తీగలాగుతున్న సిట్ | SIT begins investigation on land scams in Visakhapatnam | Sakshi
Sakshi News home page

తీగలాగుతున్న సిట్

Nov 2 2019 8:27 AM | Updated on Mar 22 2024 11:30 AM

విశాఖపట్నం జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణకు శ్రీకారం చుట్టింది.  ‘సిట్‌’ సభ్యులు... రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వైవీ అనూరాధ, జిల్లా సెషన్స్‌ కోర్టు రిటైర్డ్‌ జడ్జి టి. భాస్కర్‌ రావు శుక్రవారం విశాఖపట్నం చేరుకుని భూ కుంభకోణంపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం నగరంతోపాటు 13 మండలాల పరిధిలో జరిగిన అతి పెద్ద భూ కుంభకోణం సంచలనం రేపిన విషయం విదితమే. దీనిపై కేంద్ర నేర పరిశోధన సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని అన్ని రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేసినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement