమయంలో ‘లెగో’ ఆడి సేదతీరుతానని, ఆ బ్లాగ్స్‌ను పేర్చడం ద్వారా తాను ఎంతో నేర్చుకుంటానని ఇషా సింగ్ వివరించింది.
ఎనిమిదో స్థానంతో హంపి ముగింపు
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ మహిళల అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌ను మాజీ చాంపియన్, భారత నంబర్‌వన్ కోనేరు హంపి ఎనిమిదో స్థానంతో ముగించింది. హంపి ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో ఓడిపోయి 3.5 పాయింట్లు సాధించింది. ప్రపంచకప్ విజేత, భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ 4.5 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. దివ్య రెండు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓడిపోయింది. క్యాండిడేట్స్ టోర్నీ విజేత, మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్ చాలెంజర్, భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలికి ఈ టోర్నీ నిరాశను మిగిల్చింది. వైశాలి 2.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానాన్ని దక్కించుకుంది. వైశాలి ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడిపోయింది. పది మంది ప్లేయర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో చైనా గ్రాండ్‌మాస్టర్ టాన్ జోంగి 6.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. అలైస్ లీ (అమెరికా; 6 పాయింట్లు) రన్నరప్‌గా నిలువగా... బిబిసారా అసబయేవా (కజకిస్తాన్; 5 పాయింట్లు) మూడో స్థానాన్ని సంపాదించింది.
ఐపీఎల్లో అత్యధిక వేతనం తీసుకుంటున్న కోచ్‌లు వీరే
ప్రపంచ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు సారిపాటి మరొకటి లేదు. ఐర్లాండ్ వంటి అసోసియేట్ జట్టు నుంచి ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టు వరకు ప్రతీ ఒక్క ఆటగాడు ఐపీఎల్లో భాగమవ్వాలని కలలు కంటుంటాడు. అందుకు తగ్గట్టే ఈ క్యాష్ రీచ్ లీగ్ ఆటగాళ్లపై కాసులు వర్షం కురిపిస్తోంది. కేవలం ప్లేయర్లకే కాదు కోచ్‌లకు కూడా కామధేనువులా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో అత్యధిక పారితోషం అందుకుంటున్న హెడ్కోచ్లపై ఓ లుకేద్దాం.క్రిక్‌బ్లాగర్ రిపోర్ట్ ప్రకారం.. ఐపీఎల్లో అత్యధిక వేతనం అందుకుంటున్న హెడ్‌కోచ్‌ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం, పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ (రూ. 9.5 కోట్లు), ఆశిష్ నెహ్రా(రూ. 9.5 కోట్లు) సంయుక్తంగా అగ్రస్దానంలో ఉన్నారు. నెహ్రా గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఆ తర్వాత స్ధానంలో సీఎస్కే మాజీ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్(రూ. 7.5 కోట్లు) ఉన్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2027 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా భారత లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అందుకోసం అతడికి ఢిల్లీ ఫ్రాంచైజీ రూ. 6 కోట్లు పారితోషం చెల్లించనున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్లో అత్యధిక వేతనం అందుకున్న కోచ్‌ల వివరాలు:రికీ పాంటింగ్ (పంజాబ్ కింగ్స్)-రూ. 9.5 కోట్లుఆశిష్ నెహ్రా (గుజరాత్ టైటాన్స్)-రూ. 9.5 స్టీఫెన్ ఫ్లెమింగ్(చెన్నై సూపర్ కింగ్స్)- రూ. 7.5యువరాజ్ సింగ్(ఢిల్లీ క్యాపిటల్స్-రిపోర్ట్స్)- రూ. 6.0 కోట్లుజహీర్ ఖాన్(లక్నో సూపర్ జెయింట్స)- రూ. 5.0 కోట్లురాహుల్ ద్రవిడ్(రాజస్తాన్ రాయల్స్)- రూ. 4.5 కోట్లుఆండీ ఫ్లవర్(ఆర్సీబీ)-రూ. 4.5 కోట్లుజస్టిన్ లాంగర్(లక్నో)-రూ.4.5 కోట్లు)
ముగిసిన పీవీ సింధు పోరాటం.. ప్రీక్వార్టర్స్‌లో ఓటమి
ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్-2026లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో చైనాకు చెందిన వాంగ్ జీ యీ చేతిలో 11-21, 21-15, 17-21తో సింధు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో వాంగ్ జీ యీ తీవ్ర గాయంతో బాధపడుతున్నప్పటికీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. తొలి గేమ్‌ను 11-21తో సింధు కోల్పోయింది. కానీ రెండో గేమ్‌లో తిరిగి పుంజుకున్న సింధు.. 21-15తో గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. అయితే మూడో గేమ్‌ను 21-17తో కైవసం చేసుకోవడంతో సింధు కథ ముగిసింది. మరోవైపు ఆయుష్ శెట్టి కూడా పురుషుల సింగిల్స్ రౌండ్-16 మ్యాచ్‌లో ఇండోనేషియా షట్లర్ అల్వీ ఫర్హాన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
న్యూస్ పాడ్‌కాస్ట్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్‌లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
బిజినెస్
భారీగా షేర్లు అమ్మేసిన పేటీఎమ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ‘పేటీఎమ్’ మాతృ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్’లో విదేశీ, దేశీయ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు భారీగా వాటాలను కొనుగోలు చేశాయి. గోల్డ్‌మెన్ శాక్స్, బీఎన్పీ పారిబాస్, సొసైటీ జెనరల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు పలు భారతీయ మ్యూచువల్ ఫండ్ దిగ్గజాలు ఓపెన్ మార్కెట్ ‘బ్లాక్ డీల్’ ద్వారా సుమారు రూ.2,949 కోట్ల విలువైన 3 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) బ్లాక్ డీల్ సమాచారం ప్రకారం.. ఈ సంస్థలు సగటున ఒక్కో షేరుకు రూ.1,535.10 చొప్పున మొత్తం 1,92,10,110 ఈక్విటీ షేర్లను (3% వాటాకు సమానం) కొనుగోలు చేశాయి. పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందిన ‘రెసిలెంట్ అసెట్ మేనేజ్మెంట్’ ఈ 3% వాటాను విక్రయించింది. వాటా కొనుగోలు చేసిన ప్రధాన సంస్థలు: కొనుగోళ్లు చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో సంస్థలో గోల్డ్‌మెన్ శాక్స్, బీఎన్పీ పారిబాస్, సొసైటీ జెనరల్, ఘిసాల్లో క్యాపిటల్, ఆక్స్బో క్యాపిటల్, నార్త్ రాక్ క్యాపిటల్, విరిడియన్ అసెట్ మేనేజ్మెంట్, విక్టోరియా ఫండ్–ఓసీ, ఇంటెగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్ (ఆసియా) ఉన్నాయి. అలాగే ఎస్బీఐ ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, కొటక్ మహీంద్రా ఎంఎఫ్, హెచ్ఎస్బీసీ ఎంఎఫ్, సుందరం ఎంఎఫ్, టాటా ఎంఎఫ్ తదితర దేశీయ మ్యూచువల్ ఫండ్లున్నాయి. వీటితో పాటు బీమా రంగానికి చెందిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలున్నాయి.
జస్ట్ రూ.500 ఖర్చుతో ఎగిరిన విమానం!
విమాన ప్రయాణం అంటే భారీ ఇంధన వ్యయంతో కూడుకున్న వ్యవహారమనే భావన చాలా మందికి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా, అమెరికాలో జరిగిన ఓ ప్రయోగాత్మక విమాన ప్రయాణం భవిష్యత్ ఎలక్ట్రిక్ ఏవియేషన్‌పై ఆసక్తిని పెంచుతోంది. అమెరికాకు చెందిన హార్ట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన X1 బ్యాటరీ-ఎలక్ట్రిక్ విమానం ఈ నెల 12న తొలిసారి గాల్లోకి ఎగిరింది. 27 నిమిషాల ఈ పరీక్షా ప్రయాణానికి సుమారు 5 డాలర్లు (రూ.500 లోపే) విలువైన విద్యుత్ మాత్రమే వినియోగించినట్లు కంపెనీ వెల్లడించింది.1,100 అడుగుల ఎత్తుకు..న్యూయార్క్‌లోని ప్లాట్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన X1.. 27 నిమిషాల పాటు ప్రయాణించింది. ఈ సమయంలో 1,100 అడుగుల (సుమారు 335 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. ఒక పైలట్‌తో నిర్వహించిన ఈ పరీక్షలో ప్రయాణికులను ఎవరినీ తీసుకెళ్లలేదు. టేకాఫ్, పైకి ఎగరడం, మలుపులు, ల్యాండింగ్ వంటి దశలను పరీక్షించారు. విమానం పూర్తిగా బ్యాటరీలతో నడిచింది. దీని ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థ ఒక మెగావాట్‌కు పైగా శక్తిని అందించింది.చిన్న విమానం కాదు..X1ను సాధారణ చిన్న ప్రయోగాత్మక విమానంగా భావించడానికి వీల్లేదు. దీని రెక్కల వెడల్పు 106 అడుగులు (32.3 మీటర్లు), పొడవు 76 అడుగులు (23.2 మీటర్లు). టేకాఫ్ సమయంలో దీని బరువు 25,000 పౌండ్లకు పైగా అంటే సుమారు 11.3 టన్నులు. ఈ పరిమాణంతో X1 ఇప్పటివరకు గాల్లోకి ఎగిరిన అతిపెద్ద బ్యాటరీ-ఎలక్ట్రిక్ విమానంగా హార్ట్ ఏరోస్పేస్ పేర్కొంది.టికెట్ కూడా అంత చౌకేనా?ఇక్కడ రూ.500 ఖర్చుతోనే విమానం ప్రయాణించింది అంటే ఆ మొత్తం కేవలం 27 నిమిషాల పరీక్షా ప్రయాణంలో వినియోగించిన విద్యుత్ విలువ మాత్రమే. పైలట్ జీతం, నిర్వహణ, బీమా, విమానాశ్రయ రుసుములు, విమానం కొనుగోలు లేదా ఫైనాన్సింగ్ ఖర్చులు, బ్యాటరీల తయారీ, వాటి క్షీణత వంటి వ్యయాలు ఇందులో లేవు. అందువల్ల భవిష్యత్తులో విమాన టికెట్ రూ.500కు లభిస్తుందని దీన్ని బట్టి చెప్పలేం. అయితే విమానాన్ని నడిపే ఇంధన వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఎలక్ట్రిక్ విమానాల ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.అసలు లక్ష్యం 30 సీట్ల హైబ్రిడ్ విమానంX1ను కేవలం రికార్డు కోసం రూపొందించలేదు. హార్ట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న ES-30 అనే 30 సీట్ల హైబ్రిడ్-ఎలక్ట్రిక్ ప్రాంతీయ విమానానికి అవసరమైన సాంకేతికతలను పరీక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. ES-30కు 2031లో సేవల్లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం, ES-30 పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో సుమారు 200 కిలోమీటర్లు, హైబ్రిడ్ మోడ్‌లో గరిష్ఠంగా 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. సుమారు 30 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తి చేసే లక్ష్యమూ ఉంది.నిర్వహణ ఖర్చులు 40 శాతానికి పైగా తగ్గుతాయటసాంప్రదాయ ప్రాంతీయ విమానాలతో పోలిస్తే ES-30 నిర్వహణ వ్యయం 40 శాతానికి పైగా తగ్గవచ్చని హార్ట్ ఏరోస్పేస్ అంచనా వేస్తోంది. తక్కువ విద్యుత్ వ్యయం, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలో తక్కువ కదిలే భాగాలు, సరళమైన నిర్వహణ, విమానం ఎక్కువ సమయం అందుబాటులో ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని చెబుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ కెనడా, జేఎస్ఎక్స్ వంటి సంస్థలు ES-30పై ఇప్పటికే ఆసక్తి లేదా కమిట్మెంట్లు వ్యక్తం చేశాయి.మరి చౌక విమాన ప్రయాణం ఎప్పుడు?ఎలక్ట్రిక్ విమానాలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గే అవకాశం లేదు. టికెట్ ధరలో ఇంధనం లేదా విద్యుత్ ఖర్చుతో పాటు సిబ్బంది, విమానాశ్రయ రుసుములు, పన్నులు, నిర్వహణ, విమాన కొనుగోలు వ్యయం, మార్గంలో డిమాండ్ వంటి అనేక అంశాలు ఉంటాయి. అయితే సాంకేతికత ఆశించిన స్థాయికి చేరుకుంటే తక్కువ దూరం, ప్రాంతీయ మార్గాల్లో ప్రయాణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న విమానాలను తక్కువ ఇంధన ఖర్చుతో నడపగలిగితే ప్రస్తుతం ఆర్థికంగా అనుకూలంగా లేని కొన్ని ప్రాంతీయ మార్గాలను తిరిగి ప్రారంభించేందుకు విమానయాన సంస్థలకు అవకాశం లభించవచ్చు.ఇదీ చదవండి: భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరం..
భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరం..
దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎకోసిస్టమ్ వృద్ధికి బడా టెక్ సంస్థల ఆధిపత్య ధోరణి కంటే నిపుణుల కొరత, డేటా ప్రామాణీకరణ లోపించడం అనేవి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. ‘భారతదేశ ఏఐ ఎకోసిస్టమ్‌లో పోటీతత్వం, నవకల్పనలు, మార్కెట్ స్వరూపం’ పేరుతో ది డైలాగ్ అనే సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దేశంలో ఏఐ రంగం వేగవంతమైన అభివృద్ధి, విస్తరణ దశలో ఉంది, అయితే, తగినంత మంది ప్రతిభావంతులు లేకపోవడం, డేటా వినియోగంలో లోటుపాట్లు కీలక సమస్యలని పేర్కొంది. స్టార్టప్‌లు, బిజినెస్ యూజర్లు, వినియోగదారుల్లో 308 మందిని ఈ అధ్యయనంలో భాగంగా సర్వే చేశారు.ముఖ్యాంశాలివీ...నైపుణ్యగం గల సిబ్బంది లభ్యత భవిష్యత్తు పోటీతత్వానికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని అని సర్వేలో పాల్గొన్న వారిలో 47.2 శాతం గుర్తించారు. అదేవిధంగా కస్టమర్లు ఏఐ సేవలను అందిపుచ్చుకోవడం కూడా అంతే స్థాయిలో కీలక సవాలుగా పేర్కొన్నారు.భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరంతో పాటు ఏఐ వ్యవస్థలను రూపొందించడం, శిక్షణ ఇవ్వడం, అమలు చేయడం, దాన్ని విస్తరించడానికి ప్రత్యేక నైపుణ్యలు కావాలని ది డైలాగ్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ భూమిక అగర్వాల్ పేర్కొన్నారు.ఏఐ అభివృద్ధిలో డేటా వినియోగం మరో పెద్ద సమస్యగా ఉంది. డేటా కొరత కంటే వినియోగంలో ఒకే విధమైన ప్రమాణాలు లేకపోవడం ప్రధాన ఇబ్బంది అని 63.2 శాతం మంది ఏఐ డెవలపర్లు అభిప్రాయపడ్డారు. కాపీరైట్ సమస్యలను 44 శాతం మంది, డేటా కొరతను 42 శాతం మంది సవాలుగా చెప్పారు. ప్రభుత్వ అ«దీనంలోని డేటాసెట్స్ సులభంగా అందుబాటులో ఉన్నాయని కేవలం 15 శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం.భారత్‌లోని ఏఐ స్టార్టప్‌లు, డెవలపర్లు ఓపెన్ సోర్స్ మోడళ్లు, టూల్స్‌పై కొంతమేర ఆధారపడుతున్నట్లు 96.2 శాతం మంది చెప్పారు. 62.3 శాతం మంది వాటిపై అధికంగా ఆధారపడుతున్నామని వెల్లడించారు.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’!
స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’!
దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తన షేర్లను సొంత ప్లాట్‌ఫామ్‌పై ట్రేడింగ్‌కు అనుమతించే మార్గాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈ పబ్లిక్ మార్కెట్లో లిస్టయిన సంస్థ కాదు. ప్రతిపాదిత ఐపీవో ద్వారా షేర్లను బీఎస్ఈలో లిస్ట్ చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఈలో ప్రాథమిక లిస్టింగ్ కొనసాగిస్తూ, ఎన్ఎస్ఈలోనూ షేర్ల ట్రేడింగ్‌కు అనుమతి పొందేందుకు ‘పర్మిటెడ్ టు ట్రేడ్’ (PTT) మార్గాన్ని ఉపయోగించాలని ఎన్ఎస్ఈ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ ప్రాఫిట్ వెల్లడించింది.ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఒక స్టాక్ ఎక్స్ఛేంజ్ తన సొంత ప్లాట్ఫామ్లోనే తన షేర్లను స్వయంగా లిస్ట్ చేసుకోవడం సాధ్యం కాదు. అందువల్ల ఎన్ఎస్ఈ తన షేర్లను సొంత మార్కెట్లో ట్రేడింగ్‌కు తీసుకురావాలంటే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) అనుమతి తప్పనిసరి. ఇదే అంశంపై ఎన్ఎస్ఈ ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.పీటీటీ మార్గం ఎలా పనిచేస్తుంది?ఎన్ఎస్ఈ గత మే 7న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఒక కంపెనీ మరో స్టాక్ ఎక్స్ఛేంజ్లో ప్రాథమికంగా లిస్టయి ఉంటే, దాని సెక్యూరిటీలను ఎన్ఎస్ఈలో ‘పర్మిటెడ్ టు ట్రేడ్’ కేటగిరీలో ట్రేడింగ్‌కు అనుమతించవచ్చు. అంటే ఆ కంపెనీ ఎన్ఎస్ఈలో ప్రత్యేకంగా లిస్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ ట్రేడింగ్ సదుపాయం పొందుతుంది.పీటీటీ కేటగిరీలోకి వచ్చిన కంపెనీకి ఎన్ఎస్ఈతో ప్రత్యేక లిస్టింగ్ ఒప్పందం అవసరం ఉండదు. అలాగే ప్రాథమిక లిస్టింగ్ ఎక్స్ఛేంజ్కు సమర్పించే ప్రస్తుత వెల్లడింపులే ప్రధానంగా వర్తిస్తాయి. అయితే ఎన్ఎస్ఈలో జరిగే ట్రేడింగ్ మాత్రం ఎక్స్ఛేంజ్ నిఘా, పర్యవేక్షణ నిబంధనలకు లోబడి ఉంటుంది.ఎన్ఎస్ఈ ఐపీవోకు ఇది ఎందుకు కీలకం?ఎన్ఎస్ఈ ఐపీవో ప్రక్రియ ఇప్పటికే కీలక దశకు చేరుకుంది. ఎన్ఎస్ఈ అధికారిక ఆఫర్ డాక్యుమెంట్ల ప్రకారం.. జూన్ 17, 2026న డీఆర్‌హెచ్‌పీ దాఖలైంది. ఆ తర్వాత ఆగస్టు 10న దానికి యాడెండమ్ కూడా జత చేశారు. ఐపీవోలో ఎన్ఎస్ఈ ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనుంది.ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈ షేర్లు బీఎస్ఈలో లిస్ట్ అయిన తర్వాత ఎన్ఎస్ఈ ప్లాట్‌ఫామ్‌పైనా ట్రేడింగ్‌కు అందుబాటులోకి వస్తే, పెట్టుబడిదారులకు మరో ట్రేడింగ్ వేదిక లభిస్తుంది. అదే సమయంలో ఎన్ఎస్ఈ సొంత షేర్లపై మార్కెట్ పర్యవేక్షణ, ధర నిర్ణయం, నియంత్రణ వంటి అంశాల్లో అదనపు జాగ్రత్తలు అవసరమవుతాయి.ఇప్పటికే ఎన్ఎస్ఈ పీటీటీ విధానాన్ని ఇతర లిస్టెడ్ కంపెనీలకు అందిస్తోంది. ఈ విధానం కింద ప్రాథమికంగా మరో ఎక్స్ఛేంజ్లో లిస్టయిన సంస్థలకు ఎన్ఎస్ఈలో అదనపు ట్రేడింగ్ వేదిక లభిస్తుంది. అందువల్ల ఎన్ఎస్ఈ తనకూ ఇదే వ్యవస్థను వర్తింపజేయాలని ప్రయత్నిస్తే, తుది నిర్ణయం మాత్రం సెబీ అనుమతిపైనే ఆధారపడి ఉంటుంది.ఎన్ఎస్ఈ అధికారిక షేర్‌హోల్డింగ్ వివరాల ప్రకారం.. 2026 ఆగస్టు 4 నాటికి ట్రేడింగ్ మెంబర్లు, వారి అనుబంధ సంస్థలు, ఏజెంట్ల మొత్తం వాటా 35.17 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే, బీఎస్ఈలో ప్రాథమిక లిస్టింగ్.. ఎన్ఎస్ఈలో పీటీటీ ద్వారా ట్రేడింగ్ అనే నిర్మాణం అమలైతే, భారత స్టాక్ మార్కెట్లో ఒక ఆసక్తికరమైన కొత్త విధానానికి తెరలేచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: వరుస నష్టాలకు బ్రేక్.. రయ్‌మన్న రియాల్టీ షేర్లు
ఫ్యామిలీ
కేరళ గుడిలో విదేశీ ఎంపీతో మళ్లీ వివాహం!
ప్రేమకు సరిహద్దులు లేవని ఈ జంట కారణంగా మరోసారి నిరూపితమైంది. ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు గానీ దాన్ని గెలిపించుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు, ఎంత కాలమైన నిరీక్షిస్తారు. అచ్చం అలానే ఈ స్కాటిష్ ఎంపీ పదేళ్లు నిరీక్షించి మరీ కేరళ మహిళను పెళ్లాడాడు స్కాటిష్ రాజకీయ నాయకుడు. దేశం దాటిన ఈ దంపతుల ప్రేమ కథ ఏంటో చూద్దామా..!స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) రాజకీయ నాయకుడు , పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే కేరళకు చెందిన నిధిన్ చంద్‌ను అక్కడ ప్రఖ్యాత గాంచిన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఎర్నాకులం జిల్లాలోని పిరవంకు చెందిన నిధిన్ చిరకాల కోరిక ఇన్నేళ్లకు నెరవేరిందట. ఈ వివాహ వేడుక మంగళవారం నాడు గురువాయూర్ దేవాలయ ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను మార్టిన్ డే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. పదేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదు..నిజానికి ఈ జంట 2016లోనే యూకేలో వివాహం చేసుకున్నారు. కానీ నిధిన్ చాలా కాలంగా గురువాయుర్‌లో తన వివాహతంతుని పూర్తి చేయాలని కోరుకున్నారు. 2018 కేరళ వరదలు, కోవిడ్ 19 మహమ్మారి వంటి కారణాల వల్ల ఈ జంట వివాహ వేడుక చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు తమ వివాహం రిజిస్టర్ అయిన తొమ్మిదేళ్ల తర్వాత, తన నాలుగవ పర్యటనలో ఆ దంపతులు గురువాయురు ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇది తన భాగస్వామి చిరకాల కోరిక అని చెబుతున్నారు స్కాటిష్ ఎంపీ మార్టిన్ డే.ఎవరీ మార్టిన్ డే..55 ఏళ్ల మార్టిన్ డే, స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన లిన్లిత్గో ప్రాంతానికి స్థానిక, జాతీయ స్థాయిలలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1999లో వెస్ట్ లోథియన్ కౌన్సిల్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో లిన్లిత్గో ఈస్ట్ ఫాల్కిర్క్ నియోజకవర్గం నుంచి ఎంపీగా యూకే హౌస్ ఆఫ్ కామన్స్లోకి ప్రవేశించారు. ఆయన 2024 వరకు ఎంపీగా పనిచేశారు. ఆరోగ్యం, సామాజిక సంరక్షణ వంటి రంగాలతో సహా SNP ఫ్రంట్‌బెంచ్ బాధ్యతలను నిర్వహించారు.2026 స్కాటిష్ పార్లమెంట్ ఎన్నికలలో, డే తిరిగి ఎన్నికై పదవిలోకి వచ్చి, ఫాల్కిర్క్ ఈస్ట్ అండ్ లిన్లిత్గో నియోజకవర్గం నుంచి MSPగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్ క్లైమేట్ యాక్షన్ కమిటీ అండ్ ఎకానమీ, టూరిజం అండ్ ఎనర్జీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు,బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. అలాగే వెస్ట్ లోథియన్‌లోని స్థానిక ప్రభుత్వంలో పాలుపంచుకున్నారు.ఎవరీ నిధిన్ చందన్..ఎర్నాకుళంలోని పిరవం ప్రాంతానికి చెందిన నిధిన్ చంద్, ఉన్నత విద్య కోసం నవంబర్ 2008లో యూకేకి వెళ్లారు. ఆమె యూకేలో ఐటీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె తండ్రి కే.ఎన్. చంద్రన్ ఒక రిటైర్డ్ వెటర్నరీ అధికారి, తల్లి రాజమ్మ పంపాకుడ మాజీ గ్రామ పంచాయతీ సభ్యురాలు.అలా పరిచయమైంది..యూకేలో ఆమె పీహెచ్డీ చేస్తున్న సమయంలో, కొత్త వలస నిబంధనల వల్ల ఆమె వీసాతో సహా వేలాది విద్యార్థి వీసాలు రద్దు చేయబడ్డాయి. నిధిన్ అక్కడినుంచి వెళ్ళిపోకుండా, పార్లమెంటులో లాబీయింగ్ చేసి, కమిటీల ముందు భారతీయ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించారు. అక్కడే ఆమె లిన్లిత్గో అండ్ ఈస్ట్ ఫాల్కిర్క్ ఎంపీ అయిన మార్టిన్ డేను కలిశారు.మే నెలలో అతను ప్రపోజ్ చేసిన తర్వాత, 2016లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. తనకు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడని, తాను విడాకులు తీసుకున్న మహిళనని నిధిన్ చెప్పినప్పుడు, మార్టిన్ చాలా విశాల హృదయంతో తన జీవితంలోకి ఆహ్వానించి, తన పేరెంట్స్ మార్గరెట్, రాన్ డేలకు ఆమెను పరిచయం చేశారు. ఆమె వీసా, ఉద్యోగ పరిస్థితి అనిశ్చితంగా ఉన్నప్పటికీ, వాళ్లు ఆమెను ఆప్యాయంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. తర్వాత మార్టిన్, నిధిన్, ఆమె కుమారుడు వేద్దిక్తో కలిసి యూకే వెళ్ళాడు.అలాగే ఆమె కుమారుడు వేద్దిక్, ఎడిన్‌బర్గ్‌లోని కంప్యూటర్షేర్లో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. నిధిన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, స్కాటిష్ నేషనల్ పార్టీ ప్రచారాలలో కూడా చురుకుగా పాల్గొంటుంది. కాగా, మార్టిన్ డే 1999 నుంచి ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. అంతేగాదు తొమ్మిదేళ్లలో మూడు పర్యాయాలు యూకే పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. ఆయన స్కాటిష్ పార్లమెంట్లో భారతదేశం తరపున అఖిల పక్ష పార్లమెంటరీ గ్రూపుకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by jith (@jith__uday) (చదవండి: లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!)
Health: దోమ చిన్నదే..! కుట్టిందో ఖతమ్..!
మనుషులపై మలేరియా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధికి దోమలే కారణం. దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ అనారోగ్య పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం, తగినంత మంది పారిశుధ్య కారి్మకులు లేకపోవడంతో చెత్త, మురుగు ఎక్కడికక్కడే పెరిగిపోయి దోమలు ప్రభావం తీవ్రంగా ఉంది. ‘వరల్డ్ మస్కిటో డే’ సందర్భంగా ఈ కథనం..దోమలు కలిగించే వ్యాధులివీఅనాఫెలస్ దోమ: ఈ దోమ వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఇది శుభ్రమైన నీటిలో సంచరిస్తుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. క్యూలెక్స్: ఈ దోమ వల్ల ఫైలేరియా, మెదడుకు సంబంధించిన వ్యాధి సోకుతుంది. ఇది మురుగు నీటిలో మసులుతుంది. ఇది 11 కిలోమీటర్లు మేర సంచరిస్తూ ఉంటుంది. ఏడిస్: ఈ దోమ వల్ల డెంగీ, చికెన్‌గున్యా వ్యాధులు సోకుతాయి. ఇది చెట్టు తొర్రలు, నివాస ప్రాంతాల్లోని వస్తువుల్లో నిల్వ ఉంచిన నీటిలోనూ, కొబ్బరి డిప్పలు, పశువల పాకలవు వద్ద అపరిశుభ్రత పరిస్థితులమధ్య సంచరిస్తుంది.ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. మేన్సోనియా: ఈ దోమ వల్ల ఫైలేరియా, చికెన్‌గున్యా వ్యా«ధులు సోకుతాయి. దీని ప్రభావం ఇండియాలో తక్కువగా ఉంది. ఇది చెరువులు, కాల్వల్లో ఉండే గుర్రపుడెక్క, మొక్కలో ఉంటుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు.వ్యాధుల లక్షణాలు ఇలా..మలేరియా: వణుకుతో కూడిన చలి జ్వరం వస్తుంది. రెండు రోజులకోసారి జ్వరం కనిపిస్తుంది. ప్రాథమిక దశలోనే చికిత్సను ప్రారంభించాలి. తీవ్రత పెరిగతే మెదడు ప్రభావితమై రోగి చనిపోయే పరిస్థితులుంటాయి.ఫైలేరియా: సాధారణంగా కాలు వాస్తుంది. గజ్జలో బిల్లలు వేస్తాయి. సాయంత్రం వేళ తక్కువ స్థాయిలో జ్వరం కనిపిస్తుంది.డెంగీ జ్వరం: జ్వరం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తలనొప్పి, రొంప, కీళ్ల నొప్పులు, గొంతునొప్పి, కళ్ళు ఎర్రబారడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా జాగ్రత్తపడాలి. శరీలంలో మచ్చలు వస్తే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయినట్టుగా భావించవచ్చు. చికెన్‌గున్యా: ఈ వ్యాధి దీర్ఘకాలంపాటు ఉండొచ్చు. కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. రెండు నెలలు నుంచి ఏడాది పాటు ఈ నొప్పులు బాధించవచ్చు.వరల్డ్ మస్కిటో డే ప్రాధాన్యం ఇదీ..బ్రిటీషు దేశానికి చెందిన రొనాల్డ్ రాస్ అనే సైంటిస్ట్ ప్రజలను పట్టిపీడిస్తున్న జ్వరాలపై పరిశోధన చేశాడు. అనాఫెలస్ అనే ఆడ దోమ వల్ల మలేరియా అనే వ్యాధి సోకుతుందన్న విషయాన్ని 1897 ఆగస్టు 20న ప్రపంచానికి తన పరిశోధన ద్వారా తెలియపర్చాడు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆగస్టు 20ను అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించారు.- రొనాల్డ్ రాస్, సైంటిస్ట్
ఈర్ష్య : పక్కవాడి విజయం ఎందుకు నచ్చదు?
ఈర్ష్య అనేది కోరిక నుండి పుడుతుంది. ఇతరుల సంతోషాన్ని, ఎదుగుదలను చూసి అది ఇంకా పెరుగుతుంది. కానీ సత్పురుషులకు జ్ఞానం, వివేకం వల్ల ఆ ఈర్ష్య నశిస్తుంది. ఈర్ష్య అసూయ.. ఈ రెండు అవలక్షణాల వలన మానవుడు సర్వం కోల్పోతాడు.. శతక కవులు ఇదే విషయాలను ఎంతో స్పష్టంగా సెలవిచ్చారు.వేమన శతకం... ‘ఈర్ష్య గలవాని కెన్నడుసంతోషము లేదు నిజము సుమ్ము కుమారాఈర్ష్య గలవాడు పరులనుఈర్ష్యతో చూచుచుండు నెప్పుడు కుమారా‘అర్థం: ఈర్ష్య ఉన్నవాడికి ఎప్పుడూ సంతోషం ఉండదు. వాడు ఇతరులను ఎప్పుడూ ఈర్ష్యతోనే చూస్తూ ఉంటాడు.మరో పద్యంలో... ‘తనకు లేని దొరులకున్నతన మనసున రోత పుట్టి తనువు కశించున్ఇన లేకున్నను చీకటిపనికొచ్చునా ఈర్ష్య పరుల బాధించురా’అర్థం: తనకు లేనిది ఇతరులకు ఉంటే మనసులో అసూయ పుట్టి, శరీరం కృశించిపోతుంది. సూర్యుడు లేకుండా చీకటి ఎలా పనికిరాదో, ఈర్ష్య కూడా అలాగే ఇతరులను బాధిస్తుంది.ఇక సుమతి శతకంలో బద్దెన ఏమి చెప్పారంటే‘అసూయ గలవాని నెదుటఅసమానపు ధనము కురిసిన నది చూడకఅసహ్యించుకొను వాడుఅసమానుడు గాడె సుమతీ అనవుడు కుమారా‘ ఈర్ష్య గలవాడి ముందు కోట్లు కురిసినా వాడు చూడడు. పైగా అసహ్యించుకుంటాడు. అటువంటివాడు అసమానుడు సుమతీ.దాశరథి శతకం...‘అసూయ చేతను నరుడువసుధను కృశించుచుండు వనరుహనేత్రీఅసూయను వీడిన నరుడువసుధను సుఖియించు చుండు వరముగ కుమారా‘ ఈర్ష్య చేత మనిషి ఈ లోకంలో కృశించిపోతాడు. ఈర్ష్యను వదిలిన మనిషి సుఖంగా ఉంటాడు.పరగుణ పరమాణూనాం పర్వతీకరణం క్షణాత్స్వగుణ మేరుమాత్రాణాం కూపీకరణం క్షణాత్యత్ కుర్వన్తి సతాం సన్తః తదస్మాభిః కిం ఉచ్యతేఅసూయా కలుషాః కేచిత్ నిర్దుష్టం గుణం ఏవ హి తాత్పర్యం: ఈర్ష్యతో నిండిన కొందరు దుష్టులు, ఇతరుల చిన్న లో΄ాన్ని కూడా పర్వతంలా పెద్దది చేసి చూపిస్తారు. అదే సజ్జనులు తమలోని మేరు పర్వతం అంత గొప్ప గుణాన్ని బావి అంత చిన్నదిగా చేసేస్తారు. అంటే ఈర్ష్య ఎంతటి అవగుణమో అర్థం అవుతోంది కదా!– డా. కందాళ సత్య నారాయణ మూర్తినిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్
ప్రపంచాన్నీ ఆకట్టుకున్న ‘నమస్తే’! ఆంతర్యం ఏంటో తెలుసా?
భారతీయ సంప్రదాయంలో ఎదుటి వ్యక్తిని కలవగానే ముందుగా చేసే పని ‘నమస్కారం’. ఇది కేవలం ఒక పలకరింపు మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగమైన గౌరవానికి, ఆత్మీయతకు ప్రతీక. గుడిలో భగవంతుడిని దర్శించుకున్నా, ఇంట్లో పెద్దలను కలిసినా రెండు చేతులు జోడించి నమస్కరించడం మన ఆనవాయితీ. అసలు ఇలా రెండు చేతులూ ఎందుకు జోడించాలి..? దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం..‘నమస్తే’ అనే పదంలో దాగిన ఆంతర్యం..సంస్కృత పదాలైన ‘నమః‘, ‘తే’ కలయికతో ‘నమస్తే’ ఏర్పడింది. ‘నమః’ అంటే నాలోని అహంకారాన్ని వదిలిపెట్టడం, ‘తే‘ అంటే మీకు. అంటే.. ‘నా అహాన్ని విడిచిపెట్టి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను‘ అని అర్థం. హిందూ ధర్మం ప్రకారం ప్రతి జీవిలోనూ దైవాంశ ఉంటుంది. అందుకే ఎదుటి వ్యక్తికి నమస్కరించడం ద్వారా, వారిలో కొలువై ఉన్న పరమాత్మను స్మరించుకుంటున్నామని మన శాస్త్రాలు చెబుతున్నాయి.రెండు చేతులు ఎందుకు జోడించాలి..?ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. కుడి చేయి సానుకూల సూర్య శక్తికి, ఎడమ చేయి గ్రహించే చంద్ర శక్తికి ప్రతీకలు. ఈ రెండు చేతులను ఏకం చేసినప్పుడు శరీరంలోని నాడులు సమతుల్యమై, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. చేతులు జోడించే భంగిమ ఎదుటివారి పట్ల మనకు ఉన్న వినమ్రతను, శరణాగతి భావాన్ని సూచిస్తుంది. ఇది బంధాల్లో ఆత్మీయతను పెంచుతుంది.నమస్కరించే సరైన విధానం..శాస్త్రాల ప్రకారం, రెండు చేతులను ఛాతీకి దగ్గరగా ఉంచి, తలను కొద్దిగా వంచి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల మనసులో వినయం ఇనుమడిస్తుంది. దేవుడికి లేదా వయసులో పెద్దవారికి నమస్కరించేటప్పుడు కళ్లు మూసుకుని భక్తి శ్రద్ధలతో ప్రణామం చేయడం అత్యంత మంగళకరం.నమస్కారం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు..నమస్కారం చేయడం వెనుక కేవలం ఆధ్యాత్మిక కోణమే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి. రెండు చేతుల వేళ్ల చివర్లు ఒకదానికొకటి తాకినప్పుడు చేతుల్లోని ఒత్తిడి బిందువులు ఉత్తేజితం అవుతాయి. అలా ఆక్యుప్రెషర్.. జరిగి నేరుగా కళ్లు, చెవులు, మెదడుకు అనుసంధానమై ఉంటాయి. దీనివల్ల నమస్కరించిన వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుందని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది.నమస్కారంలో ఎలాంటి భౌతిక స్పర్శ ఉండదు కాబట్టి, అంటువ్యాధులు వ్యాపించే అవకాశం చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా నమస్కారానికి ఎంతో గుర్తింపు ఉంది. నేడు యోగాతో పాటు భారతీయ సంస్కృతికి ఉన్న ఆదరణ వల్ల, విదేశీయులు సైతం భౌతిక దూరం పాటిస్తూనే గౌరవాన్ని వ్యక్తం చేసే ఈ ‘నమస్తే’ సంప్రదాయాన్ని ఎంతో ఆసక్తిగా, భక్తితో పాటిస్తున్నారు. మన సంప్రదాయాలను గౌరవిద్దాం, భావితరాలకు అందిద్దాం..– పసుపులేటి శ్రీలక్ష్మినిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్
అంతర్జాతీయం
కెన్యాలో తీవ్ర విషాదం.. హెలికాఫ్టర్ కూలి ఏడుగురి మృతి
కెన్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సఫారీ ప్రయాణంలో ఉన్న హెలికాప్టర్ కుప్పకూలడంతో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ దంపతులతో పాటు ఐదుగురు అమెరికన్లు కోల్పోయారు. ఉత్తర కెన్యాలోని మారుమూల ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.కెన్యా పౌర విమానయాన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. లోయిసాబా కన్జర్వెన్సీ నుంచి ఎవాసో న్యిరో ప్రాంతానికి వెళ్తుండగా ఉదయం 9.13 గంటలకు సాంబురు కౌంటీలోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు, ఒక పైలట్ ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే హెలికాప్టర్లో ఉన్నఅంతా మృతి చెందినట్లు సాంబురు పోలీసు కమాండర్ డేవిడ్ న్కోరోయ్ వెల్లడించారు.🇰🇪 Tragedy in Kenya.Seven people were killed in a helicopter crash in northern Kenya, according to authorities and local media.Among the victims were five Americans, including a Telemundo executive, as well as an Ecuadorian security official.No known cause yet. Writer:…— Mario Nawfal (@MarioNawfal) August 19, 2026మృతుల్లో ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈక్వెడార్ నేషనల్ ఇంటెలిజెన్స్ సెంటర్ డైరెక్టర్ పేరు మిచెల్ సెన్సీ-కాంటూగి.. ఆయన సతీమణి స్టెఫనీ హోలిహాన్ కూడా మృతి చెందారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన అమెరికా రాయబార కార్యాలయం.. స్థానిక అధికారులతో కలిసి కాన్సులర్ సహాయం అందిస్తున్నట్లు పేర్కొంది. BREAKING: An aircraft has crashed at Lolokwe Mountain in Samburu County, Kenya, the Kenya Civil Aviation Authority (KCAA) says.The Eurocopter EC130 B4, registration 5Y-GYM, was flying from Loisaba to Ewasonyiro when the accident occurred at around 9:13am on Wednesday, August… pic.twitter.com/hpCIgr7cXC— The New Times (Rwanda) (@NewTimesRwanda) August 19, 2026మృతుల వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఫ్లోరిడాకు చెందిన టెలిముండో మీడియా సంస్థ ఉన్నతాధికారి జోసే సువారెజ్ (55) మృతుల్లో ఒకరని స్థానిక మీడియా తెలిపింది. ఆయన టెలిముండో ఫ్లోరిడా స్టేషన్లకు అధ్యక్షుడు, జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రమాదానికి ముందు వాళ్లంతా సరదాగా గడిపిన చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.One of these photos captured a moment of joy before the flight. The other is a portrait of Michele Sensi-Contugi, Ecuador’s intelligence chief.Hours later, a helicopter carrying seven people crashed near Mt. Ololokwe in Samburu County, Kenya.More details of the tragedy 👇 pic.twitter.com/GcSaWzPL1R— LESAMBURUI (@hon_lesamburui) August 19, 2026It has now emerged that one of the American tourists who perished in the Eurocopter EC130 B4 aircraft at Mt Ololokwe near Kirish in Samburu County, Kenya while covering the route from Loisaba to Ewaso Nyiro is Jose Alberto Suarez, President and General Manager of Telemundo 31,… pic.twitter.com/UoJxWn4T6L— JaHomaBay (@HassanMcOjwang) August 19, 2026ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లేడీ లోరీ హెలికాఫ్టర్స్‌కు చెందినదిగా అధికారులు తెలిపారు. ఇది చార్టర్ ఫ్లైట్‌గా నడుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. మౌంట్ ఒలోలోక్వే పర్వత పాద ప్రాంతంలోని క్లిష్టమైన భూభాగంలో హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు కెన్యా రెడ్‌క్రాస్, ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.కెన్యాలో పర్యాటక రంగం విస్తృతంగా ఉండటంతో దూర ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు హెలికాప్టర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో దేశంలో హెలికాప్టర్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ కెన్యాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఓ ఎంపీ సహా ఆరుగురు మృతి చెందారు. తాజా ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
వాడేసిన రాకెట్ మళ్లీ ల్యాండైంది
బీజింగ్: రాకెట్ల పునర్వినియోగం విషయంలో చైనా కీలకమైన ముందడుగు వేసింది. మొట్టమొదటిసారి వాడేసిన ఒక రాకెట్ తొలిదశను భూమిపై సేకరించి వెనక్కు తీసుకు రాగలిగామని చైనా మీడియా బుధవారం తెలిపింది. అయితే ల్యాండ్ అయిన కొంత సేపటికి ఈ రాకెట్ దశ నుంచి మంటలు చెలరేగడంతో ప్రయోగం విజయవంతంపై కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఝూక్యూ–3ని బుధవారమే ప్రయోగించగా ఆ తరువాత ఎక్కడో పడిపోయిన రాకెట్ తొలిదశ గోబీ ఎడారి ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. కానీ అందులోని ఇంధనం మండిపోయింది. అడుగు భాగం నుంచి పొగలు వెలువడ్డాయి. దీంతో కార్బన్ ఫైబర్‌తో తయారైన నాలుగు కాళ్లు బలహీన పడినట్లు తెలిసింది. బూస్టర్ కూడా మంటల్లో చిక్కుకుపోవడంతో అది కుప్పకూలినట్లు సమాచారం. మిన్కిన్ ప్రాంతంలో ఈ రాకెట్ దశ ల్యాండైన వీడియోలో ముందు బూస్టర్ నిట్టనిలువుగా ల్యాండ్ అయిన దృశ్యాలు కనిపించాయి. నేలవాలడం పూర్తయి అది నాలుగు ల్యాండింగ్ కాళ్లపై నిలబడింది కూడా. అయితే కొంత సమయం తరువాత మాత్రం మంటలంటుకున్నట్లు తెలిసింది. ల్యాండ్ స్పేస్ అనే ప్రైవేట్ సంస్థ ఈ రాకెట్‌ను తయారు చేసింది. డాంగ్‌ఫెంగ్ స్పేస్ సెంటర్ నుంచి నింగికేగిన తరువాత 137 సెకన్లకు రాకెట్ రెండోదశ విడిపోయింది. తరువాతి దశ రాకెట్ ద్వారా హోంఝూ–03 ఉపగ్రహం కక్ష్యలోకి విజయవంతంగా చేరడం విశేషం. ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ 2015 నుంచి వాడేసిన రాకెట్ దశలను మళ్లీ సేకరిస్తోంది. తద్వారా ప్రయోగాల ఖర్చును తగ్గించుకుంటోంది. చైనా బుధవారం సేకరించిన రాకెట్ దశలో ల్యాండింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం విశేషం. పునర్వినియోగ రాకెట్ల విషయంలో ఇదో పెద్ద విజయమని చైనా మీడియా సంస్థలు ప్రకటించాయి. ఈ ఏడాది జూలై పదవ తేదీ చైనా వాడేసిన రాకెట్ దశను సముద్ర ఉపరితలంపై నుంచి ఒడిసిపట్టుకున్న విషయం తెలిసిందే. లాంగ్‌మార్చ్–10 ప్రయోగం తరువాత విడిపోయిన రెండో దశ సముద్ర ఉపరితలంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థకు చేరింది. ఆ తరువాతి రోజు అంటే జూలై 11న జపాన్ మొట్టమొదటి పునిర్వనియోగ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
స్పేస్ వాక్... లోపాల యాంటెన్నా తొలగింపు!
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి సమాచారం పంపించేందుకు అవసరమైన యాంటెన్నాను మార్చే పని వాయిదా పడింది. తాజా స్పేస్ వాక్ ద్వారా వ్యోమగాములు అనిల్మీనన్, సోఫీ అడెనాట్లు ఈ యాంటెన్నాను మార్చాల్సి ఉన్నప్పటికీ తగినంత సమయం లేకపోవడంతో వాయిదా వేయాల్సి వచి్చంది. బుధవారం సుమారు ఆరుగంటల 23 నిమిషాల సమయం వీరిద్దరూ స్పేస్‌వాక్‌లో భాగంగా లోపాలతో కూడిన యాంటెన్నాను తొలగించడంలో విజయం సాధించారు కానీ మార్చడం మాత్రం కుదరలేదు. భారతీయ సంతతికి చెందిన అనిల్ మీనన్‌కు ఇది రెండో స్పేస్ వాక్ కాగా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సోఫీకి మొదటిది. అయితే స్పేస్ వాక్ చేపట్టిన తొలి ఫ్రాన్స్ వ్యోమగామిగా సోఫీ రికార్డు సృష్టించింది. సక్రమంగా పనిచేయని యాంటెన్నాను తొలగించడం, కొత్తదాన్ని బిగించడం అన్న రెండు లక్ష్యాలతో ఇద్దరు వ్యోమగాములు తమ స్పేస్‌వాక్‌ను ప్రారంభించారు. అయితే విద్యుత్తు, డేటా కనెక్టర్లు బిగుసుకుపోయి ఉండటంతో తొలగింపు ఆలస్యమైంది. అంతేకాకుండా.. యాంటెన్నాలోని గింబల్ అసెంబ్లీలో లాకింగ్ పిన్స్ బిగించడం, యాంటెన్నాను బిగించిన బోల్టులను తొలగించడంలోనూ జాప్యం జరగడంతో కొత్త యంటెన్నా ఏర్పాటుకు సమయం దొరకలేదు. రాచెట్ సాయంతో యాంటెన్నాను తొలగించేందుకు వారు చాలా శ్రమించడాన్ని కూడా నాసా స్క్రీన్లపై కనిపించింది. ఈ నేపథ్యంలో పాడైన యాంటెన్నాను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు, కొత్త యాంటెన్నాను తీసుకుని బిగించేందుకు తగినంత సమయం లేదని మిషన్ కంట్రోల్ నిర్ణయించింది. కొత్త యాంటెన్నా బిగింపు భవిష్యత్తులో చేపడతామని నాసా ప్రకటించింది. హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్ నుంచి డేటా ప్రసారానికి ఈ యాంటెన్నా చాలా కీలకం. అయితే స్పేస్ టు గ్రౌండ్ యాంటెన్నా సాయంతో ఐఎస్ఎస్ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని నాసా తెలిపింది. ఐఎస్ఎస్ నిర్మాణం, నిర్వహణల్లో తాజా స్పేస్ వాక్ 282వది కావడం విశేషం.
రెండు గంటలు టెన్షన్.. టెన్షన్
మ్యూనిక్: జర్మనీలో వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానం లోపల ఉన్న ప్రయాణికులను, జర్మనీ విమానాశ్రయ సిబ్బందిని రెండు గంటలపాటు ఉత్కంఠతకు గురి చేసింది. మ్యూ నిక్ నుంచి హనోయికి వెళ్తున్న బోయింగ్ 787–9 విమానం ఆగష్టు 15న మధ్యాహ్నం 1:45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మ్యూనిక్ నుండి బయలుదేరింది. టేకాఫ్ కోసం విమానం పైకి లేస్తున్న సమయంలోనే దాని వేగం అసాధారణంగా తగ్గింది. రన్‌వేలో దాదాపు సగం దూరం వెళ్ళినప్పుడు, విమానం వేగం పెరగడం సుమారు రెండు సెకన్ల పాటు ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వేగాన్ని పుంజుకుంది. కొద్దిసేపటి తర్వాత మరోసారి వేగం తగ్గింది. టేకాఫ్‌ను సురక్షితంగా రద్దు చేయడానికి తగినంత రన్‌వే లేదని నిర్ధారించుకున్న పైలట్లు టేకాఫ్‌ను కొనసాగించారు. కేవలం 91 మీటర్ల రన్‌వే మాత్రమే మిగిలి ఉండగా టేకాఫ్ చేశారు. అంతేకాదు, విమానం ఎనిమిది ప్రధాన ల్యాండింగ్–గేర్ టైర్లలో నాలుగు పగిలిపోయాయి. టేకాఫ్ సమయంలో తోక రన్‌వేను ఢీకొట్టింది. గాలిలోకి లేచిన కొద్దిసేపటికే విమానం తోక నేలను తాకే అవకాశం ఉందని, టైర్లలో గాలి ఒత్తిడి తక్కువగా ఉందని హెచ్చరికలు వచ్చాయి. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేసిన సిబ్బంది, విమానం మ్యూనిక్‌కు తిరిగి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, తిరిగి రావాల్సి ఉంటుందని కెపె్టన్ ప్రకటించిన తర్వాత, క్యాబిన్‌లోని వాతావరణం మారిపోయింది. ఆందోళన ఉన్నప్పటికీ, ప్రయాణికులు ప్రశాంతంగానే ఉన్నారు. మ్యూనిక్‌కు తిరిగి వెళ్ళేందుకు విమానం బరువును తగ్గించడానికి సిబ్బంది ఇంధనాన్ని ఖాళీ చేయడం ప్రారంభించే ముందు, అది సుమారు 9,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ప్రయాణికులు రెండు రెక్కల నుండి ఇంధనాన్ని ఖాళీ చేయడాన్ని చూస్తుండగా, ఆ విమానం గంటకు పైగా విమానాశ్రయం సమీపంలో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత విమానం విమానాశ్రయం చుట్టూ తక్కువ ఎత్తులో రెండుసార్లు ప్రదక్షిణ చేసింది. దీనివల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు దాని ల్యాండింగ్ గేర్‌ను ప్రత్యక్షంగా తనిఖీ చేయగలిగారు. బయలుదేరిన సుమారు రెండు గంటల తర్వాత, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:57 గంటలకు ఆ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది. అందుకు గుర్తుగా విమానం వెనుక భాగం కింద నిలువుగా ఉన్న గీతలు, విమానం బయటి పొర చిరిగిపోయిన అనేక ప్రాంతాలను కూడా తనిఖీ అధికారులు కనుగొన్నారు. గ్రౌండ్ సిబ్బందికి మంటలు లేదా పొగ జాడలు ఏవీ కనిపించలేదు. ఆ సమయంలో విమానంలో మొత్తం 271 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులకు ఇతర విమానయాన సంస్థల విమానాల్లో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసింది. అలాగే, ప్రత్యామ్నాయ విమానాల కోసం ఎదురుచూస్తున్న వారికి వసతి, భోజనం మరియు స్థానిక రవాణా సౌకర్యాలను కూడా కల్పించింది. డ్యూటీలో ఉన్న నలుగురు వియత్నాం పైలట్లకు మొత్తం 63,938 గంటల విమానయాన అనుభవం ఉంది. అందులో 19,675 గంటలు బోయింగ్ 787 విమానంలో గడిపినవారున్నారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారని వియత్నాం సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. ఆగస్టు 15న జరిగిన ఈ సంఘటన విమానాశ్రయంలో కార్యకలాపాలకు కూడా అంతరాయం కలిగించింది. జర్మనీ విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ బీఎఫ్యూ దీనిని దర్యాప్తుచేస్తోంది.
జాతీయం
తల్లినే ఎక్కువ ఇష్టపడుతున్నారని, ముక్కుపచ్చలారని చిన్నారులపై తండ్రి దారుణం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను నీటి కాలువలోకి నెట్టివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బుధవారం వారి మృతదేహాలను వెలికితీసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులలో తొమ్మిదేళ్ల బాలిక, రెండన్నరేళ్ల బాలుడు ఉన్నారు. ఈ జంట హత్యలకు కారణం తెలిసి పోలీసులు కూడా నివ్వుపోయాడరు.యాద్గిర్ ఎస్పీ పృథ్వీక్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు శాంతప్పకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు (9,6) ఒక అబ్బాయి ( సుమారు మూడేళ్లు). తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుండి బయలుదేరి, మోటార్‌సైకిల్‌పై బిగుడి వద్ద ఉన్న కాలువకు వెళ్లాడు. తన ఆరేళ్ల కుమార్తెను మాత్రం వదిలి మిగిలిన ఇద్దర్నీ నిర్దాక్షిణ్యంగా కాలువలోకి నెట్టేశాడు. ఆ తరువాత ఆ చిన్నారని తనతో పాటు యాద్గిర్ పట్టణానికి తీసుకెళ్లాడు. అనంతరం బిగుడి (Bigudi) ప్రాంతంలోని తన ఇద్దరు పిల్లలను కాలువలోకి విసిరినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి అక్కడికి రాగా, పోలీసులు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే రాత్రి కావడంతో, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు అగ్నిమాపక శాఖ సహాయంతో గాలింపు చర్యలు తిరిగిచేపట్టారు. అదే సమయంలో కాలువలోకి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్ (KBJNL) అధికారులను కోరారు.ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయంప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం ఆ ఇద్దరు పిల్లలు తమ తల్లి రేణుకకు దగ్గరగా ఉండేవారని, తనతో అంతగా కలిసి ఉండేవారు కాదని అందుకే చంపేశానని పోలీసులకు తెలిపారు. కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శాంతప్పను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని యాద్గిర్ ఎస్పీ వెల్లడించారు.
ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండే (FDA Commissioner Tukaram) రాష్ట్రంలో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలు మరియు మందుల నియంత్రణపై భారీ చర్యలు చేపడుతున్నారు. రెస్టారెంట్లు హోటళ్లు, ప్రముఖ ఫార్మా కంపెనీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పెద్ద ఎత్తున లైసెన్సులు సస్పెండ్ చేయడం , అమ్మకాలను నిలిపివేయడం, నోటీసులు జారీ లాంటి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తుకారం ముండే చర్యలపై ప్రశంసలు కురిపించారు.మరోవైపు ముండే వ్యవహారశైలిపై బాంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులివ్వకుండా తనిఖీల పేరుతో ఎఫ్‌డీఏ చేపడుతున్న దూకుడు చర్యలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన తరుణంగా తాజాగా తుకారాం ముండేకి ట్యాగా చేస్తూ నటి శ్వేతా తివారీ Shweta Tiwari) చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్అసలు ఏమైంది? శ్వేతా తివారీ ఒక క్విక్-కామర్స్ యాప్ ద్వారా ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన సరుకులతో పాటు ఇంట్లోకి బొద్దింక వచ్చిందని ఆరోపించిది. ఈ యాప్ ద్వారా కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు శ్వేతా తివారీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. దీనికి మహారాష్ట్ర ఎఫ్‌డీఏ మిషనర్ తుకారాం ముండేను ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో తన ఇంట్లో తిరుగుతున్న బొద్దింకను చూపిస్తూ, ఆహార భద్రతా నిబంధనలపై చర్యలు తీసుకుంటున్న ముండేను ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు.కాగా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లు, క్యాంటీన్లపై కఠిన చర్యలు తీసుకుంటూ ముండే ఇటీవల సోషల్ మీడియాలో "అసలి సింగం"గా ప్రశంసలు అందుకుంటున్నారు. సదరు ఆర్డర్ లేదా డెలివరీ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నటి ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం
జస్టిస్ రవికుమార్‌కు షాక్.. ఆ 100 కేసులు బదిలీ!
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి కుమార్ దివాకర్ తీర్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత నాలుగు నెలల్లో ఆయన 10 హత్య కేసుల్లో ఏకంగా 22 మందికి మరణశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆయన వద్ద విచారణలో ఉన్న మరణశిక్ష, జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న సుమారు 100 హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేశారు. అందుకు కారణం ఏంటో కూడా చెబుతున్నారు.ముజఫర్‌నగర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న సుమారు 100 హత్య కేసులను జిల్లా, సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. మరణశిక్ష లేదంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న కేసులే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి ప్రకారం.. ఈ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న నిందితులకు గరిష్ఠ శిక్ష పడే అవకాశం ఉందన్న ఆందోళన న్యాయవాదులు, కక్షిదారుల్లో నెలకొంది.ఎవరీ రవి కుమార్ దివాకర్?46 ఏళ్ల రవి కుమార్ దివాకర్ 2009లో అజంగఢ్‌లో అదనపు సివిల్ జడ్జిగా తన న్యాయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2015లో సుల్తాన్‌పూర్‌లో సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. అనంతరం న్యాయ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. బీకామ్, ఎల్ఎల్ఎం పట్టాలు పొందిన ఆయన 2025 నవంబర్ నుంచి ముజఫర్‌నగర్‌లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. 2022లో వారణాసిలోని జ్ఞాన్వాపి సముదాయంలో వీడియో సర్వే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.నాలుగు నెలల్లో 22 మరణశిక్షలు..రవి కుమార్ దివాకర్ ఇటీవల వరుసగా సంచలన తీర్పులు వెలువరించారు. ఆగస్టు 13న 12 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధించారు. షామ్లీ జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో 2014లో పవన్ కుమార్ ఇంటిపై దాడి చేసి కాల్పులు జరిపిన కేసులో రామ్‌వీర్, రాజీవ్, రాహుల్, హరేంద్ర కుమార్‌లను దోషులుగా తేల్చారు.అంతకుముందు ఆగస్టు 12న 1999లో రూ.5 లక్షల విమోచన కోసం కలప వ్యాపారి సలీంను కిడ్నాప్ చేసి హత్య చేసిన షహనవాజ్‌కు ఉరిశిక్ష విధించారు. దాదాపు 27 ఏళ్ల నాటి కేసులో ఈ తీర్పు వెలువడింది. జూలై 17న 2011లో దోపిడీకి ప్రయత్నిస్తూ రైతు రాజ్సింగ్ను హత్య చేసిన కేసులో నలుగురికి మరణశిక్ష పడింది. జూలై 6న పంచాయతీ ఎన్నికల కక్షల నేపథ్యంలో 2010లో రాజ్బీర్ సింగ్‌ను హత్య చేసిన కేసులో మాజీ గ్రామ సర్పంచ్, అతని సహచరుడికి ఉరిశిక్ష విధించారు. ఈ కేసు ‘అత్యంత అరుదైన వాటిలో అరుదైనది’ అని కోర్టు అభిప్రాయపడింది.విధుల్లో ఉన్న హోంగార్డును హత్య చేసిన కేసులోనూ..2020లో విధుల్లో ఉన్న హోంగార్డు రతిరామ్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన దీపక్‌కు జూలై 2న మరణశిక్ష విధించారు. తన తల్లిపై దాడి చేసిన నిందితుడిని అడ్డుకునేందుకు రతిరామ్ ప్రయత్నించడంతో ఈ హత్య జరిగినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. జూన్ 20న రాజేంద్ర సైనీ హత్య కేసులో గజేంద్ర, రామ్కిరణ్లకు ఉరిశిక్ష విధించారు. మే 30న 15 ఏళ్ల నాటి డబుల్ మర్డర్ కేసులో 50 ఏళ్ల రహీస్‌కు మరణశిక్ష పడింది. అతడు రాజేశ్ దేవి, ఆమె ఆరేళ్ల కుమారుడు హిమాంశును ఇటుకలతో కొట్టి చంపినట్లు కోర్టు నిర్ధారించింది.ఏప్రిల్ 28న 2019 నాటి హత్య కేసులో ఓ మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమారులకు మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 6న రూ.45 లక్షల ఆర్థిక వివాదం నేపథ్యంలో న్యాయవాది మహ్మద్ సమీర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ముగ్గురికి ఉరిశిక్ష విధించారు.ఎందుకింత చర్చ?ఒకే న్యాయమూర్తి నాలుగు నెలల వ్యవధిలో 10 కేసుల్లో 22 మందికి మరణశిక్ష విధించడం న్యాయ వర్గాల్లోనే కాదు.. ఇటు దేశవ్యాప్తంగానూ చర్చకు దారితీసింది. ముఖ్యంగా మరణశిక్ష అనేది ‘అత్యంత అరుదైన వాటిలో అరుదైన’ కేసుల్లోనే విధించాల్సిన గరిష్ఠ శిక్ష కావడంతో.. ఈ తీర్పులపై ఆసక్తి నెలకొంది. అయితే మరణశిక్ష విధించినంత మాత్రాన వెంటనే ఉరి అమలు జరగదు. భారత న్యాయవ్యవస్థలో ఇటువంటి తీర్పులకు తదుపరి న్యాయపరమైన దశలు ఉంటాయి. అప్పీళ్లు, ఉన్నత న్యాయస్థానాల పరిశీలన వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాతే తుది పరిణామం ఉంటుంది. ఈ నేపథ్యంలో దివాకర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న సుమారు 100 కేసుల బదిలీ ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
పట్టాలపైకి గజరాజుల దండు.. ‘రాజధాని’కి సడన్ బ్రేక్!
హోజాయ్: అస్సాంలోని హోజాయ్ జిల్లాలో రైల్వే ట్రాక్‌ను దాటుతున్న అడవి ఏనుగుల గుంపును గమనించిన లోకో పైలట్, అప్రమత్తతతో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను సకాలంలో నిలిపివేసి పెను ప్రమాదాన్ని నివారించారు. బుధవారం ఉదయం లంకా రేంజ్ పరిధిలోని హవైపూర్ ప్రాంతంలో (కిలోమీటర్ 167/8 వద్ద) ఈ ఘటన చోటుచేసుకుంది. An unexpected halt on the tracks, but only for our adorable giants to pass by. This morning, the Down Rajdhani Express was stopped at Km 167/8 as an elephant herd crossed the tracks at Hawaipur under Lanka Range, Nagaon South Division, Hojai.Alert action by our @assamforest… pic.twitter.com/qhPseOLNCv— Jayanta Mallabaruah (@jayanta_malla) August 19, 2026డౌన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆ మార్గంలో వస్తున్న సమయంలోనే ఏనుగుల గుంపు ట్రాక్ వైపు రావడం విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది కంటపడింది. వారు వెంటనే స్పందించి సమాచారాన్ని లోకో పైలట్‌తో పాటు లుమ్డింగ్ రైల్వే కంట్రోల్ రూమ్‌కు చేరవేశారు. సమన్వయంతో రైలును వెంటనే నిలిపివేయడంతో ఏనుగులన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా సురక్షితంగా పట్టాలు దాటాయి. అనంతరం రైలు తన ప్రయాణాన్ని యథావిధిగా కొనసాగించింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అస్సాం అటవీ శాఖ మంత్రి జయంత మల్ల బారువా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అధికారులను ప్రశంసించారు. అటవీ సిబ్బంది, రైల్వే యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించి వన్యప్రాణులను కాపాడారని ఆయన కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణుల కారిడార్ల మీదుగా వెళ్లే రైల్వే మార్గాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని, ఈ చర్యలు మానవ-వన్యప్రాణి సంఘర్షణలను, రైలు ప్రమాదాలను అరికట్టడంలో కీలకంగా మారాయని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: గ్రీకుల గర్భనిరోధక మొక్క.. రెండువేల ఏళ్ల తర్వాత ప్రత్యక్షం
ఎన్ఆర్ఐ
చాట్‌జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్
అమెరికాలో జంట హత్యలు కలకలం రేపాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబాన్ని ఎలా హత్య చేయాలనే విషయాలను ఏఐలో వెతికి మరీ ఈ దురాగతానికి పాల్పడటం మరింత ఆందోళ రేపింది. గోతిక్ నవల (Gothic novel) తరహా కథలు, పాత్రలను రూపొందించడంలో సాయం చేయాలని AI ఛాట్‌బాట్‌ను కోరినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.మసాచుసెట్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోని మాసాచుసెట్స్ సబర్బన్ ఏరియాలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్ అర్జున్ అరవింద్, తల్లి సుధా వెంకటేశన్ (45), సోదరుడు సిద్ధార్త్ (14) దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు.Accused killer 17 year old Arjun Aravind of Acton was taken into custody in Wayland overnight and tomorrow he’s expected in adult court charged with murdering his mother and younger brother…his dad was at work when the murders took place #7News pic.twitter.com/ljpT6lNZGR— Steve Cooper (@scooperon7) August 12, 2026 మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన ట్యూటర్ లోపలికి వెళ్లలేక అర్జున్ తండ్రికి సమాచారం అందించారు. తండ్రి ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ‘వెల్ బీయింగ్ చెక్’ చేయాల్సిందిగా కోరారు. పోలీసులు వచ్చి చూడగా తల్లీ కొడుకులిద్దరూ మృతి చెంది ఉన్నారు. ఆక్టన్ ప్రాంతంలోని వారి ఇంట్లోనే ఈ హత్యలు జరిగాయి.నేరం జరిగిన తర్వాత అర్జున్ తన తల్లికి చెందిన హోండా కార్లో పరారైనట్టు పోలీసులు గుర్తించారు. మృత దేహాలపై తీవ్రమైన గాయాలున్నాయనీ, తల్లి మృతదేహం బేస్మెంట్లో, తమ్ముడి మృతదేహం మొదటి అంతస్తులో లభ్యమయ్యాయనీ వెల్లడించారు. దీంతో అర్జున్‌పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడి, కారు దొంగతనం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాలింపు చర్యల అనంతరం వేలాండ్ (Wayland) ప్రాంతంలోని ఒక పార్కింగ్ లాట్లో కారులో అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు.ఛాట్‌జీపీటీ వాడకంపై పోలీసుల ప్రకటనఅర్జున్ కొంతకాలంగా విచిత్రమైన ప్రవర్తన కనబరుస్తున్నాడు. కుటుంబాన్ని చంపేందుకు సంబంధించిన ఊహాజనిత కథనాలు, ఆలోచనల కోసం ఇంటర్నెట్, ChatGPTని ఉపయోగించినట్లు విచారణలో తేలిందని మిడిల్సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీసీ నెట్వర్క్ ఏర్పాటు..
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు 'ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్'(AAA) మరియు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ(ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్‌కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లుబొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్‌వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్‌గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్‌గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్‌గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.నాయకత్వం, నెట్‌వర్కింగ్‌కు ప్రాధాన్యంAAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బలమైన నెట్వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
యూరప్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..జగిత్యాల యువకుడు దుర్మరణం
జగిత్యాల: బతుకుదెరువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. యూరప్‌లోని మాల్టా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన 27 ఏళ్ల మహ్మద్ జావెద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆయన మరణించడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ జావెద్ గత ఏడాది కాలంగా మాల్టాలోని పావోలా పట్టణంలో ఒక సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ మాల్టాలోని కోర్మి ప్రాంతంలో జావెద్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక భారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జవ్వద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మహ్మద్ జావెద్‌కు మూడు నెలల క్రితమే స్వదేశానికి వచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకల అనంతరం జీవితంలో స్థిరపడాలనే ఆశతో ఆయన తిరిగి మాల్టాకు వెళ్లాడు. ఇంతలోనే ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో జావెద్ మృతి చెందారనే వార్త వినడంతో భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు ఆదివారం (9 ఆగస్టు 2026) సాయంత్రం అత్యంత వైభవంగా కోలాహలంగ జరిగాయి. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. తెలుగు వారందరితో తో కలిపి సుమారు 850 నుండి 900 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో అమ్మ వారి భక్తి మరియు బోనాలకు సంబందించిన ప్రత్యేక పాటలకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు. బోనాల జాతరలో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ సాయి కుమార్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి మరియు అరవింద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఈ ఏడాది బోనం సమర్పించిన ఫ్యామిలీస్ లో శశిధర్ రెడ్డి, రమేష్ గడప, అలేఖ్య దార, అలేఖ్య తడిసిన, దీపా రెడ్డి మండల, బోయిని స్వరూప, శ్వేత కుంభం, బర్ల అరుణ్‌కుమార్, బైలపూడి గౌరీ వరలక్ష్మి, మోతె శ్రీనివాస రెడ్డి, బొందుగుల ఉమారాణి మరియు అన్ను సుజాత ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు ఇంట్లో వండి తెచ్చిన అన్న తీర్థ ప్రసాదాన్ని పంచి సంతోషాన్ని వెలిబుచ్చారు. వీరితో పాటు గడప రమేశ్ మరియు బసిక ప్రశాంత్ కుమార్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు. బోనాలు పండుగ లో పాల్గొన్న భక్తులందరూ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద (పులిహోర , పెరుగు అన్నం మరియు కేసరి ) వితరణలో పెద్ద ఎత్తులో సంతోషంగా పాల్గొని అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.సింగపూర్ బోనాలు - 2026 పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు మరియు శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు మాట్లాడుతూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి మరియు స్పాన్సర్స్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.ఎలాంటి అసౌకర్యం లేకుండ తీసుకున్న జాగ్రత్తలకు సొసైటీ చేసిన ఏర్పాట్లను భక్తులు అభినందించారు. ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్) మరియు స్వాతి ఖానాపురం; సాయి కృష్ణ కొమాకుల; నగేష్ టేకూరి; నిఖిల్ పారుపల్లి; శ్రీధర్ మారోజు & ఫ్రెండ్స్, రామాంజనేయులు చమిరాజు, అజయ్ నందగిరి, నరేష్ కుమార్ నౌల్ల, అభిమల్ల గిరి ప్రసాద్; కొల్లా శివ ప్రసాద్; మునిగెల కృష్ణం రాజు; పాతూరి రాంబాబు మరియు దండా నాగేశ్వర్ రెడ్డి, రెడ్డిపల్లి కృష్ణారావు, రవీంద్ర కుమార్ గార్లకు మరియు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పండుగలో ఫొటోగ్రఫీ కవరేజ్ చేసిన కృష్ణ నెల్లుట్ల గారికి, సౌండ్ సాంకేతికతలో సహకరించిన యసరావేణి విజయ కుమార్ మెరుగు గారికి మరియు పండుగ విజయవంతంగా జరగడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికి పేరు పేరున కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
క్రైమ్
డాక్టర్ ప్రియాంక హత్య కేసు: 16 ప్రశ్నలు.. కీలక విషయాలపై ఆరా!
సాక్షి, తూర్పుగోదావరి: డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల పోలీస్ కస్టడీ విచారణ రెండో రోజూ కొనసాగుతోంది. దీంతో నిందితులు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను పోలీసులు విచారిస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్, ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతోంది.16 ప్రశ్నల్లో 6 పూర్తి..ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 16 కీలక ప్రశ్నలను సిద్ధం చేయగా.. ఇప్పటివరకు 6 ప్రశ్నలకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం. నిందితులు ఇచ్చే సమాధానాలను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఘటనకు ముందు చోటుచేసుకున్న పరిణామాలు, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఇతర కీలక అంశాలపై పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. అయితే, పోలీస్ కస్టడీ విచారణలో భాగంగా ప్రకాష్‌నగర్ సీఐ బాజీ లాల్‌ను ఉన్నతాధికారులు తప్పించారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే ఈ నిందితులను విచారిస్తున్నట్లుగా ఏఎస్పీ దేవరాజ్ తెలిపారు.రేపు ఉదయం కస్టడీ పూర్తి..ప్రస్తుతం రెండవరోజు కొనసాగుతున్న నిందితుల పోలీస్ కస్టడీ గడువు రేపు ఉదయం 11 గంటలకు ముగియనుంది. దీంతో కస్టడీ విచారణ పూర్తయిన అనంతరం దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
తల్లినే ఎక్కువ ఇష్టపడుతున్నారని, ముక్కుపచ్చలారని చిన్నారులపై తండ్రి దారుణం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను నీటి కాలువలోకి నెట్టివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బుధవారం వారి మృతదేహాలను వెలికితీసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులలో తొమ్మిదేళ్ల బాలిక, రెండన్నరేళ్ల బాలుడు ఉన్నారు. ఈ జంట హత్యలకు కారణం తెలిసి పోలీసులు కూడా నివ్వుపోయాడరు.యాద్గిర్ ఎస్పీ పృథ్వీక్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు శాంతప్పకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు (9,6) ఒక అబ్బాయి ( సుమారు మూడేళ్లు). తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుండి బయలుదేరి, మోటార్‌సైకిల్‌పై బిగుడి వద్ద ఉన్న కాలువకు వెళ్లాడు. తన ఆరేళ్ల కుమార్తెను మాత్రం వదిలి మిగిలిన ఇద్దర్నీ నిర్దాక్షిణ్యంగా కాలువలోకి నెట్టేశాడు. ఆ తరువాత ఆ చిన్నారని తనతో పాటు యాద్గిర్ పట్టణానికి తీసుకెళ్లాడు. అనంతరం బిగుడి (Bigudi) ప్రాంతంలోని తన ఇద్దరు పిల్లలను కాలువలోకి విసిరినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి అక్కడికి రాగా, పోలీసులు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే రాత్రి కావడంతో, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు అగ్నిమాపక శాఖ సహాయంతో గాలింపు చర్యలు తిరిగిచేపట్టారు. అదే సమయంలో కాలువలోకి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్ (KBJNL) అధికారులను కోరారు.ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయంప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం ఆ ఇద్దరు పిల్లలు తమ తల్లి రేణుకకు దగ్గరగా ఉండేవారని, తనతో అంతగా కలిసి ఉండేవారు కాదని అందుకే చంపేశానని పోలీసులకు తెలిపారు. కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శాంతప్పను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని యాద్గిర్ ఎస్పీ వెల్లడించారు.
కూకట్పల్లి ఓయో హోటళ్లలో వ్యభిచారం
హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచార కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 11 మందిని అరెస్టు చేశారు. ఈ వివరాలను బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్‌లో ఉన్న సాయి ప్యారడైజ్, వైసాయి కాటేజ్ ఓయో హోటళ్లలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో సీఐ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం రాత్రి ఈ దాడులు చేపట్టారు. ఈ ఘటనలో నిర్వాహకులు ఆమని (28), దినేష్ (21), రాజేష్ (28), ఉమేష్ చంద్ర (24), రామసాయి (25), విటులు రాజు (26), బాలరాజు (27), వంశీ (38) ప్రశాంత్ (36)లను అరెస్టు చేశారు. ముగ్గురు బాధితురాళ్లను రెస్క్యూ హోంకు తరలించారు. మరో ఇద్దరు నిర్వాహకులు పరారీలో ఉన్నారు. హోటళ్ల అనుమతులు రద్దు చేసి సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అసలేం జరిగింది!
కాకినాడ: పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముందుగా నూకరాజు, ఆయన కూతురు సౌజన్య రాసిన మరణ వాంగ్మూలాలు, అనంతరం వియ్యంకుడు భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, సౌజన్యల సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయడం ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయనే కోణంలో వారి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించే పనిలో ఉన్నారు. మరో పక్క ఈ కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అతడు కర్ణాటకకు పారి పోయినట్లు గుర్తించి, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే గోదావరిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కూతురు సౌజన్యల ఆచూకీ మూడో రోజూ లభ్యం కాలేదు. ఫోన్ సంభాషణలే ఆధారం నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఆదివారం రాత్రి ఏం జరిగింది అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజమహేంద్రవరం బయలు దేరిన ఆయన.. దారిలో ఎవరిని కలిశారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ ప్రాంతంలో ఎంత సేపు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు తదితర వాటిపై ఆరా తీస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి గోదావరిలోకి దూకే వరకు ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం వెళ్లే వరకు సాధిక్ పలు మార్లు కాల్ చేసి బెదిరించినట్లు నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంపైనా పోలీసులు దృష్టి సారించారు. మెసేజ్‌లపై దృష్టినూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించిన సామగ్రిని, వారి సెల్ఫోన్లను పోలీసులు ఆయన కారులో స్వా«దీనం చేసుకున్నారు. అయితే వారి సెల్ఫోన్లలో వాట్సాప్ మెసేజ్‌లను ఆత్మహత్యలకు ముందు డిలీట్ చేసినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావించి, ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లేఖల పరిశీలన నూకరాజు, సౌజన్య రాసిన లేఖలను విశ్లేషిస్తున్న పోలీసులు నూకరాజు వియ్యంకుడు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దృష్టి సారించారు. తన కుమారుడిపై కోచ్ సాధిక్ ఖాన్ విష ప్రయోగం చేసి చంపేశాడని ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మృతుడు జగదీశ్వరరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అయితే దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన కావడం, జగదీశ్వరరెడ్డి మృతదేహాన్ని దహనం చేయడంతో ఆధారాలు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే జగదీశ్వరరెడ్డి చనిపోవడానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురై సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చెబుతున్నారు. విష ప్రయోగం జరిగి ఉంటే అప్పటి మెడికల్ రిపోర్టుల్లో విషయం బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.కర్ణాటకకు పారిపోయిననిందితుడు!నిందితుడు సాధిక్ ఖాన్‌పై రాజమహేంద్రవరం టూటౌన్, కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అయితే సాధిక్ ఖాన్ సోమవారం తెల్లవారుజామునే పారిపోయినట్లు గుర్తించి, సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలోని అతడి ఇల్లు, రైఫిల్ షూటింగ్ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కాగా.. సాధిక్ ఖాన్ తన సెల్‌ఫోన్ వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అతడు కర్ణాటక పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను అక్కడకు పంపినట్టు సమాచారం.మూడో రోజూ లభించని ఆచూకీకంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి గల్లంతైన నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ బుధవారానికి మూడు రోజులవుతున్నా లభించలేదు. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం లభ్యం కాగా, భార్య, కుమార్తె ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వారి కోసం రెండో పట్టణ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జాలర్లు బోట్లపై తిరుగుతూ గాలిస్తున్నారు. అయితే ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. గోదావరిలో వరద నీరు అధికంగా ఉండడంతో గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టడం ఇబ్బందిగా మారింది. కాగా.. ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్ రాజు నుంచి రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసులు పలు ఆధారాలను సేకరించారు.డబ్బున్న పిల్లల తల్లులే టార్గెట్!కాకినాడ రూరల్: సాధిక్ ఖాన్ వృత్తి రైఫిల్ షూటింగ్ కోచింగ్ అయినా, శిక్షణకు వచ్చే డబ్బున్న పిల్లల తల్లులే అతడి లక్ష్యమని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నూకరాజు కుమార్తె సౌజన్యను టార్గెట్ చేశాడని తెలుస్తోంది. కాకినాడలోని గుడారిగుంట సమీపంలో ప్రో షూటింగ్ అకాడమీ పేరిట సాధిక్ ఖాన్ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు. అంతకు ముందు అకాడమీని రాయుడుపాలెం జంక్షన్ వద్ద ఓ భవనంలో నిర్వహించేవాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనతో అతడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధిక్ ఖాన్ తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు విచారణ చేసి, కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. మరో వైపు రైఫిల్ షూటింగ్ శిక్షణ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కూడా ఆరా తీస్తున్నారు. అలాగే నూకరాజు నివాసంలో సోదాలు జరిపి ఆధారాలు సేకరిస్తున్నారు. సౌజన్యది ప్రేమ వివాహం నూకరాజు కుమార్తె సౌజన్య, జగదీశ్వరరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కార్తికేయ రెడ్డి కుమారుడు. కాంట్రాక్టర్ అయిన జగదీశ్వరరెడ్డి కాకినాడలోనే భార్య, కుమారుడితో నివాసం ఉండేవారు. ఆయన గత జూలై 2న మృతి చెందారు. కాగా.. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డి కలిసి ఆదివారం ఉదయమే కాకినాడ అశోక్ నగర్లో నివాసం నుంచి బయటకు వెళ్లారని స్థానికులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం పలుమార్లు సాధిక్ ఖాన్ ఆ అపార్టుమెంట్ వద్ద కంగారుగా తిరుగుతూ కనిపించాడన్నారు.
వీడియోలు
రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్‌గా నటించనున్న రామ్ పోతినేని?
జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు
యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది?
ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి..
టాక్సిక్ టికెట్ ధరలపై ఫ్యాన్స్ ఫైర్.. డబ్బింగ్ మూవీకి ఇంత రేటా..?
రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం
టీచర్ కోపం .. ఎంత పని చేసింది
స్పోర్ట్స్ కోటా ఉద్యోగం.. నా దగ్గర డబ్బు తీసుకుంది ఆయనే..! లైవ్ లో DSC బాధితురాలి ఆవేదన
సభలో చర్చకు రమ్మంటే భయపడతారు.. బయటమాత్రం ఛాలెంజ్ లు చేస్తారు..
తీహార్ జైల్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ మృతి


