తల్లి ప్రేమకు అద్దం పట్టిన సంఘటన | Sakshi
Sakshi News home page

తల్లి ప్రేమకు అద్దం పట్టిన సంఘటన

Published Fri, Jul 3 2020 5:21 PM

తిరువనంతపురం: రోడ్డుమీద ఉన్న బారియర్‌ను దాటడానికి ఇబ్బంది పడుతున్న పిల్ల ఏనుగుకు.. తల్లి సాయం చేసి.. క్షేమంగా రోడ్డు దాటేలా చూసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరలవుతోంది. కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను అనీశ్‌ కటా అనే వ్యక్తి షేర్‌ చేశాడు. వివరాలు.. గురువారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో మరో ముగ్గురితో కలిసి అనీశ్‌ కటా సైక్లింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో కేరళ-తమిళనాడు సరిహద్దు సమీపంలోని నాడుకని చురం వద్ద మూడు ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. వీటిలో రెండు సులభంగానే రోడ్డు మీద ఉన్న బారియర్‌ను దాటాయి.)కానీ మరో పిల్ల ఏనుగు మాత్రం దాటలేకపోయింది. పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యింది.

దాంతో తల్లి ఏనుగు తన తొండంతో పిల్ల ఏనుగును పైకి తోసి బారియర్‌ను దాటేలా చేసింది. అనీశ్‌ కటా ఈ సంఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం ఇది ఓ ఆంగ్ల ఛానల్‌లో ప్రసారం అయ్యింది. ఈ సందర్భంగా అనీశ్‌ కటా మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన నా హృదయాన్ని తాకింది. బిడ్డ పట్ల తల్లి చూపించే ప్రేమకు నిదర్శనంగా నిలిచింది’ అన్నారు.

Advertisement