కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గడం, ఆల్మట్టి జలాశయం ఎత్తును కర్ణాటక ప్రభుత్వం 519.6 అడుగుల నుంచి 524.65 అడుగులకు పెంచుతుండటం వల్ల రానున్న రోజుల్లో నీటి లభ్యత మరింత తగ్గే ప్రమాదం ముంచుకొస్తుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల పరిధిలో సాగునీటికే కాదు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు.