గుంటూరు జిల్లా కొండవీడులో బీసీ రైతు కోటేశ్వరరావు (కోటయ్య) మృతిపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. అసలు చంద్రబాబు ఎందుకింతగా దిగజారారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మంగళవారం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమై రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. కోటయ్య మృతి విషయంలో నిజనిర్ధారణ కోసం శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జగన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
కొండవీడు రైతు మృతిపై వైఎస్ జగన్ ఆవేదన
Feb 20 2019 7:23 AM | Updated on Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement